సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది.
ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment