leak
-
తండేల్‌ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్‌ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?
కేంద్ర బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సంప్రదాయం ప్రకారం.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం నార్త్ బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ ప్రింటింగ్ కోసం లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమైన తర్వాత హల్వా వేడుక కూడా జరిగింది.ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని సంప్రదాయ హల్వా రుచి చూశారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బందికి హల్వా తయారు చేసి పంపిణీ చేయడం ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం బడ్జెట్ ప్రతులను నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ముద్రించనున్నారు. నార్త్ బ్లాక్ బేస్మెంట్లో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రెస్ ఉంది. కానీ నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను చాలా కాలం ముద్రించలేదు. దీని వెనుక చాలా ముఖ్యమైన కారణం ఉంది.బడ్జెట్ ముందే లీక్1950లో కేంద్ర బడ్జెట్ విషయంలో ఊహించని సంఘటన జరిగింది. అప్పట్లో మింటో రోడ్లో ఉన్న రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుండి కేంద్ర బడ్జెట్ లీక్ అయింది. అప్పటి వరకూ బడ్జెట్ పత్రాలను ఇదే ప్రెస్‌లో ముద్రించేవారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. కానీ 1950లో బడ్జెట్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో దేశంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక పత్రాన్ని ముద్రించే స్థలాన్ని మరింత సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడ్జెట్ పత్రాలు లీక్ అయిన సమయంలో జాన్ మథాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తుల ప్రయోజనాల కోసమే బడ్జెట్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రణాళికా సంఘానికి నిరసనగా అప్పటి ఆర్థిక మంత్రి రాజీనామా చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 1980లో బడ్జెట్‌ను ముద్రించే స్థలం మరోసారి మారింది. నార్త్ బ్లాక్‌లోని ప్రస్తుత స్థానానికి మార్చారు.'లాక్-ఇన్' పీరియడ్ అంటే..బడ్జెట్ ముద్రణ ప్రక్రియ అత్యంత పటిష్టంగా, గోప్యంగా జరుగుతుంది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు బడ్జెట్‌పై పని చేస్తున్న అధికారులు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దీన్నే “లాక్-ఇన్” పీరియడ్ అంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ వ్యవధిలో అధికారులు తమ ఫోన్లను ఉపయోగించడానికి కూడా అనుమతించరు. ఆర్థిక మంత్రి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాతే వారు బయలుదేరవచ్చు. బడ్జెట్ గోప్యత దృష్ట్యా ఈ విధానం పాటిస్తున్నారు. 1980 నుంచే హల్వా వేడుకబడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది.భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది. -
Bihar: మరో ప్రశ్నాపత్రం లీక్.. సీహెచ్ఓ పరీక్ష రద్దు
పట్నా: బీహార్ రాష్ట్ర ఆరోగ్య కమిటీ డిసెంబర్ ఒకటిన నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) పరీక్ష రద్దయ్యింది. ఈరోజు (డిసెంబర్ 2)న జరగాల్సిన పరీక్ష కూడా రద్దయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పరీక్షల తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తారు.సీహెచ్ఓ పరీక్ష పేపర్ లీక్‌కు కొన్ని ముఠాలు పాల్పడినట్లు పట్నా పోలీసులకు ఇన్పుట్ అందింది. వీటి ఆధారంగా పట్నా పోలీసులు ఆదివారం అర్థరాత్రి పలు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలపై దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ తర్వాత ఈ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పట్నా పోలీసు బృందం ఆదివారం ఏకకాలంలో 12 ఆన్లైన్ కేంద్రాలపై దాడులు చేసింది. రామకృష్ణనగర్తో పాటు పలు కేంద్రాలకు చెందిన 12 మందిని ఈ బృందం అదుపులోకి తీసుకుంది. రెండు కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు.పోలీసులు ఈ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి నలుగురిని విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ పరీక్షకు సంబంధించిన ఆడియో, వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్య కమిటీ ఎస్ఎస్పీకి లేఖ రాసి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో ఆదివారం పరీక్షకు ముందు నుంచే పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బీహార్‌లో గతంలో పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి.ఇది కూడా చదవండి: Pollution Control Day: భోపాల్ గ్యాస్ లీకేజీ విషాదాన్ని గుర్తు చేస్తూ.. -
ఆ లీక్ వీరులెవరో నాకు తెలుసు.. దసరా డైరెక్టర్ ఆగ్రహం!
దసరా మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన నానితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించి టైటిల్ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్శకుడు శ్రీకాంత్ మండిపడ్డారు.నా మూవీ టైటిల్ లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని శ్రీకాంత్ ఓదెల అన్నారు. మా టీమ్‌తో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నా సినిమాకు మాత్రమే కాదు.. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుపట్టడం మానేస్తే మంచిదని ఆయన హితవు పలికారు. వాళ్లు సినిమా రంగంలో క్రియేటర్స్ అని కొనియాడారు. సినిమాలకు వారు అందించే నిస్వార్థమైన సేవలను గౌరవించాలని.. అంతేగానీ కష్టపడి పనిచేసే డిపార్ట్మెంట్లపై నిందలు మోపడం సరికాదని శ్రీకాంత్ అన్నారు.కాగా.. శ్రీకాంత్.. నానితో తెరకెక్కిస్తోన్న చిత్రానికి ది ప్యారడైజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ మూవీ యూనిట్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ విషయంపై శ్రీకాంత్ ఓదెల ఆగ్రహం వ్యక్తం చేశారు. To whomever it may concern,నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024 -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
అల్లు అర్జున్ పుష్ప-2.. నెట్టింట లీకైన క్లైమాక్స్ సీన్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ వీడియో అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వీడియో పుష్ప-2 చిత్రానికి సంబంధించిందా? లేదా ?అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ నెటిజన్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుతున్నారు.మరికొందరు ఫ్యాన్స్ ఈ వీడియోనూ డిలీట్ చేయాలంటూ అతనికి రెక్వెస్ట్లు పెడుతున్నారు. ఎందుకిలా లీక్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి బ్రో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో డిలీట్ చేయకపోతే కొందరి ఉద్యోగాలు కూడా పోతాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్టింట వైరలవుతోన్న వీడియో ఒరిజినలా, కాదా అన్నది తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #Pushpa2 Climax Fight Scene 😉Enjoy pandagowww 💥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/EyGDhWtvzu— Jaisai Nimmala (Allu Arjun Die Hard Fan) (@NimmalaJaisai23) July 30, 2024 -
నీట్ లీక్.. చెరువులోంచి 16 ఫోన్లు స్వాధీనం!
నీట్ పేపర్ లీకేజీలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన అవినాష్ అలియాస్ బంటీని అరెస్టు చేశారు. అనంతరం పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం సీబీఐ అతడిని జూలై 30 వరకు కస్టడీకి తీసుకుంది. నీట్ పేపర్ లీక్ కేసులో గతంలో అరెస్టయిన శశి పాసవాన్ బంధువు ఈ బంటీ కావడం గమనార్హం.నీట్ పేపర్ ప్రశ్నాపత్రాల కీని షేర్ చేయడంలో బంటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నీట్-యూజీ పరీక్ష తర్వాత పేపర్ లీకేజీ కోసం ఉపయోగించిన 16 ఫోన్లను సమీప చెరువులో పడేయగా.. కేసు విచారణ నిమిత్తం.. ఫోన్లను పడేసిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి గుర్తించారు. కాగా, నీట్ పేపర్ లీకేజీపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. పరీక్షకు ముందే నీట్ పేపర్ ప్రశ్నాపత్రాలను పొందేందుకు రూ. 35 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అధిక మొత్తంలో చెల్లించినట్లు సీబీఐ అధికారుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. బీహార్ అభ్యర్థులు రూ. 35 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి రూ.55 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు చెల్లించినట్లు విచారణలో తేలింది. హజారీబాగ్ (జార్ఖండ్), లాతూర్ (మహారాష్ట్ర), గోద్రా (గుజరాత్), పాట్నా (బీహార్)లలో పరీక్షా కేంద్రాలను గుర్తించడంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 150 మంది అభ్యర్థులు లీకైన పేపర్ల నుండి ప్రయోజనం పొందినట్లు జాతీయమీడియా కథనాలు చెబుతున్నాయి. -
NEET Paper Leak: ఒక్కో పేపర్ రూ. 60 లక్షలు..150 మంది కొనుగోలు
పట్నా: నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. తాజాగా సీబీఐకి అందిన సమాచారం ప్రకారం విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాలను రూ.35 నుంచి 60 లక్షలకు కొనుగోలు చేశారు. నిందితులు ఈ పేపర్లను బీహార్ విద్యార్థులకు రూ.35 నుంచి 45 లక్షలకు విక్రయించగా, బీహార్ వెలుపలి విద్యార్థులకు రూ.55 నుంచి 60 లక్షలకు విక్రయించారు. విచారణలో 150 మందికి పైగా విద్యార్థులు పేపర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించాయి.గుజరాత్‌లోని గోద్రా, మహారాష్ట్రలోని లాతూర్, హజారీబాగ్, పట్నా ఇతర నగరాల్లోని వివిధ ప్రాంతాలలో ఈ విక్రయాలు జరిగినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. పట్నాలోని 35 మంది విద్యార్థులకు సమాధానాలతో కూడిన ప్రశ్నా పత్రాలను అందించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అయితే ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన 150 మంది విద్యార్థుల్లో సగం మంది మెరుగైన మార్కులు సాధించలేదని తెలుస్తోంది.దర్యాప్తులో ఎన్టీఏ పలువురు అనుమానిత విద్యార్థుల పేర్లను ఆర్థిక నేరాల విభాగానికి పంపింది. ఈఓయూ ఆ విద్యార్థులను విచారించింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో ధన్బాద్లో అరెస్టయిన అవినాష్ కుమార్ అలియాస్ బంటీని ఆరు రోజుల పోలీసు రిమాండ్‌పై సీబీఐకి అప్పగించాలని పట్నా ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇతనిని జూలై 30 వరకు సీబీఐ విచారించనుంది. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. నెట్టింట లీకైన వీడియో!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే గేమ్ ఛేంజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని శంకర్ ప్రకటించారు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సీన్‌ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్‌కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఇండియన్-2 థియేటర్లలో రిలీజైంది. #Gamechanger Leaked scene here it's...An Airport sequence 🌟Shankar cooking something against #government 😂💥#Ramcharan #Shankar #Kollywood #Tollywood #Raayantrailer #Indian2Disaster #MaxTeaser #Encounter #leak pic.twitter.com/nrua55J8mx— Vikki (@stupid_guy_07) July 16, 2024 -
ఎన్టీఆర్ 'దేవర'.. నెట్టింట వైరలవుతోన్న పవర్ఫుల్ డైలాగ్!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సముద్ర నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా దేవరకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయమైన విషయం నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవరలోని ఓ డైలాగ్ లీక్ అయినట్లు సమాచారం. 'సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా.' అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ డైలాగ్ వింటే ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. దేవర ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. Actress Mani Chandana garu has started dubbing for #Devara, She is playing #JanhviKapoor's mother role in the film ❤️సాదా సీదా మగాళ్ళు కావాలా...ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా...! 🔥🔥🔥#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/WcbbRVJ0kk— Dhanush🧛 (@Always_kaNTRi) July 10, 2024 -
నీట్ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్ పేపర్ తయారు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.అయితే వాయిదా వేసిన ఆ పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ప్రశ్నాపత్రాన్ని రెండు గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. తాజాగా,నీట్ పీజీ పరీక్షను కేంద్రం నిర్వహించనుందని పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.అంతేకాదు ఈ పరీక్షలను ఆరోగ్య,కుంటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుందని తెలుస్తోంది. -
నీట్ యూజీ -2024 రీటెస్ట్.. 750 మంది విద్యార్ధుల గైర్హాజరు!
సాక్షి,న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ-2024 పేపర్ లీకేజీలో మరో కీలక మలుపు తిరిగింది. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు తిరిగి ఆదివారం నీట్ పరీక్ష నిర్వహించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నీట్ యూజీ -2024 రీటెస్ట్ నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. 1563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరైతే, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్‌లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్‌గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్‌ను నిర్మించారు. త్వరలోనే రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్‌లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
యూపీ బోర్డు పేపర్ లీక్ ప్రధాన నిందితుడు అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ల ఫోటోలను నిందితుడు వినయ్ వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 29న యూపీ బోర్డు సెకండ్ షిఫ్ట్ పరీక్షలో 12వ తరగతికి చెందిన రెండు పేపర్లు లీక్ అయ్యాయి. ఆగ్రాలోని శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ చౌదరి 12వ తరగతి బయాలజీ, మ్యాథమెటిక్స్ పేపర్ ఫొటోలను ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడు. 12వ తరగతి పేపర్ లీక్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పేపర్ లీక్ అయిన ఆగ్రాలోని సదరు కళాశాల గుర్తింపును రద్దు చేశారు. యూపీ బోర్డు సమావేశంలో శ్రీ అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ రోజౌలీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ చౌదరి, స్కూల్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజేంద్ర సింగ్, అదనపు సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గంభీర్ సింగ్, స్టాటిక్ మేజిస్ట్రేట్ గజేంద్ర సింగ్‌లపై ఫిబ్రవరి 29 న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సెంటర్ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసి, జైలుకు తరలించారు. -
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరి అరెస్ట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గతంలో గేమ్ చేంజర్ సినిమాలోని ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాంగ్ లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు. అయితే దీపావళి సందర్బంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఈ పాటను దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపించనుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్‌లో కనిపించడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. అయితే ప్రింట్‌ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు వద్దు
పంజగుట్ట: ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇది సీఎంకు తగదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే దాదాపు 15 పేపర్లు లీక్ అయ్యాయని ధ్వజమెత్తారు. ఇప్పటికీ లీకేజీ అసలు బాధ్యులను గుర్తించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు కాబట్టే విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థులు, పలు పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘గ్రూప్ 2 వాయుదాకై నిరుద్యోగుల విన్నపం’ పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరామ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ గురుకుల టీచర్ల పరీక్షల నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. దీనివల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు ఆదివారం వరకు వేచి ఉండి అప్పటికీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే అన్ని లైబ్రరీల్లో, యూనివర్సిటీల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్నారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్నారు. -
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
ది కేరళ స్టోరీ నటికి బిగ్ షాక్.. ఆ వివరాలు లీక్ చేసిన నెటిజన్!
ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. తాజాగా ఇటీవల రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి. విపుల్ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. (ఇది చదవండి: 'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్ సినిమా రికార్డ్ బ్రేక్!) తాజాగా ఆదా శర్మకు మరో షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఆమె వ్యక్తిగత వివరాలను లీక్ చేశారు. అదా శర్మ ఫోన్ నంబర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన తర్వాత అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. అయితే ఆదా శర్మ వివరాలు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ యూజర్ అకౌంట్‌ను వెంటనే డీ యాక్టివేట్ చేశారు. అంతే కాకుండా ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను లీక్ చేస్తానని బెదిరించినట్లు సమాచారం. (ఇది చదవండి: ఉపాసనకు ప్రెగ్నెన్సీ.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్!) కాగా.. ఆదా శర్మ, దర్శకుడు సుదీప్తో సేన్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ది కేరళ స్టోరీ బృందం కరీంనగర్లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉండగా.. రోడ్డు ప్రమాదం జరగడంతో విరమించుకున్నారు. ఈ విషయాన్ని ఆదా శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. -
ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్‌కు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ట్విటర్ సోర్స్ కోడ్ ఆన్లైన్లో లీక్ అయిందన్న తాజా అంచనాలు కలకలం రేపాయి. 44 బిలియన్డాలర్లతో సంస్థను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక సవాళ్లను మధ్య నెట్టుకొస్తున్న మస్క్‌కు ఇది మరో సవాల్ అని నిపుణులు భావిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ GitHub నుండి లీక్ అయిన సమాచారాన్ని తీసివేసేలా ట్విటర్ చట్టపరమైన చర్య తీసుకున్న తర్వాత ఈ కోడ్ లీక్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కోడ్‌లో భద్రతా లోపాలు హ్యాకర్లకు వినియోగదారు డేటాను దొంగిలించడానికి లేదా సైట్‌ను తీసివేయడానికి అవకాశం ఇస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకైన్ సోర్స్ కోడ్‌లో ట్విటర్, ఇంటర్నల్ టూల్స్ ప్రాపర్టీ సోర్స్ కోడ్ ఉంది, అయితే ఇది ట్వీట్లను సిఫార్సు చేసే సోర్స్ కోడ్ లీక్‌లో భాగమేనా అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. (మస్క్ కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్!) దీనికి సంబంధించి కాలిఫోర్నియాలోని నార్తర్న్ కోర్ట్‌లో దాఖలైన ఫిర్యాదు మేరకు అనుమతి లేకుండా దాని సోర్స్ కోడ్ స్నిప్పెట్లను షేర్ చేసిన తర్వాత GitHubకి నోటీసు లిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘన నోటీసు తర్వాత కంటెంట్‌ను తక్షణమే తీసివేయడానికి GitHub అంగీకరించింది, అయితే కోడ్ ఆన్లైన్లో ఎంతకాలం ఉందో అస్పష్టంగా ఉంది. డేటాను షేర్ చేసిన యూజర్ పేరు “FreeSpeechEnthusiast” గా తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారంపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. గత ఏడాది మస్క్ ట్విటర్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ట్వీట్లను సిఫార్సుకుఉపయోగించే కోడ్ మార్చి 31న ఓపెన్ సోర్స్ చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు ట్విటర్ విలువ దాదాపు సగానికి పడిపోయిందని అంగీకరించిన మస్క్, యూజర్లకు బ్లూ సబ్స్క్రిప్షన్, ప్రకటనదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్? షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, ముంబై: మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చూస్తోంది. గత ఏడాది లాంచ్ చేసిన స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో వాటర్ లీక్ అవుతున్న వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో 1 రోజు క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 4.7 మిలియన్ల వ్యూస్‌ని సంపాదించింది. యూట్యూబర్ అరుణ్ పన్వార్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ కారులో నీరు ఎలా లీక్ అయ్యిందో చూపించే వీడియోను షేర్ చేశారు. కొండల్లో ప్రయాణిస్తుండగా ఓ జలపాతం తనకు ఈ అనుభవం ఎదురైందని వీడియోలో చెప్పాడు. తన కారును జలపాతం కింద కడగాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ కారును పార్క్ చేసే ముందు డ్రైవర్ సన్‌రూఫ్‌ను మూసివేసినా కూడా సన్‌రూఫ్, స్పీకర్ల ద్వారా కారులోకి నీరు లీక్ అయిందని, కారు లోపల పాడైపోయిందని పేర్కొన్నాడు. వీడియోలో, రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు, క్యాబిన్ ల్యాంప్ ద్వారా క్యాబిన్ లోపల నీరు పారుతూ ఉండగా, సన్‌రూఫ్ మూసి ఉందా లేదా అని రెండు సార్లు నిర్ధారించుకున్నట్టు కనిపిస్తోంది ఈవీడియోలో. (ఆర్ఆర్ఆర్ మేనియా: రామ్ చరణ్‌పై ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!) అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీప్ మెరిడియన్ని చాలాసార్లు ఇలా కడిగాను కానీ ఇలా ఎపుడూ కాలేదని ఒకరు కమెంట్ చేయగా, అలాంటిదేమీ లేదు.. ఉద్దేశపూర్వకంగా అతగాడు సన్‌రూఫ్‌ను కొద్దిగా తెరిచి ఉంచాడని భావిస్తున్నానంటూ మరొకరు కామెంట్ చేయడం గమనార్హం. (బిజినెస్ క్లాస్ ప్యాసింజర్‌కి షాక్, ట్వీట్ వైరల్: ఎయిరిండియా స్పందన) అయితే కంటెంట్ కోసం అతను నిజంగానే అలా చేశాడా? అసలు ఏమైంది? సన్‌రూఫ్ ఎందుకు లీక్ అయ్యింది, సన్‌రూఫ్ లీక్ ప్రూఫ్‌గా ఉండే రబ్బరు సీల్ ఉందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలపై మహీంద్ర అధికారికంగా స్పందించాల్సి ఉంది. (గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం ) View this post on Instagram A post shared by Arun Panwar (@arunpanwarx) -
చైనీస్ ల్యాబ్ లీక్ వల్లే కరోనా సంభవించింది: యూఎస్ నివేదిక
కరోనా పుట్టినిల్లు చైనా అంటూ ప్రపంచ దేశాలన్ని నిందించిన సంగతి తెలిసిందే. పైగా ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇప్పుడు తాజాగా యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సైతం కరోనా మహమ్మారి చైనా ల్యాబ్ నుంచే లీక్ కారణంగానే సంభవించిందని తేల్చి చెప్పింది. ఐతే ఈ విషయమై అమెరికన్ ఇంటిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా ఉద్భవించిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొంది ఎనర్జీ డిపార్ట్మెంట్. అదీగాక డిపార్ట్‌మెట్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ఈ విషయంపై వివిధ ఏజెన్సీలు వేరువేరుగా తమ నివేదికలను ఇచ్చాయి. ఐతే ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రయోగశాల దుర్ఘటన ఫలితంగానే ఈ మహమ్మారి సంభవించిందంటూ ఫెడరల్ ఇన్విస్టేగేషన్ సరసన నిలిచింది. ఇదిలా ఉండగా, నాలుగు ఏజెన్సీలు కోవిడ్ సహజంగానే ఉద్భవించిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ నొక్కి చెప్పారు. దీనిపై ప్రస్తుతం కచ్చితమైన సమాధానం ఇంటిలిజెన్సీ విభాగాల నుంచి రాలేదని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మూలల గురించి వెల్లడించే వరకు తమ పరిశోధనలు కొనసాగిస్తామని ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. శాస్త్రీయపరంగా మెరుగ్గా ఈ వైరస్‌పై పోరాడటానికి, నిరోధించటానికి ఈ కరోనా మహమ్మారి మూలాన్ని గుర్తించడం అత్యంత కీలకం. (చదవండి: ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం) -
షావోమి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఫోటోలు లీక్, లుక్ మాములుగా లేవుగా!
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావోమీ తొలి ఎలక్ట్రిక్ కారుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్లోబల్‌గా అరంగేంట్రం చేయనున్న ఈ ఈవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చైనాలో ఈవీ మార్కెట్ చాలా పోటీ ఉంది. దీంతో షావోమీ కారుకు మరింత ప్రాధాన్యతను సంతరించు కుంది. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో తీసుకొస్తున్న సెడాన్ డిజైన్, లుక్ ఆకర్షణీయంగా మారింది. ఇది పోర్షే టైకాన్తో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ సంస్థ బీవైడీకి చెందిన సియెల్ ఎలక్ట్రిక్ సెడాన్ తరహాలో షావోమి ఈవీ డిజైన్ ఉండనుందని అంచనా. అంతేకాదు కారు ముందు భాగంలో LiDAR సెన్సార్ ఆధారంగా ఇది అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యాలతో వస్తోందని కూడా భావిస్తున్నారు. షావోమీ 4 డోర్ ఎంఎస్11 చాలా ఆకర్షణీయమైన సెడాన్ అని సోషల్ మీడియా ప్రశంసిస్తోంది. స్పోర్టీగా కనిపించే 4-డోర్ల ఎలక్ట్రిక్ వాహనంలో విండ్‌షీల్డ్ పెద్దగా ఉండి, పైకప్పు మొత్తం ఒక సింగిల్ పేన్ గ్లాస్‌తో టెస్లా మోడల్‌లలో కని పిస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లాయ్ వీల్స్ అమర్చింది. ఈ వీల్స్ మధ్యలో "షావోమీ’’ బ్రాండ్ లోగో కనిపిస్తోంది. తుదిమెరుగులు దిద్దుకున్న షావోమీ ఈవీ టెస్టింగ్‌ను కూడా చైనా రోడ్లపై ఇప్పటికే నిర్వహించిందట. రూ. 1.2కోట్ల ఫైన్..! అయితే తొలి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫోటోలు ఆన్లైన్ లీక్ కావడంపై షావోమీ సీరియస్‌గా స్పందించింది. బీజింగ్‌కు చెందిన మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ అనే వెండర్ ద్వారా ఈ ఫొటోలు లీక్ అయినట్టు గుర్తించారు. ఈ లీక్‌ను ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదని సీఈఓ లీ జున్ మండిపడ్డారు. అలాగే సెక్యూరిటీ బ్రీచ్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించారు. సంస్థపై 1 మిలియన్ యువాన్ల ( దాదాపు. రూ.1.22కోట్లు) జరిమానా విధించనుందట షావోమీ. -
నిర్మాత దిల్‌రాజు కొడుకును చూశారా? ఫోటో వైరల్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. ఆయన సతీమణి తేజస్విని ఈ ఏడాది జూన్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దిల్‌రాజు ఇప్పటివరకు తన కొడుకు ఫోటోను రివీల్ చేయలేదు. అయితే తాజాగా దిల్‌రాజు వారసుడి ఫోటో నెట్టింట లీక్ అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్ దిల్‌రాజు కొడుకును ఎత్తుకున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వంశీ పైడిపల్లి దర్శక్తవం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో దిల్‌రాజు ఇంటికి వచ్చిన విజయ్ ఆయన కొడుకును ఎత్తుకొని ఆడించారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స చేస్తున్నారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మాస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. -
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 2778×1244 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్‌కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్‌పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
రామారావు ఆన్‌డ్యూటీ సీన్స్ లీక్...
-
లీకైన రణ్‌బీర్, రష్మిక ఫోటోలు.. నెట్టింట వైరల్
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సినిమా యానిమల్. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మనాలీలో పూజ కార్యక్రమాలతో ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి స్థానిక యంత్రాంగం మూవీ టీంకు ఘన స్వాగతం పలికింది. అయితే యానిమల్ షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే రణ్‌బీర్, రష్మికల ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రణ్‌బీర్ వైట్ కుర్తాలో కనిపించగా, రష్మిక వైట్ అండ్ రెడ్ చీరలో తళుక్కుమంది. ఇక ఈ చిత్రంలో రష్మిక గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది. యి. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. Video: Ranbir Kapoor & Rashmika Mandanna spotted in Manali today. 👀🤍#Animal #SandeepReddyVanga pic.twitter.com/5uu5DMIkMz — Ranbir Kapoor Universe (@RanbirKUniverse) April 23, 2022 -
'సర్కారువారి పాట' సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్
Two Persons Arrested For SVP Song Leak: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకువీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో షాక్‌కి గురైన మేకర్స్ రంగంలోకి దిగారు. పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్లైన్ లీక్ నేపథ్యంలో నేడు(ఆదివారం)అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు. -
శ్రీరామచంద్ర ఇమేజ్ను డామేజ్ చేస్తున్న వాట్సాప్ చాట్
Sri Reddy and Sreerama Chandra Whatsapp Chat: నటి శ్రీరెడ్డి టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు పెద్దమనుషుల భాగోతాలను బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర తనతో చేసిన వాట్సాప్ చాట్‌ను కూడా లీక్ చేసింది. 'చూడండి ఇండియన్ ఐడల్ చాట్.. షేమ్ ఆన్ యూ శ్రీరామ్' అంటూ అతడి గుట్టు రట్టు చేసింది. ఇద్దరూ సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా బయటపెట్టింది. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం శ్రీరామచంద్ర బిగ్‌బాస్ సీజన్-5లో కంటెస్టెంటుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామ్ అంటే గొట్టని వాళ్లు, ఇతర కంటెస్టెంట్ల ఫాలోవర్లు ప్రస్తుతం దీన్ని ఆయుధంగా చేసుకొని శ్రీరామ్‌ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఇది శ్రీరామచంద్రుడి భాగోతం..అతడికి సపోర్ట్ చేయకండి అంటూ సోషల్ మీడియాలో అతనిపై విషం చిమ్ముతున్నారు. కండబలంతోపాటు బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా శ్రీరామచంద్ర తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో వాట్సాప్ చాట్ మరోసారి తెరమీదకి రావడం అతని ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందంటూ శ్రీరామ్ ఫాలోవర్స్ మండిపడుతున్నారు. మరోవైపు శ్రీరామచంద్రకు తమ మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. -
ఫేస్బుక్ ‘టెర్రర్’ వార్నింగ్..! పలు డాక్యుమెంట్లు లీక్..!
Facebook Secret List Leaked By Intercept: ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్స్, వ్యక్తులపై ఫేస్బుక్ కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థలను గుర్తించడానకి ఫేస్బుక్ మూడంచెల వ్యవస్థను కల్గి ఉంది. టెర్రరిస్ట్ , ద్వేషపూరిత గ్రూప్స్, క్రిమినల్ ఆర్గనైజేషన్ గ్రూప్‌లను ఫేస్బుక్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు ఇంటర్సెప్ట్ పేర్కొంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... ఇండియాలో నాలుగువేలకు పైగా... ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్స్, వ్యక్తులపై, తీవ్రవాద సంస్థలపై ఫేస్బుక్ కఠిన చర్యలను తీసుకుంటుంది. సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ సుమారు 4 వేలకు పైగా గ్రూప్స్‌ను, వ్యక్తుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ తన ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించని 'ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల(‘Dangerous Individuals and Organizations’)' జాబితా డాక్యుమెంట్లను ఇంటర్సెప్ట్ మంగళవారం రోజున లీక్ చేసింది. వీటిలో ఇండియన్ ముజాహిదీన్, జైషే-ఇ-మహమ్మద్, తాలిబన్లకు, సంబంధించిన గ్రూప్స్ ఇందులో ఉన్నాయి. ఇంటర్సెప్ట్ ద్వారా విడుదల చేయబడిన బ్లాక్లిస్ట్పై ఫేస్బుక్ స్పందించలేదు. సోషల్ మీడియానే ఆయుధంగా...! నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌మీడియా ఒక పదునైన ఆయుధం. సోషల్ మీడియాను సరైన దారిలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..అదే చెడు దారిలో వాడితే ఊహించలేని పర్యావసనాలు ఎదురవుతయ్యాయి. పలు ఉగ్రవాద సంస్థలు సోషల్‌మీడియాను ఒక ఆయుధంగా మార్చుకుంటూ తమ భావజాలాన్ని ముందుకు తీసుకేళ్తున్నారు. పలు సోషల్‌మీడియా సంస్థలు ప్రజాస్వామ్య పద్దతులకు వ్యతిరేకంగా ఉన్న గ్రూప్‌లను, పేజీలను గుర్తించి వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంటాయి. చదవండి: చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..! -
వైరల్ : బాయ్‌ఫ్రెండ్‌తో నటి ప్రైవేట్ వీడియో లీక్
పాట్నా : ప్రముఖ భోజ్‌పురి నటి త్రిషకర్ మధు ప్రైవేటు వీడియో లీకైంది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్ చేసింది. అయితే వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికే మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు ఆ తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్‌లో నటించి పాపులర్ అయ్యింది. -
నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ తన పర్సనల్ మొబైల్ నంబర్ లీక్ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ నా మొబైల్ నంబర్ లీక్ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 దీంతో పాటు సిద్ధార్థ్ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీశారు. వాటిని తన ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్ నంబర్ని లీక్ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్. My phone number was leaked by members of TN BJP and @BJPtnITcell Over 500 calls of abuse, rape and death threats to me & family for over 24 hrs. All numbers recorded (with BJP links and DPs) and handing over to Police. I will not shut up. Keep trying.@narendramodi @AmitShah — Siddharth (@Actor_Siddharth) April 29, 2021 ఇక సిద్ధార్థ ట్వీట్‌పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్ మీడియాలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్ -
ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి
సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత పట్టి పీడిస్తోంది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ఆసుపత్రి వద్ద జరిగిన షాకింగ్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆక్సిజన్ నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. మరింత సమాచారం సేకరించిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. (పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్) The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour. — Narendra Modi (@narendramodi) April 21, 2021 మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నాసిక్ సంఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. మరోవైపు నాసిక్ విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసులు 38,98,262కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరుకుంది. చదవండి : సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్ -
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్!
ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు. ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. చదవండి : బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్ డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
వన్‌ప్లస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
బీజింగ్: చైనా మొబైల్ సంస్థ వన్‌ప్లస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్ అయిందంటూ బాంబు పేల్చింది. "అనధికార పార్టీ" ద్వారా కస్టమర్ల డేటా లీకైందని వెల్లడించింది. ఈ మేరకు తన వినియోగదారులకు సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితమయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు. వన్‌ప్లస్ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేశారని తెలిపింది. ముఖ్యంగా కస్టమర్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లు, ఇమెయిల్, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్వర్డ్లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ డేటా బ్రీచ్ మూలంగా కొంతమందికి స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్ రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారమే డేటా లీక్ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు సంస్థనుంచి అధికారిక ఇమెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితమనే విషయాన్ని గమనించాలని వన్‌ప్లస్ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వన్‌ప్లస్ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్ సీ ఒక ప్రకటనలో తెలిపారు. -
అంతర్వేదిలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీకేజీ
-
న్యూ ఐఫోన్ ఫీచర్లు హల్చల్
మొబైల్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తోంది. భవిష్యత్ ఐపోన్లను ట్రిపుల్ రియర్ కెమెరాలతో తీసుకురానుందని తాజా సమాచారం. హువావే తరహాలో తన నూతన ఐఫోన్లలో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను జోడించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన కొత్త ఐఫోన్ 11 ఇమేజ్‌లు ప్రస్తుతం నెట్లో లీకయ్యాయి. హువావే మేట్ 20 ప్రొ బాటలో యాపిల్ తరువాతి తరం ఐఫోన్లలో ట్రిపుల్ బ్యాక్ కెమెరాలను అందివ్వనున్నట్లు సమాచారం. ఐఫోన్ ఎక్స్‌ఎస్‌లో డ్యుయల్ కెమెరాలను జోడించిన సంస్థ ఇపుడిక ట్రిపుల్ కెమెరాలతో ఫ్లాగ్షిప్ ఫోన్లను తీసుకురానుంది. అలాగే మూడో కెమెరా 3డీ ఇమేజ్‌లకు సపోర్ట్‌ను ఇవ్వనుందట. ప్రస్తుతం పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 3డీ ఆప్షన్‌ను కెమెరాలకు ఇస్తున్నాయి. అదే కోవలో యాపిల్ చేరనుంది. అలాగే కొత్త ఐఫోన్లను 2019, సెప్టెంబరు నాటికి అందివ్వనున్నట్లు సమాచారం. కాగా తాజా లీకులపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి వుంది. Back from September 2019, I bring you the very 1st and very early glimpse at which I guess #Apple will unveil as #iPhoneXI!!! Yes, time has already come to meet the new #iPhone through gorgeous 5K renders made on behalf of new coming Partner @digitindia -> https://t.co/b6SxFUS2tx pic.twitter.com/97jrlTHQ5G — Steve H.McFly (@OnLeaks) January 6, 2019 -
నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తన హవాను చాటుకునేందుకు మరో ఫ్లాగ్షిప్ కెమెరాతో సిద్ధమవుతోంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'నోకియా 9' స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ 2019లో విడుదల లాంచ్ చేయనుంది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఏకంగా 5 కెమెరాలతో ఇది వినియోగదారుల ముందుకు రానుంది. తాజాగా సోషల్ మీడియా (ఇన్స్టాగ్రామ్) లో హల్ చల్ చేస్తున్న సమాచారం ప్రకారం 'నోకియా 9' స్మార్ట్‌ఫోన్ 5 రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9పై, గ్లాస్ బ్యాక్‌తో ఈ ఫోన్ రానుంది. మిగతా ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. 6 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 845 సాక్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4150 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే కెమెరా ఉత్పత్తిలో సమస్య కారణంగా ఇప్పటివరకూ ఫోన్ విడుదలను వాయిదా వేస్తూ వచ్చిన సంస్థ కొత్త సంవత్సరంలో యూజర్లకు కొత్త ఏడాది కానుకగా 2019 ఆరంభంలో తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై సస్పెన్స్ వీడాలంటే లాంచింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎల్లెల్సీకి మళ్లీ గండి
కర్నూలు, ఆదోని/హొళగుంద/హాలహర్వి/ మంత్రాలయం: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కు మళ్లీ గండి పడింది. కర్ణాటకలోని 60.8 కి.మీ. వద్ద కురుగోడు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కాలువకు గండి పడినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఎగువనున్న ఎస్కేప్ చానల్ ఎత్తి కురుగోడు వాగుకు నీటిని వదిలేశారు. దీంతో కురుగోడు వాగు చెరువును తలపించింది. అక్కడి రైతులు కొందరు చెరువులు, వంకలు, వాగులను నింపుకునేందుకే అర్ధరాత్రి కాలువ గట్టుకు గండి పెట్టి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న తుంగభద్ర జలాశయం సమీపంలో 8.4 కి.మీ. వద్ద రక్షణ గోడ కుప్పకూలడంతో దాదాపు 12 రోజుల పాటు ఎల్లెల్సీకి నీటి సరఫరా నిలిచిపోయింది. గోడ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 7న నీటి సరఫరాను పునరుద్ధరించారు. మూడు రోజుల క్రితం నీరు బోర్డు సరిహద్దుకు చేరింది. పునరుద్ధరించిన నీటి సరఫరా ఇంకా పూర్తి స్థాయికి చేరుకునే లోగానే మళ్లీ కాలువకు గండి పడడంతో ఎల్లెల్సీ రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బోర్డు కార్యదర్శి నాగమోహన్, ఎస్ఈ రమణ, ఈఈ విశ్వనాథ్‌రెడ్డి గండి పడిన చోటుకు చేరుకున్నారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేస్తామని ఎస్ఈ రమణ తెలిపారు. ఆదోని దిగువ కాలువ ప్రాజెక్ట్ నం.2 డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి, జేఈ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. మూడు రోజుల్లో గండిని పూడ్చి వేసినా జిల్లాకు నీరు చేరేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని డీఈఈ విశ్వనాథ్‌రెడ్డి చెప్పారు. గండిపై ఎన్నో అనుమానాలు గండి పడిన చోట కాలువ గట్టు దాదాపు 30 అడుగుల వెడల్పుతో ఎంతో పటిష్టంగా ఉంది. రెండేళ్ల క్రితం గట్టునుసీసీ లైనింగ్‌తో ఆధునికీకరించారు. దీంతో సహజ గండి పడేందుకు దాదాపు అవకాశాల్లేవు. దీంతో కర్ణాటక రైతులే గండి కొట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురుగోడు సమీపంలో ఓ పెద్ద చెరువు ఉంది. కురుగోడు చెరువు, వంక, తుంగభద్ర నది ఆధారంగా రైతులు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువు, వంకకు నీటి సమస్య నెలకొనడం, తుంగభద్రలోనూ ప్రవాహం నిలిచిపోవడంతో వరి పంట ఎండుముఖం పట్టింది. దాన్ని రక్షించుకోవడానికి కాలువకు గండి పెట్టి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కూడా ఇవే అనుమానాలు ఉండడంతో కురుగోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని బోర్డు ఈఈ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు. బోర్డు అధికారుల నిర్లక్ష్యం! జలాశయం సమీపంలో 8.4 కి.మీ. మలుపు వద్ద ఓ వాగుకు నిర్మించిన రక్షణ గోడ దాదాపు శిథిలదశకు చేరుకుంది. గత ఏప్రిల్ నుంచి దాదాపు నాలుగు నెలల పాటు కాలువకు నీటి సరఫరా లేదు. ఆ సమయంలో బలహీనంగా మారిన రక్షణ గోడను కూల్చివేసి.. కొత్తది నిర్మించి ఉంటే నీటి సరఫరాలో అంతరాయం ఉండేది కాదని దిగువ కాలువ రైతులు అంటున్నారు. తమ గురించి బోర్డు అధికారులు అసలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము ఏ ఏడాది పంట భూములను బీడుగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారిన సాగు దిగువ కాలువకు జూలై 22న నీటి సరఫరా ప్రారంభమైంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగలేదు. బోర్డు సరిహద్దు 250 కి.మీ. హానువాళు వద్ద 600 క్యూసెక్కులు నీరు సరఫరా చేయాలని జిల్లా సాగునీటి శాఖ అధికారులు బోర్డుకు ఇండెంట్ పెట్టారు. అయితే 200 నుంచి 400 క్యూసెక్కుల వరకు మాత్రమే సరఫరా అవుతోంది. దీనికి తోడు రక్షణ గోడ కూలి 12 రోజులు, ఇప్పుడు కురుగోడు వద్ద గండితో మరోసారి నీటి సరఫరా నిలిచిపోయింది. కాలువ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలలో ఖరీఫ్‌లో 42,420 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇందులో ఇప్పటి వరకు 16వేల ఎకరాలలో మాత్రమే వరి నాట్లు వేశారు. మిగిలిన ఆయకట్టు భూములు బీడుగా ఉన్నాయి. రాష్ట్ర వాటా మేరకు నీటి సరఫరా జరగకపోవడం, గండ్లు పడుతుండడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు, కోడుమూరు సబ్డివిజన్లకు చుక్క నీరు చేరలేదు. ఈ సబ్ డివిజన్లలో నేటికీ ఎకరాలో కూడా వరి నాట్లు పడలేదు. ఎగువనున్న ఆలూరు, ఆదోని నియోజకవర్గాలలోని చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు అందడం లేదు. -
గీత గోవిందం సినిమా కేసును ఛేదించిన పోలీసులు
-
నిర్మల్ జిల్లా మోడల్ కాలనీలో లీకైన పైప్ లైన్
-
వాట్సాప్ లీక్‌లపై త్వరలో సెబీ చర్యలు
న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా కంపెనీల విషయాలు లీక్ అయిన కేసులో మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ త్వరలో చర్యలు తీసుకోనున్నది. వాట్సాప్ లీక్‌లతో సంబంధమున్న డజనుకు పైగా బ్లూచిప్ కంపెనీలు, ఈ కంపెనీల సంబంధిత ఉన్నతాధికారులు, మార్కెట్ ఆపరేటర్లు, బ్రోకరేజ్ సంస్థల ఉద్యోగులపై సెబీ చర్యలు తీసుకోనున్నది. కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకముందే వాట్సాప్ ద్వారా లీక్ కావడం, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయడం తెలిసిందే. కంపెనీలకు సంబంధించిన కీలక విషయాలు బయటకు పొక్కకుండా నియంత్రించే విషయంలో విఫలమైనందుకు ఈ కంపెనీలపై తీవ్రమైన చర్యలే ఉండనున్నాయని సెబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా లీక్ అయిన సమాచారం ఆధారంగా ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి అక్రమ లాభాలు ఆర్జించిన అనుమానిత వ్యక్తులపై కూడా సెబీ దర్యాప్తు జరిపిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లో పరిశోధించిన వివరాలను క్రోడీకరిస్తోందని, దర్యాప్తు దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
హెచ్‌టీసీ యూ12ప్లస్ లీక్: మే 23న లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: తైవాన్ మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ మరో ఆకర్షణీయమైన ఫోన్‌ను లాంచ్ చేయనుంది. హెచ్‌టీసీ యూ12 ప్లస్ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఏడాదిలో తొలి ఫ్లాగ్‌షిప స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న యూ12 ప్లస్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 128 జీబీ వేరియంట్ సుమారు రూ.54, 000- 56,300 మధ్య లభ్యం కానుంది. అలాగే 64జీబీ వేరియంట్ ధర 49,500-51,800రూపాయల మధ్య ఉంటుందని అంచనా. హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు 6 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12+16ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 8+8 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3420 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాట్సాప్‌లో ‘పది’ ప్రశ్నాపత్రం.. అలజడి
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది. జిల్లాలోని బద్వేల్లో శనివారం జరుగుతున్న టెన్త్ క్లాస్ హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశ్నాపత్రం లీక్‌పై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
వాట్సాప్ లీక్‌లపై ‘సెబీ’ సీరియస్
ముంబై: వాట్సాప్ లీక్‌ల విషయాన్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్(సెబీ) తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ విషయమై తీవ్రంగానే దర్యాప్తు జరుగుతోందని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. మరోవైపు ఐపీఓకు వచ్చిన కంపెనీల స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సమయాన్ని ప్రస్తుతమున్న ఆరు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఇలా లిస్టింగ్ సమయాన్ని తగ్గించడం వల్ల ప్రైమరీ మార్కెట్ మరింత సమర్థవంతంగా ఉంటుందని వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల అవగాహన పెరుగుతోందని, ఫండ్స్‌లో మదుపు చేసే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సదస్సులో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. వివరాలు.. వాట్సాప్ లీక్‌లు.. లిస్టెడ్ కంపెనీల కీలకమైన ఆర్థిక సమాచారం అధికారికంగా వెల్లడికాక ముందే సోషల్ మీడియా(వాట్సాప్) ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చిన ఉదంతాన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నామని అజయ్ త్యాగి చెప్పారు. కొన్ని కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాల వివరాలు అధికారికంగా వెలువడకముందే వాట్సాప్‌లో కొందరు వ్యక్తులు సర్క్యులేట్ చేశారని త్యాగి నిర్ధారించారు. దీనిని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేసే ఆర్థిక ఫలితాలు ముందుగానే వాట్సాప్‌లో లీక్ కావడం పట్ల తాము చూస్తూ ఊరుకోబోమని వివరించారు. కాల్ రికార్డ్ల పరిశీలన... వాట్సాప్ ద్వారా దాదాపు 24 కంపెనీల క్యూ2 ఫలితాలు ముందుగానే వెల్లడైన విషయమై సెబీ, స్టాక్ ఎక్సే్చంజ్‌లు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఈ 24 కంపెనీల షేర్ల లావాదేవీల వివరాలను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్లు పరిశీలిస్తున్నాయని వివరించారు. ఈ వాట్సాప్ లీక్‌లతో ప్రమేయం ఉన్న, ఈ లీక్‌లను సర్క్యులేట్ చేసిన వ్యక్తుల కాల్ డేటా రికార్డ్లను కూడా పరిశీలించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యక్తులతో సంబంధమున్నట్లు తేలితే బ్రోకరేజ్ సంస్థలు, కంపెనీలను కూడా స్పష్టత కోరతామని త్యాగి పేర్కొన్నారు. వాట్సాప్ లీక్‌ల దర్యాప్తు విషయమై సెబీతో కలిసి పనిచేస్తున్నామని ఇదే ఈవెంట్లో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ లిమాయే చెప్పారు. వాట్సాప్ లీక్‌ల వ్యవహారం గత నెల 17న వెలుగులోకి వచ్చింది. కొన్ని కంపెనీల క్యూ2 ఫలితాలు ఆయా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు వెల్లడించకముందే కొన్ని వాట్సాప్ గ్రూప్‌లో సర్క్యులేట్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, తదితర కంపెనీల డేటా ఇలా వాట్సాప్ ద్వారా లీకయింది. కాగా ఈ ఏడాది ఐపీఓ మార్కెట్ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. గత ఆరేళ్లలో ఐపీఓల ద్వారా ఎన్ని నిధులు వచ్చాయో, అంతకు మించి ఈ ఏడాది ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ జరిగిందని వివరించారు. -
మోటో స్పెషల్ స్మార్ట్‌ఫోన్ త్వరలో..
లెనోవా సొంతమైన మోటరోలా కంపెనీ త్వరలోనే ఈ ఏడాదిలో తన మూడవ డ్యూయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారం మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో ఎక్స్4' పేరుతో నెల 24వ తేదీన విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ బాడీ, ఫింగర్‌ప్రింట్ ఫీచర్స్‌తో సూపర్ బ్లాక్ లేదా స్టెర్లింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. ఐరోపా, ఉత్తర అమెరికా, ఈ మోటా ఎక్స్ 4 ఫోన్ 3 జీబి ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్గాను, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 4 జీబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తోను రానుంది. అంతేకాదు డిజిటల్ టీవీ ఆప్షన్, స్పెషల్ హైబ్రిడ్ ఎస్‌డీకార్డును పొందుపర్చినట్టు తెలుస్తోంది. మోటో ఎక్స్ 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. మోటో ఎక్స్4 ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 12, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ -
గేమ్ ఆఫ్ థ్రాన్స్ అభిమానులకు చేదువార్త
గేమ్ ఆఫ్ థ్రాన్స్ అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్. ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటి వరకూ ఆరు సిరీస్‌లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. అయితే ఈ సీరియల్ అభిమానులు ఇప్పుడు ట్విట్టర్లో హాట్‌స్టార్ యాజమాన్యంపై రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళ్తే సీజన్7 ఇప్పటికే అభిమానులను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈసిరీస్ భారత్‌లో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటి మూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న గేమ్స్ ఆఫ్ థ్రాన్స్ నాలుగో ఎపిసోడ్ ఆగస్టు 7, సోమవారం ప్రసారం కావాల్సి ఉంది. అయితే హాట్‌స్టార్ అప్లికేషన్ తప్పిదం వల్ల ఆన్లైన్లో లీకైంది. వీడియోను పైరసీ చేసి ఇంటర్నెట్, టోరెంట్లో అప్లోడ్ చేశారు. దీంతో గేమ్ ఆఫ్ థ్రాన్స్ అభిమానులు ట్వట్టర్లో రెచ్చిపోయారు. హాట్‌స్టార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. -
పరీక్ష పారదర్శకంగా నిర్వహించాం
-
విడుదలకు ముందే సినిమా లీక్
న్యూఢిల్లీ: స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న సినిమా ముందే ఆన్లైన్ లీకవడం కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛభారత్‌ను ప్రమోట్ చేస్తూ తెరకెక్కిన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' సినిమా సెకండ్ హాఫ్ మొత్తం లీకైంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా ధ్రువీకరించారు. అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్లు హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతని ఓ ప్రేమ కథ ద్వారా తెలియజెప్పారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే సమస్యలపై దర్శకుడు నారాయణ్ సింగ్ ఈ సినిమా ద్వారా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విడుదల కన్నా ముందుగానే సినిమా లీకవడం దర్శకుడు, నిర్మాతలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. -
గూగుల్ కొత్త ఫోన్లు లీక్: ఫీచర్లివేనట!
గూగుల్ తన సొంత బ్రాండులో గతేడాదే పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విజయవంతమైన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లకు సక్సెసర్ గా మరో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను గూగుల్ రూపొందిస్తుందని పలు రిపోర్టులు వచ్చాయి. వాటికి సంబంధించిన కోడ్ నేమ్స్ తైమెన్, ముస్కీ, వాల్లీలుగా పలు లీకేజీ వివరాలు ఆన్ లైన్ హల్ చల్ చేశాయి. తాజా రూమర్ల ప్రకారం ముస్కీ కోడ్ నేమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ ను గూగుల్ ఇప్పుడు రూపొందించడం లేదని, స్టాండర్డ్, పెద్ద సైజు వాల్లీ, తైమెన్ లపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారించిందనే సమాచారం చక్కర్లు కొడుతోంది. దీనిలో వాల్లీ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 2గా, తైమెన్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2గా టెక్ లీకేజీలు చెబుతున్నాయి. ఈ రెండు డివైజ్ ల స్పెషిఫికేషన్స్ వివరాలను ఎక్స్‌డీఏ డెవలర్లు సంపాదించారు. వారి రిపోర్టు ప్రకారం గూగుల్ పిక్సెల్2 స్మార్ట్ ఫోన్, 4.97 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, క్వాల్ కాల్ తాజా ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 835, 4జీబీ ర్యామ్ ఉన్నట్టు టాక్. స్టీరియో స్పీకర్లతో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అంచనా. అదేవిధంగా గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కూడా 5.99 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే, 1440పీ రెజుల్యూషన్, 128జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ కలిగి ఉండబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. డిజైన్ విషయంలో పిక్సెల్ ఎక్స్ఎల్2 స్మార్ట్ ఫోన్ టూ-టోన్ గ్లాస్, గ్లాస్ విండోతో పాటు మెటల్ ఫిన్నిష్ తో ఇది రూపొందుతుందని తెలుస్తోంది. ఎక్స్‌డీఏ లీక్స్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ 2 స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు కెమెరా ఉన్నట్టు తెలిసింది. అయితే పలు ఇతర రిపోర్టులు ఈ ఫోన్ కు డ్యూయల్ కెమెరా సెన్సార్ ను సూచిస్తున్నాయి. పలు స్టోరేజ్ వేరియంట్లతో ఇవి వినియోగదారులను అలరించనున్నాయట. -
పైపులు వీక్.. గ్యాస్ లీక్
ఒకే చోట ఏడు బావులు ధర్నాకు దిగిన గ్రామస్తులు అంతర్వేదికర (సఖినేటిపల్లి) : గ్రామంలోని రక్షణలేని ఓఎన్జీసీ బావులతోను, తుప్పుపట్టిన పైపులైన్లు, పైపుల జాయింట్‌లతోను ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావులు వద్ద శాశ్వత రక్షణ చర్యలు చేపట్టకపోవడం, తుప్పు పట్టిన జాయింట్లను తొలగించకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న సందర్భాల్లో సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, అటుపై వీటి గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా గ్యాస్ లీకేజీ .. గ్రామంలోని దిండమెరక, బెల్లంకొండ గ్రూపులకు సమీపంలో మంగళవారం ఉదయం కేవీ 10 బావి నుంచి లీకయిన గ్యాస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడ ఈ బావితో పాటు మరో ఆరు బావుల్లో ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. బావి ముఖ ద్వారం పైపు జాయింట్ నట్లు తుప్పు పట్టి ఊడిపోయి, గ్యాస్ బావి వద్ద నుంచి లీకవ్వడం గ్రామస్తులు బెంబేలెత్తి పోయారు. సుమారు 45 నిమిషాల పాటు లీకయిన ఈ గ్యాస్ బావులన్నింటినీ కమ్మేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్ సిబ్బంది బావి వద్దకు వచ్చి గ్యాస్ లీకేజీని అరికట్టారు. బావి వద్ద, మోరి జీసీఎస్ వద్ద గొట్టాలను మూసివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్నాకు దిగిన గ్రామస్తులు.. తరుచూ గ్రామంలోని బావులు వద్ద, పొలాల్లోని వెళ్లిన పైపుల నుంచి లీకవుతున్న గ్యాస్ వల్ల తమకు భద్రత లేకుండా పోయిందని గ్రామస్తులు ఏడు బావులున్న ఓఎన్జీసీ సైటులో ధర్నాకు దిగారు. గ్యాస్ లీకేజీలను ముందుగా పసిగట్టే ఆధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, గ్యాస్ లీకేజీల వల్ల దెబ్బతింటున్న పంటలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంకొండ నాని, రావి ఆంజనేయులు, చొప్పల బాబూరావు, చెన్నంశెట్టి సుబ్బారావు, బీ వెంకటేశ్వరరావు, బి.రాజు, తోట వెంకటేశ్వర్లు, రావి వాసు, శ్రీను, విష్ణు, బి. పద్మాజీరావు పాల్గొన్నారు. -
మహిళతో క్రికెటర్ ప్రైవేట్ వీడియో లీక్!
శ్రీలంక మాజీ కెప్టెన్, క్రికెటర్ సనత్ జయసూర్యకు చెందిన ఓ ప్రైవేట్ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మాజీ ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఈ వీడియో శ్రీలంకలో సంచలనంగా మారింది. క్రికెటర్‌గా ఉన్న సమయంలో జయసూర్యకు ఆమెతో పరిచయం ఏర్పడింది. కొద్దికాలం తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ మానసికంగా, భౌతికంగానూ దగ్గరయ్యారు. అయితే, కొన్ని విభేదాలతో ఒకరికొకరు దూరమయ్యారు. జయసూర్య నుంచి విడిపోయిన ఆమె ఓ బడా వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు శ్రీలంకలో మీడియా సంస్ధకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతీకారంతోనే జయసూర్య స్వయంగా ఆ వీడియోని లీక్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఏమందంటే ‘ఇది ప్రతీకారమే! ఆ వీడియో అతనే రికార్డు చేశాడు. మేం గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు తీశాడు.' అని ఆ మహిళ చెప్పిన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వీడియోను ఎవరు లీక్ చేశారనే విషయాన్ని కనిపెట్టేందుకు శ్రీలంక జాతీయ సైబర్ సెక్యూరిటీ కేంద్రం ప్రయత్నిస్తోంది. -
కోట్లాది ఆధార్, బ్యాంక్ నంబర్ల లీక్, షాకింగ్ రిపోర్టు
ఆధార్ కార్డుల లీక్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆధార్ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదని పదే పదే కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ తాజా పరిశోధన భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటటపెట్టింది. జార్హండ్ లీక్ వ్యవహారం మర్చిపోకముందే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరోభారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు, పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్‌అయిందని తాజా రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సోమవారం విడుదల చేసిన కొత్త పరిశోధనా నివేదిక ప్రకారం కేంద్ర మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్దతుల ద్వారా 135 మిలియన్ల ఆధార్ నంబర్లు లీక్ అయ్యాయి. వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అక్రమ భద్రతా పద్ధతుల కారణంగా గత రెండు నెలల్లో భారీగా డేటా బహిర్గతమైందని తెలిపింది. నాలుగు ప్రభుత్వ డేటాబేస్లను ఇది అధ్యయనం చేసింది. మొదటి రెండు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినవి. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ ఎస్ ఎ పి) డాష్‌బోర్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) పోర్టల్. మిగిలిన రెండు డేటాబేస్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్నానికి చెందినవి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఎన్ఆర్ఇజిఎ పోర్టల్ , రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఆన్లైన్ డాష్ బోర్డ్ "చంద్రన్న బీమా" ది. ఈనాలుగు పోర్టల్స్ దవ్ఆరా 130-135 మిలియన్లదాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే వంద మిలియన్లు(కోటి) దాకా బ్యాంక్ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని అధ్యయన వేత్తలు అంబర్ సిన్హా , కొడాలి శ్రీనివాస్ తెలిపారు. ఈ డేటా లీక్ లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) పాత్రపై విశేషంగా ప్రస్తావించారు. ప్రభుత్వ సంస్థల ప్రామాణికతలేని విధానాలు, భద్రత , గోప్యతకు భరోసా ఇవ్వడంలో బాధ్యతా రాహిత్యం దీనికి కారణమని వాదించారు. దీంతో ఈ డేటా దుర్వినియాగానికి దారి తీయనుందని నివేదిక పేర్కొంది. ఈ ప్రభుత్వ డేటాబేస్ ఇప్పటికీ డేటా లీక్ ను అరికట్టిందా లేదా అనేది కీలకమైన ప్రశ్నఅని చెప్పింది. అయిదే తమ పరిశోధన కొనసాగుతుడగా పిఐఐ (వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం) కి కొంత భద్రత కల్పించినట్టు గమనించామన్నారు. ఇటీవల ఆధార్ లీక్ లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డేటాబేస్ సంస్థలు స్పందిచినట్టు చెప్పింది. కాగా ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వ విభాగ వెబ్సైట్లో లక్షలాది మంది పెన్షన్ లబ్ధిదారుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్సైట్లలో లబ్ధిదారుల ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. -
కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోల్డ్ స్టోరేజీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. ఫతేపూర్ జిల్లాలోని జహనాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మోనియా గ్యాస్ లీక్ అయిన కోల్డ్ స్టోరేజీ నుంచి 42 మంది కార్మికులను తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. కోల్డ్ స్టోరేజీ పరిధిలో 2 కిలోమీటర్ల వరకు రాకపోకలను నిలిపివేశారు. ఘటన జరిగిన సమీపంలో ఎలాంటి గ్రామాలు లేవని అధికారులు తెలిపారు. అమ్మోనియా గ్యాస్‌ను పీల్చడం ద్వారా ముక్కు, శ్వాసనాళాల్లో తీవ్రమైన మంట వస్తుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సర్కిల్ ఆఫీసర్ రవింద్ర వర్మ వెల్లడించారు. మెడికల్ బృందాలను ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. గ్యాస్ తీవ్రత తగ్గేవరకు మాస్క్‌లు ధరించాలని ప్రజలకు సూచించారు. -
లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలన విక్రయాలతో దూసుకెళ్తున్న షియోమి, మరో రెండు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు లాంచింగ్ ముందే ఆన్ లైన్ లో లీకైపోయాయి. డిస్ప్లే, ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా వంటి అన్ని ప్రత్యేకతలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. షియోమి ఎంఐ 6, షియోమి ఎంఐ 6 ప్లస్‌ల పేరుతో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ 11న లాంచ్ కాబోతున్నాయి. లీకైన వీటి స్పెషిఫికేషన్ వివరాలు ఓ సారి చూద్దాం... ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.15 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 32జీబీ, 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ 19ఎంపీ సోనీ ఐఎంఎక్స్400 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ షూటర్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్) ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో దీని ధరలు సుమారు రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటాయట. ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 6జీబీ ర్యామ్ 12ఎంపీతో డ్యూయల్ కెమెరా ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ షూటర్ 4500ఎంఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్) ఆండ్రాయిడ్ 7.0 నోగట్ దీని ధరలు సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉంటాయట. -
ప్రశ్నాపత్రం లీకుపై మంత్రి సీరియస్
- విచారణకు ఆదేశం విజయవాడ: నెల్లూరు జిల్లాలో పదోతరగతి సైన్స్-1 పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్త హల్చల్ చేస్తోంది. సామన్య శాస్త్రం-1 ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. -
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్2 ఫోటోల హల్చల్
స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఎంతో ప్రతిష్టాత్మక ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ చేద్దామనుకున్న సోనీ ఎక్స్‌పీరియా హ్యాండ్సెట్ ఫోటోలు లీకేజీ బారిన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలను నెదర్లాండ్స్‌కు చెందిన వెబ్సైట్ టెక్టాస్టింగ్ రివీల్ చేసింది. ఈ వెబ్సైట్ పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు ఎక్స్‌పీరియా ఎక్స్2విగా టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇమేజస్ కూడా కంపెనీ ఇంతకముందు విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఉన్నాయంటున్నారు. లీకైన ఫోటోలు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్2 గురించి మరీ అంత ఎక్కువగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఆ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ను రీప్లేస్ చేస్తుందని తెలుపుతున్నాయని టెక్ విశ్లేషకుల పరిశీలన. స్టాండర్డ్ ఓమ్నిబ్యాలెన్స్ డిజైన్‌ను ఇది కలిగి ఉందట. ఇదే డిజైన్‌ను కంపెనీ తన స్మార్ట్ఫోన్లకు వాడుతోంది. ఒక ఫోన్ పెద్ద బెజిల్(డిస్ప్లే చుట్టూ ఉండే ఫ్రేమ్)ను కలిగిఉంటే, మరొకటి స్లిమ్ బెజిల్తో దర్శనమిస్తోంది. ఈ ఇమేజ్‌లోనే ఫోన్ మెమరీ ఎంత కలిగి ఉందో కూడా తెలుస్తుందట. 4జీబీ ర్యామ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇది మన ముందుకు రాబోతుందట. ముందస్తు రిపోర్టుల ప్రకారం జపనీస్‌కు చెందిన ఈ దిగ్గజం ఎండబ్ల్యూసీ ఈవెంట్లో కనీసం ఐదు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది. అయితే ఏయే మోడల్స్‌ను ఇది విడుదల చేస్తుందో రిపోర్టులు తెలుపలేదు. ఎండబ్ల్యూసీ ఈవెంట్ ప్రారంభ వేడుకలో అంటే ఫిబ్రవరి 27న సోనీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. ఒకవేళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎక్స్‌పీరియా ఎక్స్2 గురించి ప్రకటన వెలువరిస్తే, ఇక వినియోగదారులు ఎన్నో రోజులు సోనీ కొత్త మొబైల్ గురించి వేచిచూడాల్సినవసరం ఉండదు. -
లాంచింగ్ కు ముందే..ఎల్జీ జీ6 లీక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన జీ సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. అయితే జీ6 పేరుతో వస్తున్న ఈ తాజా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీక్ అయింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ..అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు యోచిస్తున్న జీ6 స్మార్ట్ ఫోను ఇమేజ్ ఇపుడు ఆన్ లైన్ హల్ చల్ చేస్తోంది. ఎల్ జీ జీ5 స్మార్ట్ ఫోను డిజైన్ కు భిన్నంగా దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. పూర్తి గ్లాస్ అండ్ మెటల్ బాడీతో అందుబాటులోకి రానుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 ఫిబ్రవరి 26 న బార్సిలోనాలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది సంస్థ. తాజా లీకుల ప్రకారం ఈ స్మార్ట్ ఫోను 5.7-అంగుళాల డిస్ ప్లే , 3.5ఎంఎ ఆడియో జాక్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఎడమవైపు వాల్యూమ్ రాకర్ బటన్లు , డబుల్ కెమెరా సెటప్ , ఫ్రింగర్ ప్రింట్ సెన్సర్, సరికొత్త కూలింగ్ టెక్నాలజీ సామర్థ్యంతో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ తదితర ఫీచర్స్ తో మార్కెట్లోకి రానుంది. అయితే ఈవెంట్ లో శాంసంగ్ పాల్గొనకపోవడంతో ఎల్ జీ పెద్ద ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫేస్బుక్లో దంగల్ లీక్.. కలకలం!
ముంబై: ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం శుక్రవారమే విడుదలైంది. రెజ్లర్ మహవీర్ ఫోగట్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. భారీ రికార్డులపై కన్నేసిన ఈ చిత్రం అంతలోనే సోషల్ మీడియాలో లీక్ కావడం కలకలం సృష్టించింది. ఓ ఫేస్బుక్ యూజర్ సోషల్ మీడియాలో దంగల్ పూర్తి సినిమాను ఉంచగా ఇప్పటికే 4 లక్షల మంది వీక్షించారు, 50 మందికి పైగా దీనిని షేర్ చేశారు. ఆధునిక పైరసీకి ఉదాహారణగా మారిన ఈ ఘటనకు పాల్పడింది ఓ పాకిస్తానీ ఫేస్బుక్ యూజర్‌గా గుర్తించారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తొలగించారు. సోషల్‌మీడియాలో ఈ తరహా పైరసీలు చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు మేవెదర్, పకియావ్ల మధ్య జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌ను సైతం పెరిస్కోప్‌లో యూజర్లు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ ఘటనతో పెరిస్కోప్ యూజర్లకు కఠినమైన నియమనిబంధనలు తీసుకొచ్చింది. -
బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్!
బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ బయటపడ్డాయి. బ్రెగ్జిట్ మీటింగ్ అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేత సహాయకుడు తీసుకెళ్తున్న నోట్స్ వివరాలను డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) దగ్గర ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ సీక్రెట్ మెమో బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు చెలరేగాయి. అయితే అది బ్రెగ్జిట్ వివరాలు కావని, ఆయన వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. వ్రాతపూర్వకంగా రాసుకున్న ఈ పత్రాలను కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ మార్క్ ఫీల్డ్ సహాయకుడు పట్టుకెళ్తుండగా బయటపడ్డాయి. స్టీవ్ బ్యాక్ అనే ఫోటోగ్రాఫర్ లాంగ్ లెన్స్ కెమెరాలో ఈ నోట్స్‌ను బంధించాడని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే ఈ నోట్స్ ప్రభుత్వ అధికారులకు లేదా ఏ స్పెషల్ అడ్వయిజరీకి సంబంధించింది కాదని, వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నోట్స్‌లో యూరోపియన్ యూనియన్‌తో చర్చించబోయే అంశాల్లో వచ్చే అనేక సమస్యలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ సింగిల్ మార్కెట్‌గా ఉండే అవకాశాన్ని ఆఫర్ చేయబోవనే అంశం కూడా బయటపడింది. వాణిజ్య పరిమితులు లేని సింగిల్ మార్కెట్ నుంచి యూకే వైదొలిగితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశంలో మళ్లీ కొత్తగా వాణిజ్య ఒప్పందాలను బ్రిటన్ కుదుర్చుకోవాల్సి వస్తోందని ముందు నుంచి వాదన వినిపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ వివరాలను ప్రకటించడానికి మొదటి నుంచి బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తిరస్కరిస్తూ వస్తున్నారు. బ్రెగ్జిట్ అనంతరం యూరోపియన్ యూనియన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోబోతున్నారో థెరిస్సా రివీల్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఒప్పందం వివరాలు లీక్ అయితే, యూకే చర్చలు బలహీనమయ్యే అవకాశాలున్నాయని ఆమె చెబుతూ వచ్చారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ సహాయకుడు చేతిలోని నోట్స్‌ను ఓ ఫోటోగ్రాఫర్ తీసి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది మార్చి నుంచి అధికారిక డైవర్స్ ప్రక్రియ ప్రారంభం చేయాలని థెరిస్సా ప్లాన్ చేస్తున్నారు. -
విమానాశ్రయంలో రేడియోయాక్టీవ్ లీక్ కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో టెర్మినల్ వద్ద రేడియోయాక్టీవ్ పదార్థం లీక్ కావడం ఆదివారం కలకలం సృష్టించింది. విమానాశ్రయ సిబ్బంది సమాచారం మేరకు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్(ఏఈఆర్బీ) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్ ఫ్రాన్స్ విమానం ద్వారా వచ్చిన మెడికల్ పార్సిల్లో ఈ లీక్ సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా కార్గో టెర్మినల్ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. లీక్ అయిన రేడియోయాక్టీవ్ పదార్థం క్యాన్సర్ చికిత్సలో వాడే న్యూక్లియర్ మెడిసిన్‌కు సంబంధించినది అని, అయితే దీని రేడియోయాక్టివ్ తీవ్రత చాలా తక్కువ అని ఏఈఆర్బీ అధికారులు తనిఖీల అనంతరం వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహన సంస్థ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి హానిలేదని తెలిపారు. -
దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ లీకేజీ
శాయంపేట : భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి ఫేజ్–1 పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను పులుకుర్తి పంప్‌హౌస్‌కు దేవాదుల అధికారులు కొద్దిరోజులుగా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గోవిందాపూర్, పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామాల శివారులో ఉన్న ఫేజ్–1 పైప్‌లైన్ గేట్‌వాల్వ్ వద్ద రెండు రోజులుగా లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం పూర్తి స్థాయిలో గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో నీరు ఎగిసిపడింది. ఇలా బయటకు వచ్చిన నీరు పక్కనే ఉన్న ముప్పవాని చెరువులోకి చేరింది. -
లోగుట్టు లీక్!
మన రక్షణ అవసరాలను తీర్చడానికి అడుగు ముందుకేసినప్పుడల్లా ఏవో అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. తాజాగా నౌకాదళం సమకూర్చుకొనబోయే స్కార్పిన్ జలాంతర్గాముల శక్తిసామర్థ్యాలకు సంబంధించిన సవివరమైన డేటా ఆస్ట్రేలియాకు చెందిన పత్రికలో వెల్లడై ప్రకపంనలు సృష్టిస్తున్నది. 22,457 పత్రాల్లో ఉన్న ఆ వివరాలన్నీ అత్యంత కీలకమైనవి. స్కార్పిన్ గమనంలో ఉండగా దాన్నుంచి ఎంత పౌనఃపున్యంలో ధ్వని వెలువడుతుందన్న దగ్గరినుంచి... దాని కనిష్ట, గరిష్ట వేగం, వేర్వేరు వేగాల్లో ఉన్నప్పుడు దాని ప్రొపెల్లర్లనుంచి వెలువడే ధ్వని వివరాలు, సముద్ర జలాల్లో అది చూడగల లోతులు, వివిధ స్థాయిల్లో దాని సామర్థ్యం తీరు, శత్రు నౌకలపై దాడి చేశాక వెనుదిరగడంలో, వాటి దాడికి అంద కుండా ముందుకు కదలడంలో దాని పటిమ, శత్రు నౌకలనూ, టార్పెడోలనూ, క్షిపణులనూ ధ్వంసం చేయడంలో దానికుండే సామర్థ్యం వగైరాలన్నీ ఆ డేటాలో ఉన్నాయి. ఈ డేటాను అధ్యయనం చేస్తే స్కోర్పిన్ను ఎదుర్కొనడానికి అనువైన రక్షణ ఏర్పాట్లను చేసుకోవడం ప్రత్యర్థులకు పెద్ద కష్టం కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే లీకైన వివరాలన్నీ జలాంతర్గామికి చెందిన బ్లూ ప్రింట్ లోనివేనని, దాని చోదన, ఆయుధ వ్యవస్థల వివరాలు అందులో ఉండవు గనుక అదంత ప్రమాదం కాదని మరికొందరి అభిప్రాయం. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ సైతం ఈ లీకు వల్ల ఏర్పడగల ముప్పేమీ లేదన్న వాదనతోనే ఏకీభవి స్తున్నారు. నిజానికి స్పార్పిన్ ప్రపంచంలోని జలాంతర్గాములతో పోలిస్తే అన్ని విధాలా మెరుగైనదన్న పేరుంది. అది నిలకడగా దాదాపు 50 రోజులపాటు నీటి అడుగున ఉండగలదు. మన నౌకాదళం వద్ద ప్రస్తుతం 13 జలాంతర్గాము లున్నా వాటిలో కొన్ని అవసాన దశకు చేరుకున్నాయి. పైగా ఇప్పటి అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవు. సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్న వర్త మానంలో అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే తప్ప ప్రత్యర్థులపై ఆధిక్యత సాధ్యం కాదు. స్కార్పిన్లు ఆ లోటు తీరుస్తాయనుకుంటున్న తరుణంలో ఈ లీకులు వెలుగులోకొచ్చాయి. స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన నిర్మాణ పనులు పదేళ్లక్రితం మొదలయ్యాయి. అవి దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆఖరు కల్లా ఆరు జలాంతర్గాములనూ మన నౌకాదళానికి అప్పగించే అవకాశాలున్నాయం టున్నారు. ఈ దశలో వాటì డిజైన్‌ను సవరించడం కూడా కష్టమంటు న్నారు. ఈ లీకులు మన దేశాన్ని ఇరకాటంలో పడేయటానికా లేక డీసీఎన్ఎస్ సంస్థపై కక్ష తీర్చుకోవడానికా అన్నది ఇంకా తేలవలసి ఉంది. లీకుల వల్ల జరిగిన నష్టమెంత అన్నదానిపై ఎటూ సమీక్ష ఉంటుంది. దేశ భద్రతతో ముడిపడిన అంశం గనుక అసలు అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో రాబట్టడం ఇప్పుడు ముఖ్యం. జలాంతర్గాముల్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మనకు ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. 1981లో పశ్చిమ జర్మనీతో కుదిరిన హెచ్డీ డబ్ల్యూ జలాంతర్గాముల కొనుగోళ్ల ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో దేశంలో జలాంతర్గాముల నిర్మాణ కార్యక్రమం అట కెక్కింది. అందులో సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టు కొట్టేశాక 1999లో మళ్లీ కదలిక వచ్చింది. 2005లో రూ. 18,000 కోట్ల విలువైన ఆరు జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేసేందుకు, దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్ని బదిలీ చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ సంస్థతో ఒప్పందం ఖరారైంది. అయితే ఆ మరుసటి ఏడాదే ఇందుకోసం 4 శాతం ముడుపులు చెల్లించారని గుప్పుమంది. ఈ వ్యవహారంలో డీసీఎన్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని 2009లో కాగ్ సైతం చెప్పింది. అయితే అది ఎత్తి చూపిన లోపాలు ప్రాజెక్టును ఆపేయవలసినంత ముఖ్యమైనవి కాదని నిర్ణయించారు. ఆ తర్వాత పనులు మొదలయ్యాయి. జలాంతర్గాములను మన దేశంలోనే తయారు చేయడానికి అను వుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడం, దాని రూపకల్పనపై ఇక్కడివారికి శిక్షణనివ్వడం ఒప్పందంలో కీలకాంశాలు. లీకులతో ముప్పేమీ ఉండబోదన్న పరీకర్ ప్రకటన వాస్తవం కాదని దీన్ని బయటపెట్టిన పాత్రికేయుడు కామెరాన్ స్టీవర్ట్ అంటున్నాడు. భారత్, ఫ్రాన్స్‌లు రెండూ జరిగిన నష్టాన్ని తగ్గించి చూపు తున్నాయని, తన దగ్గరున్న మిగిలిన సమాచారం వెల్లడిస్తే అసలు కథ ఏమిటో వెల్లడవుతుందంటున్నాడు. రేపో మాపో ఆ పని చేస్తానంటున్నాడు. అందు వల్ల పూర్తి స్థాయి దర్యాప్తు జరగకుండా లీకు వల్ల నష్టం ఉన్నదనో, లేదనో చెప్పడం తొందరపాటే అవుతుంది. అది దేశ భద్రతకు చేటు తెస్తుంది. పైకి ఏం చెప్పినా శత్రు దేశాల అంతర్గత భద్రతా వ్యవస్థ తీరుతెన్నుల గురించి ఆరా తీయడం, అందుకోసం వారు చేసుకుంటున్న ఏర్పాట్లపై నిఘా ఉంచడం ఎవ రైనా చేసే పనే. అవతలివారి సమాచారాన్ని రాబడితే తప్ప మనం చేసుకుంటున్న ఏర్పాట్ల లోటుపాట్లేమిటో సంపూర్ణంగా తెలియదు. అదే సమయంలో మనకు సంబంధించిన సమాచారం కాస్తయినా బయటకు పొక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడపా దడపా శత్రు దేశాల గూఢచారులుగా వ్యవహ రిస్తున్నవారు పట్టుబడుతుంటారు. రక్షణ కొనుగోళ్లు ఆషామాషీగా జరిగే వ్యవ హారం కాదు. టెండర్లు పిలవడం దగ్గర్నుంచి సంస్థల ఎంపిక వరకూ ఎన్నో జాగ్ర త్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ స్థాయిలో రాజీపడినా కాంట్రాక్టు దక్కని సంస్థ దాని కూపీ లాగి యాగీ చేస్తుంది. బోఫోర్స్ తుపాకుల స్కాం బయటపడ్డాక కొను గోళ్లలో దళారుల ప్రమేయాన్ని అంగీకరించరాదన్న విధానం పెట్టుకున్నా ముడు పులు చేతులు మారుతూనే ఉన్నాయి. అవి ఏదో ఒక దశలో బయటపడి అనిశ్చితి ఏర్పడుతోంది. ఇప్పుడు లీకైంది ముడుపుల సంగతి కాక ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలు. భారత్‌లోనే లీక్ అయి ఉండొచ్చునని డీసీఎన్ఎస్ అంటుండగా అది అసాధ్యమని పరీకర్ గట్టిగా చెబుతున్నారు. ఈ విషయంలో పటిష్టమైన దర్యాప్తు జరిపి దోషుల్ని పట్టుకోనట్టయితే నష్టపోయేది ఫ్రాన్సే. -
గ్యాస్ లీకై రెండు ఇళ్లు దగ్ధం
రూ.30 లక్షల ఆస్తి నష్టం దాచేపల్లి (గుంటూరు): గ్యాస్ సిలిండర్ లీకై రెండు ఇళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని కేసానుపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించటంతో ఇళ్లలో సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన తాడేపల్లి సుబ్బారావు, అన్నపూర్ణ దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటూ కిరాణ దుకాణం, హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలకు అన్నం వండేందుకు అన్నపూర్ణ స్టౌ వెలిగించగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగటంతో ఆమె శరీరం కాలింది. చుట్టు పక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా అగ్ని కీలలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో సిలిండర్ పేలటంతో మంటలు ఉద్ధతి మరింతగా పెరిగాయి. సుబ్బారావు ఇంట్లో ఉన్న కిరాణదుకాణానికి సంబంధించిన సరుకులు, ఫ్రిజ్‌లు,, బీరువాలు, దుస్తులతో పాటు ఇతర సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయాయి. ఇంటిపై కప్పు రేకులు కాలి నేలపై పడ్డాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో పక్కనే ఉన్న దేవరపల్లి సత్యం ఇంటికి కూడా అంటుకున్నాయి. సత్యం ఇంట్లోని సామాన్లు కాలిపోయాయి. అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు పిడుగురాళ్ల అగ్నిమాపక అధికారులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ అధికారి చిరంజీవి, సాంబయ్య, వెంకటేశ్వర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. -
‘స్కార్పిన్’ రహస్యాలు లీక్
-
‘స్కార్పిన్’ రహస్యాలు లీక్
- విచారణ జరపాల్సిందిగా నేవీ చీఫ్‌ను ఆదేశించిన రక్షణ మంత్రి - జలాంతర్గాముల లీకేజీని బయట పెట్టిన ఆస్ట్రేలియా పత్రిక - భారత నౌకాదళానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: భారత నౌకా దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ డీసీఎన్ఎస్ సాంకేతిక సహకారంతో ముంబైలో నిర్మిస్తున్న ఆరు అత్యాధునిక స్కార్పిన్ జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత సున్నిత సమాచారం లీక్ అయింది. దీంతో దేశ భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తక్షణం దీనిపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా రక్షణమంత్రి మనోహర్ పరీకర్ ఆదేశించారు. ఈ లీకేజీకి సంబంధించి 22,400 పేజీల సమాచారం వెల్లడయింది. స్కార్పిన్ జలాంతర్గాముల శక్తి సామర్థ్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో ఉంది. ఈ జలాంతర్గాముల్లో సిబ్బంది ఏ పౌనఃపున్యం వద్ద నిఘా పెడతారు. వివిధ వేగాల వద్ద, వివిధలోతుల్లో జలాంతర్గామి ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి శబ్దాలు వస్తాయి అనే విషయాలకు సంబంధించి సమస్త సమాచారం ఇందులో ఉందని అస్ట్రేలియాకు చెందిన ’ది ఆస్ట్రేలియన్’ పత్రిక వెల్లడించింది. స్కార్పిన్ సబ్‌మెరైన్‌లో ఉన్నవారు శత్రువులు గమనించకుండా వారిలో వారు మాట్లాడుకునే అవకాశం ఉందని వెల్లడైన పత్రాలను ఉటంకిస్తూ ది ఆస్ట్రేలియన్ పత్రిక తెలిపింది. అంతే కాకుండా సబ్‌మెరైన్‌కు అయస్కాంత, విద్యుదయస్కాంత, ఇన్ఫ్రా రెడ్ తరంగాల సమాచారాన్ని, సబ్‌మెరైన్ టార్ఫిడో ప్రయోగ వ్యవస్థ, యుద్ధ వ్యవస్థకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ పత్రాల్లో ఉన్నట్లు పత్రిక తెలిపింది. జలాంతర్గామి వేగం, పెరిస్కోప్ వినియోగానికి అవసరమైన పరిస్థితులు, ప్రొఫెల్లర్ నుంచి వచ్చే శబ్ధం, ఉపరితలానికి చేరుకునేటప్పటి పరిస్థితులకు సంబంధించిన సమాచారమంతా ఈ పత్రాల్లో ఉంది. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిందిగా నేవీ చీఫ్‌ను ఆదేశించినట్లు రక్షణమంత్రి పరీకర్ విలేకర్లకు తెలిపారు. తనకు తెలిసినంతవరకు సమాచారం హ్యాకింగ్‌కు గురైందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. లీకేజీకి సంబధించిన సమాచారం భారత్‌నుంచి వెల్లడి కాలేదన్న విషయం వందశాతం చెప్పగలనని, కొద్ది రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడవుతాయని రక్షణమంత్రి తెలిపారు. స్కార్పిన్లకు సంబంధించిన సమాచారం లీక్ అయిన విషయం ఒక విదేశీ మీడియా వెల్లడించిందని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని రక్షణశాఖకు చెందిన నిపుణులు పరిశీలిస్తున్నారని నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ రహస్య పత్రాల లీకేజీ వ్యవహారం ఆస్ట్రేలియా ప్రభుత్వంలోనూ గుబులు రేకెత్తిస్తోంది. భారత్ నుంచే లీకయ్యే అవకాశం: డీసీఎన్ఎస్ లీకైన సమాచారం ఫ్రాన్స్ కంటే భారత్ నుంచే లీకయ్యే అవకాశం ఉందని నిర్మాణ కంపెనీ డీసీఎన్ఎస్ స్పష్టంచేసింది. భారత్‌లో డీసీఎన్ఎస్ డిజైన్‌తో స్థానిక కంపెనీ నిర్మాణం చేపడుతోందని, డీసీఎన్ఎస్ దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తుందే కాని దాన్ని నియంత్రించదని కంపెనీ తెలిపింది. పత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి డెరైక్టర్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పాలసీ స్టడీస్ రిటైర్డ్ కమాండర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, లీకైన డాక్యుమెంట్లు వాస్తవమైనవా కాదా అనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. -
భారత నౌకా దళానికి ఎదురుదెబ్బ!
-
రామిలేరులో గోదావరి జలాల ఉధృతి
హనుమాన్‌జంక్షన్ రూరల్ : రామిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం కుడి ప్రధాన కాలువకు నూజివీడు మండలం పల్లెర్లమూడిలో రామిలేరుపై నిర్మించిన అండర్‌టెన్నెల్ వద్ద సోమవారం తెల్లవారుజాయున గండి పడింది. దీంతో రామిలేరు గోదావరి జలాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎన్నడూ లేని విధంగా నీటి ప్రవాహం ఉండటంతో పల్లెర్లమూడి, సీతారామపురం, కొయ్యూరు, బొమ్ములూరు తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల క్యూసెక్కుల గోదావరి జలాలు కోల్లేరులోకి వృథాగా చేరుతున్నాయి. బాపులపాడు మండలం కొయ్యూరు వద్ద రామిలేరు నుంచి పెద్ద చెరువులోకి నీళ్లు మళ్లించేందుకు నిర్మించిన చెక్‌డ్యాం సైతం నీటి వేగానికి పూర్తిగా ధ్వంసమైంది. పొక్లెయిన్ సైతం నీటి ఉధృతికి కొట్టుకొచ్చింది. గట్టు బలహీనంగా ఉన్నచోట్ల గండి పడే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే
►సీఎల్పీ నేత కె.జానారెడ్డి నాగార్జునసాగర్: ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోందన్నారు. లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ ఆయన నుంచి నేర్చుకుంటున్నారు'
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ట్విట్టర్లో ఈ వ్యవహరంపై ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. 'వ్యాపమ్ కుంభకోణం వెనుక మాస్టర్ మైండ్ అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి కేసీఆర్ పాఠాలు నేర్చుకుంటున్నారు' అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. Telangana Medical Exam leak. KCR learning lessons from CM MP Shivraj Singh Chauhan master mind of Vyapam Scam. Guilty must be punished. — digvijaya singh (@digvijaya_28) 29 July 2016 -
ఎంసెట్–2 పేపర్ లీకేజీ చేసిన వారిని శిక్షించాలి : సంకినేని
సూర్యాపేట : ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్‌లో మెరిట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వం పూర్తి విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలన్నారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక ఎంజీ రోడ్డులో విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు నలగుంట్ల అయోధ్య, హబీద్, చల్లమల్ల నర్సింహ, కొండేటి ఏడుకొండల్, బండపల్లి పాండురంగాచారి, జీడి భిక్షం, పొదిల రాంబాబు, వెంకట్‌రెడ్డి, అనంతుల యాదగిరి, జనార్దన్, కిరణ్, ఫణి తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ 2పై రేపు నిర్ణయం
హైదరాబాద్: మెడికల్ ఎంసెట్ లీక్ పై చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గతంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై పరిశీలనలు జరపాలని నిర్ణయించింది. లీక్ వ్యవహారంపై సీఐడీ నివేదిక సీఎం కేసీఆర్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షను రద్దు చేయాలా? లేదా అన్నదానిపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వ వర్గాలు విస్తృత సమాలోచనలు చేస్తోంది. సంబంధిత అధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం అయ్యారు. ఈ కీలక సమావేశానికి జేఎన్ టీయూ వీసీ హాజరయ్యారు. మెడికల్ స్కాంలో జేఎన్ టీయూ సిబ్బందిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక వేళ పరీక్ష రద్దు చేస్తే తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతారని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎంసెట్-2 లీక్ నిజమే.. రూ.15 కోట్ల డీల్
-
ఎంసెట్-2 లీక్ నిజమే.. రూ.15 కోట్ల డీల్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీనికోసం రూ.15కోట్లు డీల్ కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తాజాగా ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు పేపర్ లీక్ అయిందని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. ఈ లీక్ ద్వారా 30 మంది విద్యార్థులు లబ్ది పొందినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. ముంబై, బెంగళూరులో నిందితులు మెడికల్ ఎంట్రన్స్ పేపర్ ను లీక్ చేసి విద్యార్థులకు అందించారు. లీకైన పేపర్‌తో బెంగళూరులో ప్రాక్టీసు చేశారని.. దాన్నే యథాతథంగా పరీక్షలో రాయడంతో వాళ్లకు మంచి ర్యాంకులు వచ్చాయని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. వైద్యవిద్య పీజీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ చేసినవాళ్లే.. దీనికి కూడా పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. బెంగళూరు, ముంబై నగరాలతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసులు దర్యాప్తు చేశారు. రమేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్‌లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమంది విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్‌లో వందల్లోనే ర్యాంకులు రావడంతో మొదలైన అనుమానం.. చివరకు డొంక మొత్తాన్ని కదిలించింది. దాంతో ఈ బాగోతం అంతా బయటపడింది. తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కొంతమంది తల్లిదండ్రులు తెలంగాణ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆశ్రయించారు. వాళ్లు సెక్రటేరియట్‌కు చేరుకుని, ఇలా లీకైన పేపర్లతో పరీక్ష నిర్వహిస్తే తమ పిల్లల గతేం కావాలని ప్రశ్నించారు. దాంతో దర్యాప్తునకు ఆదేశించగా.. చివరకు అసలు విషయం నిగ్గుతేలింది. -
'ఉడ్తా పంజాబ్' లీక్.. లీకు వీరులు సెన్సార్ బోర్డేనా?
ముంబై పోయి పోయి సెన్సార్ బోర్డుతో పెట్టుకుంటే మాటలా మరి... వాళ్లు ఏమైనా చేయగలరు. చివరకు విడుదల కాక ముందే సినిమాను టోరెంట్లలో లీక్ కూడా చేయగలరు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. చివరకు కోర్టు ద్వారా విడుదలకు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్న 'ఉడ్తా పంజాబ్' చిత్ర యూనిట్ ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఏయే టోరెంట్లలో తమ సినిమా లింకులు ఉన్నాయో వెతుక్కుని మరీ డిలీట్ చేయిస్తోంది. విషయం ఏమిటంటే... పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన సంచలనాత్మక చిత్రం 'ఉడ్తా పంజాబ్' విడుదలకు ముందే టోరెంట్లలో లీకైంది. అయితే.. లీకు చేసింది సాక్షాత్తు సీబీఎఫ్‌సీకి సంబంధించిన వాళ్లేనని అంటున్నారు. ఎందుకంటే, లీకైన సినిమా ప్రింటు చూసినప్పుడు దాని మీద 'ఫర్ సెన్సార్' అని ముద్ర కనిపించడంతో పాటు.. దానికి సంబంధించిన డేట్ స్టాంప్ కూడా ఉందట. అంటే, తాము సెన్సార్ చేయడానికి ఇచ్చిన ప్రింటును యథాతథంగా లీక్ చేసేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు రెండు గంటల 20 నిమిషాల నిడివి కలిగిన మూవీ లీకైంది. దీనిపై మూవీ యూనిట్‌ను ప్రశ్నించగా వారు అధికారికంగా స్పందించలేదు. సినిమాను సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు 90కి పైగా కట్లు సూచించింది. అయితే, ఈ విషయంపై కోర్టుకెళ్లిన యూనిట్ ఒక కట్ తో 'ఏ' సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. -
పనామా పేపర్స్‌లో మరో హీరోయిన్!
లాస్ఎంజిల్స్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న పనామా పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మరో హీరోయిన్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరు ఈ జాబితాలో కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా 'హ్యారీపోటర్ అండ్ ద గొబ్లెట్ ఆఫ్ ఫైర్'లో నటించిన బ్రిటీష్ నటి ఎమ్మా వాట్సన్(26) పేరు పన్ను ఎగవేత కోసం విదేశాల్లో సంస్థలను స్థాపించిన వారి జాబితాతో కూడిన పనామా పత్రాల లీకేజీలో ఉన్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. దీనిపై ఎమ్మా ప్రతినిధి మాట్లాడుతూ.. సంస్థను నెలకొల్పిన విషయం వాస్తవమే అని తెలిపాడు. అయితే ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని తెలిపాడు. అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకు పైగా విదేశీ సంస్థల వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో వివిధ కంపెనీలు, ట్రస్ట్‌లు, ఫౌండేషన్స్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వివిధ విదేశీ సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్‌ను సైతం ఐసీఐజే వెల్లడించింది.