
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది. ఆ మాటను ఇటీవల విడుదలైన కోర్ట్ మూవీ మరోసారి స్పష్టం చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించిన దానికంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఈ మూవీపై పలువురు టాలీవుడ్ అగ్ర సినీతారలు ప్రశంసలు కురిపించారు.
తాజాగా ఈ మూవీ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కోర్ట్ మూవీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించిన చిరు.. సినిమా తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ఉండడంతో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని భావించానని అన్నారు. కానీ ఈ కథను చాలా స్ట్రైట్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారని మెగాస్టార్ కొనియాడారు. ఈ సినిమాలో శివాజీ చాలా క్రూయల్‌గా నటించారని.. రోషన్, శ్రీదేవి అద్భుతంగా చేశారని చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా చిరంజీవితో ప్రియదర్శి కాసేపు సినిమా కాన్సెప్ట్ గురించి వివరించారు. ఠాగూరు మూవీ తర్వాత అంతలా చర్చించుకున్న సినిమా ఇదేనని ప్రియదర్శి అన్నారు. కాగా.. ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఈ