'పెద్ది' సర్ ప్రైజ్.. ఉగాదికి కాదు శ్రీరామనవమికి | Ram Charan Peddi Movie Glimpse On Sri Rama Navami | Sakshi

Peddi Movie: బర్త్ డేకి మిస్.. శ్రీరామనవమికి రిలీజ్

Mar 30 2025 3:59 PM | Updated on Mar 30 2025 4:19 PM

Ram Charan Peddi Movie Glimpse On Sri Rama Navami

రామ్ చరణ్ కొత్త సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీ ఎంత రస్టిక్ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అయితే పోస్టర్స్ తో సంతృప్తి పడని ఫ్యాన్స్.. గ్లింప్స్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. కొన్నాళ్ల క్రితం ఛాతీనొప్పి రావడంతో బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. దీంతో పుట్టినరోజున గ్లింప్స్ ఉండకపోవచ్చని అనుకున్నారు. అలానే జరిగింది. శ్రీరామనవమి రోజున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

బహుశా గ్లింప్స్ వీడియోలో రామ్ చరణ్ క్యారెక్టర్ తో పాటు రిలీజ్ తేదీపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశముంది. వచ్చే ఏడాది మార్చి 27న అనుకుంటున్నారు. కానీ మరి అది నిజమో కాదో చూడాలి. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.

(ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement