potina mahesh
-
పవన్ కళ్యాణ్ రోడ్డు చెకింగ్.. పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు
-
కిలోమీటరు పరిధిలో 12 మద్యం షాపులు.. చంద్రబాబుపై పోతిన మహేష్ ఫైర్
-
కల్తీ మీ బుర్రలో ఉందా పవన్?
విజయవాడ, సాక్షి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా పవన్‌కు చురకలు అంటించారు.నాడు రోడ్డుపై దొర్లినా.. నేడు తిరుమల మెట్లేక్కినా ఎవరికోసం, ఎందుకోసం? అని సూటిగా నిలదీశారు. ‘నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా, కల్తీ.. లడ్డూలో లేదు - మీ బుర్రలో ఉందా?’ అని ఎద్దేవా చేశారు.నాడు రోడ్డుపై దొర్లినా - నేడు మెట్లిక్కినా నాడు శపథాలు చేసినా - నేడు దీక్షలు చేసినా ఎవరికోసం, ఎందుకోసం? కల్తీ లడ్డులో లేదు - మీ బుర్రలో ఉందా?#justasking— Pothina venkata mahesh (@pvmaheshbza) October 1, 2024చదవండి: బాబు లడ్డు కహానీ! (ఫొటోలు) -
బాబు, పవన్ పై పోతిన మహేష్ పంచులు
-
అందుకే ‘తిరుమల లడ్డూ’పై బాబు నీచ రాజకీయం: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: వందరోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకానితనం బయటపడినప్పడు వైఎస్ జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘వంద రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు విమర్శలు చేశాడు. జూలైలో రిపోర్టులో వస్తే సెప్టెంబర్‌లో బయటపెట్టడం ఏంటీ?. శాంపిల్స్ ఎప్పుడివి? ఎక్కడ సేకరించారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలు భక్తుల్లో ఉన్నాయి. నాణ్యత లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 550 దేశీ ఆవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా గత ప్రభుత్వమే..ఇది కనిపించడం లేదా?’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం‘‘శ్రీవైష్ణువులు తేడా జరిగితే చెప్పారా? ఎందుకు ఊరుకుంటారు?. లడ్డు సరుకులను ముందుగానే తనిఖి చేస్తారు.. సరిగ్గా లేకుంటే తిరిగి పంపిస్తారు. లడ్డూ తయారికి ముందే సరుకులు తనిఖి చేస్తారు. లడ్డు తయారీ తర్వాత తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఏ కాలానికి వచ్చింది.. ఎప్పుడు వచ్చింది. ఏ ట్యాంక్‌లో వచ్చింది చెప్పకుండా కోట్లాది హిందూ భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. వెంకన్న భక్తులు చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి జవాబు ఇస్తారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప రాజకీయంగా వాడుకోవాలని చూడడం సరైనది కాదు’’ అని పోతిన మహేష్ హితవు పలికారు. -
పవన్, చంద్రబాబుపై పోతిన మహేష్ కామెంట్స్
-
ఆధారాలతో సహా చర్చకు సిద్ధం.. స్పందించు పవన్: పోతిన మహేష్
సాక్షి, గుంటూరు: పార్కింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా?.. చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు రూ.4 కోట్లు అవినీతికి పాల్పడ్డారని.. పార్కింగ్, టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయటానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ శాఖ అధికారులను బెదిరించి జీవోలు జారీ చేయించుకుంటున్నారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ పది శాతం పెంచి సదరు కాంట్రాక్టర్‌కు కాంట్రాక్టు ఇవ్వాలి. రెండు కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు?. పైగా నాలుగు నెలల పాటు భక్తుల నుండి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారు’’ అని పోతిన మహేష్ ధ్వజమెత్తారు.‘‘ఒక కోటి రెండు లక్షలు భక్తుల నుంచి వసూలు చేసుకోమని జీవో ఇవ్వడం ఏంటి?. హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ ఆలయానికి రావటం వలన కాంట్రాక్టర్‌కు నష్టం వచ్చిందని జీవోలో రాశారు. ఇదేం విచిత్రమైన జీవోలు?. దోచుకో, దాచుకో, తినుకో అనే పరిస్థితి వస్తుందని వైఎస్ జగన్ ముందే చెప్పారు. అమ్మవారి ఆలయంలో భారీగా దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేసుకోమని అధికారికంగా జీవో ఇవ్వడం కూటమి ప్రభుత్వంలోనే చెల్లింది. రూ. 3.06 కోట్లు అమ్మవారి ఆలయానికి నష్టం వచ్చింది. ఆ మేరకు సదరు కాంట్రాక్టర్‌కి లాభం చేకూరింది’’ అని పోతిన మహేష్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: నిర్లక్ష్యమే ముంచేసింది‘‘కనకదుర్గ నగర్లో షాపులు ఏర్పాటులోనూ అక్రమాలు చేశారు. బకాయిలు ఉన్నా, వ్యాపారాలు సజావుగా సాగుతున్నా 49 శాతం అద్దెలు తగ్గించారు. బుద్దా వెంకన్న ఒక్కో షాపుకు రూ.5 లక్షలు చొప్పున లంచాలు తీసుకున్నారు. మూడు నెలల్లో 4 కోట్లు వసూలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన మనుషులకి ఘాట్ రోడ్డులో కోటికి పైగా విలువైన కాంట్రాక్టును నామినేషన్ మీద ఇచ్చారు. అన్నదాన సత్రంలో స్టీల్ టేబుల్స్ ఏర్పాటు కాంట్రాక్టులోనూ అవినీతి పాల్పడ్డారు. అమ్మవారి సొమ్ము కొట్టేయటంలో ఏఈ లక్ష్మణ్.. బుద్దాకు సహకరిస్తున్నారు. వీటన్నిటిపై ఏసీబితో విచారణ జరిపించాలి..ఆధారాలతో సహా చర్చకు ఏ వేదిక మీదనైనా నేను సిద్ధం.. చట్టపరంగా పోరాటం చేస్తా. ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చేస్తున్న తప్పుడు పనులపై ఆధారాలు సేకరిస్తున్నాం. అమ్మవారి ఆలయంలో జరిగే అక్రమాలపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి’’ అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. -
కక్ష సాధింపు ధోరణి తోనే పాలన చేస్తున్నారు
-
‘బాబూ.. నీ 40 ఏళ్ల రాజనాల విలనిజం ప్రజలకు అర్థమైంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎల్లో మీడియాలో ఎలివేషన్ ఇచ్చినా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుపిస్తుందని ఎద్దేవా చేశారు.కాగా, పోతిన మహేష్ ట్విట్టర్ వేదికగా..‘వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం వైఎస్ జగన్ అనే చంద్రబాబు మాట్లాడేలా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక బాబుకు చాదస్తం ఎక్కువైంది అనిపిస్తోంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏయే వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియలేదు ప్రభుత్వానికి.వరదకు ముందు చేయాల్సిన పనులు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలని శాంతి పరచడానికి ఆయన రోడ్ల మీద బోటుల్లో తిరుగుతున్నారు తప్ప అసలు ఆ బోట్లు రోడ్డు మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారు కూటమి నేతలు.ఎన్ని కథలు చెప్పినా, సొంత మీడియా వాడుకుని ఎలివేషన్స్ ఇచ్చినా ప్రజల కోపం తగ్గలేదు కాబట్టి గొల్లపూడి బోట్లు వైఎస్సార్సీపీ వాళ్ళవి అంటూ కొత్త కుట్ర ఎత్తుకున్నారు. 10 లక్షల క్యూసెక్కులపైగా వరద ప్రవాహాన్ని ఐదు బోట్లు అడ్డుకోగలవా?. ఎవ్వరైనా బోట్లకి పార్టీ రంగులేసుకుని ప్రకాశం బ్యారేజ్ గేట్లకి అడ్డంగా వదిలేయాలనుకుంటారా?. ఇలాంటి 40ఏళ్ల క్రితం రాజనాల సినిమా విలనిజం చేస్తే అర్ధం చేసుకునే తెలివి జనానికి లేదా?.అసలు మత్యకారులకు, బోట్ నిర్వాహకులకు ప్రభుత్వం సరైన సమాచారం ఇచ్చి వాళ్లని అప్రమత్తం చేస్తే ఈ రోజు బోట్లు కొట్టుకువచ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. బుడమేరు వాగును, దానికి వస్తున్న ఇన్‌ఫ్లోని ముందే అంచనా వేస్తే ఈ రోజు నాలుగు లక్షల మంది ప్రజల జీవితాలు ఛిద్రం కాకుండా ఉండేవి. అలాగే గొడుగు పట్టుకుని బుడమేరు కట్ట దగ్గర రీల్స్ చేసుకునే పరిస్థితి నిమ్మల రామానాయుడుకి రాకుండా ఉండేది. క్రైసిస్ మేనేజ్మెంట్లో నన్ను మించిన వారు లేరని మీ మీడియాలో ఊదర గొట్టే ముందు బుడమేరు వరదలకు కారణం మీరే అని ఎప్పుడు గ్రహిస్తారు?.ఏదో రకంగా వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలని వరదల్లో బురద ముంపులో మురికి రాజకీయం చేయాలని టీడీపీ పార్టీ నాయకులు తాపత్రయం పడుతున్నారు తప్ప అసలు ఈ ముంపుకి కారణం మాత్రం ప్రజలకు అర్ధం అయ్యింది. కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే వ్యక్తులను పోలీసులు తీసుకెళ్లి విచారణ పేరుతో వేధిస్తున్నారు. కోమటి రామ్మోహన్ తనకున్న బోట్లను నాలుగేళ్ల క్రితమే ఉషాద్రి అనే వ్యక్తికి విక్రయించారు. ఉషాద్రికి ఏ పార్టీతో సంబంధం లేకున్నా వైఎస్సార్సీపీ పార్టీ చెందినవారు అని చెప్పాలని పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా నడుచుకుంటే సంబంధిత పోలీసు అధికారులు కోర్టు ముందు నిలబెడతామని న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని వైఎస్సార్సీపీ స్పష్టం చేస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి వచ్చినా కారణం @ysjagan గారే అని చంద్రబాబు గారు @ncbn మాట్లాడటం చూస్తుంటే ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనిపిస్తోంది.కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టెలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు అయినా సరే విజయవాడ మునిగేవరకు అసలు ఏ ఏ… pic.twitter.com/rKIkpAxDfY— Pothina venkata mahesh (@pvmaheshbza) September 9, 2024 -
బాబుని ఏకిపారేసిన పోతిన మహేష్
-
రాధాకృష్ణ పవర్ ప్లాంట్,చంద్రబాబు ఇల్లు కోసం ప్రజల ప్రాణాలతో చలగాటాలా..
-
చంద్రబాబు ఈ పాపం ఊరికే పోదు.. బుడమేరును దారి మళ్లించి బడుగుల జీవితాన్ని చిదిమేశారు
-
బాబుపై పోతిన మహేష్ ఫైర్
-
ఏపీలో కూటమి పాలనపై పోతిన సెటైర్లు
విజయవాడ, సాక్షి: ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత ఆంధ్రప్రదేశ్ గాని ఎప్పుడైనా ఒక ఏడాదిలో ఒక ఎండాకాలం వచ్చేది, కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రెండో ఎండాకాలం వచ్చిందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా 39 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండలు కాస్తున్నాయి. కూటమి మహిమా? సూపర్ సిక్స్‌లో ఇది కూడా ఒక పథకం అంటారేమో అనిపిస్తుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆయన సెటైర్లు వేశారు.‘‘ ఏపీలో రెండో ఎండాకాలం. కూటమి మహిమా?.. రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా రాజకీయ హత్యలు దాడులు పగ ప్రతీకారంతో కూటమిపాలన సాగిస్తుంది. ప్రతిరోజు పేపర్ చదవాలన్న టీవీలలో, పేపర్లలో సోషల్ మీడియాలో వార్తలు చూడాలన్న ప్రజలకు భయం వేస్తుంది. కూటమి అధికారంలోకొచ్చింది రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం కోసమేనని ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరిన విధంగా కూటమి ప్రభుత్వం ఎసెన్షియాలో మరణించిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం, గాయపడినవారికి మెరుగైన ఉచిత వైద్యం ఘటనపై లోతు అయిన దర్యాప్తు చేపట్టాలి’’ అని అన్నారు.పేలుళ్లతో కూటమిపాలన ప్రారంభమైందని పోతిన మహేష్ మండిపడ్డారు. ‘‘ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024), ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి, 50 మందికి గాయాలు(21.08.2024), పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి (16.7.2024)’ ఘటనలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగినట్లు తెలిపారు.1.పేలుళ్లతో ప్రారంభమైన కూటమిపాలన.A. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బ్రాయిలర్ పేలిన ఘటనలో 3 గురు మృతి, 16 మందికి గాయాలు (07.07.2024)B. ఎసెన్షియ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి,50 మందికి గాయాలు(21.08.2024)C. పరిటాల దొనకొండ క్వారీలో బాంబులు పేలి 3 గురు మృతి…— Pothina venkata mahesh (@pvmaheshbza) August 22, 2024 -
పవన్ కళ్యాణ్ సైలెన్స్ వద్దు.. పోతిన మహేష్
-
చంద్రబాబు,లోకేష్ పై పోతిన మహేష్ ఫైర్
-
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ వార్నింగ్
-
బాబు, పవన్ ను ఓ ఆటాడుకున్న పోతిన మహేష్
-
షర్మిల పై పోతిన మహేష్ ఫైర్
-
సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సీఎం చంద్రబాబు మరోసారి సామాజిక మోసానికి తెరతీస్తూ తన మొదటి సంతకం చేశారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ పేర్కొన్నారు. కేవలం ఒకరికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, ఈ విషయంలో బీసీ, దళిత, మైనార్టీలకు అన్యాయం చేశారని చెప్పారు. ఈ మేరకు పోతిన మహేష్ శనివారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారు. 2014లో చంద్రబాబు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు.వారిలో ఒకరు కాపు, మరొకరు బీసీ సామాజికవర్గం వారు ఉన్నారు. వైఎస్ జగన్ 2019లో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ చంద్రబాబుకు మిన్నగా కాపు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారు. తద్వారా ఆయా సామాజికవర్గాల ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ మరింత పెంచారు. వైఎస్ జగన్‌ను పదేపదే విమర్శించిన చంద్రబాబు... వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సామాజిక న్యాయానికి మించి అట్టడుగు వర్గాలకు పదవులు కేటాయించాల్సింది పోయి ఉన్న పదవులను తగ్గించారు.ఇది చంద్రబాబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. దీనిపై చంద్రబాబు ఆయా వర్గాలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గత పాలన అంతా దళితులు, బీసీలు, మైనారిటీలను అణగదొక్కడమే కనిపిస్తుంది. వైఎస్ జగన్ అమలు చేసిన సామాజిక న్యాయాన్ని ఇప్పటికైనా బీసీ, దళిత, మైనార్టీ, కాపు సామాజికవర్గాలు గ్రహించాలి. ఆయన ఆయా వర్గాలకు కేటాయించిన సీట్లను సైతం గుర్తించాలి.’ అని పోతిన అన్నారు. -
చంద్రబాబు కూటమిపై రెచ్చిపోయిన పోతిన మహేష్
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
పాలేరు పవన్..
-
Potina Mahesh: పవన్ అక్రమాస్తుల వివరాలు ఇవే..!
విజయవాడ: రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ పెద్ద చీడపురుగని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. జనసేన స్థాపించిన పదేళ్లలో ఆయన సుమారు రూ.15 వందల కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆయన వెల్లడించారు. 2014లో కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు.విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇటీవల కాలంలో పవన్ ఏ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించకపోయినా.. రూ.వందల కోట్ల లాభాలు రాకపోయినా జనసేన పార్టీ పెట్టాకే పవన్‌కు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారుగానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్.మాలాంటి వాళ్లందర్నీ రాజకీయంగా, ఆరి్థకంగా బలిపశువులు చేసి ఆయన మాత్రం అన్ని రకాలుగా బాగుపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పుకోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని మాలాంటి వాళ్లను పవన్ బలి పశువులని చేసి ఆయన మాత్రం బాగా ఆరి్థకంగా బలపడ్డారు.ఈ సమావేశంలో పవన్ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్ వెల్లడించారు. అవి..మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామి అయినా నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజి్రస్టేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజి్రస్టేషన్లకు నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ వి. నవీన్‌కుమార్ హాజరయ్యారు. డాక్యుమెంట్ నెంబర్లు : 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పవన్ ఫామ్‌హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్లో చూపించారు. కానీ, అది 45–50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.2019 ఎన్నికల్లో పవన్‌కు ఎన్ఆర్ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలుచేసింది పీవీ రావు, ఆర్ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారధి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి.పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018–2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.పవన్ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.పవన్ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా?సినీ పరిశ్రమలోను, బయట పవన్ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్. వీరితోపాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, తంగేళ్ల సుమన్ వీరంతా కూడా ఆయన బినామీలే.ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వా«దీనం చేసుకున్నారు. వాటినింకా రిజి్రస్టేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలలు కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.టీ టైమ్ తంగెళ్ల శ్రీనివాస్‌కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు.పవన్ తన పిల్లల పేర్లు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారుగానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజి్రస్టేషన్ చేయించడంలేదు?ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్ విరాళాల ముసుగులో అమెరికా వెళ్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.పవన్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్ పవన్‌తో ఏడు సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?పవన్ ప్రధాన బినామి టీజీ విశ్వప్రసాద్‌పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి. రేణుదేశాయ్‌కు ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లి ఇస్తున్నారు.ప్యాకేజీకి అదనంగా పవన్‌కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 కోట్లు పవన్ వసూలుచేశారు. -
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు