![Akkineni Naga Chaitanya Thandel Movie Available In Online](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Thandel.jpg.webp?itok=tzIJm-tJ)
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.
తండేల్‌ను వదలని పైరసీ భూతం..
అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్‌లో తండేల్ పూర్తి సినిమా అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.
కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు.
తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..
తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది.
విదేశాల్లోనూ హవా..
విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment