నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు
రాహుల్‌గాందీకి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్ నిరంకుశ పాలనకు ప్రతీకగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పౌర హక్కులను నిరంతరం ధిక్కరిస్తోందన్నారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన ఆపాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాం«దీకి హరీశ్‌రావు సోమవారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో అధికార దురి్వనియోగంతో దుష్టపాలన నడుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు.
‘హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరిట పేద, మధ్యతరగతి కుటుంబాలను రేవంత్ రోడ్డున పడేస్తున్నారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ బుల్డోజర్ పాలన నడుపుతున్నారు. బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారింది. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ మీ పార్టీ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సోం, మహారాష్ట్రలో పేదలు, మధ్య తరగతి ప్రజలపై బీజేపీ బుల్డోజర్లను ప్రయోగించిన రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో అదే దారిలో నడుస్తోంది. బుల్డోజర్ కూలి్చవేతలపై సుప్రీం ఆదేశాలు ఉన్నా సర్వేలు, సరైన విధానాలు అనుసరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విరుచుకుపడుతోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలు, చట్టాలను గౌరవించే విధంగా మీ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అని రాహుల్‌కు రాసిన లేఖలో కోరారు.
క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లుతూ వికృత రాజకీయాలకు తెరలేపిందని హరీశ్‌రావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తోందన్నారు. తనకు గోల్కొండ కోట, చారి్మనార్‌లోనూ వాటాలు ఉన్నాయనే రీతిలో కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్నారు. అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పశు వైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, 1962 అంబులెన్స్ సేవల సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. మూగజీవాల వద్దకు పశు వైద్య సిబ్బంది వెళ్లి తక్షణ సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక కుటుంబపోషణ భారంగా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment