న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మై డియర్ ఫ్యామిలీ’ మెంబర్ అని ఒక్కొక్కరనీ వ్యక్తిగతంగా సంబోధిస్తూ లేఖ మొదలు పెట్టారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు స్ఫూర్తినిస్తూ ముందుకు నడుపుతున్నారని తెలిపారు.
‘ఈ పదేళ్ల పాలనలో ప్రజల సహకారంతో ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ లాంటి ఎన్నో విజయాలు సాధించాం. వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలి. రైతులు, పేదలు, యువకులు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ పదేళ్లలో చాలా కృషి చేశాం. పీఎం ఆవాస్ యోజన, ఇంటింటికి నీళ్లు, కరెంటు, గ్యాస్ అందించాం.
ఆయుష్మాన్ భారత్‌తో ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నాం. భారీగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్మించాం. ట్రిపుల్ తలాక్, నారీ శక్తి వందన్ చట్టాలతో మహిళా సాధికారత కల్పించాం. ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అందం. మీ మద్దతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి నాకు బలాన్నిచ్చింది. వికసిత్ భారత్‌కు మీ సలహాలు నాకు కావాలి. మనందరం కలిసి దేశాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తామన్న నమ్మకం నాకు ఉంది’అని మోదీ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment