Insider trading case
-
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్‌క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్‌క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్‌క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
WhatsApp leak case: యాక్సిస్ బ్యాంక్ ఇన్సైడర్ కేసులో ఆరోపణల కొట్టివేత
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఆర్థిక ఫలితాలకు సంబంధించి బయటకు వెల్లడి కాని సున్నిత సమాచారాన్ని వాట్సాప్ సందేశాల ద్వారా పంపిణీ చేసినట్టు 11 సంస్థలు, వ్యక్తులపై వచ్చిన ఆరోపణలను సెబీ కొట్టివేసింది. 2017 సంవత్సరం జూన్ క్వార్టర్ ఫలితాలను యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడానికి ముందే ఆ సమాచారాన్ని వ్యాప్తి చేసినట్టు సెబీ తన దర్యాప్తులో లోగడ గుర్తించింది. మల్బారి, వకీల్, మోతివాలా, ఖన్నా దేధియా యాక్సిస్ బ్యాంక్ ఫలితాల సమాచారాన్ని లీక్ చేశారంటూ, వీరిని ఇన్సైడర్లుగా ప్రకటించింది. కోటక్ క్యాపిటల్, హింగ్లాజ్, మెహ్రా, బగ్రేచా, షా, సల్దాన్హ సున్నిత సమాచారం ఆధారంగా యాక్సిస్ బ్యాంకులో ట్రేడింగ్ చేసినట్టు ఆరోపించింది. గతేడాది కూడా సెబీ టీసీఎస్, అల్ట్రాటెక్ తదితర 12 కంపెనీలకు సంబంధించి బయటకు వెల్లడించని సున్నిత సమాచారాన్ని లీక్ చేశారంటూ ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంది. ఈ ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పరిస్థితుల్లో యాక్సిస్ బ్యాంకు సున్నిత సమాచారం కేసులో 11 మంది సంస్థలు, వ్యక్తులపై చేసిన ఆరోపణలు నిలబడవంటూ, వాటిని ఉపసంహరిస్తున్నట్టు సెబీ తాజాగా ప్రకటించింది. -
లేటెస్ట్ టెక్నాలజీతో సెబీ రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అత్యంత ఆధునిక టెక్నాలజీని, సంబంధిత టూల్స్‌ను సమకూర్చుకుంటోంది. వీటి సహాయంతో ఇన్సైడర్ ట్రేడింగ్, అక్రమ లావాదేవీల కేసులపై కొరడా ఝళిపించనుంది. తద్వారా నకిలీ ఖాతాల వినియోగంతో అక్రమాలకు పాల్పడిన కేసులను అత్యంత భారీ స్థాయిలో వెలికితీయనుంది. వెరసి క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రపంచంలో పేరున్న ఇలాంటి కొంతమంది ప్రధాన అక్రమార్కులపై కేసులు నమోదు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్–19వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా కేసులపై ఇటీవల సెబీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటలో ఇకపై ఇలాంటి కేసులను మరిన్నింటిని గుర్తించనున్నట్లు తెలుస్తోంది. ఆధునిక టెక్నాలజీతో పర్యవేక్షణ వ్యవస్థల సామర్థ్యం 100 రెట్లు బలపడిన కారణంగా సెబీ మరింతలోతైన అధ్యయానికి తెరతీస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆల్గోరిథమ్స్, బిగ్ డేటా, కృత్రిమ మేథ తదితర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వివరించాయి. -
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీముతో అక్రమంగా ఒక మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.5 కోట్లు) పైగా లాభాలు ఆర్జించారంటూ భారత సంతతికి చెందిన ఏడుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్(ఎస్ఈసీ) ప్రకారం.. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ట్విలియోలో హరి ప్రసాద్ సూరి, లోకేష్ లగుడు, ఛోటు ప్రభు తేజ్ పులగం సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసేవారు. కంపెనీకి సంబంధించిన అంతర్గత వివరాలను వీరు తమ స్నేహితులైన దిలీప్ కుమార్ రెడ్డి కముజుల, సాయి నెక్కలపూడి, అభిషేక్ ధర్మపురికర్, చేతన్ ప్రభు పులగంలకు చేరవేసేవారు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని వీరంతా ట్విలియో ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేశారు. 2020 తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించడానికి ముందు ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వీరు 1 మిలియన్ డాలర్ల పైగా లాభాలు అక్రమంగా ఆర్జించినట్లు ఎస్ఈసీ అభియోగాలు మోపింది. సూరి, లోకేష్, ఛోటులు ప్రత్యేకంగా చాటింగ్ కోసం కంపెనీలో ప్రైవేట్ చానల్ ఏర్పాటు చేసుకుని .. 2020 మార్చి-మే మధ్య కాలంలో కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల అంచనాల గురించి తెలుగులో చర్చించుకున్నారని తెలిపింది. అప్పట్లో 110 డాలర్లుగా ఉన్న షేరు 150 డాలర్లకు వెడుతుందని వారు అంచనాకు వచ్చారని ఎస్ఈసీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందేందుకు, తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు వీరంతా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉపయోగించుకున్నారని తెలిపింది. నిందితులు ఇలా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఎస్ఈసీ పేర్కొంది. (చదవండి: హమ్మ బాబోయ్! ఈ బైక్ ధరకు కారు వచ్చేస్తుందిగా) -
రాజ్‌కుంద్రాకు షాకిచ్చిన సెబీ
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్‌పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది.సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు వయాన్ సంస్థ ఉద్యోగులకు రాజ్కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్‌కుంద్రా బెయిల్‌ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్ పిటీషన్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్డీటీవీ ప్రమోటర్లపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లపై సెబీ కొరడా ఝళిపించింది. రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ధి పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్పీల్‌కు కంపెనీ... అయితే ఈ ఆరోపణలను కంపెనీ తప్పుపట్టింది. తగిన ఆధారాలు లేకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందని పేర్కొంది. ఈ రూలింగ్‌పై అప్పీల్‌కు వెళతామని ఒక ప్రకటనలో తెలిపింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. రాధికా రాయ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అక్రమ లబ్ధికి సంబంధించి మరికొందరు వ్యక్తులు, సంస్థలపైన కూడా సెబీ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధాజ్ఞలు విధించింది. అప్పట్లో సంస్థ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్రమాదిత్య చంద్ర, సీనియర్ అడ్వైజర్ (ఎడిటోరియల్ అండ్ ప్రాజెక్ట్స్), ఈశ్వరీ ప్రసాద్ బాజ్‌పాయ్, ఫైనాన్స్ డైరెక్టర్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరవ్ బెనర్జీలు వీరిలో ఉన్నారు. -
రాజధాని అక్రమాల కేసు సీబీఐకి
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని భూముల అక్రమాల కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాజధాని భూముల విషయంలో భారిఎత్తున అక్రమాలు జరియాన్న ఆరోపణల నేపథ్యంలో.. దాన్ని నిగ్గు తేల్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమేనని సబ్‌కమిటీ నివేదించింది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. బినామీల పేర్లతో అక్రమాలు చేశారంటూ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది. సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా సీఐడీ, సిట్ విచారణ జరిపింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రాజధాని భూముల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని కేంద్ర హోం శాఖకు అంద చేశారు. మొత్తంగా నాలుగువేల ఎకరాలకు పైగా భూముల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని కెబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. -
అమరావతి భూ అక్రమాలపై సీఐడీ విచారణ ముమ్మరం
-
అక్రమాల ‘వరద’
-
ఇన్సైడర్ ట్రేడింగ్: ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
-
చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అడిషనల్ డైరెక్టర్ పీవీ సునీల్ కుమార్ అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల వివరాలు, భూముల సర్వే నెంబర్లు, అడ్రసుతో సహా పూర్తి వివరాలను ఎక్సెల్ షీట్లో చీఫ్ కమిషనర్‌కు లేఖతో పాటే పంపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు కాగా 2018-2019 మధ్య జరిగిన అసైన్డ్ భూముల కొనుగోలు ట్రాన్సాక్షన్లపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. కాగా ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఆధారాలు సేకరించిన సీఐడీ
-
ప్రత్తిపాటి, నారాయణలపై కేసులు
సాక్షి, అమరావతి/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుల్లారావు, నారాయణ, నరసింహారావులపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120/బిలతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గురువారం మంగళగిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు.. 761 ఎకరాల కొనుగోలు రాజధాని రాకముందే రంగంలోకి దిగిన బెల్లంకొండ నరసింహారావు అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కుంటుందని భయపెట్టాడు. నరసింహారావు తన పేరిట ఉన్న 99 సెంట్ల అసైన్డ్ భూమిని బలవంతంగా రాయించుకుని భూ సమీకరణ కింద పరిహారం కూడా పొందినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టగా ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని ఆధారాలు ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో నిర్ధారణ అయింది. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.38,56,84,000 ఉంటుందని తేలింది. (చదవండి: తెల్లబోయే దోపిడీ) తెల్ల రేషన్‌కార్డుదారుల పేరుతో బినామీలు కొన్న భూములు ►అమరావతి మండలంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 ఎకరాలు కొన్నారు. ►పెదకాకాని మండలంలో 43 మంది 40 ఎకరాలు కొన్నారు. ►తాడికొండలో 188 మంది 190 ఎకరాలు కొన్నారు. ►తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలు కొనుగోలు చేశారు. ►మంగళగిరిలో 148 మంది 134 ఎకరాలు కొన్నారు. ►తాడేపల్లి మండలంలో 49 మంది తెల్ల రేషన్‌కార్డు దారులు 24 ఎకరాలు కొనుగోలు చేశారు. ►797 తెల్ల రేషన్ కార్డుదారుల్లో 268 మందికి పాన్ కార్డు ఉంది. ►761 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ రూ 38.50 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.220 కోట్లకుపైగా ఉంటుంది. నాలుగు బృందాలతో విచారణ.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సీఐడీ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అసైన్ట్ భూములపై విచారిస్తుండగా మరో బృందం తెల్ల రేషన్ కార్డులపై దర్యాప్తు జరుపుతోంది. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారికి సంబంధించి మరో బృందం వివరాలు సేకరిస్తుండగా నాలుగో బృందం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను విచారిస్తోంది. (చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!) (చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..) -
పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్
- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఉత్తర్వుల నేపథ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ఉత్తర్వులు నేపథ్యంలో మురుగప్ప గ్రూపు చైర్మన్ పదవి నుంచి వేలాయన్ వైదొలిగారు. గురువారం రాత్రి వేలాయన్‌పై సెబీ అభియోగాలను మోపి, నగదు స్వాధీనానికి ఉత్తర్వులు జారీచేసింది. దాంతో గ్రూపు చైర్మన్ పదవితో పాటు అనుబంధ కంపెనీలు కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ సంస్థల చైర్మన్ పదవి నుంచి కూడా పక్కకు తప్పుకున్నట్లు మురుగప్ప గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెబీ కొన్ని సంశయాలతో వేలాయన్‌పై మోపిన అభియోగాలను గ్రూప్ తోసిపుచ్చింది. వేలాయన్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని గ్రూప్ పేర్కొంది. వేలాయన్‌కు ఉన్న కీర్తి, కంపెనీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని చైర్మన్ పదవి నుంచి వైదొలిగారని, కానీ కంపెనీ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతారని మురుగప్ప గ్రూపు వెల్లడించింది. సెబీ ఆరోపణలను వేలాయన్ ఖండిస్తూ, దర్యాప్తు పూర్తయితే నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సెబీకి పూర్తి సహకారాన్ని అం దిస్తానని వేలాయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదీ కేసు..: సబిరో ఆర్గానిక్ అనే గుజరాత్ కంపెనీని కొనుగోలు చేస్తున్నప్పుడు బయటకు చెప్పకూడని సమాచారాన్ని బంధువులకు చేరవేయడం ద్వారా వేలాయన్, ఆయన సమీప బంధువు మురుగప్పన్‌లు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లఘించినట్లు సెబీ ఆరోపించింది. 2011లో మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్, సబిరోను టేకోవర్ చేసిన సందర్భంలో వారు ఇన్సైడర్ సమాచారాన్ని చేరవేసినట్లు సెబి ఆరోపించింది. ఈ కేసులో వేలాయన్, మురుగప్పన్‌లతో పాటు వై.కరుప్పాయి, గోపాలకృష్ణన్లపై సెబీ అభియోగాలను నమోదు చేసింది. సమాచారం ఆధారంగా ట్రేడ్‌చేయడం ద్వారా గోపాలకృష్ణన్ రూ. 1.30 కోట్లు, కురుప్పాయి రూ. 15.93 లక్షల చొప్పున లబ్దిపొందారని సెబీ ఆరోపించింది. వడ్డీతో కలిపి రూ. 2.15 కోట్లు వారి ఖాతాల నుంచి స్వాధీనం చేసుకునేందుకు సెబీ ఉత్వర్వులిచ్చింది. ఈ మొత్తం వారి అకౌంట్లలో లేకపోతే ఈ మొత్తానికి సమానమైన షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లో స్తంభింపచేస్తామని సెబీ పేర్కొంది. -
అమెరికాలో భారత్ ఫండ్ మేనేజర్‌కు 9 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో భారతీయ సంతతికి చెందిన ఫోర్ట్పోలియో(ఫండ్) మేనేజర్ మాథ్యూ మార్టోమా(40 ఏళ్లు)కు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. 27.6 కోట్ల డాలర్లకుపైగా మొత్తంతో ముడిపడిఉన్న ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీమ్‌లలో మార్టోమాను కీలక సూత్రధారిగా పేర్కొంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ గార్డఫే తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మథ్యూ అక్రమంగా ఆర్జించిన 98 లక్షల డాలర్ల బోనస్ మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించారు. ఫ్లోరిడాలో ఆయనకున్న ఇంటితోపాటు, పలు బ్యాంక్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని తేల్చిచెప్పారు. అల్జీమర్స్ ఔషధానికి సంబంధించిన పరీక్షల(ట్రయల్స్) రహస్య సమాచారాన్ని ఇద్దరు డాక్టర్ల నుంచి అక్రమంగా సేకరించి.. ఎస్ఏసీ క్యాపిటల్ 27.5 కోట్ల డాలర్ల మేర నష్టపోకుండా చూడటంతోపాటు లాభాలను కూడా ఆర్జించిపెట్టాడన్నది కేసు ప్రధానాంశం. కాగా, ఈ కేసులో ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా మార్టోమాకు వ్యతిరేకంగా వాదించింది కూడా భారతీయ సంతతికి చెందిన ప్రీత్ భరారాయే. గతంలోనూ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లో గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజన్ గుప్తా, హెడ్జ్ ఫండ్ దిగ్గజం రాజ్ రజరత్నంలకు శిక్ష పడేలా చేసింది భరారా కావడం గమనార్హం. తాజా కేసుతో ఇప్పటిదాకా వాల్‌స్ట్రీట్‌లో 78 ఇన్సైడర్ నేరాల్లో శిక్షలు వేయించిన చెక్కుచెదరని రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు కూడా.