ఇది సోషల్ మీడియా యగం. దీనిలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు చాలామంది తాపత్రయ పడుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిభను చాటుతున్న పలువురు ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్నికల నేపధ్యంలో బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ కుమార్ పాశ్వాన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది.
చిరాగ్ కుమార్ పాశ్వాన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్‌లోని జముయి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చినది మొదలు చిరాగ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ నిరంతరం పెరుగుతూ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్) తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చిరాగ్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది.
చిరాగ్ పాశ్వాన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం ఆయన ఈ ఏడాది మే 26 నాటికి ఒక మిలియన్ (10 లక్షలు) ఫాలోవర్లను సంపాదించుకున్నారు. తాజాగా చిరాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు పెరుగుతున్న ఫాలోవర్ల గురించి చిరాగ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో సమాచారం ఇచ్చారు.
చిరాగ్ పాశ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం నలుగురిని మాత్రమే అనుసరిస్తున్నారు. అర్జున్ భారతి, నరేంద్ర మోదీ, రామ్ విలాస్ పాశ్వాన్, అమిత్ షాలను చిరాగ్ అనుసరిస్తున్నారు. తన ఇన్‌స్టాలో చిరాగ్ మొత్తం 2,076 పోస్ట్‌లను షేర్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్)లో 93 లక్షల 27 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్స్‌లో పాశ్వాన్ 112 మందిని అనుసరిస్తున్నారు. చిరాగ్‌కు ఫేస్‌బుక్‌లో ఏడు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment