Glimpse
-
ఒంటరివాడను నేను!
ఒకరు కాదు... ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు అతన్ని. కానీ, ‘ఒంటరివాడను నేను... ఎవ్వరివాడను కాను...’ అనే పాట వింటుంటాడు. పైగా 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి పెళ్లి కాకుండా మిగిలిపోవడానికి కారకుడు కూడా అవుతాడు. ఈ ఒంటరివాడు ఆ తర్వాత ఒక ఇంటివాడు అవుతాడా? పెళ్లి కాని 35 ఏళ్ల బ్రహ్మచారి కథ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ చిత్రం చూడాలి. ఒంటరివాడుగా హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), 35 ఏళ్ల యువకుడిగా ‘వెన్నెల కిశోర్’ నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టైటిల్ ప్రకటించి, శ్రీవిష్ణు లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమేరా: ఆర్ వేల్రాజ్. -
తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్(Thandel Transformation) పేరుతో గ్లింప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్‌గా మారడాన్ని ఇందులో చూపించారు. తండేల్ షూటింగ్లో చైతూ జర్నీని వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.Becoming Thandel Raju was challenging and extremely satisfying Here’s a glimpse into the journey https://t.co/uEuMtmVwWj-- #Thandel RajuSEE YOU ALL IN CINEMAS 7TH FEB. #ThandelonFeb7th pic.twitter.com/8rx997jCro— chaitanya akkineni (@chay_akkineni) February 3, 2025 -
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇవాళ మాస్ మహారాజా బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మాస్ జాతర మూవీ గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. The Swag.The Energy.The Vibe. 🔥🔥🔥𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025 -
బోల్డ్ కన్నన్
బోల్డ్ కన్నన్‌గా మారిపోయారు హీరో విజయ్ సేతుపతి. ఆయన హీరోగా నటిస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘ఏస్’. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మూవీ ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో యోగిబాబు, బీఎస్ అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ ఇతర లీడ్ రోల్స్æచేస్తున్నారు. జనవరి 16న విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రంలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇంకా విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మరో మూవీ ‘ట్రైన్’ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వంలో కలైపులి యస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాజర్, కేఎస్ రవికుమార్, శ్రుతీహాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇలా బర్త్ డేకి డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ సేతుపతి. -
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్‌పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025 -
ప్రియుడికి టాటా చెప్పేశాక..సర్ప్రైజ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్, తనదైన లుక్స్, నటనతో ఆకట్టుకుంది. 19 ఏళ్ల వివాహ జీవితం, కుమారుడు తర్వాత భర్త అర్బాజ్ ఖాన్‌నుంచి విడిపోయింది. ఆ తరువాత 2018 నుంచి అర్జున్ కపూర్‌తో రిలేషన్షిప్లో ఉంది. 2024లో విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించారు. ఇటీవలే మలైకా తండ్రి కన్నుమూశారు. ప్రస్తుతం కుమారుడు అర్హాన్‌తో కలిసి జీవిస్తోంది. మలైకా అరోరా ఒక కొత్త రెస్టారెంట్ ప్రారంభించింన సంగతి తెలిసిందే. ప్రియుడితో బ్రేకప్ ప్రకటించిన తరువాత ఇపుడు అధికారికంగా ఈ రెస్టారెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఫుడ్ విశేషాలను ఇందులో షేర్ చేసింది. సర్ప్రైజ్ కూడా ఉంది అంటూఫ్యాన్స్ను ఊరిస్తోంది. మలైకా లేటెస్ట్ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. దీంతో ముంబైలో రెస్టారెంట్‌ను ప్రారంభించిన తాజా సెలబ్రిటీగా మలైకా అరోరా నిలిచింది. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) ‘స్కార్లెట్ హౌస్‌కి స్వాగతం. సరే, ఇది మా రిటైల్ రూం. ,ఇది రాత్రికి వైన్, టేస్టింగ్ కమ్యూనిటీ బార్గా మారుతుంది. ఇది పర్ఫెక్ట్ సెట్టింగ్.. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి తయారవుతూనే ఉంటుంది... అంటూ మలైకా తన పోస్ట్‌లో తెలిపింది.దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్! ముంబైలోని బాంద్రాలో కొలువుదీరిన ఈ రెస్టారెంట్‌కు స్కార్లెట్ హౌస్ అని పేరు పెట్టారు. 90 ఏళ్ల క్రితం నాటి పోర్చుగీస్ బంగ్లాను వింటేజ్ లుక్ తీసుకొచ్చి రెస్టారెంట్గాతీర్చిద్దింది. . తన చిన్ననాటి స్నేహితుడు మలయ నాగ్‌పాల్, రెస్టారెంట్ నడిపే ధవల్ ఉదేషితో కలిసి ఈ ఫుడ్ బిజినెస్‌ను మొదలు పెట్టింది. స్కార్లెట్ హౌస్ అద్భుతమైన ఇంటీరియర్స్ , విలాసవంతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో దీన్ని రూపొందించారట. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం -
'ఓ భామ అయ్యో రామా' అంటోన్న సుహాస్ .. గ్లింప్స్ వచ్చేసింది!
ఇటీవల జనక అయితే గనక అనే సినిమాతో అభిమానులను అలరించిన హీరో సుహాస్. సరికొత్త కథలతో ఆడియన్స్‌ను అలరిస్తోన్న సుహాస్ మరో కథతో రెడీ అయిపోయారు. 'ఓ భామ అయ్యోరామా' అంటూ వచ్చేస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే' అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్‌గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
అనుష్క శెట్టి బర్త్ డే.. అరుంధతిని మరిపిస్తోన్న గ్లింప్స్!
టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ప్రేక్షరులను పలకరించింది. ఆ తర్వాత మళ్లీ ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించలేదు. దీంతో అనుష్క ఫ్యాన్స్ సినిమాలకు గుడ్ బై చెప్పేయనుందా అన్న డైలామాలో పడ్డారు.అయితే ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా అనుష్క ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె నటిస్తోన్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఘాటీ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 47 సెకన్ల పాటు ఉన్న గ్లింప్స్ అనుష్క ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో కొడవలి పట్టుకున్న అనుష్క ఫుల్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టేశారు. ఈ సినిమాను మహిళ ఓరియంటెడ్ కథగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర చూస్తుంటే ఓ రేంజ్లో ఉండనుందని గ్లింప్ల్తోనే అర్థమవుతోంది. మరోసారి అరుంధతి రేంజ్ నటనను ఘాటీ గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
రాఘవ లారెన్స్ బర్త్ డే.. గ్లింప్స్ అదిరిపోయింది!
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో బుల్లెట్ బండి మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్ చూస్తుంటే ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎల్విన్, వైశాలి, సింగంపులి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
గుణశేఖర్ 'యుఫోరియా' గ్లింప్స్.. ఈసారి కొత్తగా ప్లాన్ చేశాడుగా!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూటు మార్చాడు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా సింపుల్‌గా ఉండేలా యూత్‌కు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. 'వరల్డ్ ఆఫ్ యుఫోరియా' సినిమా తెరకెక్కించాడు. ఇందులో భూమిక ప్రధాన పాత్రలో నటించగా సారా అర్జున్, నాజర్, రోహిత్, పృథ్వీరాజ్, లిఖిత కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.గ్లింప్స్‌లో డ్రగ్స్, అత్యాచారం వంటి సీరియస్ అంశాలను చూపించారు. ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించాడు. చాలా రోజుల తర్వాత హిట్ కోసం ఆరాటపడుతున్న గుణశేఖర్‌కు యుఫోరియా తిరిగి సక్సెస్‌ను ఇచ్చేట్లు కనిపిస్తోంది. నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీన్ కె పోతన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. -
సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ'
నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ దర్శ కత్వంలో ఆయన తనయుడు అద్వయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ చిత్రాన్ని ప్రవీణ కడియాల, రామలక్ష్మిల సమర్పణలో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్నారు.ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హీరో ఓ బావిలోకి దూకి అక్కడ ఉన్న ఓ పురాతన పుస్తకాన్ని తీసుకురావడం, ఆ పుస్తకానికి కాపలాగా ఉన్నట్లుగా ఉన్నపాములు అతనిపై దాడి చేయడం, ఓ గుడి అతని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం, జై శ్రీరామ అంటూ వాయిస్ ఓవర్ రావడం వంటివి టీజర్లో కనిపిస్తాయి. ఈ చిత్రం 2025లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఆకట్టుకుంటున్న 'మంగంపేట' ఫస్ట్ లుక్.. విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్
చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్లో భాస్కర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మంగంపేట’. గౌతం రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ గ్లింప్స్‌ను రీసెంట్గా విడుదల చేశారు.‘మంగంపేట’ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఇందులోని డైలాగ్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. 'ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’ అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.మంగంపేట గ్లింప్స్ టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు. -
టాలీవుడ్ సూపర్ 'హిట్' సిరీస్.. పార్ట్-3లో హీరో ఎవరంటే?
సరిపోదా శనివారం అంటూ ఇటీవలే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ హీరో నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. అంతలోనే మరో కొత్త మూవీని ప్రకటించారు. ఈ సినిమా నాని కెరీర్లో 32వ చిత్రంగా నిలవనుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేయండి.గతంలో టాలీవుడ్లో హిట్ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ రెండు సినిమాలకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ పేరుతో వచ్చిన మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. ఆ తర్వాత హిట్-2లో లీడ్ రోల్లో అడివి శేష్ కనిపించారు. ఈ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రం హిట్-3. ఇందులో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్లో మే 1న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందించనున్నారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. -
ఆగస్టు 15న దేవర నుంచి బిగ్ అప్డేట్
-
ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి సరికొత్తగా ప్రభాస్‌ను చూపించనున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Shraddha Das: కట్టెలపొయ్యిపై రొట్టెలు చేసిన హీరోయిన్ (ఫోటోలు)