విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ బీజేపీలో చేరుతున్నారా? | Is Prakash Raj Joining In BJP, His Reaction To Viral Post In Twitter Trending - Sakshi
Sakshi News home page

Prakash Raj Party Change Rumours: విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ బీజేపీలో చేరుతున్నారా?

Published Fri, Apr 5 2024 5:24 PM | Last Updated on Fri, Apr 5 2024 5:41 PM

Is Prakash Raj Joining BJP - Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తరుణంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రకాష్‌ రాజ్‌ బీజేపీలో చేరుతున్నారని సోషల్‌ ప్రచారం జోరందుకుంది. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలక్షణ నటుడు కొట్టిపారేశారు. 

దిస్కిన్‌ డాక్టర్‌ అనే  ఎక్స్‌ అకౌంట్‌ యూజర్‌.. ప్రకాష్‌ రాజ్‌ బీజేపీలోకి చేరుతున్నారంటూ ట్వీట్‌ చేశారు.  నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ప్రకాష్‌ రాజ్‌ స్పందన కంటే ముందే దాదాపు మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. ఇక ఆ ట్వీట్‌కు విలక్షణ నటుడు స్పందించారు. ‘నన్ను కొనేంత సైద్ధాంతిక బలం బీజేపీకి లేదని’ వ్యంగ్యంగా స్పందించాడు ప్రకాష్ రాజ్. 

ఈ ఏడాది జనవరిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రాజకీయ పార్టీలు టికెట్‌ ఆఫర్‌ చేస్తున్నాయని అన్నారు. తాను మోదీని విమర్శిస్తున్నాను కాబట్టే టికెట్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని, తన సిద్ధాంతాలు నచ్చి కాదని పేర్కొన్నారు.అలాంటి ట్రాప్‌లో తాను పడబోనన్న ప్రకాశ్‌ రాజ్‌.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. 

కాగా,  2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement