న్యూఢిల్లీ, సాక్షి: తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని లేఖలో సుఖేష్ ఆరోపించాడు. అంతేకాదు.. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు.
జైల్లో ఆప్ నేతలంతా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. అధికార దుర్వినియోగం చేసిన వచ్చిన వాళ్లకు తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు.
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. అలాగే జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎశరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment