కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణెల విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన విశేషాలను నటుడు హుంహు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
ఆయనతో సీన్స్ లేవు
హుంహు మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ కాంబినేషన్‌లో నాకు ఎటువంటి సన్నివేశాలు లేవు. సీక్వెల్‌లో అయినా ఆయనతో కలిసి నటిస్తే బాగుండని భావిస్తున్నాను. ప్రభాస్, దీపికతో కొన్ని సన్నివేశాల్లో నటించాను. అసలే నాకు సినిమాలు కొత్త, అందులోనూ ప్రభాస్‌కు అభిమానిని.
సొంత అన్నలా దగ్గరుండి..
తనెప్పుడూ నన్ను డార్లింగ్ అని పిలిచేవాడు. ఒక యాక్షన్ సీన్‌లో నన్ను పక్కకు తీసుకెళ్లి టిప్స్ చెప్పాడు. ఎక్కడ? ఎలా? యాక్ట్ చేయాలో నేర్పించాడు. నిజానికి నాకు దగ్గరుండి చెప్పాల్సిన అవసరం ప్రభాస్‌కు లేనే లేదు. అయినా సొంత అన్నలా నాకు సలహాలు ఇచ్చాడు.
విశాల హృదయం..
దీపికతో నటించాల్సి వచ్చినప్పుడు కొంత భయపడ్డాను. అది గమనించిన ఆమె జోక్ చెప్పి నవ్వించింది. వీళ్లు పెద్ద సెలబ్రిటీలు మాత్రమే కాదు పెద్ద మనసున్నవాళ్లు కూడా! వీరితో కలిసి పని చేయడం నా అదృష్టం' అని చెప్పుకొచ్చాడు. అలాగే కల్కి షూటింగ్‌లో తాను గాయపడినట్లు తెలిపాడు.
చదవండి: Kalki 2898 AD: అర్జునుడిగా విజయ్ దేవరకొండ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment