ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఈడేపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ ఎ¯ŒSవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక 27వ వార్డులోని ఎస్సీకాలనీలోని కమ్యూనిటీ హాలులో నిరుద్యోగ, యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీలకు విద్యార్హతతో బేధం లేకుండా అందరూ ఉపాధి పొందవచ్చన్నారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్న వెంటనే ఆ¯ŒSలై¯ŒSలో నమోదు చేస్తామన్నారు. దరఖాస్తులు చేసుకొన్న అభ్యర్థులకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతిలలో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ అధికారి లావణ్య, వార్డు టీడీపీ నాయకులు సనక నాగులు పాల్గొన్నారు.