
ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె
గర్భంతో ఉన్న భార్యను అపురూపంగా చూసుకున్న స్టార్‌హీరో రణ్‌వీర్ సింగ్
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు.
తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.
దీపికా-రణవీర్‌జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment