సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్‌పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది.సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు వయాన్ సంస్థ ఉద్యోగులకు రాజ్‌కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్‌కుంద్రా బెయిల్‌ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్ పిటీషన్‌ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment