
షేరుకి రూ. 75 డివిడెండ్
ముంబై: టాటా గ్రూప్ ఐటీ సేవల ఇంజనీరింగ్ కంపెనీ టాటా ఎలెక్సీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 13 శాతం క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. నికర లాభ మార్జిన్లు 18.1 శాతంగా నమోదయ్యాయి. నిర్వహణ ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 908 కోట్లను తాకింది.
వాటాదారులకు గతేడాదికిగాను కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా షేరుకి రూ. 75 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆదాయం రూ. 3,729 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 208 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు 22.9 శాతానికి చేరాయి.