ఫార్ములా–ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకం
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సవివరంగా చర్చ జరగాలి
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అవాస్తవాలు
సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.
అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది.
తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్‌కు బీఆర్‌ఎస్ వినతి
ఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్‌కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment