అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.
అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్‌ఫామ్‌ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.
ఇప్పటికే హెచ్చరికలు
అనధికారిక వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్‌ఫామ్‌ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ
కొన్ని లిస్టెడ్ ఆన్‌లైన్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌లు
గ్రో
జెరోధా
ఏంజిల్ వన్
అప్‌స్టాక్స్
ఐసీఐసీఐ డైరెక్ట్
కోటక్ సెక్యూరిటీస్
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్
ఎస్‌బీఐ సెక్యూరిటీస్
మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్
Comments
Please login to add a commentAdd a comment