krishna district
-
మెట్లపల్లిలో మరోసారి పులి కలకలం
గన్నవరం రూరల్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. గతేడాది డిసెంబర్ 18న ఇదే గ్రామంలో తోటలో పులి ఉచ్చులో చిక్కుకుని మరణించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని చూసినట్లు ఆర్టీసీ కండక్టర్ చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కలటూరుకు చెందిన బొకినాల రవికిరణ్ గన్నవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్. విధుల నిమిత్తం గన్నవరం డిపోకు తెల్లవారుజాము 3 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా సగ్గూరు–మెట్లపల్లి దారిలో పులి పిల్ల ఎదురైంది.దానిని చూసిన రవి కిరణ్ భయాందోళనకు లోనై సమీపంలోని సగ్గూరు వెళ్లి గ్రామస్తులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్లపల్లి, వీరపనేనిగూడెం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ గార్డు కుమారి గ్రామానికి వచ్చారు. పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రయత్నించారు. జొన్న చేను వెంట పులి అడుగులు ఉన్నట్లుగా రైతులు ఆమెకు చూపించారు. ఈ అటవీ ప్రాంతంలో పులులు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు (ఫొటోలు)
-
పొలిటికల్ కారిడార్ : తిరువూరు తమ్ముళ్ల మధ్య చిచ్చు
-
ఆడాళ్లూ.. జాగ్రత్త! ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం తప్పదు
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని కృష్ణాజిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిలో సుమారు 19 మంది మహిళలు బ్లాక్‌మెయిల్‌కు గురైనట్లు గుర్తించారు. వివరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కొండేరు మండలం కొండ్రపల్లి గ్రామానికి చెందిన భీమిని గణేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం హైదరాబాదులోని ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగం చేశాడు. చేస్తున్న ఉద్యోగం మానేసిన గణేష్ సంపాదన కోసం అడ్డదారి ఎంచుకున్నాడు. ఫేస్బుక్లో ఉండే మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫేస్బుక్లో ప్రైవసీ లాక్ చేసుకోని మహిళల అకౌంట్లను ఎంచుకుని వారికి వేరే వ్యక్తుల ఫొటోలు కొత్త కొత్త పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ మహిళలతో పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. కొంతకాలం మంచి ఫ్రెండ్‌గా నటిస్తూ వారి ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి అందులోని వారి ఫొటోలు డౌన్లోడ్ చేయడంతో పాటు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అలా అనేక మంది యువతులు, వివాహితులను తన ట్రాప్‌లో పడేసి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. మోసపోయిన 19 మంది మహిళలు.. గణేష్ చేస్తున్న సైబర్ నేరాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 19 మంది అమాయక మహిళలు మోసపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు గ్రామానికి చెందిన ఓ యువతి ఆన్లైన్ ఉద్యోగం చేసే క్రమంలో భాగంగా ఒక యాప్‌ను ప్రమోట్ చేసేందుకు ఫేస్బుక్ స్టేటస్‌లో షేర్ చేసింది. అదే సమయంలో వికాస్రామ్ అనే దొంగ పేరుతో గణేష్ ఆ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి పెట్టిన ఫేస్బుక్ స్టేటస్‌ను ప్రమోట్ చేస్తానని నమ్మించాడు. మాటలు కలిపి యాప్ డౌన్లోడ్ చేయగానే ఓటీపీ వస్తుందని ఆ నంబరును తనకు ఫార్వర్డ్ చేయాలని చెప్పాడు. యువతి ఫోన్ నంబరు చెప్పగా ఆ నంబరు కలవడం లేదని ఇంట్లో వాళ్ల నంబర్లు ఏవైనా ఉంటే చెప్పాలని అడిగాడు. నమ్మిన యువతి కుటుంబసభ్యుల నంబర్లు అతనికి మెసేజ్ చేసింది. నంబర్లు తీసుకున్న వెంటనే గణేష్ ఆమె ప్రొఫైల్ ఫొటోపై బాధితురాలి ఫోన్ నంబరుతో పాటు ఇంట్లోవాళ్ల నంబర్లు పెట్టి సెక్స్ గాళ్‌గా అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. కాదు అంటే నూడ్‌గా వీడియో కాల్ చేయాలని డిమాండ్ చేశాడు. తప్పని పరిస్థితుల్లో సదరు యువతి అతనికి వీడియో కాల్ చేసింది. గణేష్ ఆమె వీడియో కాల్‌ను స్క్రీన్ రికార్డు ద్వారా వీడియో రికార్డు చేసి మరింత బ్లాక్ మెయిల్ చేయసాగాడు. యువతి ఫిర్యాదుతో విచారణ.. గణేష్ చేతిలో మోసపోయిన యువతి జరిగిన విషయాన్ని స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఎస్పీ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్పీ ఆదేశాలతో గాలింపు చేపట్టిన పోలీసులు బాధితురాలి చేత అతనికి ఫోన్ చేయించారు. అడిగినంత డబ్బు ఇస్తానంటూ నమ్మించి గూడూరుకు పిలిపించారు. అప్పటికే అక్కడ కాపు కాసిన దిశ సీఐ నరేష్కుమార్, గూడూరు ఎస్ఐ ఇతర సిబ్బంది యువతి వద్దకు వస్తున్న గణేష్‌ను వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఎస్పీ మాట్లాడుతూ యువతులు, మహిళలు తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లపై స్పందించవద్దని సూచించారు.ఫేస్బుక్ అకౌంట్ లాక్ మరిచారో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరగాడిని పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనబరచిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీ ఎన్.వెంకట రామాంజనేయులు, దిశ సీఐ నరేష్కుమార్, ఎస్ఐ మస్తాన్‌ఖాన్, ఐటీ కోర్ ఎస్ఐ దీపిక, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ చదవండి: ప్రేమ పేరుతో వివాహితను వంచించిన ఏఆర్ ఎస్ఐ -
సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు సురక్షితం
సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది. ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం) -
కేశినేని కుటుంబంలో కుంపటి!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగినట్లు టీడీపీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. చంద్రబాబునాయుడు, లోకేష్‌లు నాని ప్లేస్‌లో తన సోదరుడైన కేశినేని శివనాథ్ (చిన్ని)ని చేరదీసినట్లు తెలుస్తోంది. అన్నదానం పేరిట.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరిట విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం నగరంలోని ఆటోనగర్ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కేశినేని డెవలపర్స్ పేరిట నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెలిసిన హోర్డింగులు, పోస్టర్లలో టీడీపీ వ్యవస్థాపకుడైన∙ఎన్టీ రామారావు, ఆపార్టీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులైన చంద్రబాబునాయుడు, లోకేష్‌లతో పాటు కేశినేని చిన్ని ఫొటోలు మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారాయి. పొమ్మనకుండా పొగపెడుతున్నారా? విజయవాడ ఎంపీ కేశినేనికి రాజకీయంగా చెక్ పెట్టడానికి అధిష్టానం పావులు కదుపుతోందా అనే అనుమానాలు నాని అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. తన ఎన్నికలప్పుడు, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నానికి, నగరంలోని సీనియర్ నాయకుల మధ్య జరిగిన బహిరంగ మాటల యుద్ధం తెలిసిందే. కొన్ని నెలల కిందట చంద్రబాబు, ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడి అవసరాలకు నానీని దగ్గరకు తీసుకున్నట్లు, సన్నిహితంగా ఉన్నట్లు అధినేత కనిపించారు. ఆ తర్వాత జిల్లా పార్టీలో చోటుచేసుకున్న పలు పరిణామాల సమయంలో కేశినేనితో చంద్రబాబు అంటీముట్టనట్లు ఉంటున్నారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా, తంగిరాల సౌమ్య, పట్టాభి తదితరులకు ఎంపీతో పొసగకపోవడం, వారికి అధిష్టానం పరోక్ష మద్దతిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నానికి పొమ్మనకుండా పొగపెడుతున్నట్లు ఉందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నితో నానికి చెక్! నాని, చిన్నిలు అన్నదమ్ములే అయినప్పటికీ ఎవరి వ్యాపార వ్యవహారాలు వారివే. 2014 ఎన్నికల సమయంలో నానీకి చేదోడు వాదోడుగా ఉన్నట్లు కనిపించిన చిన్ని 2019 ఎన్నికలప్పుడు కనిపించలేదు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మాత్రం ఓ పర్యాయం ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలిసిన చంద్రబాబు, లోకేష్‌లు రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడిన చిన్నితో గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో మంతనాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. చిన్ని రానున్న ఎన్నికల బరిలో దిగనున్నారనే ఫీలర్లు బాబు, లోకేష్‌లే పంపుతూ నానీకి చెక్ పెడుతున్నారని అంటున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తామని మండల విద్యాశాఖాధికారుల సంఘం ప్రకటించింది. శుక్రవారం విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం మీడియాతో మాట్లాడారు. మండల విద్యాశాఖాధికారులకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్, ఎంఈవో కార్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటినీ ఏకకాలంలో పరిష్కరించి.. 30 ఏళ్ల తమ కలను సాకారం చేసిన సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌ను తమ సంఘం బలపరుస్తోందని వెంకటరత్నం చెప్పారు. సమావేశంలో మండల విద్యాశాఖాధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్‌బాబు, సంయుక్త కార్యదర్శి కోటంపల్లి బాబ్జీ, బత్తుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తరగని ప్రేమకు.. ఇది చిరునామా!
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): భార్యపై తనకున్న అపార ప్రేమను ఓ భర్త వినూత్నంగా చాటుకున్నాడు. 40 ఏళ్ల వైవాహిక జీవితంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన భార్య భౌతికంగా దూరమైపోయినా.. ఆమె ప్రతిమతో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నాడు. విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు భార్య కాశీ అన్నపూర్ణ గతేడాది అనారోగ్యంతో మరణించారు. దీంతో కుంగిపోయిన కుటుంబరావు.. ఆమెనే తలుచుకుంటూ జీవించేవారు. ఆమె ఎల్లప్పుడూ తనతోనే ఉండాలనే కోరికతో ఏకంగా భార్య ప్రతిమను తయారు చేయించి.. ఇంట్లో పెట్టుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో కాశీ అన్నపూర్ణ ప్రతిమతో కలిసి కుటుంబరావు కేక్ కట్‌చేశారు. -
అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు కాలువలో నిర్జీవంగా...
తోట్లవల్లూరు (పామర్రు): మండలంలోని యాకమూరులో అదృశ్యమై బాలుడి మృతదేహం పుల్లేటి కాలువలో లభ్యమైంది. గ్రామంలోని పుల్లేటికాలువ కట్టపై నివశించే శింగవరపు వెంకటరమణ, మంగ దంపతుల కుమారుడు మోహిత్‌సాయి (4) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు స్థానిక పుల్లేటి కాలువలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం మోహిత్‌సాయి మృతదేహం కాలువలో లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోహిత్‌సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్‌సాయి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
భవానీ దీక్షల విరమణ..ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ప్రారంభమైంది. దాంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణ ఉత్సవం 29వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భవానీ మాలధారులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే భవానీల రాక ప్రారంభమైంది. దీక్ష విరమణ నేపథ్యంలో దేవదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థాన ఘాట్ రోడ్డు, రాజగోపురానికి రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల తర్వాతే దర్శనం శనివారం తెల్లవారుజామున దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. హోమగుండాల్లో ఉదయం 8.23 గంటలకు అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ, అర్చకులు పాల్గొన్నారు. అగ్నిప్రతిష్టాపన అనంతరం ఇరుముడుల సమర్పణ ప్రారంభమైంది. నగరానికి భవానీలు శనివారం దీక్ష విరమణ ఉత్సవం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే భవానీలు విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఉదయం తమిళనాడుకు చెందిన భవానీలు, పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా దీక్ష విరమణకు ముందు రోజు తమిళనాడు నుంచి పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తుంటారు. గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు నగరానికి శుక్రవారం చేరుకున్న భవానీలు దుర్గాఘాట్, కనకదుర్గనగర్‌లో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరి ప్రదక్షణ ప్రారంభించారు. గిరి ప్రదక్షణ మార్గాల్లో భవానీలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భవానీలు గిరి ప్రదక్షణ చేసే కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు గిరి ప్రదక్షణ పూర్తి చేసిన భవానీలు వినాయకుడి గుడి వద్దకు చేరుకుని క్యూలైన్ ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లోకి చేరిన భవానీలు, భక్తులు అమ్మవారి దర్శనం అనంతరమే బయటకు చేరుకుంటారు. కొండపై మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గంతో పాటు మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇరుముడులను సమర్పించాల్సి ఉంటుంది. ఇరుముడులను సమర్పించిన అనంతరం నేతి కొబ్బరికాయలను హోమగుండాలలో సమర్పించి, అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో ఏర్పాట్లు భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీ దీక్ష విరమణ సందర్భంగా గట్టు వెనుక ప్రాంతంలోని భవానీ, పున్నమి ఘాట్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీల వాహనాలను (బస్సులు, కార్లు, టెంపోలు) పార్కింగ్ చేసుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ పక్కనగల ఖాళీ ప్రదేశాన్ని నిర్ణయించారు. అక్కడే తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఏర్పాటు చేశారు. అనంతరం స్నానాలు చేసేందుకు రెండు ఘాట్లల్లో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, మరుగుదొడ్లను సిద్ధం చేశారు. భవానీలు తలనీలాలను సమర్పించిన అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పున్నమి హోటల్ వద్ద నుంచి బస్సులను ఏర్పాటు చేసింది. మాస్కు తప్పనిసరి దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు శుక్రవారం మీడి యాతో మాట్లాడారు. భవానీలు, భక్తులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించి, కోవిడ్ నిబంధలను పాటించాలన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో ఇరుముడులను సమర్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు, భవానీలకు దద్దోజనం, పులిహోర ప్యాకెట్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ దీక్ష విరమణలకు ఐదు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనావేశామన్నారు. రోజుకు ఆరు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాన్నారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో భవానీలకు జల్లు స్నానా లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, ఈఈ భాస్కర్, పాలక మండలి సభ్యులు కటకం శ్రీదేవి, గంటా ప్రసాద్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీవీ మీద పడి చిన్నారి మృతి.. బర్త్‌డేకు తెచ్చిన గౌను వేసి..
సాక్షి, కృష్ణా(నందిగామ): మరో వారంలో మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారిని ఇంట్లోని టీవీయే యమపాశమై కబళించింది. మండల పరిధిలోని కంచల గ్రామంలో శనివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. వీరిలో చిన్న కుమార్తె చలమల కీర్తి (11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ను తాకడంతో టీవీ చిన్నారిపై పడింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో బయట ఇంటి పనులు చేసుకుంటున్న తల్లి సౌందర్య లోపలికి వచ్చి బంధువుల సాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే చిన్నారి తుది శ్వాస విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కీర్తి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పుట్టిన రోజు వేడుక కోసమని ఆన్లైన్లో కొనుగోలు చేసిన గౌనునే.. ఆ చిన్నారికి ధరింపజేసి అంతిమ సంస్కారాన్ని నిర్వహించడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: బెజవాడలో గోల్డ్ మాఫియా! -
అమ్మా..! నాకూ, తమ్ముడికి ఈత రాదు
సాక్షి,తాడేపల్లిరూరల్: అమ్మా! నాకూ తమ్ముడికి, నీకు ఈతరాదు.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోదాం పద.. నాన్న, తాతయ్య దగ్గర మనం ఉండవద్దు అంటూ కన్న కూతురు వేడుకున్నా.. ఆ తల్లి హృదయం కరగలేదు. మామ పెట్టిన బాధలు గుర్తుకు వచ్చి గుండెను దిటవు చేసుకున్న ఆ అమ్మ బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్ద కృష్ణానదికి పడవలు వెళ్లే దారిలో కూతురు, కొడుకుతో కలిసి కాలువలోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. అసలేం జరిగిందంటే.. విజయవాడకు వన్‌టౌన్‌కు చెందిన పవన్ కుమార్‌కు ఖమ్మం జిల్లా రాంపురానికి చెందిన శాంతిప్రియకు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు. భర్తకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకుంటోంది. మామ రామకృష్ణ వేధిస్తుండడంతో శాంతిప్రియ భర్తకు చెప్పింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక తన పెద్దకుమార్తె స్పందన, కొడుకు తలామ్ రాజును తీసుకుని బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు గమనించాడు. అడ్డు కునే లోపలే ఆమె తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తనూ దూకింది. అక్కడే చేపలు పడుతున్న నాగరాజు, యేసు, యాకోబు, క్రిస్టియన్ బాబు కాలువలోకి దూకి ముగ్గురినీ కాపాడి బయటకు తీసుకు వచ్చారు. శాంతి ప్రియ తనను ఎందుకు బతికించారు అంటూ భోరున విలపించింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రామకృష్ణ ‘నీ మొగుడ్ని, రెండో కూతురిని కూడా తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటే మాకు పట్టిన పీడ వదిలేదని’ అనడంతో పోలీసులు తమదైన శైలిలో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శాంతిప్రియ తల్లిదండ్రులను పిలిపించి, పిల్లల్ని, ఆమెను ఇంటికి పంపారు. భర్తకు కిడ్నీ దానం చేసిన శాంతిప్రియ భర్తకు మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలూ చెడిపోవడంతో భర్త తండ్రిగానీ, తమ్ముడు కానీ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. శాంతిప్రియ తన కిడ్నీని దానం చేసింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా ఇంట్లో పనిమొత్తం ఆమె చూసుకుంటోంది. మామ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె ఎన్నిసార్లు భర్తకు చెప్పినా ఫలితం లేకపోయింది. భర్త కూడా తననే మందలించడంతో తన అమ్మానాన్నలకు చెప్పింది. వారూ సర్దుకుపోవాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రెండో కుమార్తెను భర్త బయటకు తీసుకెళ్లడంతో ఆ సమయంలో మిగిలిన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది. -
నేడు కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్
గాందీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. మొదటి విడత డోస్ తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్ డోస్ కోవిడ్ టీకా వేస్తామన్నారు. అర్హులైన వారందరు తమ సంబంధింత వలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్‌ను సంప్రదించాలని కోరారు. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్.. ఉపాధ్యాయులందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునేలా సోమవారం జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ‘మెగా వ్యాక్సినేషన్ మేళా’ నిర్వహిస్తున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 16న పాఠశాలలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో గల అన్ని యాజమాన్యాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ నెల 27 నాటికి నూరుశాతం వ్యాక్సినేషన్ కావాలని సూచించారు. విజయవాడలో 22,000 డోస్‌లు.. నగర పరిధిలో గల అన్ని శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు కమిషనర్ వెంకటేష్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 22,000 కోవిషీల్డ్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. టీకా కోసం వచ్చేవారందరూ మాస్క్ వినియోగం, భౌతిక దూరం పాటించాలని కోరారు. -
‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే ఆస్పత్రులను అధికారులు ఫినిష్ చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఆస్పత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
కృష్ణా జిల్లా: కరోనా రోగి ఆత్మహత్య
-
ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ
సాక్షి, మేడ్చల్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయలు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు. వివరాల ప్రకారం.. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఓ కేసు విషయంలో నిందితుడి నుంచి 50వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. మొత్తానికి ఇద్దరి మధ్యా 30 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ డబ్బును ఎస్సైకి ఇస్తుండగా ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఏసీబీ అధికానులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైతో పాటు ఈ ఘటనలో కానిస్టేబుల్ హస్తం కూడా ఉండటంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. -
ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘెర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రబావి వద్ద వేగంగా వచ్చిన లారీ ఇన్నోవాను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్ణాటక మధుగిరి ఆసుపత్రికి తరలించారు. కాగా బెంగళూరు నుంచి పావగడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. కృష్ణా : జిల్లాలోని నందిగామ మండలం మునగచర్ల గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ఎస్వీకేడీటీ ట్రావెల్స్ బస్సు మునగచర్ల సమీపంలోకి రాగానే వేగంగా వస్తున్న లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ, బస్సు రెండు బోల్తా పడ్డాయి. కాగా ప్రమాదంలో బస్పులో ఉన్న 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కపోయిన డ్రైవర్, క్లీనర్లను స్థానికులు సురక్షితంగా బయటికి తీశారు. చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏర్పేడు వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలు కాగా.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ తప్ప ఎవరు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. -
కనకదుర్గ అమ్మవారి దర్శన వేళల్లో మార్పులు
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే రేపటి నుంచి(శుక్రవారం) భక్తులకు అమ్మవారి దర్శనం సమయం ఉదయం 06.గంటల నుంచి రాత్రి 08.గంటల వరకు లయ అధికారులు పెంచారు. (వైఎస్ జగన్ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి) కరోనా ప్రారంభం నుంచి దుర్గగుడిలో భక్తులు అమ్మవారి సేవల్లో ప్రత్యక్షం పాల్గొనే అవకాశం నిపిలివేశారు. రేపటి నుంచి భక్తులు ప్రతిరోజు సాయంత్రం 06.గంలకు జరుగనున్న అమ్మవారి పంచహారతులు సేవలో పరిమిత సంఖ్యలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అమ్మవారి సేవల టిక్కెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org , మొబైల్ ఆప్ kanakadurgamma, అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా భక్తులు అమ్మవారి సేవ టికెట్స్ పొందవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. (20 శాతం మందికి వైరస్ వచ్చి పోయింది) -
కరోనానా.. మామూలు జ్వరమా..?
గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.. అసలే ఇటీవలికాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయలకు, సరుకుల కోసం నగరంలో తిరిగి ఉండడంతో తనకు కరోనా ఏమన్నా సోకిందా అన్న మీమాంసలో పడిపోయాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ఎందుకయినా మంచిదని, ఇంట్లోనుంచి బయటకు రాకుండా మందులు వాడుతూ ఉండిపోయాడు. అతని ఆందోళనను గమనించిన స్నేహితుడు ఒకసారి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోమని ఫోన్లో సలహా ఇచ్చాడు. వెంటనే పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు.. నెగెటివ్ అని తేలడంతో ఆందోళనతో పాటు జ్వరం కూడా తగ్గిపోయింది. విజయవాడకు చెందిన ఒక మహిళ తనకు గతకొన్ని రోజులుగా విపరీతమైన జ్వరం వస్తున్నా.. ఇరుగుపొరుగు వారికి భయపడి పరీక్షలు చేయించుకోలేదు. తెలిసిన మందులు వాడుతోంది. పక్కింటివారు ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చినా, నాకు మామూలు జ్వరమే అంటూ, వచ్చిన వారిని, పక్కింటివారిని గదమాయించింది. రెండు రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో భర్త ఒక అంబులెన్స్‌లో కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి, ఐసీయూలో ఉంచి, ఆక్సిజన్ పెట్టారు. పదిరోజులు అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఆమె మామూలు స్థితికి రాలేదు. ఆమె భర్త, పిల్లలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. సాక్షి, గుంటూరు: ప్రపంప వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాల ప్రజలు అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మార్చి నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏది కరోనా? ఏది సీజనల్ ? అనే విషయాన్ని తెలుసుకోలేక కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో వస్తున్న కరోనా సమాచారం చదివి ముందస్తుగానే మాత్రలు తీసుకుంటూ... వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటున్నామని తమకు ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణితో ఉండి సకాలంలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసులు, సీజనల్ వ్యాధుల కేసులు రెండు కూడా నేడు నమోదు అవుతున్నా దష్ట్యా ప్రజలు వ్యాధులపై అవగాహన కల్గి ఉండి అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల కాలంతో తికమక... కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్న సమయంలోనే మరోపక్క వర్షాకాలం కూడా ప్రారంభం అవ్వటంతో అక్కడక్కడ సీజనల్ వ్యాధులు సైతం వస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 27 మలేరియా కేసులు, 57 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మరో నాలుగు నెలలపాటు సీజనల్ వ్యాధుల కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. జ్వరం వచ్చినా, దగ్గినా, తుమ్మినా, జలుబు వచ్చినా కరోనా జ్వరమా లేక సీజనల్ జ్వరమా అనే అనుమానం ప్రజల్లో విస్తృతంగా తలెత్తుతోంది. ఏది కరోనా, ఏది సీజనల్ అనే విషయం తెలియక త్రీవంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి దగ్గు వచ్చినా గుండెల్లో దడ పుడుతుంది. జ్వరం వస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఒంటి నొప్పులు, తలనొప్పి వస్తే భయం వెంటాడుతుంది. తీవ్ర జ్వరమైతే పరీక్ష తప్పనిసరి.. వానాకాలం కొనసాగుతూ ఉంది కాబట్టి దోమల బెడద కూడా ఉంటుంది. వర్షాలతోపాటే సీజనల్ వ్యాధులైన వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు సహజంగానే వస్తాయి. కరోనా తీవ్రంగా విజృంభిస్తూ ఉండటంతోపాటుగా సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉండటం రెండింటిలోనూ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటంతో జనం గజగజ వణికి పోతున్నారు. ఈ రెండింటిని వేరు చూసి చూడటం అంత సులువు కాదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. అలాగని చిన్నపాటి జ్వరం, దగ్గును కరోనాగా భావించి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కంచర్ల సుధాకర్ తెలిపారు. కొన్ని లక్షణాలతో కరోనానా? సీజనల్ వ్యాధా? అనే విషయం తెలుసుకోవచ్చని వెల్లడించారు. లక్షణాలు ఏవైనా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిస్తే కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు పరీక్షలు చేయించకోవాలి. ఇళ్లలోనే ఉండే వాళ్లు తమకు ఉన్న లక్షణాలను క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. సీజనల్ లేదా సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతుంది. అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, క్యాన్సర్, హెచ్ఐవీ, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు... వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాలి. చాలా మంది అవగాహన లేక ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇళ్ల వద్దకు ఆశా వర్కర్లు, వలంటీర్లు వచ్చి అడిగినప్పుడు ఏ లక్షణాలు లేవని చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఇంట్లో ఉండి ఊపిరి ఆడని పరిస్థితిలో ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటికే ఆక్సిజన్ తగ్గిపోవటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు కరోనాపై అవగాహన పెంచుకోవాలి. కరోనా ప్రారంభంలో జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియకపోవటం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఉంటాయి. నాలుగు, ఐదో రోజు నుంచి దగ్గు ఎక్కువై ఆయాసం వస్తే వెంటనే ఆస్పత్రికి రావాలి. – డాక్టర్ కంచర్ల సుధాకర్, గుంటూరు, ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నాడు దానం చేసి.. నేడు క్షణమొక యుగంలా
సాక్షి, కంకిపాడు (పెనమలూరు): ఉన్న రెండు కిడ్నీలు పాడై క్షణం ఒక యుగంలా కాలం వెళ్లదీస్తోంది ఓ సోదరి. తన తోబుట్టువుకు చిన్న వయస్సులోనే వచ్చిన కష్టం చూసి తల్లడిల్లిపోతూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆమె సోదరి. చిన్నతనంలోనే తల్లిని, ఊహ తెలిశాక తండ్రిని కోల్పోయారు వారిరువురూ. తండ్రి మరణంతో అవయవాలను దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాడు ఔదార్యం చాటిన చిట్టి మనస్సులు నేడు సాయం కోసం చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నాయి. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కొప్పనాతి పార్వతి, లక్ష్మీ తిరుపతమ్మ సోదరీమణులు ఎదుర్కొంటున్న కష్టం వారి మాటల్లోనే.... కొప్పనాతి నాగరాజు, వీరకుమారి మా అమ్మానాన్న. మాకు ఉహ కూడా తెలీదు. చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నాన్న కూలీ చేసి మమ్మల్ని పోషించాడు. 2013 లో కృష్ణా కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న ఊక లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మా నాన్న నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్చారు. పది మందిలో బతికుంటాడని! గాయాలు తీవ్రంగా అవ్వటంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌కేసుగా తేల్చారు. లాభం లేదని చెప్పారు. ఆ సమయంలో వైద్యు లు అవయవ దానం గురించి చెప్పారు. అవయవాలను దానం చేయటం ద్వారా మా నాన్న పది మందిలో బతికి ఉంటారని భావించాం. ఎలాంటి లాభం ఆశించకుండా కళ్లు, గుండె, కిడ్నీలు, పనికి వచ్చే ప్రతి అవయవాన్ని తీసుకున్నారు. మనస్సులో బాధ ఉన్నా సంతోషంగా అవయవాలు దానమివ్వటం జరిగింది. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం) రెండేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ! నాన్న చనిపోయాక మద్దూరులో అమ్మమ్మ దగ్గర పెరిగాం. హాస్టల్లో ఉండి పదోతరగతి వరకూ చదువుకున్నాం. రెండేళ్ల కిందట అక్క పార్వతికి వివాహం జరిగింది. ఆమె కు అయిన ఆర్నెల్లకు నాకు వివాహం జరిగింది. అయితే కిడ్నీ సమస్య ఏర్పడటంతో అక్కకు ఆమె భర్త దూరంగా ఉంటున్నారు. అమ్మమ్మ దగ్గరే ఉంచి అక్కను ఆసుపత్రుల చుట్టూ తిప్పాం. కిడ్నీలు రెండూ పాడయ్యాయని, జీవన్ పథకం కింద కిడ్నీ మారి్పడికి రూ.30 లక్షలు వరకూ ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కిందకు వైద్యం రాదని వైద్యులు చెప్పారు. రూ 30 లక్షలు అంటే మా శక్తికి మించింది. ఎలాంటి ఆధారం లేదు. పింఛనుగా వచ్చే రూ.10 వేలుతో అవసరమైన ఖర్చులు పెట్టి డయాలసిస్ చేయించుకుంటూ అక్క పార్వతి ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నా. అక్క ప్రాణాలు కాపాడుకోవాలి’ అంటోంది చెల్లెలు లక్ష్మీ తిరుపతమ్మ. సాయం అందించండి నా ఆరోగ్యం పాడై చాలా ఇబ్బంది పడుతున్నా. డయాలసిస్‌కు, ఇతర ఖర్చులకు పింఛనుతో పాటుగా చెల్లి ఎంతో ఆదుకుంటోంది. కానీ వైద్యం చేయించుకోవాలంటే రూ.30 లక్షలు కావాలంటున్నారు. మాకు వెన్నుదన్నుగా ఎవరూ లేరు. నా కాళ్ల మీద మళ్లీ నేను బతకాలనుంది. అలా జరగాలంటే కిడ్నీ మార్పిడి జరగాలి. సాయం అందించాలని వేడుకుంటున్నా. –కొప్పనాతి పార్వతి -
కనక దుర్గమ్మకి బంగారు బోనం
సాక్షి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మకి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఆదివారం తెలంగాణ నుంచి వచ్చిన బోనాలకు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ సురేష్ బాబు స్వాగతం పలికారు. జమ్మిదొడ్డి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి సన్నిధికి తెలంగాణ మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కాలినడకన చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. (కరువు సీమలో సిరులు) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఏడాది దుర్గమ్మకు బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. కరొనా కారణంగా అమ్మవారికి ఆడంబరంగా కాకుండా కేవలం పరిమితంగానే బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అదే విదంగా ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తలిపారు. సాయంత్రం 7 గంటల వరకు శాకాంబరిదేవీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను అనుసరించి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. కరోనా నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. -
కరోనా: నిప్పు రాజేసిన పేకాట, హౌసీ
సాక్షి, అమరావతి: విజయవాడలోని కృష్ణలంక.. అక్కడి వీధులన్నీ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వెడల్పున్నవే. ఆ వీధుల్లోనే ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ కూడా. పైగా జనసాంద్రత ఎక్కువే. ఇరుకిరుకు వీధుల్లోనే అవసరం లేకపోయినా రాకపోకలు. ఇక అక్కడ భౌతిక దూరం కేవలం మాటలకే పరిమితం కాగా.. అదే ప్రాంతంలోని జనం గుంపులు, గుంపులుగా చేరి‘పేకాట’, ‘హౌసీ’ వంటి సరదా ఆటలు.. ఫలితం జిల్లాలోనే అతి ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన హాట్‌స్పాట్‌గా కృష్ణలంక నిలిచింది. ఓ లారీ డ్రైవర్ నుంచి.. ఇటీవల కోల్‌కతా నుంచి కృష్ణలంకలో గుర్రాల రాఘవయ్య వీధిలోని తన ఇంటికి చేరుకున్న ఓ లారీ డ్రైవర్ వచ్చి రావడంతోనే.. ఆయా ఆటల్లో చురుకుగా పాల్గొనడం వల్లే అతడి ద్వారా వైరస్ విస్తరణ జరిగిందని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. అలా ఒకరి నుంచి మరొకరి ఆ వైరస్ సోకి.. ఇప్పుడు నగరంలోనే కృష్ణలంక హాట్‌స్పాట్‌గా మారింది. మొత్తం 95 మంది వరకు ఒక్క ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటికీ కరోనా బాధితుల సంఖ్య అక్కడ పెరుగుతూనే ఉండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. కృష్ణ.. కృష్ణా.. 3.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణలంక విస్తరించి ఉంది. ఇంత తక్కువ విస్తీర్ణం గల స్థలంలో ఎక్కువ ఇళ్లు ఉండటం.. 80వేల జనాభా ఉండటం కారణంగా వైరస్ నియంత్రణ సాధ్యం కావడం లేదు. కృష్ణలంకతోపాటు బృందావన కాలనీ, బ్యాంక్ కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, ప్రగతినగర్, రాణిగారితోట, రణదీర్‌నగర్, గుమ్మడివారి వీధి, బాల భాస్కర్ నగర్, చండ్రరాజేశ్వర నగర్, ఫక్కీరుగూడెం, ఇజ్రాయేల్ పేట, గుర్రాల రాఘవయ్య వీధి తదితర ప్రాంతాలన్నీ పక్కపక్కనే ఉన్నాయి. నగరంలో ఇలాంటి ఇరుకిరుకు ప్రాంతాలు సుమారు 20కిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
కృష్ణా జిల్లావ్యాప్తంగా 28 కంటైన్మెంట్ జోన్లు
-
కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు
-
ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, కృష్ణా జిల్లా : ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లమని, కానీ వాణిజ్య కారణాల వల్ల రైతులు ఎరువుల ఉపయోగం వైపు మళ్లారని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతులు, స్వయం సహాయక బృంద మహిళలతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రసాయనాల వల్ల భూసారం తగ్గిపోయి కొన్నాళ్లకు భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. పంట మొత్తం విషపూరితమవుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి పద్దతులు సమాజానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోమని కోరతానని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. జిల్లాలో రోజురోజుకీ ప్రకృతి వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆవులు కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్ధిక సహాయం అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో 18 వేల మంది ప్రకృతి రైతులున్నారని, ఇటీవల ఢిల్లీలో ఈ విభాగంలో పురస్కారం కూడా అందుకున్నామని తెలిపారు. గవర్నర్ స్వయంగా ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక సమస్యకు కాల్ సెంటర్ : కలెక్టర్
సాక్షి, విజయవాడ : ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే విధానం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆదివారం వ్యాఖ్యానించారు. దీనికి పరిష్కారంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని 0866 2474801, 803, 804 నంర్లకు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఏపీఎండీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక విక్రయిస్తుండగా ప్రస్తుతం 18200 టన్నుల ఇసుక నిల్వ ఉందని కలెక్టర్ వెల్లడించారు. మొత్తంగా ఐదు రీచ్‌లు ఇప్పుడు నిర్వహణలో ఉన్నాయని, 38 మంది పట్టా ల్యాండ్ ఓనర్లు తవ్వకాలకు తమ సుముఖత వ్యక్తం చేశారని తెలపారు. మరోవైపు శనివారం జిల్లాలోని అన్ని రెవెన్యూ కేంద్రాలలో రైతు భరోసా కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఇదిలా ఉండగా, సోమవారం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినం సందర్భంగా ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఉర్దూలో పాండిత్యం ఉన్న నలుగురికి జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. అబుల్ కలాం ఆజాద్ పేరున జాతీయ పురస్కారం, అబ్దుల్ కలాం పేరుతో విద్యా పురస్కారం అందజేస్తామని వివరించారు. మంత్రులు, ఉన్నతాధాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ప్రకటించారు. -
మంటలు చెలరేగి,ఇళ్లు దగ్ధం
-
గ్రామ సచివాలయానికి పసుపు రంగేసిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, కృష్ణా జిల్లా : గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి పసుపు రంగేసిన ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు అక్రమంగా సచివాలయంలోకి చొరబడి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని పెట్టారు. ఇలా బరితెగించి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఈ మేరకు పంచాయితీ సెక్రటరీ విజయ వర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్‌కు తరలించినట్టు గంపలగూడెం ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఏపీలో 7వ ఆర్థిక గణాంక సర్వే ప్రారంభం
సాక్షి, కృష్ణా : ఏపీలో నేటి నుంచి 7వ ఆర్థిక గణాంక శాఖ సర్వే అధికారికంగా ప్రారంభమైందని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. నేటి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ఆర్థిక గణాంక సర్వే జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 వేల గ్రామపంచాయతీలు, పట్టణ స్థాయిలో 1200 ఇన్విస్టిగేషన్ యూనిట్ల ద్వారా 15 వేల మందితో సర్వే జరుగుతుందని, రెండు స్థాయిల్లో పర్యవేక్షణ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గణాంక శాఖ సర్వేకు సంబంధించి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసామని తెలిపారు. ఈ సర్వేను రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ, జాతీయ శాంపిల్ సర్వే సంయుక్తంగా నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహించే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఇంతియాజ్ కోరారు. -
సచివాలయ ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, విజయవాడ : సెప్టెంబరు 1 నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అవి పంచాయతీ సెక్రటరీ, విఆర్వో, అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఎఎన్ఎమ్ ఉద్యోగాలకు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. 374 సెంటర్లలో 200655 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ సంఖ్యలో పరీక్ష ఎప్పుడూ జరగలేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్షలు ఉదయం 10 నుండి 12వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందు పరీక్ష హాల్లో ఉండాలి. ఓఎమ్ఆర్ షీట్లలో పరీక్ష ఉంటుంది. సెల్ఫోన్లకు అనుమతి లేదు. పరీక్ష నిర్వహించడానికి 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత నడుమ ప్రశ్రపత్రాల తరలింపు ఉంటుంది. ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరింటెండ్‌తో పాటు స్పెషల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్, రూట్ ఆఫీసర్లను నియమించాం. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష జరిగే పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జీరాక్స్ సెంటర్లను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు రేషన్ అందదనే అపోహలు వద్దని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ వలంటీర్లు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ప్రతీ ఇంటినీ సర్వే చేస్తారనీ, ప్రజలు తమ సమాచారాన్ని సరైన రీతిలో ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి తీసుకున్న సమాచారాన్ని వలంటీర్లు తహసీల్దార్లకు అందజేస్తారు. అంతేకాక, ఈ కేవైసీ నమోదు చేయనివారు దాదాపు 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నామనీ, ఈ కేవైసీని సంబంధిత రేషన్ షాపుల్లో నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. -
కాటేస్తే.. వెంటనే తీసుకు రండి
సాక్షి, కృష్ణా జిల్లా: వర్షాలు పడుతుండడంతో పాములు రెచ్చిపోతున్నాయి. జిల్లాలోని మొవ్వ మండలంలో పాము కాట్లు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే ఐదుగురు పాము కాటుకు గురయ్యారు. గత మూడు రోజులుగా చూస్తే మొత్తం 26 మంది పాము కాటుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లను అదనంగా నిల్వ చేసింది. దీంతో బాధితులు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. పాములు కాటేసిన వెంటనే ఆలస్యం చేయకుండా బాధితులను ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాపాయ నుంచి కాపాడతామని డాక్టర్ శొంఠి శివరామకృష్ణ తెలిపారు. -
దివిసీమలో గాలివాన బీభత్సం
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : దివిసీమలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారు జామున ఉదయం 3గంటల నుంచి 5గంటల వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బందలాయి చెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ చెట్లు పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. తోకల మోహన్‌కుమార్, దేసు శ్రీనివాసరావుకు చెందిన రెండు బడ్డీలపై భారీ వేపచెట్టు పడటంతో బడ్డీలు ధ్వంసమయ్యాయి. పలు సామాన్లు దెబ్బతిన్నాయి. భారీ వృక్షాలు రహదారికి అడ్డుగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నీటమునిగిన కార్యాలయాలు, పాఠశాలలు.. అవనిగడ్డలో 85 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 70 నుంచి 80 కి.మీ వేగంతో వీచిన ఈదురు గాలులు వీచాయి. అవనిగడ్డలో తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ, ఆర్అండ్బీ అతిథిగృహం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిశువిద్యామందిరం స్కూల్ ఆవరణంతా వర్షం నీటితో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వణికించిన ఈదురుగాలులు కోడూరు(అవనిగడ్డ): దివిసీమ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం వణికించింది. గాలుల ప్రభావానికి మండలంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. కృష్ణాపురం, నరసింహపురం, వి.కొత్తపాలెం, బైపాస్ రోడ్డు, పిట్టల్లంక, రామకృష్ణాపురం, మందపాకల గ్రామాల్లో చెట్లు రోడ్డుకు అడ్డుగా కూలాయి. మండల కేంద్రంలోని అంబటి బ్రహ్మణ్య కాలనీ, మెరకగౌడపాలెం ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లల్లోకి చేరగా నివాసులు ఇబ్బందులు పడ్డారు. అనేకచోట్ల విద్యుత్‌వైర్లపై చెట్ల పడడంతో సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విద్యుత్‌తీగలు తెగిపోవడంతో విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. అవనిగడ్డ మండల పరిధిలో మొత్తం 28 చోట్ల చెట్లు పడి, గాలికి కరెంట్ వైర్లు తెగిపోయాయి. మండల పరిధిలోని పులిగడ్డ పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం పడిపోయింది. అప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ డీఈ ఉదయభాస్కర్ ఆదేశాల మేరకు ఏఈ ఎఎన్ఎం రాజు ఉదయం 5 గంటల నుంచే సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్దరించారు. -
కమర్షియల్ కార్మికుల కష్టాలు!
సాక్షి, భవానీపురం (విజయవాడ పశ్చిమ): పేరుకు తగ్గట్లే అక్కడ అంతా హోల్‌సేల్‌గా కమర్షియలే. ఫక్తు వ్యాపార ధోరణే తప్ప వారికి మరో ధ్యాస ఉండదు. షాపులు తీశామా.. వ్యాపారం చేశామా.. నాలుగు డబ్బులు సంపాదించుకున్నామా.. అంతే. తమ సంక్షేమం కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు వారి దగ్గర పనిచేసే ముఠా కార్మికుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. పైగా కూలి రేట్లు పెంచాలని పోరాడక తప్పని దుస్థితి కార్మికులది. ముఠా పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి గాయాలపాలైతే కనీసం ప్రాథమిక వైద్య సౌకర్యం కల్పించని పరిస్థితి ఉంది. ఇదీ గొల్లపూడి గ్రామ పరిధిలోని మహాత్మా గాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో పనిచేసే ముఠా కూలీల దయనీయ స్థితి. అన్ని రకాల వ్యాపారాలకు సంబంధించిన సంఘాలకు నాయకుడిగా వెలుగొందిన దివంగత గడ్డం సుబ్బారావు హోల్‌సేల్ వ్యాపారుల కోసం 2003లో గొల్లపూడిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లో 489 షాపులు ఉన్నాయి. ప్రతి రోజూ కోట్లాది రూపాయాల వ్యాపారం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకు దిగుమతి, ఇక్కడి నుంచి వేరేచోటకు పంపించే సరుకు ఎగుమతి చేసే ముఠా కూలీలు సుమారు 1,500 మందికిపైనే ఉన్నారు. కాంప్లెక్స్ నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం చొప్పున రెండు కామన్ సైట్లను వదిలారు. ముఠా కూలీల కోసం ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే సదుద్దేశ్యంతో కాంప్లెక్స్ నిర్మాణ సారధి గడ్డం సుబ్బారావు ఓ స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన చనిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకున్న నాధుడు లేడు. కొన్నేళ్లుగా ఆ స్థలాన్ని వ్యాపారులు డంపింగ్ యార్డ్‌గా వాడుకుంటున్నారు. అంతా ఆయనతోనే పోయింది!.. కాంప్లెక్స్ వైభవం అంతా గడ్డం సుబ్బారావుగారితోనే పోయిందని అక్కడ పనిచేసే ముఠా కూలీలు చెబుతున్నారు. సరుకుల ఎగుమతి, దిగుమతి సమయాల్లో ప్రమాదం జరిగితే వెంటనే ప్రథమ చికిత్స చేయించుకునే సౌకర్యం కాంప్లెక్స్‌లో లేదు. తమ కోసం ఓ హాస్పటల్ నిర్మించాలని అప్పట్లో సుబ్బారావు కాంప్లెక్స్‌లో స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. ఆయన పోవటంతో అదికాస్తా మూలనపడింది. అయితే, యజమానులంతా కలిసి తమ సంక్షేమం కోసం విజయవాడ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారుగానీ, వారి దగ్గర పని చేస్తున్న తమ సంక్షేమం కోసం ఎటువంటి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఠా కార్మికులు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే ఒక్క షెడ్ కూడా లేదు. దీంతో చెట్ల కిందో, షాపుల్లోనో సేద తీరుతున్నామని వాపోతున్నారు. లక్షల్లో పన్ను చెల్లిస్తున్నా.. గొల్లపూడి పంచాయతీకి తాము ఏటా రూ.9 లక్షలకుపైనే పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సహకరించటం లేదని సొసైటీ అధ్యక్షుడు అన్నవరపు కోటేశ్వరరావు చెప్పుకొస్తున్నారు. కాంప్లెక్స్‌లోని చెత్తా చెదారాన్ని పంచాయతీ సిబ్బంది తీసుకువెళ్లకపోవడంతో హాస్పటల్ కోసం కేటాయించిన స్థలంలో వేసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. తామే ట్రాక్టర్ కొనుగోలు చేసుకుంటామని, చెత్త డంప్ చేసే ప్రదేశాన్ని చూపమని అడిగినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాగా కాంప్లెక్స్‌లోని ఒక్కో షాపు నుంచి మెయింటినెన్స్ పేరుతో సొసైటీ రూ.1,600 వసూలు చేస్తుంది. ఆ షాపుపై మొదటి అంతస్తు ఉంటే మరో రూ.600 చార్జి చేస్తున్నారు. ఈ రకంగా సొసైటీకి నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు వస్తుంది. అయితే కాంప్లెక్స్ మెయింటినెన్స్ అధ్వానంగా ఉంటుందని, లారీలు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేయడం, రోడ్డుపైనే ఎగుమతి దిగుమతులు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. -
భార్యాభర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
సాక్షి, మధురానగర్ (విజయవాడ సెంట్రల్) : ఇంటిపక్కవార్ని మచ్చిక చేసుకుని ఇంట్లోని బంగారు వస్తువులు కాజేసిన భార్యాభర్తలను సోమవారం అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. పవన్‌కుమార్, రేవతి భార్యాభర్తలు. రేవతి తమ ఇంటి సమీపంలోని జీ. రవికుమార్ భార్యను మచ్చిక చేసుకుని విలువైన వస్తువులు, బంగారు నగలు, ఇంటి తాళాలు ఎక్కడ పెడుతున్నారో గమనిస్తూ ఉంది. సమయం కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా తస్కరించింది. ఈనెల 5వ తేదీన ఇంట్లోని వస్తువులు మాయం అవ్వటం గమనించిన జీ రవికుమార్ దంపతులు అజిత్‌సింగ్‌నగర్ సీఐ ఎస్‌వీవీఎల్ నారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన నాను తాడు, చెవి దిద్దులు, రింగులు తదితర వస్తువుల విలువ సుమారు రూ.1.08 లక్షలు ఉంటుందని నిర్ణయించారు. విచారణ ప్రారంభించిన ఎస్ఐ సౌజన్య .. రవికుమార్ దంపతులను కలిసి ఎవరిమీదైనా అనుమానం ఉందా, ఇంటికి ఎవరెవరు వస్తుంటారు.. తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రేవతి దంపతులపై అనుమానం వచ్చింది. వారిపై నిఘా పెట్టగా సోమవారం రేవతి తన భర్తతో బంగారు నగలను తాకట్టు పెట్టేందుకు వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిరువురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తక్కువ సమయంలోనే దొంగలను పట్టుకున్నందుకు సీఐ లక్ష్మీనారాయణ పోలీసులను అభినందించారు. -
‘దివి’ గుండెచప్పుడు వైఎస్!
సాక్షి, అవనిగడ్డ: దివిసీమ ప్రజల గుండెలో మహానేత వైఎస్ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆధునికీకరణ పనుల ద్వారా సాగునీటి కష్టాలు తొలగించి, రైతులకు వందేళ్ల భరోసా ఇచ్చేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్ లైన్ కరకట్టకు నిధులు మంజూరు చేశారు. దివిసీమలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసి చెరగని ముద్ర వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 నవంబర్ 2వ తేదీన ఓగ్ని తుఫాన్ ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి అవనిగడ్డ వచ్చారు. 60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డెల్టాను ఆధునికీకరిస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన డెల్టా ఆధునికీకరణకు రూ.4,576 కోట్లు మంజూరు చేశారు. 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. 150 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా వైఎస్ చరిత్ర పుటల్లో నిలిచారు. చిత్తరువుని చూసి మురిసిన వైఎస్.. కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు, అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.547.93 కోట్లు డెల్టా ఆధునికీకరణ పనులు జరిగాయి. పులిగడ్డ వార్పు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకంపై వైఎస్ పలుగు పట్టుకుని గాతవేస్తున్న ప్లాస్టరాఫ్ ప్యారిస్ చిత్తరువు మహానేతను అచ్చుగుద్దినట్టు ఉంటుంది. శంకుస్థాపన మహోత్సవానికి వచ్చిన వైఎస్ తన చిత్తరువుని చూసి ఎంతో మురిసిపోయారు. అడగకుండానే దివిసీమకు వరాలు దివిసీమకు వైఎస్ అడగకుండానే ఎన్నో వరాలు అందించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.590 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. రాష్ట్రంలోనే తొలి ఫిషరీస్ కళాశాలను నాగాయలంక మండలంలోని భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.35 కోట్లతో అవనిగడ్డలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు వైఎస్ హయాంలోనే జరిగింది. రూ.40 కోట్లతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకూ సముద్ర కరకట్టను అభివృద్ధి చేశారు. అశ్వరావుపాలెం – మందపాకల పంట కాల్వ ఏర్పాటుతో పాటు, జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు దివిసీమ ప్రజల గుండెల్లో వైఎస్‌కు చెరగని ముద్ర వేశాయి. ఉల్లిపాలెం వారధికి అప్పుడే అంకురార్పణ.. ఉల్లిపాలెం – భవానీపురం వారధికి వైఎస్ హయాంలోనే అంకురార్పణ జరిగింది. ఈ వారధి కోసం రూ.32 కోట్లకు ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వైఎస్ సమాయత్తమవగా ఎన్నికల కోడ్ రావడంతో కార్యక్రమం నిలిచిపోయింది. ఆ తర్వాత పలు దఫాలుగా అంచనాలు పెంచి వారధిని నిర్మించారు. -
‘మత్తు’ వదిలించొచ్చు
మద్యం మహమ్మారి నేడు అనేక కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది.. మద్యానికి బానిసైనవారు తమ శరీరానికి హాని చేసుకోవడమే కాకుండా ఇంట్లోవారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారు.. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువుగా మృతి చెందడం చూస్తున్నాం. వారిలో చాలామంది మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదాలు జరిగి మృతిచెందినట్లుగా తేలడం విస్మయానికి గురిచేస్తోంది. మద్య పానానికి అలవాటుపడిన వారు నలుగురిలో చులకనకు గురవుతారు.. చాలామందికి మద్యం మానాలని ఉన్నా రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రారంభిస్తారు.. అయితే చిత్తశుద్ధి ఉంటే వారిలో ఈ వ్యసనాన్ని తేలిగ్గా పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాక్షి, విజయవాడతూర్పు : సరదాగా స్నేహితులతో కలిసి వీకెండ్స్‌లో తాగేవారు కొందరు..కాయకష్టం చేసి, అలసటను మర్చిపోవాలనే ఉద్ధేశంతో తాగేవారు మరికొందరు. మద్యానికి బానిసలై ఉదయం నిద్రలేవగానే మద్యం తాగే వాళ్లు ఇంకొందరు. ఇలా పురుషుల్లో 17 శాతం మంది ఏదొక సమయంలో మద్యం తాగుతూ ఉంటారు. వారిలో సాయంత్రం 6 గంటల తర్వాత తాగేవారు అధికంగా ఉండగా, రాత్రి 9 నుంచి వేకువ జామున 3 గంటల వరకూ మద్యం తాగే వారు అత్యధికంగా ఉన్నట్లు అంచనా. అలాంటి వారి కారణంగానే ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నట్లు మానసిక వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఆల్కాహాల్ శాతం పెరిగితే... మద్యం అధికంగా తాగడం వలన రక్తంలో ఆల్కాహాల్ శాతం పెరిగి తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. అలెర్ట్నెస్(అప్రమత్తత) తగ్గడం, సరిగ్గా వినపడక పోవడం, విజన్(కంటిచూపు) తగ్గడం, తక్షణమే నిర్ణయం తీసుకునే శక్తి తగ్గడం జరుగుతుంది. ఈ ప్రభావంలో వాహనం నడిపే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు, మనుషులను గుర్తించలేక ప్రమాదాలకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువుగా జరుగుతున్నట్లు అంచనా. అనారోగ్య సమస్యలు అధికంగా మద్యం సేవించడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వెంట్రుకల నుంచి కాలిపాదం వరకూ శరీరంలోని ప్రతి అవయవంపై మద్యం ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా లివర్ దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, రక్తనాళాలు, గుండెపై ప్రభావం చూపడం, రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పేగు పూత, ప్రాంకియాటైటీస్ వంటి సమస్యలు ఆల్కాహాలిస్టుల్లో సర్వసాధారణంగా వస్తుంటాయి. మద్యం సేవించే వారిలో దాంపత్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెపుతున్నారు. మాన్పించవచ్చు.. మద్యానికి బాలిసలైన వారిని మాన్పించేందుకు వైద్యం అందుబాటులో ఉంది. రెండు సంవత్సరాల పాటు క్రమం తప్పక మందులు వాడటం ద్వారా మద్యం అలవాటును పూర్తిగా మాన్పించవచ్చునని మానసిక వైద్యులు చెబుతున్నారు. రోజుకు మూడు క్వార్టర్లు కన్నా ఎక్కువ మద్యం తాగే వారికి ఇన్‌పేషెంట్‌గా చేర్చి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. మద్యం తాగే ప్రతి వంద మందిలో 10 మంది మానేందుకు ప్రయత్నిస్తూ చికిత్సకోసం వస్తున్నట్లు చెబుతున్నారు. అలా వచ్చిన వారిలో 90 శాతం మంది తిరిగి మద్యం తాగడం జరగడం లేదంటున్నారు. -
జీతాలు చెల్లించండి బాబోయ్
సాక్షి, మైలవరం(కృష్ణా) : గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో పేదలు నరకయాతన పడుతున్నారు. ఉపాధి కోసం స్కూళ్లలో చేరిన పారిశుద్ధ్య కార్మికులను రెండేళ్లుగా జీతాలు చెల్లించకుండా ఆటలాడుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో స్వీపర్లును నియమించింది. నెలకు రూ.1500 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. తొలి ఏడాది అరకొరగా జీతాలు చెల్లించి తరువాత రెండు, మూడు నెలలకు ఒకసారి ఒక నెల జీతం చెల్లిస్తూ కాలయాపన చేశారు. దీంతో స్వీపర్లు సంక్షోభంలో పడ్డారు. ప్రస్తుతం జీతాలు లేక పాఠశాల ప్రధానోపాధ్యాయుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4500 పాఠశాలలు ఉండగా 1200 పాఠశాలల్లోనే స్వీపర్లును నియమించారు. కొన్ని పాఠశాలల్లో గతం నుంచి పనిచేస్తున్న అటెండర్లతోనే ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. 23 నెలలుగా వారికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. స్వీపర్లు అనేక సార్లు వేతనాలు చెల్లించాలని పలు మార్లు నిరసన తెలిపినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. మైలవరం నియోజకవర్గంలో 120 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. నందిగామ మండలంలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు 56వరకు ఉన్నాయి. నూజివీడు మండలంలో 85 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. తిరువూరు మండలంలో 61 జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 59 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని 4,500 పాఠశాలల్లో కేవలం 1200 పాఠశాలల్లో మాత్రమే స్వీపర్ల నియామకం జరిగింది. మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కాని పట్టించుకున్న నాథుడే లేడు. -
పెద్దల ముసుగులో అరాచకం..!
సాక్షి, కైకలూరు(కృష్ణా) : కొల్లేరులో ప్రభుత్వానికి ధీటుగా సమాంతర పాలన కొనసాగుతోంది. చట్టాలను లెక్కచేయడం లేదు. మా రాజ్యంలో పెద్దలు చెప్పిందే శాసనం అనే రీతిలో ఆటవీక రాజ్యం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆధ్మాత్మిక కేంద్రంగా పేరుగడించింది. ఈ దేవాలయం చేరడానికి పందిరిపల్లిగూడెం వద్ద సర్కారు కాలువపై ఇనుప వంతెన ఆధారం. దేశంలో ఎక్కడా లేని విధంగా అక్రమ టోలు గేటు వసూల చేస్తూ కొల్లేరు పెద్దలు రూ.కోట్లలో ప్రజాధనాన్ని దండుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లిని దర్శించుకోడానికి వస్తున్న భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కొల్లేరు కట్టుబాట్ల కారణంగా అక్రమ వసూళ్లు ఏడాది పొడవునా సాగుతోంది. ప్రశ్నించే భక్తులపై నిర్వాహకులు దాడులకు దిగుతున్నారు. ఈ విషయాలు పోలీసు, రెవెన్యూ, అటవీ అధికారులకు తెలిసినా తెలుగుదేశం నేతల బెదిరింపులు కారణంగా ఏమీ చేయలేని దుస్థితి దాపురించింది. అక్రమ వసూళ్లను అడ్డుకోలేక పోలీసు, ఆర్అండ్బీ, ఫారెస్టు అధికారులు ఒకిరిపై ఒకరి తమ పరిధి కాదంటే తమది కాదని చేతులు దులుపుకుంటున్నారు. ఏడాదికి రూ.44 లక్షల అక్రమ పాట.. పందిరిపల్లిగూడెం సర్కారు కాలువ వంతెన దాటిన తర్వాత ఐదు గ్రామాలు ఉన్నాయి. వంతెన అవతల కొల్లేటికోట గ్రామంలో పెద్దింట్లమ్మ దేవస్థానం ఉంది. ప్రతి ఆదివారం అమ్మ దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఏటా మార్చిలో జరిగే జాతరకు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. ఈ విధంగా వంతెన దాటిన ప్రతి ఒక్కరి నుంచి, వాహనాల నుంచి అక్రమ టోలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్రమ టోలు ఫీజు నిమిత్తం గురువారం రాత్రి పందిరిపల్లిగూడెం గ్రామ చావిడి వద్ద పెద్దలు పాటలు నిర్వహించారు. గ్రామానికి చెందిన జయమంగళ కొండయ్య అనే వ్యక్తి ఏడాదికి రూ.44లక్షల 6 వేలు పాట దక్కించుకున్నాడు. ఈ డబ్బులు పందిరిపల్లిగూడెం పెద్దలు తీసుకుంటారు. పాటదారుడికి ఏడాదికి రూ.కోటి 50 లక్షలపైనే ఆదాయం వస్తుంది. అవినీతి సహించమన్నా చలనం లేదు.. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి రహిత పాలన అందించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పందిరిపల్లిగూడెం వంతెనపై అక్రమ టోలు ఫీజును నిలుపుదల చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వమే నామమత్ర ఫీజులను వసూలు చేసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇప్పటికైన కొల్లేరులో సమాంతర పాలనకు అడ్డకట్ట వేసి అక్రమ టోలు దోపిడిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి బ్యూరో(కృష్ణా) : పెద్దలు చెప్పినట్లు ఆలస్యం చేస్తే అమృతమైనా విషమవుతుందన్న చందంగా ఉంది ఇంజినీరింగ్ కాలేజీల అడ్మిషన్ పరిస్థితి. ప్రతి ఏడాది జరుగుతున్న షెడ్యూల్ కాకుండా ఈ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఏడాది తీవ్ర జాప్యం జరగటంతో విద్యార్థులు ఇతర మార్గాలు అన్వేషించటంతో జిల్లాలో ఇంజనీరింగ్ సీట్లు నిండుతాయా లేదా అన్న అనుమానం రేకెత్తుతోంది. సాధారణంగానే జిల్లాలోని కాలేజీలలో సుమారు ఐదు వేల సీట్లు గతేడాది ఖాళీగా ఉన్నాయి. అసలే ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఆడ్మిషన్లు ఆలస్యమవటంతో కాలేజీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 34 ఇంజినీరింగ్ కాలేజీలు కృష్ణా జిల్లా పరిధిలో 34 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ బ్రాంచ్‌లలో 18,090 సీట్లు ఉన్నాయి. ఇది వరకు మరో ఐదు వేల సీట్లు ఉన్నప్పటికీ ఆడ్మిషన్లు తగ్గటంతో కాలేజీలు తమకున్న సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. ఫార్మసీ కాలేజీలు 11 ఉండగా అందులో 1,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మన జిల్లాలో వర్శిటీ కాలేజీలు లేవు. జిల్లాలో 26,799 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాయగా అందులో 20,743 మంది ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలతో జాప్యం! ఏపీ ఎంసెట్ పరీక్షను అనుకున్న సమయానికే నిర్వహించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఫలితాలను విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వచ్చిన గందరగోళమే. తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షను నాన్ లోకల్ కేటగిరిలో రాశారు. ఎంసెట్ ర్యాంకులు ప్రకటించటానికి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకుల ప్రకటన ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరగటం, విద్యార్థులు కోర్టులకెక్కటం వంటి కారణాలతో వారి మార్కులను తెలంగాణ ఇంటర్ బోర్డు ఏపీ ఎంసెట్ అధికారులకు అందజేయలేదు. దీంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమైంది. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అడ్మిషన్లు ఏపీ ఎంసెట్ ప్రక్రియ ఆలస్యం అవ్వటంతో మన విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటకలలోని ప్రముఖ కాలేజీలకు క్యూ కట్టి మరీ అడ్మిషన్లు పూర్తి చేస్తున్నారు. ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందో రాదో...ఆలోగా పక్క రాష్ట్రాలలో సీట్లు భర్తీ అయిపోతాయేమోనన్న భయంతో అడ్మిషన్ల విషయంలో తొందరపడ్డారు. ప్రతి ఏడాది పక్క రాష్ట్రాలకు అడ్మిషన్లు పోయినప్పటికి ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని పేరుమోసిన డీమ్డ్ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందటానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు. మరో వైపు సాంప్రదాయ డిగ్రీ విద్యకు ఆదరణ పెరగడం కూడా ఇంజనీరింగ్ అడ్మిషన్ల సంఖ్య తగ్గటానికి కారణమవుతోంది. ఆందోళనలో యాజమాన్యాలు... ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ జాప్యమవటం, విద్యార్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారన్న సమాచారంతో ఇంజనీరింగ్ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. అసలే కళాశాలలో అడ్మిషన్లు తగ్గి, గత ప్రభుత్వం సరిగ్గా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ఇబ్బందిపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు భవిష్యత్ గురించి బెంగపెట్టుకున్నారు. ఇతర మార్గాలు అన్వేషించకుండా ఇక్కడే ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్న విద్యార్థులు సైతం ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటుందా, అడ్మిషన్ ఎక్కడ దొరుకుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు. ఫార్మసీ కాలేజీలు, విద్యార్థుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీలు 34 ఇంజినీరింగ్ సీట్లు 18,090 ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య 26,799 ఎంసెట్ పరీక్షలో ఆర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 20,743 -
‘టెండర్ల’కు చెమటలు
సాక్షి, విజయవాడ : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం మొగ్గుచూపడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. జలవనరుల శాఖలో అవినీతి.. ఆశ్రిత పక్షపాతం.. బంధుప్రీతితో జరిగిన టెండర్ల కేటాయింపుపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. పాతిక శాతం దాటని పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. జలవనరుల శాఖలో గత ప్రభుత్వ హయాంలో అనుమతించిన టెండర్లను అధికారులు సమీక్షిస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన కాంట్రాక్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో కేటాయించిన పనులపై సమీక్షించి నత్తనడకన సాగుతున్న పనులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నారు. రూ.45 కోట్ల జైకా నిధులతో మున్నేరు అభివృద్ధి.. గత ఏడాది జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ), వరల్డ్ బ్యాంకుల నుంచి వచ్చిన నిధులతో చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టారు. జైకా నుంచి వచ్చిన రూ.45 కోట్ల నిధులతో మున్నేరు మెయిన్ కెనాల్ అభివృద్ధి పనులు, చెరువుల అభివృద్ధి చేపట్టారు. 50 కిలోమీటర్ల పొడవు మున్నేరు కాలువ గట్ల బలోపేతం, ధ్వంసమైన బ్రిడ్జిలను తిరిగి నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్యాకేజ్–1లో ఐదు చెరువులు, ప్యాకేజ్–2లో ఏడు చెరువుల అభివృద్ధికి టెండర్లు పిలిచారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా టెండర్లు దాఖలు చేసినప్పటికీ నాటి అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్లకే ఈ పనులు దక్కాయి. మున్నేరు ప్రధాన కాలువ పనులు 20 శాతం పూర్తికాగా.. ప్యాకేజ్ 1, 2లలో పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తూ ఒక నివేదికను సిద్ధం చేశారు. వరల్డ్ బ్యాంకు నిధులతో చెరువుల అభివృద్ధి.. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన సుమారు రూ.100 కోట్లతో పశ్చిమ కృష్ణాలోని 78 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టారు. వరల్డ్ బ్యాంకు నిబంధనల ప్రకారం బాక్స్ టెండర్లు మాత్రమే వేయాల్సి ఉంది. ఇది తెలుగుదేశం నేతలకు వరంగా మారింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరులకు తప్ప బయట కాంట్రాక్టర్లకు కనీసం టెండర్ ఫారాలు కూడా దక్కకుండా జాగ్రత్త పడ్డారు. వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చిన నిధులతో రెడ్డిగూడెంలో 9 చెరువులు, గన్నవరంలో మూడు చెరువులు, మైలవరంలో నాలుగు చెరువులు, బాపులపాడులో 10 చెరువులు, ముసునూరులో 7 చెరువులు, చాట్రాయిలో 8 చెరువులు, విసన్నపేటలో 11 చెరువులు, నూజివీడులో 8 చెరువులు, తిరువూరులో 3 చెరువులు, విజయవాడ రూరల్‌లో ఒక చెరువు, కోడూరులో 4 చెరువులు, ఆగిరిపల్లిలో రెండు, ఏకొండూరు, గంపలగూడెంలో 4 చెరువులకు గట్ల బలోపేతం చేసి, పూడికలు తీసి చెరువుల ద్వారా సాగునీటి వసతికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఐదు శాతం అధిక ధరలకు.. తొలుత టెండర్ల ధరలపై 25 శాతం అధిక రేట్లకు టెండర్లు వేశారు. అయితే దీనిపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసి రద్దు చేశారు. దీంతో టెండర్ రేటుపై ఐదు శాతం అధికంగా టెండర్లు దాఖలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ టెండర్లను మంత్రి అనుచరులే దక్కించుకోగా.. 17 చెరువులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అందులో ఆరు చెరువులకు పనులు ప్రారంభంకాకపోగా, 11 చెరువులకు సంబంధించి 20 శాతంలోపు పనులు జరిగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగు తమ్ముళ్లు పనులు విషయంలో వెనుక్కు తగ్గారు. ప్రస్తుతం ఈ పనుల ప్రస్తుత స్థితిని వివరిస్తూ కమిషనర్ కార్యాలయానికి లేఖ రాస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ టెండర్లు రద్దయితేనే మంచిదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
‘బెల్టు’ స్కూళ్లు..!
బెల్టు షాపులు అంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి తరచూ వింటూ ఉంటాం.. అంటే అనుమతులు లేకుండా చిన్న బడ్డీ కొట్లలో అక్రమంగా మద్యం విక్రయించడం. ఈ జాడ్యం ఇప్పుడు విద్యావ్యవస్థకూ పాకింది. ఒక పాఠశాల నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటారు.. అదే అనుమతితో రెండు మూడు సబ్ బ్రాంచ్‌లు పెట్టేస్తారు. వీటికి అనుమతులుండవు.. అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్ సెంటర్లంటూ నమ్మిస్తారు. దీంతో జిల్లాలో ‘బెల్టు’ స్కూళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ సంస్థలు ఒక్క స్కూల్‌కు అనుమతి తీసుకొని, వాటితో రెండు మూడు బ్రాంచ్‌లను నడుపుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. గుర్తింపు లేకపోతే సరి..! స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల నుంచి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుంచి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది. జిల్లాలో దాదాపు 80 స్కూళ్లు... కృష్ణా జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పాఠశాలలు దాదాపు 80 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడ నగరంలోనే 60 స్కూళ్ల వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 20 దాకా ఉన్నాయని సమాచారం. వీటిలో అగ్రభాగం నారాయణ, శ్రీచైతన్య, తదితర కార్పొరేట్ పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా.. ఇది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, భారీగా ముడుపులు అందజేయటం వంటి కారణాల వల్ల వీటిపై దాడులు జరగకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి చూపటంతో వీటిపై దాడులు మొదలయ్యాయి. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురంలోని అనుమతి లేని నారాయణ స్కూల్‌పై విద్యాశాఖాధికారులు దాడి చేసి లక్ష రూపాయలు జరిమానా, తాత్కాలికంగా సీజ్ చేశారు. విద్యాసంవత్సరం ఆరంభంలో కేవలం నోటీసులు, జరిమానాలతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ఈవీఎం విజువల్స్.. కలెక్టర్ ఆగ్రహం
కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్శిటీలో శనివారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఓ న్యూస్ చానల్లో ప్రచారం కావటంతో పాటు, ఓ దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడు నియోజకవర్గానికి చెందిన పోలింగ్ ప్రక్రియకు ఉపయోగించిన ఈవీఎంలతో పాటు, రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మచిలీపట్నంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సంఘటనపై న్యూస్ చానల్, దినపత్రికలో స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను తరలించినట్లు ప్రచురితమైంది. దీనిపై ఆదివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా అధికారులు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మాత్రమే స్ట్రాంగ్ రూంకు తరలించటం జరిగిందన్నారు. అది కూడా నూజివీడు నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకుల సమ్మతితోనే తరలించటం జరిగిందన్నారు. అయితే ఓ న్యూస్ చానల్లో ప్రసారం అయిన వీడియోను ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంట ఉన్న వీడియో గ్రాఫర్ ద్వారా లీకైనట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణతో పాటు, సీసీ కెమోరాల పుటేజీలను కూడా సేకరించి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆ దృశ్యాలను సదరు మీడియా ఛానల్లో ప్రసారం కూడా చేశారు. -
టీడీపీ నాయకుల వీరంగం
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక క్రాంబ్వే రోడ్‌లోని సర్ ఆర్థర్ కాటన్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. అందులో ఏర్పాటు చేసిన బూత్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నాయకులు రీపోలింగ్ చేయించేందుకు కుట్రపన్నారు. అందులో భాగంగా పశ్చిమ టీడీపీ అభ్యర్థిని షబానా ఖాతూన్‌ను వారు సాయంత్రం అక్కడికి పిలిపించారు. అయితే ఆమె వచ్చేసరికి 6 గంటలు దాటటంతో గేటు వేసేశారు. దీంతో ఆమెను లోపలికి పంపించాలని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. సమయం మించిపోయింది.. పై అధికారులు అనుమతిస్తే పంపిస్తామని పోలీసులు చెప్పారు. కొందరు చోటా నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షబానాతోపాటు పెద్ద ఎత్తున వచ్చిన స్థానిక నాయకులను చూసి వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వెలంపల్లి సమన్వయం పాటించాలని అక్కడున్న పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో వారు అక్కడే ఉన్నారు. షబానాను లోపలికి అనుమతిస్తే తమ అభ్యర్థి వెలంపల్లిని కూడా అనుమతించాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పోలీసులు పై అధికారులపై సంప్రదింపులు జరుపుతున్నారు. పట్టాభి రాకతో పెరిగిన ఉద్రిక్తత ఈ క్రమంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి అక్కడికి చేరుకుని పోలింగ్ స్టేషన్లో ఉన్న పీఓలతో గొడవకు దిగారు. 26వ నంబర్ బూత్‌లో 10 వరకు అవకాశం ఇచ్చినప్పుడు అభ్యర్థిని లోపలకు ఎందుకు అనుమతించరంటూ పీఓలతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు మొత్తం గేటు దగ్గరకు చేరుకుని హడావుడి చేశారు. దీంతో మండిపడ్డ వైఎస్సార్ సీపీ నాయకులు నినాదాలు చేయటంతో పోలీసులు వారు ముందుకు రాకుండా రోప్‌ను అడ్డంగా పెట్టారు. టీడీపీ నాయకులను గేటు దగ్గర నుంచి బయటకు పంపి వారిని కూడా రోప్‌తో అడ్డగించాలని నినాదాలు చేశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ 27వ డివిజన్ అధ్యక్షుడు చిన సుబ్బయ్య వెలంపల్లిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు. వైఎస్సార్ సీపీ నాయకులు చిన సుబ్బయ్యపై ధ్వజమెత్తుతూ రోప్‌ను తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీలు ఝుళించి అందరినీ చెల్లాచెదురు చేశారు. తరువాత షబానా తరుఫున ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన అన్పారీ అభ్యర్థులిద్దరినీ లోపలికి అనుమతిస్తే ఏ గొడవ ఉండదని చెప్పటంతో పోలీసులు వెలంపల్లిని పిలిచారు. చివరికి ఇరు పార్టీల తరుపున ఒకొక్కరిని గేటు బయట ఉండి 26వ నంబర్ బూత్‌లో ఓటేసేందుకు వచ్చినవారని లోపలకు పంపించేందుకు ఏర్పాటు చేయటంతో గొడవ సద్దుమణిగింది. -
ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం
సాక్షి, విజయవాడ : నేడు ఏపీలో జరిగిన పోలింగ్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడి పలుచోట్ల దాడులకు దిగింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ హల్చల్ చేశారు. వన్ టౌన్ పరిధిలో తన అనుచరులతో కలిసి జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ డివిజన్ అధ్యక్షుడు వాహబ్ కార్యాలయంపై ఆయన తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాహబ్కు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయంలోని ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ పంజా సెంటర్లో రెచ్చిపోయారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం జలీల్ ఖాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను కేశినేని నాని పరామర్శించారు. -
వైఎస్సార్ సీపీ ఏజెంట్లే టార్గెట్!
సాక్షి, విజయవాడ : ఎన్నికల రోజు ఏజెంట్లే కీలకం. పోలింగ్ బూత్‌లో కూర్చుని దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసో, వారిపై తప్పుడు కేసులు పెట్టించో ఎన్నికల రోజు వారు మౌనంగా ఉండేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లనే టార్గెట్ చేసి వార్ని పోలింగ్ బూత్‌లకు దూరంగా ఉంచేందుకు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. డబ్బులు పంచుతున్నారంటూ ఫిర్యాదు.... వాస్తవంగా పార్టీలో దీర్ఘకాలంగా పని చేసేవారిని.. అభ్యర్థికి నమ్మకమైన వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటారు. డివిజన్ స్థాయిలో కీలకంగా ఉన్న వారిని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు తమ ఏజెంట్లుగా నియమించుకున్నారు. దీంతో వీరిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 20 మంది వైఎస్సార్ సీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై గురువారం ఎన్నికలు పూర్తయ్యే వరకు నిఘా ఉంచాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇందులో ఎక్కువ మంది ఏజెంట్లుగా ఉన్నవారేనని సమాచారం. మైలవరం, గుడివాడల్లోనూ అదే తీరు.... మైలవరం, గుడివాడ నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రతిపక్ష ఏజెంట్లపై దృష్టి సారించారని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రెండు రోజుల నుంచి నిఘా పెట్టారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బులు పంచుతున్నారంటూ వారిని బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టి సాయంత్రానికి ఏ విధమైన కేసులు లేకుండా పంపేయాలని జిల్లా మంత్రి నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సమాచారం. ఎదురు తిరిగే ఏజెంట్లపై కేసులు పెట్టి కోర్టుకు పంపుతామని బెదిరించి స్టేషన్లోంచి కదలకుండా ఉంచేందుకు కుట్ర పన్నుతున్నారు. మైలవరం, గుడివాడలో దొంగ ఓట్లు వేయించడానికి విజయవాడ నుంచి యువతను తరలించి గుడివాడలోని పార్టీ నేతల ఇళ్లలో ఉంచారని తెలిసింది. మద్యం వ్యాపారస్తుల సంఘంలో కీలకపాత్ర వహించే ఓ వ్యక్తి కన్నుసన్నల్లో ఈ తతంగమంతా జరుగుతోంది. లొంగదీసుకునేందుకు యత్నాలు... కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో విజయవాడ గుణదలలో ఇదే తరహాలో కొంతమంది వ్యతిరేక పార్టీల ఏజెంట్లను లొంగదీసుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. ఏజెంట్లను బెదిరించో. భయపెట్టో, డబ్బులకు కొనుగోలు చేశో తమ పని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో బంధుత్వాలు కూడా కలుపుకుని ఎన్నికల్లో సహాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యంగా గన్నవరం, నందిగామ, నూజివీడు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, ఈ విషయంలో వైఎస్సార్ సీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లుగా నియమించిన వారు ఏ విధమైన కేసుల్లోనూ ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ ముగిసే వరకు బూత్ వదిలిపెట్టి రాకుండా ఏజెంట్లకు తగిన సూచనలు చేస్తున్నారు. -
విజయవాడ పశ్చిమ సభలో వైఎస్ షర్మిల
-
ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది: కొడాలి
గుడివాడ(కృష్ణా జిల్లా): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని(కొడాలి వెంకటేశ్వర రావు) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొడాలి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణల వీడియోతో వీరి అసలు నైజం బయటపడిందని, ఆ సంభాషణల్లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తనను బాధించాయని కొడాలి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిమానిగా ముందు నుంచి చెబుతున్నానని, ఉచ్ఛం, నీచం లేనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని శాపనార్ధాలు పెట్టారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కొట్టేసి, ఆయన పదవిని కూడా లాక్కుని మరణానికి కారణమైన నీచాతినీచుడు చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది...బయటకు వచ్చి ప్రజలు రాళ్లతో కొడతారేమోనని ఆయన విగ్రహాలకి దండలు వెయ్యటం, పథకాలకి పేరు పెట్టినట్లు నటించడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని తూర్పారబట్టారు. బాబు ఎన్టీఆర్ పాలిట దుర్మార్గుడని, రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు, చంద్రబాబును ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, రాజకీయంగా భూస్థాపితం చెయ్యటానికి తాను ముందు ఉంటానని, ఎన్టీఆర్ అభిమానులు అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు వెంట ఉంటే ఆయన ఆత్మక్షోబిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ వైఎస్ జగన్ వెంట నడిచి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి చంద్రబాబుకు చరమగీతం పాడాలని విన్నవించారు. -
టీడీపీ నకి ‘లీలలు’
సాక్షి, అమరావతి : ఏదీ చేసైనా..ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్న కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కుయుక్తులకు తెరతీశారు. ఏకంగా నకిలీ పట్టాలు పంపిణీ చేసిన ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఓటుకు రూ. వేయి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు.. తాజాగా మహిళలకు సైతం నాసిరకం చీరలు పంపిణీ చేస్తుండటం విశేషం. బహిరంగంగానే ఈ ప్రలోభాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నా.. ఎన్నికల అధికారులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటోసారి.. రెండోసారి.. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే..టీడీపీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో నిమగ్నమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అనుచరులను రంగంలోకి దింపి డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటోసారి.. రెండోసారి.. అవసరమైతే మూడోసారైనా ఫర్వాలేదు అన్నట్లుగా వేలం పాట రీతిలో ఓటర్లకు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదటి విడత పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. డబ్బుతోపాటు మహిళలకు చీరలు, ముక్కుపుడకలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. మరో అడుగు ముందుకేసి పేదలను ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట మోసాలకు తెరలేపా రు. హనుమాన్ జంక్షన్లో నకిలీ పట్టాలు గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్‌జంక్షన్, కొయ్యూరు గ్రామాలలో పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు పంచారు. గత ఏడాది ఆగస్టులో బదిలీ అయిన బాపులపాడు మండల తహసీల్దార్ కె.గోపాలకృష్ణ పేరిట రబ్బర్ స్టాంపు సంతకం కలిగిన 500 పట్టాలను స్థానిక టీడీపీ నేతలు పంపిణీ చేయడం గమనార్హం. కేవలం ఓట్లు దండుకోవడం కోసమే నకిలీ పట్టాలు సృష్టించి పేదలను మోసగించడానికి యత్నిస్తున్న టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపీణీ వ్యవహారంపై మండల రెవెన్యూ, నియోజకవర్గ ఎన్నికల అధికారులకు వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కేంద్ర ఎన్నికల కమిషన్ నేరుగా ఓటర్లు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన సీవిజిల్ యాప్‌లోనూ ఈ విషయాన్ని ఫొటోలతో సహా అప్లోడ్ చేసినా అతీగతి లేదు. చీరలూ నాసిరకమే.. ఇటీవల మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఓటర్లకు ఏకంగా ఏసీలు, వాషింగ్ మిషన్లు పంపిణీ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అవి కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని తెలిసింది. ఇదేవిధంగా ఇప్పుడు కృష్ణాజిల్లాలో టీడీపీ నేతలు అలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారు. వారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాసిరకమైన చీరలు కొనుగోలు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గంలో ఆదివారం పలు గ్రామాల్లో ఇలాంటి చీరలను టీడీపీ నేతలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. -
టీడీపీ అసమర్థ పాలనకు ఇదే సాక్ష్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల అసమర్థ పాలనపై గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు చొరవ చూపకుండా విఫలమయ్యారనే అభిప్రాయం ప్రజల నుంచి వినిపిస్తోంది. మూలుగుతున్న ఇంటింటికి కుళాయి నిధులు గ్రామాల్లోని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మండలానికి రూ.37 కోట్లు కేటాయించింది. కేవలం నెల రోజుల్లో పథకాన్ని పూర్తి చేసి తాగునీటిని అందిస్తామని కొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం ఎక్కడా ప్రారంభం కాకపోవడం అసమర్థ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. మంగినపూడికి మంగళం అరిసేపల్లి, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, పోతేపల్లి, పోతిరెడ్డిపాలెం, పొట్లపాలెం, మంగినపూడి, చిరివెళ్లపాలెం, గోకవరం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మంగినపూడి తాగునీటి పథకాన్ని2012లో అప్పటి ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2015 వరకు ఈ పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు పుష్కలంగా చేరింది. టీడీపీ నాయకులు పథకం నిర్వహణ కాంట్రాక్ట్ పనులు చేజిక్కించుకుని పైప్‌లైన్‌కు ఏర్పడుతున్న లీకులకు మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం ఏ గ్రామానికి తాగునీరు సక్రమంగా చేరకపోవడంతో ప్రజలు బిందె నీటిని రూ.20 కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఏడాది జరుగుతున్న జన్మభూమి– మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డంపింగ్ యార్డు తరలింపులోనూ నిర్లక్ష్యమే.. స్థానిక రాజుపేట శివారులో శివగంగ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డును తరలించడంలోనూ పాలకులు విఫలమయ్యారు. రాజుపేట, కరెంటుకాలనీ ప్రజలతోపాటు మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురం, సుల్తానగరం గ్రామాల ప్రజల ఆరోగ్యంపై ఈ యార్డు ప్రభావం చూపుతోంది. దీన్ని అక్కడి నుంచి తరలించాలని గత పాలకవర్గం హయాంలోనే రూ.2.75 కోట్ల మునిసిపల్ నిధులను సమకూర్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా యార్డు తరలింపు అంగుళం ముందుకు కదలకపోవడం పాలనాతీరును ఎద్దేవా చేస్తోంది. తాగునీటి పథకాన్ని వీడని గ్రహణం చిన్నాపురం గ్రామంలో తాగునీటి పథకం ఏర్పాటు చేసి శివారు పంచాయతీలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. పథకం నిర్మాణానికి భూమి కొలుగోలు ప్రక్రియ అప్పట్లోనే పూర్తయింది. ఈ ప్రాంతాన్ని రెండుసార్లు అప్పటి జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పరిశీలించారు. పాలకుల చొరవ లేకపోవడంతో పథకం పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదు. పాలకుల అసమర్థత కారణంగా చిన్నాపురం గ్రామ పంచాయతీతోపాటు ఎన్‌గొల్లపాలెం, పెదయాదర, తుమ్మలచెరువు, వాడపాలెం, కొత్తపల్లెతుమ్మలపాలెం గ్రామ పంచాయతీల ప్రజలు ఐదేళ్లుగా ఉప్పునీరు తాగుతున్నారు. అప్రోచ్ నిర్మించ లేకపోయారు పల్లెతాళ్లపాలెం గ్రామం వద్ద తాళ్లపాలెం మేజర్ డ్రెయిన్‌పై నిర్మాణం చేసిన వంతెనకు అప్రోచ్‌ను నిర్మాణం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. గత పాలకవర్గం హయాంలోనే రూ.60 లక్షలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. సత్తెనపాలెం ఎస్సీకాలనీ, బోట్లవానిపాలెం గ్రామాలను కలుపుతూ పల్లెతాళ్లపాలెం గ్రామం మీదుగా కానూరు, పెదపట్నం సులువుగా చేరుకునేందుకు అప్పట్లో పేర్ని నాని ఈ వంతెన నిర్మాణం చేశారు. వంతెనకు ఒక వైపున అప్రోచ్ రోడ్డును నిర్మాణం చేసేందుకు ఓ రైతు వద్ద కొంత భూమిని కొనుగోలు చేయాల్సి ఉంది. సదరు రైతుకు పరిహారం మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. -
నయానో.. భయానో ఇచ్చేయండి
సాక్షి, విజయవాడ : ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షం ఆత్మ స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను నయానో..భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడుతోంది. ఎంతకైనా తెగిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంతకైనా తెగించేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధమయ్యారు. తిరువూరులో మంత్రి జవహర్ గెలుపు కోసం బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అక్కపాలెం అనే గ్రామంలో సర్పంచ్ భర్త నాగేశ్వరరావును టీడీపీ గూండాలు హత్య చేశారు. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తే నాగేశ్వరరావు వద్దకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలోని నాయకులు ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రక్షణ నిధి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణులు పనిచేయడం ప్రారంభించాయి. జగ్గయ్యపేటలో ఒక బీఎల్ఓను టీడీపీ అభ్యర్థులు బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ బీఎల్ఓకు అండగా నిలబడ్డారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించగా.. తమకు ఏమీ జరగలేదని బీఎల్ఓ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విజయవాడలో ఒక వైద్యుడిపై టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు అందరి ముందు వీరంగం వేసిన విషయం అందరికి తెలిసిందే.. అసభ్య పదజాలంతో ఆయన్ను దూషించడంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది పెద్ద వివాదం కావడంతో చివరకు ఆ వైద్యుడిని తన ఇంటికి పిలిపించుకుని బొండా సెటిల్ చేసుకున్నారు. ఇక గుడివాడలో టీడీపీ అభ్యర్థి, ఆయన అనుచరులను చూస్తుంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారిలో ఉన్న వర్గ తగాదాలకే ఒక యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడవద్దని, వారిని ఎదుర్కొవాల్సి వస్తే తానే ముందుకు ప్రాణాలను ఫణంగా పెడతానని అక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడాలి శ్రీవెంకటేశ్వరరావు ప్రకటించారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గన్నవరంలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రతిపక్ష కార్యకర్తలను బంధించి పెట్టుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది మైలవరంలో గెలుపుకోసం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆయన సభను భగ్నం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన అనుచరులు అంగబలం, ఆర్థికబలంతో గ్రామాల్లో ప్రతిపక్ష కార్యకర్తలను లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ అడుగడుగునా అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ బెదిరింపులు.. గత నాలుగున్నర ఏళ్లుగా గ్రామాల్లో పెత్తనం సాగించిన జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఏ మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఓటు వేసినా వారి తెల్లకార్డులు, పింఛన్లు రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత నెల రోజుల వరకు కౌంటింగ్ జరగదని ఈ లోగా తమ ప్రభుత్వం పింఛన్లు, కార్డులను రద్దు చేయిస్తామంటూ మైలవరం, నందిగామ, అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాల్లో జోరుగా బెదిరింపులకు దిగుతున్నారు. గత ఐదేళ్లుగా వారి పెత్తనం చూసిన గ్రామస్తులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మరోకవైపు తమ పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గుడివాడలో టీడీపీ నాయకుల బరితెగింపు
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా ప్రలోభాలకు తెరదీశారు. గుడివాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్‌ను ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాలకు నియమించటంతో వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2500 ఇస్తూ కెమెరాకు చిక్కారు. 200 మందికి పైగా మున్సిపల్ ఉద్యోగుల వద్ద నుంచి పోస్టల్ బ్యాలెట్లను తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. ఆధోనిలోనూ పోస్టల్ ఓట్ల కొనుగోలు మరో వైపు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నేతల ప్రలోభాలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు లాక్కుని దౌర్జన్యంగా టీడీపీ నేతలు ఓట్లేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాల్సిన అధికార పార్టీ, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కూడా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడంతో యువనేత జైమనోజ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. -
మైలవరం బహిరంగ సభలో వైఎస్ జగన్
-
బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్: వైఎస్ జగన్
సాక్షి, మైలవరం : మైలవరంలో దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడీయిజం టీడీపీ హయాంలో బాగా పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసగించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే మైలవరం నియోజకవర్గం నుంచి తన సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశానని గుర్తు చేశారు. ఇక్కడి పోలీసులు టీడీపీకి ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక డీఎస్పీ నాగేశ్వరరావు వైఎస్సార్సీపీ బహిరంగ సభలకు ఆటంకాలు కల్పిస్తున్నారని, సభ సజావుగా సాగకుండా ఉండేందుకు లారీలను రోడ్డుకు అడ్డంపెట్టి ఆటంకాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇసుకను ఇక్కడి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఏవిధంగా దోచుకుంటున్నాడో ప్రజలు ఒక్కసారి గమనించాలన్నారు. ప్రభుత్వమేమో ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటుంది..కానీ లారీ ఇసుక మార్కెట్లో రూ.40 వేలకు అమ్ముతున్నారు.. ఇసుక మీకు ఉచితంగా ఇస్తున్నారా అని ప్రజల్ని ప్రశ్నించారు. పుష్కరాల ఘాట్లు ఏమయ్యాయ్ ఇదే నియోజకవర్గంలో కృష్ణా పుష్కరాల సమయంలో వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్లు, రోడ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనుమతి లేని కంకర క్వారీలు నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మైలవరంలో టీడీపీ నాయకులు మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు గుప్పించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమ జలవనరుల శాఖా మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడి పంట పొలాలకు నీటి సౌకర్యం కల్పించలేని అసమర్ధుడన్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఏ మాత్రం నీళ్లు తీసుకురాగలిగాడని ప్రశ్నించారు. బుడమేరుపై తారకరామ ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. పోలవరం కుడి కాలువ పొడవు 174 కిలోమీటర్లు.. వైఎస్ హయాంలో 145 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు కేవలం రెండు కిలోమీటర్లు కాలువ తవ్వి అంతా మేమే పూర్తి చేశామని డబ్బా కొట్టుకుంటున్నాడు.. ఇలాంటి నాయకుల్ని ఏమనాలని ప్రశ్నించారు. మైలవరంలో ప్రజలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు. మామిడి రైతుకు దక్కని గిట్టుబాటు ధర మామిడి రైతులకు బంగినపల్లి టన్ను రూ.35 వేల ధర ఉంటే కానీ గిట్టుబాటు కానీ పరిస్థితి ఉందని, కానీ ప్రస్తుతం టన్నుకు రూ.8 వేలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అన్నారు. బాబు హయాంలో పంటలకు మద్ధతు ధర లభించే పరిస్థితి లేదన్నారు. బాబు వస్తే గవర్నమెంటు స్కూళ్లుండవ్! పొరపాటున మళ్లీ గనక బాబు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లు ఉండవన్నారు. ఇప్పటికే 6 వేల ప్రభుత్వ స్కూళ్లు అకారణంగా మూసేశారని ఆరోపించారు. స్కూళ్లలో టీచర్లను భర్తీ చేయరు..విద్యార్థులకు పుస్తకాలు అందించరు..మధ్యాహ్నా భోజన బిల్లులు సకాలంలో చెల్లించరు..బాబు పాలన ఈవిధంగా ఉందని ఎద్దేవా చేశారు. బాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు మూసేసి నారాయణ స్కూళ్లు తెరుస్తారని ఆరోపించారు. నారాయణ స్కూళ్లల్లో సంవత్సరానికి ఎల్కేజీ చదవాలంటే ప్రస్తుతం రూ.25 వేలు అవుతోందని, పొరపాటున బాబొస్తే ఫీజు లక్ష రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రస్తుతం రూ.లక్ష అవుతోందని, బాబొస్తే గనక ఈసారి రూ.5 లక్షలకు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. చార్జీలు బాదుడే బాదుడు.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆర్టీసీ, కరెంటు చార్జీలు ఎలా పెంచాడో అందరికీ తెలుసునని, ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, పెట్రోలు, డీజీల్ రేట్లు ఎలా పెరిగాయో అందరూ చూశారు..మళ్లీ గనక బాబొస్తే ఇక వీరబాదుడేనని వ్యాఖ్యానించారు. బాబు అధికారంలోకి రాకముందు 46 లక్షల పెన్షన్ కార్డులు ఉండేవని, అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్ కార్డులు తొలగించాడని ఆరోపించారు. చంద్రబాబు భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఆయన గనక మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములకు రక్షణ ఉండదని అన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ఏర్పాటు చేశారని, ఊర్లో పేదలకు ఏమి ఇవ్వాలన్నా కూడా వారు మీది ఏపార్టీ అని అడుగుతారని అన్నారు. మీరు ఏ సినిమా, టీవీ, పత్రిక చూడాలో కూడా వారే నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు ప్రధాన పాత్రలో ఈ నడుమ మహానాయకుడనే ఒక సినిమా వచ్చింది.. చాలా బాగుందట..అందరూ చూడాలట.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం చూడకూడదట.. పరిస్థితి ఇది.. మీరు ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదో వారే నిర్ణయిస్తారు.. ఒకసారి గమనించాలని కోరారు. బాబు వస్తే ఉచిత విద్యుత్ ఉండదు పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌కు బాబు మంగళం పాడతారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రూ.1000 పైన ఖర్చు అయ్యే ప్రతి జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. గ్రామానికి 10 ఇళ్లు కూడా బాబు హయాంలో నిర్మించలేదని తెలిపారు. జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తే గానీ పనులు కావటం లేదన్నారు. బాబు గతాన్ని ఒక్కసారి పరిశీలించండి.. 1994 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ మద్యనిషేదం, కిలో 2 రూపాయలకే బియ్యం పథకాలు పెట్టింది.. అధికారంలోకి రాగానే చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. కిలో బియ్యాన్ని 2 నుంచి ఐదున్నర రూపాయలకు పెంచాడు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు. మాట తప్పడం చంద్రబాబు నైజమని ప్రజలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కోరారు. బాబు గనక పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే తనను వ్యతిరేకించే ఎవ్వరినీ బతకనీయడని ఆరోపించారు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు నచ్చిన పోలీసులను పెట్టుకుని, సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను ఏపీలోకి రానీయకుండా జీవోలు జారీ చేశాడని చెప్పారు. మనుషుల్ని చంపించి వాళ్ల బంధువులే చంపారని చిత్రీకరిస్తాడని, టీడీపీ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ అరాచకాలను చూయించవని వెల్లడించారు. బీసీలు జడ్జి పోస్టులకు పనికిరారని కొలీజియానికి చంద్రబాబు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టో నెరవేర్చకపోతే రాజీనామా చేసే పరిస్థితికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. 20 రోజులుగా చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ9, టీవీ5 ఛానళ్లు రోజుకొక పుకారు పుట్టించి చర్చ జరుపుతున్నాయని అన్నారు. డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త ఎన్నికలకు ఒక రోజు ముందు ప్రతిగ్రామానికి డబ్బుల మూటలతో వస్తారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. బాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల మహిళల రుణాలన్నీ నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామన్నారు. అలాగే సున్నావడ్డీకే మళ్లీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడాది మే నెలలో రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తామని వెల్లడించారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు చెల్లిస్తామన్నారు. పిల్లలను బడులకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15వేలు అందిస్తామని చెప్పారు. అవ్వా, తాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వర ప్రసాద్‌లను ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త: షర్మిల
సాక్షి, నూజివీడు: ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించారు.. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో నారా చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలని వైఎస్సార్సీసీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసగించారు. వైఎస్ఆర్ హయాంలో ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా సంక్షేమ పథకాలు అమలుపరిచారని, కుల, మత, పార్టీలకతీతంగా పేదవారికి మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పదవికి అవమానం తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అధికారం పోతున్న సమయంలో పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేశారని ఆరోపణలు గుప్పించారు. రాజధానిలో పర్మినెంట్ బిల్డింగ్లు లేవు ఐదేళ్లు రాజధానిలో ఉండి ఒక్క పర్మినెంటు బిల్డింగ్ కట్టలేకపోయారని, కనీసం ఐదేళ్లలో దుర్గగుడి ప్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట..శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట.. నమ్ముతారా అని ప్రజలని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కానీ లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చిందన్నారు. ఏం అర్హత ఉందని లోకేష్ 3 శాఖలు కేటాయించారు? ఇది పుత్రవాత్సల్యం కాదా అని సూటిగా అడిగారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడతారు.. పూటకో వేషం వేస్తారు.. బాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌తోనే ప్రత్యేక హోదా సజీవం నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను నీర్చుగార్చారని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారు.. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు..ఒకే విషయంపై పదేపదే మాట మారుస్తూ యూటర్న్లు తీసుకుంటున్న చంద్రబాబును నమ్మాలా వద్దా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్‌గానే వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్‌గానే వస్తుందని షర్మిల అన్నారు. చంద్రబాబు మాత్రం 2014లో బీజేపీతో, 2019లో కాంగ్రెస్‌తో, పరోక్షంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల కోసమే చంద్రబాబు, మీ(ప్రజల) భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు.. ఈ ఐదేళ్లు మీ బాధ్యత కనిపించలేదా? లోకేష్ బాధ్యతే కనిపించిందా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో లోకేష్, హెరిటేజ్ కోసమే చంద్రబాబు పనిచేశారని విమర్శించారు. డబ్బుల మూటలతో వస్తారు..జాగ్రత్త ఎన్నికలకు ఒక రోజు ముందు గ్రామాల్లో టీడీపీ నాయకులు డబ్బుల కట్టలతో వస్తారు.. చేతిలో రూ.3 వేలు పెడతారు.. డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటేయండని ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్ఫోన్లు ఇస్తానన్నాడు.. ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.లక్షా ఇరవై వేలు బాకీ ఉన్నారు.. టీడీపీ నాయకులు ఓటేయాలని అడిగితే ఈ బాకీలన్నీ ఎన్నికల ముందే తీర్చాలని అడగండని సూచించారు. ప్రతి రైతుకు రూ.12,500 ల పెట్టుబడి సాయం ప్రతి రైతు కుటుంబానికి మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని, అలాగే పిల్లలను బడులకు పంపిన తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్ అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామని, అలాగే సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ప్రజలకు మేలు చేసేవాడు కావాలంటే జగనన్న రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడు వస్తే అప్పుడు రాష్ట్రంలో కరవు వస్తుందని అన్నారు. బైబై చంద్రబాబు..ఇదే ప్రజాతీర్పు కావాలన్నారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్సార్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ను, నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుని గెలిపించాలని కోరారు. -
డిపాజిట్ దక్కితేనే గౌరవం..!
సాక్షి, మచిలీపట్నం : ఒక్క ఓటు తక్కువైనా పర్లేదు.. డిపాజిట్ మాత్రం వచ్చేటట్టు చూస్కో.. అన్నట్లుంది బరిలోకి దిగే అభ్యర్థుల పరిస్థితి. సార్వత్నిక ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు ఇరు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండిపెండెంట్, ఇతర పార్టీల నుంచి అధిక మంది బరిలోకి దిగారు. ఈ సారి పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండటంతో.. అంతగా ప్రజాదరణ లేని పార్టీల తరపున, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారు ఓట్లు రాబట్టుకుని ఎలాగైనా డిపాజిట్ మొత్తం వెనక్కు తీసుకునే ప్రయత్నాలు సైతం చేస్తుండగా.. మరి కొందరు తాము పోటీ చేశామన్న ప్రఖ్యాతి గడించేందుకు ఉర్రూతలు ఊగుతున్నారు. మరికొంత మంది తమకు డిపాజిట్లు దక్కకపోతే ప్రజల్లో శృంగభంగం తప్పదన్న భావనలో ఉన్నారు. బరిలో 232 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీకు 205 మంది పోటీలో నిలిచారు. పార్లమెంట్‌కు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ మాత్రమే అభ్యర్థి కేవలం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించారు. అయితే పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందితేనే డిపాజిట్లు ఇస్తారు. లేకపోతే ఆ డబ్బులన్నీ ఖజానాలోకి చేరుతాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరం పోలైన ఓట్లలో డిపాజిట్లు పొందిన వారికి మాత్రమే తిరిగి వస్తుంది. దీంతో గౌరవప్రదంగా డిపాజిట్ దక్కించుకునేలా ఓట్లు పొందాలని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అసెంబ్లీకు, పార్లమెంట్‌కు సగం డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవార్గల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా డిపాజిట్ నగదు వెనక్కు వస్తుంది. రూ.26.95 లక్షల డిపాజిట్ త్వరలో జరగబోయే ఎన్నికలకు డిపాజిట్ నగదు పారింది. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది బరిలో ఉండగా.. వారి ద్వారా రూ.6.75 లక్షలు, 16 శాసనసభ స్థానాలుండగా.. అందులో 3 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. 13 నియోజకవర్గాల పరిధిలో 172 మంది బరిలో ఉండగా..రూ.17.20 లక్షలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో 33 మంది అంటే.. రూ.1.65 లక్షలు సెక్యురిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులు సేకరించారు. -
మందలగిరి మాలోకం
సుశీలక్కా.. ఓ సుశీలక్కా.. ఇంకా రడీ కాలేదేంటే.. అంటూ వచ్చింది వనజాక్షి సుశీల : ఆ.. ఇంట్లో పాచి పనులన్నా అవ్వొద్దంటే వనజ.. అన్ని పనులూ నేనే చూసుకోవాల. ఇదిగో ఉక్కరవసేపు ఉండవే వత్తన్నా.. వనజ : ఇయ్యాల ఆదివారం కదా .. మరి పిల్లలను ఏం సేత్తన్నవ్.. సుశీల : పిల్లోల్లు కూడా మనెంటే తీసుకెళదాం.. ఆళ్లే తిరగతారు.. వనజ : అమ్మో.. బైట అగ్గి చూడక్కా.. ఎట్టుందో.. మనమే మాడిపోతన్నం.. పిల్లలు తట్టుకోలేరు.. వద్దులే అక్క.. సుశీల : మరి ఏం సెయ్యాలే.. ఆదివారమైనా ఆయన రిచ్చా తొక్కితేనే కదా.. నాలుగు డబ్బులొచ్చేది.. ఇంటి దగ్గర వోరుంటారే.. ఇంతలో ఆ వీధిలో నాలుగు అక్షరం ముక్కలు చదువుకున్న పద్మ అక్కడికి వచ్చింది. పద్మ : ఏంటి అక్కాచెల్లెళ్లు ముచ్చట్ల మీదున్నారు.. వనజ : అవునక్కా.. ఇయ్యాల .. మన ముక్కమంత్రి కొడుకు లోకేశంబాబు ప్రచారమంట.. పిలిత్తే ఎలతనం..ఒక్కోరికి ఐదొంతలు నుంచి ఎయ్యిదాకా ఇత్తన్నారులే.. సుశీల : అవునమ్మా.. ఆదివారం కదా.. ఏవో నాలుగు డబ్బులొత్తాయని మేమూ వత్తామని సెప్పాం.. మన ఈది సివర తెలుగుదేశం ఆయన ఈ పని కుదిర్చాడు. పద్మ : అవునా.. సరేలే వనజ వెళ్లండి.. మరి పిల్లల సంగతేంటి ? సుశీల : అదే అక్క.. మా ఎంట తీసకెళదామనుకుంటున్నాం.. పద్మ : అమ్మో.. ఆ లోకేశంబాబు మీటింగ్‌లకు పిల్లలను తీసుకెళ్లొద్దమ్మా.. వాళ్లకు వచ్చే నాలుగు అక్షరాలు కూడాపోతాయి. కావాలంటే పిల్లల దగ్గర నేనుంటా.. మీరే వెళ్లిరండి. సుశీల : అదేంటక్కా.. అలా అంటవ్.. ఆయన ముక్కమంత్రి కొడుకు కదా.. ఆయన మాట్టాడితే.. ఏమైతదక్కా.. పద్మ : ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల గురించి చెబుతా వినవే..మంగళగిరిలో ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి లోకేశం బాబు నాలుక మడతపడని రోజు లేదు. తెలుగుకు తెగులు పుట్టించని రోజు లేదు.వచ్చిన రోజునే మంగళగిరిని మందలగిరిగా మార్చేశాడు. గుంటూరును గుంత్రు అనేశాడు. వనజ : అవునా.. మన పిల్లొల్లు కూడా సక్కగా అంటరు కదక్కా.. ఆయనకేమైనా నాలిక మందమా! పద్మ : అదేమో తెలియదే.. లోకేశం బాబు ప్రచారం మాత్రం మంగళగిరి ప్రజలకు మంచి కామెడీ షోలా అనిపిస్తుంది. సగం మంది జనం ఆయన చెప్పే మాటలు విని నవ్వుకోవడానికే వెళుతున్నారంట. సుశీల : ఆయన ఈ ఒక్క మాట సెబితే ఏమైతదిలే అక్కా! పద్మ : అమ్మో.. ఆ ఒక్కటి ఏంటే ఆయన మాట్లాడే ప్రతి మాటా.. ఆణిముత్యమేనని సోషల్ మీడియాలో తెగ జోకులు వేసుకుంటున్నారు..ఇదిగో మంగళగిరి వచ్చిన రెండో రోజే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న ‘వైఎస్ వివేకానంద రెడ్డి మృతితో పరవశించాన’ని బహిరంగంగా చెప్పాడు. మరి అది కావాలని అన్నాడో. మనసులో ఉన్నది అన్నాడో.. ఇదీ నాలుక మడతో అర్థం కాలేదే.. కానీ పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన వాహనం వెంట ఉన్న వాళ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.. వనజ : పోనీలే అక్క అదేదో.. అనుంటాడులే.. పద్దాక.. రాజికీయాలే మాట్టాడతారు కదా.. అందుకే అట్ట వచ్చుంటదిలే.. పద్మ: అదొక్కటి కాదే.. ఇంకా ఉన్నాయి.. లోకేశం బాబు గురించి..ఆ మాటలు వింటున్న మంగళగిరి ప్రజలు.. ఈయనకు మంగళగిరి మాలోకం అని పేరు పెట్టేశారే.. సుశీల : అవునా అక్కా.. పాపం అదేందే.. పద్మ: అవును మరి.. రెండు రోజుల క్రితం మంగళగిరిలో మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన తనకు ఓట్లేసి గెలిపించాలని చెప్పారు.. మళ్లీ జనం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సుశీల : అదేంటక్కా.. ఎలచ్చన్లు వచ్చే నెల 11న అంటన్నారుగా..! పద్మ : అవునే ఎలక్షన్స్ ఏప్రిల్ 11వ తేదీనే.. ఏం చదువుకోని నీకే ఈ విషయం గుర్తుంటే.. రాష్ట్రానికి మంత్రిగా పని చేశాడు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తన్నాడు. పైగా ముఖ్యమంత్రి కొడుకు.. ఆయనకు ఈ మాత్రం తెలియకపోవడం ఏమిటో.. కొంచెం కూడా అర్థమై చావట్లేదు. నిన్నటికి నిన్న తనను ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరాడు.. ఇది విన్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు ఉన్నవే 2.50 లక్షల చిల్లర. వనజ : మరి ఐదు లచ్చల ఓట్లు ఏడ నుంచి తేవాలక్కా.. అదేందే అట్ట మాట్టాడ్డం.. సుశీల : అయినా ఈ నాయకులంతా ఏదో కాగితంలో ముందుగనే రాసుకుని సదువుతరంటగా.. అట్ట కూడా ఈయన సదవలేదా ! పద్మ : ఎందుకు చదవలేదే.. ఈయనగారి కోసం ముఖ్యమంత్రి గారు.. ఏకంగా తెలుగు క్లాసులే చెప్పించారు.. కానీ లోకేశం బాబుకే వంట బట్టల! 1980 నుంచి మంగళగిరిలో టీడీపీ గెలిచిందే లేదన్నాడు. వనజ : అవునా.. గెలిచినట్లున్నారుగా అక్కా.. పద్మ : 1980లో తెలుగుదేశం పార్టీనే పెట్టలేదే..కానీ మంగళగిరి మాలోకానికి అదీ తెలియదనుకుంటా. ఇవే కాదే.. గతంలోనూ ఆయన పదే పదే నోరు జారడం.. తరువాత నాలుక కరుచుకోవడం చాలాసార్లు జరిగాయి. అంబేడ్కర్ జయంతి రోజున.. వర్ధంతి అనేశాడు. అవినీతి, అరాచకమైన పార్టీ ఏదైనా ఉందంటే .. అది తెలుగుదేశం పార్టీనే అని సెలవిచ్చాడు. వనజ : అమ్మో.. అదేందక్కో.. ఆళ్ల పారిటీ గొప్పలు తెగ సెప్పేసుకుంటరుగా.. మరి ఈయనేంది ఇట్టా సెప్పారంటన్నవ్.. పద్మ : అవునే.. చాలా మంది జబర్దస్త్ కామెడీ షో బదులు.. యూట్యూబ్‌లో లోకేశం బాబు వీడియోస్ చూసి నవ్వుకుంటున్నారే.. ఇప్పుడు పిల్లలవి అంతా ఇంగ్లిష్ మీడియం చదువులు.. లోకేశం బాబు సభల దగ్గరకు వెళితే వచ్చే నాలుగు ముక్కల తెలుగు కూడా రాకుండా పోతుంది. అదీగాక జనరల్ నాలెడ్జ్ విషయంలోనూ ఆయన తడబాటుకు వీళ్లకు సవాలక్ష డౌట్లు వస్తాయి. సుశీల : అమ్మో.. నా పిల్లలను ఆ సభలకాడకి పట్టకెల్లను. నీకాడే ఉంచక్కా.. మద్దానం..ఆళ్ల అయ్య వత్తడులే.. పద్మ : సరే వెళ్లిరండి.. లోకేశం బాబు ప్రసంగం మాత్రం వినకండి.. అక్కాచెల్లెళ్లు సభకు వెళ్లొచ్చాక అదే రోజు సాయంత్రం పద్మ దగ్గరకు వెళ్లారు. సుశీల : అక్కా.. ఆళ్లెంట తిరగాం.. తలా ఐదొంతలు ఇచ్చారులే.. లోకేశం బాబు అదేందో అన్నాడంటక్కా.. జనం తెగ నవ్వుకుంటన్నరు..ఏదో పోరుటు సంగతంట.! పద్మ: (ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ) అవునే.. ఈ రోజుకు కూడా లోకేష్ బాబు.. మరో జోక్ పేల్చాడు.. ఇదిగో ఈ వీడియో చూడు. మచిలీపట్నం పోర్టును కేసీఆర్ తీసుకెళతాడంట! వనజ : హైదరబాద్‌లో సముద్రం ఏడదక్కా! పద్మ : అవును .. లోకేశం బాబు చెప్పే మాటలన్నీ ఇంతే ఉంటాయి. సుశీల : ఈ మాటంటే నాకోటి గుర్తుకొత్తాంది.. అదేదో సినమాలో సీకాంత్ కూడా.. ఇంతే అంటడు.. హైదరబాద్‌కు సముద్రాన్ని తీసకొత్తనని. అప్పుడు.. ఇదెట్టా కుదిరిద్దబ్బా అనుకున్నం.. లోకేశం బాబు సెబితే.. తెలుత్తుంది. ఆయన తెచ్చే సముద్రంలోకేననుకుంటా కేసీఆర్ సర్ పోరుటు తీసకెల్లేది. ఇది విన్న అక్కాచెల్లెళ్లు ఒక్కసారిగా పకపకా నవ్వుకుంటూ ఇంటి దారి పట్టారు. -
కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్‌కు షాక్!
సాక్షి, కృష్ణా : జనసేన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే డీవై దాసు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం జనసేన పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీనుంచి పోటీ చేయాలని జనసేన నేతలు ఆహ్వానించారని, జనసేనలో చేరిన తర్వాత బీఎస్పీనుంచి పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పామర్రు టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం తనను బలిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన ముసుగు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీ-ఫాం ఇస్తానని 13గంటల పాటు జనసేన ఆఫీసు వద్ద నీరక్షణ చేయించారని, ఆ తర్వాత బీఎస్పీ ఎంపీని కలవాలంటూ నాదెండ్ల మనోహర్ సూచించారని తెలిపారు. టీడీపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీని ఓడించటానికి రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. -
కరుణించవమ్మా మహాలక్ష్మి..
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్‌కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్‌కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
ఉత్తుత్తి వాగ్దానాల బాబు !
సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎదురుమొండి వారధి ఏమైంది? గత ఏడాది నవంబర్ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి శూన్యం పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు. చుక్కలు చూపిస్తున్నారు దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు. రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా? దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు కోడూరు పీహెచ్‌సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్‌డ్యాంలు (రబ్బర్ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు. విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. రూపాయి బోనస్ ఇవ్వలేదు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్‌కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్‌కు రూ.200 బోనస్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్ ఇవ్వలేదు. – గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు -
సమస్యలు కో‘కొల్లు’లు..
సాక్షి, మచిలీపట్నం : ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర చేసింది శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లు స్వగ్రామంగా చెప్పుకునే ‘గరాల దిబ్బ’ సమస్యలతో సతమతమవుతోంది. ‘మంత్రి మనోడే’ నని సమస్యలు తీరకపోతాయా...? అని ఐదేళ్లు పాటు ప్రజలు ఆశగా ఎదురుచూసినప్పటకీ, మౌలిక వసతులు మెరుగపడలేదు. గ్రామంలో అంతా మత్స్యకారులే. నిరుపేదలైన వీరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు కూడా సవ్యంగా అందలేదు. తాగునీటికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. తమ ఇబ్బందులు చెబితే ఎక్కడ తమకు వచ్చే సంక్షేమ పథకాలకు అడ్డం పడతారేమోననే ఆందోళన ఇక్కడి ప్రజానీకంలో ఉంది. అర్హులకు అందని పథకాలు గ్రామంలో అర్హులకు రేషన్ కార్డులు లేవు. చదువులపై మంచి ఆసక్తి చూపే యువత ఉన్న గ్రామంలో ఒకప్పుడు 72 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక్కడి వారు ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. గ్రామం చుట్టూ అసైన్డ్ భూములున్నా తాతలు, తండ్రులు నాడు ఇచ్చిన హక్కు పత్రాలే దిక్కయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఇవ్వకపోవటంతో ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు నివసిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. మురుగు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లవద్దనే నిల్వ ఉంటున్నాయి. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీ రోజూ‘పానీ’ పాట్లే! గరాలదిబ్బ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో చేతిపంపులు ఉన్నప్పటకీ, ఉప్పునీరు కావటంతో మునిసిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరే ఆధారం. ఇవి కూడా రోజు విడిచి రోజు వస్తుంటాయి. దీంతో నల్లాల నుంచి వచ్చే సన్నటి ధార కోసం బిందెలు పట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. తాగునీటికి కష్టాలు బిందెడు మంచినీళ్లు పట్టుకునేందుకు పైపుల వద్ద గంటల తరబడి ఉండాలి. వీధుల్లో ఉన్న నల్లాల వద్ద మంచినీళ్లు పట్టుకునేందుకు బిందెలు ముందుగానే వరుసుగా పట్టాలి. రోజులో ఒక్కసారి అది కూడా ఒక గంట మాత్రమే నీళ్లు వస్తుంటాయి. చేతి పంపులు ఉన్నప్పటకీ, ఉప్పు నీరు కావడంతో తాగలేం. నల్లాల నుంచి వచ్చే నీరు రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. – కె.జయంతి ఆర్భాటపు ప్రచారం నిరుద్యోగ భృతి మంజూరు చేయాలంటూ అధికారులకు అర్జీ ఇచ్చాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. డిగ్రీ చదివి కుటుంబం గడువడానికి కూలి పనులకు వెళ్తున్నాను. ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలే తప్ప నాలాంటి అర్హులైన వారికి న్యాయం చేయటం లేదు. – ఒడుగు దుర్గారావు -
కోడ్‌కు అడ్డంగా సవారీ
సాక్షి, ఘంటసాల : ఎన్నికల నిబంధనలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ మాకేం పట్టిందంటూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిన అధికారులు మాత్రం కేవలం తమ కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. మండల కేంద్రమైన ఘంటసాల హైస్కూల్లో విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సైకిళ్లను సిద్ధం చేస్తున్నారు. మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న 212 మందికి పంపిణీ చేసేందుకు కొత్త సైకిళ్లను ఇటీవల తీసుకువచ్చారు. స్కూల్లోనే రహస్యంగా పార్టులు అమర్చుతున్నారు. స్థానిక హైస్కూల్ వద్ద సైకిళ్లు బిగించే విషయమై ఎంఈఓ బీహెచ్‌సీ సుబ్బారావును సాక్షి వివరణ కోరగా సైకిళ్ల పంపిణీ విషయంలో తమకు సంబంధం లేదని, సంబంధిత కాంట్రాక్టర్‌కు షెల్టర్ కల్పించడం వరకే తమ పని అని మండలంలోని అన్ని హైస్కూల్స్‌కు సంబంధిత కాంట్రాక్టరే సైకిళ్లు పంపిణీ చేస్తాడని చెప్పారు. -
బయటకెళ్తే భయమేస్తోందమ్మా
సాక్షి, కృష్ణా : ఏం వదినా.. ఏం కూర వండుతున్నావు.. ఇవాళ..’’అప్పటికే కూరలు తరుగుతున్న పుల్లమ్మ.. తప్పదుగా రమణమ్మా... సాయంత్రానికి ఏదోకటి వండిపెట్టాలి..ఉదయం వండింది పిల్లలు తినడం లేదు..అవునూ, పెద్దమ్మాయి ఏదీ.. ఇంట్లో కనపడటం లేదే..‘ఇవాళ కాలేజీ ఉందంటా.. పొద్దున్నే వెళ్లింది.. ఈపాటికే రావాలి.. టైం కూడా ఆరు అవుతోంది.ఎటువెళ్లిందో ఏమిటో.అవును వదినా, బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఇంటికి క్షేమంగా వస్తారన్న గ్యారంటీ లేకుండా పోయింది. ప్రభుత్వం వాళ్లు ఏవేవో చేశామంటున్నారేగానీ ప్రభుత్వాధికారులకే రక్షణ కల్పించ లేకపోతే మనవంటి వాళ్ల పరిస్థితి చెప్పేదేముంటుంది’నిజమేనమ్మా.. కలికాలం.. మన చిన్నతనంలో ఇంత భయమే లేదు. మహిళపై ఎన్నెన్ని అఘాత్యాలు జరిగుతున్నాయో పత్రికల్లో, టీవీల్లో వస్తున్నాయి... చూశావా.. రామలక్ష్మి : అవును తులశి అంత కంగారుగా ఉన్నావు.. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా! నీ ముఖంలో ఎప్పుడూ అంత ఆందోళన చూడలేదే.. తులశి : ఏం చెప్పను.. రామలక్ష్మక్క.. చదువు కోసం వెళ్లిన అమ్మాయి రాధ ఇప్పటికీ ఇంటికి రాలేదు.. రోజులు చూస్తే బాగాలేదు.. ఏం జరిగిందో ఏంటో.. కంగారుగా ఉంది.. రామలక్ష్మి : ఏమీ కాదులే తులశి బస్సు టయానికి రాలేదోమే.. కంగారు పడకు.. వచ్చేస్తుందిలే .. తులశి : ఏం లేదక్క.. ఈ మధ్య వరుసగా జరుగుతున్న బాలికలపై అఘాయిత్యాలు, హత్యలు చూసి భయమేస్తోంది.. పిల్లలను బయటకు పంపితే వచ్చే వరకు దినదినగండంగా మారింది.. పెరంటాలు (పనిమనిషి) : అమ్మగారు.. మీ మాటకు అడ్డు వస్తున్నానని ఏం అనుకోవద్దండి.. ఈ ప్రభుత్వంలో ఆడోళ్లకు రక్షణ లేదండీ.. అప్పట్లో ఏకంగా మహిళా తహసీల్దారు వనజాక్షిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎవరేం చేయలేకపోయారు.. మళ్లీ ఆయనగారికే సీటిచ్చారు.. ఏంటండీ ఇంత దారుణం.. నీలాంబరి (పక్కింటావిడ) : ఓసీ పిచ్చి పెరంటాలు.. రాజకీయ నాయకులు అంటే అంతే నే మీటింగులలో మహిళ రక్షణే మా కర్తవ్యం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు.. మనపై దాడులు జరిగితే వాళ్ల మనుషులను కాపాడుకోడానికి ఎంతకైన తెగిస్తారు.. రామలక్ష్మి : మహబాగా చెప్పావు.. నీలాంబరి.. విజయవాడలో కాల్‌మనీ విషయాన్నే తీసుకోండి.. అధికార నాయకులు అవసరానికి డబ్బులిచ్చి.. మహిళలతో ఎంచక్కా నీచమైన పనులు చేయించారో గుర్తుందా.. ఎన్ని కేసులు పెడితే ఏంటి.. మళ్లీ వాళ్లు అదే కాల్‌మనీ చేస్తున్నారు.. ఇదేక్కడి న్యాయం పెరంటాలు : అద్సరేగాని అమ్మగారు... నాకు తెలియక అడుగుతున్నాను.. చంద్రబాబుగారు..మొన్న ఎన్నికల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.. అవి ఎక్కడా కనిపంచవేమిటీ.. తులశి : నిజమే పేరంటాలు.. ఈ విషయం మాకు గుర్తులేదు.. పర్వాలేదే.. లోకజ్ఞానం బాగానే ఉంది.. పోలీసు స్టేషన్లే కాదు.. ఏకంగా మహిళలకు ప్రత్యేక బస్సులు వేస్తామన్నారు.. రాజకీయ నాయకుల హామీలు అంటే ఇంతేనే.. చెప్పింది చేయరు.. కనకమ్మ : (వస్తూ వస్తూనే.) మాయదారి మద్యం,. తాగుబోతు సచ్చినోట్లు .. పనీపాట లేదు.. అంటూ తిట్టుకుంటోంది.. రామలక్ష్మి : ఏంటీ కనకమ్మ ఎవరిని తిడుతున్నావు.. కనకమ్మ : ఏ చెప్పనమ్మ.. మా వీధి చివరనే బెల్టు షాపు పెట్టారు.. గాలిసచ్చినోళ్లంతే అక్కడే తాగి మీదకు వచ్చేస్తున్నారు.. ఆడోళ్లంటే గౌరవం లేకుండా పోయింది.. చీ.. ఛీ రామలక్ష్మి : చంద్రబాబు మొన్న ఎన్నికల్లో బెల్టు షాపులు అనేవి ఉండవన్నారు.. అది నెరవేర్చలేదు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మరిన్నింటికి అనుమతులు ఇచ్చారు. తులశి : అందుకే అక్క.. ఈ సారి రాజశేఖరరెడ్డి కొడుకు జగన్‌బాబుకు ఓటేద్దామనుకుంటున్నా.. ఆయనొస్తే మహిళలకు మేలు జరుగుతుందనే నమ్మకం నాకుంది.. పెరంటాలు : అమ్మా గారు.. అదిగో రాధమ్మ వచ్చేసింది.. తులశి : రాధ ఇంత లేటెందుకయ్యిందమ్మా.. ఎంత కంగారుపడ్డామో... తెలుసా రాథ : బస్టాండు దగ్గర ఓ ముసలావిడ ఎండలకు కళ్లు తిరిగిపడిపోయిందమ్మా.. దెబ్బలు తగిలాయి.. అందరం కలసి ఆస్పత్రికి తీసుకెళ్లాం.. అందుకే లేటయ్యింది.. తులశి : ఎంత మంచి పనిచేస్తావమ్మా.. రా ఏమైనా తిందువుగాని.. అంటూ అందరూ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. రాథ : అమ్మా, వీధి చివర మద్యం కొట్టువద్ద మందుబాబుల గొడవ ఎక్కువగా ఉంది.. సాయంత్రమైతే గొడవలు చేస్తున్నారు. ఒక్కళ్లమే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.. తులశి : నేను వీధి చివరి దాకా వచ్చి నిలుచుంటాలేమ్మా.. నీవు కాలేజీ బస్సు దిగిన తరువాత ఇద్దరమూ కలిసే ఇంటికొద్దాం. రాథ : ఇలా ఎన్నాళ్లమా? తులశి : తప్పదమ్మా.. మళ్లీ స్వర్ణయుగం పాలన వచ్చే వరకు.. -
అధికారుల డేగ కన్ను..
సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వానికి తెరలేవడంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా మైక్సెట్లు, డప్పులమోత మోగుతోంది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రచార హోరు జోరుగా సాగుతోంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీల నాయకుల కదలికలను నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులు పెడుతున్న ఖర్చు, వినియోగించే సామగ్రి, ఉపయోగించే వాహనాలపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. అభ్యర్థుల ప్రతి కదలికపై అధికారులు డేగ కన్ను వేశారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తున్న అభ్యర్థులు చేసే ఖర్చుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి మించి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. అయితే అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎలా ఖర్చుపెడుతున్నారు అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతిదీ లెక్కే.. ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్నఖర్చులు,లౌడ్ స్పీకర్లు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు తదితర వాటికి అయ్యే ఖర్చును పరిశీలించేందుకు, సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు ఐఆర్ఎస్ అధికారులు జిల్లాకు వస్తున్నారు. వీరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచార శైలిని పరిశీలించనున్నారు. అభ్యర్థుల ఖాతాలను అతని అనుమతితో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అలాగే నియోజకవర్గాల ఆర్వోలు కూడా ఎన్నికల ప్రచార శైలిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రచారాన్ని రికార్డింగ్ చేయనున్న సిబ్బంది జిల్లాలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని చేయాల్సి ఉంది. ప్రచారం చేసే అభ్యర్థులను వీడియో సర్వీయలెన్స్ టీం వెంబడిస్తుంది. సంబంధిత అధికారులు వీడియో కెమెరాలతో రికార్డింగ్ చేస్తున్నారు. జెండాలు, బ్యానర్లు, ర్యాలీలు, హంగు ఆర్భాటాలు ఇలా ప్రతి ఒక్కదానికి చేసే ఖర్చును ఎన్నికల అధికార యంత్రానికి అప్లోడ్ చేస్తారు. ఈ మొత్తాన్ని అధికారులు లెక్కల్లో రాస్తారు. కార్యకర్తలకయ్యే భోజనాలు, అల్పాహారం, టీ, కాఫీలు కూడా లెక్కలోకి వస్తాయి. అధికారులతో పాటు ఎన్నికల సంఘం నూతనంగా ఈ ఏడాది ఆవిష్కరించిన సీ–విజల్ యాప్‌నకు ఎవరైనా అనుసంధానం చేసినా వాటికి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. అభ్యర్థులు చేస్తున్న ఖర్చు వివరాలు దాచాలన్నా దాగవు. నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఎవరైనా ఓటర్లను భయపెట్టినా, ప్రలోభపెట్టినా సమీపంలో ఉన్న అధికారులు, పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించాలి. ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ -
‘నీకు, నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే’
కృష్ణా జిల్లా: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగేశ్వర రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే దేవినేని ఉమ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గణపవరంలో తనపై మంత్రి ఉమా వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. కొంగర మల్లయ్య అనే పదం వాడే ముందు నీ(ఉమ) రాజకీయ చరిత్ర గుర్తు చేసుకోవాలని సూచించారు. నీకు(ఉమ), నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని గుర్తు చేశారు. తనకు కాళ్లు లేకపోయినా మాట్లాడే సత్తా ఉంది ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కొంగర మల్లయ్య లేస్తే మనిషిని కాదు అన్నాడేమో కానీ వసంత నాగేశ్వర రావు లేస్తే దేవినేని ఉమ పాలిట భయంకరుడని సమాధానమిచ్చారు. స్టీఫెన్ హకింగ్ అనే ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన ఖగోళ శాస్త్రవేత్తకు కూడా కాళ్లు లేవని, కానీ ఖగోళ శాస్త్రంలో ఆయన అద్భుతాలు కనిపెట్టాడని గుర్తు చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జైపాల్ రెడ్డిని కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తనకు ఒకప్పుడు కాళ్లు ఉండేవి.. దేవినేని కుటుంబానికి ఊతం ఇచ్చి ఇప్పుడు కాళ్లు లేకుండా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాళ్లు ఉన్నా లేకపోయినా తాను చేయాల్సిన పాత్ర తాను చేస్తానని చెప్పారు. తన గురించి ఇంత మాట్లాడుతున్నా వంటే ఈ కాళ్లు లేనోడిని చూసి భయపడి ప్రతిసారీ తన ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నావని ప్రశ్నించారు. దేవినేని ఉమ ఓటమి భయంతోనే ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. మైలవరం నియోజకవర్గం ప్రజలు నిన్ను(దేవినేని ఉమ) ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని, నువ్వు కూడా తట్టా బుట్టా సర్దుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. -
కృష్ణాలో.. వనితే నిర్ణేత
సాక్షి, మచిలీపట్నం: జిల్లా ఓటర్ల జాబితాలో మళ్లీ ఆమెకే ఆధిపత్యం దక్కింది. ఎన్నికల సంఘం ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సైతం ఆమె అగ్రభాగంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితాలో జిల్లా మొత్తం 33,03,592 ఉండగా.. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో జిల్లా మొత్తం 34,12,581 మంది ఉన్నారు. అంటే తాజాగా 1,08,989 ఓట్లు పెరిగాయి. వీటిలో మహిళలు 16,69,703 ఉండగా, పురుషులు 16,33,595 ఉన్నారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో మహిళలు 17,29,186 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సారి ఎన్నికలో మహిళా ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఊరూరా వారి సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ పురుషులతో పోటీ పడి మరీ పైచేయి సాధించారు. అన్ని నియోజకవర్గాల్లో సైతం ఆమె డామినేషనే దర్శనమిస్తోంది. జిల్లాలో 16 నియోజకవర్గాలుండగా.. 5 నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 46,103 అధికంగా ఉన్నాయి. 2014 ఆమెదే.. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళల హవానే కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అప్పట్లో మొత్తం ఓట్లు 33,37,071 ఉండగా.. పురుషులు 16,58,639 ఉండగా.. మహిళలు 16,78,118 ఉన్నారు. అంటే 19,479 మంది మహిళలు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించారు. ప్రసన్నానికి ఎత్తులు! రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లాలో రాజకీయ పార్టీలకు ప్రతి అంశమూ కీలకమైందే. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు, సమ ప్రాధాన్యంపై ఆసక్తి చూపుతారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటం, ఊరూరా అభ్యర్థుల ప్రకటనల్లో రాజకీయ పార్టీలు బిజీగా ఉండటం కీలకంగా మారింది. ఓటరు జాబితాలను పట్టుకుని మరీ తమకు అనుకూలమైన ఓటర్లు ఎక్కడున్నారన్న వేట మొదలు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. మహిళలకు ఇష్టమైన చీరలు, ముక్కు పుడకలు ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. మరో అడుగు ముందుకేసిన టీడీపీ.. మహిళా ఓటర్లపై గురి పెట్టింది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు పసుపు–కుంకుమ పేరుతో రూ.2,500 నగదు జమ చేసింది. ఆ నగదులో సింహభాగం మహిళలకు చేరిన దాఖలాలు లేవు. కొంత మేర బ్యాంకర్లు అప్పులకు జమ చేసుకోగా.. మరి కొంత నగదు అసలు చేతికే అందలేదు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు ట్యాబ్‌లు అందజేసింది. అవిసైతం పూర్తిస్థాయిలో అందకపోగా.. మరికొన్ని నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.సాక్షి, మచిలీపట్నం: జిల్లా ఓటర్ల జాబితాలో మళ్లీ ఆమెకే ఆధిపత్యం దక్కింది. ఎన్నికల సంఘం ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సైతం ఆమె అగ్రభాగంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితాలో జిల్లా మొత్తం 33,03,592 ఉండగా.. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో జిల్లా మొత్తం 34,12,581 మంది ఉన్నారు. అంటే తాజాగా 1,08,989 ఓట్లు పెరిగాయి. వీటిలో మహిళలు 16,69,703 ఉండగా, పురుషులు 16,33,595 ఉన్నారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన జాబితాలో మహిళలు 17,29,186 మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సారి ఎన్నికలో మహిళా ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. ఊరూరా వారి సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ పురుషులతో పోటీ పడి మరీ పైచేయి సాధించారు. అన్ని నియోజకవర్గాల్లో సైతం ఆమె డామినేషనే దర్శనమిస్తోంది. జిల్లాలో 16 నియోజకవర్గాలుండగా.. 5 నియోజకవర్గాల్లో మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. పురుషుల కంటే మహిళల ఓట్లు 46,103 అధికంగా ఉన్నాయి. నియోజకవర్గాలు 16 ప్రస్తుత జనాభా 47,28,816 మహిళలు 23,73,545 పురుషులు 23,55,271 మొత్తం ఓట్లు 34,12,581 మహిళా ఓటర్లు 17,29,186 పురుషుల ఓటర్లు 16,83,083 ఇతరులు 312 -
టీడీపీలో టికెట్ టెన్షన్!
సాక్షి, మచిలీపట్నం: గత ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా నిలిచిన నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పాత్ర కీలకం కానుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 16 నియోజకవర్గాల్లో 11నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరాలు చేయగా.. మరో 5 నియోజకవర్గాల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇది వరకు ఉన్న వారిని పక్కన బెట్టి కొత్త వారికి అవాకాశం కల్పించే దిశగా సీఎం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో అసమ్మతిని రాజేస్తోంది. నూజివీడులో నయా రాజకీయం! నూజివీడు నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. 2014 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ముద్దర బోయిన వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని పక్కన బెట్టి కమ్మ సామాజిక వార్గనికి చెందిన అట్లూరి రమేష్‌కు టికెట్ ఇవ్వాలని అధినేత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ముద్దరబోయిన వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఆది నుంచి పార్టీ కోసం పనిచేసినా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆఖరికి ఎమ్మెల్యే స్థానం కేటాయించకపోవడంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పంచాయతీ సీఎం వద్దకు వెళ్లినా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. దీనికి తోడు తాజాగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేరు సైతం ప్రస్తావనకు వస్తోంది. ఇందుకు అధిష్టానం ఆదేశిస్తే తాను నూజివీడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కొన్ని రోజులు క్రితం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బచ్చుల స్పష్టం చేయడం బలాన్ని చేకూరుస్తోంది. కాగితకు చెక్! పెడన ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం సిటింగ్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు ఆరోగ్యం సహకరించడం లేదన్న సాకుతో పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై చర్చించేందుకు కాగిత ఆదివారం సీఎం అపాయింట్మెంట్ కోరగా.. తిరస్కరించినట్లు తెలిసింది. దీనికి తోడు సుజనా చౌదరి సైతం ఆరోగ్యం బాగాలేదు కదా.. తర్వాత మట్లాడుదాంలే అన్న ఉచిత సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాగిత వర్గంలో అయోమయం నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం ముడా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బూరగడ్డ వేదవ్యాస్ సైతం పెడన అభ్యర్థిగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో పర్యటనలు, పరామర్శలు, పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. వ్యాస్ తనయుడికి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కొనకళ్లకు దక్కేనా? బందరు ఎంపీగా వ్యవహరిస్తున్న కొనకళ్ల నారాయణరావుకు పెడన ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీగా తాము పోటీ చేసి గెలవలేమని.. ఇప్పటికే సీఎంకు స్పష్టం చేశారని, ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం ఎదుట వాపోయినట్లు తెలిసింది. దీంతో చేసేది లేక పెడన స్థానానికి ఎన్నిక చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ బాడుగు రామకృష్ణ కుమార్తె బాడుగ శ్రీదేవికి మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమచారం. కాగా తాజాగా మరో వాదన తెరపైకి వస్తోంది. ఇటీవల టీడీపీలోకి చేరిన వంగవీటి రాధాకు బందరు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీలో అసమ్మతి వర్గాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కల్పనకు కలేనా? పామర్రు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ స్థానంలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఉప్పులేటి కల్పన నైతిక విలువలను మంట గలిపి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేపై తన సామాజిక వార్గనికి చెందిన నాయకులే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కల్పనకు టికెట్ కేటాయిస్తే తాము ఒప్పుకొమని కొందరు.. కల్పనకే టికెట్ కేటాయించిచాలని మరో వర్గం పట్టుబడుతోంది. ఈ పంచాయతీ ఇటీవల సీఎం వద్దకు చేరింది. వెరసి పామర్రు నియోజకవర్గం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక తికమక పడుతున్నట్లు సమాచారం. పామర్రు స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ఆశిస్తున్నారు. కొంతకాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాతో సైతం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగా మరో అభ్యర్థి తెరపైకి వచ్చారు. సీఎం చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చినట్లు ఊడిగ శ్రీనివాస్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ స్పష్టం చేశారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. -
సైరా.. రాజకీయ నాయకా
సాక్షి, అమరావతి బ్యూరో : ఎన్నికల నగారా మోగింది. సరిగ్గా 74 రోజుల్లో రాష్ట్ర రాజకీయం ఏంటో తేటతెల్లం కానుంది. మార్చి 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. గత వారంలో రోజులుగా నిన్నా.. నేడూ అంటూ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఉత్కంఠ ఉండగా ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నేటి నుంచి జిల్లా రాజకీయం జెట్‌స్పీడ్‌ను అందుకోనుంది. అభ్యర్థుల ప్రకటన, ప్రచారం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవ్వగా.. రేపటి నుంచి ఇది మరింత ఊపందుకోనుంది. ఇక పల్లెపల్లెన ప్రచారం హోరెత్తనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో జిల్లా అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినట్లుగా మార్చి 18న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 25 వరకు ఈప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 26న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. కలెక్టరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగానికి సంబంధించిన అంశాలపై నేడు కలెక్టర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం, ప్రధాని ఫొటోలు తీసేయాల్సిందే.. ఎన్నికల నియమావళి(కోడ్) రాష్ట్రంలో ఆదివారం నుంచి సంపూర్ణంగా అమల్లోకి వచ్చింది. ఎన్నిక షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సంఘం ‘కోడ్’లోని ఏడో నిబంధనను అమల్లోకి తేవడంతో వీటన్నింటికీ బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అంతటా అమల్లోకి ఇక వచ్చినట్లే. దీంతో ప్రభుత్వ భవనాలపై ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలు, గోడలపై రాతలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు అన్నింటినీ 24 గంటల్లో తొలగించాలి. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ సీఎం, ప్రధాన మంత్రి ఫొటోలు తొలగించాల్సిందే. ప్రజా ఆస్తులైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలు, రహదారుల వెంట వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్‌లను 48 గంటల్లో తొలగించాలి. ఇక ప్రైవేటు ఆస్తులపై ఉన్న వాటిని 2 గంటల్లో తొలగించేయాలి. -
కృష్ణా జిల్లా.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, కృష్ణా జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్ కాల్ సెంటర్ ఇన్చార్జి : స్వామినాయుడు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్: 9849903988 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం!
సాక్షి, కృష్ణా : నందిగామ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు. నందిగామ పాతబస్టాండ్ సమీపంలో ఓ బాటసారిని గుర్తుతెలియనం వాహనం డీకొట్టింది. తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరించారు. హాస్పిటల్‌కి వచ్చి పదిహేను నిమిషాలు అయినప్పటికీ అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. తక్కువ సిబ్బంధి ఉందని ఏం చేయమంటారని అక్కడి డాక్టర్లు దురుసుగా సమాధానం ఇచ్చారు. చివరకు వివరణ కోరుతున్న మీడియా ప్రతినిధులపైనా దురుసుగా ప్రవర్తించారు. -
రెండు అవతారాల్లో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి అంతరాలయ దర్శనం, ఆశీర్వచనాలు నిలిపేశారు. ఆలయంలో భక్తులకు లఘు దర్శనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్లకు హంస వాహనంపై ఊరేగించనున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిని భారీ సంఖ్యలో భవానీ దీక్ష చేసే వారు దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కొండ కింద దీక్షలు విరమిస్తున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తున్నట్లు సమాచారం. -
10/10 వచ్చినా.. ట్రిపుల్ ఐటీ సీటు రాలేదని..!
సాక్షి, కృష్ణా : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రమైన చాట్రాయిలో చోటుచేసుకుంది. వివరాలు.. టెన్త్ క్లాస్‌లో 10/10 జీపీఏ సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవండంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ సీటు విషయమైన నిన్న రాత్రి మంజు తీవ్ర ఆవేదనతో మాట్లాడిందని ఆమె తల్లి భోరున విలపించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ-కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, కృష్ణా జిల్లా : విజవాడ జాతీయ రహదారిపై లారీ- మహేంద్ర ట్రావెల్ కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరువూరు శివారు వద్ద చోటుచేసుకుంది. కారు క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టం మీద పోలీసులు బయటకు తీశారు. 108కు ఫోన్ చేసినప్పటికి అంబులెన్స్ జాడకానరాలేదు. దీంతో వారిని ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో విజయవాడకు తరలించారు. -
అవమానభారంతో యువకుడి ఆత్మహత్య
విజయవాడ: చిట్టినగర్ వాగు సెంటర్లో రవికిరణ్ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఇల్లు నిర్మించానంటూ రవికిరణ్ తన తల్లిదండ్రుల నుంచి కొన్ని నెలల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. కుమారుడు గృహాన్ని నిర్మించాడని భావించి తల్లిదండ్రులు గృహప్రవేశ కార్డులు పంచారు. ఇల్లు నిర్మించానని చెబుతున్న ప్రాంతానికి వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడ ఇల్లు కనిపించకపోవడంతో కుమారుడిని నిలదీశారు. తీవ్రంగా మందలించడంతో అవమానానికి గురయ్యానని భావించి రవికిరణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బు బెట్టింగ్‌ల్లో పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిక్కవరంలో పాముల కలకలం
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో పాములు కలకలం రేపుతున్నాయి. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం రాత్రి పాము కాటేసింది. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన యువకులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం ఇదే గ్రామంలో పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. వారంలో ముగ్గురు పాము కాటు బారిన పడటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఎస్ఐ గల్లంతు ?
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో కరకట్టపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ సమీపంలోని రామచంద్రాపురం నుంచి అవనిగడ్డ వైపు వస్తున్న ఓ కారు పాపవినాశనం వద్ద అదుపుతప్పి కరకట్ట పై నుంచి పక్కనే ఉన్న బందరు కాలువలోకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కాపాడగలిగారు. కాగా ఈ ఘటనలో డ్రైవింగ్ చేసిన వ్యక్తి మాత్రం గల్లంతయ్యారు. డ్రైవింగ్ చేసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కోట వంశీగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వృద్ధురాలి మెడలో ఆభరణాల అపహరణ
విజయవాడ: అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాంచారమ్మ అనే వృద్ధురాలి ఆభరణాలు చోరీకి గురయ్యారు. నాంచారమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసును గుర్తుతెలియని మహిళ దోచుకెళ్లింది. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి ఆభరణాలు మాయం చేసింది. తన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెల్సుకున్న తరవాత నాంచారమ్మ పోలీసులను ఆశ్రయించింది. నాంచారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
అవిశ్వాస తీర్మానంలో మరో మలుపు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి.