chirag paswan
-
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ
పట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. మితిమీరిన వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టం చలాన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి పాశ్వాన్ నేషనల్ హైవేపై హాజీపూర్ నుంచి చంపారన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు.. బిహార్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ డిటెక్షన్ సిస్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగఘించిన 16,700 మందికి ఈ-చలాన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ డిటెక్షన్ సిస్టంను మోటార్ వాహన చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను చెక్ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్ జారీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
‘బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అదే మన ఆశ’
పట్నా: దీర్ఘకాంలంగా ఉన్న బిహార్ ప్రత్యేక ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్రమంతి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో బిహార్ ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు.‘ఇది ఒత్తిడి చేసే రాజకీయం కాదు. ఇది మన దీర్ఘకాల డిమాండ్. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఏ పార్టీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయదు. ఏ పార్టీ అయినా బిహార్‌కు ప్రత్యేక హోదా అంగీకరిస్తుందా?. కానీ, మేము బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో అనుకూలంగా ఉన్నాం. మేము ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నాం. ..ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. ప్రధాని మోదీ మా లీడర్. మేము ఆయనపై నమ్మకం పెట్టుకున్నాం. ప్రధాని మోదీ ముందు ఈ డిమాండ్‌ను మేము పెట్టకపోతే.. మరి బిహార్‌కు ప్రత్యేకహోదా ఎవరు అడుగుతారు?. బిహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. అదే మన ఆశ. బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించే క్రమంలో మార్చాల్సిన కొన్ని నిబంధనలపై మేము చర్చిస్తాం’ అని అన్నారు.అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వటం లేని కేంద్రం గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీహార్, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీయే కూటమిలో భాగంగా ఐదుస్థానాల్లో పోటీచేసీ ఐదింటిలో విజయం సాధించింది. -
ఎంపీలు కంగనా-చిరాగ్.. అదిరిపోయే లుక్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా మారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, కంగనా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మీడియా దృష్టి కంగనాపై నిలిచింది.లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బుధవారం ఎంపీలంతా పార్లమెంట్‌కు వచ్చారు. ఇదే కోవలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభ మెట్లు ఎక్కగానే మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆమెకు సమీపంలో కనిపించారు. పార్లమెంట్ మెట్ల మీద వారిద్దరూ కలుసుకుని, నవ్వుతూ పరస్పరం పలుకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్స్ తమ అభిమాన నేతలను చూసి సంబరపడుతున్నారు.కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ గతంలో ఒక చిత్రంలో కలిసి నటించారు. 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’లో వీరిద్దరూ కనిపించారు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా మారి రాజకీయాల్లో విజయం సాధించారు. వీరు నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సారధ్యంలో రాజకీయాల వైపు పయనం మొదలుపెట్టారు. 2024లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా తొలి ఇన్నింగ్స్‌లోనే విజయాన్ని అందుకున్నారు. #WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0— ANI (@ANI) June 26, 2024 -
కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!
బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న రాజకీయనాయకుడు కూడా ఆయనే. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో హీరోగా నటించారు కూడా. అందులో హీరోయిన్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. ఇక చిరాగ్ ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన ఆహారం గురించి షేర్ చేసుకున్నారు. బిహారీ సంప్రదాయ ఫుడ్ అయిన దాల్చావల్ లేదా దాల్ బాత్ అంటే మహా ఇష్టమైన రెసిపీ అని చెప్పుకొచ్చారు. ఇది స్పైసీ తడ్కాతో కూడిన ఒక రకమైన భోజనం. పేరు డిఫెరెంగా ఉన్నా.. ఇది మన సాధారణ భారతీయ భోజమే. మనం తెలుగు రాష్ట్రాల్లో పప్పు అన్నం ఇష్టంగా తింటామే అదేగానీ కొంచెం వెరైటీగా ఉంటుంది.ఇక్కడ దాల్ చావల్ అంటే దాల్ అంటే పప్పు, చావల్ అంటే ఉడికించిన అన్నం..మొత్తం కలిపి పప్పు అన్నం. అయితే కొన్ని ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు తక్కువగా ఉండటంతో కొద్దిపాటి కూరగాయలను జోడించి.. సులభంగా పోషకాలు పొందేలా రూపొందిచిన వంటకమే ఈదాల్ చావల్. అదేనండి మనం పప్పు టమాటా, దోసకాయ పప్పు ఎలా చేసుకుంటామో అలానే అన్నమాట. కాకపోతే ఇది స్పైసీగా ఉంటుంది. దీనికి ఊరగాయ, పాపిడ్ని జతచేసి వేడివేడి అన్నంలో తింటే దీని రుచే వేరు. ఈ దాల్ చావల్ తయారీ విధానం ఎలాగో సవివరంగా చూద్దామా..!కావాల్సిన పదార్థాలు..కందిపప్పు 1 కప్పునీళ్లు 4 కప్పులుఉల్లిపాయ ఒకటిటమమోటాలు 2పచ్చిమిర్చి 2వెల్లుల్లి రెండు, లవంగాలు రెండుఅల్లం ముక్క ఒకటిఆవాలు టేబుల్ స్పూన్జీలకర్ర టేబుల్ స్పూన్నూనె రెండు టేబుల్ స్పూన్లుఅలంకరణ కోసం తాజా కొత్తిమీర ఆకులుబాస్మతి బియ్యం 1 కప్పునీరు 2 కప్పులురుచికి ఉప్పుతయారు చేయు విధానం: పప్పు బాగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు, పసుపు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ ఉడికించిన పప్పును వేయడమే. చివరగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకోవాలికి. దీని కోసం రెడీ చేసి పెట్టుకున్న వేడి వేడి అన్నంలో ఈ పప్పు, ఊరగాయ, పాపిడి వేసుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్. View this post on Instagram A post shared by Vani Sharma (@vaanis_lunch_table) (చదవండి: అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!) -
‘నాన్నే నా ప్రాణం’.. చిరాగ్ భావోద్వేగ పోస్ట్
బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మూడోసారి ఎంపీగా ఎన్నికై, తొలిసారి మోదీ కేబినెట్లో మంత్రి అయ్యారు. మోదీ 3.0 క్యాబినెట్లో చిరాగ్ పాశ్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒకప్పుడు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలను చేపట్టారు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను షేర్ చేశారు.ఈ పోస్టుకు తన తండ్రికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలను జతచేశారు. నాడు రాష్ట్రపతి భవన్లో రామ్ విలాస్ పాశ్వాన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఫొటోను చిరాగ్ పోస్ట్ చేశారు. అలాగే తాను తన తండ్రితో ఉన్నప్పటి ఫొటోలను కూడా షేర్ చేశారు. వీడియోలో రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డ్ చేసిన వాయిస్ ప్లే అవుతుంది. అలాగే ఇదే వీడియోలో చిరాగ్ మాట్లాడుతూ ఈ దీపం(చిరాగ్) దేశానికి, ప్రపంచానికి వెలుగు నిచ్చేదిగా మారినందుకు సంతోషిస్తున్నాను’ అని పేర్కొన్నారు.చిరాగ్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు మూడు కోట్ల మంది వీక్షించగా, 11 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో చిరాగ్‌ను ప్రశంసిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలో బీహార్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కొందరు పేర్కొన్నారు. -
అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
ఇది సోషల్ మీడియా యగం. దీనిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది తాపత్రయ పడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుతున్న పలువురు ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్నికల నేపధ్యంలో బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది.చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని జముయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చినది మొదలు చిరాగ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చిరాగ్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది.చిరాగ్ పాశ్వాన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఈ ఏడాది మే 26 నాటికి ఒక మిలియన్ (10 లక్షలు) ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా చిరాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు పెరుగుతున్న ఫాలోవర్ల గురించి చిరాగ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో సమాచారం ఇచ్చారు.చిరాగ్ పాశ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం నలుగురిని మాత్రమే అనుసరిస్తున్నారు. అర్జున్ భారతి, నరేంద్ర మోదీ, రామ్ విలాస్ పాశ్వాన్, అమిత్ షాలను చిరాగ్ అనుసరిస్తున్నారు. తన ఇన్‌స్టాలో చిరాగ్ మొత్తం 2,076 పోస్ట్‌లను షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్)లో 93 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్‌లో పాశ్వాన్ 112 మందిని అనుసరిస్తున్నారు. చిరాగ్‌కు ఫేస్బుక్లో ఏడు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్‌గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్‌జనశక్తి పారీ్ట(రామ్‌విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్‌లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్‌గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్‌కు పట్టున్న త్రిసూర్ లోక్‌సభ స్థానంలో 2019 లోక్‌సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్‌నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్‌నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్‌కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్‌సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్‌కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్‌గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్‌గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్‌పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్‌పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్‌పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్‌గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్‌గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్‌లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని ధార్ లోక్‌సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్‌నగర్ మేయర్..తాజా లోక్‌సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్‌నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్‌నగర్ మేయర్‌గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్‌గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్‌లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్‌తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీజీ మీతోనే సాధ్యం.. పాశ్వాన్ ఆసక్తిర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జీపీ)పార్టీ అధినేత, ఎన్డీఏ భాగస్వామి చిరాగ్ పాశ్వాన్ ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం జరిగిన ఎన్డీయే కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ మోదీకి మద్దతు పలికారు. అనంతరం మోదీతో కరచాలనం చేశారు. ఆపై కౌగిలించుకున్నారు. ప్రతి స్పందనగా మోదీ పాశ్వాన్ తలను నిమిరారు. ఆ అద్భుత క్షణాల్ని పాశ్వాన్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ (ఎన్డీఏ) విజయానికి ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ ఘనత మీకే దక్కుతుంది. మీ సంకల్పబలమే చరిత్రలో ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయడానికి దోహదపడింది. మూడోసారి ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదని ప్రశంసించారు.ప్రధానిపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. మీ వల్లే ఈ రోజు ప్రపంచం ముందు భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని పాశ్వాన్ మోదీనిపై ప్రశంసలు కురిపించారు. -
మోదీ 3.0.. చిరాగ్‌కు కేబినెట్ బెర్త్ ?
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పాటు లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్) కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. పోటీ చేసిన ఐదుకు ఐదు సీట్లను గెలుచుకుని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటడంలో తన వంతు పాత్ర పోషించింది. దీంతో ఎల్జేపీ(రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్, తన తండ్రి దివంగత ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్‌కు అసలు సిసలైన రాజకీయ వారసుడిగా అవతరించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్పాశ్వాన్కు ఒక కేబినెట్ బెర్త్‌తో పాటు బిహార్ రాష్ట్ర కేబినెట్లో పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే బీజేపీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై మాట్లాడడానికి చిరాగ్ పాశ్వాన్ నిరాకరించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది పూర్తిగా ప్రధాని మోదీ నిర్ణయమని చెప్పారు. -
చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
బరిలో బాబాయ్..అబ్బాయ్! గెలుపెవరిదో..
Chirag Paswan Vs Pashupati Paras: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులే విరోధులుగా బరిలోకి దిగుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్‌పై హాజీపూర్ నుంచి పోటీ చేస్తానని లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ‘నాన్న కర్మభూమి అయిన హాజీపూర్ నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), ఎన్డీఏ అభ్యర్థిగా నేను పోటీ చేయడం ఖాయం. ఆయనకు (పశుపతి కుమార్ పరాస్) స్వాగతం (అక్కడ నుంచి పోటీ చేయడానికి). నేను అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎలాంటి సవాళ్లకు నేనెప్పుడూ భయపడలేదు. ఈ ఛాలెంజ్‌ను కూడా స్వీకరిస్తున్నాను’ అని చిరాగ్ పాశ్వాన్ మీడియాతో అన్నారు. హాజీపూర్ నియోజకవర్గం నుండి తన సొంత బాబాయిపై పోటీ చేయడంపై పాశ్వాన్ మాట్లాడుతూ "ఇది నాకు రాజకీయ ఎంపిక కానే కాదు. ఇది నా కుటుంబానికి కూడా ఇబ్బందికరమే. ఇటువంటి నిర్ణయాలు రాజకీయ పార్టీలుగా మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మనోభావాలు పరిగణనలోకి తీసుకుని తీసుకోవాలి. కుటుంబం నుండి విడిపోవాలనే నిర్ణయం ముందుగా ఆయనే (పశుపతి పరాస్) తీసుకున్నారు" అని పేర్కొన్నారు. బిహార్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎన్డీఏ సీట్లు నిరాకరించడంతో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. "నేను (లోక్‌సభ ఎన్నికల్లో) హాజీపూర్ నుండి పోటీ చేస్తాను. మా సిట్టింగ్ ఎంపీలందరూ వారి వారి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారు. ఇది మా పార్టీ నిర్ణయం" అని పరాస్ అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బిహార్‌లో సీట్ల పంపకాన్ని ఎన్డీఏ ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (HAM), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. -
బీజేపీతో కటీఫ్.. కేంద్ర మంత్రి పదవికి పరాస్ రాజీనామా
సాక్షి, పాట్నా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పరాస్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర కేబినెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యావాదాలు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ, బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఎన్డీయే మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పరాస్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్ ఎన్డీయే నుంచి బయటకు రాగా.. కూటమిలో ఉన్న పశుపతి పరాస్‌కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో వారికి సీట్లు కేటాయించారు. అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిపారు. -
Bihar: అబ్బాయ్‌వైపే బీజేపీ మొగ్గు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం రంజుగా మారింది. లోక్‌సభ సీట్ల కేటాయింపుతో బీహార్‌లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ రాజకీయం తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు లోక్ జనశక్తిని పార్టీ (ఆర్ఎల్జేపీ) శాసించి మోదీ వర్గంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బాబాయ్ పసుపతి పరాస్ ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం పోరాడుతుంటే.. మరోవైపు తన తండ్రి స్థాపించిన లోక్ జన శక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన అబ్బాయి చిరాగ్ పాశ్వాన్ వైపే బీజేపీ మొగ్గు చూపింది. బీజేపీ తీరుపై అసంతృప్తి గత కొంత కాలంగా పసుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగుతారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతని ఎమ్మెల్యేలు ఇండియా కుటమికి మద్దతు పలుకుతున్నారని, వారం క్రితం చిరాగ్ పాస్వాన్ సైతం బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగాయి. ఈ వరుస పరిణామాలపై పశుపతి పరాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఆర్ఎల్జేపీ కూడా ఎన్డీయేలో భాగమేనని తెలిపారు. అంతేకాదు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని పశుపతి పరాస్ అన్నారు. ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ తమకు ఉందని ఎన్డీయేను హెచ్చరించారు. పాశ్వాన్ వైపే మొగ్గు అదే సమయంలో ఒకప్పుడు తనను తాను ప్రధాని నరేంద్ర మోదీకి ‘హనుమంతుడు’గా అభివర్ణించుకున్న పాశ్వాన్ ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తులో భాగంగా పాశ్వాన్ ఆశించిన ఆరు సీట్లలో ఐదు స్థానాలను దక్కించుకున్నారు. అయితే, ఆ జాబితాలో అతని దివంగత తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన హాజీపూర్ లోక్‌సభ స్థానం ఉంది. అంచనాలు తారుమారు రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి పరాస్ హాజీపూర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశాయి. 6 శాతం పాశ్వాన్ వర్గం ఓట్లు చిరాగ్ పాస్వాన్‌కు కలిసొచ్చాయి. పొత్తులో భాగంగా లోక్‌సభ సీట్ల పంపిణీలో బాబాయ్ పశుపతి పరాస్‌ను కాదనుకుని అబ్బాయి చిరాగ్ పాస్వాన్తో పొత్తు పెట్టుకునేందుకు కారణమయ్యాయి. కాగా, చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజీపూర్ నుండి ఎనిమిది సార్లు గెలుపొందారు. వాటిలో నాలుగు వరుస విజయాలున్నాయి. చిరాగ్ పాస్వాన్ పార్టీ సమస్తిపూర్, జముయి, వైశాలి, ఖగారియా లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగనుంది. ఎవరికెన్ని సీట్లంటే? లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో పొత్తులు ఖరారయ్యాయి. అలయన్స్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకు గాను పెద్దన్నగా వ్యవహరిస్తున్నబీజేపీ (17), సీఎం నితీష్‌కుమార్ పార్టీ జనతాదళ్ యూనైటెడ్ (16), లోక్‌జనశక్తి పార్టీ (5), బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకి (1), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి (1) సీట్లు కేటాయించింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. -
ఏ పార్టీకైనా నా సపోర్ట్ కావాల్సిందే.. ‘షేర్ కా బేటా’ ఇక్కడ!
ఏ పార్టీకైనా, కూటమికైనా తన సపోర్ట్ కావాల్సిందేనని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన మద్దతు కోసం వివిధ పార్టీలు పోటీపడుతున్నాయని, వీటిలో ‘గౌరవప్రదమైన’ ఆఫర్ ఇచ్చే పార్టీలతోనే తన పొత్తు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షంగా పాశ్వాన్‌కు బిహార్ ప్రతిపక్ష కూటమి 'మహాఘఠ్ బంధన్' నుండి ఆహ్వానం అందినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. సాహెబ్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన ర్యాలీలో చిరాగ్ మాట్లాడుతూ "చిరాగ్ పాశ్వాన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్న మీడియా వ్యక్తులను ఇక్కడ చూస్తున్నాను. చిరాగ్ పాశ్వాన్ కేవలం బిహార్ ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాడని వారికి చెప్పాలనుకుంటున్నాను" అన్నారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్‌కు నిజమైన వారసుడిగా తనను తాను "షేర్ కా బేటా" అని చిరాగ్ చెప్పుకొన్నారు. తమ పార్టీని చీల్చిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్‌ల పేర్లు ఎత్తకుండానే తన ఇల్లు, కుటుంబం, పార్టీని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. -
ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..
పాట్నా: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష కూటమి ఏర్పాటు దిశగా పలు ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తుండగా.. అటు ఎన్డీయే కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో కలిసిన మరుసటి రోజే బిహార్‌లో మరో పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ ఎన్డీయేలో కలుస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ రోజు కేంద్ర హో మంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. ఎన్డీయే కుటుంబంలో చేరుతున్న చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వాగతం పలికారు. జులై 18న ఎన్డీయే కూటమి ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి ముందు చిరాగ్ పాశ్వాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. श्री @iChiragPaswan जी से दिल्ली में भेंट हुई। उन्होंने माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में शामिल होने का निर्णय लिया है। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ। pic.twitter.com/vwU67B6w6H — Jagat Prakash Nadda (@JPNadda) July 17, 2023 లోక్ జన్‌శక్తి పార్టీని బిహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించారు. ఆయన ఆరు సార్లు లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం బీజేపీ కూటమి తరపున రాజ్య సభకు కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు తండ్రి బాటలోనే చిరాగ్ కూడా బీజేపీ కూటమిలో చేరారు. ఇదీ చదవండి: Rajbhar Joins In NDA: ఎస్పీకి దెబ్బ మీద దెబ్బ.. ఎన్డీయే కూటమిలో చేరిన ఎస్బీస్పీ.. -
18న ఎన్డీఏ భేటీకి రండి
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌కూ లేఖ అందింది. ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. -
ఎన్డీయేలోకి ఎల్జేపీ (రామ్‌విలాస్)!
పట్నా: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) భాగస్వామిగా చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేత, ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నిత్యానంద రాయ్ తాజాగా చర్చలు జరిపారు. బీజేపీ, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ ఒకే విలువలను పంచుకొనేవారని గుర్తుచేశారు. ప్రజా సాధికారతతోపాటు అభివృద్ది కోసం పాశ్వాన్ ఎంతగానో తపించేవారని కొనియాడారు. అయితే, ఎన్డీయేలో లోక్ జనశక్తి పారీ్ట(రామ్ విలాస్) చేరికపై నిత్యానంద రాయ్ నేరుగా స్పందించలేదు. చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. బీజేపీతో మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్డీయేలో చేరికపై ఇప్పుడే స్పందించడం సరైంది కాదన్నారు. బీజేపీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని ఆయన గతంలో పలుమార్లు చాటుకున్నారు. -
బిహార్‌లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్‌లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
ECI: చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు
న్యూఢిల్లీ: చీలికతో వివాదంగా మారిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం చూపింది. ఇంతకాలం వినియోగంలో ఉన్న పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు(ఇల్లు గుర్తు)ను చీలిక వర్గాలైన చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పారస్‌లు వాడొద్దని గతంలోనే ఈసీ ఆదేశాలివ్వడం తెల్సిందే. తాజాగా ఇరు వర్గాలకు వేర్వేరు పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది. చిరాగ్ పాశ్వాన్ వర్గానికి ‘లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)’ పేరును, హెలికాప్టర్ గుర్తును కేటాయిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. పారస్ వర్గానికి ‘రాష్ట్రీయ లోక్ జన శక్తి’ పేరును, ఎన్నికల గుర్తుగా ‘కుట్టుమిషన్’ను ఇస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉప ఎన్నికల్లో ఈ పేర్లు, గుర్తులను వాడుకోవచ్చని ఈసీ ఇరు వర్గాలకు వేర్వేరుగా లేఖలు రాసింది. ‘‘ బిహార్‌లో ఉప ఎన్నికల కోసం ఏ ఇతర పార్టీకి కేటాయించని ‘గుర్తుల జాబితా’లో ఉన్నవేవైనాకావాలంటే మీరు వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ, మీ రెండు వర్గాల గుర్తులు ఒకేలా మాత్రం ఉండకూడదు’’ అని ఈసీ స్పష్టంచేసింది. -
ఎల్జేపీ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ
పట్నా: లోక్ జనశక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ గుర్తు ‘బంగ్లా’ను చిరాగ్ పాశ్వాన్ వర్గం, కేంద్ర మంత్రి పశుపతి పారస్ వర్గాలు ఎవరూ ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్జేపీ గుర్తు కోసం చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్ వర్గాల మధ్య వివాదం చేలరేగిన విషయం తెలిసిందే. బీహార్‌లోని కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ‘బంగ్లా’ గుర్తును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. జరగబోయే ఉప ఎన్నికల్లో ఉపయోగించే గుర్తు విషయంలో ఈసీ మూడు ఆప్షన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఆప్షన్లను సోమవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనున్నట్లు సమాచారం. -
ఎంపీ ప్రిన్స్ రాజ్‌పై రేప్ కేసు
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) నేత, బిహార్‌లోని సమస్తీపూర్ ఎంపీ ప్రిన్స్ రాజ్‌పై రేప్ కేసు నమోదైంది. ఎల్జేపీ ముఖ్యనేత చిరాగ్ పాశ్వాన్‌కు ప్రిన్స్ రాజ్ దగ్గరి బంధువు. ఎల్జేపీ మహిళా కార్యకర్త గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రిన్స్‌రాజ్‌పై ఫిర్యాదు చేయొద్దంటూ తనపై చిరాగ్ ఒత్తిడిచేశారంటూ బాధితురాలు పేర్కొనడంతో చిరాగ్ పేరునూ ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన పేరును చేర్చడంపై చిరాగ్ పాశ్వాన్ గతంలో∙స్పందించారు. ‘వివాదాన్ని పరిష్కరించాలని ఇద్దరూ నా వద్దకు వచ్చారు. పోలీసుల వద్ద తేల్చుకోండని సూచించాను. కేసు వద్దని సదరు మహిళపై నేనేమీ ఒత్తిడి చేయలేదు’ అని అన్నారు. కేసు నమోదు నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రిన్స్‌రాజ్ మంగళవారం ఢిల్లీ కోర్టు మెట్లెక్కారు. ముందస్తు బెయిల్ దరఖాస్తును స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ గురువారం పరిశీలించనున్నారు. ‘ సదరు మహిళ సమ్మతితోనే సంబంధాన్ని కొనసాగించాను. ఆమెకు వేరే వ్యక్తితో అంతకుముందే సంబంధముంది. మేం సన్నిహితంగా ఉన్నపుడు ఆ వ్యక్తి వీడియోలు తీశాడు. కొన్నాళ్ల తర్వాత రూ.1 కోటి ఇవ్వాలని వారిద్దరి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. రూ.2 లక్షలు ముట్టజెప్పాను. తర్వాత చట్టప్రకారం సమస్య పరిష్కారం కోసం పోలీసులకు ఫిర్యాదుచేశాను’ అని ఫిబ్రవరిలో ఇచ్చిన పోలీసు ఫిర్యాదులో ప్రిన్స్‌రాజ్ పేర్కొన్నారు. -
ఇల్లు ఖాళీ చేయండి.. లోక్‌సభ ఎంపీకి షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: దివంగత ఎంపీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు కేటాయించిన 12 జన్‌పథ్ బంగ్లాలో నివసిస్తున్న ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటినే ప్రస్తుతం లోక్‌జనశక్తి పార్టీ తమ పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ఇంట్లో నివసించారు. ఆయన గతేడాది అక్టోబర్‌లో మరణించారు. కాగా ఇల్లు మారాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామ్ విలాస్ భార్య, చిరాగ్‌పాశ్వాన్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. -
స్పీకర్ నిర్ణయం: చిరాగ్‌కు భారీ షాక్...
న్యూఢిల్లీ: తన బాబాయి పశుపతి పరాస్‌ను లోక్‌సభలో పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ ఓంబిర్లా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చిరాగ్ పిటిషన్‌పై జస్టిస్ రేఖా పిళ్లై శుక్రవారం విచారణ జరిపారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని చెప్పారు. నిజానికి చిరాగ్ పాశ్వాన్‌కు జరిమానా విధించాలని భావించామని, ఆయన తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఆ ఆలోచన విరమించుకున్నామని పేర్కొన్నారు. ఎల్జేపీ చీలిక వర్గం నాయకుడైన పశుపతి పరాస్‌ను లోక్‌సభలో ఆ పార్టీ పక్షనేతగా గుర్తిస్తూ స్పీకర్ జూన్ 14న సర్క్యులర్ జారీ చేశారు. -
వాళ్లంతా నాకు టచ్‌లోనే ఉన్నారు: చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగించలేదని లోక్‌జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. త్వరలోనే జేడీ(యూ)లో చీలిక వస్తుందని, ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు తనతో టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశీర్వాద్ యాత్రలో భాగంగా ఉత్తర బిహార్ జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తనను దెబ్బ కొట్టేందుకే తన బాబాయ్ పశుపతి పరాస్తో చేతులు కలిపిన నితీశ్ కుమార్.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించారని ఆరోపించారు. జేడీయూలోని ఇతర నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి స్థిరంగా కొనసాగలేదని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని చిరాగ్ జోస్యం చెప్పారు. నితీశ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులుగా.. ఎన్నికల సమయానికి ఈ పొత్తు గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు. పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని నేనే: పశుపతి దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అసలైన రాజకీయ వారసుడిని తానేనని, ఆయన సోదరుడు పశుపతి పరాస్ పేర్కొన్నారు. ‘‘హిందూ వారసత్వ చట్ట ప్రకారం చిరాగ్ ఆయన ఆస్తులకు వారసుడేమో గానీ, నేను మాత్రమే ఆయన రాజకీయ వారసుడిని’’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూను వ్యతిరేకిస్తూ అభ్యర్థులను రంగంలోకి దించిన చిరాగ్ పాశ్వాన్... తన నిర్ణయంతో ఆ పార్టీ ఓట్లకు గండికొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరాగ్‌తో విభేదించిన ఎంపీ పశుపతి ఇటీవలే ఎల్జేపీలో తిరుగుబాటు లేవనెత్తి జాతీయాధ్యక్ష పదవి చేపట్టారు. బిహార్‌లో ఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక జేడీయూ నేత రామచంద్ర ప్రసాద్ సింగ్ (63)కు సైతం బిహార్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. -
నా తల్లి, నేను ఒంటరిగా పోరాడుతున్నాం: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ/పట్నా: ‘‘ఈరోజు నా తల్లి, నేను ఒంటరిగా పోరాడుతున్నాం. నా బలం బిహార్ ప్రజలే. మీ మద్దతు కారణంగానే ఇదంతా సాధ్యమమవుతోంది. నేను సింహం బిడ్డను. నన్ను ఎంతగా దెబ్బకొట్టాలని చూసినా... ఎవరికీ, ఎప్పటికీ భయపడను. మీరే నా ధైర్యం’’ అంటూ లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులు అనుకున్న వారు నట్టేట ముంచినప్పటికీ, ప్రజల అండతో తిరిగి పుంజుకుంటానని పేర్కొన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ సోమవారం.. ‘‘పాశ్వాన్’’ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఈరోజు మా బాబాయ్ నాకు అండగా నిలబడతారని ఆశించా. కానీ అది జరుగలేదు. మరేం ఫర్వాలేదు. అంకితభావం, కఠిన శ్రమతోనే గుర్తింపు దక్కుతుందని నాన్న చెప్పేవారు. ఆయన మాటలే నాకు స్ఫూర్తి. నేను నాన్నగారి బాటనే ఎంచుకున్నాను’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అదే విధంగా బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాల గురించి ప్రస్తావిస్తూ... ‘‘కొంత మంది కుటుంబ సభ్యులే మమ్మల్ని మోసం చేశారు. కానీ.. ఎంతో శక్తివంతమైన మా ప్రజాకుటుంబం మాతోనే ఉంది. సొంతం అనుకున్న వాళ్లు మోసం చేయవచ్చేమో కానీ.. ఈ విస్త్రృత కుటుంబం మాత్రం నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా’’ చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇక హాజీపూర్ నుంచి ఆశీర్వాద్ యాత్ర ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా హాజీపూర్ ఎంపీ పశుపతి పరాస్ ఎల్జేపీలో తిరుగుబాటు లేననెత్తి ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి దక్కించుకోవడంతో పాటు పార్లమెంటరీ నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గం నుంచే చిరాగ్ యాత్ర మొదలుపెట్టడం గమనార్హం. #WATCH | LJP leader Chirag Paswan breaks down during the book launch of his late father Ram Vilas Paswan, on his birth anniversary. He says, "I am the son of a lion, will never be scared, no matter how much people try to break us..." pic.twitter.com/rh6qC5v53y — ANI (@ANI) July 5, 2021 -
ప్రధాని నా వైపు ఉంటారని ఆశించా.. కానీ: చిరాగ్ భావోద్వేగం
న్యూఢిల్లీ: కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు అండగా నిలబడతారని ఆశించానని లోక్ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన రాముడి కోసం ఈ హనుమంతుడు చేయాల్సిందంతా మనస్ఫూర్తిగా చేశాడని, కానీ తాను ఆశించింది జరగలేదని పేర్కొన్నారు. తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్‌కు.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బాబాయ్ పశుపతి పరాస్తో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పశుపతి నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ను తొలగించడం సహా ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా ఆయనే ఉంటారని రెబల్ ఎంపీలు స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాశ్వాన్ అసలైన వారుసుడెవరో ప్రజలే తేలుస్తారంటూ జూలై 5 నుంచి ఆశీర్వాద యాత్ర చేసేందుకు చిరాగ్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మేం మద్దతునిచ్చాం. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్ఆర్సీ వంటి అంశాలను స్వాగతించాం. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ మాత్రం వీటికి అనుకూలంగా లేదు. అయినప్పటికీ ఈ హనుమంతుడు రాముడి కోసం అన్నింటికీ సిద్ధమయ్యాడు. అయితే, నేను కష్టకాలంలో ఉన్నపుడు నా ప్రధాని నావైపు ఉంటారని ఆశించాను. కానీ, అలా జరగలేదు. ఈ సమస్యను నాకు నేనుగా పరిష్కరించుకోవాలని, ఎవరూ నాకు సహకారం అందించరని త్వరలోనే నాకు బోధపడింది. అంతేకాదు.. నేను వారి మద్దతు ఆశించేందుకు అర్హుడిని కూడా కాదని అర్థమైంది’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘నా సొంత కుటుంబ సభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు. నా తండ్రి లాంటి మా బాబాయ్.. నా కొడుకు వంటి నా సోదరుడు(ప్రిన్స్ రాజ్) నాకు ద్రోహం చేశారు. మా బాబాయ్... మా నాన్నకు చాలా సన్నిహితంగా ఉండేవారు. కానీ ఆయనను కూడా మోసం చేశారు. బాబాయ్.. నాకంటే పెద్దవారు కదా.. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాల్సింది. ఇద్దరం కలిసి పరిష్కారం కనుగొనేవాళ్లం. కానీ ఆయన ఇలా చేయడం సరికాదు. నాకు మాత్రమే కాదు.. నాన్నకు కూడా ఆయన ద్రోహం చేశారు. ఇదంతా చూస్తూ నాన్న అస్సలు సంతోషంగా ఉండరు’’ అని చిరాగ్ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. చదవండి: పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?! -
పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు
న్యూఢిల్లీ: బిహార్‌లోని లోక్‌జనశక్తి పార్టీలో బాబాయ్, అబ్బాయిల మధ్య పోరాటం కొత్త పరిణామాలకు దారి తీసింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కి తానే అసలు సిసలైన వారసుడినని చెప్పుకోవడానికి, పార్టీపై పట్టు పెంచుకోవడానికి చిరాగ్ ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. ఆదివారం ఢిల్లీలోని చిరాగ్ నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. చిరాగ్ ఇక తాను ప్రజల్లోకి వెళ్లి బాబాయ్ పశుపతి పరాస్ నీచ రాజకీయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. జూలై 5న రామ్‌విలాస్ పాశ్వాన్ జయంతి రోజున హజీపూర్ నుంచి ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. పరాస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే జనంలోకి వెళ్లి వాస్తవాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు ఈ సమావేశం పాశ్వాన్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేసింది. సమావేశం ముగిసిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆవేశంగా చెప్పారు. ‘‘వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 90 శాతం నా వైపే ఉన్నారు. ఢిల్లీ, కశ్మీర్ పార్టీ అధ్యక్షులు మినహాయించి మిగిలిన వారంతా ఆ వైపు ఉన్నారు. పశుపతి పరాస్ వైపు 9 శాతం మంది మాత్రమే ఉన్నారు’’అని చిరాగ్ వెల్లడించారు. మరోవైపు పరాస్ ఆ సమావేశానికి చట్టబద్ధత లేదన్నారు. సమావేశానికి హాజరైన వారంతా పార్టీ సభ్యులే కారని ఆరోపించారు. ఎవరిది అసలైన పార్టీ్టయో ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని విలేకరులతో చెప్పారు. పార్టీ ఎంపీలను తన వైపు తిప్పుకొని పరాస్ తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పటికీ బిహార్‌లో 6 శాతం జనాభా ఉన్న పాశ్వాన్ వర్గం ఇప్పటికీ చిరాగ్‌నే పార్టీ నాయకుడిగా చూస్తోంది. అంతేకాదు లాలూ ప్రసాద్ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ కూడా పాశ్వాన్ జూనియర్‌కే మద్దతిస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. -
ఎల్జేపీ: అసలు విషయం ఇదేనా.. అందుకే పశుపతి రాజీనామా?!
పట్నా/న్యూఢిల్లీ: ఇటీవల లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు లేవనెత్తి ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కనుందా... జేడీయూను ఎదిరించిన అన్న కొడుకు చిరాగ్ పాశ్వాన్‌ను నైతికంగా దెబ్బకొట్టినందుకు ఆయనకు అగ్రతాంబూలం దక్కనుందా.. అన్న ఊహాగానాలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పశుపతి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న అంశంపై బాబాయ్- అబ్బాయ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ‘‘నేను కేంద్ర మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే.. పార్లమెంటరీ పార్టీ నేతగా రాజీనామా చేస్తాను’’ అని పశుపతి పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గత గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీలో తిరుగుబాటు అనంతరం తాము ఇదే కూటమిలో కొనసాగుతామని పశుపతి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పశుపతి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన పావులు కదిపుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. మరోవైపు.. చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. పైగా ప్రధాని మోదీ రాముడు అయితే, తాను హనుమంతుడినంటూ గతంలో అభిమానం చాటుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే పశుపతికి పదవి ఇస్తే బాగానే ఉంటుందని కొంతమంది స్థానిక(బిహార్) బీజేపీ నేతలు అభిప్రాయపడుతుండగా, మరో వర్గం మాత్రం చిరాగ్ పాశ్వాన్‌కే మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(2020) చిరాగ్ పాశ్వాన్ జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 35 స్థానాల్లో జేడీయూ సీట్లకు గండికొట్టగా.. ఆయా చోట్ల బీజేపీకి అనుకూల పవనాలు వీయడం గమనార్హం. ఇక తాజా పరిణామాలు, ప్రకటనలతో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా దేశమంతా చర్చనీయాంశమయ్యాయి. చదవండి: LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
LJP: మత్తు ఇచ్చి నాపై లైంగికదాడి: ఆ ఎంపీపై సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ/పట్నా: లోక్‌జనశక్తి పార్టీలో తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరాస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అబ్బాయి వ్యవహారశైలి కారణంగానే.. ముఖ్యంగా పార్టీని పరిరక్షించేందుకే తాను మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయ్ చెబుతుంటే.. వెన్నుపోటు రాజకీయాలు చేశారని చిరాగ్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ కుట్ర వెనుక జేడీయూ హస్తం ఉందని, ప్రస్తుతం తమ పార్టీలో సంక్షోభానికి నితీశ్ కుమార్ వర్గం కారణమని ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా తన కజిన్, ఎంపీ ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్(రామ్‌విలాస్ పాశ్వాన్ సోదరుడు రామచంద్ర పాశ్వాన్ తనయుడు) సైతం తమ అంకుల్ పశుపతితో చేతులు కలిపి తనను ఒంటరి చేశారనే బాధ చిరాగ్‌ను వేధిస్తోందని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నారు. మత్తు ఇచ్చి అత్యాచారం.. ఈ పరిణామాల నేపథ్యంలో... ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రిన్స్‌రాజ్ పాశ్వాన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ కనాట్‌ప్లేస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మూడు పేజీలతో కూడిన తన ఫిర్యాదులో.. ‘‘నా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ప్రిన్స్‌రాజ్.. ఢిల్లీలోని ఓ హోటల్లో నాపై అత్యాచారం చేశారు’’ అని ఆమె ఆరోపించారు. ఇక ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని, అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అత్యాచార ఆరోపణల గురించి చిరాగ్ పాశ్వాన్ దృష్టికి రాగా.. తనకు పూర్తి వివరాలు తెలియదని, ఇరు వర్గాలను పోలీసులను సంప్రదించమని తాను సలహా ఇచ్చానని పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020 సమయంలో జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపి నితీశ్ కుమార్‌కు సవాల్ విసిరారు. అప్పటి నుంచి చిరాగ్, పశుపతి మధ్య తలెత్తిన విభేదాలు ముదిరి తిరుగుబాటుకు దారి తీసింది. ఇక ఈ ఎన్నికల్లో ఎల్జేపీ విఫలమైనప్పటికీ తన ఓట్ల శాతం మాత్రం పెరిగిందని చిరాగ్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబాన్ని, పార్టీని కలిపి ఉంచేందుకు తను చేసిన ప్రయత్నాలు వృథా అయిపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్ ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
మంచాన పడి ఉంటే.. వెన్నుపోటు పొడిచారు: చిరాగ్ పాశ్వాన్
పట్నా/న్యూఢిల్లీ: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) జాతీయాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ అంశంపై చట్టబద్ధ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎల్జేపీలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. పశుపతి పరాస్ సహా ఐదుగురు ఎంపీలు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకోవడం.. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లాకు తెలపడం.. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. ఈ క్రమంలో చిరాగ్‌ను జాతీయాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ఎల్జేపీ ప్రకటన విడుదల చేయగా.. ఇందుకు స్పందించిన చిరాగ్.. తానే ఆ ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చిరాగ్ పాశ్వాన్... ‘‘ఒకవేళ పశుపతి పరాస్ పార్లమెంటరీ నేతగా ఉంటానని నన్ను కోరితే ఎంతో సంతోషంగా అందుకు ఒప్పుకునేవాడిని. ఆయనను నాయకుడిని చేసేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. పైగా నన్ను పార్టీ పదవి నుంచి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ విషయంపై పోరాడేందుకు నేను సిద్ధమవుతున్నా. నిజానికి దీనంతటి వెనుక జేడీయూ హస్తం ఉంది. తమకు వ్యతిరేకంగా గొంతెత్తే పార్టీలను విడగొట్టేందుకు వారు ఎంతకైనా తెగిస్తారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తాం. ప్రస్తుత పరిస్థితికి జేడీయూనే ముఖ్య కారణం. ఏదేమైనా నేను రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడిని. సింహం బిడ్డను. కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తాను’’అని చెప్పుకొచ్చారు. అదే విధంగా.. ‘‘నన్ను ఘోరంగా మోసం చేశారు. నిజానికి కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదు. టైఫాయిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నేను మంచాన పడి ఉన్న సమయంలో ఇలాంటి వ్యూహంతో నాకు వెన్నుపోటు పొడవడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. పార్టీని, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచేందుకు నా శాయశక్తులా ప్రయత్నించాను. మా అమ్మ కూడా బాబాయ్‌తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. పరాస్‌ను నా తండ్రిలా భావించాను. కానీ ఆయన నా తండ్రి మరణించిన నాడే మాకు దూరంగా వెళ్లిపోయారు’’ అని చిరాగ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలు-2020లో తమ పార్టీ పరాజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయం నాకు అత్యంత కఠినమైనది.. అప్పుడే నాన్నను కోల్పోయాను. నా కుటుంబంతో సరిగ్గా సమయం గడిపే వీలు కూడా దొరకలేదు. శాసనసభ ఎన్నికల్లో ఎల్జేపీ బాగానే పనిచేసింది. మా పార్టీకి ఓటింగ్ శాతం 2 నుంచి 6 శాతానికి పెరిగింది’’ అని తన నాయకత్వాన్ని చిరాగ్ సమర్థించుకున్నారు. చదవండి: ‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’ -
‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’
వెబ్‌డెస్క్: మనం ఇతరులకు ఏం ఇస్తామో అదే తిరిగి వస్తుంది.. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు.. అవమానానికి అవమానం.. ప్రతీకారానికి ప్రతీకారం.. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బాబాయ్ పశుపతి పరాస్తో తన వ్యవహార శైలి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందు వెళ్లి చేజేతులా తానే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునే విధంగా ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత చిరాగ్ పూర్తిస్థాయిలో ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పటివరకు తండ్రి నీడలో ఉన్న చిరాగ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో తమతో పాటు ఎన్డీయేలో భాగస్వామి అయిన సీఎం నితీశ్ కుమార్‌తో విభేదించారు. కూటమి సమీకరణాలు పట్టించుకోకుండా సొంతంగా ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూనే అధికార జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎల్జేపీ ఘోరంగా విఫలమైనప్పటికీ, జేడీయూ ఓట్లను మాత్రం చీల్చగలిగింది. దాదాపు 35 స్థానాల్లో సీట్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి పరిణామాల వెనుక కచ్చితంగా జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమను దెబ్బకొట్టిన చిరాగ్‌కు తమ సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే పశుపతి పరాస్తో తిరుగుబాటు చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పశుపతి మాత్రం ఈ వార్తలను కొట్టిపడేశారు. ఎల్జేపీని పరిరక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనతో సహా ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందని కుండబద్దలుకొట్టారు. నువ్వు నా రక్తం కావు.. ఈ నేపథ్యంలో... చిరాగ్‌కు, పశుపతికి మధ్య చెలరేగిన విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఎల్జేపీలో చీలిక వచ్చిందన్న విషయం సుస్పష్టమవుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి మృతి తర్వాత చిరాగ్, బాబాయ్ పశుపతిని తీవ్రంగా అవమానించారని పేర్కొంటున్నారు. ఒకానొక సమయంలో.. తన తల్లి రీనా పాశ్వాన్, కజిన్ ప్రిన్స్ రాజ్, అతడి అనుచరుడు సౌరభ్ పాండే ముందే.. ‘‘నువ్వు నా రక్తం కానేకాదు’’ అంటూ వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. చిరాగ్ మాటలతో మనోవేదనకు గురైన పరాస్.. ‘‘ఈరోజు నుంచి మీ బాబాయ్ నీకు లేడు. చచ్చిపోయాడు’’ అంటూ అదే స్థాయిలో అతడికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన చిరాగ్ తల్లి రీనా పాశ్వాన్, పరాస్‌కు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, అయితే, ‘‘అన్నదమ్ముల అనుబంధం గురించి మీకు బాగా తెలుసు. కానీ దీపు(చిరాగ్‌ను ఉద్దేశించి) నన్ను పార్టీ నుంచి వెళ్లగొడతానని బెదిరించినపుడు మీరు తనను చెంపదెబ్బకొట్టలేదు. కనీసం తన మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పలేదు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను చిరాగ్ తెగేదాకా లాగడంతోనే పరాస్ తిరుగుబాటుకు ఉపక్రమించారని ఆ కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘చిరాగ్ ఎప్పుడూ తన తండ్రి, బాబాయ్‌ల మధ్య అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారికి ఎటువంటి కష్టం రాకుండా కనిపెట్టుకుని ఉన్న తీరును గమనించలేదు. బహుశా అందుకేనేమో ప్రతీసారి దూకుడుగా ప్రవర్తించి పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నాడు’’ అని వారు వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. గంటన్నర సేపు వెయిట్ చేయించారు రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన పశుపతి పరాస్... తెరవెనుక ఉంటూనే ఆయన రాజకీయ జీవితంలో తన వంతు పాత్ర పోషించారు. మరో సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌కు సైతం అన్ని విధాలా అండగా నిలబడ్డారు. అయితే, రామ్‌విలాస్ మరణం తర్వాత చిరాగ్ మాత్రం ఆయనను ఖాతరు చేయలేదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరాస్ సలహాలు, సూచనలు పట్టించుకోకపోవడం, కించపరిచే విధంగా వ్యవహరించడం సహా... ఒంటెద్దు పోకడలతో పార్టీని మొత్తంగా ముంచివేసే విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని పరాస్ నివాసానికి వెళ్లి, గంటన్నర సేపు ఎదురుచూసినా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్ల తిరుగుబాటు నేపథ్యంలో మంగళవారం ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా తానే తిరుగుబాటు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చిరాగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో తదుపరి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారన్న అంశం చర్చనీయాంశమైంది. చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం! -
Bihar: దెబ్బ మీద దెబ్బ.. తగ్గేదే లే అంటున్న చిరాగ్!
పట్నా: బిహార్ యువ రాజకీయనేత చిరాగ్ పాశ్వాన్‌కు గట్టిఎదురుదెబ్బ తగిలింది. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు... లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. దీంతో, పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన పరాస్ బృందం, పార్టీ పదవి నుంచి చిరాగ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పరాస్, ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసింది. అదే విధంగా, ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్భాన్ సింగ్ ఉంటారని పేర్కొంది. ఈ క్రమంలో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్ పరాస్ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తనను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే చిరాగ్, పార్టీ సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు. చదవండి: ‘ఎల్జేపీ’లో తిరుగుబాటు -
ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం!
గతేడాది బిహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీయేలో భాగస్వామ్యమైన చిరాగ్ పాశ్వాన్, మరో భాగస్వామి నితీశ్ కుమార్‌కు కంట్లో నలకలా మారారు. ఎన్డీయే కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీశ్‌కు చికాకులు తెచ్చారు. ఒకపక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీశ్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతికష్టం మీద ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంది. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. ఎల్జేపీ అభ్యర్థుల కారణంగా, దాదాపు 35 సీట్లను జేడీయూ కోల్పోయింది. దాంతో తొలిసారి మిత్రపక్షం బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎల్జేపీని బలహీన పర్చే ప్రయత్నాలను జేడీయూ ముమ్మరం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి అదను కోసం చూస్తున్న నితీశ్ చాణక్యం వల్లనే తాజాగా ఎల్జేపీలో ముసలం పుట్టిందంటున్నారు. చిరాగ్‌ను ఒంటరి చేసేలా... మిగతా ఎంపీలకు దగ్గరవుతూ నితీశ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎల్జేపీకి ఉన్న 6గురు ఎంపీల్లో ఐదుగురు చిరాగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వేరు కుంపటి పెట్టుకొని, తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. లోక్ జనశక్తి అధినేత పదవిని సైతం చిరాగ్ వదులుకొని తన బాబాయి పశుపతి కుమార్ పరాస్‌కు పగ్గాలు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక నితీశ్ పావులు కదిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎల్జేపీ ఎంపీలతో నితీశ్ నేరుగా సంప్రదింపులు జరిపారని, ఈ వ్యవహారాన్ని జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ద్వారా నడిపించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రామ్‌విలాస్ మృతితో బీజాలు పశుపతి పరాస్తో మహేశ్వర్ హజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి, కొడుకు మధ్య విబేధాలున్నాయి. రామ్‌విలాస్ పాశ్వాన్ మరణానంతరం పశుపతికి, చిరాగ్‌కు మధ్య సంబంధాలు క్షీణించాయి. ఎన్నికల్లో విడిగా పోటీచేయాలన్న చిరాగ్ నిర్ణయాన్ని అప్పట్లోనే పశుపతి వ్యతిరేకించారు. అప్పట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పశుపతిని నితీశ్ దగ్గరకు తీశారని సదరువర్గాల సమాచారం. దీంతో పాటు తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఒకరైన వీణా సింగ్ జేడీయూ నుంచి సస్పెండయిన ప్రజాప్రతినిధి భార్య. తిరిగి నితీశ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఈ నేత ఎంతో యత్నిస్తున్నారు. దాంతో వీణాసింగ్ మద్దతు సులభంగానే పరాస్‌కు లభించింది. అలాగే మరో ఎంపీ అనారోగ్యం పాలైనప్పుడు నితీశ్ వ్యక్తిగతంగా ఆయన బాగోగులపై ఆరా తీశారు. ఇలా ప్రతి ఎంపీతో ఏదోరకంగా సత్సంబంధాలు నెరపడం, అటు పశుపతిని దువ్వడం ద్వారా నితీశ్ తాను అనుకున్నది సాధించారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఎల్జేపీకి ఉన్న ఏకైక ఎంఎల్ఏ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో జేడీయూకు మద్దతు పలికారు. నితీశ్ పంచన చేశారు. ఉన్న ఒక్క ఎంఎల్సీ బీజేపీలో చేరారు. అప్పుడైనా చిరాగ్ మేలుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాను మోదీకి హనుమంతుడి లాంటివాడినని చిరాగ్ ఎంత చెప్పుకున్నా, ప్రస్తుతం నితీశ్‌తో సంధి తప్ప ఆయన్ను కాపాడే మార్గాలేవీ లేవంటున్నారు. చిరాగ్ ఎన్డీయేలో ఉంటూనే జేడీ (యూ)ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉండొచ్చనే వాదనలు అప్పట్లో వినిపించాయి. నితీశ్‌ను బలహీనపర్చి... తమపై ఆధారపడేలా చేసే గేమ్‌ప్లాన్‌లో భాగంగానే చిరాగ్‌ను జేడీయూపైకి ప్రయోగించారని అంటారు. చివరకు అదే జరిగింది. జేడీయూకు కంటే బీజేపీకి ఎక్కవ స్థానాలు గెలిచినా... ఎన్నికలకు ముందు ప్రకటించిన మేరకు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా చేసి... బీజేపీ క్రెడిట్ కొట్టేసింది. ఇప్పుడు చిరాగ్... ఒంటరిగా మిగిలే పరిస్థితులు వచ్చినపుడు అది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ అంటోంది. రాజకీయాలు తెలిసి రావాలంటే చిరాగ్‌కు ఇంకా సమయం పడుతుందేమో. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఎల్జేపీ’లో తిరుగుబాటు
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించిన ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’లో తిరుగుబాటు తలెత్తింది. పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పార్టీ నేత, రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆయన బాబాయి, హజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఉపనేతగా మరో ఎంపీ మెహబూబ్ అలీ కైజర్‌ను ఎన్నుకున్నారు. లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి వారు స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. పార్టీని తాను విచ్ఛిన్నం చేయలేదని, నిజానికి పార్టీని కాపాడానని పార్టీలో తిరుగుబాటు అనంతరం సోమవారం పశుపతి çపరాస్ వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్‌కు, ఎల్జేపీకి ప్రత్యర్థి అయిన జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్‌ను గొప్ప నాయకుడు, ప్రగతిశీల ముఖ్యమంత్రి అని పరాస్ ప్రశంసించారు. ఈ తిరుగుబాటు వెనుక ఆయన లేరన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ పోరాడిన తీరుపై 99% కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. పార్టీలోని సంఘ వ్యతిరేక శక్తుల కారణంగా పార్టీ నాశనమయ్యే స్థితికి చేరుకుందన్నారు. ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందన్నారు. ఈ తిరుగుబాటుపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. బాబాయి నివాసం వద్ద గంటన్నర నిరీక్షణ! తన బాబాయిని కలుసుకునేందుకు చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు. చిరాగ్ సోదరుడు (కజిన్), మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అదే నివాసంలో ఉంటున్నారు. అక్కడ గంటన్నర పాటు వేచిచూసిన తరువాత చిరాగ్ పాశ్వాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ చిరాగ్‌తో ఆయన బాబాయి పరాస్ కానీ, సోదరుడు ప్రిన్స్ రాజ్ కానీ కలవలేదని సమాచారం. ఆ సమయంలో పరాస్, ప్రిన్స్‌రాజ్ అక్కడ లేరని ఆ తరువాత అక్కడి సిబ్బంది తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంపై చాన్నాళ్లుగా ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్లు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా నిలవడం రాష్ట్రంలో ఎల్జేపీని బాగా దెబ్బతీసిందని వారు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 2020లో తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ హఠాన్మరణం అనంతరం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చిరాగ్ పాశ్వాన్‌కు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. పరాస్ వర్గం పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా పాశ్వాన్‌ను తొలగించనున్నారని, ఆ తరువాత ఎన్నికల సంఘాన్ని కలిసి నిజమైన ఎల్జేపీ తమదేనని గుర్తించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి చిరాగ్ పాశ్వాన్‌ను తీసుకోనున్నారనే వార్తల నేపథ్యంలోనే, జేడీయూ సూచనల మేరకే ఈ తిరుగుబాటు జరిగిందని చిరాగ్ సన్నిహితులు ఆరోపించారు. కాగా, ఇది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఎన్డీయే నుంచి విడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. చిరాగ్ పాశ్వాన్ ఎన్నడూ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించలేదు. -
ఎన్డీయేలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ : అధికార ఎన్డీయేలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బడ్జెట్ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ భేటీకి లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ చిరాగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనివెనుక జేడీయూ అభ్యంతరాలే కారణమని భావిస్తున్నారు. కూటమి భావనను మరిచిపోయి, ఎన్నికల్లో తమను వెన్నుపోటు పొడిచిన పార్టీకి తిరిగి ఆహ్వానం పంపడమేంటంటూ జేడీయూ నేతలు బీజేపీపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. బిహార్‌కే చెందిన ఎన్డీఏ పక్షాలు హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలు కూడా ఎల్జేపీకి ఆహ్వానం పంపడం ఏంటంటూ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో, ఎల్జేపీకి పంపిన ఆహ్వానాన్ని బీజేపీ వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్జేపీ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎల్జేపీ అభ్యర్థులను నిలిపింది. తమకు వ్యతిరేకంగా చిరాగ్ అభ్యర్థులను బరిలో నిలపడంతో తాము పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయామని జేడీయూ ఆరోపిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని సీఎం నితీష్ కుమార్ సైతం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎల్జేపీ, జేడీయూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. -
బీజేపీకి చెక్: చిరాగ్ చెంతకు తేజస్వీ
పట్నా : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బిహార్‌లో రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు దీనికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోరుమీదుకున్న ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎత్తులు వేస్తున్నారు. దీనికి లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాం విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి తమ కుటుంబానికే కేటాయిస్తుందని చిరాగ్ భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానానికి బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ పేరును నామినేట్ చేయడం యవనేతకు షాకింగ్ కలిగించింది. తన తండ్రి స్థానంలో జరుగుతున్న ఎన్నికకు కనీసం తమకు సంప్రదించకుండా సుశీల్ పేరును ఖరారు చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. (ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) ఈ క్రమంలో చిరాగ్‌తో దోస్తీకి ప్రయత్నం చేస్తున్న తేజస్వీ వ్యూహత్మకంగా ఆలోచన చేశారు. పాశ్వాన్ మృతితో జరుగుతున్న ఎన్నికలో ఆయన భార్య, చిరాగ్ తల్లి రీనాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చిరాగ్‌కు దగ్గర కావడంతో పాటు ఎన్డీయే విజయానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. రీనాకు ఆర్జేడీ మద్దతు ఇస్తామని తేజస్వీ ఇదివరకే వర్తమానం పంపినట్లు బిహార్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆర్జేడీ సీనియర్ నేత శక్తీ యాదవ్ మాట్లాడుతూ.. రినా పాశ్వాన్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే దానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయం చిరాగ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఒకవేళ చిరాగ్ ముందుకు రాకపోతే మహాకూటమి తరుఫున సుశీల్ మోదీకి వ్యతిరేకంగా తామూ అభ్యర్థిని బరిలో నిలుపుతామని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని కైవలం చేసుకునే విధంగా ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) మరోవైపు తేజస్వీ ఎత్తుగడ బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ చిరాగ్‌ను తనవైపుకు తిప్పుకుంటే ఎల్జేపీ సానుభూతిపరులు దాదాపు తేజస్వీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌తో విభేదించిన చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జేడీయూపై తీవ్ర ప్రభావం చూపగా.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చిపెట్టింది. అయితే తాము ఎన్డీయే భాగస్వామ్యం పక్షంగానే కొనసాగుతామని ప్రకటించిన ఎల్జేపీ.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో మాత్రం చేరలేదు. దీంతో తండ్రి మరణం అనంతరం చిరాగ్ ఒంటరి వాడు అయ్యాడనే భావన కలుగుతోంది. దీనిని తేజస్వీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫర్‌పై చిరాగ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
నితీష్‌కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్‌దాస్‌పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్‌కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్‌దాస్‌తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్‌కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
నితీశ్‌కు ‘చిరాక్’
పట్నా: ‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే నా ప్రధాన ఉద్దేశం. ఈ ఎన్నికల్లో నేను చూపించిన ప్రభావం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’’.. ఎన్నికల ఫలితాల అనంతరం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలివీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారం దక్కించుకుంది. ఈ కూటమిలోని బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుంది. మరో పార్టీ జేడీ(యూ) దారుణంగా చతికిలపడింది. ఇందుకు ప్రధాన కారణం ఎల్జేపీ పోటీలో ఉండడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలుండగా, 120 స్థానాల్లో చిన్నాచితక పార్టీలు ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీశాయి. ఇందులో 54 సీట్లలో ఎల్జేపీ బలమైన ప్రభావం చూపింది. వీటిలో 25 సీట్లలో జేడీ(యూ) రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎల్జేపీ పోటీ చేయడం వల్ల జేడీ(యూ) ఓడిపోయింది. మొత్తం 54 స్థానాల్లో ఎల్జేపీ మూడో స్థానంలో నిలిచింది. ఆయా స్థానాల్లో గెలిచిన, ఓడిన ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కంటే ఎల్జేపీకి దక్కిన ఓట్లే అధికం కావడం విశేషం. ఈ ఓట్లన్నీ ఓడిపోయిన ప్రధాన పార్టీకి పడి ఉంటే కచ్చితంగా గెలిచేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎల్జేపీ మతీహన్ అనే స్థానంలో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని చోట్లా పరాజయం పాలైంది. మహాకూటమికీ గట్టి దెబ్బ ఎన్డీయే మిత్రపక్షమైన వికాశీల్ ఇన్సాన్ పార్టీ కూడా ఎల్జేపీ వల్ల 4 స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చాలాచోట్ల ఎల్జేపీ అభ్యర్థులను నిలపలేదు. కొన్నిచోట్ల ఎల్జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎల్జేపీ వల్ల ఒక స్థానంలో మాత్రమే బీజేపీ ఓటమి మూటకట్టుకుంది. ఎల్జేపీ అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల మహాకూటమిలోని ఆర్జేడీ 12 సీట్లు, కాంగ్రెస్ 10, సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లలో ఓడిపోయాయి. మొత్తంగా చూస్తే చిరాగ్ పాశ్వాన్ వల్ల ఎన్డీయే 30, మహాకూటమి 24 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. లాభమెంత? నష్టమెంత? ఎల్జేపీ వల్ల ప్రధాన పార్టీలకు నష్టమే కాదు, లాభం కూడా దక్కింది. ఆయా పార్టీలు ఓడిపోవాల్సిన చోట గెలిచాయి. ఓట్లను ఎల్జేపీ చీల్చడంతో ఇది సాధ్యమైంది. ఎల్జేపీ పోటీ కారణంగా ఆర్జేడీ 24, కాంగ్రెస్ 6, జేడీ(యూ) 20, హిందూస్తాన్ ఆవామ్ మోర్చా 2, బీజేపీ ఒకటి, వీఐపీ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. స్థూలంగా చెప్పాలంటే.. చిరాగ్ పాశ్వాన్ కారణంగా బిహార్‌లో ఎన్డీయేకు లాభం 24, నష్టం 30. మహాకూటమికి లాభం 30, నష్టం 24. చిరాగ్ ఆత్మాహుతి దళంలా పని చేశారు ప్రధాని మోదీకి తాను హనుమంతుడి లాంటి భక్తుడినని చెప్పుకుంటున్న చిరాగ్ పాశ్వాన్ జేడీ(యూ)ను దెబ్బకొట్టడంపైనే దృష్టి పెట్టారు. ఆయన అనుకున్నది నెరవేరింది. ఈ ఎన్నికల్లో చిరాగ్, ఆయన బృందం ఆత్మాహుతి దళంలా పని చేసిందని జేడీ(యూ) నేత రాజీవ్ రంజన్ విమర్శించారు. -
నితీష్ గెలిచింది ప్రధాని మోదీ వల్లే..
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ గెలిచినది ప్రధాని మోడీ వల్ల మాత్రమే అని అన్నారు. బుధవారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లోని ఓటర్లు ప్రధాని మోడీపై తమకున్న విశ్వాసం వ్యక్తం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధిని సాధించడానికి బిహార్‌లో బీజేపీ బలోపేతం కావడం అవసరమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎల్జేపీ బాగా పోరాడిందని అన్నారు. బిహార్ ఎన్నికల్లో 150 స్థానాల్లో సొంతంగా పోటీచేసి మెజారిటీ స్థానాల్లో మంచి ప్రదర్శన కనబరిచామన్నారు. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనే నినాదంతో పోటీచేసిన 6శాతం ఓట్లు సాధించాము. మమ్మల్ని పిచ్లాగ్ పార్టీ అని పిలిచారు. అయినా మేము ఎవరి మద్దతులేకుండా ధైర్యం చూపించామన్నారు.. దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. (బీజేపీదే బిహార్) కాగా.. సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు, మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. -
నితీష్ కుమార్ ఇక ఇంటికే :పాశ్వాన్
పట్నా : మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలకు బిహార్ సిద్ధమైంది. చివరి దశలో మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. తుది దశలో మెత్తం 2కోట్ల 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఘాటు వ్యాక్యాలు చేశారు. మరోసారి నితీష్ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. తాను సాధారణ స్థాయి నుంచి వచ్చి పనిచేశానని, పార్టీ కోసం ఒంటరిగా కృషి చేస్తున్నానని అన్నారు. గడిచిన రెండు దశల ఎన్నికలను పరిశీలిస్తే నితీష్ కుమార్ మరలా ముఖ్యమంత్రి కారని అన్నారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెడుతుందని, ప్రతి ఒక్కరికీ దీని గూర్చి తేలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. ఓటర్లు అంతా ముందుకు వచ్చి ఓటు వేయాలని నేను కోరారు. గత 15 సంవత్సరాల కంటే బిహార్ రాబోయే ఐదేళ్ళు మెరుగ్గా ఉండటానికి ఇదే అవకాశమని ఆయన అన్నారు . -
‘నితీశ్ తలవంచక తప్పదు’
పాట్నా: ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నితీశ్‌కుమార్, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ముందు తలవంచకతప్పదు అని ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్ అన్నారు. గురువారం చిరాగ్ మీడియాతో మాట్లాడుతూ, నువ్వు( సీఎం నితీశ్ కుమార్) ఏ ప్రధానితో అయితే ఎప్పుడు గొడవపడుతూ, విమర్శిస్తూ ఉంటావో ఇప్పుడు నీ కోసం ఓట్లు అడగమని అతని ముందే తల దించావు. దీన్ని బట్టే నీకు ముఖ్యమంత్రి పదవి అన్న, ఆ అధికారం అన్న ఎంత ఆశ ఉందో అర్ధం అవుతోంది. నవంబర్ 10 తరువాత నువ్వు తేజస్వీ యాదవ్ ముందు తలవంచక తప్పదు’ అని అన్నారు. ఇప్పటికే బిహార్‌లో మూడవదశ పోలింగ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షంపై తూటాలు ఎక్కు పెట్టింది. ఫైనల్ దశ పోలింగ్ శనివారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పరాగ్ కేంద్రప్రభుత్వంతో నితీశ్ వ్యతిరేకించిన విషయాలను చర్చించారు. ఆర్టికల్ 370, సీఏఏ విషయంలో నితీశ్ విబేధించారని అయితే ఇప్పుడు ఎన్నకల సమయంలో మద్దతు కోసం నితీశ్ కేంద్రప్రభుత్వంతో ఉన్న విబేధాలను మర్చిపోయారని మండిపడ్డారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా నితీశ్ బిహార్‌ను అభివృద్ధి పరచలేదని విమర్శించారు. నితీశ్ కుమార్ ఇప్పటి వరకు ఐదు సార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. చదవండి: సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్ అంటూ.. -
నితీష్ ఇంకెప్పుడూ సీఎం కాలేరు : చిరాగ్
పట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. నితీష్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. బిహార్‌లో నేడు (మంగళవారం) రెండో దశ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తన ట్వీట్లతో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 10 తర్వాత నితీశ్ కుమార్ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత నితీష్‌జీకి ఓటమి భయం పట్టుకుందని, ప్రజలు అతన్ని తిరస్కరిస్తున్నారని అర్థమైందని అన్నారు. ‘నితీష్ ఫ్రీ బిహార్ కావాలి, గత 15 ఏళ్లలో రాష్ట్రం అపఖ్యాతి పాలై, దారుణమైన స్థితికి చేరుకుంది. వలసలు, నిరుద్యోగం, వరదలు వంటి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు చీకట్లో జీవిస్తున్నారు. బిహార్ నుంచి వలస వెళ్లిన వారు తమను తాము బిహారీ అని చెప్పుకోడానికి వెనకాడుతున్నారు. అయోధ్య రామ మందిరం కంటే పెద్దదైన సీత ఆలయాన్ని బిహార్‌లో నిర్మిస్తామని హామీ ఇస్తున్నా. బిహార్ ఫస్ట్- బిహారీ ఫస్ట్ అనేదే మా నినాదం’ అని అన్నారు. బిహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అక్టోబర్ 27న మొదటి దశ ఎనికలు పూర్తి కాగా, నవంబర్ 3న రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న విడుదల కానున్నాయి. కరోనా సంక్షోభం అనంతరం జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. -
తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బుధవారం పార్టీ ప్రణాళికను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ పక్కన లేకుండా విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి. అడవిని చీల్చుకుంటూ పులి పిల్ల నెమ్మదిగా బయటకు వస్తుందని నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నేడు నేను అదే పని చేశాను. బిహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్ అనేదే మా సిద్ధాంతం. 4 లక్షల మంది ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుని రూపొందించిన మేనిఫెస్టో ఇది. విద్య, ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున యువత రాష్ట్రాన్ని వీడి వెళ్తున్నారు. రాష్ట్రంలో అభవృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన కారణంగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. వాటిని నివారించి స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పలు అంశాలు రూపొందించాం’’ అని పేర్కొన్నారు.(చదవండి: నా చెల్లెలు వంటిది, గెలిపించండి: చిరాగ్) అదే విధంగా, ఉద్యోగార్థులు- సంస్థల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పారద్రోలుతామని హామి ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కరువుకాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడే విధంగా, కెనాళ్ల ద్వారా నదుల అనుసంధాన ప్రక్రియ చేపడాతమని చిరాగ్ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత రాజస్తాన్‌లోని కోటా, ఢిల్లీలోని ముఖర్జీ నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వంటి కోచింగ్ సిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు. (చదవండి: ‘పాదాలకు నమస్కరించినా పట్టించుకోలేదు’) వీటితో పాటు లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తామని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇక తాము అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా గ్రామ పంచాయతి ప్రధాన కేంద్రాలు, మార్కెట్లతో పాటు ఇతరత్రా ప్రధాన బ్లాకులన్నింటిలో వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కాగా ఈనెల 28న బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ నేడు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. -
నితీష్‌కు డబుల్ ట్రబుల్..!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రతిపక్షాలతో పాటు విపక్షంగా మారిన మిత్రపక్షం లోక్ జన్‌శక్తి పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతానని తెలిపారు. ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమస్యను రెట్టింపు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్‌కి మద్దతు తెలిపారు. రామ్ విలాస్ పాశ్వాన్ లేని సమయంలో నితీష్ కుమార్ వారికి అండగా ఉండాల్సింది పోయి చిరాగ్ పాశ్వాన్‌ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘చిరాగ్ పాశ్వాన్ విషయంలో నితీష్ కుమార్ వైఖరి సరైంది కాదు. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్‌కి ఆయన తండ్రి అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ మన మధ్యలో లేరు. నిజంగా ఇది శోచనీయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ పట్ల నితీష్ కుమార్ వైఖరి పూర్తిగా అన్యాయంగా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నేను మోదీ హనుమాన్‌ని!) అయితే తేజస్వీ ఇలా చిరాగ్ పాశ్వాన్‌కు మద్దతివ్వడం వెనక గల కారణాలను విశ్లేషిస్తే.. ఇద్దరి తండ్రులు మధ్య గల స్నేహం ఒక కారణమైతే సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా ఇరు యువ నాయకులు తండ్రులు నితీష్ కుమారతో కలిసి పని చేశారు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పుడు తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇద్దరీకి ఉమ్మడి శత్రువుగా మారడంతో తేజస్వీ, చిరాగ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిలో భాగంగానే రాఘోపూర్ నియోజకవర్గంలో తేజస్వీకి సహాకరించేందుకుగాను చిరాగ్ రాజ్‌పుత్ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల బీజేపీ ఉన్నత కుల ఓటు బ్యాంకు చీలిపోయి తేజస్వీకి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నాయి. -
ప్రతిపక్షంలోనే కూర్చుంటా: చిరాగ్ పాశ్వాన్
పట్నా : లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ సీఎం సీటే లక్ష్యంగా పనిచేస్తున్న నితీశ్.. జేడీయూ నిర్వహించబోయే అన్ని ప్రచార ర్యాలీలకు రావాల్సిందిగా ప్రధాని మోదీపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించారు. అంతేకాకుండా జేడీయూ, బీజేపీ కూటమికి మద్దతు తెలిపేలా తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ ఐసీయూలో ఉండగా కేవలం మద్దతు కోరేందుకే మోదీ తనకు ఫోన్ చేశారన్నారు. అందుకే తనకు మోదీ పట్ల గౌరవం తగ్గిపోయినట్టు తెలిపారు. తమ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరబోదని, ప్రతిపక్షంలోనే కూర్చుంటానని స్పష్టం చేశారు. కాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా నితీష్ కుమార్‌పై మండిపడ్డారు. సీఎం మొదటి, చివరి ప్రేమ సీఎం కుర్చీపైనే ఉంటుందని ఎద్దేవా చేశారు. -
‘ప్రధాని మోదీపై నితీష్ ఒత్తిడి ఉంది’
పట్నా: అధికార జేడీయూని వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మరోసారి విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి మేరకే ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో 12 ర్యాలీలకు ఓకే చెప్పారని అన్నారు. నితీష్ ఒత్తిడి కనుక లేకుంటే ప్రధాని మోదీ అన్నేసి ర్యాలీలకు పచ్చజెండా ఊపేవారు కాదని చెప్పారు. ఇక ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన చిరాగ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. జేడీయూ ఉండగా ఎన్డీఏలో భాగయ్యేది లేదని స్పష్టం చేసిన ఆయన సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి బీజేపీతో కలిసి అధికారాన్ని చేపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాకాని కాకుండా నితీష్ మరోసారి సీఎం అయితే ఎన్డీఏలో కలవకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు. 15 ఏళ్లుగా పాలన సాగిస్తున్న జేయూడీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని చిరాగ్ విమర్శించారు. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఫొటోలు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనే బీజేపీ నేతల విమర్శలపై చిరాగ్ శుక్రవారం స్పందించిన సంగతి తెలిసిందే. తన గుండెల్లో మోదీ ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చిరాగ్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, ఓట్లు చీల్చేందుకు అతను ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే, తన తండ్రి స్థాపించిన ఎల్జేపీ ఓట్లు చీల్చే పార్టీ అయితే, 2014, 2015, 2019 ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీ నేతలను చిరాగ్ సూటిగా ప్రశ్నించాడు. కాగా, అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7.. మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. -
నేను మోదీ హనుమాన్‌ని!
పట్నా/న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తాను హనుమంతుడి వంటి భక్తుడినని లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ శుక్రవారం పేర్కొన్నారు. తన గుండెల్లో ఆయనే ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫొటోను వాడుకుంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించిన నేపథ్యంలో చిరాగ్‌పాశ్వాన్ స్పందించారు. ‘సీఏఏను, ట్రిపుల్ తలాఖ్‌ను, ఎన్ఆర్సీని, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన సీఎం నితీశ్‌కే ప్రధాని ఫొటో అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రధానితో ఆయనే వేదికను పంచుకోవాల్సి ఉంటుంది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తన అనుబంధం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తరువాత బిహార్‌లో బీజేపీ– ఎల్జేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ ఓట్లను చీల్చే వ్యక్తి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభివర్ణించారు. బీజేపీ సీనియర్‌నేతలతో సత్సంబంధాలున్నాయని పేర్కొంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఎల్జేపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బిహార్‌లో బీజేపీ జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలతో కలిసి పోటీ చేస్తోందన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో 12 ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారని బిహార్ ఎన్నికల ఇన్చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. -
నా గుండె చీల్చి చూడండి: చిరాగ్ పాశ్వాన్
పట్నా: బీజేపీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే తనకున్న ఏకైక లక్ష్యమని లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఆ పార్టీ నాయకుల మాటలు తనను బాధిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోయినా ఎన్నికల్లో విజయం సాధించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. మోదీ రాముడైతే, తాను హనుమంతుడి లాంటివాడినని, ఆయన ఆశీసులు తనకు ఎప్పుడూ ఉంటాయంటూ అభిమానం చాటుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే, జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్జేపీని బరిలోకి దింపి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఢీకొట్టేందుకు ఈ యువనేత సిద్ధమయ్యారు. (చదవండి: పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) తప్పుదోవ పట్టించొద్దు ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌కు చెక్ పెట్టేందుకే, బీజేపీ అతడిని అస్త్రంగా వాడుకుంటోందన్న సందేహాలు తలెత్తాయి. దీంతో జేడీయూ నేతల నుంచి ఇదే తరహా అనుమానాలు వ్యక్తం కావడం సహా, సీఎంపై చిరాగ్ తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ నేత భూపీందర్ యాదవ్ తదితరులు శుక్రవారం ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఆయన ఓ ప్రత్యేక దారిని ఎంచుకున్నారు. అంతేకాదు బీజేపీ సీనియర్ లీడర్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు బీ, సీ వంటి టీంలు ఏమీలేవు. ఎన్డీయేకు నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తుంది. చిరాగ్ పార్టీ కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోతుంది’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్) నా గుండెను చీల్చి చూడండి ఈ విషయంపై స్పందించిన చిరాగ్..‘‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. ఆయన నా గుండెల్లో ఉన్నారు. రాముడికి హనుమంతుడు ఎలాగో, ఆయనకు నేనూ.. అలాగే. మీరు గుండెను చీల్చి చేస్తూ అందులో మోదీజీ కనబడతారు’’అని చెప్పుకొచ్చారు. సీఎం నితీశ్ జీకే ఆయన ఫొటోల అవసరం ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక తన తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి చిరాగ్ మాట్లాడుతూ.. ‘‘ నాన్న భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి పట్నాకు తీసుకువచ్చిన సమయంలో నితీశ్ కుమార్, ఎయిర్‌పోర్టుకు వచ్చి నివాళులు అర్పించారు. అప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరించాను. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. అక్కడున్న వాళ్లంతా ఈ విషయాన్ని గమనించారు. అంతేకాదు మా అమ్మనుగానీ, నన్ను గానీ కనీసం పరామర్శించలేదు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలా ప్రవర్తిస్తారా? ఆయన ప్రవర్తకు నన్ను షాక్‌కు గురిచేసింది. కానీ ప్రధాని మోదీ అలా కాదు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను పరామర్శించారు. నా భుజం తట్టి, మేమంతా ఉన్నామనే భరోసా ఇచ్చారు’’అని పేర్కొన్నారు. -
ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్ పాశ్వన్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కారులో కీలకంగా వ్యవహరించి రాం విలాస్ పాశ్వాన్ మృతి కూటమికి తీరని లోటనే చెప్పవచ్చు. అయితే నితీష్ కుమార్‌తో విబేధాల నేపథ్యంలో ఈ సారి రాం విలాస్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగాలని భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తాను ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇది తన తండ్రి కోరిక అన్నారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని మా నాన్న భావించారు. అలా అయితేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటుందన్నారు. ఎన్డీఏ నుంచి విడిపోయినా.. బీజేపీతో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. నితీష్ కుమార్ ప్రభుత్వంపై పోరాడతాం. ఒంటరిగా బరిలో దిగాలని నాన్న నన్ను ప్రేరేపించారు. ఇది నాన్న గారి అతిపెద్ద కల. 2005లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని గరించి విదేశాంగ శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్, షహనావాజ్ హుస్సేన్ వంటి చాలా మంది బీజేపీ నాయకులకు తెలుసు’ అన్నారు. (పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!) అంతేకాక ‘ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో ఐదేళ్లు కొనసాగితే మీరు మరో 10-15 ఏళ్లు చింతించాల్సి వస్తుంది. మరో ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రజల పాలిట పెను విపత్తు అవుతుందని నాన్న భావించారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నన్ను ప్రేరేపించారు’ అన్నారు చిరాగ్ పాశ్వాన్. తన తండ్రి మరణం తనను ఎంతో కుంగదీసిందన్నారు. ‘నేను తనని చాలా మిస్ అవుతున్నాను. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరు ముందుగా ఊహించలేరు. ఈ బాధ వర్ణణాతీతం. నాన్న లేరు.. మరో వైపు ఎన్నికలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాలే నాకు బలం. ఆయన పాటించిన విలువలను నేను కొనసాగిస్తాను’ అని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదన్నారు సుశీల్ కుమార్ మోదీ. -
పాశ్వాన్‌కు కన్నీటి వీడ్కోలు
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం బిహార్ రాజధాని పట్నాలో ముగిశాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న జనార్దన్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్య క్రియలు నిర్వహించారు. పాశ్వాన్ చితికి ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిప్పంటించారు. బిహార్ సీఎం నితీశ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, అధిక సంఖ్యలో పాశ్వాన్ అభిమానులు తరలివచ్చారు. పాశ్వాన్ స్వస్థలం హాజీపూర్ నుంచి జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. చితికి నిప్పపెట్టాక చిరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూ లిపోయాడు. కొంతసేపు అచేతన స్థితికి చేరుకున్నాడు. చిరాగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సమీప బంధువులు తెలిపారు. -
పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!
పట్నా : కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. మాయావతి తరువాత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన దళిత నేతగా పేరొందిన రాంవిలాస్ మరణించడం.. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. దళిత ఓట్లను ఆకట్టుకోవడంలో వ్యూహ రచనచేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని చెప్పకతప్పడంలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా పాశ్వాన్ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకు దక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని దళిత నేత ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను భుజానకెత్తునే పరిస్థితి నెలకొంది. తండ్రి అంతటి రాజకీయ అనుభవంతో పాటు వ్యహరచనలో మెలుకువులు తెలియకపోవడం చిరాగ్‌కు పెద్ద సమస్యగా మారింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. పాశ్వాన్ లేని ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. (సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ) ఇన్నేళ్లు పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తాజాగా నెలకొన్న విపత్కరమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతల నుంచి, అభ్యర్థుల ఎంపిక కూడా చిరాగే చూడాల్సి ఉంది. అయితే చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్‌లో బయటపడనుంది. మరోవైపు తొలివిడత పోలింగ్‌లో ఎల్జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవంలేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. అయితే యువనేతకు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ (74) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి చనిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్ హఠాణ్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాశ్వాన్ ప్రస్తుత వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిగా ఉన్నారు. 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న తరువాత 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో హాజీపూర్ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ తిరిగి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగున్నారు. మొత్తం ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1946 జూలై 5న బిహార్‌లో జన్మించిన పాశ్వాన్.. 2000లో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగంగా కేంద్రమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కాగా రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణంతో దేశం దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయింది. పార్లమెంటులో అత్యంత చురుకైన మరియు ఎక్కువ కాలం పనిచేసిన సభ్యులలో ఆయన ఒకరు. అతను అణగారిన వర్గాలవారికి స్వరం, అట్టడుగున ఉన్నవారికి విజయాన్ని అందించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రామ్‌విలాస్ పాశ్వాన్ ఇక లేరన్న వార్త నన్ను దిగ్ర్బాంతికి గురిచేసింది. పాశ్వాన్ మృతితో ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. పేదల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగానూ లోటుగా అనిపిస్తుంది. తాను ఓ మంచి స్నేహితుడిని, సహచరుడిని పేదల కోసం ఆలోచించే వ్యక్తిని కోల్పోయాను. - ప్రధాని నరేంద్ర మోదీ రామ్ విలాస్ పాశ్వాన్ జీ అకాల మరణం బాధాకరం. పేదలు, అణగారిన వర్గాలు ఆయన మృతితో ఈ రోజు ఒక బలమైన రాజకీయ గొంతును కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం ప్రకటిస్తున్నాను. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత -
రెబల్స్‌కు ఫడ్నవీస్ వార్నింగ్ !
బిహార్: లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్‌కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు. మోది పేరు వాడొద్దు... భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ
పట్నా: బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ మార్చుకుంది. అభ్యర్థుల ఎంపికపై మరోసారి కసరత్తు ప్రారంభించింది. జేడీయూతో కూడిన ఎన్డీఏలో తాము చేరబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని లోక్ జన శక్తి పార్టీ(ఎల్జేపీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడింది. దాదాపు 143 స్థానాల్లో ఎల్జేపీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనుంది. ఈక్రమంలో కుల సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే బీజేపీ బిగ్ బాస్ జేపీ నడ్డాతో బిహార్ బీజేపీ ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌మోడీలు ఇవాళ భేటీ కానున్నారు. బీజేపీతో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ఈ సమావేశం తర్వాతే ఆయన ప్రకటించారు. బీజేపీ 'ప్లాన్ బి'లో భాగంగానే ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీయూ ఉన్న ఎన్డీఏతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చిరాగ్ ప్రకటించినా ఇప్పటి వరకు బీజేపీ నేతలు స్పందించకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీకి దళిత ఓటర్ల మద్దతుంది. 2005 ఎన్నికల్లోనూ ఇలాంటి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగిన ఎల్జేపీ... ఆర్జేడీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించింది. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్
న్యూఢిల్లీ: బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి ఆదివారం కీలక భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వైదొలగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 143 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నది తమ లక్ష్యమని, అందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ భేటీలో నిర్ణయించారు. లక్షలాది బిహారీల అభిప్రాయాలను క్రోడీకరించి తాము రూపొందించిన ‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’ దార్శనిక పత్రం అమలు జేడీయూతో కలిసి కూటమిలో ఉంటే సాధ్యం కాదని స్పష్టమైందని వ్యాఖ్యానించింది. జేడీయూతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కూటమికి సంబంధం లేకుండా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచిన స్థానాల్లో ఎల్జేపీ తరఫున అభ్యర్థులను నిలపబోమని తెలిపింది. బీజేపీపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంది. ఎల్జేపీ నిర్ణయంతో.. రానున్న ఎన్నికల్లో జేడీయూ పలు స్థానాల్లో నష్టపోనుందని, కాంగ్రెస్, ఆర్జేడీల విపక్ష కూటమి లాభపడే అవకాశముందని భావిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: వీఐపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీకి దిగుతామని విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ప్రకటించింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కు శస్త్ర చికిత్స కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఆదివారం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళిత నేత హత్య బహిష్కృత ఆర్జేడీ నేత శక్తి మాలిక్ ఆదివారం హత్యకు గురయ్యారు. బిహార్‌లోని పుర్నియా జిల్లాలోని ఆయన నివాసంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఇది రాజకీయ హత్య అని, దళిత నాయకుడైన తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. శక్తి మాలిక్ హత్య అనంతరం ఒక వీడియో వైరల్ అయింది. రాణిగంజ్ టికెట్ కావాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ శక్తి మాలిక్‌ను డిమాండ్ చేస్తున్నట్లుగా, అంతు చూస్తానని బెదిరించినట్లు, కులం పేరుతో దూషించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ కేసులో తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
కేంద్ర మంత్రికి సర్జరీ.. చర్చలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై చర్చలు తుది దశకు చేరుకున్నాయనుకున్న తరుణంలో మరోసారి బ్రేక్ పడింది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అగ్ర నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కి అత్యవసరంగా హార్ట్ సర్జరీ నిర్వహించడంతో శనివారం నిర్వహించాల్సిన భేటీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రికి ఇవాళ ఉదయం శస్త్రచికిత్స జరిగిందని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో అవసరమైతే మరో శస్త్ర చికిత్స నిర్వహించే వీలుందని డాక్టర్లు వెల్లడించారని చిరాగ్ చెప్పారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమితో తలపడనుండగా ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు) -
ఇక వైదొలుగుతాం : అమిత్ షాకు లేఖ
పట్నా : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కావడంతో సీట్ల పంపకాలపై చర్చలు షూరు అయ్యాయి. విపక్షాలైన కాంగ్రెస్-ఆర్జేడీ ఇదివరకే ఓ అవగాహన కుదుర్చుకోగా.. ఆ కూటమిలో మరికొన్ని పార్టీలు వచ్చిచేరే అవకాశం ఉంది. ఇక అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. బీజేపీ-జేడీయూ మధ్య చర్చలు సానుకూలంగా ఉన్నా.. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని మూడో భాగస్వామ్యపక్షం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ)తో అసలు చిక్కొచ్చి పడుతోంది. జేడీయూ ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్మాలాను తమకు వర్తింపచేయాలని పట్టుపడుతోంది. లేదంటే తమదారి తాము చేసుకుంటామని సవాలు విసురుతోంది. ఎల్జేపీ డిమాండ్స్‌పై అధికార జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు తమ కూటమిలో లేనేలేరని తాము భావిస్తున్నామని తేల్చిచెబుతోంది. ఈ నేపథ్యంలో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆదివారం ఓ లేఖరాశారు. (ఎన్నికల నగారా మోగింది.. ఇక సమరమే) సీట్ల పంపకాలపై నాన్చుడు ధోరణి ఇక సాగదని, తమకు ఇచ్చేందేంటో వెంటనే చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. జేడీయూ తీరుతో తమ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయారని భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగితే కూటమిలో ప్రసక్తేలేదని వాపోయినట్లు సమచారం. తమనక నష్టం జరుగున్న కూటమిలో తాము ఇక ఉండలేని చెప్పిట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉందని చిరాక్ లేఖలో స్పష్టం చేశారు. ఇక ఇదే లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం పంపించారు. కాగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే. ముడు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు అక్టోబర్ 28న తొలివిడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 3న రెండో విడత, మూడో విడత నవంబర్ 7న జరుగనుంది. నవంబర్ 10 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. (వరుస ఎదురు దెబ్బలు: ఎన్డీయే విచ్ఛిన్నం..!) -
‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’
పట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సంజయ్ పాశ్వాన్, చిరాగ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాక ‘కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘సుపరిపాలన’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని.. జాతీయ వేదికపై బిహార్‌కు ‘తగిన గౌరవం’ పొందడానికి సహాయపడుతుందని అన్నారు. -
‘వారి విషయంలో యూపీని అనుసరించండి’
పట్నా: వలస కార్మికుల సమస్యపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు సరిగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. రిజిస్ట్రేషన్ కేంద్రాలు సరిగా పని చేస్తేనే.. కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోగలరని తెలిపారు. ఈ వివరాలను కేంద్రానికి అందజేయడం ద్వారా వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందన్నారు. బిహార్ వెలుపల ఉన్న వలస కార్మికులను రాష్ట్రానికి రప్పించే అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు తమ పార్టీ కార్యకర్తలు రేషన్‌ను అందజేశారని పాశ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. రాష్ట్రానికి చెందిన కార్మికులకు తగిన సాయం అందేలా చూడాలని కోరారు. అంతేకాక వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని పాశ్వాన్ ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్లలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు నితీష్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారికి సరైన సౌకర్యాలు కల్పించాలని పాశ్వాన్ డిమాండ్ చేశారు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
తండ్రికి కొడుకు క్షవరం
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు దేశం అనుసరిస్తున్న లాక్ డౌన్ కొత్త నైపుణ్యాలను బయటపెడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు ఆయన కొడుకు, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆదివారం క్షవరం చేసి ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌తో ట్రిమ్మింగ్ చేస్తున్న వీడియోను చిరాగ్ ట్వీట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. -
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
-
కేంద్ర మంత్రికి ట్రిమ్మింగ్ చేసిన తనయుడు
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యులే కాకుండా ప్రముఖులు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమలోని కొత్త కొత్త కళలను బయట పెడుతున్నారు. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కూడా తనలో ఉన్న కొత్త కళను బయటపెట్టారు. లాక్డౌన్ వేళ సెలూన్ షాపులు మూతపడటంటో ఇంట్లోనే తన తండ్రికి టిమ్మింగ్ చేశారు. ట్రిమర్ సాయంతో గడ్డం తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరాగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘లాక్డౌన్ అనేది కష్టమైనదే.. కానీ ఇందులో కూడా కొన్ని వెలుగులు ఉన్నాయి. నాలో ఈ నైపుణ్యం ఉందని నాకు తెలియదు. కరోనాపై పోరాడి.. అందమైన జ్ఞాపకాలను ఏర్పరుచుకుందాం’అని చిరాగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రికి సాయం చేసిన చిరాగ్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. -
బీజేపీకి షాక్.. ఒంటరిగానే పోటీ చేస్తాం!
న్యూఢిల్లీ : ఎన్డీయే భాగస్వామి లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) బీజేపీకి షాకిచ్చింది. జార్ఖండ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలోకి దిగుతామని స్పష్టం చేసింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు జార్ఖండ్‌లో 50 శాసన సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొంది. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమని.. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. కాగా 81 శాసన సభ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో బీజేపీ ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వెల్లడించింది. కాగా జార్ఖండ్‌లో ఎల్జేపీ ప్రభావం లేకపోయినా మిత్రపక్షానికి వ్యతిరేకంగా పోటీకి దిగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో కీలక పాత్ర పోషించిన చిరాగ్.. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం ప్రకారం 50 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడం గమనార్హం. కాగా గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానంలో పోటీ చేసిన ఎల్జేపీ అక్కడ పరాజయం పాలైంది. झारखंड में चुनाव लड़ने का आख़िरी फ़ैसला प्रदेश इकाई को लेना था।लोक जनशक्ति पार्टी झारखंड प्रदेश इकाई ने यह फ़ैसला लिया है पार्टी 50 सीटों पर अकेले चुनाव लड़ेगी।आज शाम तक पार्टी के उमीदवारों की पहली सूची का एलान हो जाएगा। — Chirag Paswan (@ichiragpaswan) November 12, 2019 -
వారసుడికి పార్టీ పగ్గాలు
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) కొత్త అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఎల్జేపీని స్థాపించిన సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్‌గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని మంగళవారం ఆయన ప్రకటించారు. రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన చిరాగ్ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌ను ఎల్జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ‘యువ నాయకత్వం కోసం కార్యకర్తలందరూ పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు. పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. సంస్థాగతంగా ఎల్జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియాకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఎల్జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది. -
అప్పుడు జల్సాలు.. ఇప్పుడు కన్నీళ్లు
న్యూఢిల్లీ: బీహార్‌లో పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆ రాష్ట్ర ఎంపీ, ఎల్పీజీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఆవేదన చెందారు. మంగళవారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మనం చేసే ప్రతీ తప్పుకు ప్రకృతి బదులిచ్చి తీరుతుందని ప్రభుత్వ వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిపట్ల తన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు చిరాగ్ పాశ్వాన్ గోవాలో తన బాలీవుడ్ స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడు విందులో మునిగితేలి, ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రస్తుత మోదీ క్యాబినెట్లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ 2011లో ఓ బాలీవుడ్ సినిమాలో నటించగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లో చేరారు. -
‘స్వీట్లు, పూలదండలు రెడీగా ఉన్నాయి’
న్యూఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడించిన వాటి ఎక్కువ సీట్లు గెలుస్తామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటమికి సాకులు వెదుక్కునే క్రమంలో విపక్షాలు ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం రాత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన విందుకు లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఓటమి ఖాయమని వారికి అర్థమైంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఈవీఎంలపై కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ఈవీఎంలను నిందించలేదు ఎందుకు. కనీసం పంజాబ్‌లో గెలిచినప్పుడైనా వారు ఈవీఎంలపై ఉన్న సందేహాలను లేవనెత్తాల్సింది. కానీ అలా చేయలేదు. వాళ్లు ఎన్ని నిందలు వేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట అనలేదు. కానీ ప్రతిపక్షాలకు నేనొక విషయం చెప్పదలచుకున్నాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు. అర్థమైందా’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ విజయం ఖాయమని, కార్యకర్తలంతా స్వీట్లు, పూలమాలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైపోయారని వ్యాఖానించారు. ఇక తన తనయుడు చిరాగ్ పాశ్వాన్ గురించి మాట్లాడుతూ.. ‘ నాయకుడిగా ఎదిగే అన్ని లక్షణాలు తనకు ఉన్నాయి. ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకత్వాన్నే కోరుకుంటారు. నేను కూడా అంతే. ముందు ఫలితాలైతే రానివ్వండి. బహుశా తను కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటాడేమో అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ప్రశంసలు కురిపించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని జమాయి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా పోటీ చేశారు. కేంద్ర మంత్రిగా రామ్ విలాస్ బిజీగా ఉండగా పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు. -
తండ్రికి వ్యతిరేకంగా కూతురు పోటీ
పాట్నా : ‘కన్న కూతురికి న్యాయం చేయలేని వాడు సమాజానికి ఏం న్యాయం చేస్తాడు. కూతుర్ని పట్టించుకోని వ్యక్తి బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినదాలు చేయడం హాస్యాస్పదంగా ఉందం’టూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌పై ఆయన అల్లుడు అనిల్ సాధు మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను, తన భార్య ఆశా దేవి, రామ్ విలాస్ పాశ్వాన్‌కు,ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా పోటి చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ సాధు మాట్లాడుతూ.. సొంత కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి సమాజంలోని ఆడవారిని ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. రామ్ విలాస్, పాశ్వన్ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. అంతేకాక కన్న కూతురికి న్యాయం చేయలేని వ్యక్తి ‘బేటీ బచావో..బేటీ పడావో’ అంటూ నినదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రామ విలాస్ తన కుమార్తె కన్నా కొడుకు పట్లనే అధిక ప్రేమ చూపేవాడని తెలిపారు. అందుకే ఆయన తన కుమారుడు చిరాగ్‌ని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాడు.. కానీ కూతుర్ని మాత్రం గ్రామంలోనే ఉంచాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినదిస్తున్నారు. కానీ జనాలు ఆయన మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరని తెలిపాడు. అంతేకాక రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య ఆశా దేవి, రామ్ విలాస్ పాశ్వన్ మీద.. తాను రామ్ విలాస్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిల్ సాధు ప్రకటించారు. రాష్ట్రీయా జనతా దళ్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక వేళ తమకు టికెట్ ఇవ్వకపోయినా రామ్ విలాస్‌కు, అతని కొడుకుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో రామ్ విలాస్‌ను ఆయన కుమారుడిని ఓడించడమే తన లక్ష్యంగా అనిల్ సాధు పేర్కొన్నారు. ఆశా దేవి రామ్ విలాస్ పాశ్వాన్ మొదటి భార్య రాజ్ కుమారి దేవి కూతురు. కానీ రామ్ విలాస్ ఆశా తల్లికి విడాకులు ఇచ్చి 1983లో రీనా అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. చిరాగ్, రామ్ విలాస్ - రీనాల కుమారుడు. -
త్వరలోనే చిరాగ్ పాశ్వాన్ పెళ్లి..!!
పాట్నా, బిహార్ : బిహార్‌లో మరో రాజకీయ నేత తనయుడి పెళ్లికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వధువును మాత్రం తల్లిదండ్రులే వెదికిపెట్టాలని చెప్పారు. జముయ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరాగ్ ప్రస్తుతం తనపై నియోజవకవర్గ ప్రజల బాధ్యత ఉందన్నారు. పెళ్లి కొంచె ఆలస్యం అయినా ఫర్వాలేదని చెప్పారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా ఆయన తమ్ముడు తేజస్వీ యాదవ్ తనకంటే వయసులో పెద్దవారైన చిరాగ్, నిశాంత్ కుమార్(నితీశ్ కుమార్ తనయుడు)ల వివాహం తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన చిరాగ్.. తేజస్వి కోరికను తప్పకుండా నేరవేర్చుతానని అన్నారు. -
పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు
పట్నా: సంపన్న దళితులు, ఇతర కులాల వారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. నిమ్నకులాలకు చెందిన సంపన్నులు తమకు తాముగా రిజర్వేషన్లు వదులుకుంటే అర్హులకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ మాను సింఘ్వి అన్నారు. ముందుగా చిరాగ్ పాశ్వాన్ తన రిజర్వేషన్ వదులుకోవాలని జేడీ(యూ) నేత పాశ్వాన్ వర్మ సూచించారు. తాను ఆచరించి ఇతరులకు చెబితే బాగుంటుందని అన్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకుంటున్నగా ఆర్థికంగా నిలదొక్కుకున్న నిమ్నవర్గాల వారు రిజర్వేషన్లు వదులుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సోమవారం వ్యాఖ్యానించారు. కులవ్యవస్థలేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. -
అస్సలు ఊహించలేదు: చిరాగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తుందని ఏమాత్రం ఊహించలేదని ఎన్డీయే కూటమిలోని జేఎల్పీ నేత చిరాగ్ పాశ్వాన్ (రావిలాస్ పాశ్వాన్ కుమారుడు) వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఓటమికి కారణాలను ఇప్పుడే ఊహించలేమని ఆయన ఆదివారమిక్కడ అన్నారు. స్పష్టమైన మెజార్టీ సాధించిన మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్‌కు ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ మహాకూటమి 35, బీజేపీ 10, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. -
'దళిత నాయకుడిగా ఉండాలని లేదు'
పాట్నా: తనకు దళిత నాయకుడిగా ఉండాలని లేదని లోక్ జన శక్తి పార్టీనేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోజులు మారాయని చెప్పారు. ఇప్పటి వరకు దళిత నాయకుడిగానే చెప్పుకుంటూ పాశ్వాన్ గొప్ప నాయకుడిగా ఎదగగా.. హీరో నుంచి నాయకుడిగా మారిన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. 'నాకు దళిత నాయకుడిగా తెలియడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటి రోజులు వేరు ప్రస్తుత రోజులు వేరు. ఇప్పుడంతా మారిపోయింది' అని చిరాగ్ అన్నాడు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. -
అలాంటి వాటితో బీజేపీకి, ఎన్డీయేకు దెబ్బే
పనాజి: దాద్రి లాంటి ఘటనలవల్ల బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో జరుగుతున్న మతపరమైన హింసలకు ఆరెస్సెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. పనాజీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదివారం రాత్రి దాటాక మీడియాతో మాట్లాడారు. 'దాద్రివంటి ఘటనలు బీజేపీ, ఎన్డీయేకు నష్టాన్ని కలిగిస్తాయని నేను భావిస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ను కూడా దీనివల్ల దెబ్బతినే అవకాశం లేకపోలేదు. అయితే, వాస్తవానికి బీజేపీకి, ఎన్డీయేకు ఇలాంటి వాటితో సంబంధం లేదు. అవి అలా జరగాలని కూడా కోరుకోవు. కొన్ని ఘటనలకు స్థానికంగానే ప్రాధాన్యం లేకపోయినప్పటికీ కావాలనే ఓ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు వాటికి దేశ వ్యాప్త ప్రచారం కల్పిస్తున్నాయని నా పరిశీలనలో కనుగొన్నాను' అని పారికర్ అన్నారు. తన ఇంట్లో గోమాంసం ఉందనే కారణంతో మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొందరు హిందువులు దాడి చేసి కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కాగా, దానిపై ప్రధాని కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా రక్షణమంత్రి పారికర్ స్పందించడం కొంత చర్చనీయాంశమైంది. -
కుప్పకూలి కిందపడ్డారు
పాట్నా: లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన కిందపడిపోయారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గయా జిల్లాలో ఆయన ప్రసంగిస్తుండగా స్టేజి కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో చిరాగ్‌కు ఎలాంటి హాని జరగలేదని జిల్లా మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. వేదిక సామర్ధ్యానికి మించిన గుంపు వేదికపైకి రావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాం కూలిపోయినప్పుడు ఆయనతోపాటు లోక్ సమతా పార్టీ రాష్ట్ర విభాగ చీఫ్ ఎంపీ అరుణ్ కుమార్ ఉన్నారు. -
కొడుకు vs అల్లుడు @ 12 జన్‌పథ్
10 జన్‌పథ్.. రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేనివారికైనా ఈ చిరునామా తెలిసే ఉంటుంది. మరి, ఆ బంగళాకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న 12 జన్‌పథ్ గురించి ఎంతమందికి తెలసులు? అనే సందేహానికి 'ఎనిమిదిన్నర కోట్ల మంది' అని బదులు చెప్పొచ్చు. సెక్యూలరిజం, సోషలిజం, పాపులిజాలే ప్రధాన ఎజెండాగా ప్రారంభమై గడిచిన 15 ఏళ్లుగా బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన విలక్షణ పాత్ర పోషిస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ప్రధాన కార్యాలయం చిరునామా.. 12 జన్‌పథ్. ప్రస్తుతం వారసత్వ కుంపటి రాజేసిన వేడి గాలులు.. 12 జన్‌పథ్ నుంచి బీహార్ మారుమూల పల్లెల వరకు వీస్తున్నాయి. పార్టీపై ఆధిపత్యం విషయంలో రాంవిలాస్ తనయుడు చిరాగ్ పాశ్వాన్, అల్లుడు అనిల్ కుమార్ సాధూల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. చిరకాలంగా పార్టీలో దళిత విభాగానికి నేతృత్వం వహిస్తున్న అనిల్ సాధూకు ఈసారి ఎన్నికల్లో కనీసం టికెట్ కూడా దక్కకపోవడం 'కొడుకు- అల్లుళ్ల' విభేదాలకు పరాకాష్ట. చదువు పూర్తయిందనిపించిన వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరాగ్ పాశ్వాన్ ఒకటీ అరా సినిమాల్లో నటించాడు. కనీసం బీహార్‌లో కూడా తన సినిమాలు ఆడకపోవడంతో రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఇటు ఢిల్లీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాలు రెండింటితో టచ్‌లో ఉంటూ రాంవిలాస్ బిజీ కాగా, అటు సొంత రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యతను తలకెత్తుకున్నాడు చిరాగ్. ఆఫీస్ బేరర్ల నియామకం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపుల వరకు అన్ని నిర్ణయాలూ ఆయనవే. ఈ క్రమంలోనే ఏళ్లుగా పాశ్వాన్నే నమ్ముకుని, పార్టీనే శ్వాసించిన కొందరు సీనియర్లు కూడా పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే చిరాగ్ చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా చిన్నచూపునకు గురైనవారికి పెద్ద దిక్కుగా ఉంటూ 'మావయ్యతో అన్ని విషయాలు మాట్లాడతా' అంటూ సర్దిచెప్పుకొచ్చే రాంవిలాస్ అల్లుడు అనిల్ కుమార్ సాధూ కూడా ఇటీవల ఘోర అవమానాల పాలయ్యాడు. అసమ్మతి నేతలకు నాయకుడిగా ఉంటున్నాడనో మరే కారణమో తెలియదు గానీ అనిల్ సాధూకు టికెట్ నిరాకరించాడు చిరాగ్. అంతే.. సాధూ భగ్గున మండిపోయాడు. 'అసలా యువనేత నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకున్న ప్రజాదరణ మర్చిపోయాడా? 2010 ఎన్నికల్లో మసౌరీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచానన్న విషయం గుర్తులేదా? 15 ఏళ్లుగా పార్టీ బాగు కోసం అహోరాత్రాలు కష్టపడటం చూడలేదా?' అంటూ చిరాగ్ పాశ్వాన్‌పై నిప్పులు కురిపించాడు. పార్టీ నుంచి బయటకు వచ్చేసి..ఈ ఎన్నికల్లో ఎల్జేపీ- బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు మామ పార్టీని దెబ్బకొట్టేలా సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీలు కొత్తగా ఏర్పాటుచేసిన కూటమిలోకి చేరే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్‌లో ఎల్జేపీకి ఆరు స్థానాలు దక్కాయి. రాంవిలాస్ హజీపూర్ నుంచి, ఆయన తనయుడు చిరాగ్ జముయి నియోజకవర్గాల నుంచి గెలిచారు. కొడుకుకు ఉత్తమ రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకున్న రాంవిలాస్.. చిరాగ్‌ను ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ని చేశారు. అది పార్టీలో చిరాగ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఎంపీలందరిపై చిరాగ్ చిందులేసేవారని విమర్శలు వచ్చాయి. ముంగర్ స్థానం నుంచి గెలిచిన మహిళా ఎంపీ వీణాదేవీ మీడియా ముందే చిరాగ్ పై విమర్శలు చేసి, ఆయన ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఇక వైశాలీ ఎంపీ రామ్ సింగ్ మరో అడుగు ముందుకేసి పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపుల్లో తాను సూచించిన పేర్లను చిరాగ్ పాశ్వాన్ కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదన్నది సింగ్ ఆరోపణ. ఎంపీ, ఎమ్మెల్యే లేకాదు.. మండల, గ్రామ స్థాయి కార్యకర్తల్లోనూ చినబాబు చిరాగ్ పాశ్వాన్ తీరుపై అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ నేతనే చెబుతున్నారు. వారసులను నిలబెట్టుకోవడం కోసం అప్పటికే పేరుపొందిన నేతలు పొరపాట్లు చేస్తుండటం (ఆ పార్టీ కార్యకర్తల దృష్టిలో) సహజమే అయినప్పటికీ అవి మొత్తం పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేవిగా మారితే అంతకన్నా విషాదం ఉండదు. వర్తమాన రాజకీయాల్లో పెళ్లికాని వారికి.. ఎట్ లీస్ట్.. వారసులను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకునే వారికే ప్రజాదరణ మెండుగా ఉందన్న సంగతి మోదీ, మాయ, మమత, నవీన్, రాహుల్ లాంటి వాళ్లను చూశాకైనా రాంవిలాస్ లాంటి 'పుత్రప్రేమికులకు' అర్థమవుతుందా?.. కనీసం ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా! -
'మాకు షాక్ ఇచ్చారు... అయినా వారి వెంటే'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కేటాయించిన స్థానాల పట్ల లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ మొదట తమకు చెప్పింది ఒకటి, తీరా కేటాయింపులో చేసింది మరొకటని ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్, రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నిప్పు లేకుండా పొగ రాదని వ్యాఖ్యానించారు. బీజేపీతో మరోసారి చర్చలు జరిపి చూస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశారు. గత అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీట్ల పంపకంపై ఆగ్రహం లేదని అసంతృప్తి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తమకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు. సీట్ల కేటాయింపుతో తమకు షాక్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీకి 40, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)కు 23, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎమ్-ఎస్)కు 20 స్థానాలు కేటయించారు. బీజేపీ 160 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. -
అనంతరం: తండ్రి బాటలోకే తిరిగొచ్చాడు...
నది... పుట్టినచోటే ఉండదు. ముందుకు సాగేకొద్దీ తన నడక మార్చుకుంటుంది. ఎక్కడో మొదలై ఎక్కడికో చేరుతుంది. చిరాగ్‌ని చూస్తే నదిని చూసినట్టే ఉంటుంది. రాజకీయ కుటుంబంలో పుట్టాడు. సినిమా మీద ఆసక్తితో అటువైపు మళ్లాడు. అక్కడ కలసి రాకపోవడంతో మళ్లీ రాజకీయాలవైపు చూస్తున్నాడు. తన నడకను మార్చుకుంటూ పోతున్నాడు. అసలు అతడి గమ్యం ఏదో? అతడి పయనం ఎందాకో? 2011... నవంబర్ 4. ‘మిలే న మిలే హమ్’ సినిమా రిలీజయ్యింది. హీరోయిన్ అందరికీ తెలిసిందే... కంగనా రనౌత్. అయితే ఆమె పక్కన నటించిన పిల్లికళ్ల పిల్లాడెవరో చాలామందికి తెలియదు. ‘కొత్త పిల్లాడు, బానే ఉన్నాడే’ అనుకున్నారంతా. అలా అంటారని తెలిసే ఆ అబ్బాయి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఫలితం మాత్రం అనుకున్నట్టుగా రాలేదు. అందుకే అతడు మళ్లీ తెరమీద కనిపించలేదు. 2013... జూన్. హాజీపూర్‌లో ఒక సభ జరుగుతోంది. ఎంతోమంది వచ్చారు. వేదిక మీద ఓ యువకుడు ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. తన తండ్రిలో ఎంత మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడో వివరంగా చెబుతున్నారు. తండ్రి తరఫున తనే హామీలు ఇస్తున్నాడు. అనుభవం ఉన్న రాజకీయవేత్తలా మాటలు వెదజల్లుతున్నాడు. నాటి నటుడు, నేటి ఈ యువకుడు ఒక్కరే... చిరాగ్. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు. ముగ్గురు ఆడపిల్లల మధ్య రాకుమారుడిలా పెరిగాడు. ఇంటి నిండా రాజకీయ వాతావరణం, అయినా ఆ వాసన అతడికి ఒంటబట్టలేదు. ఊహ తెలిసిన నాటి నుండీ అతడి కళ్లల్లో రంగుల కలలు మెరిసేవి. మనసు సినీ వినీలాకాశం వైపు రెక్కలు కట్టుకుని ఎగరాలని ఉవ్విళ్లూరేది. అందుకే బడిలో పాఠాలతో పాటు నటనలో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. డ్రామా అంటే మనోడు ఉండాల్సిందే. ఏదో ఒక పాత్రను తన తరహాలో పండించాల్సిందే. అద్భుతంగా చేశావు అంటే అమితాబ్‌తో పోల్చినంత ఆనందం. నటుడవ్వాలన్న కోరిక ఎప్పుడు కంచెలు తెంచుకుందామా అని చూసేది. పెరిగి పెద్దయ్యేకొద్దీ ఆ ఆశ అతడి అణువణువునూ ఆక్రమించేసింది. ‘నేను హీరోనవుతాను అంటే మా వాళ్లు అంతగా షాకవలేదు’ అంటాడు చిరాగ్. ఎందుకవుతారు? మాటలు వచ్చినప్పట్నుంచీ సినిమా అన్న పేరు అతడి నోటి నుంచి ఎన్ని లక్షల సార్లు వచ్చి ఉంటుందో. అందుకే వాళ్లు షాక్ తినలేదు. కానీ కాస్త డిజప్పాయింట్ అయితే అయ్యారు. చిరాగ్‌ని పాలిటిక్స్‌లోకి రమ్మని పాశ్వాన్ ఎప్పుడూ బలవంతపెట్టలేదు. నా మార్గంలో నడవడం ఇష్టం లేకపోతే... కనీసం డాక్టరో, ఇంజినీరో అవ్వమన్నారు. కానీ చిరాగ్ ఆలోచనల్లో ఆ రెండు ప్రొఫెషన్లూ లేవు. ఉన్నదల్లా ఒక్కటే... సినిమా. తన ఆసక్తికి తండ్రి పొలిటికల్ బ్యాక్గ్రౌండుని జోడించి ఎలాగయితేనేం... బాలీవుడ్లో అడుగుపెట్టాడు విలాస్ వారసుడు. కానీ అవకాశం వచ్చినంత వేగంగా అదృష్టమైతే వరించలేదు. ఒక్క సినిమాతోనే చిరాగ్ కలలకు తెర పడింది. ఆ సినిమా వైఫల్యం అతడిని నిరాశలో ముంచేసింది. ఇంత వరకూ తేరుకోకుండా చేసింది. రెండేళ్లుగా తన కలలను పునర్మించుకునేందుకు శ్రమపడుతున్నా... ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో విసుగే చెందాడో... లేక తండ్రికి తన తోడే అవసరమనుకున్నాడో తెలియదు కానీ, నాన్న అడుగుల్లో అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బీహార్‌లో తన తండ్రిని, ఆయన పార్టీని ప్రమోట్ చేసేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాడు చిరాగ్. అందమైన రూపం, సినిమాలో నటించాడన్న చిన్నపాటి క్రేజ్, మాటల్లో ఉట్టిపడే ఆవేశం అతణ్ని అందరికీ దగ్గర చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి గెలుపునే తన లక్ష్యంగా చేసుకున్న చిరాగ్, తన అసలైన లక్ష్యాన్ని పక్కన పెట్టేశాడా? లేక కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చాక మళ్లీ వెళ్దామని బ్రేక్ తీసుకున్నాడా? లేదంటే... ఇక కలసిరాని కలలను ఏరుకోవడం మానేసి, కనిపించే మార్గంలో సాగిపోవాలని నిర్ణయించుకున్నాడా? అసలు చిరాగ్ ఎటు పయనిస్తున్నాడు! - సమీర నేలపూడి