దాడులు సరికాదు.. చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ | Bandi Srinivasa Rao Open Letter To CM Chandrababu Naidu Over Attacks In AP, See Details Inside | Sakshi
Sakshi News home page

దాడులు సరికాదు.. చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ

Published Thu, Jun 20 2024 9:09 PM | Last Updated on Fri, Jun 21 2024 1:28 PM

Bandi Srinivasa Rao Open Letter To Cm Chandrababu

సాక్షి, విజయవాడ: టీడీపీ, జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబుకు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని వారిని దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగులు..  ప్రభుత్వంలో భాగస్వాములు.. వారికి అండగా ఉండి మానసికస్థైర్యం కల్పించాలని కోరారు.

‘‘రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఉండవు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యం. రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే  చింతకాయల అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారు. ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనలకు గురిచేసే విధంగా ఉంది’’ అని బండి శ్రీనివాస్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘అనంతపురంలో టీడీపీ నేత జేసి ప్రభాకర రెడ్డి.. రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్‌లను నా కొడకల్లారా.. నరుకుతా... అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడటం వారిని దూషించడాన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబసభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయ భాస్కరరావు ఇంటిలోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. విధినిర్వహణలో తప్పుచేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడం దారుణం. ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఉద్యోగులపై బెదిరింపులకు, దాడులకు దిగడం, విధులకు ఆటంకం కలిగించడం వంటివి విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ లేఖలో బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement