dipika padukone
-
బేబీ బంప్‌తో దీపిక క్యూట్‌గా, అపురూపంగా చూసుకున్న రణవీర్
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు. తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.దీపికా-రణవీర్జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
రహస్యంగా 'దీప్‌వీర్' మూడో వివాహ వార్షికోత్సవం.. వీడియో వైరల్
Ranveer And Deepika Secret 3rd Wedding Anniversary: బాలీవుడ్ పాపులర్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇటీవల ఉత్తరాఖండ్‌లో తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి వీరిద్దరూ వార్షికోత్సవ వేడుకలను రహస్యంగా ఉంచారు. కానీ వారు డెహ్రాడూన్ విమానాశ్రయం నుంచి అభిమానులతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ కంఫర్ట్ వేర్ ధరించిన 'దీప్‌వీర్' అల్మోరాలో అభిమానులతో ఆనందంగా ఫోజులిచ్చారు. View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) ఇటలీలోని సుందరమైన లేక్ కోమోలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వరుసగా 2018 నవంబర్ 14, 15న కొంకణి, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. తర్వాత కుటంబం, స్నేహితుల కోసం బెంగళూరు, ముంబైలో రెండు గ్రాండ్ రిసెప్షన్లను నిర్వహించిందీ దీప్‌వీర్ జంట. ఇదిలా ఉంటే కబీర్ ఖాన్ చిత్రం 83లో రణ్వీర్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో లెజెండరీ క్రికెటర్ కపీల్ దేవ్‌గా నటించగా, దీపికా పదుకొణె రోమీదేవిగా కనిపించనున్నారు. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ది ఇంటర్న్' హిందీ రీమేక్ 'పఠాన్ అండ్ ఫైటర్'లో దీపికా నటించనున్నారు. View this post on Instagram A post shared by Deepika padukone⚡ (@deepikanpadukonefp) -
భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై
-
చప్పక్ మొదలు
దీపికా పదుకోన్‌ను స్క్రీన్ మీద చూసి ఏడాది పైనే కావస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదామె. కొత్త సినిమా ఏం చేయాలో అని ఫిక్స్ అవ్వడానికి ఆర్నెల్లు, కొత్త సినిమా ఒప్పుకొని దాని పనులు మొదలుపెట్టేసరికి మరో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఫైనల్‌గా దీపిక కెమెరా ముందుకొచ్చే టైమ్ సెట్ అయింది. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఆమె ‘చప్పక్’ చిత్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేఘన్ గుల్జర్ దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ నడుస్తున్నాయి. ‘‘చప్పక్’ చిత్రానికి మొత్తం సిద్ధం’ అని దీపికా పేర్కొన్నారు. -
‘పద్మావత్’ రివ్యూ
పద్మావత్ సినిమా ఒక మహిళ వీరత్వానికి, చతురత్వానికి, ఔన్నత్యానికి దివిటీ అవుతుందనుకుంటే... ‘ఇది చరిత్ర కాదు. కల్పనే’ అని నొక్కి వక్కాణించిన భన్సాలీ... చివరికి పోరాడలేక నిస్సహాయురాలై నిశ్చేష్టురాలై సంక్షోభాన్ని గట్టెక్కలేక తనతో పాటు వందల మంది మహిళల్ని (గర్భిణులు, పిల్లలకు కూడా ఉన్నారు) పద్మావతి బూడిద చేస్తుందని చూపించాడు! సినిమా చూడ్డానికి బాగుంది. నిమగ్నం అవడానికి స్ఫూర్తి పొందడానికి కీర్తించుకోడానికి కూడా బాగుండాల్సింది. రూపమా? గుణమా? ఏది ముఖ్యమన్న ప్రశ్న ఎదురైనప్పుడు, గుణం అంటుంది రాణి పద్మావతి. ఆ గుణాన్ని నిరూపించుకోవడం కోసం తన రూపాన్ని కూడా ఆహుతి చేస్తుంది. ఇదీ ఒక్క మాటలో సంజయ్ లీలా భన్సాలీ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమా. అది ఎలాంటి గుణం? శత్రువు దగ్గర తలవంచని గుణం. శత్రువు తన గౌరవాన్ని మట్టుబెట్టడానికి వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడే గుణం. రాజపుత్రిక ఖడ్గంలో ఎంత శక్తివుందో రాజపుత్రిక గాజుల్లో కూడా అంతే శక్తి వుందని నమ్మే గుణం. ఒక స్త్రీ గౌరవం స్త్రీ శీలంతో బలంగా ముడిపడిన 13వ శతాబ్దపు నాటి కథ ఇది. చారిత్రక కల్పన. భార్య కోసం ముత్యాలు కొనడానికి సింహాళ్ వెళ్లిన మహారావల్ రతన్ సింగ్ ‘ప్రమోదవశాత్తూ’ పద్మావతి వేటాడుతుండగా ఆమె బాణపు వేటుకు గాయపడుతాడు. పద్మావతి! ఎలాంటి అపురూప సౌందర్యవతి? ‘ఆమె నీడ కూడా మోహం కలిగించేంత అందం’! అంతటి దివ్యవిగ్రహం కాబట్టే, ఆమెను వివాహం చేసుకుని చిత్తోఢ్కు తెచ్చిన తర్వాత, రతన్‌సింగ్ రాజగురువు కూడా తన వ్యక్తిత్వాన్నీ, తనకు రాజ్యం తరఫున అందుతున్న గౌరవాన్ని కూడా పక్కనపెట్టి పద్మావతిని దొంగచాటుగా చూడటానికి ప్రయత్నిస్తాడు. దాంతో రతన్‌సింగ్ ఆయనకు దేశబహిష్కార శిక్ష విధిస్తాడు. అల్లాహ్ సృష్టించిన ప్రతి అందమైన దానిమీదా అల్లావుద్దీన్ ఖిల్జీకి హక్కు ఉంటుంది అనుకునేంత వాంఛాపరుడు ఖిల్జీ. పెళ్లి రోజుకూడా పరస్త్రీని కోరుకునేంత విచ్చలవిడితనం ఉన్నవాడు. పిల్లనిచ్చిన మామను సింహాసనం కోసం చంపేసినవాడు. కిరీటం ఎంత చెడ్డది, అది తలల్నే మార్చేస్తుంది అని చమత్కరిస్తాడు కూడా. ఇంకా బైసెక్సువల్ కూడా. మాలిక్ కాఫుర్ ‘ఆయనకు పెళ్లాంలాంటివాడు’ అనిపిస్తాడు దర్శకుడు ఒక పాత్రతో. అలాంటి ఖిల్జీకి తన పన్నాగంతో పద్మావతిని పొందని జన్మ జన్మే కాదనీ, ఆమె వుంటే స్వర్గం నేలమీదే వున్నట్టనీ ఊరిస్తాడు రాజగురువు. అలా విపరీతమైన లాలసను పెంచుకున్న ఖిల్జీ చిత్తోఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. రతన్‌సింగ్‌ను సంధి పేరుతో కుయుక్తిగా బంధించి ఢిల్లీకి పట్టుకెళ్లడమూ, అంతే యుక్తిగా పద్మావతి మళ్లీ రతన్‌సింగ్‌ను విడిపించుకు రావడమూ, దీనికి ఖిల్జీ భార్య మల్లికయే సాయం చేయడమూ, దాన్ని అవమానంగా భావించిన ఖిల్జీ భార్యను బంధించి తిరిగి చిత్తోఢ్కు భారీ ఫిరంగులతో వెళ్లడమూ (ఆ ఫిరంగి సామర్థ్యం చిత్తోఢ్కు లేదు), రతన్‌సింగ్ యుద్ధంలో మరణించడమూ(ఇక్కడా కుయుక్తిగానే), భర్త మరణించాడని తెలిసిన పద్మావతి సహా ఏడువందలమంది రాజపుత్రికలు సతీసహగమానానికి పాల్పడటమూ గగుర్పొడిచే ఘట్టం! ఖిల్జీ కనీసం పద్మావతి కొనగోటిని కాదుగదా, కనీసం కొనచూపుతో కూడా చూడకుండానే ఆమె బూడిదైపోతుంది. రాజపుత్ర ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి పూర్తి కంకణం కట్టుకుని తీసిన సినిమాలా అనిపిస్తుంది. దీన్ని బట్టి రాజపుత్ర కర్ణిసేన చేసిన నిరసన ప్రదర్శనలు ఎంత అర్థరహితమో అనిపిస్తుంది. ఏ వ్యక్తుల, కులాల, మతాల, జాతుల విశ్వాసాలను కించపరచడానికి ఈ సినిమా తీయలేదు అని ముందుగానే జాగ్రత్తగా ప్రకటించిన ఈ సినిమాలో నిజానికి గాయపడటానికి అవకాశం ఉన్న పాత్ర ఖిల్జీది మాత్రమే. ఒక దృశ్యంలో తన పేరులేని చరిత్ర పుటల్ని ఖిల్జీ చించేస్తాడు. ఖిల్జీ కోణంలోంచి చూస్తే గనుక ఈ సినిమా కూడా చిరిగిన పుటే. ఖిల్జీ పాత్రకు ఎక్కడా కూడా ఒక సానుకూల కోణాన్ని ఇవ్వలేదు. కొన్నిసార్లు కవిత్వాన్ని ఆస్వాదించినట్టూ, తానే స్వయంగా కవితలు అల్లినట్టూ చూపినప్పటికీ ఆ కవిత చెప్పగలగడానికి కారణమైన సున్నితత్వాన్ని ఏ దృశ్యంలోనూ చూపలేదు. అతడు మొదటినుంచీ లాలసుడే. రతన్‌సింగ్ మొదటి భార్య వ్యక్తిత్వంగానీ, రతన్‌సింగ్– పద్మావతి మధ్య అద్భుతమైన ప్రేమ పండినట్టుగానీ ఆవిష్కరణ జరగదు. దాంతో ఏ పాత్ర ఉద్వేగంతోనూ నడవడానికి ఆధారం దొరకదు. కానీ భన్సాలీ అన్ని సినిమాల్లాగే సాంకేతికంగా గ్రాండ్‌గా ఉంది. విజువల్లీ రిచ్. ఇది బాగా తీయబడిన సినిమాయేకానీ బాగా రాయబడిన సినిమా కాదు అనిపిస్తుంది. చివరి అరగంట సతీసహగమన ఘట్టంలో మాత్రం రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ భారంతోనే సినిమాకు తెర పడుతుంది కాబట్టి సినిమా బాగుంది అనేలా చేస్తుంది. టాప్‌క్లాస్ విజువల్స్ రాజ్‌పుత్ రతన్‌సింగ్‌కు తాను పంపిన వర్తమానానికి సమాధానం కోసం ఎదురుచూస్తుంటాడు అల్లావుద్దిన్ ఖిల్జీ. ఆ వర్తమానంలో ఏం పంపాడో చూసిన పద్మావతి దాన్ని కాల్చేస్తుంది. అల్లావుద్దీన్ ఎదురుచూస్తూనే ఉంటాడు. ఈ సన్నివేశాల్లో షాట్ కంపోజిషన్స్ ఒక చిన్న ఉదాహరణ మేకింగ్ పరంగా ‘పద్మావత్’ టాప్‌క్లాస్ అని చెప్పడానికి. యుద్ధం మొదలైందని తెలిశాక, పద్మావతి పరిగెత్తుకుంటూ కోట గుమ్మం వరకూ వెళ్లే సన్నివేశంతో పాటు చాలా చోట్ల కొన్ని అన్‌కట్ లాంగ్ టేక్స్ చూడొచ్చు. ఇలాంటివి సంజయ్ లీలా భన్సాలీ లాంటి మాస్టర్స్‌కే సాధ్యమనిపించే షాట్స్. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీలో అన్నీ మెరుపులే! కాస్ట్యూమ్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటి. భన్సాలీ సినిమాల్లో కాస్ట్యూమ్స్ వేరే లెవెల్ అనేలా ఉంటాయి. ఇందులోనూ అది కనిపిస్తుంది. అదేదో మెయిన్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాకుండా ప్రతీ క్యారెక్టర్‌కూ కాస్ట్యూమ్స్ టాప్‌క్లాస్ ఉండేలా చూసుకున్నారు. కాస్ట్యూమ్ కలర్స్ కూడా కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. టెక్నికల్ అంశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. క్లైమాక్స్ ఎలివేట్ అయ్యేదంతా స్కోర్‌తోనే! పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, అదితిరావు హైదరి లాంటి స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో. వాళ్లను చూస్తేనే ఏదో మ్యాజిక్ చెయ్యగలరన్న నమ్మకం కలిగించే స్టార్స్ అంతా. ఆ నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చెయ్యలేదు. ప్రతీ ఒక్కరిదీ టాప్‌క్లాస్ పర్ఫార్మెన్స్. రణ్వీర్ సింగ్ వరుసగా తాను నెక్స్›్ట జనరేషన్ సూపర్‌స్టార్ అనిపించుకునేలానే నటించేశాడు. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి ‘‘ఈ చిత్రం సతీసహగమనాన్ని ఏవిధంగానూ సమర్థించడం లేదు.’’ అనే కార్డ్‌తో మొదలవుతుందీ సినిమా. అది సమర్థించాల్సిన విషయం కాదన్నది అందరూ ఒప్పుకోవాల్సిందే! మరి సినిమా ఏం చెప్తోంది? సమర్థ్ధించాల్సిన విషయం కాదన్న రోజు ఈకథ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా? ఈ ప్రశ్నలు రాకుంటే సినిమా ఎలాగూ మెప్పించడానికి చాలా సెల్లింగ్ పాయింట్స్‌నే పెట్టుకుంది. వస్తేనే.. ఎన్నో జీవిత కాలాలు వెనక్కి వెళ్లిన, ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదన్న సినిమాగా కనిపిస్తుంది. మరోరకంగా ఆలోచిస్తే హిస్టారికల్ ఫిక్షన్లో ఇదిలా ఉండాలని కోరలేని అవసరంగా కూడా కనిపించొచ్చు! -
ఒక్కపైసా తీసుకోకుండా ఆ సినిమా చేశాడా!
'బాజీరావు మస్తానీ'.. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత భారీ సినిమా. ఆయన ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత కఠినమైన పాత్ర ఇదే అవుతుందని భావిస్తున్నారు. దర్శకుడు సంజయ్‌లీలా భన్సలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో టైటిల్ రోల్ బాజీరావు పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్నది. మరాఠా సామ్రాజ్య వైభవానికి వెండితెర దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మరో వార్త తాజాగా హల్చల్ చేస్తున్నది. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా రణ్వీర్ సింగ్ తీసుకోలేదట. నిర్మాతల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రణ్వీర్ ఈ పాత్ర పోషించారని, పారితోషికానికి బదులు ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి మొగ్గు చూపారని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యంత భారీతనంతో, చారిత్రక ప్రేమకథగా రూపొందిన 'బాజీరావు మస్తానీ' బడ్జెట్ రూ. 130 కోట్లకుపైనని తెలుస్తున్నది. నిజానికి ఇటీవల చాలామంది బాలీవుడ్ నటులు పారితోషికానికి బదులు సినిమా లాభాల్లో వాటాలకే ప్రాధాన్యమిస్తున్నారు. హీరోలు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్దేవగణ్తోపాటు హీరోయిన్లు దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్ సైతం ఇదే పంథాను అనుసరించారు. -
భన్సాలీ మ్యాజిక్ ఆఫ్ 'మస్తానీ'!
చారిత్రాత్మక ప్రణయగాథ 'బాజీరావు మస్తానీ'. మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను అత్యంత భారీస్థాయిలో బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా 'ట్రైలర్' అద్భుతంగా ఉండి.. చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరాఠా సామ్రాజ్య వైభవం వెండితెర దృశ్యరూపంగా భన్సాలీ ఈ సినిమాను మలిచారు. ఇందులో రణ్వీర్ సింగ్ బాజీరావు రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా నటించారు. బాజీరావు ప్రియారాలి మస్తానీగా దీపికా పదుకొణె అడుగడుగునా తన అందంతో మెరిసిపోయింది. మూడు నిమిషాల నిడివిగల ఈ సినిమా ట్రైలర్లో అడుగడుగునా భన్సాలీ భారీతనాన్ని చూడవచ్చు. వచ్చే ఈ నెల 18న సినిమా ప్రేక్షకులను పలుకరించనుంది. -
కరెక్టేనంటారా?
గాసిప్ మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తాను తీసిన మూడు సినిమాల్లో రెండిట్లో కంగనా రనౌతే హీరోయిన్. మరోసారి ఆమె ప్రధాన పాత్రలో ఆనంద్ కొత్త సినిమా తీయనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అదంతా ఉత్తదేనని తేలింది.ఆనంద్ ఈసారి రూట్ మార్చి తన తదుపరి చిత్రంలో కంగనాకు బదులుగా దీపికా పదుకునేను నటింపజేయనున్నాడట. విశ్వసనీయ వర్గాలు ఈ వార్తను ధృవీకరిస్తున్నాయి. ‘తనూ వెడ్స్ మనూ-1,2 సినిమాలు కంగనాకు తెచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆ తరహా సినిమా ఒకటి చేయాలని ఉందని అప్పుడెప్పుడో ఆనంద్‌కు చెప్పిందట దీపిక. ‘తప్పకుండా’ అని హామీ ఇచ్చాడట ఆనంద్.ఇచ్చిన మాట కోసం తన తర్వాతి చిత్రంలో దీపికకు అవకాశం ఇస్తున్నాడనేది ఒక కథనం. అయితే ఇదేమీ కాదని...‘తనూ వెడ్స్ మనూ-2’ సక్సెస్ క్రెడిట్‌ను కంగానా మొత్తం తన ఖాతాలో వేసుకోవడం వల్ల, తన పేరు పెద్దగా వినిపించలేదనే బాధతో... ఈసారి దీపికాను ఎంచుకుంటున్నాడనేది ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట. ఇది సరే, దీపికా మాత్రం తక్కువ తిందా? ‘పీకు’ సక్సెస్‌ను తన క్రెడిట్లో వేసుకోలేదా ఏమిటి? -
ఏ సినిమా ఎందుకు ఆడుతుందంటే...
ప్రతి శుక్రవారం ఏవో కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని విజయాలు, చాలా భాగం పరాజయాలు. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపవడం, అతి తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ కొన్ని హిట్టవడం సినీసీమలో సర్వసాధారణం. దాంతో, వారం వారం సినీ దర్శక, నిర్మాతలు, తారల జాతకాలు మారిపోతుంటాయి. నిజానికి, ఎవరూ ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు. అందరి లక్ష్యం - ప్రేక్షక జనాన్ని ఆకర్షించాలనే! బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించాలనే! కానీ, కొన్ని సినిమాలకే అది సాధ్యమవుతుంటుంది. అసలు ఈ సినీ విజయాలకు తోడ్పడిన అంశాలేమిటో, అపజయాలకు కారణాలేమిటో తెలిస్తే? అవన్నీ శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే? సినిమా జయాపజయాలు అదృష్టాన్ని బట్టి ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ, శాస్త్రీయ ఆధారాలు, విశ్లేషణ ఆధారంగా సక్సెస్ రేటును ముందే పసిగట్టవచ్చన్నది నిపుణుల వాదన. బాక్సాఫీస్ విజయ సూత్రం ఏమిటన్నది సశాస్త్రీయంగా కనిపెట్టాలనీ, ఆ ఫార్ములా ఆధారంగా వరుస విజయాలను సాధ్యం చేయాలనీ చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ మేనేజ్మెంట్ నిపుణుడు అరిందమ్ చౌధురి పదేళ్ళ క్రితం తన మేనేజ్మెంట్ సూత్రాలను బాలీవుడ్ చిత్ర నిర్మాణానికి తెచ్చారు. చిత్ర నిర్మాణానికి ముందే ప్రేక్షకుల సర్వేలు చేయడం లాంటి ప్రయత్నాలు చేశారు. వాటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఆయన తీసిన తొలి చిత్రం ‘రోక్ సకో తో రోక్ లో’ (2004) తీశారు. తీరా, ఆ చిత్రం ఫ్లాపైంది. అయితే, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు విశ్లేషణ పరికరాలు, పద్ధతులు చాలా మారాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ఐ.బి.ఎం. సంస్థ ఆ టెక్నాలజీలను హిందీ చిత్ర పరిశ్రమకు తెచ్చింది. దర్శక, రచయితలు అప్పటికప్పుడు తమ మనసులో మెదిలిన ఆలోచనలను బట్టి సినిమాలకు విజయం సొంతమవుతుందని అనుకోవాల్సిన పని లేదంటోంది. అధ్యయనం ద్వారా సేకరించిన సమాచారాన్ని సృజనాత్మక ఆలోచనకు జతచేస్తే అప్పుడిక బాక్సాఫీస్ వద్ద విజయం సాధ్యమేనని ఐ.బి.ఎం. చెబుతోంది. ఎలా చేశారీ విశ్లేషణ? ఫలానా స్క్రిప్టుతో తీస్తున్న సినిమా ఆడుతుందా, ఆడదా అన్నది తెలుసుకోవడానికి ఐ.బి.ఎం. చిత్రమైన పద్ధతులను అనుసరించింది. సామాజిక సంబంధాల సైట్లలో అమితమైన ఆసక్తి రేపుతున్న ఓ పాతిక దాకా హిందీ చిత్రాలను విశ్లేషణకు స్వీకరించింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, రకరకాల బ్లాగులతో సహా పలు రకాల వేదికల ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలను సమీకరించింది. వాటి ద్వారా వచ్చిన దాదాపు 7 లక్షలకు పైగా పోస్ట్‌లను విశ్లేషించింది. అలా పరిశీలనకు ఎంచుకున్న చిత్రాల్లో ‘బర్ఫీ’, ‘ఏక్ థా టైగర్’, ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘కై పోచే’, ‘కహానీ’, ‘అగ్నిపథ్’ లాంటి పేరున్న చిత్రాలున్నాయి. ఎంచుకున్న సినిమా ఏ కోవకు చెందినది, దాని కథాంశమేమిటి, నటీనటులు ఎవరు లాంటి రకరకాల అంశాల ఆధారంగా వాటి విజయాన్ని అంచనా వేయవచ్చని ఐ.బి.ఎం. విశ్లేషకులు చెప్పారు. ఈ అంచనా పద్ధతికి వారు పెట్టిన పేరు - ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ). ఫలించిన తొలి ప్రయత్నం? దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్‌లు నటించిన ‘(గోలియోం కీ రాస్లీలా...) రామ్‌లీలా’ చిత్రానికి ఈ ఎస్.ఎస్.ఐ. పద్ధతిని ఉపయోగించి చూసిన ఐ.బి.ఎం. నూటికి 73 పాళ్ళు ఆ సినిమా తొలివారం వసూళ్ళు బాగుంటాయని అంచనా వేసింది. ఆ ముందస్తు అంచనా నిజమైంది. తొలి వారం వసూళ్ళు బాగున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దాంతో, ఐ.బి.ఎం. చెప్పిన ఆ ఎస్.ఎస్.ఐ. మీద అందరి దృష్టీ పడింది. హిట్టవుతుందన్న నమ్మకమెంత? 75 శాతం - ఐ.బి.ఎం. రూపొందించిన ‘సోషల్ సెంటిమెంట్ ఇండెక్స్’ (ఎస్.ఎస్.ఐ)ని బట్టి, రాజకీయ వాసనలున్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద విజయావకాశాలు ఎక్కువని నూటికి 75 పాళ్ళ నమ్మకంతో చెబుతున్నారు. 69 శాతం - కామెడీ సినిమా హిట్టవుతుందని 69 పాళ్ళ మేర నమ్మకం. ఇలాంటి సినిమాల్లో పాటలు, డ్యాన్సులు, సంగీతం, పరభాషా చిత్రాల రీమేక్ కావడం లాంటివి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 63 శాతం - చక్కటి సంగీతం ఉండి, ఇతర భాషల్లో హిట్టయిన సినిమాకు రీమేక్ అయ్యుండి, సదరు రీమేక్‌కు ఎవరైనా స్టార్ డెరైక్టర్ దర్శకత్వం వహిస్తే, అలాంటి సినిమా హిట్టవుతుందని 63 పాళ్ళ మేర నమ్మకం ఉంటోంది. 61 శాతం - యాక్షన్ సినిమా... దానికి ఓ స్టార్ డెరైక్టర్... ఈ రెండూ జత పడి, ఆ దర్శకుడే స్వయంగా నిర్మాణం కూడా చూసుకుంటే... ఇక కాసులు కురవడం ఖాయమని 61 శాతం మేర నమ్మకం వెల్లివిరుస్తోంది. 62 శాతం - చిన్న బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే, భారీ బడ్జెట్ చిత్రాల విజయావకాశాలు ఎక్కువని 62 పాళ్ళు నమ్ముతున్నారు.