baby bump
-
బేబీ బంప్‌తో 'మహాతల్లి' జాహ్నవి (ఫొటోలు)
-
పెళ్లయి 13 ఏళ్లు.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనున్న నటి (ఫోటోలు)
-
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్‌ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
సీరియల్ హీరోయిన్ దేవలీనా మెటర్నిటీ ఫొటోషూట్ (ఫొటోలు)
-
సీరియల్ హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్
సీరియల్ నటి దేవలీనా ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని కొన్నిరోజులు ముందు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భర్తతో కలిసి క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో కనిపించింది. 2002 డిసెంబరులో ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి దేవలీనా భట్టాచార్జి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తన జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు అయినప్పటికీ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ భర్తతో ఉన్న ఫొటోలని దేవలీనా పోస్ట్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఆగస్టు 15న తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పుట్టినరోజు జరుపుకొంది. ఇలా ప్రతిసారి తన పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్తకి తీవ్ర గాయాలు) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
నిండు గర్భిణి దీపిక వినాయకుని ఆశీస్సులు, ఆ చీర రహస్యం!
గణేష్ చతుర్థి 2024 కోసం బాలీవుడ్ హీరోయిన్, త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె ఆమె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ధరించిన ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. రణవీర్ , దీపిక జంట మొత్తం కుటుంబంతో కలిసి రావడం విశేషం. పుట్టబోయే బిడ్డ కోసం గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిండు గర్భిణీ దీపిక బనారసీ చీరలో హుందాగా కనిపించింది. దీపికా ఫ్యాషన్ బీట్‌ను మిస్ చేయదు అంటూ అభిమానులు కమెంట్ చేశారు. అయితే ఈ చేనేత చీర వెనుక పెద్ద కథే ఉందట.సెలబ్రిటీ స్ట్టౖౖెలిస్ట్ అనితా ష్రాఫ్ అదాజానియా 9 గజాల ఈ చీరను దీపికాకు బహూకరించారట. ఈ బనారసి చీరను ఎత్నిక్ వేర్ బ్రాండ్ బనారసి బైఠక్ కోసం రూపొందించారు. వంద సంవత్సరాల నాటి డిజైన్ ప్రేరణతో బనారసి థ్రెడ్‌వర్క్‌తో, మ్యూజ్, ఒరిజినల్ డిజైన్, కలర్ ప్యాటర్న్‌ను తీసుకున్నారు. అయితే చీర మరీ బరువు కాకుండా చీర, కాస్త తేలిగ్గా ఉండేలా బూటాల మధ్య ఉన్న దాన్ని మాత్రమే తొలగించారు. దీని తయారీ కోసం ఆరు నెలలు పట్టింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) కాగా దీపికా,రణవీర్ , 2018, నవంబరు 14న వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ పిల్లల బట్టలు, బూట్లు . బెలూన్లతో శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్న సంగతి తెలిసిందే. -
బేబీ బంప్‌తో దిష్టి తగిలేలా దీపికా! బేబీమూన్ కోసం లండన్‌కు (ఫోటోలు)
-
కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. బేబీ బంప్‌తో కనిపించిన దీపికా!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.కల్కి రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేదికపై కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్, రానా, దీపికా సందడి చేశారు. అయితే ఈవెంట్లో పాల్గొన్న దీపికా బేబీ బంప్‌తో కనిపించింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వచ్చిన బాలీవుడ్ భామ.. అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే గర్భిణిగా నటిస్తోంది. ఈ సందర్భంగా దీపికా పదుకొణె షూటింగ్లో తన అనుభవాలు పంచుకున్నారు.దీపికా మాట్లాడుతూ..'నాకిది ఇది ఒక అద్భుతమైన అనుభవం. చాలా నేర్చుకున్నా. ఇది పూర్తిగా నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా ఒక అద్భుతమైన అనుభవం." అని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.Deepika.......🩶Prabhas lends a helping hand to #DeepikaPadukone to step down and Big B makes fun of it 💥💥Season 4 Brahmins #KALKI2898AD pic.twitter.com/FKi5OCWyyd— Lalita Rawat (@LalitaRawat_07) June 19, 2024 -
నిండు గర్భంతో అమలా పాల్, లెవల్ క్రాస్‌లో స్వయంగా ఓ పాట : వైరల్
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా పోస్ట్చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Think Music Malayalam (@thinkmusicmalayalam) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
బేబీ బంప్‌తో దీపిక క్యూట్‌గా, అపురూపంగా చూసుకున్న రణవీర్
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు. తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.దీపికా-రణవీర్జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫోటోలు)
-
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ భామ ఆర్తి చాబ్రియా త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్తను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆర్తి చాబ్రియాకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని 2019లో వివాహం చేసుకుంది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
బేబీ బంప్‌తో అమలాపాల్.. భర్తతో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
Aditi Prabhudeva Baby Bump Photos: గతేడాది పెళ్లి.. తల్లి కాబోతున్న కన్నడ బ్యూటీ (ఫోటోలు)
-
Mukku Avinash: బేబీ బంప్‌తో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ భార్య (ఫొటోలు)
-
గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ
టాలీవుడ్లో పూర్ణగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా కాసిమ్.. దక్షిణ భారత చలనచిత్రంలో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. మలయాళం ద్వారా కెరీర్ ప్రారంభించిన పూర్ణ అక్కడ షమ్నా కాసిమ్గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రల ద్వారా అగ్రతారగా నిలిచింది. పూర్ణ మంచి డ్యాన్సర్ కూడా.. ఇప్పటికే పలు డ్యాన్స్ షోస్ ద్వారా కూడా అభిమానులను సంపాదించుకుంది. సినిమాలే కాకుండా బుల్లితెర ప్రపంచంలో కూడా పూర్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో కొత్త దశను దాటుతోంది. ఇటీవలే తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన శింబు.. అమ్మాయి ఎవరంటే) తన ఇంటికి కొడుకు రాకతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. సినిమాలో తన పాత్ర కోసం ఎలాంటి ఛాలెంజ్లనైనా స్వీకరించడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉందటుంది. ఒకానొక సమయంలో సినిమా కోసం ఆమె జుట్టు కత్తిరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగులో నాని సినిమా అయిన దసరా షూటింగ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి పూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో పూర్ణ గర్భవతి కాగా సినిమా విడుదల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దసరా సినిమా కోసం వర్షంలో రెండు రోజులు షూటింగ్ జరిగిందని గర్భవతిగా ఉన్న తాను ఎంతో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఇందులో ఆమెకు సంబంధించిన చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే జరిగాయని తెలిపింది. దీంతో రెండు రాత్రులు వర్షంలోనే ఉండాల్సి వచ్చిందని పూర్ణ చెప్పింది. ఆ సమయంలో రాత్రి చాలా చలిగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. గర్భవతిగా ఉన్న తనకు చాలా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని చెప్పింది. గర్భవతి అయిన తనకు ఆ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమైందని పేర్కొంది. కానీ అంత కష్టపడ్డా సినిమాలో తను నటించిన కొన్ని సన్నివేశాలు తొలిగించారని పేర్కొంది. వర్షంలో తడిసిన సన్నివేశాలను చిత్రీకరించిన మేకర్స్ ఆపై తాను చాలా ఇబ్బంది పడటం గమనించి వేడినీళ్లు తెప్పించి పూర్ణపై పోస్తూనే ఉన్నారట. సినిమాలోని మరో సన్నివేశం కోసం రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చిందని అప్పుడు వీధికుక్కల అరుపులు విని భయపడ్డానని, అదృష్టవశాత్తూ అవి తనను కరిచలేదని పూర్ణ చెప్పింది. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిత్రీకరించబడిందని పేర్కొంది. కానీ ఆ సమయంలో పెద్దగా గాయాలు ఏం కాలేదని పేర్కొంది. సినిమా షూటింగ్ సమయంలో మేకర్స్ తనకు ఎంతగానో తొడ్పడ్డారని తెలిపింది. వారి సాయంతోనే గర్భవతిగా ఉన్న తాను సురక్షితంగా సినిమా పూర్తి చేశానని పూర్ణ తెలిపింది. -
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్‌కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్‌లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్‌లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్‌లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అక్షయ్ కుమార్‌తో కలిసి హౌస్‌ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్ ఫోటో వైరల్!
పోకిరీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు సరసన 'పోకిరి' సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది. అయితే పెళ్లి కాకుండానే అందరికీ షాకిచ్చింది భామ. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఊహించని విధంగా ఏకంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) అయితే ఆమె ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తొమ్మిది నెల గర్భంతో ఉన్న ఇలియానా లేటెస్ట్ బేబీ బంప్ పిక్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇలియానా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మై లిటిల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా నటించిన ఇలియానాకు.. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్‌కు మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రెగ్నెన్సీ ప్రకటించి సినిమాలకు విరామం తీసుకుంది. బాలీవుడ్‌లోనూ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్లు అందుకుంది. అయితే ‘రుస్తుం’,‘బాద్షాహో’ ‘రైడ్’, ‘ముబారకన్’ వంటి కథ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినా... ఇలియానాకు బీటౌన్‌లో సరైన బ్రేక్ లభించలేదు. చివరగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో నటించింది. (ఇది చదవండి: మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ భామ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ లీడర్ ఫహద్ అహ్మద్‌ను పెళ్లాడిన సంగతె తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. మొదట సీక్రెట్‌గా చేసుకున్న భామ.. ఆ తర్వాత రిజిస్టర్ వివాహాం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న నటి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా తాను బేబీ బంప్‌తో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట) అయితే ప్రెగ్నెన్సీ ప్రకటించాక స్వర భాస్కర్ దారుణంగా ట్రోల్స్‌కు గురైంది. అప్పట్లో వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని పలువురు విమర్శించారు. కాగా.. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. (ఇది చదవండి: విమానంలో బిగ్‌బాస్ బ్యూటీకి వేధింపులు.. అది కూడా తప్పతాగి! ) View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
బేబీ బంప్‌తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి లహరి పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్లో నటిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా లహరి షేర్ చేసిన పిక్స్ తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, కొడుకు సమక్షంలోనే.. ) అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే సీమంతం వేడుక జరుపుకుంది బుల్లితెర భామ. తాజాగా బేబీబంప్‌తో ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
నాలుగేళ్లుగా హీరోతో సహజీవనం.. నటికి రెండోసారి ప్రెగ్నెన్సీ!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ అనే రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రాంపాల్ బాలీవుడ్లో దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో నటించారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నటుడు అర్జున్ రాంపాల్ మరో నటితో సహజీవన చేస్తున్నారు. తాజాగా రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ రెండోసారి గర్భం ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవాళ యోగా డే సందర్భంగా గాబ్రియెల్లా బేబీబంప్‌తో యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) కాగా.. అర్జున్, గాబ్రియెల్లా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ జంట 2018లో తమ స్నేహితుల ద్వారా కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఈ జంటకు 2019లో తమ మొదట కుమారుడు అరిక్ రాంపాల్ జన్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి గర్భం ధరించినట్లు గాబ్రియెల్లా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కాగా.. అర్జున్ రాంపాల్‌కు ఇది వరకే పెళ్లి కాగా.. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు ఎవరు ఈ గాబ్రియెల్లా? అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన 'ఊపిరి' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ కూడా ఓ పాత్రలో నటించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) -
బేబీబంప్‌తో నటి పోజులు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటీవలే స్వర భాస్కర్ ట్విటర్ వేదికగా ప్రెగ్నెన్సీని వెల్లడించింది. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి) అయితే తాజాగా స్వర భాస్కర్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. గర్భం ధరించాక తొలిసారిగా బయట కనిపించింది. తన భర్తకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన నటి.. బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేశారు. స్వర భాస్కర్ పెళ్లికి ముందే గర్భవతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' ఇంత తొందరగానా' అంటూ రాశాడు. మరో నెటిజన్ రాస్తూ..'పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ?' అంటూ కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ పెళ్లి సమయంలోనే ఆమె గర్భవతి అంటూ ట్రోల్ చేశాడు. ఇంతకుముందే ఆమెను టార్గెట్ చేస్తూ చాలాసార్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా..స్వర భాస్కర్ చివరిసారిగా బడ్డీ కామెడీ చిత్రం జహాన్ చార్ యార్ (2022)లో కనిపించారు. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. కలెక్షన్స్ ఎంతంటే?) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తన బాయ్‌ఫ్రెండ్ ఫోటో రివీల్ చేసిన ఇలియానా
తన వయ్యారంతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా.. టాలీవుడ్లో 'దేవదాసు'తో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తొలి సినిమాతోనే గుర్తింపు పొంది.. యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్ తోనూ జతకట్టింది ఈ భామ. తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా రానించలేకపోయింది. (ఇదీ చదవండి: నిన్న తిరుమల, నేడు గురుద్వార్.. మీరు మారరా?) ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. ఈ విషయంలో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో భారీ ట్రోలింగ్‌కు గురైంది. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయినందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఇలియానా తొలిసారిగా తన బాయ్‌ఫ్రెండ్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కానీ ఆ ఫోటో అంత క్లారిటీగా లేదు. (ఇదీ చదవండి: ఆ నిర్మాత అవసరం తీరాక ముఖం చాటేస్తాడు: ప్రేమమ్ హీరోయిన్) తన వాల్లో ఇలా రాసుకొచ్చింది. 'ప్రెగ్నెన్సీ అనేది అతిపెద్ద వరం. నేను ఇప్పుడు మరింత అందంగా ఉన్నాను. నా బేబీ బంప్ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. నా బేబీని త్వరలో కలుస్తాను. ఈ ప్రయాణంలో నా ప్రియమైన వ్యక్తి ఎంతో సహకరించాడు. నాకు సమస్యలు ఎదురైన ప్రతిసారి నా కన్నీళ్లు తుడిచాడు. రాయిలా నాకు అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఏదీ అంత కష్టంగా అనిపించడం లేదు' అని ఇన్‌స్టాలో తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ఎఫైర్లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. -
తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!
భాభిజీ ఘర్ పర్ హైన్ సీరియల్ ఫేమ్ విదిషా శ్రీవాస్తవ గర్భం ధరించినట్లు వెల్లడించింది. త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి జూలైలో తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదలండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) టాలీవుడ్లో ఎంట్రీ కాగా విదిషా టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. 'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, దేవరాయ చిత్రాల్లో నటించింది. ఓకే ఏడాదిలో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ విదిషా శ్రీవాస్తవ కీలకపాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో రియా పాత్రలో మెప్పించింది. కాగా.. విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్లో సాయక్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కాదు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయికి వెళ్లనున్నట్లు తెలిపింది. అయితే తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయలేదని.. కానీ తన భర్త తనకు బాగా సపోర్ట్‌తో ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించింది. గతంలో ఆమె ఓ షోలో చేరిన 10 నెలలకే గర్భం దాల్చిన విషయం చెప్పేందుకు ఇబ్బంది పడినట్లు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు సెట్లోని అందరూ ఆమెను అభినందించారని పేర్కొంది. (ఇది చదవండి: 'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. (ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్) అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.