కరెక్టేనంటారా? | Gossip | Sakshi
Sakshi News home page

కరెక్టేనంటారా?

Published Wed, Jul 22 2015 10:49 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

కరెక్టేనంటారా? - Sakshi

కరెక్టేనంటారా?

గాసిప్

మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. తాను తీసిన మూడు సినిమాల్లో రెండిట్లో  కంగనా రనౌతే హీరోయిన్. మరోసారి ఆమె ప్రధాన పాత్రలో ఆనంద్ కొత్త సినిమా తీయనున్నాడని వార్తలు వినిపించాయి. అయితే అదంతా ఉత్తదేనని తేలింది.ఆనంద్ ఈసారి రూట్ మార్చి తన తదుపరి చిత్రంలో కంగనాకు బదులుగా దీపికా పదుకునేను నటింపజేయనున్నాడట. విశ్వసనీయ వర్గాలు ఈ వార్తను ధృవీకరిస్తున్నాయి.

‘తనూ వెడ్స్ మనూ-1,2  సినిమాలు  కంగనాకు  తెచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆ తరహా సినిమా ఒకటి చేయాలని ఉందని అప్పుడెప్పుడో  ఆనంద్‌కు చెప్పిందట దీపిక. ‘తప్పకుండా’ అని హామీ ఇచ్చాడట ఆనంద్.ఇచ్చిన మాట కోసం తన తర్వాతి చిత్రంలో దీపికకు అవకాశం ఇస్తున్నాడనేది ఒక కథనం. అయితే ఇదేమీ కాదని...‘తనూ వెడ్స్ మనూ-2’ సక్సెస్  క్రెడిట్‌ను కంగానా మొత్తం తన ఖాతాలో వేసుకోవడం వల్ల, తన పేరు పెద్దగా వినిపించలేదనే బాధతో... ఈసారి దీపికాను ఎంచుకుంటున్నాడనేది  ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట. ఇది సరే, దీపికా మాత్రం తక్కువ తిందా? ‘పీకు’ సక్సెస్‌ను తన క్రెడిట్‌లో వేసుకోలేదా ఏమిటి?

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement