న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా కంపెనీల విషయాలు లీక్ అయిన కేసులో మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ త్వరలో చర్యలు తీసుకోనున్నది. వాట్సాప్ లీక్‌లతో సంబంధమున్న డజనుకు పైగా బ్లూచిప్ కంపెనీలు, ఈ కంపెనీల సంబంధిత ఉన్నతాధికారులు, మార్కెట్ ఆపరేటర్లు, బ్రోకరేజ్ సంస్థల ఉద్యోగులపై సెబీ చర్యలు తీసుకోనున్నది. కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకముందే వాట్సాప్ ద్వారా లీక్ కావడం, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయడం తెలిసిందే.
కంపెనీలకు సంబంధించిన కీలక విషయాలు బయటకు పొక్కకుండా నియంత్రించే విషయంలో విఫలమైనందుకు ఈ కంపెనీలపై తీవ్రమైన చర్యలే ఉండనున్నాయని సెబీ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా లీక్ అయిన సమాచారం ఆధారంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి అక్రమ లాభాలు ఆర్జించిన అనుమానిత వ్యక్తులపై కూడా సెబీ దర్యాప్తు జరిపిందని ఆ వర్గాలు వెల్లడించాయి. అన్ని కోణాల్లో పరిశోధించిన వివరాలను క్రోడీకరిస్తోందని, దర్యాప్తు దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment