machilipatnam
-
వీణల విందుగా...
వీణ రాగాల వెన్నెలలో పులకించిపోయిన దీప్తికి– వీణ పాఠమేప్రాణమై పోయింది. వీణ విహంగ రెక్కలపై ఆమె కొత్త ప్రపంచాలను చూసింది. ‘ఈ తరం అమ్మాయిలు కూడా వీణ నేర్చుకుంటున్నారా!’ అనేది కొందరి ఆశ్చర్యం. నేర్చుకుంటే ఎంత బాగుంటుందో దీప్తిలాంటి అమ్మాయిలు తమ విజయాల ద్వారా నిరూపిస్తున్నారు...తాను ఒకటి తలిస్తే వీణ ఒకటి తల్చింది!అవును.. మచిలీపట్నానికి చెందిన మొదలి చంద్రశేఖర్ దగ్గర గాత్రం, కీబోర్డు నేర్చుకుందామని వెళ్లిన అప్పికట్ల దీప్తి అంతలోనే మనసు మార్చుకుంది. వీణపై ఆసక్తి పెంచుకుంది. పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. సాధారణంగా చాలామందికి నేర్చుకోవడంలో ఆరంభ శూరత్వం ఉంటుంది. అయితే దీప్తి విషయంలో అలా జరగలేదు. ‘ఇంకా ఏదో నేర్చుకోవాలి’ అనే తపనతో ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేది. దీప్తి ప్రస్తుతం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతోంది.‘ఇంజినీరింగ్ చదివే అమ్మాయికి వీణలెందుకు.. చదువు దెబ్బతింటుంది కదా!’ అనేది కొందరి సందేహం. ‘చదువు దెబ్బతినదు. మరింత చదువుకోవాలనిపిస్తుంది’ అంటుంది దీప్తి. ఎందుకంటే వీణరాగాల సాధనలో ఒత్తిడి తగ్గి మనసు తేలిక అవుతుంది. ఏకాగ్రత అంతకంతకూ పెరుగుతుంది. ఏది చదివినా ఇట్టే గుర్తుండి పోతుంది అంటుంది దీప్తి. నాలుగు సంవత్సరాలపాటు కర్ణాటక సంగీత సంప్రదాయ వీణ కోర్సును చదివి ఫస్ట్ క్లాస్‌లో సర్టిఫికెట్‌ను సాధించిన దీప్తి ఆ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో వీణలో డిప్లమో చేసింది.నేర్చుకోవడం ఒక ఎత్తయితే, ప్రేక్షకులు మెచ్చేలా ప్రదర్శన ఇవ్వడం మరో ఎత్తు. మొదటిసారిగా సంగీత కళాకచేరిలో మంచి మార్కులు కొట్టేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన ‘యువభేరి’ లో బహుమతులు సాధించింది. ఎన్నో పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకుంది. తెలంగాణ రాజ్‌భవన్ లో వీణ వాద్య కచేరి చేసి గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ప్రశంసలు అందుకుంది. వీణ వాద్య ప్రతిభతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతుల ప్రశంసలు అందుకుంది. ‘రాష్ట్రపతి భవన్ లో వీణ ప్రదర్శన ఇవ్వడం, ప్రముఖులను దగ్గరి నుంచి చూడడం, వారి ఆశీర్వాదం అందుకోవడం మరచిపోలేని అనుభూతి’ అంటుంది దీప్తి. చదువూ, సంగీతంలోనే కాదు కరాటేలోనూ రాణిస్తున్న దీప్తి మరిన్ని కళలలో విజయాలు సాధించాలని ఆశిద్దాం. ధ్యానం లాంటి వీణవీణ అనేది కేవలం కచేరీల కోసం కాదు. నా దృష్టిలో వీణ వాద్య సాధన అనేది ఒకలాంటి ధ్యానం. వీణరాగాల వెలుగులో మనసు ఉత్తేజితం అవుతుందన్నది కాదనలేని సత్యం. – అప్పికట్ల దీప్తి – అంబటి శేషుబాబు సాక్షి, మచిలీపట్నం -
బందరు బ్యాంక్ @ 219 ఏళ్లు
సాక్షి, మచిలీపట్నం: ఒకవైపు సముద్రతీరం మరోవైపు కృష్ణమ్మ ఒడి.. ఒడ్డున వెలిసిన ప్రాచీన పట్టణం మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంక్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.ఈ బ్యాంక్ ఏకంగా 218 వసంతాలు పూర్తి చేసుకొని 219వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ నేడు సామాన్య ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తోంది.అప్పట్లో ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా ఆవిర్భవించి.. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. గుంటూరు బ్యాంక్‌కు సబ్ బ్రాంచ్‌గా ఉన్న ఈ బ్యాంక్ 1908లో ప్రత్యేక బ్రాంచ్‌గా ఆవిర్భవించింది. జనవరి 1వ తేదీతో ప్రత్యేక బ్రాంచ్ ఏర్పడి 117 ఏళ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్ కాలంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం బ్రిటీష్‌వారు తమ పాలనకు ఎంతో అనువైన పట్టణంగా మచిలీపటా్నన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం దేశంలో మూడో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్రం కోసం సాగిన పోరులో పాల్గొనడంతో పాటు రాజకీయ, సినీ, సామాజిక రంగాల్లో రాణించారు. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు, చరిత్రకారుల వివరాల మేరకు.. 1806లో దీన్ని బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌గా 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా ఉద్యోగులు శిక్షణ కేంద్రం కూడా నెలకొల్పారు. 1905 నుంచి గుంటూరు బ్యాంక్‌కు అనుబంధంగా సబ్ బ్రాంచ్‌గా నిర్వహించి, 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్‌గా ఏర్పాటు చేశారు.1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడి, 1955 జూన్ 30 వరకు సేవలందించింది. అదే ఏట జూలై 1 నుంచి ఆర్బీఐలో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మచిలీపట్నం పేరు ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు కాగా నేటికీ అదే పేరు ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం.. బ్రిటిష్ కాలంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాడు పదిమంది లోపు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. 1955లో స్టేట్ బ్యాంక్‌గా ఏర్పడిన తరువాత ఉద్యోగుల సంఖ్య 20కి చేరింది. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండేవి. ఆ రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు, పదుల్లో లావాదేవీలు జరిగేవి. నేడు 50 వేలకు పైగా ఖాతాదారులు ఉండగా రోజూ వెయ్యికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 1905లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆంగ్లేయులకు అన్ని విధాలా ఉపయోగపడింది. రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో ఆంగ్లేయులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఈ బ్యాంక్‌లో భద్రపరచినట్లు పెద్దలు చెబుతున్నారు. -
చిరు వ్యాపారులపై అధికారుల ఓవరాక్షన్
-
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్‌కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్‌కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
బాలికపై యువకులు దాడి
-
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
మచిలీపట్నంలో శక్తి పటాల ఊరేగింపులో ఘర్షణ
-
స్వచ్ఛ సేవకులుగా మారండి
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రాన్ని 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలని సీఎం చంద్రబాబు కోరారు. బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం వచ్చిన ఆయన మహాత్మాగాందీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గాం«దీజీ, లాల్ బహదూర్‌శాస్త్రి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పి0చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి, చెత్త ప్రభుత్వం అనిపించుకుందన్నారు. ఆ చెత్త పన్నును ఈ రోజు నుంచి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 2015లో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టామన్నారు. పట్టణాల్లో 2.43 లక్షల మరుగుదొడ్లు, 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించి, 110 మునిసిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించామన్నారు. 2019 ఎన్నికల్లో భూతం వచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, ఎక్కడ చూసినా కుప్పలుగా చెత్తను పెట్టారని పేర్కొన్నారు. 9,538 సాలిడ్ వేస్టే మేనేజ్మెంట్ కేంద్రాలను నిర్మించామని, వాటిని గత ప్రభుత్వం వినియోగించుకోకుండా రంగులు వేసుకుందన్నారు. మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు 1919లో కృష్ణా జిల్లాలో సత్యాగ్రహ సభలో గాం«దీజీ పాల్గొన్నారని, ఈ గడ్డపై పుట్టిన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను గాం«దీజీకి అందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెడతామన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారని, కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీ స్థలాన్ని కబ్జా చేయాలని చూశారన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ ఆ«దీనంలో నిర్వహిస్తామని తెలిపారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎన్నికల హామీ ప్రకారం దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ పథకానికి తానే శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. 2025 మార్చి నాటికి ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు, 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీళ్లిస్తామని, 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని, అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయన బందరు పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి.. 2025 డిసెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. బందరు–రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి చొరవ తీసుకుంటామన్నారు. మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ నిరి్మస్తామని, బందరు లడ్డు, రోల్డ్ గోల్డ్ నగల తయారీ పరిశ్రమల కోసం ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేస్తామన్నారు. ప్లెక్సీల వాడకాన్ని నిర్మూలించేందుకు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2047 నాటికి వందేళ్ల స్వతంత్ర భారత్‌లో స్వర్ణాంధ్ర లక్ష్యమన్నారు. జనాభాను పెంచాలి జనాభా తగ్గుముఖం పట్టడంతో వృద్ధుల సంఖ్య అధికంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలని సూచించారు. గత పాలకుల పాపంతోనే బుడమేరుకు గండ్లు పడి వరదలు వచ్చాయని, దీంతో విజయవాడ అతలాకుతలమైందన్నారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, వారికి మంచినీరు, భోజనాలు అందించలేక పోయామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు రథం తగలబెట్టి.. ఆ నెపం టీడీపీపై నెట్టాలని చూశారని, నేరం చేసిన రెండు నిమిషాల్లోనే నిందితుల్ని పట్టుకునే వ్యవస్థ ప్రభుత్వం వద్ద ఉందన్నారు. రాముడి తల నరికితే నిందితులను పట్టుకోలేదని, దుర్గమ్మ వెండి సింహాలు మాయం చేసిన వారిపై చర్యలు లేవన్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తి అయినా ఇంతవరకు ఎందుకు చెత్తపన్నును రద్దు చేయలేదని నెటిజన్లు సోషల్‌మీడియాలో సీఎంను ప్రశ్నిస్తున్నారు. -
బందరు సర్వజన ఆస్పత్రిలో అమాత్యుడి జపం!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆఖరుకు ప్రభుత్వాస్పత్రుల్లోని డాక్టర్లను వదిలిపెట్టకుండా బందరు ఎమ్మెల్యే అయిన మంత్రితో చెప్పించమంటారా అంటూ వారిపై.. రోగుల సహాయకుల పేర్లతో వస్తున్న చోటామోటా నేతలు వత్తిడి పెడుతున్నారు. మేం మంత్రి గారి తాలూకా.. ప్రభుత్వం మాది మేం చెప్పినట్లు వైద్యం చేయండి అన్నచందాన వీరు తీరుంది. నాయకులింతే.. మారరంతే అని డాక్టర్లు.. కొందరు రోగులు అనుకుంటున్నారు. మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలే నడుం నొప్పితో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆయనకు సహాయకులుగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు.. ‘డాక్టర్ గారు.. నేను బందరు ఎమ్మెల్యేగారి తాలూకా. రోగి నాకు బాగా కావాల్సిన మనిషి. బాగా చూడండి. ఎమ్మారై స్కానింగ్ చేయించండి అన్నారు.’ దీంతో కంగుతిన్న వైద్యులు ‘ఎక్స్‌రే చాలు.. ఎమ్మారై అవసరం లేదని’ చెప్పినా వినకుండా.. మంత్రి గారితో చెప్పించ మంటారా? అని ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఎమ్మారై చేయించారు.’ ఇలాంటి పరిస్థితి ఉంది బందరు సర్వజన ఆస్పత్రిలో..సాక్షి, మచిలీపట్నం: బందరు మొత్తం.. మంత్రి గారి తాలూకా అన్నవిధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తార్కాణం బందరు సర్వజన ప్రభుత్వాస్పత్రి. ‘డాక్టర్‌గారూ.. నేను బందరు ఎమ్మెల్యే గారి తాలూకా.. ఆయన మంత్రిగారు కూడా.. చెప్పించమంటారా అంటూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి డాక్టర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నారు’ రోగుల సహాయకులుగా వచ్చే కొందరు నేతలు. అంతేకాకుండా వారు.. డాక్టర్లు చెప్పిన టెస్ట్‌లు కాకుండా ఎలాంటి పరీక్షలు రాయాలో కూడా ఆ నేతలే సూచిస్తున్నారు. ఇది రోజు రోజుకూ పెరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. మరి కొందరు సహాయకుల పేరుతో వచ్చే చోటామోటా నేతలు ఇంకాస్త ముందుకు వెళ్లి.. అవసరం లేకపోయినా అడ్మిట్ చేసుకోవాలని, వార్డులో బెడ్స్ వసతి కల్పించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లకు గురి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోగి పరిస్థితి, వ్యాధి లక్షణాల మేరకు అవసరమైన పరీక్షలు చేయిస్తామని, వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నా వినడం లేదని తెలుస్తోంది. -
నీ ఉడత ఊపులకు భయపడం.. పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి? అంటూ పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా?. మీ ఉడత ఊపులకు మేం భయపడబోం’’ అని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైనా పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘సినిమాల్లో నాలుగు డ్యాన్స్‌లు వేసి రాజకీయాల్లోకి వచ్చావ్. నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావ్. కులం లేదు, మతం లేదంటూ మతాలను రెచ్చగొడతావ్. క్రిస్టియన్లకు, ముస్లింలకు ఉన్న ఐక్యత మీకు లేదా అంటూ హిందువులను రెచ్చగొడతావ్. ఎన్నికల ముందు కులాలను రెచ్చగొట్టావ్. ఈ రోజు మతాలను రెచ్చగొడుతున్నావ్. డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి. .బాధ్యత లేకుండా ప్రవర్తించడం సిగ్గుమాలినతనం’’ అంటూ పేర్ని నాని నిప్పలు చెరిగారు.‘‘గుడివాడ వెళితే నా కారుపై రాళ్లు వేయించావ్. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని గుర్తుంచుకో పవన్. మచిలీపట్నం పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా. తప్పుడు ఉద్యోగం చేయడం మీరు మొదలుపెడితే హింసా రాజకీయాలు మొదలవుతాయి. మేం చాలా ప్రశాంతంగా ఉన్నాం. మందు పోయించి మా ఇళ్ల పైకి మందిని పంపిస్తే. పరిస్థితులు మరోలా ఉంటాయి’’ అంటూ పేర్ని నాని హెచ్చరించారు. ‘‘పవన్ తప్పుడు రాజకీయాలు మానుకోవాలి. నిన్నటి దాకా కులం అయిపోయింది. ఇప్పుడు కాషాయ దుస్తులు ధరించావ్. కాషాయ దుస్తులు తీసేసి.. సినిమాల్లో అమ్మాయిలతో డాన్స్‌లు చేసి రావడమేంటి?. లడ్డూలో నిజంగానే తప్పులుంటే ఈ డ్రామాలెందుకు?. తప్పుడు రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టి పాపం మూటగట్టుకుంటున్నారు. దిష్టిబొమ్మ తగలేసి. శునకానందం పొందడం మానుకో. హుందాగా రాజకీయం చేయండి. పోతు పేరంటాళ్లలాగా మెట్లకు పసుపులు రాయడం కాదు’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు.ఇదీ చదవండి: గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం.. ఏది నిజం?వైజాగ్ స్టీల్ కార్మికులతో ఏం చెప్పావో మర్చిపోయావా?. ఒక్క ఎంపీ ఇవ్వండి పార్లమెంట్‌ను బద్ధలు కొట్టేస్తా అన్నావ్. చంద్రబాబు, నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు. స్టీల్ ప్లాంట్ కాపాడతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా. మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నావ్. వంద రోజులైంది. ఏమైంది సుగాలి ప్రీతి కేసు. ఎన్నికల ముందు 30 వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారన్నావ్ కదా. డిప్యూటీ సీఎం అయ్యావు.. అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి. నా కారు పై రాళ్లేయించినా.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయించినా తగ్గేదే లేదు.. ఆగేదే లేదు. నీకు చేతనైతే.. నికార్సైన రాజకీయ నాయకుడివైతే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు’’ అని పేర్ని నాని హితవు పలికారు. ‘‘బందరు పోర్టు, మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ఇలాంటి పాపాలు చేయడం మానుకోండి. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని నువ్వూ... నీ ముఖ్యమంత్రి చెబుతారు. లోకేష్.. నీ ఆర్థిక మంత్రి నెయ్యి కలపలేదంటారు. దేవుడితో దుర్మార్గమైన నీచ రాజకీయాలు మాని.. ప్రజలకు మంచి చేయండి’’ అని పేర్ని నాని అన్నారు. -
కాలం మారినా కళ తగ్గలేదు
వస్త్ర ప్రపంచంలో వన్నె తగ్గని కలంకారీ మొగలుల కాలంలో ఆదరణ పొంది, బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. రసాయనాలకు తావులేకుండా సహజసిద్ధమైన రంగులతో తయారవుతున్న ఈ అద్దకం మచిలీపట్నం కలంకారీగా వాసికెక్కింది. 1960లో పెడన వరకు విస్తరించింది. కలంకారీలో ఈ ఊరిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వందల దుకాణాలున్నాయి. పెడనతోపాటు గూడూరు, పోలవరం, కప్పదొడ్డి తదితర గ్రామాల్లోనూ ఈ కళే ప్రధాన జీవనోపాధిగా మారి ఓ పరిశ్రమగా విరాజిల్లుతోంది. దీనిపై ఆధారపడి దాదాపు పదివేల మందికి పైగా కార్మికులు జీవిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సోకులను సంతరించుకుంటున్న ఫ్యాషన్ ప్రపంచం తన కేటలాగ్ నుంచి కలంకారీని మాత్రం రీప్లేస్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు దానికున్న క్రేజ్ ఎలాంటిదో! ఇలా ప్రింట్ అవుతుంది..కలంకారీ అద్దకం కోసం ముందుగా ఒక కొర్రగుడ్డను (గోధుమ వర్ణంలోని వస్త్రం) తీసుకుని దాన్ని ఒకరోజంతా నీటిలో నానబెడతారు. తర్వాత ఆ గుడ్డకు కరక్కాయ గుజ్జు పట్టించి, రోజంతా ఉంచుతారు. అనంతరం దాని మీద బ్లాక్ ప్రింట్ (పలు రంగుల్లోని డిజైన్ అచ్చులు) వేసి, 24 గంటల తర్వాత ఆ గుడ్డను తీస్తారు. దాన్ని పారుతున్న కాలువ నీటిలో శుభ్రం చేస్తారు. దాంతో బ్లాక్ ప్రింట్ వేసిన తర్వాత గుడ్డకు అంటిన రంగులు పోతాయి. అప్పుడు దాన్ని రాగి బానలో 45 నిమిషాల పాటు ఉడకబెడతారు. దీనివల్ల గుడ్డ మీద డిజైన్ మరింత చిక్కగా, వెలిసిపోకుండా తయారవుతుంది. ఇలా ఈ ప్రక్రియలో ఒక బెడ్‌షీట్ తయారు కావాలంటే వారం పడుతుంది. కానీ స్క్రీన్ ప్రింట్లో ( రసాయన రంగులు ఉపయోగించి చేసిన రెడీమేడ్ అచ్చులు) అయితే ఒక కార్మికుడు రోజుకు 6 బెడ్షీట్లను తయారుచేయగలడు. ఇలా అన్ని రకాల ఉత్పత్తులతో జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.50 కోట్ల టర్నోవర్ జరుగుతోంది.డిజైన్లు ఇలా..ఈ కళలో పలు పౌరాణిక కథథలను, పూల తీగలను, అమ్మాయిల నృత్య భంగిమలను డిజైన్లుగా చిత్రీకరించి, తర్వాత వాటికి వెజిటబుల్ డైస్‌తో రంగులు అద్దుతారు. ఇది ఆంగ్లేయుల కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో కలంకారీకున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. ఆయా ప్రాంతాల నుంచి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, కుషన్ కవర్లకు ఆర్డర్లు వస్తుంటాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం కలంకారీ దుస్తులు వినియోగించారంటే దీని ప్రత్యేకత ఎలాంటిదో తెలుసుకోవచ్చు.∙ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. ఫొటోలు: చక్రపాణి, విజయవాడపిచ్చుక వీరసుబ్బయ్యతో మొదలు..పెడనలో కలంకారీ వస్త్రాల తయారీని తొలిసారిగా పిచ్చుక వీరసుబ్బయ్య ప్రారంభించారు. నేటికీ ఆయన వంశస్థులు ఇందులో కొనసాగుతున్నారు. ప్రకృతిసిద్ధమైన రంగులతో ఈ కళకు జీవం పోస్తున్నారు.మూడుతరాలుగా ఇందులోనే.. పెడనలో కలంకారీని మా నాన్న పిచ్చుక వీరసుబ్బయ్య మొదలుపెట్టారు. ఇక్కడ తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి కావాలన్నది మా నాన్న కోరిక. ఈ కళ మా ఇంట్లో వారసత్వంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను, మా అబ్బాయి పిచ్చుక వరుణ్‌కుమార్ ఇద్దరం ఇదే రంగంలో ఉన్నాం. మా అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్వతహాగా ఇంకో పది డిజైన్లు తయారు చేశాడు. వీటికి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.– పిచ్చుక శ్రీనివాస్, పెడన.16 ఏళ్లుగా.. ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లికి ముందు నుంచే అంటే 16 ఏళ్లుగా ఈ అద్దకం చేస్తున్నాను. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చున్నీలు, బెడ్షీట్లపై కలంకారీ ప్రింట్ వేస్తాను. యజమానులు సూచించిన, డిమాండ్‌లో ఉన్న డిజైన్లను చేతితో అచ్చు వేస్తాను.– ఈడే వెంకటలక్ష్మి, పెడన.ప్రభుత్వం ఆదుకోవాలి ఫ్యాషన్ మార్కెట్లో కలంకారీకి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. అయితే పెరిగిన ముడి సరుకుల ధరలతో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం. తగిన కూలీ లేక చాలా మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. ఈ పరిశ్రమ కొనసాగాలంటే దీనిని ప్రభుత్వం ఆదుకోవాలి.– యర్ర టార్జ¯Œ రావు, వస్త్ర వ్యాపారీ, పెడన. -
మన్మథుడి కోసం ఇద్దరి ప్రియురాళ్ల కీచులాట..
మచిలీపట్నం(చిలకలపూడి): మచిలీపట్నం నగరానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేయటంతో పాటు వేరే మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న ఘటనలపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. సీఐ అబ్ధుల్‌నబీ తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నగరానికి చెందిన బిల్డర్ విజయ్ ఓ మహిళతో ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆ మహిళ వద్ద నుంచి కొంత సొమ్ము, బంగారం తీసుకున్నారన్నాడు. విజయ్ కూడా ఆ మహిళకు పలు దఫాలుగా ఆర్థిక సాయం చేశాడు. ఇటీవల విజయ్ మరో మహిళతో పరిచయం ఏర్పరుచుకుని మొదట సహజీవనం చేసిన మహిళను దూరంగా పెడుతూ వచ్చాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహం చెంది మరో అమ్మాయితో విజయ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి నేను ఇచ్చిన సొమ్ము, బంగారం తిరిగి ఇమ్మని వాగ్వాదానికి దిగిందన్నారు. విజయ్‌కు సంబంధించిన కారును తగులబెట్టే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారన్నారని తెలిపారు. సహజీవనం చేసిన మహిళ విజయ్‌తో ఉన్న మహిళ ఇరువురు కొద్దిసేపు వాగ్వాదానికి దిగి దాడులకు కూడా పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదుతో పాటు విజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై పరస్పర కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మన్మథుడి కోసం ఇద్దరి ప్రియురాళ్ల కీచులాట..
-
మచిలీపట్నంలో టీడీపీ Vs జనసేన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ, జనసేనల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.దీంతో యర్రంశెట్టి నానిపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆయన ఇళ్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో యర్రంశెట్టి నాని గాయపడ్డారు.అనంతరం ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్మెంట్ చేశారు. అయితే, సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా టీడీపీ నేతలు తీవ్రంగా కొట్టారు.బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని టీడీపీ నేతలు క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. జనసేన, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.ఇదీ చదవండి: తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు -
ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం
సాక్షి, మచిలీపట్నం: బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆక్వాకల్చర్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం బృందం సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గిలకలదిండిలో నిరి్మస్తున్న హార్బర్‌ను ఆదివారం కేంద్ర బృందం ప్రాజెక్టు ఇండియా సహాయ ప్రతినిధి డాక్టర్ కొండ చెవ్వ, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, కో–ఆర్డినేటర్ సీమ భట్, లీడ్ టెక్నికల్ స్పెషలిస్ట్ మురళీధరన్, ఆక్వా కల్చర్ స్పెషలిస్ట్ విష్ణుభట్, ఫైనాన్స్ స్పెషలిస్టు నీలకంఠ మిశ్రా, ఎని్వరాన్మెంటల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ నీనా కోషి, సేఫ్ గార్డ్ స్పెషలిస్టు సలోమ్ ఏసుదాస్ పరిశీలించారు.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ (ఎఫ్ఏఓ) ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితులు, మత్స్యకారుల ఇబ్బందులు, చేపల నిల్వ, ప్యాకింగ్, నీరు, ఉప్పు శాతం, భూమి, ఇతర నమూనాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వాకల్చర్‌పై దృష్టి పెడుతుందన్నారు. మెరుగైన, సైన్స్ ఆధారిత ఆక్వాకల్చర్ నిర్వహణ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ స్కేప్ విధానాలు అవలంబించాలని, రసాయన వినియోగం తగ్గించి స్థిరమైన ఆక్వాను ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు.మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగమతి చేస్తే.. రిజెక్టు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర బృందంతో భూగర్భ వనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. బందరును ఆక్వాహబ్‌గా మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోలార్ పవర్డ్ బోట్స్ సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్ డి.కె.బాలాజీని కలిసి, హార్బర్ వద్ద సేకరించిన అంశాలను ఆయనకు వివరించింది. -
బందరు తీరంలో భారీ చేప.. బరువు తెలిస్తే షాకే..
సాక్షి, కృష్ణా జిల్లా: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు బందరు తీరంలో వలకు భారీ టేకు చేప చిక్కింది. మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది.ఈ టేకు చేప 1500 కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. క్రేన్ సాయంతో ఆ భారీ చేపను బయటకు తీశారు. ఈ టేకు చేపను చెన్నైకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.కాగా, బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతుంటారు. -
నర్సు వేషంలో వచ్చి కిడ్నాప్..
-
జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్
-
టీడీపీ శ్రేణుల దౌర్జన్యం
మచిలీపట్నంటౌన్: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆ పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగుతున్నాయి. ఓ పక్క కౌంటింగ్‌లో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటి సమీపంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడిన టీడీపీ, జనసేన కార్యకర్తలు బుధవారం మళ్లీ దాడులకు యత్నించారు. నగరంలోని పలు కాలనీల్లో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ కార్యకర్తలు బైక్‌ల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్ధాలతో హడావుడి చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల నివాసప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచాను కాలుస్తూ నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. బుధవారం నగరంలోని 28వ డివిజన్ ఓగీస్పేట ప్రాంతంలో మొబైల్ డిస్ట్రిబ్యూçÙన్ యూనిట్ (ఎండీయు) వాహనం ద్వారా నిర్వాçßæకుడు పిండి శ్యాంబాబు కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నాడు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా అక్కడకు చేరుకుని ముందు వాహనం నుంచి దిగాలని శ్యాంబాబును దౌర్జన్యంగా దింపి దాడి చేయబోయారు.దీంతో అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. వాహనానికి టీడీపీ జెండాలను కట్టి జగన్స్టిక్కర్లను చించివేశారు. దీంతో శ్యాంబాబు విషయాన్ని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పాటు డీఎస్వో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. బుధవారం వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున గురువారం ఆ ప్రాంతానికి వెళ్లి సరుకులు పంపిణీ చేయాలని, మళ్లీ వారు ఏమైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. -
కొల్లు రవీంద్రలో కలవరం
పచ్చ పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రిగా ఉన్న ఆ నేత నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సముద్ర తీరాన ఉన్న ఆ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. కాని ఈసారి మేమే గెలుస్తాం అంటూ టీడీపీ అభ్యర్థి పోలింగ్ రోజు డప్పు వేసుకున్నారు. అయితే సునామీలా పోటెత్తిన ఓటర్లు వచ్చింది ఎవరికోసం అన్నవిషయం పోలింగ్ ముగిసాక కాని ఆయనకు అర్థం కాలేదట. దీంతో ఆశల మేడలన్నీ కుప్పకూలి నిరాశలో కూరుకుపోయారట ఆ పసుపు పార్టీ అభ్యర్థి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందో..? ఆ నేత ఎవరో చూద్దాం.ఎన్నికల్లో గెలిచే నాయకులు పోలింగ్‌కు ముందు..తర్వాత ఒకేలా ఉంటారు. మరింత జోష్‌గా ఉంటారు. కాని ఓడిపోయే అభ్యర్థులు పోలింగ్‌కు ముందు ఎంత హడావుడి చేసినా..పోలింగ్ పూర్తయ్యాక పరిస్థితులు అర్థం కావడంతో నిరాశకు లోను కావడం మామూలే. ఇప్పుడు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పరిస్థితి అలాగే తయారైందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు మాటలు నమ్మిన కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మచిలీపట్నంలో ఈసారి కచ్చితంగా పసుపు జెండా ఎగరేయడం ఖాయమనుకున్నారట. అయితే పోలింగ్ రోజున ఓట్ల సునామీని చూశాక టీడీపీ వారికి కళ్ళు బైర్లు కమ్మాయట. ప్రారంభంలో ఆ ఓట్లన్నీ ప్రబుత్వానికి వ్యతిరేకమే అని సంబరపడ్డాక...సమయం గడిచే కొద్దీ వాస్తవం బోధపడింది. వైఎస్ జగన్‌ను గెలిపించేందుకే ప్రజలు తరలివచ్చారనే విషయం వారికి ఆలస్యంగా అర్థమైంది.మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 1,96,680 ఓటర్లు ఉండగా.. వీరిలో 1,61,109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే 4,898 మంది మహిళలు అధికంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను ఆందోళనకు గురిచేస్తోందట. వాస్తవానికి గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి కేవలం ఈ ఐదేళ్లలో మచిలీపట్నం ప్రజలు చూశారు. దశాబ్ధాల కల బందరు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తయితే బందరు పరిసరాలు పరిశ్రమలతో కళకళలాడతాయి. అలాగే ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇప్పటివరకు బందరులో మెడికల్ కాలేజ్ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక తొలివిడతలోనే బందరు మెడికల్ కాలేజీని నిర్మించి ప్రారంభోత్సవం కూడా చేశారు. కాలేజ్‌తో పాటు అద్భుతమైన ఆస్పత్రి కూడా కృష్ణా జిల్లా వాసులకు అందుబాటులోకి వచ్చింది.ఇవే కాకుండా ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు..భారీ ఎత్తున సంక్షేమ ఫలాలు కూడా అందుకున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల కారణంగానే మచిలీపట్నం ప్రజలు ఓటేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. రాత్రి వరకూ వేచిఉండి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు రావడంతో టీడీపీ నేతలు ఆ ఓట్లన్నీ తమకే పడ్డాయని ఆశపడ్డారట. కానీ పోలింగ్ అనంతరం వేసుకున్న లెక్కలతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రలో కలవరం మొదలైందట. ఓటింగ్ లో భారీగా పాల్గొన్న వారిలో అధికంగా మహిళలే ఉండటంతో ఆందోళన మరీ ఎక్కువైందట.చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన అనుభవం ... టీడీపీ సూపర్ సిక్స్ హామీలు తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించేస్తాయని కలలు కన్న కొల్లు రవీంద్రకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదట. 2019లో 80.78 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 1.13 శాతం అధికంగా నమోదైంది. పోలింగ్ జరిగిన తీరు గమనించాక కొల్లు రవీంద్ర బందరు సీటుపై ఆశలు వదిలేసుకున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్‌కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
-
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
-
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
-
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
-
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)
-
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
కృష్ణా జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
-
ఎన్ని పొత్తులైన పెట్టుకొండి... ఎవడి అడ్డాలు లేవు అంతా జగన్ అడ్డ..
-
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
బందరు తీరంలో.. త్వరలో 'లంగరు'
కృష్ణాజిల్లా మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నం శరవేగంగా వాస్తవ రూపంలోకి వస్తోంది. దక్షిణాసియాకు అత్యంత సమీప ముఖ ద్వారంగా ఉన్న ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభించిన ఏడు నెలల్లోనే కీలకమైన బ్రేక్ వాటర్ పనులను పూర్తిచేయడం ద్వారా ఈ పోర్టు నిర్మాణంపై తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటోంది. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 25,000 మందికి ఉపాధి క ల్పించే ఈ పోర్టు.. 2025 ఆరంభానికల్లా పూర్తయ్యేలా పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. – సాక్షి, అమరావతి బందరు పోర్టు తొలిదశ కింద రూ.5,254 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మే 22, 2023న భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించడంతో పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నార్త్‌బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తికాగా, సౌత్‌బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, రెండు బెర్తుల నిర్మాణ పనులూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా వేయగా.. వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్ క్లింకర్, గ్రానైట్ బ్లాక్స్, ముడి ఇనుము, కంటైనర్ల ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అంచనా. ఈ పోర్టు అందుబాటులోకి రావడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో.. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే.. ఇక్కడ సముద్రంలో ఇసుక మేటలు ఎక్కువగా ఉండడంతో పాటు తీరప్రాంతం కూడా ఇసుకతో ఉండటంతో భారీ కట్టడాల నిర్మాణానికి అనువుగా ఉండదు. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేలను పటిష్టపరుస్తున్నారు. 2,075 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రెయిన్స్ (పీవీడీ) విధానంలో భూమిలోంచి నీటిని తోడి ఆ స్థానంలో మట్టిని పంపి భారీ కట్టడాలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా 52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడిపోయడం ద్వారా భారీ ఓడలు నిలుపుకునే విధంగా సముద్రాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆ్రస్టేలియా నుంచి అత్యాధునిక డ్రెడ్జింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. ఏడు నెలల కాలంలోనే 12 శాతం నిర్మాణ పనులను పూర్తిచేయడం ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డు రికార్డు సృష్టించింది. తండ్రి కోరికను నెరవేరుస్తున్న తనయుడు.. నిజానికి.. మచిలీపట్నం పోర్టు పునరుద్ధరణ అనేది స్థానిక ప్రజల చిరకాల స్వప్నమంటూ 2004 తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని తీసుకెళ్లారు. వారి కోరికను నెరవేర్చే విధంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి 2008, ఏప్రిల్ 23న శంకుస్థాపన చేశారు. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు అటకెక్కెంది. 2014 తర్వాత చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా 2019 ఎన్నికలకు కేవలం నెలన్నర ముందు కొబ్టరికాయ కొట్టి మమ అనిపించారు. కానీ, దీనికి భిన్నంగా ప్రసుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు సమకూర్చడం దగ్గర నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం.. సీఎం పదవి చేపట్టిన ఏడాదిలోపే 2020 ఫిబ్రవరి 4న మచిలీపట్నం పోర్టు డెవలపమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు. రూ.5,254 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేయడమే కాకుండా జగన్ సర్కారు నిధులను కూడా సమకూర్చింది. ఆ తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.3,668.83 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించడానికి టెండరు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌తో 2023, ఫిబ్రవరి 26న ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా 2023, ఫిబ్రవరి 28న వచ్చాయి. ఇలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించడమే కాక ఆ పనులు వేగంగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పోర్టు ఎప్పుడెప్పుడు ఎలా..? ♦ 1590 నుంచి ఎగుమతి దిగుమతులతో మచిలీపట్నం పోర్టు కళకళ.. ♦ 1970 నుంచి నిలిచిపోయిన పోర్టు కార్యకలాపాలు ♦ బందరు వాసుల చిరకాల వాంఛను తీరుస్తూ దివంగత సీఎం వైఎస్ 2008 ఏప్రిల్‌లో శంకుస్థాపన ♦ ఆయన మరణానంతరం అటకెక్కిన పోర్టు పనులు ♦ ఎన్నికలకు నెలన్నర ముందు ఎటువంటి అనుమతులు లేకుండా 2019లో చంద్రబాబు మరోసారి శంకుస్థాపన ♦ దీనికి భిన్నంగా ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు ప్రారంభించిన సీఎం జగన్ ♦రూ.11,464 కోట్ల వ్యయంతో 116 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టు నిర్మాణం ప్రారంభం ♦తొలిదశలో రూ.5,254 కోట్ల పెట్టుబడితో పోర్టు పనులకు గత మే 22న శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ ♦ 2,075 ఎకరాల్లో నాలుగు బెర్తులతో 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ♦ పోర్టును జాతీయ రహదారితో అనుసంధానిస్తూ 6.5 కి.మీ మేర నాలుగులైన్ల రహదారి నిర్మాణం ♦అలాగే.. ఏడు కి.మీ రైల్వేలైన్ కూడా నిర్మాణం ♦ ఈ పోర్టుతో రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణకు ప్రయోజనం ♦ దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి ప్రాజెక్టు పూర్తి వ్యయం - 11,464 కోట్లు తొలిదశ పోర్టు సామర్థ్యం - 35 ఎంఎంటీపీఏ పూర్తిస్థాయి సామర్థ్యం - 116 ఎంఎంటీపీఏ బెర్తులు - 2,075ఎకరాల్లో నాలుగు బెర్తులతో నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం 2025ప్రారంభం నాటికి భారీ ఓడలు నిలిచేలా నిర్మాణం.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం అత్యంత సవాలుతో కూడుకున్నది. భారీ ఓడలు నిలిచే విధంగా రాష్ట్రంలోని నాలుగు ఓడ రేవులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఓడరేవుల సగటు లోతు 7–8 మీటర్లు ఉండగా, ఇప్పుడు నిర్మిస్తున్న ఈ పోర్టుల్లో 16–18 మీటర్ల లోతు ఉండేలా నిర్మిస్తున్నాం. దీంతో భారీ ఓడలు రావడమే కాకుండా సరుకు రవాణా కూడా పెరుగుతుంది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యాపారం మొత్తం ఇప్పుడు మచిలీపటా్ననికే వస్తుంది. – రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు 2025 నాటికి రెడీ.. అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడు నెలల్లోనే 12 శాతం పనులు పూర్తిచేశాం. 6.5 కి.మీ కాంపౌండ్ వాల్ నిర్మాణం, నాలుగు బిల్డింగ్లు, జాతీయ రహదారి 216కు అనుసంధానం చేస్తూ 6.5 కి,మీ రోడ్డు అనుసంధానం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు బెర్తులకు సంబంధించి ఈ పైల్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2025 ప్రారంభం నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నాం. – ఎం. దయాసాగర్, ఎండీ, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంతోషంగాఉంది.. బందరు ప్రాంత అభివృద్ధి ఈ పోర్టు నిర్మాణంతో సాకారం కానుంది. పోర్టు నిర్మాణానికి నాకున్న భూమిని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలిగింది. భావితరాల మేలు కోసం మాజీమంత్రి పేర్ని నాని చేసిన కృషి ఫలించింది. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, పోతేపల్లి, బందరు మండలం గర్వంగా ఉంది.. సొంత ఊరు అభివృద్ధికి కీలకమైన బందరు పోర్టు నిర్మాణంలో భాగస్వామి కావడం ఆనందంగాను, గర్వంగాను ఉంది. నేను ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడిని. కానీ, ఈ పోర్టు నిర్మాణంలో నా వంతు కృషిచేయాలన్న తలంపుతో మచిలీపట్నంకు బదిలీ చేయించుకున్నా. బందరు పోర్టును జాతీయ రహదారికి అనుసంధానించే పనిలో పాలుపంచుకుంటున్నా. త్వరలో ఈ ప్రాంత ప్రజల కల సాకారం కానుంది. – బి.నాగసూర్య చంద్ర, అసిస్టెంట్ మేనేజర్, రైట్స్ సంస్థ -
మచిలీపట్నం భాస్కరపురంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం
-
సాధికారతను చాటిన మచిలీపట్నం
మచిలీపట్నం(కృష్ణాజిల్లా): మచిలీపట్నంలో సామాజిక సాధికారత నినాదం ఉప్పొంగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ‘జై జగన్’ నినాదాలతో మచిలీపట్నం హోరెత్తింది. నియోజకవర్గంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎదుట బుధవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘గడచిన 75 ఏళ్లల పాలన కంటే సీఎం జగన్మోహన్రెడ్డి పాలన భిన్నమైనది. ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చాలనేదే సీఎం జగన్ తాపత్రయం. ఈ దేశంలో రాజకీయ అవకాశం కల్పించాలని ఎంతోమంది ఉద్యమాలు చేశారు. అన్ని వర్గాలకు అధికారం కట్టబెట్టిన వ్యక్తి సీఎం జగన్.ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే ఇలా చేయగలరు. గత ప్రభుత్వంలో మైనార్టీలు,గిరిజనులకు కనీస అవకాళం కల్పించలేదు. పేదల కన్నీళ్లు తుడిచి ఆకలి తీరుస్తుంటే చంద్రబాబు బాధపడిపోతున్నాడు. డబ్బంతా ఖర్చైపోతోందని గగ్గోలు పెడుతున్నాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం మామూలు విషయం కాదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడైనా జరిగిందా ఇలా? 12,800 కోట్లు ఖర్చు చేసి పేదలకు ఇంటి స్థలాలు అందించారు.ఊళ్లకు ఊళ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి చంద్రబాబు పేదవాడి కోసం ఒక్క సెంటు స్థలమైనా కొన్నాడా?,పథకాలను ఓట్లతో ముడిపెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్య ఎదగడానికి ఎవరు కారణం. ప్రైవేట్ విద్య ఎవరి కారణంగా వచ్చింది. సీఎం జగన్ వచ్చాక ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం దక్కింది. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడో చంద్రబాబు చెప్పాడా?, ఎందుకు చంద్రబాబుకి ఓటేయాలి.నాలుగేళ్లు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు వేస్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎలా ఇస్తానంటున్నాడు’ అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము సున్నాలమే. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ నాయకులను, మంత్రులను చేశారు. మన తరాలు, తలరాతలు మారాలని, ఆలోచన చేసిన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు. ఓ పది వేల మందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు. నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా?, ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు. చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు. సీఎం జగన్ మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి సీఎం జగన్. 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలిపించుకుందాం. కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు. చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు. కాపులంతా ఆలోచన చేయాలి.రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం. తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.ఆ పప్పు పులకేష్ మనకు అవసరమా ...ప్రజలు ఆలోచన చేయాలి. మచిలీపట్నం నుంచి 2024లో పేర్ని కిట్టుని అంతా ఆశీర్వదించాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బీసీ మంత్రి రాలేడు. కానీ సీఎం జగన్ ఒక బీసీనైన నన్ను మంత్రిని చేశారు.’ అని తెలిపారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మచిలీపట్నంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డీబీటీ ద్వారా రూ. 615 కోట్లు అందాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరుగుతోంది. మచిలీపట్టణాన్ని పేర్ని నాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయనంత సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ చేసి చూపించారు. ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర వర్ణ పేదలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. అధికారంలోకి వచ్చాక ఏం చేశామో బస్సుయాత్రలో ప్రజలకు తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి కేబినెట్లో మంత్రులుగా సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. 13 జెడ్పీ చైర్మన్లలో9 చోట్ల అట్టడుగువర్గాలకు స్థానం కల్పించారు. రాజకీయంగా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్సీపీ నాలుగేళ్ల పాలనలో పేదరికం తగ్గించగలిగాం’ అని తెలిపారు. -
సామాజిక సాధికార యాత్రకు భారీ ఏర్పాట్లు
-
అభివృద్ధిలో మచిలీపట్టణం
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 24వ రోజు షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, వారి సామాజిక సాధికారతకు సీఎం జగన్ తోడ్పడిన వైనాన్ని వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవా రం విజయనగం జిల్లా నెల్లిమర్ల, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో జరిగిన యాత్రకు జనం నీరాజనాలు పలికారు. బుధవారం ఈ యాత్ర పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గాల్లో జరుగుతుంది. కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో వైసీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరుకానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాంలో మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నందివానివలసలో వైసీపీ నేతల విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు పెదమేరంగి, సీమనాయుడువలస మీదుగా బైకు ర్యాలీ జరగనుంది. 3 గంటలకు కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొననున్నారు. -
BHEL కంపెనీ దగ్గర ఉద్రిక్త వాతావరణం.. ఆక్టోపస్ దళాల హంగామాతో ప్రజల్లో భయం
-
పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం చరిత్రాత్మకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మెడికల్ కళాశాలను శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో 64 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లోనూ అకడమిక్ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. రైతులపై చంద్రబాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, వైఎసార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు. -
పొంగిన మున్నేరు వాగు.. కంచికచర్ల-చెవిటికల్లు మధ్య రాక పోకలు బంద్
సాక్షి, ఎన్టీఆర్\కృష్ణా జిల్లా: భారీ వర్షాలతో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కంచికచర్ల-చెవిటికల్లు రహదారిపై వరద ప్రవాహం కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయం భారీ వర్షానికి మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేర్ని నాని పర్యటించారు. డ్రైవర్ కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్‌ను పరిశీలించారు. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 10.20 అడుగులకు నీటిమట్టం చేరింది. 7.67 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 8వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. చదవండి: మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య -
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య దారుణ హత్య
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో దారుణం జరిగింది. జవారుపేట సెంటర్లో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్ వైద్యుడు ముచ్చెర్ల మహేశ్వరరావు భార్య రాధను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దోపిడీకి కోసం ఇంట్లో చొరబడి తన భార్యను హత్య చేసినట్లు డాక్టర్ చెబుతున్నారు. గొంతుకోసి హత్య చేసి, నగదు, నగలు దోపిడీ చేశారని ఆయన తెలిపారు ఘటన స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుంది. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు.. ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ రవి ప్రకాష్ పరిశీలించారు. ఆ ఇంటికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చదవండి: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు వివాహిత ఆత్మహత్య -
‘మెడికల్’ రికార్డు..!
వడ్డే బాలశేఖర్–మచిలీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: వందల ఏళ్ల క్రితమే సముద్రయానం ద్వారా వర్తక వాణిజ్యంతో అలరారిన మచిలీపట్నం నగరం క్రీ.శ. మూడో శతాబ్ధం నాటిదని చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో బ్రిటీష్ పాలకులు బందరు తీరం నుంచి వాణిజ్య కార్యకలా పాలు నిర్వహించారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక నగరంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైతే 70 కి.మీ ప్రయాణించి విజయవాడ వెళ్లాల్సిందే. ఈ అవస్థలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బందరు మెడికల్ కాలేజీని మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపారు. 64.3 ఎకరాల్లో రూ.550 కోట్లతో మచిలీపట్నం వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణానికి 2021 జూలై 7 సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశారు. 150 ఎంబీబీఎస్ సీట్లతో నూతన వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేలా సదుపాయాలను సమకూర్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మచిలీపట్నం వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించారు. బందరు తీర ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత తొలి ఏడాది ఎంబీబీఎస్‌లో చేరే విద్యార్థులకు అకడమిక్ కార్యకలాపాల కోసం అడ్మినిస్ట్రేషన్, ల్యాబొరేటరీ, లెక్చర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్, హాస్టళ్లతో కలిపి 7 బ్లాక్‌లను నిర్మించారు. లెక్చర్ గ్యాలరీ బ్లాక్‌లో 184 మంది కూర్చునే సామర్థ్యంతో ఎల్ఈడీ స్క్రీన్స్, ప్రొజెక్టర్స్, సెంట్రల్ ఏసీ లాంటి అత్యాధునిక వసతులతో రెండు లెక్చర్ హాల్స్, ఇన్సైడ్, అవుట్‌సైడ్ రీడింగ్ రూమ్స్, జర్నల్, స్టాఫ్ రీడింగ్, లైబ్రరీ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల కోసం విడివిడిగా రెండు హాస్టల్ బ్లాక్‌లు సిద్ధం చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుగుణంగా అన్ని వనరులు సమకూర్చారు. ఆయా బ్లాక్‌లలో ఫర్నిచర్ సమకూర్చే సమకూర్పు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరు లోపు భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. మచిలీపట్నం తరహాలోనే నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అన్ని చోట్ల నేడో రేపో కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధన సిబ్బంది కొత్తగా నిర్మించిన తమ చాంబర్లలో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి సమకూరనున్నాయి. ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటు కాగా వందేళ్ల తరువాత ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. విద్య, వైద్యం.. రెండు రకాల లాభాలు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఐదు చోట్ల సేవలు అందించిన జిల్లా ఆస్పత్రుల స్థానంలో బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. సేవలు రెట్టింపవుతాయి. అధునాతన వైద్య పరికరాలు, ల్యాబ్‌లు సమకూరడంతో వైద్య సేవలు, రోగ నిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వల్ల వివిధ రకాల వ్యాధులు, జబ్బులపై రీసెర్చ్ జరుగుతుంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో చేరనున్న విద్యార్థులు నాలుగేళ్ల అనంతరం హౌస్ సర్జన్లుగా సేవలు అందిస్తారు. 24/7 ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటంతో సేవలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఎన్ఎంసీ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ అడాప్షన్ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఐదు కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలను పర్యవేక్షిస్తారు. నాలుగైదేళ్ల తర్వాత పీజీ సీట్లు కూడా సమకూరడంతో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరుగుతుంది. వైద్యుల నిష్పత్తి పెరుగుతుంది కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు విస్త్రృతంగా పెరుగుతాయి. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మన దేశంలో వెయ్యి మందికి ఒకరి కంటే తక్కువ వైద్యులున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎక్కువ మంది వైద్యులు అందుబాటులోకి వస్తారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ కర్నూలు జీజీహెచ్ శరవేగంగా పెండింగ్ పనులు ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభించడానికి వీలుగా పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 31 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేస్తారు. పెండింగ్ పనులన్నీ శరవేగంగా నెలాఖరులోగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తున్నాం. వచ్చే ఏడాది మరో ఐదు కళాశాలలను ప్రారంభించేలా కసరత్తు చేపట్టాం. – ఎం.టి.కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నాలుగేళ్లలో వైద్యరంగం బలోపేతం ఇలా.. ► రూ.16 వేల కోట్లతో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగం బలోపేతం. ► నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 51 వేల వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా సీఎం జగన్ ఆదేశాలు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. ► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. ► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. నెలకు రెండు సార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ఇప్పటివరకూ 1.70 కోట్ల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. ► 108, 104 అంబులెన్స్‌ల సేవలు బలోపేతం. కొత్తగా 768 అంబులెన్స్‌ల సేవలు అందుబాటులోకి. 2020 జూలై నుంచి 33.35 లక్షలకు పైగా అత్యవసర కేసుల్లో సేవలందించిన అంబులెన్స్‌లు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు. స్థానికులకు ఎంతో మేలు ఇప్పటిదాకా బందరు ప్రాంతంలో మెరిట్ విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే కాకినాడ, విజయవాడ, వైజాగ్ వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే వైద్య కళాశాల ఏర్పాటుతో స్థానికులకు ఎంతో మేలు జరగనుంది. పూర్తి స్థాయిలో బోదనాస్పత్రి సిద్ధం అయింది. భవిష్యత్తులో పీజీ విద్యార్థులు కూడా వస్తారు. బందరు చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు ఆరోగ్య భద్రత చేకూరుతోంది. – డాక్టర్ బి.శ్రీనివాసాచార్య, ఐఎంఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంగ్, మచిలీపట్నం మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి ప్రతి చోటా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆమేరకు నంద్యాలలో కొత్త వైద్య కళాశాలను నెలకొల్పారు. త్వరలోనే తరగతులు ప్రారంభం కానున్నాయి. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతోంది. విద్యార్థుల వైద్య విద్య కల కూడా నెరవేరుతుంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ అవుతుంది. – చెన్నకేశవ, నంద్యాల 17 కొత్త కాలేజీలు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలను చేరువ చేసేలా సీఎం జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా సమకూరుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 5 కాలేజీలు ప్రారంభం అవుతుండగా వచ్చే విద్యా సంవత్సరం మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కాలేజీలను ప్రారంభిస్తారు. మిగిలిన వాటిని 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా నోటిఫై చేసింది. -
మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల 150 ఎంబీబీఎస్ సీట్లకు..
-
ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడైనా గెలుపు వైఎస్సార్సీపీదే
-
నేడు ‘స్థానిక’ ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు పట్టణ ప్రాంతాల్లో.. ► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు ► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్పర్సన్ ► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్ ► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు . గ్రామీణ ప్రాంతాల్లో.. ► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) ► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం) ► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ -
మచిలీపట్నంలో శరవేగంగా జరుగుతున్న పోర్టు నిర్మాణపనులు
-
టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు
సాక్షి, మచిలీపట్నం: కొట్టే వెంకట్రావు దంపతులు టీడీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ క్రియాశీలక పదవులకు రాజీనామా చేస్తూ అచ్చెన్నాయుడికి లేఖను పంపించారు. కొల్లు రవీంద్ర నిర్ణయాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెంకట్రావ్ ప్రకటించారు. మచిలీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో వెంకట్రావు భార్యను టీడీపీ తరపున మేయర్ అభ్యర్ధిగా నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మచిలీపట్నం టీడీపీలో కొల్లు వర్సెస్ కొట్టే మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కొట్టే దంపతులకు కొల్లు రవీంద్ర సహకరించకపోవడంతో వారు గతంలో కూడా పలు మార్లు పార్టీ వీడే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, లోకేష్ వద్దని వారించడంతో రాజీనామా నిర్ణయాన్ని వెంకట్రావు విరమించుకున్నారు. కొల్లు రవీంద్ర వైఖరితో విసిగిపోయిన కొట్టే వెంకట్రావు దంపతులు.. పార్టీని వీడారు. చదవండి: ఆంధ్రజ్యోతి సమర్పించు స్వర్గం నరకం -
మచిలీపట్నంలో టీడీపీ నేతల అరాచకం
-
సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూ గుంటూరులో కొందరు పేదలకు వరాల జల్లు కురిపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో గిరిధర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని శ్యామలా నగర్ వచ్చారు. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకుని సాయం చేయమని వేడుకున్నారు. వారందరినీ పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకురమ్మని అధికారులకు ఆదేశించారు. అక్కడికక్కడే ఆదేశాలు అధికారుల సాయంతో హెలిప్యాడ్‌కు చేరుకున్న వి.మరియమ్మ, కోటేశ్వరరావు దంపతులు తమ గోడును వివరిస్తూ.. తమ రెండో కుమారుడు నవీన్ థలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనికి రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంటిస్థలం కూడా లేదని వాపోయారు. వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసి.. ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జె.బాబు, శివ లక్ష్మి దంపతులు మాట్లాడుతూ మునిసిపాలిటీలో ఉద్యోగం తీసేశారని, ఆ ఉద్యోగం తమ కుమారుడికి ఇప్పించాలని వేడుకున్నారు. వెంటనే సీఎం జగన్ అందుకు తగిన ఆదేశాలిచ్చారు. బి.పేరిరెడ్డి అనే వ్యక్తి గోడు చెప్పుకుంటూ.. గతంలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకున్నానని కొంత ఆర్థిక సాయం చే యాలని కోరగా.. ఆయనకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని, వైద్యం అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కె.పుష్ప జైన్ మాట్లాడుతూ తమ జైన్ సొసైటీకి కల్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆగమేఘాల మీద సీఎం ఆదేశాలను సాయంత్రానికల్లా అమలు చేశారు. అప్పటికప్పుడే తమ కోర్కెలను మన్నించి న్యాయం చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పేదల పక్షాన ప్రభుత్వం: కలెక్టర్ గుంటూరులోని కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి, జేసీ జి.రాజకుమారి బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. చదవండి: ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా సైన్యం.. -
బందరు పోర్టు పనులకు భూమిపూజ.. అడుగడుగునా జనాభిమానం
-
సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే
-
బందరుకు చంద్రబాబు అనే గ్రహణం వీడింది
సాక్షి, కృష్ణా: మచిలీపట్నానికి చంద్రబాబు తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పోర్టు రాకుండా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారని తెలిపారు. ఇక్కడ(బందరు) పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ ఉంటుందని చంద్రబాబు కుట్ర చేశారు. పోర్టు రాకూడదని వేల ఎకరాలను కొనుగోలు చేశారు. తాను అమరావతిలో కొన్న భూముల రేట్లు పెంచుకునే యత్నం చేశారు. ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయని సీఎం జగన్ పేర్కొన్నారు. రూ. 420 కోట్లతో ఫిషింగ్ హార్బర్పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ కవరింగ్ పరిశ్రమలకు విద్యుత్‌ఛార్జీలను తగ్గించాం. రూ.7.60పై. నుంచి రూ.3.75పై. ఛార్జీలను తగ్గించాం. నాలుగు పోర్టుల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి.ఇకపై ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మేం వచ్చాక రైతుల కల సాకారం అయ్యింది. రూ. 550 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. గతంలో బందరు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న ఒక్క అధికారి ఉండేవారు కాదు. ఇప్పుడు కలెక్టర్‌తో సహా యంత్రాగం మొత్తం ఇక్కడే ఉంటోంది. మరో 24 నెలల్లోనే బందరు రూపు రేఖలు మారిపోతాయని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
‘కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రమిది’
సాక్షి, కృష్ణా: బందరు పోర్టు చిరకాల స్వప్నమని, అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్‌క్లియర్ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా.. సోమవారం జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బందరుకు సముద్ర వర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోలేదు. మేం వచ్చాక బందరు వాసుల కలను నెరవేర్చాం. కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే అస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంలో పోర్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారాయన. పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైన్‌పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లకూ ఇది చేరువలో ఉంటుందని తెలిపారాయన. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. -
బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
టీచర్ @ ఎకో స్మార్ట్ కుండీ
లక్ష్మీదేవికి పాఠాలూ ప్రయోగాలే ఊపిరి. క్లాసులో పాఠంతోపాటు ప్రయోగమూ చేయిస్తారు. మొక్క కోసం నేలకు హాని తలపెడితే ఎలా? అందుకే నేలకు మేలు చేసే పూల కుండీ చేశారు. ఆ.. ఎకో స్మార్ట్ పూల కుండీ... అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శితం కానుంది. ‘టీచర్ ఉద్యోగం ఒక వరం. దేవుడిచ్చిన ఈ అవకాశానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనేది నా ఆశయం’ అన్నారు కొల్లాటి లక్ష్మీదేవి. ఆమె పుట్టింది, పెరిగింది మచిలీ పట్నంలో. ఎమ్ఎస్సీ, బీఈడీ చేసి 1995లో డీఎస్సీ సెలెక్షన్లో ఉద్యోగం తెచ్చుకున్నారు. తొలి పోస్టింగ్ కృష్ణాజిల్లా, సుల్తానగరంలో. అప్పటి నుంచి మొదలైందామె విజ్ఞాన దానయజ్ఞం. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించడంతో మొదలైందా యజ్ఞం. పదేళ్ల తర్వాత పెడన మండలం చెన్నూరు ఈస్ట్‌లో మరో స్కూల్‌కి హెడ్మాస్టర్గా బదిలీ. ఆ సంతోషం ఆ స్కూల్‌కి వెళ్లే వరకే. పదిహేనుమంది పిల్లలున్న స్కూల్ అది. అలాగే వదిలేస్తే ఇద్దరు టీచర్ల స్కూల్లో ఒక పోస్ట్ రద్దయ్యే పరిస్థితి. ఇంటింటికీ వెళ్లి ‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. మంచి విద్యనందిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి’ అని నచ్చచెప్పి ఎన్రోల్మెంట్ 45కి పెంచారు. సైన్స్ ప్రాజెక్టులు చేయించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ పాఠశాల పిల్లలను అయస్కాంతంలా ఆకర్షించేటట్లు చేశారు. ఆ తర్వాత చెన్నూరు జిల్లా పరిషత్ స్కూల్‌కి వచ్చినప్పటి నుంచి పెద్ద తరగతులకు పాఠం చెప్పే అవకాశం రావడంతో మరింత విస్తృతంగా ప్రయోగాలు మొదలుపెట్టారు. వందకు పైగా ప్రయోగాలు చేసిన ఆమె ప్రయోగాల్లో ఎకో ఫ్రెండ్లీ పూల కుండీ ప్రయోగం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ నెల 13 నుంచి 18 వరకు ఆమె విద్యార్థులు మణికంఠ, వినయ కుమార్‌లు యూఎస్‌లోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్ నగరంలో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్‌లో ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించనున్నారు. తన ప్రయోగాల పరంపరను సాక్షితో పంచుకున్నారు లక్ష్మీదేవి. ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటారు! పిల్లల మెదడు కొత్త విషయాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. వాళ్లకు మనం మనసు పెట్టి నేర్పిస్తే వాళ్లు అంతే చురుగ్గా నేర్చుకుంటారు. ప్రయోగాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పాఠాలను ప్రయోగాత్మకంగా వివరించడానికి స్లయిడ్లు, స్టెమ్, లీఫ్, ప్లవర్ల భాగాలు నిలువుకోత, అడ్డకోతల నుంచి శరీర అవయవాల పనితీరును వివరించడానికి వధశాలల నుంచి మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులను సేకరించేదాన్ని. ఒక సైన్స్ ఫేర్‌లో సులువైన పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకాన్ని నిరూపించాం. కానీ మా స్కూల్‌కి గణితం విభాగంలో ఒక అవార్డ్ ప్రకటించడంతో అదే స్కూల్‌కి రెండో అవార్డు ఇవ్వకూడదని చెప్పి అప్రిషియేషన్ ఇచ్చారు. నాచుతో సేద్యం ప్రయోగం రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కోవిడ్ సమయంలో ఎక్కువ ఖాళీ సమయం వచ్చింది. మా ఇంటి ఎదురుగా సంతలో అమ్మే మొక్కలు, నర్సరీల వాళ్లు వాడే పాలిథిన్ కవర్ల మీద దృష్టి పడింది. వాటికి ప్రత్యామ్నాయం కోసం ప్రయోగాలు మొదలుపెట్టాను. వేరుశనగపొట్టు, వేపాకు, కొబ్బరి పీచు, మెంతుల మిశ్రమంతో కుండీ తయారీ విజయవంతమైంది. ఎండకు, వానకు తట్టుకుని నిలవడంలో కష్టమవడంతో కలంకారీలో ఉపయోగించే సహజ రంగులను వేయడంతో సమస్య పరిష్కారమైంది. ఇక అవి మట్టిలో కలిసిపోవడం గురించినదే అసలు ప్రశ్న. నెలరోజుల్లో డీ కంపోజ్ అవుతోంది. ఈ కుండీ మట్టిలో కలిసిన తరవాత మట్టికి పోషణనిస్తోందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమూ అవసరమే. ఎన్పీకే చాలా తక్కువగా ఉన్న మట్టిలో వేసి, కలిసిపోయిన తర్వాత మట్టిని మళ్లీ టెస్ట్‌కి పంపిస్తే ఎన్పీకే గణనీయంగా పెరిగినట్లు రిపోర్ట్ వచ్చింది. అంతే కాదు నీటిని నిలుపుకునే శక్తి పెరిగింది, వేపలోని యాంటీ మైక్రోబియల్ స్వభావం వల్ల తెగుళ్లు నివారణ సాధ్యమైంది. పైటో కెమికల్స్ ఉన్నాయని ల్యాబ్టెస్ట్లో నిర్ధారణ అయింది. నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ పెట్టిన సైన్స్ ఫేర్లలో మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయులు దాటి జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శించాం. మెరిటోరియస్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ‘బెస్ట్ గైడ్ టీచర్’ అవార్డు అందుకున్నాను. ఈ ప్రయోగాన్ని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించడానికి పెడన నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12వ తేదీన అమెరికా విమానం ఎక్కుతారు మా పిల్లలు’’ అని సంతోషంగా చెప్పారు లక్ష్మీదేవి. ఫ్లోరైడ్ జవాబు దొరికింది! నేను గర్వంగా చెప్పుకోదగిన ప్రయోగాల్లో ఫ్లోరైడ్ నీటిని శుద్ధి చేసే కుండ కూడా ముఖ్యమైనదే. మట్టిలో తులసి, మునగ ఆకులు కలిపి చేశాను. ఫ్లోరైడ్ 3.5 పీపీఎమ్ ఉన్న నీటిలో అడవుల్లో దొరికే చిల్లగింజలను వేసి హార్డ్నెస్ తగ్గించిన తరవాత ఆ నీటిని నేను చేసిన కుండలో పోసి ఆరు గంటల తర్వాత టెస్ట్ చేస్తే పీపీఎమ్ 1.5 వచ్చింది. ఈ కుండలో శుద్ధి అయిన నీటి పీహెచ్ సాధారణ స్థాయుల్లో ఉండడమే కాదు నీటిలో ఉండాల్సిన కంపోజిషన్స్ అన్నీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ప్రయోగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ ఎడ్యుకేషన్ నిర్వహించిన స్మార్ట్ ఇండియన్ హాకథాన్‌లో ప్రదర్శించాం. ‘ద ఇనిషి యేటివ్ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టెమ్ (ఐరిస్)’ నిర్వహించిన పోటీలో ప్రదర్శించినప్పుడు నా స్టూడెంట్ ‘సీహెచ్. తరుణ్‌బాబు’కి ‘యంగ్ ఇన్నోవేటర్ అవార్డు’, 45 వేల క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఫిఫ్త్ యాన్యువల్ ఇంటర్నేషనల్ ఇన్నోహెల్త్ ప్రోగ్రామ్ ఢిల్లీ ట్రిపుల్ ఐటీ– ఇన్నో క్యూరియో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఫైనల్స్‌కి వచ్చి ఆరు బెస్ట్ ప్రాజెక్టుల్లో రెండవ స్థానం. – కొల్లాటి లక్ష్మీదేవి, బయలాజికల్ సైన్స్ అసిస్టెంట్, బీజీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెడన, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ ‘స్మార్ట్ సొల్యూషన్ ఫర్ ఎకో పొల్యూషన్’ పేరుతో మేము తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పూల కుండీని డల్లాస్‌లో జరిగే ఐఎస్ఈఎఫ్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో ప్రదర్శిస్తారు. ఆ కార్యక్రమంలో వంద దేశాలు పాల్గొంటాయి, ప్రదర్శనలో 1800 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని బ్రాడ్‌కామ్ అనే మల్టీనేషనల్ కంపెనీ నిర్వహిస్తోంది. – వాకా మంజులారెడ్డి -
మచిలీపట్నం వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), మెడికల్ అసెస్మెంట్ మరియు రేటింగ్ బోర్డు అనుమతులిచ్చింది. ఈ మేరకు గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారికి ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్‌కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు. రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరోవైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు సమకూరనున్నాయి. ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్న సీఎం జగన్‌కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన కరువు
-
చంద్రబాబుకు చుక్కలు చూపించిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్
-
చంద్రబాబును ప్రజలే కాదు పార్టీ క్యాడర్ కూడా వదిలేసింది
-
చంద్రబాబు కాన్వాయ్ ఎదుట జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ప్రదర్శించిన అభిమానులు
-
మచిలీపట్నం చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
-
టిడ్కో ఇళ్ల పరిశీలన అంటూ ప్రకటన.. మచిలీపట్నం టూర్‌కు బాబు వెనుకడుగు
మచిలీపట్నం టౌన్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పర్యటనను ప్రతిపక్ష నేత చంద్రబాబు రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 12న బుధవారం సాయంత్రం మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు. రోడ్ షోలో భాగంగా చింతగుంటపాలెం గో సంఘం వద్ద ఉన్న జీ+3 టిడ్కో గృహాలను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అక్కడ జీ+3 గృహాలు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసింది. స్థానిక టీడీపీ నేతలు ఈ గృహ సముదాయాల పనులను పరిశీలించారు. దీంతో చంద్రబాబును ఇక్కడకు తీసుకువస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అంచనాకు వచ్చారు. నిర్మాణాలు పూర్తవడంతో చంద్రబాబు పరువుపోవడం ఖాయమని భావించిన టీడీపీ నేతలు ఆయన పర్యటనను రద్దు చేయించారు. నాడు: చంద్రబాబు హయాంలో 2019 నాటికి రుద్రవరంలోని జీ+3 గృహాల నిర్మాణ పరిస్థితి ఇది చంద్రబాబు హయాంలో అసంపూర్తిగా గృహాలు నగరంలోని గోసంఘం, రుద్రవరం ప్రాంతాల్లో జీ+3 గృహాల నిర్మాణం పనులకు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శ్రీకారం చుట్టారు. గోసంఘంలో 18 బ్లాక్‌ల్లో 864 గృహాలు నిర్మించాల్సి ఉండగా 14 బ్లాక్‌లను మాత్రమే నిర్మించారు. నాలుగు బ్లాక్‌ల పనులు చేపట్టనేలేదు. ఈ గృహాల్లో ఫ్లోరింగ్, కరెంటు, నీటి సదుపాయం తదితర మౌలిక వసతుల పనులు ప్రారంభించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన నాలుగు బ్లాక్‌లను నిరి్మంచి, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసింది. గృహాల నిర్మాణ పనులకు రూ.53.93 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.13.15 కోట్లు వెచ్చించింది. మరికొద్ది రోజుల్లోనే ఈ గృహాలను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుద్రవరంలో నిర్మించిన జీ+3 గృహాలు, ముమ్మరంగా సాగుతున్న రహదారి పనులు రుద్రవరంలోనూ అంతే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రుద్రవరంలో 30 బ్లాక్‌ల్లో 1,440 గృహాలు నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు బ్లాక్‌ల జీ+2 పనులు మాత్రమే చేశారు. 28 బ్లాక్‌లకు సంబంధించి ఫుట్టింగ్ లెవల్ వరకు మాత్రమే పనులు చేపట్టి అలాగే వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 30 బ్లాకులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతం అన్ని బ్లాక్‌ల్లో జీ+3 గృహాలను నిర్మించింది. మచిలీపట్నంలోని గో సంఘం వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ+3 గృహాలు బ్లాక్‌ల మధ్య రహదారుల నిర్మాణం, వ్యర్థాలకు సంబంధించిన సివిలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గో సంఘం, రుద్రవరంల్లో జీ+3 గృహాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇందుకు మచిలీపట్నంలోని వాటర్ వర్క్స్ వద్ద నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జీ+3 గృహాలకు తాగునీరు సరఫరా కానుంది. రెండు చోట్లా తాగునీటిని నిల్వ చేసే సంపులను కూడా నిర్మించారు. గృహాల వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. చదవండి: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ పంపిణీకి సిద్ధం చేశాం.. గో సంఘం వద్ద జీ+3 గృహాల నిర్మాణ పనులు, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేశాం. రుద్రవరంలో అన్ని బ్లాక్‌ల నిర్మాణం పూర్తయింది. గృహాల్లోని మెట్లు, బాత్రూమ్ల పనులు జరుగుతున్నాయి. అలాగే సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పైప్లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. – ఎం.గణేష్‌బాబు, ఏఈ -
చౌడు నేలలకు సరైన వరి
నీటిలోని క్లోరైడ్స్ భూమిపైకి అధికంగా చేరటం వల్ల పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలు.. ఉప్పుటేరులు.. కొల్లేరు ప్రాంతభూములు.. రొయ్యల చెరువులు.. వాటి సమీప భూముల్లో చౌడు పేరుకుపోతోంది. ఆ భూముల్లో విత్తనాలూ సరిగా మొలకెత్తవు. దీనికి చెక్ పెడుతూ ఎంపీఎం–103 పేరిట మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. చౌడు భూముల్లోనూ సిరులు పండించేందుకు మార్గం సుగమం చేసింది. సాక్షి, అమరావతి: చౌడు నేలలు.. దేశంలో 1.73 కోట్ల ఎకరాల్లో విస్తరిస్తే మన రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతంలో విస్తరిస్తున్న రొయ్యల సాగు, విచక్షణా రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల పచ్చటి పొలాలు చౌడుబారిపోతున్నాయి. ఈ నేలల్లో లవణ సాంద్రత 3 పీహెచ్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ వరి వంగడాలు సాగుచేస్తే తరచూ తెగుళ్ల బారినపడటంతోపాటు కనీస దిగుబడులు కూడా రావు. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం చౌడుతోపాటు చీడలను తట్టుకుంటూ అధిక దిగుబడులనిచ్చే ఎంసీఎం–103 సన్న బియ్యం రకం అభివృద్ధి చేశారు. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వంగడాన్ని రబీలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడి రెండో పంటకు అనువైన ఎంసీఎం–103 వంగడాన్ని బీపీటీ–5204, ఎంటీయూ–4870 రకాలను సంకరపర్చి అభివృద్ధి చేశారు. దీని పంట కాల పరిమితి 140–145 రోజులు. చౌడు తీవ్రతను బట్టి హెక్టార్‌కు 4.5 నుంచి 5.5 టన్నులు.. సాధారణ భూముల్లో హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడులు వస్తాయి. చౌడు తీవ్రత 4 నుంచి 8 డిగ్రీల లవణ సాంద్రత వద్ద సాగు చేసినా సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులకు ఢోకా ఉండదు. దోమపోటు, పొడ, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. గింజ రాలదు. కాండం దృఢంగా ఉండి నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు. నాణ్యత కల్గిన గింజ శాతం 66.70 % . దమ్ము చేసిన తర్వాత ఎకరాకు 36:24:24 నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేసుకుంటే చేను పడి పోకుండా ఉంటుంది. 15, 20 రోజులకొకసారి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను పిచికారీ చేసుకోవాలి. భూమిలో జీలుగ చల్లి కలియ దున్నడం వలన చౌడు తగ్గుతుంది. బీపీటీ కంటే ఐదు బస్తాల అధికం మా భూముల్లో చౌడు తీవ్రతతో మొక్కలు చనిపోవడం వల్ల తిరిగి ఊడ్చాల్సి వచ్చేది. మొక్కలు సరిగా ఎదగక ఎరువులు ఎక్కువగా వాడాల్సి వచ్చేది. గతేడాది బందరు పరిశోధనా కేంద్రం నుంచి ఎంసీఎం–103 విత్తనాన్ని తీసుకొని ఊడ్చా. లవణ సాంద్రత 6 పీహెచ్ వద్ద కూడా మొక్కలు చనిపోలేదు. ఎక్కువ పిలకలు వేసింది. ఒక కోటా మందులు మాత్రమే వేశాను, ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బీపీటీ కంటే 5 బస్తాలు అధికంగా దిగుబడి వచ్చింది. – జి.సురేష్, మోదుమూడి, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా పరిశోధనా కేంద్రంలో విత్తనం రాష్ట్రంలో చౌడు ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఈ రకాన్ని సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ఈ రకం వంగడం కోసం రైతులు మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నేరుగా లేదా ఫోన్ నంబర్ 94901 95904లో సంప్రదించి పొందవచ్చు. – ఎం.గిరిజారాణి, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, మచిలీపట్నం -
మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో పోలీసులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. పోలీసులపై పిడిగుద్దులతో కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. టీడీపీ నేతల దాడిలో ఆర్ఎస్ఐ శంకర్ కిందపడిపోయారు. డీఎస్పీ అడ్డుకున్నా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చెప్పులు చూపిస్తూ పోలీసులపైకి టీడీపీ మహిళా కార్యకర్తలు దూసుకువచ్చారు. చదవండి: నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన బాలకృష్ణ -
మెరిసే.. మెరిసే.. బంగారంలా.. రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్లను దాటి..
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న ధరతో సామాన్యులకి బంగారం అందని ఆభరణమే అయింది. చిన్నపాటి గొలుసు కొనాలన్నా లక్షలు పెట్టాల్సిందే. డిజైన్లు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చిందే ఇమిటేషన్ లేదా రోల్డ్ గోల్డ్ లేదా వన్‌గ్రామ్ గోల్డ్ నగలు. ఏ పేరుతో పిలుచుకున్నా వీటి కేరాఫ్ అడ్రస్ కృష్ణా జిల్లా చిలకలపూడి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గిల్ట్ నగలు తయారు చేయడం చిలకలపూడి కళాకారుల గొప్పతనం. బాగా డిమాండ్ ఉన్న యాంటిక్ నగల్లో కూడా కొత్త డిజైన్లు సృష్టిస్తూ మహిళల మనసులు దోచుకుంటున్నారు. లక్షలు విలువ చేసే బంగారు బ్రైడెల్ సెట్స్‌ను రూ.5,000 నుంచి రూ.25,000కే అందిస్తున్నారు. సినిమాల్లో, సీరియల్స్‌లో నటీనటులు ధరించే ఆభరణాల్లో అత్యధిక శాతం చిలకలపూడిలో తయారైనవే. అంతేకాకుండా అనకాపల్లి నుంచి చికాగో వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు దేవుని అలంకరణకు ఉపయోగించే వజ్ర, వైఢూర్యాలు పొదిగిన కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడివే. ఒక కుటుంబంతో ఆరంభం 114 ఏళ్ల క్రితం ఒక కుటుంబంతో ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు గోల్డ్ పార్క్ ఏర్పాటుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. 1908లో మచిలీపట్నానికి సమీపంలో ఉన్న చిలకలపూడి గ్రామంలో టేకి నరసింహం అనే స్వర్ణకారుడి ఆలోచన నుంచి మొదలయ్యింది ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారం. బంగారం ధరలు భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజల కోసం రాగి మీద బంగారం పూతతో ఆభరణాల తయారీని మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 100 ఉండే బంగారం దిద్దులను కేవలం పావలాకే అందించడంతో ఈ రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. వైఎస్సార్ చొరవతో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు దేశంలో ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోటీని తట్టుకోలేక చిలకలపూడి తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, మచిలీపట్నం ఇమిటేషన్ గోల్డ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పాటు చేశారు. 2007లో 48 ఎకరాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ పార్కు ఏర్పాటైంది. ఇప్పుడు ఈ పార్కులో 236 యూనిట్లలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తోంది. మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉండే 24 గ్రామాలకు చెందిన 27 వేల మందికి పైగా మహిళలు ఇంటి వద్దే ఆభరణాలు తయారు చేస్తూ పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు రూ.200 నుంచి రూ.450 వరకు సంపాదిస్తున్నారు. ప్లేటింగ్, క్యాడ్, కాస్టింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట ఉండటంతో ఈ పార్కులో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తొలుత రూ.10 కోట్లుగా ఉన్న చిలకలపూడి వ్యాపారం రూ.100 కోట్లను అధిగవిుంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అదే బాటలో జగన్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్క్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది. రూ. 8 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, ఈటీపీ ఆధునికీకరణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. నూతన డిజైన్ల రూపకల్పనకు క్యాడ్, కాస్టింగ్ వంటి వాటిలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. -
ఒరేయ్ ఈరిగా.. నా నెమలి నాలుగు పందేలు చేసిందిరా
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. కోడి పందేలరాయుళ్ల హడావుడి ప్రారంభమైంది. ఏ రంగుపై ఏ రంగు వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే కబుర్లు మొదలయ్యాయి. ఒరేయ్ ఈరిగా... పోయిన పండక్కి నా నెమలి నాలుగు పందేలు చేసిందిరా అంటే... నీ నెమలి నాలుగు పందేలే చేసింది... నా కక్కిరి అయితే నీచు తగలకుండా సంపేసిందిరా సూరిగా అంటూ పందెంరాయుళ్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా వచ్చే పండుగను దృష్టిలో పెట్టుకుని పందెంరాయుళ్లు పుంజుల కోసం జల్లెడ పడుతున్నారు. చిన్న చిన్న పందెంగాళ్లు సండే మార్కెట్లోకి వచ్చే పుంజులను బేరసారాలు చేసి కొనుక్కుంటుండగా పెద్ద పందెగాళ్లు కోడి రంగు, వాటం, వాటి చూపును చూసి కొనుగోలు చేస్తున్నారు. కోడికూత వినబడితే చాలు చటుక్కున ఆగి కోళ్ల యజమానితో బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విరజిమ్ముతున్నారు. పుంజు వాటంతో పాటు రంగు రూపు నచ్చితే ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడటంలేదు. పందేనికి సిద్ధం చేసేందుకు రకరకాల మేతలను తయారుచేసి పుంజుల శరీరాన్ని జిమ్ బాడీల్లా సిద్ధం చేసేందుకు పూనుకుంటున్నారు. రంగును బట్టి పందెంకోళ్లకు గిరాకీ ఉండటంతో పెంపకందారులు ఈ సీజనులో కాసులు పోగుజేసుకుంటున్నారు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, కక్కిరి, పింగళా ఇలా రంగులను బట్టి ఒక్కో పందెం కోడి ధర సుమారు రూ.5 వేలు, ఇవే రంగుల్లో జాతికోళ్లు అయితే రూ.15 వేల నుంచి మొదలై లక్షల్లో పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడి మీద పందెంరాయుళ్లకు మోజు పుడితే చాలు ధర ఎంతైనా చెల్లించి పుంజును పట్టుకుపోతున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న పందెంకోళ్లు పండుగ సమీపిస్తుండటంతో పందెంరాయుళ్లు పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుల్లా తయారు చేస్తున్నారు. పందెంరాయుళ్లు పెడుతున్న పుష్టికరమైన తిండి తింటూ పందెం కోళ్లు బరిలోకి దిగేందుకు సై అంటే సై అంటూ సిద్ధమవుతున్నాయి. కత్తి కట్టేందుకు కాలు దువ్వుతున్నాయి. ఇప్పటివరకు తవుడు ముద్దలు, ఒడ్డు, సోళ్లు వంటి వాటిని ఆహారంగా అందించిన పందెంరాయుళ్లు పండుగ దగ్గర పడటంతో పుంజులను మరింత బలంగా పెంచేందుకు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి ఖరీదైన ఆహారాన్ని అందిస్తూ కోళ్లను మేపుతున్నారు. -
మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ రాసలీలలు.. వీడియో బహిర్గతం కావడంతో..
మచిలీపట్నం(కృష్ణా జిల్లా): మైనార్జీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.ఆనంద్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ పీఆర్‌ఈఐ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నర్సింహరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ పాఠశాలలోనే రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలు బహిర్గతం కావటంతో, ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సున్నితమైన అంశమైనందున విషయం తెలిసన వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సంస్థ గుంటూరు సెక్రటరీ, జిల్లా కన్వీనర్ అదేవిధంగా మచిలీపట్నం డెప్యూటీ డీఈవో సుబ్బారావుతో కూడిన త్రీమెన్ కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ పాఠశాలలోని తన చాంబర్లో ఓ మహిళా ఉద్యోగినితో రాసలీలలుసాగిస్తున్నట్లు విషయం వాస్తవమే అని తేలింది. దీంతో దీన్ని తీవ్రంగా పరిగణించి, అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు జిల్లాలోని ముసునూరు బాలుర మైనార్టీ పాఠశాలలో పీజీటీ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న పి.సాంబశివరావును మచిలీపట్నం గురుకుల పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నియమించారు. కాగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు అనుగుణంగా నేడో, రేపో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి నివేదిక మేరకు రాష్ట్ర మైనార్టీ గురుకుల సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనని త్రీమెన్ కమిటీ సభ్యుడు, మచిలీపట్నం డెప్యూటీ డీఈవో యూవీ సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ రిమాండ్‌కు తరలింపు... కోనేరుసెంటర్: మైనారిటీ గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌తో రాసలీలలు సాగిస్తూ దొరికిపోయిన ప్రిన్సిపాల్ ఆనందకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో కామకలాపాలు సాగిస్తూ విద్యార్థులకు సెల్‌ఫోన్ లో అడ్డంగా దొరికిపోయిన ఆనందకుమార్ ఆ వీడియో తీసిన విద్యార్థులను చితకబాదిన విషయం పాఠకులకు విధితమే. ప్రిన్సిపాల్ చేతిలో ఘోరంగా దెబ్బలు తిన్న విద్యార్థి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న షకీలా ప్రిన్సిపాల్ ఆనంద్ కుమార్ తనను ఆయన కార్యాలయంలోకి పిలిచి బలవంతంగా లోబరచుకునేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది. అటు విద్యార్థి ఇటు కంప్యూటర్ ఆపరేటర్ షకీలా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి ఆనంద్ కుమార్‌ను రిమాండ్ కు తరలించినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. చదవండి: ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్ -
మచిలీపట్నం పోర్టుకు రుణం మంజూరు
-
ఏపీ: మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మరో ముందడుగు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. తాజాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 3, 940 కోట్లు మంజూరు అయ్యింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరమయ్యే వంద శాతం రుణం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లయ్యింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి మంజూరు ఉత్తర్వులు పంపింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. -
మచిలీపట్నం సీతానగర్ లో పండుగ రోజు విషాదం
-
దీపావళి రోజు విషాదం.. టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతి
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా జిల్లా): దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం శివారు నవీన్ మిట్టల్ కాలనీలో సీతానగర్‌లో టపాసులు పేలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. టపాసులు ఆరబెడుతుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపై నిప్పులు పడటంతో ట్యాంక్ అంటుకుని వాహనం పేలిపోయింది. దీంతో బాలుడు మంటల్లో చిక్కుకున్నాడు. చదవండి: టపాసులు కాల్చొద్దు అన్నందుకు హత్య టపాసులు, బైక్ పేలిన శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు.. బాలుడిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. దీంతో సీతానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు
మచిలీపట్నం: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోగల శ్రీచైతన్య (భాస్కర్భవన్ క్యాంపస్) జూనియర్ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రవికు మార్ ధ్రువీకరించారు. శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల అభీష్టం మేరకు వారికి నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థిపై కాలేజీ అధ్యాపకుడు పరుష పదజా లంతో విరుచుకుపడటమే కాకుండా చేయిచేసుకో వడం తెలిసిందే. ఆ ఘటనపై చిత్రీకరించిన వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ సైతం దీనిపై జోక్యం చేసుకుని కలెక్టర్‌ను నివేదిక కోరింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఘటనకు పా ల్పడిన అధ్యాపకుడిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదుచేశారు. తాజాగా, కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించడంతోపాటు కాలేజీ గుర్తింపు రద్దు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు కాలేజీకి మూతవేస్తామని, విద్యార్థులకు ఎక్కడా నష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్ఐవో పి.రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు ర్యాంకుల బూచి చూపించి హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
ఒకే యువతిపై ఇద్దరు మనసుపడ్డారు.. పేస్టులో పటాస్ మందు కలిపి..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వివాదం కొన్ని ప్రాణాలను బలి తీసుకునే యత్నానికి దారి తీసింది. అయితే అందుకు ప్రయత్నించిన యువకుడు ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పటంతో అతడు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చూశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాసపు నాగేంద్రకుమార్, వంకా నాగేశ్వరరావు స్నేహితులు, ఇద్దరూ రోల్డుగోల్డు పనులు చేస్తుంటారు. ఒకే కాలనీకి చెందిన వారిరువురూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై మనసు పడ్డారు. చదవండి: (అడ్డు తొలగించుకునేందుకే హత్య.. భార్య అంగీకారంతోనే..) సదరు యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా మెలిగింది. అయితే ఇటీవల నాగేంద్రకుమార్‌తో మాట్లాడటం మొదలు పెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు ఎలాగైనా నాగేంద్రకుమార్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం సుమారు 15 రోజుల క్రితం తెలిసిన రోల్డుగోల్డు దుకాణంలో పటాస్ ముక్కను కొనుగోలు చేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున నాగేంద్రకుమార్ బాత్రూంలో ఉన్న టూత్‌బ్రెష్‌లపై నిందితుడు నాగేశ్వరరావు పటాస్ కలిపిన పేస్టును పెట్టి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అలా నాగేంద్రకుమార్‌ను అంతమొందించేందుకు పూనుకున్న నాగేశ్వరరావు తాను చేసిన ప్రయత్నాన్ని తన సోదరుడి చెవిన వేశాడు. నాగేశ్వరరావు సోదరుడు ఆ బ్రెష్‌లను అక్కడి నుంచి తీసి దూరంగా పడేశాడు. కొన్ని రోజుల తరువాత ఆ నోటా ఈ నోటా విషయం కాస్తా బయటికి పొక్కటంతో విషయం తెలుసుకున్న నాగేంద్రకుమార్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరచగా సొంత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బందరు చేప భలే భలే..
సాక్షి, మచిలీపట్నం: బందరుకు ఆనుకుని బంగాళాఖాతంలో లభ్యమయ్యే చేప నాణ్యతకు.. రుచికి పెట్టింది పేరు. ఇక్కడ లభ్యమయ్యే చేపల్లో ఎలాంటి రసాయన ధాతువులు ఉండవు. అందుకే ఈ చేపలకు మంచి డిమాండ్. ఇక్కడ వందల రకాలు లభ్యమవుతుండగా వాటిలో 20 నుంచి 25 రకాల చేపలకు మాత్రం మంచి గిరాకీ ఉంది. ఈ చేపల కోసం విదేశీయులు కూడా ఎగబడుతున్నారు. అలాగే దేశంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాలకు చెందిన ఏజెంట్లు ఎగరేసుకుపోతుంటారు. రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలతో పోల్చుకుంటే మచిలీపట్నంలో కాలుష్యం చాలా తక్కువ. ఇక్కడ నుంచి గత కొన్నేళ్లుగా సముద్ర ఉత్పత్తులు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. జిల్లాలో ఏకైక ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండిలో ఏర్పాటైంది. ఈ హార్బర్‌కు యూరోపియన్ దేశాల గుర్తింపు కూడా ఉంది. వందల రకాల మచిలీలు.. మచిలీపట్నం తీరంలో ఎక్కువగా తెల్ల చందువా (సిల్వర్ అండ్ వైట్ పాంప్రెట్), నల్ల చందువా (బ్లాక్ పాంప్రెట్), కోణాం, ముక్కు కోణాం (స్వర్డ్ ఫిష్), నెమలి కోణాం (సెయిల్ ఫిష్), వంజరం (సీర్ ఫిష్), నాలుకలు (సోల్), నామాల తూర (స్కిప్ జాక్ టూనా), పసుపురెక్క తూర (ఎల్లో ఫిన్), పెద్దకన్ను తూర (బిగ్ ఐ), కానా కంతలు (మాకేరల్స్), పావడాయి (రిబ్బన్), గొరక (క్రోకర్స్), సొర చేప, కండువ, మూడు చుక్కల పీత (త్రీస్పాట్ స్విమ్మింగ్ క్రాబ్)లతోపాటు టైగర్, వైట్ నారన్, పింక్, పువాలన్ (కలందన్), కరికేడి, శంఖు, డీప్ సీ ఫ్రాన్స్, కుక్కరొయ్యలు, సారగొరక, గులిగింత, జల్లలు, కుక్కసావడాయి, మెత్తా్తళ్లు, తెంగుడు రొయ్యపొట్టు ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో ప్రధానంగా టూనా, కోణాంలతోపాటు వంజరం, చందువా, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అత్యధిక ధర తెల్ల చందువా (కిలో రూ.2 వేల వరకు), కోణం (కిలో రూ.700) పలుకుతున్నాయి. వేటకు వెళ్లిన వారు రోజూ అనేక రకాల చేపలను గిలకలదిండి హార్బర్‌కు తెస్తున్నారు. అక్కడ వ్యాపారులు వేలంపాట ద్వారా చేపలను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు నేరుగా విశాఖ, కాకినాడ, చెన్నై తీసుకెళ్లి అక్కడే విక్రయిస్తున్నారు. సీజన్‌ను బట్టి వీటికి మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మచిలీపట్నంలో చేపల చెరువుల్లో ప్రత్యేకంగా పెంచే చేపల్లో పండుగప్ప, శీలవతి, తుల్లులు, నేమ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. టూనా చేపలకు డిమాండ్ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రసాయన పరిశ్రమలు లేవు. పెద్ద ఓడల రాకపోకలూ తక్కువే. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో దొరికే వాటిలో రసాయన ధాతువులు ఎక్కువగా ఉంటున్నాయని.. మచిలీపట్నంలో నామమాత్రంగా కూడా ఉండడం లేదని యూరోప్, జపాన్ దేశస్తులు గుర్తించడం విశేషం. మచిలీపట్నం తీరంలో దొరికే టూనా చేపల కోసం జపాన్ దేశస్తుల నుంచి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) నుంచి తీసుకునే క్యాచింగ్ సర్టిఫికెట్లో మచిలీపట్నం సీకోస్ట్ అని ఉంటే చాలు ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని చెబుతున్నారు. బందరు చేపల కోసం విశాఖ, కాకినాడ, చెన్నై, కోచి, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, సికింద్రాబాద్ వ్యాపారులు ఇక్కడ కొందరు ఏజెంట్లను కూడా నియమించుకున్నారు. రోజూ మత్స్యకారుల నుంచి కొనుగోలు చేసిన చేపలను ఏజెంట్లు ఆయా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. -
సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు సురక్షితం
సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది. ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం) -
YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు. ‘వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదు. వారసత్వమంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండి’ అని కొడాలి నాని నియోజకవర్గ ప్రజల్ని కోరారు. చదవండి: (‘సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ ఒక్కరే’) -
అభివృద్ధి విపక్షాలకు కనబడటం లేదా?
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి విపక్షాల కంటికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కొడాలి నాని. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కొడాలి నాని.. మ్యానిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్న గొప్ప సీఎం జగన్ అని కొనియాడారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై మండిపడ్డారు నాని. ‘ మహానాడును చంద్రబాబు నవ్వులు పాలు చేశాడు. టీడీపీ నేతలకు చిన్న కర్మకు, పెద్ద కర్మకు తేడా తెలియదు. పనికిరాని దద్దమ్మ చంద్రబాబు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. లోకేష్ గెటప్‌కు సరిగ్గా సరిపోయే పేరు సిద్ధప్ప’ అని విమర్శించారు. -
ప్రాణం తీసిన పబ్జీ!
మచిలీపట్నం క్రైమ్: పబ్జీ గేమ్‌లో ఓడిపోయినందుకు అక్కలు ఆటపట్టించడంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం న్యూహౌసింగ్‌బోర్డుకాలనీకి చెందిన ఊటుకూరి శాంతిరాజ్‌కు భార్య లక్ష్మీనరసమ్మతో మనస్పర్థలు రావడంతో 15 ఏళ్ల కిందట విడిపోయారు. వీరికి హైనీ, జెన్నీఫర్, పృధ్వీరాజ్, ప్రభు (16) పిల్లలు ఉన్నారు. శాంతిరాజ్ 2008లో శ్రీరాధికను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. మొదటి భార్య తన పెద్ద కుమారుడు పృధ్వీరాజ్‌తో కలిసి విజయవాడలో ఉంటుండగా మిగిలిన ముగ్గురు పిల్లలు శాంతిరాజ్‌తో ఉంటున్నారు. శనివారం రాత్రి పెద్ద పిల్లలు ముగ్గురూ ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు. ఆటలో ప్రభు ఓడిపోయాడు, దీంతో అక్కలిద్దరూ ఆట పట్టించారు. దీన్ని అవమానంగా భావించిన ప్రభు పక్క గదిలో పడుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదివారం ఉదయం పొద్దెక్కినా ప్రభు గదిలో నుంచి బయటికి రాకపోవటంతో శాంతిరాజ్ గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తండ్రి శాంతిరాజ్ పోలీసులకు సమాచారం అందించారు. నా బిడ్డది హత్యే.. ప్రభు ఆత్మహత్య విషయం తెలుసుకుని మచిలీపట్నం చేరుకున్న తల్లి లక్ష్మీనరసమ్మ తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ విలపించింది. తనకు అన్యాయం చేసినట్లే తన బిడ్డకు శాంతిరాజ్, శ్రీరాధిక అన్యాయం చేశారంటూ ఆరోపించింది. ఉరి వేసుకున్న ప్రభు మర్మావయవాల నుంచి రక్తస్రావం కావటంతో తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
-
మచిలీపట్నంలో విషాదం.. పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.