న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది.
దీంతో ఎల్‌జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్‌పాశ్వాన్‌కు ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్‌లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment