కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. బేబీ బంప్‌తో కనిపించిన దీపికా! Deepika Padukone Looks In Baby Bump In Pregnancy Goes Viral. Sakshi
Sakshi News home page

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. బేబీ బంప్‌తో కనిపించిన దీపికా!

Published Wed, Jun 19 2024 9:15 PM | Last Updated on Thu, Jun 20 2024 8:36 AM

Deepika Padukone Looks In Baby Bump In Pregnancy Goes Viral

టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్‌- ప్రభాస్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

కల్కి రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.  ఈ వేదికపై కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్, రానా, దీపికా సందడి చేశారు. అయితే ఈవెంట్‌లో పాల్గొన్న దీపికా బేబీ బంప్‌తో కనిపించింది. బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో వచ్చిన బాలీవుడ్ భామ.. అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె సుమతి అనే గర్భిణిగా నటిస్తోంది. ఈ సందర్భంగా దీపికా పదుకొణె  షూటింగ్‌లో తన అనుభవాలు పంచుకున్నారు.

దీపికా మాట్లాడుతూ..'నాకిది ఇది ఒక అద్భుతమైన అనుభవం. చాలా నేర్చుకున్నా. ఇది పూర్తిగా నన్ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా,వృత్తిపరంగా ఒక అద్భుతమైన అనుభవం." అని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement