పట్నా: లోక్ జనశక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ గుర్తు ‘బంగ్లా’ను చిరాగ్ పాశ్వాన్ వర్గం, కేంద్ర మంత్రి పశుపతి పారస్ వర్గాలు ఎవరూ ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌జేపీ గుర్తు కోసం చిరాగ్ పాశ్వాన్, పశుపతి పారస్ వర్గాల మధ్య వివాదం చేలరేగిన విషయం తెలిసిందే.
బీహార్‌లోని కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ‘బంగ్లా’ గుర్తును ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. జరగబోయే ఉప ఎన్నికల్లో ఉపయోగించే గుర్తు విషయంలో ఈసీ మూడు ఆప్షన్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మూడు ఆప్షన్లను సోమవారం మధ్యాహ్నం ఈసీ ప్రకటించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment