ప్రభాస్ వల్లే ఇలా మారిపోయాను: దీపికా పదుకొణె Deepika joked that her co-star Prabhas fed her so much that she has a baby bump. Sakshi
Sakshi News home page

Prabhas Deepika: బేబి బంప్‌పై దీపికా ఫన్నీ కామెంట్స్.. ప్రభాసే కారణమంటూ!

Published Thu, Jun 20 2024 7:27 AM | Last Updated on Thu, Jun 20 2024 9:15 AM

Deepika Padukone Comments Her Baby Bump Prabhas Reason

ప్రభాస్ 'కల్కి' మరో వారంలో అంటే జూన్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం  ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్‌తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ పాల్గొన్నారు. తక్కువ సమయమే ఈవెంట్ జరిగినప్పటికీ.. యాక్టర్స్ మధ్య బాండింగ్, వాళ్ల చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించాయి. మరీ ముఖ్యంగా దీపిక, ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పడమైతే హైలెట్.

(ఇదీ చదవండి: లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్)

దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబి బంప్‌తోనే ముంబైలో జరిగిన ఈవెంట్‌కి వచ్చింది. అయితే ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని సరాదా కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్‌లా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్. అతడి ఇంటి భోజనమే నా బేబి బంప్‪‌కి కారణం (సరదాగా నవ్వుతూ). ప్రతిరోజు షూటింగ్‌కి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఎంతో ఇష్టంగా మూవీ టీమ్‌ కోసం భోజనం తెప్పించేవాడు. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్‌లా ఉండేది. అలానే ప్రభాస్ ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ ఫుడ్ వస్తుందా అని ప్రతిరోజు ఎగ్జైట్‌మెంట్‌గా ఉండేది' అని దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది. 

(ఇదీ చదవండి: మోసపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement