Securities
-
‘ఈ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్ వద్దు’.. సెబీ హెచ్చరిక!
అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్ఫామ్ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.ఇప్పటికే హెచ్చరికలుఅనధికారిక వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్ఫామ్ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐకొన్ని లిస్టెడ్ ఆన్లైన్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్లుగ్రోజెరోధాఏంజిల్ వన్అప్స్టాక్స్ఐసీఐసీఐ డైరెక్ట్కోటక్ సెక్యూరిటీస్హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ఎస్బీఐ సెక్యూరిటీస్మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ -
రిలయన్స్ సెక్యూరిటీస్‌కు సెబీ గట్టి దెబ్బ
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ థిమాటిక్ ఆన్సైట్ పరిశీలన చేపట్టాయి.2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్‌వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.అంతేకాకుండా ఎన్ఎస్ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది. -
ఈ మంగళవారం మరో రూ. 3 వేల కోట్లు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. 27న రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఈ అప్పును సమీకరించనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం సెక్యూరిటీల వేలం వివరాలను వెల్లడించింది.ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంగళవారాల్లో రూ. 12 వేల కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో కలిపి మొత్తం రూ. 15 వేల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది. 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 17 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 22 ఏళ్ల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనుంది.రూ. 2,500 కోట్లు సర్దుబాటుసీఏజీ ద్వారా విదేశీ ప్రాజెక్టుల రుణాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 2,500 కోట్లకు సార్వత్రిక ఎన్నికల ముందే వైఎస్ జగన్ సర్కారు పరిష్కారం కనుగొంది. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ ఏడాది జనవరి నుంచి సీఏజీతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఉమ్మడి ఏపీలో విదేశీ ప్రాజెక్టుల రుణాల చెల్లింపులన్నీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేస్తూ వస్తోంది. తెలంగాణ వాటాను కూడా ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రూ. 2,500 కోట్లు రావాల్సి ఉందని సీఏజీ గత జనవరిలోనే తేల్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో తెలంగాణ నుంచి రావాల్సిన ఆ నిధుల విషయాన్ని కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ రూ. 2,500 కోట్లను ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గురువారం సర్దుబాటు చేసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు ఆగస్టు 11వ తేదీ వరకూ 22.48 శాతం పెరిగి (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం వరకూ పోల్చి) 6.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో వ్యక్తిగత పన్ను వసూళ్లు రూ.4.47 లక్షల కోట్లు. కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2.22 లక్షల కోట్లు. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) వసూళ్లు రూ.21,599 కోట్లు. ఇతర పన్నులు (లెవీ అండ్ గిఫ్ట్ ట్యాక్స్ రూ.1,617 కోట్లు. స్థూలంగా చూస్తే.. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య రిఫండ్స్ రూ.1.20 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో పోలి్చతే రిఫండ్స్ 33.49 శాతం పెరిగాయి. వీటిని కూడా కలుపుకుంటే స్థూలంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.4.82 లక్షల కోట్లుకాగా, కార్పొరేట్ పన్ను రూ.3.08 లక్షల కోట్లు ఉన్నాయి. కొన్ని ముఖ్యాంశాలు... → ఏప్రిల్‌తో ప్రారంభమైన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 2023 –24కన్నా ఈ మొత్తాలు 13 శాతం అధికం. → 2023–24లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల పెరుగుదల నేపథ్యంలో అధిక పన్ను వసూళ్లు జరిగాయి. తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. ఈ గడువు నాటికి రికార్డు స్థాయిలో 7.28 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. -
మార్కెట్ల పరుగు... తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్‌పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. → బీఎస్ఈ సెన్సెక్స్ 80,000 పాయింట్ల మైలురాయిని దాటడం ఒక ఆనందకరమైన క్షణం అంటూ వచి్చన వార్తాపత్రికల కథనాలను ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ నష్టపోని వ్యవస్థల ఏర్పాటు, పటిష్టతలపై రెగ్యులేటరీ అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇలాంటి సంఘటనలు ఉద్ఘాటిస్తున్నాయని తెలిపారు. → ‘మీరు స్టాక్ మార్కెట్లో ఉప్పెనను ఎంత విజయవంతంగా చూస్తారో... అంతే స్థాయిలో జాగ్రత్తలు పాటించే విషయంలో సెబీ, శాట్‌లకు ఎక్కువ పాత్ర ఉంటుందని నేను విశ్వసిస్తునాను. మార్కెట్ భారీ పెరుగుదల సమయాల్లోనే వ్యవస్థ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి’ చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. → స్థిరమైన–ఊహాజనిత పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడంలో, పరిరక్షించడంలో సెబీ, శాట్ వంటి అప్పీలేట్ ఫోరమ్‌ల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందన్నారు. దీనిని కీలక జాతీయ ప్రాముఖ్యతగల అంశంగా పేర్కొన్న ఆయన, ఇది దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన అంశంగా వివరించారు. 6,700 అప్పీళ్ల పరిష్కారం శాట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్టిస్ పీఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శాట్‌లో ప్రస్తుతం 1,028 పెండింగ్ అప్పీళ్లు ఉన్నాయని, 1997లో మొదలైనప్పటి నుండి 6,700 అప్పీళ్లను పరిష్కరించామని తెలిపారు. శాట్ కొత్త వెబ్సైట్ ప్రారంభం.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన శాట్ కొత్త వెబ్‌సైట్‌ను భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. సాంకేతికత సమస్యపై తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. డిజిటల్ రంగం పురోగతి నేపథ్యంలో న్యాయం పొందడానికి సంబంధించిన భావనకు కొత్త రూపును ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. -
ట్రేడింగ్‌లో మహిళల హవా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది. అలాగే, మరో బ్రోకరేజ్ సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫిన్‌ఎడ్జ్ తెలిపింది. రియల్ ఎస్టేట్లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ. ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన.. కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్–టైమ్ ట్రేడర్ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్ తెలిపారు. ట్రేడింగ్ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా ఖాతాదార్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్లు.. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్ ఖాతాలు లేదా ఉమెన్ పవర్ కరెంట్ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్ డిపాజిట్ లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్ బ్యాక్, యామ్‌వాయిస్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్స్టోర్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది. -
దేశీ జీ–సెక్యూరిటీలకు సై
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశీ జీ–సెక్యూరిటీలను వర్ధమాన మార్కెట్(ఈఎం) స్థానిక ప్రభుత్వ ఇండెక్స్, సంబంధిత సూచీలలో చేర్చనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2025 జనవరి 31 నుంచి ఇండియన్ ఫుల్లీ యాక్సెసబుల్ రూట్(ఎఫ్ఏఆర్) బాండ్లను బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్సులలో చోటు కలి్పంచనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం వెయిటేజీతో వీటిని చేర్చనున్నట్లు తెలియజేసింది. తదుపరి ఎఫ్ఏఆర్ బాండ్ల పూర్తి మార్కెట్ విలువకు 10 శాతం చొప్పున ప్రతీ నెలా వెయిటేజీ పెరగనున్నట్లు వివరించింది. 10 నెలలపాటు వెయిటేజీ పెరగడం ద్వారా 2025 అక్టోబర్‌కల్లా పూర్తి మార్కెట్ విలువకు వెయిటేజీ చేరనున్నట్లు వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ ఈఎం లోకల్ కరెన్సీ గవర్నమెంట్ ఇండెక్స్, 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌తోపాటు సంబంధిత సహచర ఇండెక్సులలోనూ వీటికి చోటు కలి్పంచనున్నట్లు పేర్కొంది. కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020–21 బడ్జెట్ ప్రసంగంలో కొన్ని ప్రత్యేకించిన విభాగాల ప్రభుత్వ సెక్యూరిటీలు నాన్‌రెసిడెంట్ ఇన్వెస్టర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశీ ఇన్వెస్టర్లకు సైతం ఇవి అందుబాటులో ఉంటాయని, ఇండెక్సులలో లిస్ట్‌కానున్న వీటికి లాకిన్ అమలుకాబోదని తెలియజేశారు. బ్లూమ్‌బెర్గ్ ఈఎం మార్కెట్ 10 శాతం కంట్రీ క్యాప్డ్ ఇండెక్స్‌లో చేరాక చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల జాబితాలో భారత్ చేరనుంది. -
ఆ రైల్వే కూలీకి ఇద్దరు బాడీగార్డులెందుకు? పాక్స్తాన్ ఎందుకు బెదిరిస్తోంది?
అతని పేరు ధర్మనాథ్ యాదవ్.. బీహార్‌లోని పట్నా రైల్వే జంక్షన్లో కూలీ. సాయుధులైన ఇద్దరు పోలీసు బాడీగార్డుల నడుమ థర్మనాథ్ కనిపిస్తుంటాడు. వారిలో ఒకరు బీహార్ పోలీస్ కాగా మరొకరు జీఆర్పీ జవాను. వీరిద్దరూ అతని పక్కన నడుస్తుండగా, అతను ప్రయాణికుల బ్యాగులను మోసే పనిచేస్తుంటాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పొద్దుపోయేవారకూ అతను ఈ బాడీగార్డుల మధ్యనే ఉంటూ, తన విధులు నిర్వహిస్తుంటాడు. అది అక్టోబరు 27, 2013.. ఉదయం 9.30 గంటలు. బాంబుల మోతతో పట్నా జంక్షన్ దద్దరిల్లిపోయింది. నలువైపులా పొగలు కమ్ముకున్నాయి. వీటి మధ్య ఒక ఎర్రటి టవల్ మెడలో వేసుకున్న ఒక వ్యక్తి.. టాయిలెట్ నుంచి రక్తంతో తడిసి ముద్దయిన ఒక యువకుడిని భుజాన వేసుకుని బయటకు తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు 1989 నుంచి ఇదే స్టేషన్లో పనిచేస్తున్న కూలీ ధర్మనాథ్. ఆయన టాయిలెట్ నుంచి బయటకు తీసుకు వచ్చిన యువకుడు ఉగ్రవాది ఇమ్తెయాజ్. ఒకవేళ ఆ రోజు ధర్మనాథ్ ఉగ్రవాది ఇమ్తెయాజ్ను బయటకు తీసుకురాకుండా ఉంటే ఆ మరుక్షణంలో గాంధీ మైదాన్, బోధ్‌గయలో జరగబోయే బాంబు పేలుళ్లు ఆగేవికాదు. గాంధీమైదాన్‌లో నరేంద్ర మోదీ ర్యాలీలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని ఇమ్తియాజ్ స్వయంగా పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు గాంధీ మైదాన్, బోధ్‌గయ ప్రాంతాల్లో జరగబోయే బాంబు పేలుళ్లను నిలువరించగలిగారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి థర్మనాథ్కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ధర్మనాథ్ తనకు తగిన రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపధ్యంలో కోర్టు అతనికి రక్షణగా ఒక బాడీగార్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ బాడీగార్డు అతనికి పోలీస్ స్టేషన్లో మాత్రమే రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ధర్మనాథ్ తాను బయటకు వెళ్లినప్పుడు కూడా రక్షణ కల్పించాలని కోర్డును వేడుకున్నాడు. దీంతో కోర్టు 2023లో ధర్మనాథ్‌కు మరొక పోలీసు కానిస్టేబుల్ ద్వారా రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా కూలీ ధర్మనాథ్ మాట్లాడుతూ తనకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని, స్టేషన్‌లోని కూలీల విశ్రాంతి గదిలోనే ఉంటున్నానని తెలిపాడు. రాత్రి వేళలో ఇద్దరు బాడీగార్డులు కూడా వారి ఇళ్లకు వెళ్లిపోతారని, తనకు ఇల్లు ఉంటే వారు తనతో పాటు రాత్రి కూడా ఉంటారని చెబుతున్నాడు. అందుకే తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఇది కూడా చదవండి: భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు! -
అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!
ఉలి దెబ్బలు తింటేనే.. శిల శిల్పంగా మారుతుంది. నిప్పుల కొలిమిలో కాలితేనే ఇనుము కరిగేది. దాదాపు మనిషి జీవితం కూడా అంతే.. కష్టాల కడిలిని ఈదితేనే...జీవితంలో పైకి రావాలనే కసి పట్టుదల పెరుగుతుంది. మనసు పెడితే... దానికి సంకల్పం తోడైతే కాలం కూడా కలిసి వస్తుంది. విజయం దాసోహమంటుంది. దాదాపు ఇపుడు మనం చదవబోయే కూడా అలాంటిదే. ఒకపుడు బిడ్డకు పాలుకొనడానికి 14 రూపాయలకు వెతుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. మరిపుడు 800కోట్లకు అధిపతి. ప్రముఖ పెట్టుబడిదారుడు విజయ్ కేడియా సక్సెస్ స్టోరీ చూద్దాం రండి..! కోల్‌కతాకు విజయ్ కేడియా ఐఐటీ, ఐఐఎం లాంటి ఫ్యాన్సీ డిగ్రీలేమీ లేవు. ఉన్నదల్లా స్మార్ట్ బ్రెయిన్ జీవితంలో ఎదగాలనే సంకల్పం. మార్కెట్‌పై లోతైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిలియనీర్‌గా అవతరించాడు. విజయ్ తండ్రి స్టాక్ బ్రోకర్. 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చని పోయాడు. తండ్రిని కోల్పోయిన షాక్‌తో 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. దీనికి తోడు అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహం చేశారు. వెంటనే ఒక బిడ్డ కూడా పుట్టింది. అలా ఒక్కో బాధ్యత, అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి కష్టాల్లోకి నెట్టేసింది. కుటుంబం గడవడానికి తల్లి బంగారు ఆభరణాలను అమ్ముకున్నారు. కానీ అది మాత్రం ఎన్నాళ్లు ఆదుకుంటుంది. కనీసం కుమారుడికి పాలు కొనేందుకు రూ.14 కూడా లేక ఇబ్బందులు పట్టాడు. ఏదో ఒకవిధంగా ఒక్కో పైసా వెతికి అతని భార్య బిడ్డకు పాలు పట్టేది ఇది చూసి చలించిపోయిన విజయ్ కేడీ. కోల్‌కతా వదిలి ముంబైకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తండ్రి ఇచ్చిన వారసత్వ నేపథ్యం, పరిస్థితులతో షేర్ మార్కెట్లో మెల్లిగా పెట్టుబడులు పెట్టాడు. బుర్రకు పదును బెట్టి, మార్కెట్‌ను స్టడీ చేశాడు. దలాల్ స్ట్రీట్‌లో బుల్లిష్‌రన్ కారణంగా 1992లో అదృష్టం కలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని కేడియా క్యాష్ చేసుకున్న కొన్ని కీలకషేర్లలో పెట్టుబడల ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) ఆ తర్వాత ముంబైలో ఇల్లు కొని కోల్‌కతా నుంచి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. అయితే షేర్ మార్కెట్ పెట్టుబడులు అంటే వైకుంఠపాళి. నిచ్చెనలూ ఉంటాయి, కాటేసే పాములూ ఉంటాయి. అచ్చం ఇలాగే మళ్లీ మార్కెట్ కుప్పకూలడంతో సర్వం కోల్పోయాడు. అయినా ధైర్యం కోల్పో లేదు. 2002-2003లో మార్కెట్ మరో బుల్లిష్ రన్. చక్కటి పోర్ట్‌ఫోలియోతో లాభాలను ఆర్జించాడు. ఫలితంగా విజయ్ నికర విలువ ఇప్పుడు రూ. 800 కోట్లకు చేరుకుంది. దేశంలో అత్యంత గౌరవనీయమైన పెట్టుబడిదారులలో ఒకడిగా నిలిచాడు. కేడియా సెక్యూరిటీస్ అనే కంపెనీని ప్రారంభించి కోటీశ్వరుడిగా రాణిస్తున్నాడు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) పెట్టుబడి ప్రపంచంలో విజయ్ కేడియాది ప్రతిష్టాత్మకమైన పేరు. అనేక ఆటుపోట్లతోనిండి వున్న విజయ్ జర్నీ ఇన్వెస్టింగ్ కెరీర్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్న వారికి ఆయన స్ఫూర్తి. స్టాక్ మార్కెట్లో లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. ఓపిక ముఖ్యం. అలాగే మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు రిస్క్ తీసుకునే ధైర్యం,సామర్థ్యం ఉండి తీరాలి. నోట్: ముందే చెప్పినట్టుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు అంటే అంత ఆషామాషీ కాదు. సరియైన అవగాహన, లోతైన పరిజ్ఞానం చాలా అవసరం. -
ఎమ్మెల్యే రాజాసింగ్ కు చేదు అనుభవం
-
Finance Bill 2023: సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో సెక్యూరిటీ లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) పెంచింది. దీంతోపాటు రుణ సెక్యూరిటీల(డెట్) మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపైనా స్వల్పకాలిక పన్నుకు తెరతీసింది. శుక్రవారం ఎస్‌టీటీసహా 64 సవరణలతో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. వెరసి పన్ను సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఆప్షన్స్‌లో 0.05 శాతం నుంచి 0.0625 శాతానికి, ఫ్యూచర్ కాంట్రాక్టులలో 0.01 శాతం నుంచి 0.0125 శాతానికి ఎస్టీటీ పెరగనుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయం బలపడటంతోపాటు.. ట్రేడింగ్ వ్యయాలు పెరగనుండటంతో మితిమీరిన లావాదేవీలకు చెక్ పడనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఈ విభాగంలో నష్టపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఆప్షన్స్‌లో తొలుత 0.017 శాతం నుంచి 0.021 శాతానికి ఎస్టీటీ పెరగనున్నట్లు వెలువడిన వార్తలు టైపింగ్ పొరపాటుగా ఆర్థిక శాఖ వివరణ ఇవ్వడం గమనార్హం! డెట్ ఎంఎఫ్లపైనా.. తాజా బిల్లు ప్రకారం డెట్ ఎంఎఫ్ ఆస్తులలో 35 శాతానికి మించి ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అంతకంటే తక్కువగా ఈక్విటీలకు మళ్లించే ఎంఎఫ్‌లు స్వల్పకాలిక పెట్టుబడి లాభాల(క్యాపిటల్ గెయిన్) పన్ను చెల్లించవలసి వస్తుంది. తాజా నిబంధనల ప్రకారం డెట్ ఎంఎఫ్‌లు చేపట్టే 35 శాతంలోపు ఈక్విటీ పెట్టుబడులపై శ్లాబులకు అనుగుణంగా పన్ను చెల్లించవలసి వస్తుంది. ప్రస్తుత సవరణలతో మార్కెట్ ఆధారిత డిబెంచర్, అధిక శాతం నిధులను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే ఎంఎఫ్ మధ్య సారూప్యతకు తెరలేవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి ఎంఎఫ్లకు ప్రస్తుతం ఇండెక్సేషన్ లబ్ధి్దతో కలిపి 20 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) ట్యాక్స్ వర్తిస్తోంది. ఆశ్చర్యకరం ఎల్టీసీజీ సవరణలతోకూడిన 2023 ఫైనాన్స్ బిల్లు ఆశ్చర్యకరమని ఎంఎఫ్ పరిశ్రమ అసోసియేషన్(యాంఫీ) చైర్మన్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ చీఫ్ ఎ.బాలసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. తాజా మార్పులకు పరిశ్రమ సన్నద్ధం కావలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ అభివృద్ధి ఎజెండాను బిల్లు దెబ్బతీసే వీలున్నట్లు పలువురు అసెట్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ దిగ్గజాలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా నాబార్డ్ జారీ చేసే సెక్యూరిటీలకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద సబ్స్క్రయిబర్లన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సవరణలపై సమీక్షను చేపట్టవలసి ఉన్నట్లు యాంఫీ వైస్‌చైర్‌పర్సన్, ఎడిల్వీస్ ఏఎంసీ హెడ్ రాధికా గుప్తా పేర్కొన్నారు. దేశీయంగా ఫైనాన్షియలైజేషన్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నదని, వైబ్రేంట్ కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌కు పటిష్ట డెట్ ఫండ్ వ్యవస్థ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. డెట్ ఎంఎఫ్‌లలో పెట్టుబడులకు దీర్ఘకాలిక నిధులు తగ్గిపోతే బాండ్ల జారీ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసి వస్తుందని బాలసుబ్రమణ్యన్ వివరించారు. తాజా బిల్లు కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు. కాగా.. మార్కెట్లు అనిశ్చితిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్టీటీ పెంపు సరికాదని పారిశ్రామిక సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. ఇది మార్కెట్ సెంటిమెంటు, లావాదేవీల పరిమాణంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా అభిప్రాయపడ్డారు. ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల విక్రయంపై ఎస్టీటీ పెంపుపై ఆర్థిక శాఖ స్పష్టతను ఇవ్వవలసి ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అదనపు లావాదేవీ చార్జీలు రద్దు ఏప్రిల్ 1 నుంచి ఎన్ఎస్ఈ అమలు ఈక్విటీ నగదు, డెరివేటివ్స్ విభాగాలలో విధిస్తున్న అదనపు లావాదేవీల చార్జీలను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. 2021 జనవరి 1 నుంచి 6 శాతం పెంపును అమలు చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎన్ఎస్ఈ తాజాగా తెలియజేసింది. ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ రక్షణ నిధి ట్రస్ట్(ఐపీఎఫ్టీ) మూలధనాన్ని(కార్పస్) పెంచేందుకు ఈ చార్జీలలో కొంత భాగాన్ని వినియోగిస్తోంది. రెండేళ్ల క్రితం బ్రోకర్ వైఫల్యాల కారణంగా మార్కెట్లలో సంకట పరిస్థితులు తలెత్తడంతో 6 శాతం చార్జీలను ఎన్ఎస్ఈ విధించింది. -
మరో రూ.1,000 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం సమకూర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా తీసుకున్న ఈ అప్పును 21, 22 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించనుంది. మంగళవారం ఈ వేలం జరిగింది. రూ.1,000 కోట్లతో ఈ ఏడాది అప్పుల మొత్తం రూ.27,500 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.47,500 కోట్లు రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఏడాది మధ్యలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన మేరకు ఆ రుణం రూ.39 వేల కోట్లకు తగ్గింది. ఇప్పటికి రూ.27వేల కోట్లకు పైగా రుణాలు సమకూరిన నేపథ్యంలో మిగిలిన సుమారు రూ.12 వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. డిసెంబర్లో మిగతా రుణాలు..! కాగ్ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి తగ్గట్టుగానే ప్రతి నెలా ఖర్చులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాల అమలుకు అదనపు నిధులు అవసరమవుతున్నాయి. వచ్చే నెలలో ఇవ్వాల్సిన రైతుబంధుతో పాటు దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్ల లాంటి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబర్లోనే తమకు మిగిలిన రుణాలు సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ వర్గాలు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. ఆర్బీఐ అనుమతినిస్తే వచ్చే నెలలోనే ఆ మేరకు రుణాలు తీసుకునే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. తమపై కక్ష సాధింపులో భాగంగా ఇప్పటికే రుణాల్లో కోత విధించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థికశాఖ పెట్టిన ఈ ప్రతిపాదన ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే. -
రూ.75,000 కోట్లకు చేరుకున్న సెక్యూరిటైజేషన్
ముంబై: సెక్యూరిటైజేషన్ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 48 శాతం పెరిగి రూ.75,000 కోట్లకు చేరుకున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇన్వెస్టర్లు (బ్యాంకులు/ఆర్థిక సంస్థలు) రిటైల్ రుణాల పట్ల నమ్మకం చూపించడం ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. సెక్యూరిటైజేషన్ అంటే ఒక రుణదాత ఒక రుణంపై భవిష్యత్తులో తనకు వసూలు కావాల్సిన మొత్తాలను కొంత తక్కువకు వేరే రుణదాతకు విక్రయించడం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కరోనా రెండో విడత వల్ల సెక్యూరిటైజేషన్ మార్కెట్ ప్రతికూలతలను చూసి నట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. అయతే, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు కొంత వెనుకాడడం వల్ల కొన్ని డీల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి అర్ధభాగంలో పూర్తి కాలేదని వెల్లడించింది. మార్ట్గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాలు అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. మార్కెట్ పరిమాణంలో 40%గా ఉన్నాయి. దీని తర్వాత వాణిజ్య వాహన రుణాలు 30%, సూక్ష్మ రుణాల వాటా 13% చొప్పున ఉంది. మార్ట్గేజ్, బంగారం, సూక్ష్మరుణాల వాటా కలిపి 62 శాతంగా ఉంది. పాస్ త్రూ సర్టిఫికెట్ల (పీటీసీలు) వాటా ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 44 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. సెక్యూరిటైజేషన్ మార్కెట్లో సగం మేర రుణాలను ప్రైవేటు బ్యాంకులు సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు పావు వంతు కొనుగోలు చేశాయి. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
గోల్డ్ ఎక్సేంజ్ ఏర్పాటు.. విధి విధానాలు ఇలా ఇవే
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్)లను ‘సెక్యూరిటీల కాంట్రాక్టుల చట్టం 1956’ కింద గుర్తిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే గోల్డ్ ఎక్సేంజ్‌ల్లో ఈజీఆర్‌ల ట్రేడింగ్‌కు దారిచూపినట్టయింది. ఇప్పటికే ఉన్న ఎక్సేంజ్‌ల్లో ప్రత్యేక కేటగిరీ కింద వీటిల్లో ట్రేడింగ్‌కు అవకాశం ఉంటుంది. షేర్ల మాదిరే ఈజీఆర్‌లను డీమ్యాట్ ఖాతాల్లో ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వీటిని భౌతిక బంగారంగాను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్యూరిటీల మాదిరే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్కు అర్హత లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి ఈజీఆర్‌లను పొందొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్ సందర్భంగా ఈజీఆర్‌లపై సెబీ నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తుందని.. వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ కమోడిటీ మార్కెట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తుందని ప్రకటించడం గమనార్హం. ఎక్సేంజ్ ఏర్పాటుకు మార్గం సుగమం బంగారం ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేసేందుకు సెబీ ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమోదం తెలియజేసింది. ఈ ఎక్సేంజ్‌లో బంగారం ఈజీఆర్‌ల రూపంలోనే ట్రేడవుతుంది. ప్రస్తుత లేదా కొత్తగా ఏర్పాటు చేసే ఎక్సేంజ్‌లు ఏవైనా ఈజీఆర్‌లో ట్రేడింగ్‌ను ప్రత్యేక విభాగం కింద చేపట్టొచ్చని సెబీ ప్రకటించింది. ఎంత పరిమాణం చొప్పున ఈజీఆర్‌లలో ట్రేడింగ్, ఈజీఆర్‌లను బంగారంగా మార్పిడి చేసుకునేందుకు అనుమతించడం అనేది ఎక్సేంజ్‌ల ఇష్టానికే విడిచిపెట్టింది. బంగారం ఎక్సేంజ్ ఏర్పాటుతో దేశంలో సహేతుక బంగారం ధరలు, పెట్టుబడులకు లిక్విడిటీ, బంగారం నాణ్యతకు హామీ లభిస్తుందని సెబీ భావిస్తోంది. ఈజీఆర్‌లను ఇన్వెస్టర్ తనకు నచ్చినంత కాలం షేర్ల మాదిరే ఉంచుకోవచ్చు. వద్దనుకుంటే ఈజీఆర్‌లను స్వాధీనం చేసి, ఖజానాల్లో అండర్లైయింగ్ (హామీగా)గా ఉండే బంగారాన్ని తిరిగి పొందొచ్చు. వీటికి అయ్యే వ్యయాలు కూడా తక్కువగానే ఉంటాయని సెబీ తెలిపింది. సెబీ పర్యవేక్షణ ఈజీఆర్లకు అండర్‌లైయింగ్‌గా ఉంచే భౌతిక బంగారం వాల్ట్లపై సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయి. ఆయా సంస్థలు సెబీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. వాల్ట్ మేనేజింగ్ సేవలు అందించడానికి.. అంటే బంగారాన్ని ఈజీఆర్‌లుగా మార్చి సెక్యూరిటీల జారీకి సెబీ అనుమతి పొందాల్సి ఉంటుంది. బంగారం డిపాజిట్, నిల్వ, భద్రత, ఈజీఆర్‌లను వెనక్కి తీసుకుని భౌతిక బంగారాన్ని అప్పగించడం ఇవన్నీ వాల్ట్ సర్వీసుల్లో భాగంగా ఉంటాయి. నిర్ణీత కాలానికోసారి ఈజీఆర్‌లు, వాటికి సంబంధించి బంగారం నిల్వలను ఆడిట్ చేయించుకోవాలి. చదవండి:హాల్‌మార్కింగ్ విధాన విస్తరణకు కసరత్తు -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 15శాతం నష్టం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు చెందిన బ్రోకింగ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిస్టింగ్‌లో నష్టాలను మూటగట్టుకుంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ నష్టాలతో లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఇది 17 శాతం(రూ. 89) నష్టపోయి రూ. 431వద్ద ప్రారంభమైంది. చివరికి 15 శాతం నష్టంతో ముగిసింది. అయితే దీని ఈక్వీటీ షేరు ఇష్యూ ధర రూ. 520. కాగా ఇష్యూకి 78 శాతమే సబ్స్క్రిప్షన్ లభించింది. యాంకర్ విభాగంతో కలుపుకుంటే ఇష్యూ 88 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ పోర్షన్‌తో కలిపి ఇష్యూ ద్వారా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 3500 కోట్లను సమీకరించింది. వెరసి ఇష్యూ పరిమాణాన్ని రూ. 4017 కోట్ల నుంచి రూ. 3500కు తగ్గించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి పూర్తిస్థాయిలో(1 శాతం) బిడ్స్ దాఖలుకాగా.. సంపన్న వర్గాల కోటాలో స్వల్పంగా 33 శాతమే స్పందన కనిపించింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 88 శాతం దరఖాస్తులు లభించాయి. కంపెనీ 4.42 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 3.46 కోట్ల షేర్ల కోసం మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో 3.3 కోట్ల షేర్లను 28 సంస్థలకు కేటాయించింది. షేరుకి రూ. 520 ధరలో వీటిని జారీ చేయడం ద్వారా రూ. 1717 కోట్లను సమీకరించింది. -
ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న ఆరోపణలతో రూ.59 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మార్చి 26, 2018న ఆర్బీఐ ఒక నోటీసు జారీ చేసింది. సెక్యూరిటీల అమ్మకంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించినందుకు బ్యాంకుపై ఈ పెనాల్టీ విధించినట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ చర్య బ్యాంక్ వినియోదారులను ప్రభావితం చేయదని తెలిపింది. ఆర్బీఐ హెచ్‌టీఎమ్ పోర్ట్ ఫోలియో నుంచి నేరుగా సెక్యూరిటీల అమ్మకాలపై ఐసీఐసీఐ బ్యాంకునకు రూ.58.9 కోట్ల జరిమానా విధించింది. ఈ కేటగిరి కింద మొత్తం పెట్టుబడులు బ్యాంకు మొత్తం పెట్టుబడిలో 24శాతాన్ని మించకూడదు. కాగా ఇటీవల వివిధ నిబంధనల ఉల్లంఘనలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లకు ఆర్బీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
‘నల్లధనం కాదని హామీ పత్రాలివ్వండి’
న్యూఢిల్లీ: ఓ పక్క ప్రభుత్వ ఒత్తిడి, మరోపక్క చెడ్డపేరు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న స్విట్జర్లాండ్ బ్యాంకులు దానికి తగ్గ చర్యలు చేపట్టాయి. తమ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము.. పన్ను ఎగవేతకు సంబంధించినది కాదంటూ తాజాగా హామీ పత్రాలు ఇవ్వాలని భారత ఖాతాదారులను కోరాయి. ఆడిటర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని వ్యక్తిగత, కార్పొరేట్ ఖాతాదారులను కోరుతున్నాయి. విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించే చర్యలను భారత్ వేగవంతం చేయడం, దానికి స్విస్ ప్రభుత్వం సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో బ్యాంకులు ఈ చర్యకు ఉపక్రమించాయి. కాగా, నల్లధన ఖాతాలను ఎందుకు వెల్లడించడంలేదో చెప్పాలంటూ హెచ్ఎస్బీసీకి భారత అధికారులు షోకాజ్ నోటీస్ కూడా పంపినట్లు సమాచారం.