న్యూఢిల్లీ: దేశ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. విపక్షాలు లేఖ రాశాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీల సంతకాలతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశాయి.
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు లేఖలో ఆరోపించాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతుందని విపక్షపార్టీలు పేర్కొన్నాయి. అలాగే పార్లమెంట్ లో నిత్యావసర ధరల పెరుగుదలపై చర్చ జరపాలని విపక్షాలు లేఖలో కోరాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు రాష్ట్రపతికి లేఖలో తెలిపాయి.
ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు కోరాయి.
Opposition leaders write to @rashtrapatibhvn on stalemate in Parliament and "misuse" of investigating agencies by govt. @IndianExpress pic.twitter.com/igaQeOVszK
— Manoj C G (@manojcg4u) July 26, 2022
Comments
Please login to add a commentAdd a comment