న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ థిమాటిక్ ఆన్‌సైట్ పరిశీలన చేపట్టాయి.
2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్‌వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.
అంతేకాకుండా ఎన్‌ఎస్‌ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment