
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయితిరాజ్ శాఖ మంత్రికి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బహిరంగ లేఖను సంధించాడు. ప్రస్తుతం రాష్ట్ర స్థితి మీద కొన్ని ప్రశ్నలకు మంత్రి లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని కోరాడు. ఇందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకున్నాడు.
గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తాను, తన కుటుంబసభ్యులు 2014 ఎన్నికలలో తెలుగుదేశంకు ఓటు వేసి గెలిపించామని పేర్కొన్నాడు. మంగళవారం ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ 'గ్రామాలకు సేవ చేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టే' అంటూ మీరు(నారా లోకేశ్) చెప్పిన మాట విని చాలా సంతోషించినట్లు చెప్పాడు. అయితే, తనకు ప్రస్తుతం కొన్ని సందేహాలు ఉన్నాయని వాటి తీర్చాలని కోరాడు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందనే మాట కనికట్టులా కనిపిస్తోందని, మిమ్మల్ని మించిన తెలివైన వారు లేరని అనుకోవద్దని హితవు పలికాడు. రాష్ట్రంలో మీకు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం ప్రజలకు చిటికేసినంత పని అని లోకేశ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యువకుడి లేఖ ఇదే..
@naralokesh @ncbn మీ నుండి సమాధానం ఆశిస్తూ సామన్యుని బహిరంగ లేఖ pic.twitter.com/2dLOF9vnZd
— Balaudayakiran (@bavuki9) 24 October 2017