అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా నటించింది.
అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్‌ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్‌తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండేల్ సినిమా ఫర్‌ఫెక్ట్‌గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)
మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓
That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L— Geetha Arts (@GeethaArts) February 6, 2025
Comments
Please login to add a commentAdd a comment