![Sebi dismisses insider trading charges against 11 entities - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/3/AXIS-BANK.jpg.webp?itok=Exl40G_Q)
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఆర్థిక ఫలితాలకు సంబంధించి బయటకు వెల్లడి కాని సున్నిత సమాచారాన్ని వాట్సాప్ సందేశాల ద్వారా పంపిణీ చేసినట్టు 11 సంస్థలు, వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను సెబీ కొట్టివేసింది. 2017 సంవత్సరం జూన్ క్వార్టర్ ఫలితాలను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడానికి ముందే ఆ సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు సెబీ తన దర్యాప్తులో లోగడ గుర్తించింది. మల్బారి, వకీల్, మోతివాలా, ఖన్నా దేధియా యాక్సిస్ బ్యాంక్ ఫలితాల సమాచారాన్ని లీక్ చేశారంటూ, వీరిని ఇన్‌సైడర్లుగా ప్రకటించింది.
కోటక్ క్యాపిటల్, హింగ్లాజ్, మెహ్రా, బగ్రేచా, షా, సల్దాన్హ సున్నిత సమాచారం ఆధారంగా యాక్సిస్ బ్యాంకులో ట్రేడింగ్ చేసినట్టు ఆరోపించింది. గతేడాది కూడా సెబీ టీసీఎస్, అల్ట్రాటెక్ తదితర 12 కంపెనీలకు సంబంధించి బయటకు వెల్లడించని సున్నిత సమాచారాన్ని లీక్ చేశారంటూ ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిస్థితుల్లో యాక్సిస్ బ్యాంకు సున్నిత సమాచారం కేసులో 11 మంది సంస్థలు, వ్యక్తులపై చేసిన ఆరోపణలు నిలబడవంటూ, వాటిని ఉపసంహరిస్తున్నట్టు సెబీ తాజాగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment