
Ranveer And Deepika Secret 3rd Wedding Anniversary: బాలీవుడ్ పాపులర్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఉత్తరాఖండ్‌లో తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈసారి వీరిద్దరూ వార‍్షికోత్సవ వేడుకలను రహస్యంగా ఉంచారు. కానీ వారు డెహ్రాడూన్ విమానాశ్రయం నుంచి అభిమానులతో దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ కంఫర్ట్ వేర్ ధరించిన 'దీప్‌వీర్' అల్మోరాలో అభిమానులతో ఆనందంగా ఫోజులిచ్చారు.
ఇటలీలోని సుందరమైన లేక్ కోమోలో వీరిద్దరూ వివాహం చేసుకున‍్నారు. వరుసగా 2018 నవంబర్ 14, 15న కొంకణి, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. తర్వాత కుటంబం, స్నేహితుల కోసం బెంగళూరు, ముంబైలో రెండు గ్రాండ్ రిసెప్షన్‌లను నిర్వహించిందీ దీప్‌వీర్ జంట. ఇదిలా ఉంటే కబీర్ ఖాన్ చిత్రం 83లో రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో లెజెండరీ క్రికెటర్ కపీల్ దేవ్‌గా నటించగా, దీపికా పదుకొణె రోమీదేవిగా కనిపించనున్నారు. హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'ది ఇంటర్న్' హిందీ రీమేక్ 'పఠాన్ అండ్ ఫైటర్'లో దీపికా నటించనున్నారు.