open letter
-
గ్యారెంటీలలోనే కాంగ్రెస్ సమాధి: హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట:సన్నవడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా బోనస్ డబ్బులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.ఈ విషయమై హరీశ్‌రావు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆదివారం(ఫిబ్రవరి 9) బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ చేసింది. రూ2 లక్షల రుణమాఫీ,రైతు భరోసాను మోసం చేశారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌ను తుంగులో తొక్కారు.రుణమాఫీ,రైతు భరోసా,వడ్ల బోనస్ పైసలు కూడా ఇవ్వలేదు. ఇక రైతులు రెండో పంట ఎలా వేస్తారు.బోనస్ ఇంకా రూ. 432 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం లేదు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు,ఉత్తర మాటలు అయ్యాయి.చేతకాని మాటలు ఎందుకు మాట్లాడతావు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పైన ఎందుకు మాట్లాడతావ్. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పాలాభిషేకం చేయాలి.రైతు కందులు పండిస్తే మూడు క్వింటాల్లే కొంటున్నారు. కంది రైతుల మీద ఎందుకు పగ మీకు.క్రాప్ బుకింగ్‌లో మిస్సయిన రైతులకు అనుమతి ఇవ్వండి.రేవంత్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్న రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలి.విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం వలన విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు.కాంగ్రెస్ కోతల ప్రభుత్వం. ఓ రైతుకు 31 గంటలకు భూమి ఉంటే రూ. 1650 మాత్రమే రైతు బంధు పడతదా.సీఎం ఇచ్చిన రూ 250 కోట్ల రూపాయల చెక్కు ఎందుకు పడడం లేదు.ఉత్తుత్తి చెక్కు ఇచ్చినవా.కొత్త పాస్ బుక్ వచ్చిన వాళ్లకు రైతుబంధు పడడం లేదు.ప్రభుత్వం మోసం చేసిందని అన్ని గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.తాను తవ్వుకున్న గ్యారంటీల సమాధిలోనే కాంగ్రెస్ సమాధి అవుతుంది.ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను గాలిలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంతా పాలన,కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన.మాది అసలు పాలన మీది కొసరు పాలన.సంతృప్తి, సంక్షేమం బిఆర్ఎస్ పాలన,సంక్షోభం,అసంతృప్తి అసహనం కాంగ్రెస్ విధానం’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
-
కోతలపైనే సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివా రం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్‌రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు. ఆదాయ పరిమితి పెంచాలి.. ‘పదేళ్ల క్రితం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వకుంటే బీఆర్ఎస్ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్ చేసిన మోసంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నెలలు గడిచినా వేతనాలేవీ.. ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
బుల్డోజర్ కూల్చివేతలు.. హైడ్రాపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి,ఢిల్లీ : తెలంగాణ హైడ్రా బుల్డోజర్ల కూల్చేవేత అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి పిర్యాదు చేశాను. గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు చనిపోయారు. హైడ్రాను ఒక మాఫియా లాగ మార్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు చెరువు కింద ఉంది. పేదోడి ఇళ్లను కులగొడుతున్నారు. పేద ప్రజలకు భూములు,ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.👉చదవండి : 'అలా ఎలా కూల్చేస్తారు?'.. హైడ్రాపై హైకోర్టు సీరియస్కానీ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై 88 కేసులు ఉన్నాయి. లగచర్లలో ఎస్టీల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీని సినిమా ప్రమోషన్ అడ్డగా చేశారు. ముఖ్యమంత్రికి గురుకుల, హైడ్రా ఇతర సమస్యలు పట్టవు. అలివి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ముంచారు. అత్యంత మనువాద పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ హక్కులను ఆలోచలను తెలంగాణ కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నారు’ అని బక్క జడ్సన్ ఆరోపించారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
రైతులకు కేటీఆర్ పిలుపు
-
రైతు భరోసా ఎగవేత కుట్రలు ఎదిరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగవేసేందుకు చేస్తున్న కుట్రలను ఎదిరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రైతుబంధు పథకంపై అబద్ధాలతో దు్రష్పచారం చేశారని, చివరికి అన్నంపెట్టే రైతన్నను దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. కోతలు, కొర్రీలతో రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. పెద్ద దోఖా జరగబోతోంది.. ‘రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులతో అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్మల్ని నిండా ముంచే ఒక పెద్ద దోఖా జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి మమ అనిపించి, పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టేలా ఘోరాలు చేయబోతున్నారు. వంచనను గ్రహించి, ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన సమయం వచి్చంది. ఇప్పుడు మేల్కొనకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది. రైతుబంధుతో రూ.73 వేల కోట్లు జమ వానాకాలం.. యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే ఒక అపురూపమైన ఆలోచనకు ఆచరణే రైతుబంధు. మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. ఇక రుణమాఫీ కింద రూ.28 వేల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఈ రెండు పథకాల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి. రైతులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుబంధు కింద కేసీఆర్ ఎకరానికి ఏటా రూ.10 వేలే ఇçస్తున్నాడని, మేం వస్తే రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఇంతవరకూ రైతు భరోసా జాడా పత్తా లేదు. రైతుబంధు కింద ఇచ్చే రూ.10 వేలను ఊడగొట్టారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయి మూడో సీజన్ కూడా వచ్చేసింది. రేవంత్‌రెడ్డి సర్కారు మొత్తంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడింది. రైతులకు హక్కుగా రావాల్సిన ఈ సొమ్మును వదులుకోవద్దు. ఏ పంట పైసలు వేస్తారు? ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా వానాకాలం పైసలా? యాసంగి పైసలా? ఏడాదికి ఒకే పంటకు ఇస్తారా? రెండు పంటలకు వేస్తారా? ఈ కుట్రను రైతాంగం గుర్తించాలి. ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7,500 కాదు..రూ.17500 డిమాండ్ చేయాలి. పీఎం కిసాన్తో లింక్ చేస్తే సగం మందికి కూడా రాదు ఆదాయం పన్ను కట్టేవాళ్లకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతుబంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇక భూమితో బంధం తెంపేస్తారా? పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు. 70 లక్షలకు పైగా రైతన్నలు ఉంటే 30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదు. రైతులను అవమానపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంరూ.22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్రషర్లకు ఇచ్చారనే దు్రష్పచారంతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది. వానా కాలంలో పోలి్చతే యాసంగిలో సాగు తగ్గుతుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లు వేయడం సాధ్యం కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం యాసంగిలో కూడా వానాకాలం లెక్క ప్రకరామే రైతుబంధు పైసలు జమ చేసింది. అయితే యాసంగిలో వేసిన రైతుబంధు పైసలను దుర్వినియోగం లెక్కల్లో వేసి కాంగ్రెస్ సర్కారు అన్నదాతలను దొంగలుగా చూపుతోంది. రైతులందరికీ రైతుభరోసా అమలు చేయాలి. రైతులకు ఇస్తున్నది భిక్ష కాదు, వారి హక్కు అని ప్రభుత్వం తెలుసుకోవాలి. మేం రైతులకు అండగా ఉంటాం’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
దమ్ముంటే ‘ఫార్ములా–ఈ రేస్’ పై చర్చించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్‌కు బీఆర్ఎస్ వినతిఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్‌కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు. -
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
‘చేతి’కి ఓటేస్తే.. చేతగాని సీఎంను రుద్దారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి పంపుతున్న మూటలపై ఉన్న శ్రద్ధ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మాటలపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. రాష్ట్రంలో చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆగమాగం చేసిందని, అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఎం మతిలేని నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం.. ఇప్పుడు అధోగతి పాలవుతుంటే కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేటీఆర్ పేర్కొన్న అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘విషమే తప్ప విషయం లేని సీఎం చేతిలో ఏడాది పాలనలో తెలంగాణ బతుకు ఛిద్రమవుతున్నా కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. కాంగ్రెస్‌ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేలిపోయింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యో గాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులతో ఫొటోలకు పోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోంది. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువునా మోసం చేశారు. హైడ్రా, మూసీ పేరిట నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తలుపుతట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచింది. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి చరిత్రను లిఖించింది. తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని అవమానించి, ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్టించారు. రేవంత్ చేసిన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయం. అసలైన తెలంగాణ చరిత్ర, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, తెలంగాణ సమాజంపైన ఉంది. ఆ విగ్రహాలను గాంధీ భవన్‌కు సాగనంపుతాం ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిర, రాజీవ్ గాందీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చుతాం. సచివాలయం ముందు ఏర్పాటుచేసిన కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను మీ పార్టీ కార్యాలయం గాందీభవన్‌కు సకల మర్యాదలతో సాగనంపుతాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌ను సీఎం ఇకనైనా మానుకోవాలి. మేం పదేళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకుని, ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపేస్తామంటే సహించేది లేదు’’ అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. -
సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి: ముద్రగడ
-
ప్రజల ముందుకొచ్చే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకొని తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టాను మించిపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను నయవంచన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి హింసించే పులకేశిలా వ్యవహరిస్తున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయనను ఉద్దేశిస్తూ కేటీఆర్ సోమవారం సుదీర్ఘ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తడిగుడ్డతో రాష్ట్ర ప్రజల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసగించడమే కాంగ్రెస్ నైజం ప్రజలను నమ్మించి మోసం చేయటమే కాంగ్రెస్ నైజమని, ఆరు గ్యారంటీల పేరుతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించిందని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత తీసుకున్న రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగిచూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో చిన్న పిల్లాడు పిలిచినా వస్తా అని బీరాలు పలికిన రాహుల్.. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు, రైతులు, పోలీసులు, హైడ్రా, మూసీ బాధితులు, ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలు, ఆటో డ్రైవర్ల ముందుకు, తెలంగాణ ప్రజల ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పాలన అనుభవం లేని బ్లాక్ మెయిలింగ్ ముఖ్యమంత్రి కారణంగా తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణను దోచుకుంటూ రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని ఆరోపించారు. సీఎం ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, మంత్రులు తలోరకమైన ట్యాక్స్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నార ని మండిపడ్డారు. రూ.1.50 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్టులో ఢిల్లీ కాంగ్రెస్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే పదవిని కోల్పోయేలా చట్టం చేస్తామని ప్రకటించిన రాహుల్.. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన రాహుల్‌గాంధీ రాష్ట్రాన్ని అవినీతి తెలంగాణగా మార్చినందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ తన లేఖలో డిమాండ్ చేశారు. నీళ్లలో ధాన్యం.. ధర్నాలో రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేటీఆర్ సోమ వారం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల తీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు. ‘నీళ్లలో ధాన్యం ఉంటే.. ధర్నాలో రైతు ఉన్నాడు. షరతుల్లో మిల్లర్లు ఉన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం పెళ్లిళ్లలో ఉన్నారు’అని విమర్శించారు. సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘మిల్లర్ల కతలు..రైతుల వెతలు’కథనాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మిల్లర్లతో చర్చలు లేవు..రైతుకు భరోసా కరువు..అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్, ధాన్యం కొంటే 500 బోనస్..అసలు కొనకుంటే అంతా బోగస్’ అన్నట్టుగా తయారైందని విమర్శించారు. -
ఎన్నికల్లో పోటీ చేయడమే కొత్త.. ప్రజా పోరాటాలు కొత్త కాదు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ప్రజా పోరాటాలు తనకు కొత్త కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారి తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయం కోసం పోరాటం సాగించానని, అదే తన జీవితానికి కేంద్ర బిందువు అని వెల్లడించారు. ఈ మేరకు వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ప్రియాంక శనివారం విడుదల చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ వారికి ప్రతినిధిగా వ్యవహరించారని తెలియజేశారు. వయనాడ్ ప్రజలతో కలిసి పనిచేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నవంబర్ 13న జరిగే ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని వయనాడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ఉద్ఘాటించారు. ప్రజా సేవకురాలిగా తన ప్రయాణానికి వయనాడ్ ప్రజలే మార్గదర్శకులు, గురువులు అని ప్రియాంక స్పష్టంచేశారు. తన సోదరుడు రాహుల్ గాం«దీపై చూపిన ప్రేమానురాగాలే తనపైనా చూపించాలని కోరారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, అరుదైన వనరులను బహుమతిగా పొందిన వయనాడ్‌కు ప్రజాప్రతినిధి కావడం తన అదృష్టంగా, గర్వకారణంగా భావిస్తానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్స్థానానికి జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. -
నిరంకుశ పాలనకు ప్రతీక బుల్డోజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్ నిరంకుశ పాలనకు ప్రతీకగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పౌర హక్కులను నిరంతరం ధిక్కరిస్తోందన్నారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన ఆపాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాం«దీకి హరీశ్‌రావు సోమవారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో అధికార దురి్వనియోగంతో దుష్టపాలన నడుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు.‘హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరిట పేద, మధ్యతరగతి కుటుంబాలను రేవంత్ రోడ్డున పడేస్తున్నారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ బుల్డోజర్ పాలన నడుపుతున్నారు. బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారింది. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ మీ పార్టీ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోంది.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సోం, మహారాష్ట్రలో పేదలు, మధ్య తరగతి ప్రజలపై బీజేపీ బుల్డోజర్లను ప్రయోగించిన రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో అదే దారిలో నడుస్తోంది. బుల్డోజర్ కూలి్చవేతలపై సుప్రీం ఆదేశాలు ఉన్నా సర్వేలు, సరైన విధానాలు అనుసరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విరుచుకుపడుతోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలు, చట్టాలను గౌరవించే విధంగా మీ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అని రాహుల్‌కు రాసిన లేఖలో కోరారు. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లుతూ వికృత రాజకీయాలకు తెరలేపిందని హరీశ్‌రావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తోందన్నారు. తనకు గోల్కొండ కోట, చారి్మనార్లోనూ వాటాలు ఉన్నాయనే రీతిలో కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్నారు. అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పశు వైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, 1962 అంబులెన్స్ సేవల సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. మూగజీవాల వద్దకు పశు వైద్య సిబ్బంది వెళ్లి తక్షణ సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. -
ఫార్మాసిటీ ఉంటుందా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ప్రాజెక్టును ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. హైకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టత కోరిందని, తక్షణమే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో ఫార్మా సిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించే లక్ష్యంతో ఫార్మా సిటీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందనే ఆలోచన చేశామన్నారు. భూ సేకరణను సైతం పూర్తి చేశామని తెలిపారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గందరగోళం నెలకొందన్నారు. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించటంతో ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఫార్మా సిటీ వస్తే ఉద్యోగాలొస్తాయని భావించిన యువత, బతుకులు బాగుపడతాయని భూములు ఇచ్చిన రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మొండి పట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని కోరారు. ప్రాజెక్టును రద్దు చేయాలని భావిస్తే రైతుల భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. భూములను ఇతర అవసరాలకు వాడతామంటే రైతులతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: ‘అసలు పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? ఆ తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలెందుకు?’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు? మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్లను మా వాళ్లు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. -
అచ్యుతాపురం ఘటన.. చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖ
సాక్షి, విశాఖపట్నం: గత ప్రభుత్వ కాలంలోనే కాకుండా.. అంతకుముందు పాలించిన మీ హయాంలోనూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయని సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ గుర్తుచేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా భవిష్యత్తులో ఈ తప్పిదాలు జరగకుండా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూ శర్మ శనివారం బహిరంగ లేఖ రాశారు.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసి లాభాలు గడిస్తూ అక్కడి కార్మికులు, స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాల మీద ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదని ఆయన పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులకు, పరిశ్రమల యజమానుల మధ్య ఉన్న సంబంధాలే దీనికి కారణమని ఆరోపించారు.గత ప్రభుత్వ తప్పిదాలవల్లే ప్రమాదాలు జరిగాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై శర్మ స్పందిస్తూ.. 2014లో తమరు అధికారంలో ఉన్న సమయంలోనూ ప్రమాదాలు జరిగిన విషయం గుర్తుచేసుకోవాలని సూచించారు. 2013 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం పరవాడ ఫార్మా సెజ్‌లోనే 24 ప్రమాదాలు సంభవించగా 21 మంది ప్రాణాలు కోల్పోయారనీ, 69 మంది గాయాలపాలయ్యారన్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రమాదాలు సహజంగా మారిపోయాయని విమర్శించారు.మీరు వచ్చి వెళ్లగానే మరో ప్రమాదం.. ఎసైన్షియా ప్రమాద బాధితుల్ని పరామర్శించి వెళ్లిన రోజు రాత్రే మరో ప్రమాదం జరిగిన విషయం కూడా చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ఈఏఎస్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంతమంది మృత్యువాత పడుతున్నా పరిశ్రమల యజమానులు ఎందుకు ఒక్కరోజైనా జైలుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించడం అభినందనీయమే అయినా.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు పునరావృతం కాకుండా నిబంధలను కఠినతరం చేయాలని ఆయన కోరారు.పరిశ్రమల్లో ప్రమాదాలను, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ విధానాల్లోనూ, వైఖరిలోనూ లోతైన మార్పులు రావాలన్నారు. ఎసైన్షియా యాజమాన్యాన్ని ప్రభుత్వం క్షమించకూడదనీ.. చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల అమలులో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ శర్మ డిమాండ్ చేశారు. -
తెలంగాణ తల్లి కోసం...
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌గాంధీకి తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవుల పక్షాన బహిరంగ లేఖ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటమే చారిత్రక న్యాయం! తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధి కారతకూ ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదు, తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకట రామారావు వంటి కవులెందరో తెలంగాణ తల్లిని ప్రస్తుతిస్తూ పద్యాలూ, పాటలూ రచించారు.ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన తెలంగాణ తల్లి భావన తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పునరుజ్జీవం పొందింది. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా, సమైక్య రాష్ట్ర ప్రతీకగా తెలుగుతల్లిని నిలిపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బుద్ధి జీవులూ, సాహిత్యకారులూ, కళాకారులూ తెలంగాణ తల్లి రూపురేఖలను గురించి చర్చించటం ప్రారంభించారు. చర్చల పర్యవసానంగా తెలంగాణ తల్లి ఇప్పు డున్న విధంగా రూపుదాల్చింది. ఉద్యమకారులు స్వచ్ఛందంగా తెలంగాణ ఎల్లెడలా వేలాది విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. కనుక తెలంగాణ తల్లి ఈ మట్టిలో నుంచి, తెలంగాణ ఉద్యమ భావోద్వేగాల నుంచి పుట్టిన అస్తిత్వ ప్రతీక.సమైక్య రాష్ట్ర అస్తిత్వ ప్రతీకగా తెలుగుతల్లి విగ్రహం గతంలో సెక్రటేరియట్ ముందు ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించి నూతన సెక్రటేరియట్ భవనం కూడా నిర్మాణమైన నేపథ్యంలో, నేడు తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండటం చారిత్రక న్యాయం. సెక్రెటేరియట్‌కు అమర వీరుల స్మారక కేంద్రానికి మధ్యనున్న స్థలంలో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని తెలంగాణ కవులు, కళా కారులు, పాత్రికేయుల పక్షాన శ్రీ రాహుల్‌గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టాల్సిన చోట భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన పట్ల మాకు అభ్యంతరాలున్నాయని తెలియజేస్తున్నాం. రాజీవ్ గాంధీ గారి మీద మాకు గౌరవం ఉంది.నగరంలో ఆయన విగ్రహం పెట్టాలనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ఆలోచన పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. అయితే, సెక్రెటేరియట్ ముందు తెలంగాణ తల్లి ఉండ వలసిన చోట కాకుండా మరెక్కడైనా ప్రతిష్ఠించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నెల కొల్పినప్పుడే తెలంగాణ అస్తిత్వ ప్రతీకకు కావాల్సిన సాధికారత, ప్రతిపత్తి సిద్ధిస్తుంది. తెలంగాణ చరిత్రతో గానీ, పరిణామాలతో గానీ ప్రత్యక్ష సంబంధం లేని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టడం ద్వారా తెలంగాణ భావోద్వేగాలను గాయపర్చవద్దని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో మీరు తెలంగాణ సాంస్కృతిక ఆకాంక్షలను గౌరవి స్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపు కొంటూ సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్ర హాన్ని నెలకొల్పేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి మీరు సూచించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక ఆకాంక్ష లకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాం.అభినందనలతో...ప్రొఫెసర్ హరగోపాల్, టంకశాల అశోక్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లెపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, పరాంకుశం వేణుగోపాల స్వామి, హిమజ్వాల (ఇరివెంటి వెంక ట్రమణ), నాళేశ్వరం శంకరం, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, కట్టా శేఖర్ రెడ్డి, తిగుళ్ళ కృష్ణమూర్తి, కూతురు శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ దంటు కనకదుర్గ, రసమయి బాలకిషన్, సంగిశెట్టి శ్రీనివాస్, ఏలె లక్ష్మణ్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే, బుద్ధా మురళి, ఎస్జీవీ శ్రీనివాస్ రావు, అనిశెట్టి రజిత, ఐనంపూడి శ్రీలక్ష్మి, కొమర్రాజు రామలక్ష్మి, శ్రీదేవి మంత్రి, రాజ్యశ్రీ కేతవరపు, వెంకట్ వర్ధెల్లి, మంగళంపల్లి విశ్వేశ్వర్, పెద్దింటి అశోక్ కుమార్, వేముగంటి మురళి, కందుకూరి శ్రీరాములు, మల్లా వఝుల విజయానంద్, డా‘‘ ఆంజనేయ గౌడ్, బద్రి నర్సన్, శ్రీరామోజు హరగోపాల్, రమేశ్ హజారి, కాంచ నపల్లి, నవీన్ ఆచారి, జూలూరి గౌరీశంకర్, వఝుల శివకుమార్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, వేముగంటి మురళీకృష్ణ ద్యావనపల్లి సత్యనారాయణ, పెన్నా శివ రామకృష్ణ, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, డా‘‘ భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య, లక్ష్మణ్ మురారి(బందూక్), కార్టూనిస్ట్ మృత్యుంజయ్, చిమ్మని మనో హర్, ఎదిరెపల్లి కాశన్న, డా‘‘ ఎ. జయంతి, స్వర్ణ కిలారి, బోల యాదయ్య, కె.వీరయ్య, యన్. బాల్‌రాం, ఉప్పరి తిరుమలేష్, అమర్ నాథ్, చిక్కొండ్ర రవి, బైరోజు చంద్ర శేఖర్, బైరోజు రాజశేఖర్, బైరోజు శ్యాంసుందర్, వహీద్ ఖాన్, వేదార్థం మధు సూదన శర్మ, ఆర్. రత్నాకర్‌రెడ్డి, సి.హెచ్. ఉషారాణి, బెల్లంకొండ సంపత్ కుమార్, పొన్నాల బాలయ్య, కె.అంజయ్య, సిద్దెంకి యాదగిరి, చమన్ సింగ్, కె. రంగాచారి, తైదల అంజయ్య, నాగిళ్ల రామశాస్త్రి, ఘనపురం దేవేందర్, వీరేంద్ర కాపర్తి, ప్రగతి, పరదా వెంకటేశ్వర్రావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, సంగాని మల్లేశ్వర్. -
సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.శ్రీరాముడి దేవాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని విశ్వహిందూ పరిషత్ లేఖలో పేర్కొంది. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: నేతన్నలవి ఆత్మహత్యలు కావు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అంటూ సీఎం రేవంత్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఇప్పటివరకు 10 మంది నేతన్నలు ఆత్మబలిదానం చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు అందిన ప్రతి పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.‘‘ప్రాణాలు పోతున్న పట్టింపు లేదా?. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. గతంలో అందిన ప్రతి కార్యక్రమాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నేతన్నలకు తమ పార్టీ, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. -
దాడులు సరికాదు.. చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ
సాక్షి, విజయవాడ: టీడీపీ, జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని వారిని దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు.. ప్రభుత్వంలో భాగస్వాములు.. వారికి అండగా ఉండి మానసికస్థైర్యం కల్పించాలని కోరారు.‘‘రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యం. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే విధంగా ఉంది’’ అని బండి శ్రీనివాస్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.‘‘అనంతపురంలో టీడీపీ నేత జేసి ప్రభాకర రెడ్డి.. రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్‌లను నా కొడకల్లారా.. నరుకుతా... అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం వారిని దూషించడాన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటిలోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధినిర్వహణలో తప్పుచేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ లేఖలో బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
నీట్‌పై ప్రధాని స్పందించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ ఎంట్రన్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను ప్రధాని మోదీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశా రు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలుగన్న తల్లి దండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన వ్యవహారంతో నీళ్లు చల్లినట్టయిందని ధ్వజమెత్తారు.బిహార్‌లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్ర యించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివారం రాసిన బహిరంగ లేఖలో నీట్ పరీక్షపై పలు సందేహాలను వెలిబుచ్చారు. ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని...నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్య లు తీసుకొని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. 67 మందికి మొదటి ర్యాంకు ఎలా? నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థు లు 720 మార్కులు సాధించడం చూస్తే ..పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని.. అంతమందికి ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారో స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా పేపరే లీకేజీ ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, బిహార్ లో అవకతవకలకు పాల్పడిన కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా పరీక్ష తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. -
‘నీట్’ అక్రమాలు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఆదివారం(జూన్16) కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నీట్ వ్యవహారంపై స్పందించాలన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేసి వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. … pic.twitter.com/agUwEuiaG8— BRS Party (@BRSparty) June 16, 2024 కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.నీళ్ల కోసం ‘‘క్యూ సెరా.. సెరా’’భారతదేశంలో రాజకీయ విజయం అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వాస్తవ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గురించి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. Political success in India is no more about the ability to solve real issues like water, electricity, roads, jobs and prices of essential commodities etc Where is the incentive for political parties to work on these real issues when elections are won on imaginary issues &… https://t.co/W8XYTqpZji— KTR (@KTRBRS) June 16, 2024ఊహాజనిత సమస్యలు & ఉత్పాదక అవగాహనలతో ఎన్నికలు గెలిచినప్పుడు ఈ వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందన్నారు. వారు చెప్పినట్లు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నీళ్ల కోసం "క్యూ సెరా, సెరా"నే అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. -
పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ రాశారు. తాను ఆడిగిన ఆరు ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని కోరారు. ప్రతి పది రోజులకు పవన్ ఫోన్ నెంబర్ ఎందుకు మర్చుతారో చెప్పాలని అడిగారు. ప్రత్యేక హెలికాప్టర్ ఖర్చుల లెక్కల సంగతి ఏంటని ప్రశ్నించారు. పులివెందులలో భారతి, కుప్పంలో భువనేశ్వరీ, మంగళగిరిలో బ్రాహ్మణి ప్రచారం.. మరి పీఠాపురంలో ఎవరు అంటూ సెటైర్లు వేశారు.ఎన్నారైలు ఇచ్చిన విరాళలు గోప్యంగా ఉంచి, చిరంజీవి ఇస్తే మాత్రం ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ ఒక్కరోజు అయినా ఒక్క అభిమానికి అయినా ఒక్క పూట భోజనం పెట్టారా? అని అడిగారు. మెగా ఫ్యామిలీకి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదని ఆరోపించారు. కాపు నేతల ఛానల్‌ను తొక్కుతూ వేరే ఛానల్‌పై అభిమానం ఎందుకని ప్రశ్నించారు. -
వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌ను చిన్నచూపు చూసినపుడు జగన్‌కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్ లక్ష్మీ.2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజయమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అనుభవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్ జగన్‌ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్‌ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకెలా మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్‌ను తిడుతున్నారు."న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ. -
ఢిల్లీ: కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఇరుకునపెట్టారు. అసలే కష్టాల్లో ఉన్న ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉన్న మంచి నీటి సమస్యపై కేజ్రీవాల్‌కు మంగళవారం(ఏప్రిల్16) ఒక బహిరంగ లేఖ రాశారు. గత పదేళ్ల నుంచి ఢిల్లీ మంచి నీటి సమస్యను తీర్చడానికి ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఎల్జీ విమర్శించారు. ప్రస్తుతం వచ్చిన మంచినీటి సమస్య సడెన్‌గా రాలేదని, ప్రతి ఏడాది ఈ సమస్య వస్తోందని గుర్తు చేశారు. మంచినీటి సమస్యపై గతంలో మీడియా ప్రచురించిన కథనాలను లేఖకు ఎల్జీ జత చేశారు. మంచి నీటి సరఫరా విషయంలో ఢిల్లీ కంటే ముంబై,చెన్నై,పుణె నగరాలు బెటర్‌గా ఉన్నాయని తెలిపారు. కాగా, లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదీ చదవండి.. నా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయ్.. కోర్టులో కేజ్రీవాల్ -
‘వాళ్లు తీహార్ జైల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని లేఖలో సుఖేష్ ఆరోపించాడు. అంతేకాదు.. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైల్లో ఆప్ నేతలంతా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. అధికార దుర్వినియోగం చేసిన వచ్చిన వాళ్లకు తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. అలాగే జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎశరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశాడు. -
చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సామాజిక న్యాయ వేదిక (ఎస్జేఎఫ్) సూపర్ సిక్స్ (ఆరు) ప్రశ్నలు సంధించింది. సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బహిరంగ లేఖను విడుదల చేసింది. ఎస్జేఎఫ్ రాష్ట్ర చైర్మన్ యర్రాకుల తులసీరామ్ యాదవ్, కో చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పంచాది రంగారావు, కో కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. తాము సంధించిన సూపర్ సిక్స్ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలివీ.. ► రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు, స్థానిక సంస్థలు, గ్రామ, వార్డు వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోరి్సంగ్ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమలు చేస్తోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సంపూర్ణ మహిళా సాధికారతకు మూలాలైన విద్య, ఉద్యోగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మీకు (చంద్రబాబు) ఉన్న ఇబ్బందేవిుటి? మీరు ఆ దిశగా ఎందుకు హామీ ఇవ్వలేక పోతున్నారు? ► బీసీ, పేద ఓసీ, కాపులు, మహిళలకు సమన్యాయం–సామాజిక న్యాయం చేయడానికి మీకు ఇబ్బందేవిుటి? ► బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బాహాటంగా హామీ ఇస్తున్న మీరు.. విద్య, ఉద్యోగాల్లో కూడా 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఎందుకు ఇవ్వడంలేదు? ఈ ద్వంద్వ నీతి ఏమిటి? ఈ ద్వంద్వ విధానం దేనికి సంకేతం? ► అగ్రవర్ణ పేదలకు (బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ తదితరులకు) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను యధావిధిగా కొనసాగించడానికి మీకు ఇబ్బందేవిుటి? ► మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా అటు బీసీలు, ఇటు ఓసీలకు ఇబ్బంది లేకుండా 10 శాతం ప్రత్యేక బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి న్యాయం చేయడానికి మీకున్న ఇబ్బందేవిుటి? ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సబ్‌ప్లాన్ మాదిరిగా ఓసీ, కాపు సబ్‌ప్లాన్ అమలు చేస్తానని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు? కాపులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయడం కాకుండా వారికి అధికారంలో ఎందుకు పరిగణనలోని తీసుకోవడంలేదు అంటూ చంద్రబాబుకు ఎస్జేఎఫ్ ప్రశ్నలు సంధించింది. -
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో: రాహుల్ గాంధీకి హరీశ్‌రావు లేఖ
సాక్షి,హైదరాబాద్: మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి శుక్రవారం(ఏప్రిల్ 5) ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైనందున, మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తున్నామని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలివ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం మీకు అలవాటేనని లేఖలో హరీశ్‌రావు చురకంటించారు. ‘కాంగ్రెస్ మోసం చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటిని విస్మరించారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైంది. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు చెప్పలేదు. హామీలు ప్రకటించడమే తప్ప వాటిని అమలు చేసే విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేని మీకు, మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా’ అని లేఖలో హరీశ్‌రావు తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
‘మై డియర్ ఫ్యామిలీ మెంబర్’.. దేశ ప్రజలకు ప్రధాని లేఖ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మై డియర్ ఫ్యామిలీ’ మెంబర్ అని ఒక్కొక్కరనీ వ్యక్తిగతంగా సంబోధిస్తూ లేఖ మొదలు పెట్టారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడుపుతున్నారని తెలిపారు. ‘ఈ పదేళ్ల పాలనలో ప్రజల సహకారంతో ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో విజయాలు సాధించాం. వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రైతులు, పేదలు, యువకులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ పదేళ్లలో చాలా కృషి చేశాం. పీఎం ఆవాస్ యోజన, ఇంటింటికి నీళ్లు, కరెంటు, గ్యాస్ అందించాం. ఆయుష్మాన్ భారత్‌తో ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నాం. భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించాం. ట్రిపుల్ తలాక్, నారీ శక్తి వందన్ చట్టాలతో మహిళా సాధికారత కల్పించాం. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం. మీ మద్దతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు బలాన్నిచ్చింది. వికసిత్ భారత్‌కు మీ సలహాలు నాకు కావాలి. మనందరం కలిసి దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తామన్న నమ్మకం నాకు ఉంది’అని మోదీ లేఖలో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల స్కీమ్ ఉండాల్సింది.. అమిత్ షా -
మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన జగన్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుదాం
సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం సొంత గ్రామాల్లోనే సంపూర్ణంగా ప్రభుత్వ సేవలందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 1.36 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. మరో 2.66 లక్షల మందిని వలంటీర్లగా నియమించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందారు. అందువల్ల మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనమూ పెంచుదాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయాల ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీజీఈఎఫ్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, సచివాలయాల ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ మధుబాబు తదితరులతో కలిసి శుక్రవారం అనంతపురంలో ఈ లేఖను విడుదల చేశారు. బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు.. ఇచ్చిన మాట ప్రకారం.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమించి ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం రాకుండా అన్ని సేవలూ గ్రామంలో వారి ఇంటి దగ్గర అందిస్తామని చెప్పినప్పుడు కొందరు హేళన చేశారు. కానీ ప్రజలు నమ్మారు. బ్రహ్మరథం పట్టారు. చెప్పిన మాట ప్రకారమే వైఎస్ జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. కొన్ని సమస్యలు ఉండొచ్చు.. కానీ.. సచివాలయాల ఉద్యోగులకు సమస్యల్లేవని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. సమస్యలు ఒకటి పోతే ఒకటి రిటైరయ్యే వరకు వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి సచివాలయాల వ్యవస్థను రూపుదిద్దుతుంటే ఓర్చుకోలేని కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రొబేషన్ ఖరారు కాకముందు ఎంత మంది హేళన చేశారో అందరికీ తెలుసు. ఒక మాజీ మంత్రి మేం అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదని అన్నాడు. ఇంకో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఎవరైనా మన సచివాలయ వ్యవస్థను టచ్ చేయగలరా? ఒకవైపు ఈ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు చూస్తుంటే.. సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి కొన్ని చానళ్లు, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తూ మానసిక దాడి చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే ఉంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరూ రోజుకు ఇద్దరిని చైతన్యం చేయాలి. ఇలా రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నా’ అనివెంకట్రామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇంకెవరన్నా అయితేనా.. ‘వైఎస్ జగన్ కాకుండా వేరే ఎవరైనా సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌కు మరో సంవత్సరం, పరీక్షలకు ఇంకో సంవత్సరం, నియామకాలకు మరో సంవత్సరం తీసుకొనేవారు. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రొబేషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసేవారు. కానీ, మన ముఖ్యమంత్రి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఇంత పెద్ద వ్యవస్థకు ప్రాణం పోశారు. తర్వాత 010 పద్దు కింద జీతాలు ఇచ్చారు. ప్రసూతి సెలవులు ఇచ్చారు. ప్రొబేషన్ ఖరారులో ఇబ్బంది లేకుండా శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులు తొలగించారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడంతో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ వాయిదా వేయాలని అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టించుకోలేదు. ప్రొబేషన్ డిక్లేర్ చేసి, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చారు.’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్‌తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ.. ‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్‌తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు. 2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్‌కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’ 2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు? ‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్‌గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్‌ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’ త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా? ‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్‌ను లోక్‌సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్‌ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. -
రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: సమాజానికి మార్గదర్శకులు అని మీకు మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దంటూ రామోజీకి గోనె ప్రకాశరావు బహిరంగ లేఖ రాశారు. మీ నిత్య జీవితంలో విలువలు పాటిస్తున్నారా?. ఇతరుల విషయాల్లో మీరు పాటించే సూత్రాలు మీ విషయంలో ఎందుకు పాటించరు?. ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు రామోజీ సమాధానం చెప్పాలి’’ అంటూ ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ‘‘పదిహేను సంవత్సరాలుగా బలహీన వర్గాలకు చెందాల్సిన భూములు మీ అధీనం లో ఉన్నాయి. నాగన్‌పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 189, 203 కింద 14 ఎకరాల 30 గుంటల భూమిని దివంగత సీఎం వైఎస్సార్ బలహీన వర్గాలకు కేటాయించారు. మీ రాజకీయ పలుకుబడితో 15 ఏళ్లుగా పేదల భూమిని ఆక్రమించారు. ప్రభుత్వ రహదారిని రామోజీ ఫిలిం సిటీ కింద ఆక్రమించారు. అనాజ్ పూర్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 13 కి.మీ ప్రభుత్వ రహదారి ఆక్రమించారు. దాని వల్ల కోహెడ ,ఇబ్రహీంపట్నం వెళ్ళటానికి దూరం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు ప్రభుత్వ రహదారిని ఆక్రమించడం వల్ల 16 గ్రామాల్లోని 90 వేల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అంటూ ప్రకాశరావు దుయ్యబట్టారు. ‘‘ప్రజా రహదారిని కబ్జా చేయటాన్ని మీరెలా సమర్ధించుకుంటారు?. మీరు ప్రజా రహదారులను కబ్జా చేయటం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వ రహదారులు మీ ఎస్టేట్ కాదు. మీ సామ్రాజాన్ని సామాన్యులు చూడకూడదు అనుకుంటే భారీ ప్రహరీలు నిర్మించుకోండి. అంతే కానీ అటువైపు ప్రజలు రాకూడదని ప్రభుత్వ రహదారులు ఆక్రమించటం ఏమిటి?’’ అని ప్రకాశరావు ప్రశ్నించారు. ‘‘రామోజీకి 2024 మార్చి 31 వరకు డెడ్ లైన్. ఈ లోపు ప్రభుత్వ భూములు తిరిగి ఇచ్చేయాలి. మీ స్టూడియోలో పని చేసే వారిని ఉన్న పళంగా తీసేస్తారు. వారికి జీతాలు ఇవ్వరు. కార్మికుల చట్టాలు ఉల్లఘించారు. రామోజీ పిరికివాడు, చావు అంటే భయం.సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇస్తా. రామోజీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. లేదంటే వైఎస్సార్ పేరు తలుచుకోవడానికి మీరు అర్హులు కాదు. డెడ్ లైన్ లోపు ప్రభుత్వ భూములను రామోజీ తిరిగి అప్పగించాలి. లేదంటే బుల్డోజర్లు పెట్టి మీ గోడలు కూలుస్తా’’ అంటూ గోనె ప్రకాశరావు హెచ్చరించారు. -
ఇంకా యాచించే స్థితేనా?.. పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న
పశ్చిమ గోదావరి, సాక్షి: మాజీ పార్లమెంటేరియన్, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా చురకలంటించారాయన. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ ద్వారా పవన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే.. బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య. ఏపీలో 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు? అని లేఖ ద్వారా పవన్‌ను నిలదీశారు. ‘‘మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నవాళ్లు.. మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పాలి’’ అని లేఖలో కోరారాయన. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి అనుభవస్తుని నాయకత్వమే కావాలంటూ పవన్ కల్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామజోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు(పవన్) తెస్తారని జనసైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖ ద్వారా నిలదీశారాయాన. -
అర్హత లేకున్నా మిడ్ మానేరు పరిహారం
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన సోమవారం లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసలు మిడ్ మానేరు సమస్య ఏమిటంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్‌కు అభినందనలు తెలియజేసిన సంజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నో ఏళ్ల తరబడి అపరి ష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీ లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరు. లక్ష లాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవ సరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు త్యాగం చేశారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005–06లో నాటి ప్రభుత్వం జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది. 2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇళ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. పన్నెండు గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం తేది 01–01–2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు’ అని సంజయ్ ఆ లేఖలో వివరించారు. వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన సంజయ్ ‘రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు, నేను హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని సంజయ్ గుర్తుచేశారు. -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు. -
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్‌కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
సబ్బండ వర్గాల ఉద్యమాన్ని మింగేశారు
సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బండ వర్గాల’ఉద్యమాన్ని స్వార్థంతో మింగేసిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారథిగా తనను తాను ప్రకటించుకున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమంలో మీ స్వార్థాన్ని గురించి రాస్తే.. పెద్ద గ్రంథాలే తయారవుతాయి’అని నిందించారు. శనివారం సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి మూడో బహిరంగ లేఖ సంధించారు. ’’జలదృశ్యం’వేదికగా గాంధేయవాది కొండాలక్ష్మణ్ బాపూజీను ఉపయోగించుకున్నారు. తర్వాత బాపూజీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. మీతోపాటు తొలి అడుగులు వేసిన గాదె ఇన్నయ్య, విజయరామారావు, రవీంద్రనాయక్, మేచినేని కిషన్‌రావు వంటి నాయకులెందరినో విజయవంతంగా పక్కకు తప్పించడం మీకున్న ప్రత్యేక నైపుణ్యానికి ఒక ఉదాహరణ. తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో ఉన్న ఆచార్య జయశంకర్ సార్ వంటి తెలంగాణవాది భుజాలమీద ఎక్కి మేధావులను ముగ్గులోకి లాగారు. ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డుచేరినాంక బోడ మల్లన్న’అనే సామెత మీకు సరిగ్గా నప్పుతుంది’అని ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల వద్ద నక్క వినయాలు ప్రదర్శించి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ‘సెంటిమెంటును వాడుకుని ఎన్నికల్లో గెలవడం మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు’’అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నాయి ‘ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ వంటి నాయకులను మీతో కలుపుకోవడం ద్వారా వారికి అస్తిత్వం లేకుండా చేయడం, మీ పనైపోయిన తర్వాత వారిని పక్కకు జరిపేయడం మీ ప్రత్యేకత. మీ చేతిలో మోసపోయిన వారిలో ఎక్కువమంది వెనుకబడిన వర్గాల వారే. ధర్నాలు, దీక్షలు, వంటావార్పు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, సాగరహారం, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటివన్నీ ప్రజలు చేస్తుంటే.. ‘గాలికిపోయే పిండి కృష్ణార్పణం’అన్నట్లు..’చివర్లో మీరు, మీ కుటుంబసభ్యులే గెలిపించామన్నట్లు ఫోజులివ్వడం.. వంటివన్నీ తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ఆ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమకారులను ఉరికించి కొడుతుంటే.. దిక్కుమొక్కులేని ఉద్యమాన్ని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, కులసంఘాలు, మేధావులు, జర్నలిస్టులు.. అక్కున చేర్చుకుని తమ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రం సాధించిన తర్వాత వారందరి పరిస్థితి దయనీయంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. -
అందరినీ దూరం పెట్టారు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పారీ్టకి ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెబుతారు’ అని సీఎం కేసీఆర్‌ను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరన్నారో గానీ.. దాని తోకలి్న, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు’ అని మండిపడ్డారు. ఉద్యమ నాయకుడిగా 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్ ఎవరి మాటా వినడు’ అన్నట్లు తయారయ్యారని విమర్శించారు. ఈమేరకు కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ఉద్యమ కాలంలో అన్ని పారీ్టల గడపలు తొక్కిన మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్థిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కారి్మక సంఘాలు, విద్యారి్థ, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తమ కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలామందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది’ అన్నారు. అహంకారం, మీ నియంతృత్వ ధోరణి.. ‘మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి, ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అర్థమైపోతుంది. మీ పారీ్టకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు’అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీవీలను, పత్రికలను 10 కి.మీ లోతులో పాతిపెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచి్చన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీరి్ణంచుకోవడం లేదు. ‘ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేశారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలుచేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖధ్వజమెత్తారు. సీఎం ఎక్కడ ఉంటారో తెలియదు.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు గురచెందుతున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘గతంలో ఎందరో పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవ¯Œన్ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి ప్రజాభీష్టంతో పనిలేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా?’అని ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వంటి పెద్దలెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకలి్పంచారు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదేనా మీ రాజ్యాంగం? ‘మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతిభవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి’ అని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ‘స్పీకర్ దగ్గర జరిగే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు’ అని హెచ్చరించారు. -
తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ప్రజలు ఇది గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని లేఖలో కోరారాయన. ‘‘బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని మోదీ, కేసీఆర్‌లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో చేరినవాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఇది’’ అని లేఖలో పేర్కొన్నారయన. .. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి?. గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరారు రేవంత్. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది!. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది. కేసీఆర్‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. .. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! . పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు’’ అని రేవంత్‌రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు. -
వేమూరి రాధాకృష్ణకు లక్ష్మీ పార్వతి చురకలు
సాక్షి, విజయవాడ: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు అవినీతిని ప్రొత్సహించి.. ఈనాడు టీడీపీని పతనం అంచున నిలబెట్టడంలో రాధాకృష్ణ పాత్రను లేఖలో ప్రస్తావిస్తూ.. చురకలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారామె. చంద్రబాబు, ఆయనకి భుజంగా ఉంటూ రాధాకృష్ణ, రామోజీరావులు.. ఈ ముగ్గురు తెలుగు దేశం పార్టీకి నేటి దుస్థితిని కలగజేశారని లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీలాంటి(రాధాకృష్ణను ఉద్దేశించి..) వాళ్లు ఉంటారని తెలియకనే ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారు. నాడు 201 స్థానాల్లో నెగ్గి ప్రభంజనం సృష్టించిన పార్టీ.. 2019 ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయ్యింది. అందుకు కారణం మీతో పాటు చంద్రబాబు, రామోజీరావులే’’ అని లేఖలో పేర్కొన్నారామె. నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప జర్నలిస్టు స్థాపించిన ఆంధ్రజ్యోతిని ఇప్పుడు ఒక చిత్తుకాగితంగా, చెత్త బుట్టగా మార్చావంటూ రాధాకృష్ణపై లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎవరో కష్టపడి సాధించుకున్నది తెలివిగా ఎత్తుకుపోవడంలో మీ గురుశిష్యులు ఇద్దరూ సిద్ధ హస్తులే అంటూ.. చంద్రబాబుకి, రాధాకృష్ణకి చురకలంటించారామె. తనను టీడీపీలో దుష్టశక్తిగా, సైతాన్గా, రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించిన ఆనాటి యెల్లో మీడియా.. ఆ ఆరోపణల్ని ఇప్పటివరకు రుజువు చేయలేకపోయిందని అన్నారామె. అల్లుడు కదాని అప్పజెబితే ఇల్లంతా ఏదో చేసాడట! నారా లోకేష్‌ను అడ్డదారిలో తీసుకొచ్చి మంత్రిని చేస్తే.. అవినీతి రెండింతలు పెరిగిందని లక్ష్మీ పార్వతి లేఖలో పేర్కొన్నారు. అప్పటిదాకా ఒక చేత్తోనే సంపాదించిన చంద్రబాబు.. కొడుకు చేతుల్ని కలుపుకొని లక్షల కోట్లకు ఎగబాకాడని ఆరోపించారామె. అయినా.. అలాంటి కుటుంబాన్ని జాకీలు పెట్టి లేపడానికి ఆంధ్రజ్యోతి ఉంది కదా అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీ పార్వతి. ఎంత గొప్ప విజనరీనో? చంద్రబాబు విజన్‌కు ఆకాశానికి ఎత్తే రాధాకృష్ణకు లేఖలో చురకలంటించారామె. వెన్నుపోటు, అడ్డగోలు అవినీతి సంపాదన, కేసులు బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ(చంద్రబాబు) గొప్ప విజన్ సాధించారని అన్నారామె. ‘‘ప్రస్తుతం తెలుగుదేశం పరువు ఏ మురుగు గుంటలో పడి దొర్లుతుందో చూడండి. అవినీతి చక్రవర్తి మీ విజనరీ నాయకుడు పై కేసులు మీద కేసులు వస్తుంటే.. జైలు గోడల మధ్య ఊచలు లెక్క పెట్టాడు. కొడుకు నారా లోకేష్ జైలు దారిలో ఉన్నాడు. హెరిటేజ్ లెక్కలు చెప్పలేక భువనేశ్వరి రోడ్లమీద తిరుగుతున్నది. ఎంత గొప్ప విజనరీ’’ అని లేఖలో లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. టీడీపీకి సమాధి కట్టి కోట్లు సంపాదించారు పేదల పార్టీగా ఉన్న టీడీపీని.. పెద్దల పార్టీగా మార్చడానికి చంద్రబాబు, రాధాకృష్ణ చాలా కష్టపడ్డారంటూ విమర్శలు గుప్పించారామె. ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో.. తెలంగాణలో ఇప్పుడు అదే కాంగ్రెస్ కాళ్ల దగ్గర టీడీపీని పెట్టాడని.. ఏపీలోనూ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి తాకట్టు పెట్టే యత్నం జరుగుతోందని.. గంగా నదిలాంటి టీడీపీని మురుగు కాలువగా మార్చి అబద్దాల పునాదుల మీద నడిపిస్తున్నారని మండిపడ్డారామె. తెలుగు దేశం ఖ్యాతిని సమాధి చేసి.. ఆ రాళ్లతో కోట్లు సంపాదించుకున్నారంటూ రాధాకృష్ణ, చంద్రబాబులపై ఆమె లేఖ ద్వారా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. -
బెంగళూరు వెళ్లడం ఘోరమా.. కొడాలి నాని బహిరంగ లేఖ
సాక్షి, అమరావతి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు చనిపోవటం ఘోరమా? లేక బెంగళూరు వెళ్లడం ఘోరమా? అన్నది రామోజీరావు స్పష్టంచేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబునాయుడే 29 మందిని చంపేశారని.. ఘోరం అంటే అది అని కొడాలి నాని తెలిపారు. ఏపీ కార్మికులు కర్ణాటకలో చనిపోయిన ఘటనపై ఈనాడులో రామోజీరావు ‘ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా? అంటూ రాసిన కథనంపై శుక్రవారం కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాలు.. రామోజీరావు.. ముందుగా అసలు మీ బాధేంటో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడమా?.. ఇంకెప్పటికీ ఆయన అధికారంలోకి రాడన్న ఆక్రోశమా? లేక మీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల్ని ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రశ్నించిందన్న తట్టుకోలేనితనమా? వీటిపై ప్రజలకు సమాధానాలు చెప్పితీరాలి. ఒక రాష్ట్రం వారు, ప్రత్యేకించి సరిహద్దుల్లో ఉన్నవారు మరో రాష్ట్రంలో పనులకు వెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచీ జరుగుతోంది. అది చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్లడం సర్వసాధారణమే. ఉదా.. ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజూ కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారు. అలాగే, ఒడిశా నుంచి ఉత్తరాంధ్రకు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వలస వస్తారు. దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి రాత్రికి వెళ్లిపోతే.. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే.. ఇక్కడ ఉపాధిలేక వారు వెళ్లిపోయారా? లేక అక్కడ మెరుగైన ఉపాధి ఉందని వెళ్లారా? అని కనీసం వారి వివరణ కూడా లేకుండా రామోజీరావు రాశారు. ఇది ఎంతవరకు సమంజసం? దురుద్దేశపూర్వకంగా రాసినట్లు కన్పించటం లేదా రామోజీ? ఇలా రాస్తే ప్రజలు విశ్వసిస్తారా?.. ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు హయాంలో ఏటా కరువే.. ఇక చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరంలేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏటా కరువే. ఒక్క 2016నే తీసుకున్నా.. రాయలసీమ నుంచే 6–10 లక్షల మంది వ్యవసాయం చేసుకుంటున్న వారంతా వలసపోయారని అప్పట్లో ఆంగ్ల దినపత్రికలు రాశాయి. అంటే, వ్యవసాయం చేసుకుంటున్న వారు, వ్యవసాయం మానుకుని వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలసపోతే ఆ రోజున రామోజీ ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉద్యమం చేశారు తప్ప, ఇక్కడే ఉపాధి దొరికి ఉంటే.. ఇన్ని లక్షల రైతు కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారేవారా? అని ఏనాడూ ప్రశ్నించలేదు. మరి తేడా ఎక్కడుంది? రామోజీరావు దగ్గరే.. ఆయన మనస్సులో, ఆలోచనల్లో, రాతల్లోనే తేడా ఉంది. ఇక గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబు 29 మందిని చంపేశారు. నిజానికి.. ఆ రోజు అది బాబు చేసిన ఘోరమే. కానీ, చేసింది బాబు కాబట్టి అది నేరమైనా ఘోరమైనా రామోజీకి కమ్మగా కనిపిస్తోంది, తియ్యగా అనిపిస్తోంది. మీ వాడు కాదు కాబట్టే రాళ్లు వేస్తారా? దుర్మార్గులను వెనకేసుకొచ్చి, దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్టపరిహారాన్ని, పైగా వేరే రాష్ట్రంలో ప్రమాదం జరిగినా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మీద, మానవతా సాయం విషయంలో ఏమాత్రం వెనుకాడని నాయకుడి మీద.. తనవాడు కాదు,, గిట్టనివాడు కాబట్టి రాళ్లు వేస్తారా? మరీ ఇంత దుర్మార్గమా రామోజీ? మిగతా రాష్ట్రాలకు వెళ్లడం ఘోరం, నేరం అంటున్న వారు.. మీ తోటి ఎల్లో మీడియా అధిపతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. అసలు మా రాష్ట్రంతో, మీ సొంతూళ్లతో మీకున్న సంబంధం ఏమిటి? చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప, రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది? చంద్రబాబునాయుడుకు అయినా, పవన్‌కళ్యాణ్‌కు అయినా, సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుంది? పవన్‌కళ్యాణ్ తమ్ముడిలా రోజూ మీ ఈనాడులో జగన్ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధించి ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటు నాడే పత్రికా విలువలను హారతి పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు సమర్పించేసుకున్నారు. ఇప్పుడు రామోజీరావు మానవతా విలువల్ని కూడా అదే పద్ధతిలో వదిలేసుకున్నారు. కాస్తంత మానవత్వాన్ని అయినా ఈ 90 ఏళ్ల వయసులో మీరు నిలుపుకోవాలి. -
మరో మేనిఫెస్టో.. దసరా వేషమే!
సాక్షి, అమరావతి/నగరంపాలెం: మాజీ సీఎం చంద్రబాబు అవినీతి కేసులో జైలుకెళ్లి 44 రోజులైనా పవన్‌కళ్యాణ్ మినహా ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు సానుభూతి డ్రామాలు మొదలుపెట్టారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుల్లో లాయర్లపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ‘నిజం గెలవాలి’ అంటున్న నారా భువనేశ్వరి న్యాయస్థానాల్లో సత్యం గెలవడం వల్లే చంద్రబాబు జైలులో ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. స్థాయికి మించి ఎక్కువగా మాట్లాడవద్దని లోకేశ్‌కు హితవు పలికారు. చంద్రబాబు జైలుకెళ్లడం గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎందుకో విపరీతంగా ఆవేశపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను జైలులో కాకుండా ప్రజల గుండెల్లో ఉన్నానంటూ లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు ఆయన పేరు చెబితే గుర్తొచ్చే నాలుగు పథకాల పేర్లను వెల్లడించాలని సూచించారు. తన కోసం ఉవ్వెత్తున ప్రజా చైతన్యం ఎగసిపడుతోందని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలు కూడా ప్రజలే అని గుర్తించాలన్నారు. ‘మీ దుష్ట బృందంలో అందరికీ వయసు పెరిగినా జీవన సంధ్యా సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికీ లేదు’ అని చంద్రబాబుకు చురకలంటించారు. ఈమేరకు అంబటి ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడటంతోపాటు చంద్రబాబునుద్దేశించి రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ♦ 45 రోజుల జైలు జీవితం తర్వాతైనా నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారు. జైలు నుంచి ఈ లేఖను ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి నేను వెళ్లటం లేదు. మీ పేరిట టీడీపీనే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి దాన్ని చదివిన తరవాత మీకు బహిరంగ లేఖ రాస్తున్నా. ఇందులో కొన్ని ప్రశ్నలను అడుతున్నా. ♦ లేఖలో మొదటి వాక్యమే మీరు జైలులో లేనని రాశారు. కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి. క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లను ఉపసంహరించుకోండి. ♦ మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సాగిందన్నారు. తెలుగు ప్రజలు అంటే మీ ఉద్దేశంలో ఎవరు? హైదరాబాద్ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురా? అమెరికా, బ్రిటన్‌లో మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణాలా? ఎన్టీఆర్‌కు మీరు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన మీ మీడియా మిత్రులా? బీజేపీలో ఉన్న మీ బంధువులా? కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా? కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? తెలుగు ప్రజలంటే ఎవరు అన్నది దయచేసి తెలియజేయండి. ♦ ఓటమి భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరో అనుకుంటున్నారని లేఖలో ఆరోపణలు చేశారు. ఒక అవినీతిపరుడిని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుని షోకాజ్ నోటీసు ఇచ్చింది. అది మీరే. స్కిల్ స్కామ్‌లో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. దానికి కర్త, కర్మ, క్రియ మీరే. స్కిల్ స్కామ్‌లో కోర్టు మీకు రిమాండ్ విధించింది. దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. మరి ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయటం ఏమిటి? 45 ఏళ్లు దొరక్కుండా తప్పించుకున్నాననే మీ ఆత్మవిశ్వాసం, వ్యవస్థల మేనేజ్మెంట్ ఈసారి మీకు సాధ్యం కాలేదు. కాబట్టి దొరికిపోయిన దొంగ దేశభక్తుడ్ని అని, ప్రజాసేవకుడ్ని అని భారీ డైలాగులు చెప్పటం బాగోదు. ♦ స్కిల్ స్కామ్‌లో సీబీఐ విచారణ జరగాలని ఎవరో పిటిషన్ వేస్తే మీ ప్యాంట్లు ఎందుకు తడుస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు. అదే నిజమైతే.. కేంద్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా? మరి, రెండింటికీ గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలాగులన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్ధాలే కదా? ♦ ఈ రాష్ట్రంలో ఉండని మీరు, మీ పుత్రుడు, మీ దత్తపుత్రుడు కేవలం గెస్ట్‌లు మాత్రమే కదా? ఇది మీకు వీకెండ్ రిసార్ట్ మాత్రమే కదా? ♦ నా బలం జనమే అని చెబుతున్న మీరు ఈ మధ్య జగన్ గారి స్పీచ్‌లు బాగా చూస్తున్నారని అర్థమైంది. సీఎం జగన్ పొత్తులను నమ్ముకోవట్లేదు. ఇంటింటికీ తాను చేసిన అభివృద్ధిని, రూ.2.38 లక్షల కోట్ల డీబీటీని, ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలను, కడుతున్న 22 లక్షల ఇళ్లను, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పులను చూపించి మీరే నా బలం అని ప్రజలకు చెబుతున్నారు. ♦ చెడు గెలిచినా నిలవదని, మంచి తాత్కాలికంగా ఓడినా కాల పరీక్షలో గెలుస్తుందని మీరు అంటున్నారు. సీఎం జగన్ విషయంలో జరిగింది అదే కదా! ఆ చెడు చేసింది మీరే కదా? ♦ దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోయానంటూ మరో భారీ డైలాగు వదిలారు. 2014 మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 650 వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొదటి సంతకాలకు ఏనాడూ దిక్కూమొక్కూ లేదు. కాబట్టే ప్రజలు మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు తగినట్లే మీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మరో మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? ♦ సంకెళ్లు మీ సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయలేవని అంటున్నారు. మీమీద మీకు అంత నమ్మకం, ధైర్యం ఉంటే మీ ఆదాయం ఎంత? మీ ఆస్తులు ఎంత? అనే అంశంపై నేను పిటిషన్ వేస్తా. కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సీబీఐ విచారణకు సిద్ధపడతారా? ♦ ఎప్పుడూ బయటకు రాని మీ భార్యను ప్రజల్లోకి పంపటం ఎందుకు? వెన్నుపోటు పొడిచినప్పుడే కన్నతండ్రి పక్షాన కాకుండా మీవైపు నిలిచిన ఆమె ఎన్టీఆర్ వారసురాలు ఎలా అవుతుంది? ఎన్టీఆర్‌ను మొదట మీరే పొడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేయాలి. -
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, నల్గొండ: సగం నెల పూర్తయినా ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి.. ఇప్పటికైనా జీతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే రెండు నెలలన్న ఒకటికే జీతాలు ఇవ్వాలంటూ లేఖలో సూచించారు. జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు కట్టలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కోమటిరెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఓపీఎస్‌ను అమలు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. చదవండి: లొల్లి చేస్తే దవడ పగలగొడతా: రేణుకా చౌదరి బుధవారం ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. బానిస బతకుల పార్టీ బీఆర్ఎస్దే. కనీసం అపాయింట్మెంట్ అడిగినా తనకు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్ లాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. కాళేశ్వరం కాంట్రాక్టర్లు, భూ కబ్జాకోరులు బీఆర్ఎస్కు కావాలి. ఉద్యోగులకు ఒకటినే జీతాలు ఇవ్వాలి. ఏడాది కాలంగా పదమూడు, పద్నాలుగునా జీతాలు ఇస్తున్నారు. డిఫాల్టర్లుగా మారడంతో భవిష్యత్తులో లోన్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోడంతో ఉద్యోగులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు అమ్ముడుపోయారు. కేటీఆర్ చేతగాని దద్దమ్మ. పింఛన్లు ఇవ్వలేని వాళ్లు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దోచుకున్న సొమ్మంతా రాబోయే రోజుల్లో బయట పడుతుంది. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తాం’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ‘‘రేపటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. నల్లగొండను దత్తత తీసుకుంటున్నామని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయలేదు.దత్తత తీసుకుంటే ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు’’ అంటూ కోమటిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఎస్సెల్బీసీ సొరంగం ఎందుకు పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేటలో వేల ఇళ్లు నిర్మించారు. నల్లగొండలో ఒక్క ఇళ్లు కూడా ఎందుకు నిర్మించలేదు. రోడ్డు కోసం ఇళ్లు కూలగొట్టి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాత్రం కట్టుకున్నారు. దత్తత పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్కు డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్ అధికారంలోకి రాగామే స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇస్తాం’’ అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
ఇది మన పార్టీ అంతర్గత విషయం మీడియాకు ఎక్కొద్దంటున్నార్సార్!
ఇది మన పార్టీ అంతర్గత విషయం మీడియాకు ఎక్కొద్దంటున్నార్సార్! -
బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటూ వార్తలు.. లేఖలో అసలు విషయం చెప్పిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తనపై జరుగుతున్న దుష్ప్రచారం ఓ ముఖ్యనేత కుట్రేనంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ‘‘నేను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు. ఇదంతా ఇంటి దొంగల కుట్రేనని ఉత్తమ్ వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కేందుకు వాళ్లను తొలగించడానికి లక్ష్యంగా ప్రచారం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సైతం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీలు మారుతుండగా.. మరొకొందరు పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన బహిరంగ లేఖ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. చదవండి: కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు -
అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా నిరసనలు పెల్లుబికాయి. అన్ని జిల్లాల్లో వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల పవన్‌పై పోలీసులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పవన్ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తలచుకొంటే వారాహి యాత్ర ముందుకు సాగదని హెచ్చరించారు. ఈ క్రమంలో వాలంటీర్లు పవన్‌కు మరో లేఖ రాశారు. లేఖలోలో..‘‘పావలా అంత పరువు కూడా లేని పవన్ కల్యాణ్‌కు ఒక లక్షా 30 వేల మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రేసే రెండో లేఖ ఏమనగా...అయ్యా జల్సా రాయుడు గారూ.. మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని..యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు. చదవండి: నా పార్టీ వాళ్లే నన్ను నమ్మడం లేదు: పవన్ కళ్యాణ్ మీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టే.. భయపడి నన్ను తిడుతున్నారు అన్నారు. అయ్యా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని మీ రాజకీయ ప్రత్యర్దులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారు. మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకుని తప్పు చేసినట్టే కదయ్యా. ఆ విషయం బయట పడిందనే భయంతోనే చెప్పు చూపించారా అయ్యా. సినిమాకో క్యారెక్టర్, సినిమాకో హీరోయిన్ను మార్చే మీకు మహిళలంటే చాలా గౌరవం అనుకున్నాము కానీ.. ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా. కానీ ఒక్క విషయం అయ్యా.. హీరోయిన్ పక్కన డ్యాన్సులు వెయ్యడం సులభం. మహిళల్ని గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్‌తో రాదయ్యా. ఆ క్యారెక్టర్ మన పుట్టుకలో ఉండాలి. అయ్యా జల్సా రాయుడు గారూ.. మనం వద్దనుకుంటే విడాకులిచ్చేయవచ్చు. అది మన వ్యక్తిగతం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకొండయ్యా. విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా. ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ప్రేమ పెళ్ళి చేసుకుందని, మీ ఆత్మ గౌరవం దెబ్బతిందని, తుపాకీ పట్టుకుని వీధిరౌడీలా నడిరోడ్డుపైకొచ్చారు గుర్తుందా.. మరిప్పుడు మీరాజకీయాలకోసం లక్షా 30 వేల మంది మహిళల ఆత్మ గౌరవం దెబ్బ తీశారే ఇప్పుడు మా అమ్మానాన్న ఏం పట్టుకుని మీ ఇంటి దగ్గరకు రావాలో మీరే చెప్పండి. అయ్యా జల్సా రాయుడు గారూ.. అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు. వాలంటీర్ల గురించి ఏమనుకుంటున్నావ్.. వాలంటీర్లు అంటే బైక్ లకు సైలెన్సర్లు పీకి రయ్ రయ్ మంటూ దూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి, కుర్చీలు విరగొట్టి నిప్పుపెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజైన రోజే ఫ్లాప్ ఫ్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే రేణు దేశాయ్ ను కూడా గౌరవం లేకుండా అవమానించే చిల్లర బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ఎయిర్ పోర్టుల్లో మంత్రులపై కర్రలతో, రాళ్లతో దాడులు చేసే గూండా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి.. దాని ముందు సెల్ఫీలు దిగే అల్లాటప్పా బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే నీ పేరు చెప్పి వృద్ధుల దగ్గర సంతకాలు పెట్టించుకుని ఆస్తులు కొట్టేసే బ్యాచ్ అనుకున్నావా? వాలంటీర్లు అంటే ప్యాకేజీ కోసం నువ్వు ఎత్తుకోమన్న ప్రతి జెండాను భుజానికెత్తుకునే బానిస బ్యాచ్ అనుకున్నావా? రాసుకోండి జల్సా రాయుడు గారూ.. రాసి పెట్టుకోండి.. వాలంటీర్లు అంటే అవ్వాతాతల గుండె చప్పుడు. సంక్షేమ లబ్దిదారుల చిరునవ్వు.. ఆపన్నుల ఆత్మవిశ్వాసం. బడుగు హలహీన వర్గాల భరోసా. సీఎం జగన్ మాకు బోధించిన కర్తవ్యం ఇదే. ఇది సార్ వాలంటీర్ వ్యవస్ధ అంటే.. ఇది సార్ సేవా సైన్యం అంటే. అయినా క్యారవ్యాన్ ఫుడ్డు, క్యారవాన్ బెడ్డు. మీకెలా తెలుస్తుందిలే’ అంటూ లేఖ ద్వారా పవన్‌ను ఎండగట్టారు. -
పవన్‌కు వాలంటీర్ల బహిరంగ లేఖ.. పది ప్రశ్నలు
పావలా అంత పరువు కూడా లేని పవన్ కళ్యాణ్ గారికి.. రెండున్నర లక్షల మంది సేవా సైన్యం నమస్కరించకుండా వ్రాయు లేఖ ఏమనగా... ‘‘అయ్యా జల్సా రాయుడు గారూ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేసే క్రిమినల్స్ ఈ వాలంటీర్స్ అన్నారు మీరు. కానీ, అయ్యా .. సంక్షేమం పొందే ప్రతి గడపలో మేమే.. అవ్వా తాతల చిరునవ్వులో మేమే. వరదలు వంటి విపత్కర పరిస్దితులలో చేయందించి సాయం చేసింది మేమే. కరోనా వంటి ప్రమాదకర పరిస్దితులలో ప్రాణాలకు తెగించి సాయపడింది మేమే. ఇవేవీ మీ కళ్ళకు కనబడలేదా..? మా సేవలను ప్రశంసిస్తూ దేశమే జేజేలు కొట్టింది మీకు వినబడలేదా... కేంద్ర నిఘా సంస్ధకు చెందిన వ్యక్తి మాగురించి మీకు చెప్పారు అన్నారు. నిజంగా మేము మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటే ఆ నిఘా అధికారి కేంద్ర ప్రభుత్వానికి.. ఆధారాలతో సహా నివేదిక ఇస్తారు. కానీ మీకెందుకు చెప్పారు. ఒక్కటి అడుగుతున్నాం చెప్పు.. నువ్వేమైనా కేంద్ర హోం మంత్రివా చెప్పు...కేంద్ర మంత్రివా చెప్పు.. పోనీ ఎంపీవా చెప్పు.. అసలు ఎమ్మెల్యేవా చెప్పు.. అంతెందుకు జెడ్పీటీసీవా చెప్పు.. ఎంపీటీసీవా చెప్పు.. పోనీ ఓ గ్రామానికి సర్పంచువా చెప్పు. కనీసం వార్డు మెంబరు కూడా కాని నీకు మాగురించి చెప్పిన ఆ నిఘా సంస్ధ అధికారి ఎవరో చెప్పు. అఫ్ కోర్స్ మీకు తిక్కుండొచ్చు...దానికి బాబు గారు ఇచ్చే లెక్కుండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మాపై ఇలాంటి నిందలు వేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాల్సింది. రెండన్నర లక్షల మంది వాలంటీర్లలో దాదాపు లక్షా 30 వేల మంది మహిళలే వున్నారు. వారందరినీ క్రిమినల్స్ అన్నావ్. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశావ్. అయ్యా చివరిగా ఒక్కమాట. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఈ మధ్య పాలిటిక్స్ లో తరచుగా వినిపిస్తున్న మాట...మీ మూడవ భార్య కనబడటం లేదు అని. ఇంకా నయం దానికి కారణం మేం అనలేదు!. ధన్యవాదాలు సార్.. ఇట్లు.. ఏపీ సేవా సైన్యం. సార్.. పవన్ కల్యాణ్ గారూ పై లెటర్‌కు బదులిస్తారా ? లేక ఈ పది ప్రశ్నలకు సమాధానం ఇస్తారా ?.. 1.. వాలంటీర్లు మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారా.. ఇది నీ దత్త తండ్రి రాసిచ్చిన స్క్రిప్ట్ కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 2.. ప్రతీ నెలా ఒకటో తారీఖున తలుపు తట్టి అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెడుతోంది వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 3.. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రతి గడపకూ చేరుస్తున్న సారథులు వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 4.. కరోనా టైంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆదుకుంది వాలంటీర్లు కాదా... హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు ! 5.. కరోనాతో మరణించిన వారిని అయినవారు వదిలేస్తే దహన సంస్కారాలు చేసింది వాలంటీర్లు కాదా..హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 6.. వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించింది వాలంటీర్లు కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 7.. కేరళ మాత్రమే కాదు.. బ్రిటన్ వంటి దేశాలు వాలంటీర్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకున్నది వాస్తవం కాదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 8.. సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పని తీరు బాగుందని ప్రధాని ప్రశంసించలేదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 9.. దత్తతండ్రి పాలనలో వేలాది మంది మహిళలు మిస్ అయ్యింది నిజం కాదా.. నువ్వు ఆ ప్రభుత్వంలో లేవా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! 10.. వాలంటీర్లంటే దత్తతండ్రికి భయం... నీకు వెన్నులో వణుకు.. అందుకే వారిపై నిందలు మోపావు కదా.. హెరిటేజ్ ఐస్ క్రీం తినడం ఆపి నిజం చెప్పు! -
మానవత్వం లేని ప్రభుత్వం
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 73వ రోజున నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. వట్టెం రిజర్వాయర్‌లో అన్‌కాన్‌పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అన్‌కాన్‌పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఇక్కడి నిర్వాసితులంతా నూరు శాతం దళిత, గిరిజనులేనని పేర్కొన్నారు. వీరిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఉద్యోగం కల్పించా ల్సి ఉండగా బాధ్యతను మర్చిపోయిందని విమర్శించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ భూ నిర్వాసితులకు ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు. ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీతోనే నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు వారిని ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. దీంతో నిర్వాసితులు ఉన్న ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి దిక్కులేనివారయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందిచకపోతే పోరాడతామని హెచ్చరించారు. -
దళితులు, గిరిజనులపై మీకెందుకంతా కక్ష! కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని కోరారు. అలాగే పోడు భూములకు పట్టాలిస్తామంటూ హామిలివ్వడమే తప్ప అమలు చేయడం లేదన్నారు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం దళితులు గిరిజనుల భూములను లాక్కుంటారా అని మండిపడ్డారు. అయినా దళితులు, గిరిజనులుపై మీకెందుకు కక్ష అని ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలని లేఖలో పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ దందాకు తెరదించుకుంటే బీజేపీ పక్షాన పెద్ద ఎత్తన ఆందోళ చేపడతామని లేఖలో హెచ్చరించారు. (చదవండి: ఇప్పుడే ఒక అద్భుతం చూశా, తెలంగాణ బిడ్డగా చాలా సంతోషపడుతున్నా) -
పవన్ శ్వాస, ధ్యాస బాబే
ఒక రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించకూడదో చెప్పాలంటే ‘జనసేన’ను మించిన ఉదాహరణ మరొకటి దొరకదు. ఒక నాయకుడు ఎలా ఉండకూడదో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను చూపిస్తే చాలు. ఎదగాలన్న కసి, లక్ష్యం ఏ కోశానా కనిపించవు. కేడర్‌ను కూడగట్టుకుని పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచనే రాదు. టీడీపీని బలోపేతం చేయాలన్న తపన మాత్రం పవన్ ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు–పవన్ కల్యాణ్ బంధం ప్రేమ జంటను మరిపిస్తోంది. నాడు విడివిడిగా పోటీ చేసినా, నేడు కలిసి పోటీ చేయాలనుకుంటున్నా అంతిమ లక్ష్యం బాబుకు మేలు జరగాలన్నదే. ‘మాది వన్ సైడ్ లవ్’ అంటూ మొన్న చంద్ర బాబు బాధ పడిపోవడం చూడలేక పవన్.. అన్నీ వదిలేసి.. నమ్ముకున్న వారిని గంగలో ముంచి.. ఆయన వేలు పట్టుకుని నడవడానికి పడుతున్న పాట్లు చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు.. పవన్తీరును తీవ్రంగా తప్పు పడుతూ, ఆయన ఎత్తులు, జిత్తులు గమనించాలని కోరుతూ ప్రజలకు లేఖ రాశారు. సాక్షి, అమరావతి: ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయమంతా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే. బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం పరితపించే పవన్ కల్యాణ్, బాబుతో తన రాజకీయ వివాహ బంధాన్ని పదిల పరుచుకునేందుకు తహతహలాడుతున్నాడు. రైతుల పేరిట రెండు రోజుల పర్యటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అభిమానులు పవన్ కల్యాణ్‌కు దూరంగా ఉండాలి’ అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా.. పొత్తు ఒక ఎత్తు ♦ నిన్న, మొన్న పవన్‌కల్యాణ్ చేసిన ప్రకటనలు ఆయన అసలు రూపాన్ని బయట పెడుతున్న నేపథ్యంలో, విజ్ఞులైన రాష్ట్ర ప్రజల ముందు కొన్ని అంశాలు ఉంచుతున్నాను. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమే. ♦ బీజేపీ–కమ్యూనిస్టులు ఒక పొత్తులో ఉండరని తెలిసే.. బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదని, తాము సొంతంగా గెలవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో, ఇక వారిని బాబు కోసం తాను వదులుకోక తప్పటం లేదన్న అభిప్రాయం కలిగించటానికే రైట్–లెఫ్ట్–సెంటర్ పార్టీలన్నీ కలిసి రావాలన్న వాదనను పవన్ ముందుకు తోశాడు. ♦ 2014 నుంచి 2018 వరకు బాబుతో పాటు బీజేపీతో కూడా పవన్ దోస్తీ ఏం చెబుతోందంటే.. బాబుకు మిత్రులైతే పవన్‌కు కూడా మిత్రులే. బాబు.. బీజేపీతో విడిపోతున్నప్పుడు పవన్‌ది కూడా అదే రాగం. 2018–19లో ఆయన స్టేట్మెంట్లు చూడండి. బీజేపీ మన రాష్ట్రాన్ని పొట్టలో పొడిచిందని, పాచి లడ్డూలు ఇచి్చందని, విడగొట్టి బీజేపీ సృష్టించిన సమస్యలు చాలు అని, కొత్తగా మరిన్ని ప్రత్యేక సమస్యలు సృష్టించవద్దు అని.. ఉత్తరాదికి దక్షిణాది వారు బానిసలు కారని.. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయబోతున్నానని చెప్పాడు. ఎందుకంటే ప్రత్యేక హోదా వద్దన్న బాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నానన్న సంకేతం పంపగానే పవన్ కల్యాణ్ అలా మాట్లాడారు. ♦ మరోవంక పవన్ కల్యాణ్‌ను టీడీపీ వారు ఏమీ అనకండని అదే సమయంలో చంద్రబాబు ప్రకటన చేయటం గమనించాలి. అప్పట్లో ఆ పరిణామం దత్త తండ్రి, దత్త పుత్రుడి తెరచాటు, తెర ముందు బంధాలను అనుబంధాలను వెల్లడిస్తోంది. వ్యూహాత్మకంగానే బీజేపీలోకి.. ♦ తామిద్దరం కలిసి పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి చంద్రబాబుకు మేలు చేసే కుతంత్రంలో భాగంగానే పవన్ అడుగులు వేశారు. అయితే బాబు మేలు కాంక్షిస్తూ పవన్ తన పార్టీ నుంచి మంగళగిరిలో పోటీ పెట్టలేదు. మరోవంక.. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో చంద్రబాబు టీడీపీ ప్రచారానికి కూడా రాకపోవటాన్ని ప్రజలంతా గమనించారు. బాబు ఆదేశించాడు.. పవన్ ఆచరించాడు అంతే. ♦ మళ్లీ 2019 నుంచి బాబు కేసుల భయంతో మోడీని ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నప్పుడు.. వ్యూహంలో భాగంగానే సుజనా చౌదరి, సీఎం రమేశ్ సహా టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బాబు బీజేపీలోకి పంపాడు. అంతకు మించిన కామెడీ ఏమిటంటే.. ఆదినారాయణరెడ్డిని ఇదే చంద్రబాబు బీజేపీలోకి పంపాడు. అదే ఆదినారాయణరెడ్డి సొంత అన్న కొడుకే జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థి. ♦ బాబు ఆదేశాల మేరకు సీఎం రమేశ్ బీజేపీలోకి... అతని సోదరుడు సీఎం సురేశ్ మాత్రం టీడీపీలోనే! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తే, పదవి పోయిన కొద్ది కాలానికే టీడీపీలో పచ్చకండువా కప్పుకోవటం అంటే.. బీజేపీ అధ్యక్షుడిగా కన్నా ఎవరి జేబులో ఉండి పని చేసినట్టు? ♦ సత్యకుమార్ బీజేపీ సిద్ధాంతాలకు బద్ధుడా? లేక బాబు ఎజెండాకు కంకణ బద్ధుడా? వీరందరి తరహాలోనే బీజేపీతో పొత్తు డ్రామా ఆడి తన మెంటార్, తన ప్రొడ్యూసర్ చంద్రబాబును రక్షించుకునే డ్రామాలో భాగంగానే పవన్ బీజేపీతో కలిశాడు. నాలుగేళ్లుగా ఈ డ్రామా నడిచింది. బీజేపీని వదిలేయడానికి సాకు దొరికింది ♦ ఇప్పుడు బీజేపీకి కర్ణాటకలో ఎదురుగాలి వీస్తోందని ముందుగా సర్వేలు రాగానే.. బాబు–పవన్ మంతనాలు, వారి వ్యూహంలో మార్పులు జరిగిపోయాయి. ఒక వంక బీజేపీ నాయకత్వం.. చంద్రబాబును పచ్చి అవకాశ వాది, మోసగాడు అని.. అతనితో ఎన్నికల పొత్తే ఉండదని స్పష్టంగా పవన్‌కు చెప్పామని అంటోంది. ♦ బాబుతో కలవం అని, తమ క్యాడర్‌ను, ఓటర్ను తమ అస్తిత్వాన్ని కాపాడుకుని విస్తరించుకుంటాం అని బీజేపీ నాయకులు స్పష్టంగా చెపుతుంటే.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ అడగటం అంటే దాని అర్థం ఏమిటి? పొత్తు ఎవరితో? పొత్తు ఎవరి కోసం? ♦ దీని అర్థం కర్ణాటక పోల్ సర్వేల తర్వాత వ్యూహం మార్చుకుని బీజేపీని వదిలేసి, టీడీపీలో చేరటానికి మంచి సాకు పవన్‌కు దొరికిందనే కదా? ♦ గతంలో రెండుసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేంద్రంలో పదవులు కూడా అనుభవించిన రోజున టీడీపీ.. 2019 ఎన్నికల తర్వాత మొన్నటి వరకు పవన్.. వీరిద్దరూ నేరుగా బీజేపీ పార్ట్నర్లు. బీజేపీకి ఫలితాలు అనుకూల పవనాలు ఉన్నంత కాలం... బాబు, పవన్‌ల రాగం తానం పల్లవి. అందుకు భిన్నంగా ఎదురుగాలి ఒక్కచోట వీచిందనగానే అవన్నీ రివర్స్‌లో మారిపోయాయి! సొంతంగా ఎదగాలన్న లక్ష్యమే లేదు ♦ ప్రజలంతా ఒక్క విషయం గమనించాలని మనవి. ప్రాంతీయ పార్టీలు పెట్టిన వారు తమకు తాముగా ఎదగాలనుకుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. ఎంత ఒత్తిడినైనా భరిస్తారు. అలాంటి వారు ప్రజల్లోనే ఉంటారు. దేశంలో అధికారం తెచ్చుకున్న ఏ ప్రాంతీయ పార్టీని చూసినా ఇదే కనిపిస్తుంది. ♦ పవన్‌కు ఇందులో ఏ ఒక్క లక్షణం కూడా లేదు. అతనికి ఇండిపెండెంట్ క్యాడర్ అక్కర్లేదు. ఓట్లు అక్కర్లేదు. సీట్లు అక్కర్లేదన్నట్టు ఈ 15 ఏళ్లుగా రాజకీయాలు చేశాడు. దీని అర్థం ఏమిటి? ఇవన్నీ ఏం చెపుతున్నాయంటే.. బాబుకు పవన్ గత 10 ఏళ్లుగా జీ హుజూర్ అని. అతనికి కావాల్సింది అధికారం కాదు. ప్యాకేజీ మాత్రమే. ♦ ఇంత స్పష్టంగా అన్నీ తానే నిరూపిస్తూ.. ప్యాకేజీ స్టార్ అని ఎవరన్నా పిలవగానే పవన్ కల్యాణ్‌కు అంత ఉలుకెందుకు? తాను గెలవాలని, సీఎం కావాలని ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెడతారా? లేక.. తనకే ఎమ్మెల్యేగా గెలిచే దిక్కు లేకపోయినా.. ఫలానా పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తా అని డాంబికం కోసం ఒక పార్టీ పెడతారా? దత్త తండ్రి కోసం బతకడమే జీవితాశయం ♦ ఈ రోజుకీ పవన్ పార్టీకి లక్ష్యాలు లేవు. ఆశయాలు లేవు. ఎజెండాయే లేదు. అతని జీవితాశయం ఏమిటంటే.. దత్త తండ్రి కోసం దత్త పుత్రుడిగా బతకటం. తాను సీఎం రేసులోనే లేనని, తనకు బలం, బలగం లేవని, రావని చెప్పేసిన ఈ వ్యక్తి.. తక్షణం టీడీపీలో సభ్యత్వం తీసుకుని దుకాణం మూసేస్తే మంచిది. ♦ అంతో ఇంతో తనను నమ్మిన కాపుల ఓట్లన్నీ మూటగట్టి అమ్మటానికే పవన్ డ్రామాలు ఆడుతున్నాడని రెండేళ్ల క్రితమే సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. అదే నిజం అని మరోసారి నిరూపణ అయింది. పవన్ కల్యాణ్ చెబుతున్న సామాజిక న్యాయం అన్నది తోటకూర కట్టో, గోంగూర కట్టో అని కూడా అర్థం అయిన తర్వాత.. ఇక పవన్ కల్యాణ్‌కు వేరే పార్టీ ఎందుకు? పాలిటిక్స్ ఎందుకు? ♦ వ్యక్తిగత జీవితంలో ఏ రాజకీయ విలువలుగానీ, నైతిక విలువలుగానీ లేని ఈయన, బాబు చెప్పినట్టు నటించే పొలిటికల్ యాక్టరే తప్ప, ప్రజా సేవకుడు కాడు, కాలేడు. స్క్రిప్ట్ బాబుది.. యాక్షన్ దత్త పుత్రుడిది ♦ ఈ డ్రామాలన్నింటికీ బాబు చంద్రబాబే. స్క్రిప్ట్ బాబుది. యాక్షన్ దత్త పుత్రుడిది. 2014లో ఒక్క ఎమ్మెల్యే సీటుకుగానీ, ఒక్క ఎంపీ సీటుకు గానీ పోటీ పెట్టవద్దని బాబు ఆదేశిస్తే శిరసావహించిన పవన్.. 2019కి వచ్చేసరికి... ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లను చీల్చటానికి సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో కూటమి ఏర్పాటు చేశాడు. 2019లో తాను ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెపుతున్నది పచ్చి అబద్ధం. ♦ 2019 తర్వాత బీజేపీతో బంధం.. 2023లో బీజేపీతో విడాకులకు రంగం సిద్ధం.. ఈ రెండూ బాబు చేత, బాబు వల్ల, బాబు కోసం పవన్ డ్రామాలు. ఏపీలో అధికార పార్టీ పాలన బాగోలేకపోయి ఉంటే.. ప్రతిపక్షానికి నల్లేరుమీద బండి నడక అయి ఉండేదే కదా? అదే పరిస్థితి ఉంటే బాబు ఒక్కడే ఒంటరిగా పోటీకి దిగేవాడే కదా? ♦ ఆ పరిస్థితి ఎక్కడా లేకపోగా.. పేదలకు, రైతులకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజిక వర్గాలకు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అండగా నిలబడిన సీఎం వైఎస్ జగన్‌కు మరింతగా ఆశీస్సులు ఇస్తున్నాం అని ప్రతి ఉప ఎన్నిక, ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో 2019 తర్వాత కూడా ప్రజలు నిరూపించారు. ♦ 175 శాసనసభ స్థానాలకు 175 మంది టీడీపీ క్యాండిడేట్లు కూడా లేరు కాబట్టి, కనీసం 75 చోట్ల అభ్యర్థులే కరువు కాబట్టి చంద్రబాబు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ నిజం పవన్ కల్యాణ్‌ను కూడా మరింతగా కుంగదీసినట్టుగా ఉంది. బాబుకు అభ్యర్థుల్లేరు.. ఒంటరిగా బరిలో దిగే ధైర్యం పవన్‌కు లేదు. -
జేపీఎస్‌లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
2013లో లీటర్ పెట్రోల్ రూ.76.. ఇప్పుడేమో 110.. క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. '2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి
తమకు న్యాయం చేయాలని కోరుతూ గూగుల్ తొలగించిన ఉద్యోగులు ఏకంగా సీఈవో సుందర్ పిచాయ్కే బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై దాదాపు 1,400 మంది ఉద్యోగులు సంతకాలు చేయడం గమనార్హం. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లేఆఫ్ ప్రక్రియలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! పలు డిమాండ్లు: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు రాసిన ఈ బహిరంగ లేఖలో ఉద్యోగులు పలు డిమాండ్లు చేశారు. కొత్త నియామకాలను స్తంభింపజేయడం, నిర్బంధంగా తొలగించడం కాకుండా ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకునేలా కోరడం, కొత్త నియామకాల్లో తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్ణీత వ్యవధి వరకూ ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించడం వంటి డిమాండ్లను సీఈవో ముందు ఉంచారు. సంక్షోభాలతో సతమతమవుతున్న ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన ఉద్యోగులను ఉద్వాసన నుంచి మినహాయించాలని కోరారు. అలాగే ఉద్యోగ తొలగింపు వల్ల వీసా లింక్డ్ రెసిడెన్సీని కోల్పోయే ప్రమాదం ఉన్నవారిని ఆదుకోవాలని అభ్యర్థించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? అయితే ఈ బహిరంగ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి స్పందించలేదు. గత జనవరిలో సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగాల కోతలను ప్రకటించినప్పుడు ముందెన్నడూ లేని కష్టతరమైన ఆర్థిక పరిస్థతిని ఎదుర్కొంటున్నామని, దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. లేఖ వెనుక యూనియన్లు: ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ టెక్ అండ్ అలైడ్ వర్కర్స్, యూఎన్ఐ గ్లోబల్‌తో సహా పలు యూనియన్లు ఈ బహిరంగ లేఖ వెనుక ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో పిచాయ్‌కి భౌతికంగా లేఖను అందించడానికి కొన్ని రోజుల ముందే ఈ లేఖను సర్క్యులేట్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలిసింది. -
నా యాత్ర ఎందుకు ఆపారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గారు?: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిఖ్ రావు ఠాక్రేకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన హాత్ సే హాత్ జోడో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తనను తీవ్రంగా బాధించిందని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యాత్ర ఆగిపోవడం తనను అప్రతిష్టపాలు చేసిందని, ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న తనను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 'నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి, మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత వరకు సమంజసం? హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది ఏఐసీసీ రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే. అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి ప్రోగ్రామ్స్ అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. అయితే జరుగుతున్న లోపాలను సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా.' అని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చదవండి: నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క -
అచ్చెన్నాయుడు చిట్టా విప్పుతా.. ఎమ్మెల్యే వంశీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ‘‘చంద్రబాబుకు అధికారం దక్కలేదని మా కుల పత్రికలు బాధలో ఉన్నాయని.. అందుకే కావాలని గోబెల్ ప్రచారం చేస్తున్నాయి’’ అంటూ వంశీ దుయ్యబట్టారు. ‘‘చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం లేదు. పార్టీ లేదు బొక్కా లేదు.. గట్టి చెట్నీ వేయమన్న వ్యక్తి అచ్చెన్నాయుడు.. ఓ మహిళా ఆఫీసర్‌పై అసభ్యంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. అచ్చెన్నాయుడు నా గురించి మాట్లాడితే చిట్టా విప్పుతా.. చంద్రబాబు డబ్బు కోసం పదవులు అమ్ముకున్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం జగన్.. అందుకే బీసీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించారు’’ అని ఎమ్మెల్యే వంశీ అన్నారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది? -
‘అలాంటి బాబుతో పవన్ పొత్తు.. సమర్థిస్తారా?’
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి హరిరామ జోగయ్యకి ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబు నాయుడితో పవన్ పొత్తును ఏ విధంగా సమర్థిస్తారని అందులో అమర్నాథ్.. హరిరామ జోగయ్యను నిలదీశారు. ‘వంగవీటి రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు అని మీరే పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ని మీరు సమర్థిస్తారా..?. స్పష్టం చేయాలని హరిరామ జోగయ్యని నిలదీశారు మంత్రి అమర్నాథ్. -
హామీల అమలుకు ఇదే ఆఖరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘మీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇదే మీకు ఆఖరి అవకాశం. ఇప్పటికైనా బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి, హామీలన్నింటినీ రానున్న పదినెలల కాలంలో నెరవేర్చాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలిచ్చారని కానీ నాలుగు బడ్జెట్లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదని వెల్లడించారు. రైతులు, నిరుద్యోగ యువత, బీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, దళితబంధు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం వంటి పలు అంశాలను రేవంత్ తన లేఖలో ప్రస్తావించారు. -
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా!
సాక్షి, హైదరాబాద్: ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. అక్కడ కాంగ్రెస్‌పై కుట్ర జరుగుతోంది. మనల్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పథక రచన చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంచన్ దొరా అని బానిసలవుదామా? నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా? తేల్చుకోవాల్సిన సమయం ఇది. నికార్సైన కాంగ్రెసోడా... మునుగోడుకు రా. మీ కోసం ఎదురుచూస్తుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా, ఊరూవాడా, పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని, అక్కడ కార్యకర్తలు కదం తొక్కి తాడోపేడో తేల్చుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు వేలాదిగా తరలివచ్చి అద్భుత స్వాగతం పలికిన కేడర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారని, కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వారే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పైసాకు పనికిరాని వారు రాజ్యమేలుతూ కాంగ్రెస్‌ను అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆడబిడ్డ అనే భావన కూడా లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేషు్టలుగా ఉందామా? తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియాగాంధీకి ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా? సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం’అని రేవంత్ పేర్కొన్నారు. -
అధికారంతో విషమెక్కావ్.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే ఆగ్రహం
రాలేగావున్/ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ గాంధేయవాది ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్. నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్?.. నువ్వు, మనీశ్ సిసోడియా, అంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది అని ఆయన లేఖలో మండిపడ్డారు. నేను సూచించినట్లుగా.. మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో. అయినా బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆగ్రహం వెల్లగక్కారు హజారే. మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో మండిపడ్డారు హజారే. తన స్వస్థలం రాలేగావున్లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో కితాబిచ్చారాయన. ఇదీ చదవండి: నాకు క్లీన్ చిట్ దొరికిందోచ్! -
కాకులను కొట్టి గద్దలకు వేయడమేనా మీ పని: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో.. ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నామన్నది చేదు నిజమని పేర్కొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పత్రిక ప్రకటన ద్వారా తీవ్ర స్థాయిలోనే కేటీఆర్ స్పందించారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి?.. బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా?. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా. రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా?. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్లకేమో పన్ను రాయితీలా?. మీకు దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదు. నైజీరియా కన్నా అధ్వానం! ఇటీవల ప్రధాని మోదీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!. ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మోదీకి ముందున్న రూ.14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు.రూ. అసలు ఇన్నేసి లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారు?. ఇదీ చదవండి: మునుగోడు వైపు పోనే పోను-వెంకట్‌రెడ్డి అంత అప్పుతో ఏం జేసిన్రు? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని ఈమధ్యనే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది. మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా?. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె. లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారు. ఆదేశిక సూత్రాలే పరమావధి, కానీ.. మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక "సంక్షేమ రాజ్యం" అని నేను ప్రధానమంత్రికి గుర్తుచేయదలిచాను. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు భరోసా ఇస్తాయి. ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజం అని కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మోదీకి ప్రత్యామ్నాయం ఆ ముఖ్యమంత్రేనా? -
ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ
న్యూఢిల్లీ: దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. విపక్షాలు లేఖ రాశాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు లేఖలో ఆరోపించాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంట్ లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు కోరాయి. Opposition leaders write to @rashtrapatibhvn on stalemate in Parliament and "misuse" of investigating agencies by govt. @IndianExpress pic.twitter.com/igaQeOVszK — Manoj C G (@manojcg4u) July 26, 2022 -
నూపుర్ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం
ఢిల్లీ: అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. అయితే ఆమెకు మద్దతుగా.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుబడుతూ మాజీలంతా కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేయడం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదిహేను మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, 25 మంది ఆర్మీ మాజీ అధికారులు ఈ బహిరంగ ప్రకటనలో సంతకం చేశారు. నూపుర్ శర్మ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దీవాలా చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు దురదృష్టకరమని, మునుపెన్నడూ వినలేదని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా.. దేశంలో తనకు వ్యతిరేకంగా నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. నూపుర్ శర్మ భద్రతకు ముప్పు కాదని.. ఆమె తన వ్యాఖ్యలతో దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవక్తకు సంబంధించి కామెంట్లు చేయాల్సిన అవసరం ఏముందని, ఆమె వ్యాఖ్యలే దేశంలో కొన్ని దురదృష్టకర ఘటనలకు కారణమైందని(ఉదయ్‌పూర్ ఘటనను ఉద్దేశించి) బెంచ్ వ్యాఖ్యానించింది. ఇటువంటి వ్యక్తులు మతం కోసం మాట్లాడినట్లు కాదు. అసలు వీళ్లు ఇతర మతాలను గౌరవించే రకం కూడా కాదు. నోటి దురుసుతో దేశం మొత్తాన్ని రావణ కాష్టం చేశారని, యావత్ జాతికి ఆమె మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని సుప్రీం కోర్టు మండిపడింది. అయితే సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్.. నూపుర్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని, తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ఫోరమ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్, జమ్ము అండ్ లడఖ్ అనే సంస్థ లెటర్‌ను రిలీజ్ చేసింది. నూపుర్‌పై తీవ్రవ్యాఖ్యలతో న్యాయమూర్తులు లక్ష్మణరేఖ దాటారు.. తక్షణ దిద్దుబాటు అవసరం అంటూ ఈ మేరకు లేఖను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పంపింది. An open letter has been sent to CJI NV Ramana, signed by 15 retired judges, 77 retd bureaucrats & 25 retd armed forces officers, against the observation made by Justices Surya Kant & JB Pardiwala while hearing Nupur Sharma's case in the Supreme Court. pic.twitter.com/ul5c5PedWU — ANI (@ANI) July 5, 2022 చదవండి: న్యాయవాది అని నూపుర్ చెప్పుకోవడం సిగ్గుచేటు- నూపుర్ -
అగ్నిపథ్ నిరసనకారులకు సోనియా గాంధీ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: నిరసన ప్రదర్శనలుగా మొదలై హింసాత్మక మలుపు తీసుకున్నాయి అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది కూడా. ఈ తరుణంలో నిరసనకారుల వెన్నంటే ఉంటామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘అగ్నిపథ్‌కు ఒక దిశానిర్దేశం అంటూ లేదు. మీ గొంతుకను కేంద్రం పట్టించుకోవట్లేదు. చాలా మంది మాజీ సైనికాధికారులు కూడా కొత్త పథకం గురించి ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తారు. కేంద్రం దగ్గర సమాధానం లేదు. నిరసనకారులు.. అహింసాయుత పద్ధతుల్లో నిరసన తెలియజేయండి. ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ అంటూ సోనియా పేరిట లేఖ విడుదల చేశారు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్. देश के युवाओं के नाम @INCIndia अध्यक्ष श्रीमती सोनिया गांधी की तरफ से संदेश। pic.twitter.com/K7BYcnNODw — Jairam Ramesh (@Jairam_Ramesh) June 18, 2022 కరోనాతో ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో ప్రస్తుతం సోనియా గాంధీ చికిత్స పొందుతున్నారు. ‘‘పథకానికి వ్యతిరేకంగా మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న వాగ్దానానికి.. భారత జాతీయ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. నిజమైన దేశభక్తితో హింసకు తావులేకుండా సహనంతో మీ తరపున మా గొంతుకను వినిపిస్తాం.. మీరూ అహింసా మార్గంలోనే నిరసనలు చేపట్టండి.. అంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఎనిమిది రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక ఆందోళనల్లో ఒకరు(తెలంగాణ వరంగల్ నుంచి రాకేష్) కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. యూపీ, బీహార్ నుంచి మొత్తం 600 మంది నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు ఆయా రాష్ట్రాల పోలీసులు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ!
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ పనితీరు అనుమానాకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు. ఘటనలో కేసీఆర్ రాజకీయ మిత్రుల వారసుల పేర్లు ప్రముఖంగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిస్తున్నాయని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసి.. సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్లు లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/uwr4ivDW5c — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 4, 2022 చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సంచలన ఫొటోలు, వీడియోలు బయటకు.. -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ.. ఏమన్నారంటే..?
సాక్షి, హైదరాబాద్: సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్టు పెరిగినా తగ్గినా దేశంలో రేటు పెంచడమే తమ పనిగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు. చదవండి: వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. పన్నులు పెంచడమే పరిపాలనగా భ్రమిస్తోంది. దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాల నుంచి 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. ఒక్కో కుటుంబం నుంచి లక్ష రూపాయాల పెట్రో పన్నును కేంద్రం దోచుకుంది. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా?. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదం చేస్తుంది. పెట్రో ధరల పేరిట ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. ప్రజలను దోపిడి చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను ప్రధాని క్షమాపణ కోరాలి. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు తిరస్కరించడం ఖాయం’’ అంటూ కేటీఆర్‌లో లేఖలో దుయ్యబట్టారు. లేఖలో ఏమన్నారంటే.. ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్‌గా తిరిగొస్తుంది. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి, పేదల బాధల పట్ల మొసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోదీ, అధికారంలోకి వచ్చినంక ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి పాలిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ల నుంచే తన చేతకానితనం, తమకు అస్సలు తెలియని ఆర్థిక విధానాలతో ప్రజల్ని పీడించుకు తింటున్నది కేంద్ర ప్రభుత్వం. నేనిలా విమర్శించడానికి అడ్డూ అదుపు లేకుండా రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, ఆకాశాన్ని దాటి అంతరిక్షానికి చేరుకుంటున్న నిత్యావసరాల ధరలే కారణం. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయింది. ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలే. అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పక్కనున్న దాయాది దేశాలతో పాటు, అర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2014 లో బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కాని కరొనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోడీ ప్రభుత్వం మాత్రం ప్రజలు తగ్గిన ధరల ప్రయోజం పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొదలేకపోయారు. 2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రు.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజుకి 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాని 2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు. రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్ర్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోడీ ప్రభుత్వం. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా... దేశం కోసం.. ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. బహిరంగంగా తాను చేస్తున్న దోపిడిని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్న బట్టేబాజ్ సర్కార్ కేంద్రంలో ఉంది. ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం నీతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చింది. ఇందులోని మర్మాన్ని సవిరంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 2014కు ముందుకు పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48గా ఉండేది. అధికారంలోకి వచ్చినంక మోదీ దాన్ని రూ.32.98కి పెంచారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్ర మంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నది. కాని ఇది పచ్చి అబద్ధం. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమే. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుంది. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్ర మోదీ, పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోదీ సర్కార్ వసూలు చేస్తోంది.ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే.. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు రావాలి. కానీ బీజేపీ అవకాశవాద, అసమర్థ విధానాలను చూసిన తర్వాత తరచూ ఎన్నికలు వస్తే బాగుంటుందని, అట్లయిన పెట్రోలు ధరల పెంపు ఆగుతుందన్న ఆలోచనల్లోకి ప్రజలు వచ్చారు. పెట్రో ధరల పెంపును ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్న బీజేపీ ఎన్నికల తర్వాత అత్యంత కర్కశంగా వరుసగా పెట్రో ధరలను పెంచుకుంటూ పోవడాన్ని అలవాటుగా మార్చుకుంది. 2017 గుజరాత్ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికలు, 2020లో 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని వారాలు, నెలలపాటు పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. కాని ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి దాదాపు ప్రతీ రోజూ పెట్రో ధరల్ని మోదీ సర్కార్ పెంచుకుంటూ పోతున్నది. గత పదిహేను రోజుల్లో 13 సార్లు పెట్రోల్ ధరలను పెంచి ప్రజలన్నా, ప్రజల కష్టాలన్నా తనకు ఎంత చులకనభావం ఉందో మోదీ సర్కార్ చాటుకుంది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన పాపానికి. ప్రజలకు మోదీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తనకు చేతకాని పాలనను పక్కనపెట్టి కేవలం పెట్రో ధరలను పెంచడాన్నే అలవాటుగా మార్చుకుందంటే అతిశయోక్తి కాదు. పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయని అడిగిన ప్రతీసారి అదరకుండా, బెదరకుండా అబద్దాన్ని చెప్పే దొంగ నేర్పు ప్రస్తుత కేంద్ర మోదీ సర్కార్ కు పుష్కలంగా ఉంది. అందుకే తాజా ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా కేంద్ర మంత్రులు చూపిస్తున్నారు. లోక్ సభలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి రామేశ్వర్ తేలి చేసిన ప్రకటన ప్రకారం రష్యా నుంచి కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ క్రూడాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, అమెరికా నుంచే మనం అత్యధికంగా పెట్రో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాము. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ఈ దేశాల నుంచి మనకు పెట్రో ఉత్పత్తులు రావడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఒక్క శాతాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. ఇలా పదే పదే అబద్దాలను వల్లె వేసీ..వేసీ.. బీజేపీ నాయకుల నోట్లోని నాలుకలు కూడా సిగ్గుపడుతున్నాయి. మానవత్వం అస్సలు లేని ప్రభుత్వం దేశ ప్రజల నెత్తి మీద తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా సంక్షోభాన్ని అత్యంత్య దారుణంగా మార్చిన మోదీ సర్కార్, ఆ టైంలో పంపిణీ చేసిన ఆహార ధాన్యాలు, వ్యాక్సిన్ల ఖర్చును పెట్రోల్ ధరలతో వసూలు చేసుకుంటామని సిగ్గులేకుండా ప్రకటించింది. ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలపై భారీగా పన్నులు వసూలు చేయడమే అన్న స్ఫూర్తితోనే నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రధానమంత్రి పెట్రో పన్ను యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందనిపిస్తుంది. సమర్థ విధానాలు, నిర్ణయాలతో సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ.. సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాలి కానీ కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న, బీజేపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రజలు సాగనంపే రోజు దగ్గర పడింది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడం ఖాయం పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారింది. బీజేపీ హయాంలో గ్యాస్ బండ.. మోయలేని గుదిబండగా మారింది. దీంతో మోడీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదు. పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చింది. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నది. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైంది. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నది. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలే.. అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాల పై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్‌గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే.. ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వేంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. -
పుతిన్‌ను ఆపకపోతే పెనువిధ్వంసమే: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య
Olena Zelenska Open Letter: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ భార్య, ప్రథమ మహిళ అయిన ఒలెనా జెలెన్స్కా.. రష్యా యుద్ధకాండను నిరసిస్తూ ప్రపంచ మీడియాకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఉక్రెయిన్ పౌరులపై రష్యా చేసిన సామూహిక మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ పై రష్యా నమ్మశక్యం కాని విధంగా దాడి చేస్తోంది. మాస్కో మద్దతుగల దేశాల హామీతోనే మా దేశాన్ని వ్యూహాత్మకంగా చట్టుముట్టి దాడి చేస్తున్నప్పటికి దీనిని ప్రత్యేక ఆపరేషన్ గా పిలుచుకుంటున్నారు. అంతేకాదు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడిచేయనని రష్యా చెప్పింది. అది(రష్యా) చేస్తున్న పనులకు చెబుతున్న మాటలకు పొంతనే లేదు. మాస్కో పౌరులపై ఏ విధంగా దాడి చేసిందో నేను వివరిస్తాను. చాలామంది చిన్నారులు తమ తల్లిదండ్రులతోపాటు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అనాథలుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించిన విధ్వంసకర యుద్ధం. పుతిన్ ను అడ్డుకోకుంటే ఎవరికీ రక్షణ ఉండదన్నారు. ‘‘అణు యుద్ధం మొదలు పెడతానంటూ బెదిరిస్తున్న పుతిన్ ను మనం నిలువరించకపోతే ప్రపంచంలో సురక్షిత ప్రదేశం అంటూ మనకు ఉండదు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు. View this post on Instagram A post shared by Olena Zelenska (@olenazelenska_official) ఈ యుద్ధ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. పిల్లలతో పారిపోయి అలసటతో ఉన్న తల్లుల కళ్లలోకి చూడండి, అంతేకాదు కేన్సర్ రోగులు ఈ సంక్షోభం కారణంగా అవసరమయ్యే కీమోథెరఫీ వంటి అత్యాధునిక చికిత్సలు అందక మరణిస్తున్నవారు కొందరూ. అంతేకాదు భారీ అగ్ని ప్రమాదాల కారణంగా ఆస్మా వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారిపరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దయ చేసి మా గగనతలం మూయండి అంటూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి ప్రేక్షపాత్ర వహించింది నాటో" అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ లేఖ రాశారు. (చదవండి: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్!) -
సోషల్ మీడియా పోస్టులకు బెదిరిపోను
గోకవరం: తనను తిడుతూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు బెదిరిపోనని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా పైకి లేస్తుందన్నారు. అలాగే ఎవరో తిడుతున్నారని బలమైన ఆలోచనలను తాను వదలి పెట్టనన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాకు విడుదల చేశారు. ఇటీవల తాను రాసిన లేఖలకు కొంతమంది పెద్దలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తన న్యాయమైన ఆలోచనలను అమలు చేయొద్దని చెప్పడానికి ఇతరులెవరికీ హక్కు లేదన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొందరు నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటిస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే వారిని దగాకోరులు, దొంగలు అని చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తనను సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి ప్రముఖుల గురించి ఒక మాట రాసినా తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిని మంచి అని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తోందని గుర్తు చేశారు. 1989 నుంచే తనకు ఎన్నో ఆశలు, ఆలోచనలు ఉన్నాయన్నారు. ఐదేళ్ల క్రితం దళిత నేత డాక్టర్ రత్నాకర్ తన వద్దకు వచ్చి మూడో ప్రత్యామ్నాయం గూర్చి మాట్లాడారని తెలిపారు. అలాగే రెండేళ్ల క్రితం బీసీ నేత కుడుపూడి సూర్యనారాయణరావు ‘నిత్యం ఒకే బొమ్మ కాదు, బొమ్మ తిరగేయాలి’ అని తనతో చెప్పారన్నారు. రత్నాకర్ లేవనెత్తిన విషయాన్ని సూర్యనారాయణతో చర్చించానని తెలిపారు. చిన్న ప్రయత్నంగా ప్రత్యామ్నాయం అనేదాన్ని మొదలు పెడదామని చెప్పానన్నారు. -
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతులపై కపట ప్రేమ చూపడం మానుకోవాలని సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన వరి ధాన్యం బకాయిలు ఇంకా రూ.600 కోట్లు చెల్లించాలని బహిరంగ లేఖ రాశారు. వరి ధాన్యం కొనుగోలు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని లేఖలో ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ రైతుల పట్ల చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఎడ్చినా రాజ్యం ఎప్పటికీ బాగుపడదు.. కాబట్టి ఇక నైనా రైతులు కన్నీరు పెట్టుకునే చర్యలను మానుకోవాలని సూచించారు. వానకాలం పంట పనులు ప్రారంభమై రైతులు నాట్లు వేసుకుంటున్న ఇంకా వరి ధాన్యం కొనుగోలు బకాయి బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీని వల్ల దాదాపు లక్ష మంది వరకు రైతున్నలు డబ్బులు రాక ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఇకనైనా కళ్లు తెరిచి రైతులకు రావాల్సిన డబ్బులను మంజూరు చేయాలన్నారు. కేసీఆర్ కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఆగమేఘాల మీద నిధులు విడుదల చేసి.. రైతుల విషయంలో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసలు మీకు రైతులంటే ఎందుకు అంతా చిన్నచూపు.. దేశానికి పట్టెడన్నం పెడుతున్నందుకా..? లేదా మీరు ఎం చేసిన రైతన్న ఎదురు తిరగడు కాబట్టా...? అని ప్రశ్నించారు. వెంటనేరైతులకు బకాయిపడ్డ రూ. 600 కోట్లు నిధులు విడుదల చేయాలని లేదంటే రైతన్నలను వెంటబెట్టుకుని ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ పార్టీ తరపున ముట్టడి చేస్తామని ఆల్టిమేటం జారీ చేశారు. -
ఈసారి భారతరత్న వాళ్లకే ఇవ్వండి: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ కూడా రాశాడు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. చదవండి: ఉచిత విద్యుత్.. రోజంతా కరెంట్ లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, దేశం మొత్తం వైద్యులను కీర్తిస్తోందని, వారందరినీ భారతరత్నతో గౌరవిస్తే భారతీయులందరూ సంతోషిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఐఎంఏ లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు. -
మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘ఈనెల 8వ తేదీ నుంచి పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా నెరవేర్చాల్సిన హామీలను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం. మీరు సిద్ధమా?’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌కు రేవంత్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ, టీఆర్ఎస్ల శరీరాలే వేరని, ఆత్మలు ఒక్కటే అన్నది వాస్తవమని, కాదని చెప్పదల్చుకుంటే తన సవాల్‌కు స్పష్టంగా స్పందించాలని ఆ లేఖలో రేవంత్ డిమాండ్ చేశారు. ఐటీఐఆర్‌తో పాటు రాష్ట్ర విభజన హామీలను సాధించుకునేందుకు సిద్ధమైతే తన సవాల్‌ను స్వీకరించాలని, అలా కాకుండా తన దొడ్లోని కుక్కలతో మొరిగించే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా మీ ప్రకటనల హడావుడి, ఆర్భాటపు మాటలు వింటుంటే నవ్వొస్తోంది. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీపై యుద్ధమే అని ఇప్పుడు మీరు నిద్రలేచి కాలుదువ్వుతున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడి యువత భవిష్యత్ ముఖ్యమైతే ధర్నాకు రండి. ఢిల్లీలో నిరవధిక దీక్ష చేద్దాం. లేదంటే మీరు మోదీకి తొత్తుగా, తెలంగాణ ద్రోహిగా ప్రజల దృష్టిలో శాశ్వతంగా మిగిలిపోతారు’ అని ఆ లేఖలో రేవంత్ ప్రస్తావించారు. చదవండి: ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే.. విజిలెన్స్ పట్టించినా.. ఆర్టీసీ వదిలేసింది -
ఫేస్బుక్ సీఈఓకు ఇమ్రాన్ ఖాన్ లేఖ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ సీఈఓకు సోమవారం లేఖ రాశారు. సోషల్ మీడియా వేదికపై ఇస్లాం వ్యతిరేక కంటెంట్‌ను నిషేధించాలని కోరారు. ఇస్లాంపై దాడిచేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడిపై మండిపడిన కొద్దిసేపటికే ఫేస్బుక్ సీఈఓకు ఇమ్రాన్ లేఖ రాశారు. ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఇస్లామోఫోబియా పెరిగిపోతుండటం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను ప్రేరేపిస్తోందని సోషల్ మీడియా దిగ్గజానికి రాసిన బహిరంగ లేఖను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్ వేదికగా ఇస్లామోఫోబియో, ఇస్లాంపై విద్వేష కంటెంట్‌ను నిషేధించాలని ఆయన కోరారు. చదవండి : ఇమ్రాన్‌కు భంగపాటు తన లేఖలో ఫ్రాన్స్‌లో పరిస్థితిని కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్‌లో ఇస్లాంను ఉగ్రవాదంతో ముడిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరికి వ్యతిరేకంగా ఏ ఒక్కరూ విద్వేష సందేశాలను పంపడం ఆమోదయోగ్యం కాదని పక్షపాతంతో కూడిన ఇలాంటి ఘటనలు హింసాప్రవృత్తిని మరింత పెంచుతాయని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇమ్రాన్ లేఖపై ఫేస్బుక్ ప్రతినిధి స్పందిస్తూ ఏ రూపంలోనైనా విద్వేషాన్ని తాము వ్యతిరేకిస్తామని, మతం, వర్ణం, జాతి ప్రాతిపదికన దాడులను అనుమతించమని స్పష్టం చేశారు. -
సుశాంత్ మృతి : నిర్మాతల మండలి బహిరంగ లేఖ
ముంబై : యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదాంతం బాలీవుడ్లో బంధుప్రీతి, పక్షపాత వైఖరితో పాటు డ్రగ్స్ వంటి పలు అంశాలపై గత కొద్ది వారాలుగా వాడివేడి చర్చ సాగుతోంది. స్టార్‌కిడ్స్‌కే బాలీవుడ్లో పెద్దపీట వేస్తారని సుశాంత్ సన్నిహితులు, సెలబ్రిటీలు గళం విప్పడంతో పాటు సోషల్ మీడియాలోనూ భారీ చర్చే నడిచింది. దీనిపై భారత చలనచిత్ర నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా) స్పందిస్తూ శుక్రవారం బహిరంగ లేఖతో ముందుకొచ్చింది. యువ హీరో విషాదాంతాన్ని సినీ పరిశ్రమతో పాటు పరిశ్రమ సభ్యుల ప్రతిష్టను దిగజార్చేలా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి రంగంలో మాదిరే సినీ పరిశ్రమలోనూ లోటుపాట్లు ఉన్నాయని, వీటిని సరైన దిశలో చక్కదిద్దుకోవచ్చని, అయితే పరిశ్రమ అంతటినీ ఒకే గాటనకట్టడం సరైంది కాదని స్పష్టం చేసింది. చదవండి : సిద్దార్థ్ శుక్లా నన్ను చాలా హింసించాడు... సినీ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి ఇస్తూ కోట్లాది మందికి శతాబ్ధానికి పైగా వినోదం అందిస్తోందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ పేర్కొంది. హాలీవుడ్ ప్రాబల్యాన్ని తట్టుకుని పలు భాషా చలనచిత్ర పరిశ్రమలతో పాటు బాలీవుడ్ నిలదొక్కుకుందని వివరించింది. ఆపద సమయాల్లో చిత్ర పరిశ్రమ దేశ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తుచేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైపుణ్యాలను బాలీవుడ్ ఆహ్వానించిందని, నూతన నైపుణ్యాలను పరిశ్రమ అడ్డుకుందని ప్రచారం చేయడం అవాస్తవమని తెలిపింది. పరిశ్రమకు సంబంధం లేని ఎంతోమంది ఫిల్మ్ ప్రొఫెషనల్స్ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని, వీరిలో నటులు, డైరెక్టర్లు, రచయితలు, సంగీత దర్శకులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ప్రొడక్షన్ డిజైనర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు వంటి ఎందరో ప్రొఫెషనల్స్ సినీ నేపథ్యం లేకుండానే ఎదిగారని తెలిపింది. సినీ పరిశ్రమలో కొత్తవారు నెగ్గుకురాలేరని మీడియాలోనూ తప్పుదారిపట్టించే కథనాలు రావడం బాధాకరమని పేర్కొంది. -
మీలా రాజకీయ వ్యాపారిని కాను..
సాక్షి, కావలి: ‘కర్ణాటకలో నిర్మాణ రంగంలో వ్యాపారం చేసుకుంటూ.. ఆర్థికంగా స్థిరపడ్డాక నేను పుట్టి పెరిగిన కావలి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను.. మీలా రాజకీయాలతో వ్యాపారం చేసే వ్యక్తిని కాను’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా మీ చెప్పు చేతల్లో ఉన్న పచ్చ మీడియాలో నీచమైన రాతలు, ప్రచారాలు చేయించిన బీద రవిచంద్ర ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా తనపై కావలి నియోజకవర్గ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని, అందుకే తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. తాను ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానో.. వాటిని సాధించాలనే పట్టుదలతో ఉన్నానని పేర్కొన్నారు. (అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు) అన్ని రంగాల్లో వెనుకబడిన కావలి నియోజకవర్గంలో సాగు, తాగునీరు, రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, పారిశ్రామికవాడ, విమానాశ్రయంతో పాటు రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగు, ప్రభుత్వ వైద్యం నాణ్యతగా ప్రజలకు అందేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాజకీయ వ్యాపారైన బీద రవిచంద్ర నిత్యం రాజకీయాలు మాత్రమే చేస్తూ, అందర్నీ ఆ ఊబిలోకి లాగేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను సాధించాలనుకున్న కావలి అభివృద్ధి లక్ష్యాన్ని నీరుగార్చేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను వీటిని పట్టించుకోనని, అయితే సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. అక్రమార్జనపై సీబీఐ, సీబీసీఐడీ, అఖిలపక్ష కమిటీ ద్వారా విచారణకు సిద్ధపడాలని బీద రవిచంద్రకు సూచించారు. -
కోవిడ్-19 : మానవత్వం చాటిన మిలియనీర్లు
లండన్ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రపంచానికి తమ వంతు సాయం చేస్తామంటూ కొందరు కుబేరులు ఉదారంగా ముందుకొచ్చారు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకునేందుకు తమ వంటి అత్యంత సంపన్నులపై కోవిడ్-19 ట్యాక్స్ విధించాలని 80 మందికి పైగా మిలియనీర్లు ప్రభుత్వాలకు విజ్క్షప్తి చేశారు. మానవత్వం కోసం మిలియనీర్లుగా తమను తాము అభివర్ణించుకున్న వీరంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో సంపన్నులపై కోవిడ్ పన్ను వసూలు చేయాలని కోరారు. కుబేరులపై అధిక పన్నును సత్వరమే శాశ్వత ప్రాతిపదికన విధించాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ మేకర్ అభిగల్ డిస్నీ, స్క్రీన్‌రైటర్ రిచర్డ్ కర్టిస్, బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీం సహవ్యవస్ధాపకులు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్, అమెరికన్ వ్యాపారవేత్త సిడ్నీ టోపాల్, న్యూజిలాండ్ రీటైలర్ స్టీఫెన్ టిండాల్ తదితర ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ వంటి మిలియనీర్లు ప్రపంచం కోలుకునేందుకు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని లేఖలో వారు స్పష్టం చేశారు. తాము ఇంటెన్సివ్ కేర్ వార్డుల్లో ఉండే రోగుల పట్ల జాగ్రత్త వహించలేమని, రోగులను తరలించేందుకు అంబులెన్స్‌లను నడపలేమని, ఇంటింటికీ ఆహారం అందించలేమని..అయితే తమ వద్ద పేరుకుపోయిన డబ్బుతో అవసరార్ధులకు సాయం చేయగలమని వారు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కేందుకు రాబోయే రోజుల్లో డబ్బు అవసరం అధికంగా ఉందని అన్నారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు అత్యంత సంపన్నులు ఈ లేఖను ప్రభుత్వాల ముందుంచడం గమనార్హం. మహమ్మారి విరుచుకుపడటంతో ఎదురయ్యే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు ప్రభుత్వాలు సంపన్నులపై పన్నులను పెంచాయి. చదవండి : కపూర్ కుటుంబంలో కరోనా కలకలం! అధిక పన్నులు విధించడం మినహా మరో మార్గం లేదని బ్రిటన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ స్పష్టం చేసింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛెజ్ సైతం అధిక పన్నులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల సంకేతాలు పంపారు. కరోనా వైరస్ ప్రభావంతో పడిపోయిన రాబడిని పెంచుకునేందుకు అధిక ఆదాయ వనరులు కలిగిన పౌరులను రష్యా టార్గెట్ చేసుకంది. ఇక చమురు ధరలు తగ్గడం, వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు సౌదీ అరేబియా సేల్స్ ట్యాక్స్‌ను పెంచింది. కాగా ఆక్స్‌ఫాం, ట్యాక్స్ జస్టిస్ బ్రిటన్, అమెరికాలో అత్యంత సంపన్నులతో కూడిన పేట్రియాటిక్ మిలియనీర్స్ వంటి గ్రూపులతో కూడిన మిలియనీర్స్ ఫర్ హ్యూమనిటీ వేదిక ఏర్పాటైంది. -
గ్లోబల్ లీడర్‌గా భారత్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. కోవిడ్–19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న మోదీ తన లేఖలో గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. మోదీ లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం ‘గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్‌ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్ లీడర్‌గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీ యం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం’. రైతులు, మహిళలు, యువత సాధికారత ‘మహిళలు, యువత, రైతుల సా«ధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్‌లో 15 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని హామీ ఇచ్చాం’ తొలిగిపోతున్న గ్రామీణ, పట్టణ అంతరాలు ‘పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నాం’ కరోనాపై ఐక్య పోరాటం ‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి’ ఆత్మనిర్భర్ భారత్‌తో కొత్త దశ దిశ ‘లాక్డౌన్ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నాం. స్వయం సమృద్ధ భారత్‌ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుంది’. -
రైతు సమస్యలపై తక్షణం స్పందించాలి
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, లాక్డౌన్ సమయంలో ధాన్యం కొనుగోలు సమస్యలు, పంటనష్టం, పిడుగుపాటు తదితర అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాటలు తప్ప చేతలు కనిపించడం లేదని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో జరిగిన పంటనష్టం అంచనాలను సిద్ధం చేసి పరిహారం ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రూ.లక్ష పంట రుణమాఫీ తక్షణం అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా తరుగు, తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, పిడుగుపాటుతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలన్నారు. ఈమేరకు రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. -
తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రబీలో సాగైన పంటలు, ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితిపై సీఎంకు లేఖలో వివరించారు. రైతులను ఆదుకునే విషయంలో తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్-19 గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మద్దతు ఇస్తామని తెలియజేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి.. 1. మే 7 వరకు లాక్డౌన్ పొడిగించిన మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కరోనాను మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ లాక్డౌన్ పొడిగింపు వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిద్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా అన్నదాత అయిన రైతన్న మరీ ప్రమాదంలో పడ్డాడు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది. 2. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 53.68 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. రబీ సాధారణ విస్తీర్ణం 31. 58 లక్షల ఎకరాలు కాగా... ఈ సీజన్ లో 70 శాతం అదనంగా (మొత్తం 170 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వ్రభుత్యానికి నివేదిక ఇచ్చింది. ప్రధానంగా వరి 39.24 లక్షల ఎకరాలు మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాలు, శనగ(బెంగాల్ గ్రామ్ ) 3.28 లక్షల ఎకరాలు, వేరుశనగ 2.30 లక్షలఎకరాల విస్తీర్ణంలో సాగయ్యాయి . 3. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 16.89 లక్షల ఎకరాలు కాగా... ఈ రబీలో 39.24 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి 132 శాతం ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగైంది . సగటున ఎకరానికి 28 క్వింటాళ్ల చొప్పున 11 కోట్ల క్వింటాళ్లు (1.10 కోట్ల టన్నుల) వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. రైతు పండించిన ప్రతి గింజ కొంటామని, రాష్ట్రంలో 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో ఆదివారం నాటికి 4,380 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు 6.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల, ఏఎమ్మార్పీ కింద 1 లక్ష ఎకరాలు కలిపి 3.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతే .. 3 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అయిన వరి ధాన్యం మొత్తాన్ని మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్ మిల్లర్లే కొనుగోలు చేశారు. మరో 80 వేల ఎకరాల్లో ఇంకా వరి కోతలు పూర్తికాలేదు. అంటే ప్రభుత్వం కొనేది తక్కువ, మిల్లర్లు కొనేది ఎక్కువ ఉంది. అదే క్రమంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధ్యానం కొనుగోలు చేయటం లేదు. కేవలం దొడ్డు రకాలనే కొంటున్నారు . 4. రబీ సీజన్ ధాన్యం నింపడానికి 20 కోట్ల గోనె సంచులు (గన్నీ బ్యాగులు) అవసరమని, పశ్చిమ బెంగాల్ నుంచి వాటిని తెప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాత గన్నీ బ్యాగులను కొనడానికి గతంలో రూ.16 ఉంటే, ఇప్పుడు రూ .18 కి పెంచారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం గన్నీ బ్యాగుల కొరత విపరీతంగా ఉంది. ప్యాడీ క్లీనర్లు, విన్నోవింగ్ ఫ్యాన్లు, తేమ యంత్రాలు కొరత ఉంది. 5. మొక్కజొన్నకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ . 1,760 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 890 మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు రైతుల నుంచి టీఎస్-మార్క్ ఫెడ్ కొనుగోలు చేసింది. వాస్తవానికి ఫిబ్రవరి నుంచే మొక్కజొన్న హార్వెస్టింగ్ ప్రారంభం అయ్యింది. అప్పటికి ప్రభుత్వం సెంటర్లు ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ప్రైవేటు ట్రేడర్లకు అమ్ముకున్నారు. ట్రేడర్లు ధర తగ్గించి రూ .1,300 నుంచి రూ .1,400 క్వింటాలు చొప్పున మక్కలు కొనుగోలు చేయటంతో రైతులు నష్టపోయారు. రెండు నెలలపాటు ఇలాగే జరిగింది. చివరకు లాక్డౌన్ సమయంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మార్కెట్లు బంద్ కావటంతో మార్క్ ఫెడ్ సెంటర్లలోనే మక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి. రబీలో 6.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా.. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున 18.60 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతాయి. కాని ఇప్పటివరకు 1.30 లక్షల టన్నులే ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు పై ప్రత్యేక శ్రద్ద సారించాలి. 6. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 20 వేల, 300 ఎకరాలలో పసుపు పంటను సాగు చేశారు. లాక్డౌన్ వల్ల మార్కెట్లు బంద్ కావడంతో పసుపు అమ్ముకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌కు ముందు క్విటాల్‌కు 4500 రూపాయల నుంచి 4900 రూపాయల వరకు ప్రైవేట్ ట్రేడర్లు కొనుగులు చేసి రైతును నిలువునా దోచుకున్నారు. ఒక పక్క పసుపు పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. మరో పక్క కేంద్రం మద్దతు ధర ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర కూడా ప్రకటించలేదు. క్వింటాలుకు రూ .15 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించి, మార్క్ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ ఉంది. 7. శనగ పంట కొనుగోలుకు రాష్ట్రంలో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రకటించిన ధర రూ. 4,875 ఉంది. కేంద్రం ప్రభుత్వం కేవలం 47,600 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు 50 వేల మెట్రిక్ టన్నుల శనగలు రాష్ట్రంలో కొనుగోలు చేశారు. ఇంకో 27 వేల టన్నుల పర్మిషన్ అడిగారు. ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాలేదు. రాష్టంలో రబీ సీజన్ లో 3.28 లక్షల ఎకరాల్లో రైతులు శనగ పంట సాగుచేశారు. మొత్తం శనగ పంటలను గిట్టుబాటు ధరలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. 8. కందుల కొనుగోళ్లు రాష్ట్రంలో నిలిపి వేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్విటాలుకు రూ.5,600 కనీస మద్దతు ధరతో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేశారు. కందులను కూడా ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలి. 9. బత్తాయి, మామిడి లాంటి పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వం మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు లేదా మార్కెట్లో మంచి ధరలు ఉన్న ప్రాంతాల్లో రైతులు వారి ఉత్పత్తలను అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా కూరగాయలు పండిస్తున్న రైతులను ఆదుకునేందుకు గ్రామాలలోనే కూరగాయలను ప్రభుత్వమే కొని నగరాలలో ఉన్న ప్రజలకు "మన ఊరు మన కూరగాయలు" పథకం మాదిరి అందజేయాలి.