అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్(Thandel Transformation) పేరుతో గ్లింప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్‌గా మారడాన్ని ఇందులో చూపించారు. తండేల్ షూటింగ్‌లో చైతూ జర్నీని వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.
మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.
Becoming Thandel Raju was challenging and extremely satisfying
Here’s a glimpse into the journey https://t.co/uEuMtmVwWj
-- #Thandel Raju
SEE YOU ALL IN CINEMAS 7TH FEB. #ThandelonFeb7th pic.twitter.com/8rx997jCro— chaitanya akkineni (@chay_akkineni) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment