గణేష్ చతుర్థి 2024 కోసం బాలీవుడ్ హీరోయిన్, త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె ఆమె భర్త రణవీర్ సింగ్‌తో కలిసి ధరించిన ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. రణవీర్ , దీపిక జంట మొత్తం కుటుంబంతో కలిసి రావడం విశేషం. పుట్టబోయే బిడ్డ కోసం గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిండు గర్భిణీ దీపిక బనారసీ చీరలో హుందాగా కనిపించింది. దీపికా ఫ్యాషన్ బీట్‌ను మిస్ చేయదు అంటూ అభిమానులు కమెంట్ చేశారు. అయితే ఈ చేనేత చీర వెనుక పెద్ద కథే ఉందట.
సెలబ్రిటీ స్ట్టౖౖెలిస్ట్ అనితా ష్రాఫ్ అదాజానియా 9 గజాల ఈ చీరను దీపికాకు బహూకరించారట. ఈ బనారసి చీరను ఎత్నిక్ వేర్ బ్రాండ్ బనారసి బైఠక్ కోసం రూపొందించారు. వంద సంవత్సరాల నాటి డిజైన్ ప్రేరణతో బనారసి థ్రెడ్‌వర్క్‌తో, మ్యూజ్, ఒరిజినల్ డిజైన్, కలర్ ప్యాటర్న్‌ను తీసుకున్నారు. అయితే చీర మరీ బరువు కాకుండా చీర, కాస్త తేలిగ్గా ఉండేలా బూటాల మధ్య ఉన్న దాన్ని మాత్రమే తొలగించారు. దీని తయారీ కోసం ఆరు నెలలు పట్టింది.
కాగా దీపికా,రణవీర్ , 2018, నవంబరు 14న వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ పిల్లల బట్టలు, బూట్లు . బెలూన్‌లతో శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment