చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వెలంపల్లి శ్రీనివాస్, పోతిన మహేశ్
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్‌కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు.
తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment