
దీపికా పదుకోన్
దీపికా పదుకోన్‌ను స్క్రీన్ మీద చూసి ఏడాది పైనే కావస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదామె. కొత్త సినిమా ఏం చేయాలో అని ఫిక్స్ అవ్వడానికి ఆర్నెల్లు, కొత్త సినిమా ఒప్పుకొని దాని పనులు మొదలుపెట్టేసరికి మరో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఫైనల్‌గా దీపిక కెమెరా ముందుకొచ్చే టైమ్ సెట్ అయింది. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఆమె ‘చప్పక్’ చిత్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మేఘన్ గుల్జర్ దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ నడుస్తున్నాయి. ‘‘చప్పక్’ చిత్రానికి మొత్తం సిద్ధం’ అని దీపికా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment