
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. తాను ఆడిగిన ఆరు ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని కోరారు. ప్రతి పది రోజులకు పవన్ ఫోన్ నెంబర్ ఎందుకు మర్చుతారో చెప్పాలని అడిగారు. ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల లెక్కల సంగతి ఏంటని ప్రశ్నించారు. పులివెందులలో భారతి, కుప్పంలో భువనేశ్వరీ, మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం.. మరి పీఠాపురంలో ఎవరు అంటూ సెటైర్లు వేశారు.
ఎన్నారైలు ఇచ్చిన విరాళలు గోప్యంగా ఉంచి, చిరంజీవి ఇస్తే మాత్రం ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ ఒక్కరోజు అయినా ఒక్క అభిమానికి అయినా ఒక్క పూట భోజనం పెట్టారా? అని అడిగారు. మెగా ఫ్యామిలీకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదని ఆరోపించారు. కాపు నేతల ఛానల్‌ను తొక్కుతూ వేరే ఛానల్‌పై అభిమానం ఎందుకని ప్రశ్నించారు.


Comments
Please login to add a commentAdd a comment