Securities and Exchange Board of India
-
కార్వీ కేసులో ‘షాక్’ ఎక్స్చేంజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) కేసులో సంచలనం. స్టాక్ ఎక్స్చేంజీలకు షాక్ తగిలేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీల దుర్వినియోగాన్ని గుర్తించే విషయంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వైఫల్యాన్ని సెబీ ఎత్తి చూపింది. ఈ మేరకు బీఎస్ఈకి రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. 95,000లకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల సెక్యూరిటీలను కేవలం ఒక డీమ్యాట్ ఖాతా నుండి తాకట్టు పెట్టి కార్వీ దుర్వినియోగం చేసిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీలను తాకట్టు పెట్టి కేఎస్‌బీఎల్, గ్రూప్ కంపెనీలు 8 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.851.43 కోట్ల రుణం పొందాయి. నిస్సందేహంగా ఖాతాదారుల సెక్యూరిటీలను అనధికారికంగా తాకట్టు పెట్టడం ద్వారా కేఎస్‌బీఎల్ దుర్వినియోగానికి పాల్పడిందని సెబీ స్పష్టం చేసింది. నష్టానికి కార్వీదే బాధ్యత..: ‘పెట్టుబడిదారులకు, అలాగే రుణం ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నష్టంతో సహా.. సొంతం కాని సెక్యూరిటీలను తాకట్టు పెట్టడం వల్ల కలిగే నష్టానికి కేఎస్‌బీఎల్ బాధ్యత వహిస్తుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో సభ్యుడిగా ఉండటంతో స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ పర్యవేక్షణలో కార్వీ ఉంది. ఎక్స్చేంజీల వైఫల్యం ఉంది. ఫలితంగా కేఎస్‌బీఎల్‌లో జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో స్టాక్ ఎక్స్చేంజీలు జవాబుదారీగా ఉండాలి’ అని సెబీ తన ఉత్తర్వుల్లో ఘాటుగా స్పందించింది. జూన్ 2019 నుండి కార్వీలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సెబీ సంయుక్తంగా తనిఖీ నిర్వహించాయి. -
సెబీ చీఫ్‌గా మాధవీ పురి బాధ్యతలు
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ– సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌గా మాధవీ పురీ బుచ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఒక మహిళ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. అలాగే ఈ కీలక బాధ్యతలు చేపట్టిన నాన్–బ్యూరోక్రాట్. ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న అజయ్ త్యాగి స్థానంలో 57 సంవత్సరాల పురీ నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఫిబ్రవరి 28వ తేదీన సెబీ చీఫ్‌గా బాధ్యతలు విరమించారు. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల అనుభవం మాధవీ పురీ సొంతం. ఐసీఐసీఐ బ్యాంక్‌సహా ప్రయివేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్‌లో ముగిసింది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4వరకూ పలు విధులు నిర్వర్తించారు. సర్వీలియెన్స్, కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ తదితర కీలక పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్ధుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. విశేష అనుభవం సెబీ పూర్తికాలపు సభ్యురాలిగా 2021 అక్టోబర్‌లో బాధ్యతలు విరమించిన అనంతరం డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈ పదవీకాలంలో వివిధ పోర్ట్‌ఫోలియోల నిర్వహణ, పలు కమిటీలలో భాగస్వామ్యం వంటి బాధ్యతలు చేపట్టారు. సెక్యూరిటీ మార్కెట్ డేటాను పొందడం, ప్రైవసీ తదితర అంశాలలో విధాన చర్యలపై సలహాలు, సూచనలు అందించే అడ్వయిజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. పురీ విద్యార్హతల విషయానికి వస్తే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్‌ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో కన్సల్టెంట్‌గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రయివేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా విధులు నిర్వహించారు. బలమైన పునాది వేసిన త్యాగికి కృతజ్ఞతలు: పురి సెబీ పటిష్ట పనితీరుకు సంబంధించి తగిన బలమైన పునాదులు వేసిన సెబీ తాజా మాజీ చీఫ్ అజయ్ త్యాగికి కృతజ్ఞతలని బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాధవీ పురీ పేర్కొన్నారు. ‘మీరు మాకు అందించిన బలమైన పునాదిపై వ్యవస్థను పటిష్టంగా నిర్మించడానికి ఎదురుచూస్తున్నాను’’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో త్యాగికి ఘన సన్మానం జరిగింది. ఎన్ఎస్ఈ కేసు సత్వర పరిష్కారానికే ప్రయత్నించాం: త్యాగి చిత్రా రామకృష్ణకు సంబంధించి కో లొకేషన్ స్కామ్ (సర్వర్ల డేటాను ముందుగా వినియోగించుకునే అవకాశం కొందరు బ్రోకర్లకు కల్పించడం) , హిమాలయ యోగి సూచనల మేరకు నడుచుకున్నారన్న ఆరోపణల విషయంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో తీవ్ర అవకతవకల కేసును సత్వరం పరిష్కరించేందుకే ప్రయత్నించినట్లు సెబీ మాజీ చైర్మన్ త్యాగి బుధవారం మీడియాతో అన్నారు. ఎన్ఎస్ఈ కేసులో తన ఉత్తర్వులు ఇవ్వడానికి సెబీ తాత్సారం చేసిందన్న విమర్శల నేపథ్యంలో, అసలు ఈ కేసులో ‘అవసరమైన శిక్షార్హత‘ చర్య తీసుకుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. క్వాజీ–జ్యుడీషియల్ (అడ్మినిస్టేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ అధికారి నిర్వహించే విచారణ పక్రియ) తీర్పుల విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ ఎప్పుడూ ఎటువంటి తాత్సారం చేయలేదని స్పష్టం చేశారు. కో–లొకేషన్ ఆరోపణల విషయంలో సెబీ తన అవగాహన ప్రకారమే వ్యవహరించిందని అన్నారు. 2018లో వచ్చిన ఈ ఆరోపణలపై రూలింగ్‌ను 2022 ఫిబ్రవరిలో ఇవ్వడానికి కోవిడ్ సంబంధ సవాళ్లు కారణం తప్ప, దీనిలో ఉద్దేశపూర్వక ఆలస్యం ఏదీ లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. -
అంబానీ బ్రదర్స్‌కు రూ. 25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసులో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీతోపాటు మరికొంతమందికి కలిపి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5 శాతానికిపైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పీఏసీ.. వివరాలు అందించడంలో విఫలమైనట్లు సెబీ తాజాగా పేర్కొంది. దీంతో టేకోవర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అంబానీ బ్రదర్స్‌తోపాటు.. ముకేశ్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, మరికొన్ని సంస్థలపై జరిమానా విధించింది. వారంట్లతో కూడిన రీడీమబుల్ డిబెంచర్ల ద్వారా ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ.. 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను సొంతం చేసుకున్నాయి. 5 శాతం వాటాకు మించిన ఈ లావాదేవీని టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్‌గా ప్రకటించవలసి ఉన్నట్లు సెబీ పేర్కొంది. అయితే ప్రమోటర్లు, పీఏసీ ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదని తెలియజేసింది. వెరసి టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారని సెబీ ఆరోపించింది. కాగా.. పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా చెల్లించవచ్చని సెబీ తెలియజేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే. -
సెబిలో కరోనా కలకలం..
దేశ స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)లో కరోనా కలకలం సృష్టించింది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఇంకొకరికి కోవిడ్ 19 పాజిటివ్ ధృవీకరణ రావడం సంస్థలో ఆందోళన పుట్టించింది. దీంతో సెబి ముఖ్య కార్యాలయాన్ని ఎన్సీఎల్ బిల్డింగ్‌లోకి తాత్కాలికంగా తరలించాలని, ప్రస్తుతం కార్యాలయమున్న బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోని భవనాలని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. మే 7న సెబిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం, దీంతో బాంద్రాకుర్లా కాంప్లెక్సులోని భవనాలన్నింటిని శానిటైజ్ చేయడం జరిగింది. ఇప్పుడీ రెండో కేసు వార్తలతో కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించనున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి సెబి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉందని, అందుకే మార్కెట్లు పనిచేస్తున్న సమయాన సెబి సైతం నిర్విరామంగా పనిచేస్తునే ఉందని సంస్థ అధికారులు చెప్పారు. నిజానికి లాక్డౌన్ వేళ ఇతర సమయాల్లోకన్నా ఎక్కువగా సెబి పనిచేయాల్సిఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో సంస్థ ఉద్యోగులకు కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. -
ఫండ్స్‌లో పెట్టుబడులు డీఎల్ఎఫ్ విక్రయించుకోవచ్చు
ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) నుంచి ఉపశమనం లభించింది. వచ్చే నెలలోగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ. 1,806 కోట్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ శాట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెలలో రూ. 767 కోట్లు, డిసెంబర్లో మరో రూ. 1,039 కోట్ల విలువైన ఫండ్ యూనిట్లను విక్రయించుకునేందుకు డీఎల్ఎఫ్కు వీలు చిక్కింది. గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, ఆరుగురు కంపెనీ ఉన్నతాధికారులను క్యాపిటల్ మార్కెట్ల నుంచి మూడేళ్లపాటు నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌ను ఆశ్రయించింది. ట్రిబ్యునల్ సూచనలమేరకు ఫండ్స్‌లో పెట్టుబడులను తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా డీఎల్ఎఫ్ శాట్‌కు సోమవారం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. కాగా, సెబీ నిషేధ ఉత్తర్వులపై తుది విచారణను డిసెంబర్ 10న శాట్ చేపట్టనుంది. 2007 ఐపీవో దరఖాస్తుకు సంబంధించి ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని దాచిపెట్టిందన్న ఆరోపణలతో గత నెలలో డీఎల్‌ఎఫ్‌తోపాటు, చైర్మన్ కేపీ సింగ్ తదితర 6గురు ఎగ్జిక్యూటివ్‌లను క్యాపిటల్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది. డీఎల్‌ఎఫ్‌పై సెబీ నిషేధం క్యాపిటల్ మార్కెట్లకే పరిమితమని కంపెనీ కార్యకలాపాలకు వర్తించదని ముగ్గురు సభ్యుల శాట్ బెంచ్ వ్యాఖ్యానించింది. సెబీ సైతం ఇందుకు అభ్యంతర ం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, రుణాలపై వడ్డీ చెల్లింపులు వంటి అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చునని శాట్ ప్రిసైడింగ్ అధికారి జేపీ దేవధర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు అవసరమైనప్పుడు తనఖాలో ఉంచిన డీఎల్ఎఫ్ అనుబంధ కంపెనీల షేర్లను విడిపించుకోవడం, వినియోగించుకోవడం వంటివి నిర్వహించుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పావు గంటలో సమాచారమివ్వాల్సిందే
ముంబై: బోర్డు సమావేశాలు ముగిసిన 15 నిమిషాల్లోగా లిస్టెడ్ కంపెనీలు ఆ వివరాలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా నిధుల సమీకరణ ప్రణాళికలు, డివిడెండ్లు, బోనస్‌లు, షేర్ల బైబ్యాక్ వంటి నిర్ణయాలను సమావేశం ముగిసిన పావుగంటలోగా కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ చర్చాపత్రాలను విడుదల చేసింది. తద్వారా లిస్టెడ్ కంపెనీలు షేరు ధరపై ప్రభావాన్ని చూపగల కీలకమైన సమాచారాన్ని నిర్ణీత సమయంలోగా వెల్లడించేలా చేయాలన్నది సెబీ ప్రణాళిక. వెరసి ఇలాంటి అంశాల వెల్లడిలో ఆలస్యానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. వీటితోపాటు ఆర్థిక ఫలితాలు, స్వచ్చంద డీలిస్టింగ్, బోనస్ షేర్ల జారీ ద్వారా క్యాపిటల్ పెంచుకోవడం, రద్దు చేసిన షేర్లను తిరిగి జారీ చేయడంవంటి అంశాలను కూడా వెల్లడించేలా నిబంధనలను తీసుకు వచ్చే యోచనలో ఉన్నట్లు 26 పేజీల చర్చా పత్రాల్లో సెబీ పేర్కొంది. -
ఆడిటర్లు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్ యాజమాన్యం ప్రభుత్వానికి, పర్యవేక్షణ సంస్థలకు తప్పుడు నివేదికలు సమర్పించి దేశప్రతిష్టను దెబ్బతీసిందని పేర్కొంది. సెబీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెబీ రెండు వేర్వేరు ఫిర్యాదులు దాఖలు చేసింది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్ల్యుసీ ఆడిటింగ్ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నేర విచారణ చట్టంలోని సెక్షన్ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సెబీ స్పెషల్ పీపీ బీఎస్ శివప్రసాద్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదుతోపాటు 18 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా సమర్పించారు. సెబీ దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ప్రదీప్ రామకృష్ణన్ ఉండగా, సాక్షులుగా సెబీ సీజీఎం ఎ.సునీల్‌కుమార్, జీఎం బి.ముఖర్జీలను పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్...ఈ ఫిర్యాదులను విచారించే అవకాశం ఉంది. -
ఎఫ్‌టీఐఎల్‌కు సెబీ షాక్!
ముంబై: మూడు నెలల్లోగా స్టాక్ ఎక్స్ఛేంజీల బిజినెస్ నుంచి వైదొలగాల్సిందిగా ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్)కు సెబీ ఆదేశాలు జారీ చేసింది.జిగ్నేష్ షాకు చెందిన ఎఫ్టీఐఎల్ గ్రూప్‌నకు ఏరకమైన స్టాక్ ఎక్స్ఛేంజీల నిర్వహణ లేదా వాటాలను కలిగి ఉండేందుకు అర్హత లేదని సెబీ తాజాగా స్పష్టం చేసింది. వెరసి గడువులోగా ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్) సహా మరో నాలుగు ఎక్స్ఛేంజీలలో గల వాటాలను ఎఫ్టీఐఎల్ విక్రయించాల్సి ఉంటుంది. ఎన్ఎస్ఈ, ఢిల్లీ స్టాక్ ఎక్స్ఛేంజీ, వడోదర స్టాక్ ఎక్స్ఛేంజీ, ఎంసీఎక్స్‌ఎస్‌ఎక్స్ క్లియరింగ్ కార్పొరేషన్లలో ఎఫ్టీఐఎల్ గ్రూప్ వాటాలను కలిగి ఉంది. మరోవైపు వీటిలో ఎఫ్టీఐఎల్, తదితర సంస్థల ద్వారా ఈక్విటీలు, లేదా వోటింగ్ హక్కులు కలిగిన ఇతర సాధనాలవల్ల లభించే వోటింగ్ హక్కులను వినియోగించుకోవడాన్ని సెబీ నిషేధించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ చెల్లింపుల సంక్షోభం కారణంగా ఎఫ్టీఐఎల్ గ్రూప్ పలు సమస్యల్లో చిక్కుకున్న నేపథ్యంలో సెబీ ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కేవైసీ నిబంధనలు సరళతరం ఇన్వెస్టర్లు కొత్త బ్రోకింగ్ ఏజెన్సీకి లేదా ఫండ్‌కి మారిన ప్రతిసారి తమ వివరాలన్నింటినీ సమర్పించాల్సిన అవసరం లేకుండా కేవైసీ (కస్టమర్ల వివరాల) నిబంధనలను సెబీ సడలించింది. కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇక ఇన్వెస్టర్లు తొలుత ఇచ్చే వివరాలను కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ) వ్యవస్థలో నిక్షిప్తమవుతాయి. ఆ తర్వాత వేరే బ్రోకింగ్ ఏజెన్సీకి మారినా కస్టమరు ప్రత్యేకంగా కేవైసీ వివరాలన్నీ ఇవ్వనక్కర్లేదు. సదరు బ్రోకింగ్ ఏజెన్సీ క్లయింటు వివరాలన్నింటినీ మళ్లీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. కేఆర్ఏ వ్యవస్థ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇన్వెస్టర్ల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యూకే సిన్హా శనివారం పేర్కొన్నారు. తమ విధానాన్ని వ్యాపార వర్గాలకు వ్యతిరేకమైనదిగా భావించరాదని సూచించారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థకు సంబంధించి ప్రతిపాదించిన నిబంధనలను తదుపరి బోర్డ్ సమావేశంలో పెడతామని తెలియజేశారు. ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా ఒక వ్యక్తి ఎన్ని కంపెనీల్లో పనిచేయవచ్చన్న అంశంపై కూడా ఇందులో చర్చ జరుగుతుందని తెలిపారాయన. బోర్డు ఆమోదించాక మార్గదర్శకాలను ప్రకటిస్తామన్నారు. జాతీయ ఎక్స్ఛేంజీల సభ్యుల సంఘం (ఏఎన్ఎంఐ) వార్షిక అంతర్జాతీయ సదస్సులో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా సెబీ పనిచేస్తోందని కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఇలాంటి విమర్శలు తమను ఆవేదనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే చర్యలనే తాము తీసుకుంటున్నామని చెప్పారు. కాగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఇతర స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్యాపిటల్ మార్కెట్ల పురోభివృద్ధిలో ఇన్వెస్టర్ల విశ్వాస పెంపు చర్యలే కీలకమని వ్యాఖ్యానించారు. -
బ్యాంకింగ్ అవగాహన
1. Periodically Reserve Bank of India (RBI) reviews a few SLR norms. SLR stands for? a) Statutory Liquidity Ratio b) Statutory Liquidity Rate c) Statutory Liquidity Return d) Statutory Liquidity Repo e) None of the above 2. In the recent months, Indian Rupee depreciated heavily against US Dollar. Rupee depreciation means? a) Value of Rupee decreasing against a basket of currencies b) Less number of Rupees per US Dollar c) More number of Rupees per US Dollar d) Less number of Dollars per Rupee e) None of the above 3. In India, Commodities Market is regulated by? a) Forward Market Commission b) Forward Market Committee c) Forward Market Corporation d) Forward Market Council e) None of the above 4. Food Security Bill is recently passed by Parliament. What does the Food Security Bill intend to achieve? a) At least 3kg of food grains per person per month to be given to general category households, at prices not exceeding 50% of Minimum Support Price. b) Up to 75% of the rural population and up to 50% of urban population are to be covered under Targeted Public Distribution System. c) Children aged six months to 14 years would get take-home ration or hot cooked food. d) The oldest adult woman in each house would be considered the head of that household when issuing the ration card. e) All of the above 5. FIPB stands for? a) Foreign Investment and Production Board b) Foreign Investment and Promotion Board c) Foreign Investment and Promotion Bureau d) Foreign Investment and Protection Board e) None of the above 6. In India, Capital Markets are regulated by? a) Securities and Exchange Board of India b) Reserve Bank of India c) State Bank of India d) International Monetary Fund e) None of the above 7. RAND is the currency of ? a) China b) Japan c) North Korea d) South Africa e) None of the above 8. Recently RBI took several steps to control Rupee depreciation. Due to Rupee depreciation? a) Exports become costlier b) Imports become costlier c) Imports become cheaper d) Both (a)&(c) e) None of the above 9. India's GDP growth is slowing down. GDP means? a) Gross Domestic Product b) Gross Domestic Poverty c) Gross Demand Production d) Gross Demand Product e) None of the above 10. Chakravarthy Rangarajan is? a) Governor of Reserve Bank of India b) Director of Securities and Exchange Board of India c) Chairman of Prime Minister Economic Advisory Council d) Chairman of State Bank of India e) None of the above 11. International Monetary Fund (IMF) works to foster global monetary cooperation, promote high employment and sustainable economic growth. Who is the current managing director of IMF? a) Kaushik Basu b) Dr. Y V Reddy c) Jim Yong Kim d) Christine Lagarde e) None of the above 12. Air-Asia India is the new proposed Airline in India. It tied up with the following Industrial group for its launch in India? a) TATAs b) Reliance group c) Aditya Birla group d) Infosys e) None of the above 13. Raghuram Rajan became the 23rd RBI Governor on 5th September 2013. Whom did he succeed? a) Dr Y V Reddy b) D Subba Rao c) Bimal Jalan d) Dr Rangarajan e) None 14. IRDA headquarters located in which City? a) Mumbai b) Bangalore c) Hyderabad d) Chennai e) None of the above 15. Arundathi Battacharya was recently in the news. She is? a) Managing Director of SBI b) Chairman of Punjab National Bank c) CEO of ICICI Bank d) CEO of Axis Bank e) None of the above 16. India's CAD was 4.8% of GDP in 2012-13. CAD means? a) Current Amount Deficit b) Current Account Deficit c) Current Asst Debt d) Common Account Deficit e) None of the above 17. Which of the following is NOT matched? a) C B Bhave - SEBI b) Rangarajan - Planning Commission c) Raghuram Rajan - RBI d) T S Vijayan - IRDA e) Yogesh Agarwal - PFRDA 18. Who is the Chairman of the Planning Commission? a) P. Chidambaram b) Monteksingh Ahluwalia c) Raghuram Rajan d) Manmohan Singh e) None of the above 19. As per findings of the recent Raghuram Rajan Committee report which State is the most developed? a) Kerala b) Goa c) Gujarat d) Tamilnadu e) None of the above 20. As per the insurance bill, 2013, Foreign Investors can hold up to? a) 51% of the capital in an Indian insurance company b) 39% of the capital in an Indian insurance company c) 49% of the capital in an Indian insurance company d) 29% of the capital in an Indian insurance company e) None of the above 21. Statutory liquidity ratio(SLR) refers to the amount that the commercial banks require to maintain with RBI. What are the permitted SLR investments? a) Only Gold b) Gold or Govt approved Securities c) Only Govt approved Securities d) Only Cash e) None of the above 22. Direct Taxes Code (DTC) is intended to be introduced in the monsoon session of Parliament. DTC seeks to replace? a) Indian Contract Act b) Indirect Tax Act c) Income-Tax Act d) Banking Regulation Act e) None of the above 23. In July 2013, RBI notified that Non-CTS Cheques are valid till the end of year 2013. CTS means? a) Cheque Truncation System b) Cheque Transaction System c) Cheque Transmission Service d) Cheque Transport Service e) None of the above 24. In July 2013, SEBI Act was amended to curb Ponzi schemes. Ponzi Scheme means? a) Name of a Mutual Fund Scheme to earn higher returns b) Collective investment Schemes floated by fly by night operators c) Name of a Bank Deposit Product d) Name of a Health Insurance scheme e) None of the above 25. The minimum rate of Interest charged by a Bank from Customers on the loans is? a) Base Rate b) Bank Rate c) Prime Rate d) Prime Lending Rate e) None of the above 26. Which of the following is NOT true with regard to FCNR Accounts? a) NRIs can open the Account b) Can be opened in 'Permitted Currency' only c) Minimum Term is 1 year d) Maximum Term 5 years e) None of the above 27. REPO rate means? a) Rate at which the RBI will borrow from the banks b) Rate at which banks will borrow from other banks c) Rate at which the RBI lends to banks d) Rate at which banks lend to customers e) None of the above 28. Fiscal Deficit Refers to? a) The difference between the government's total expenditure and its total receipts (including borrowing) b) The difference between the government's total expenditure and its total receipts (excluding borrowing) c) The difference between the government's Tax collections and Salary payments d) The difference between the government's Tax collections and government's Borrowings e) None of the above 29. "DAX" is the stock market in? a) Germany b) USA c) France d) Hongkong e) None of the above 30. After retirement, Ratan Tata was made the Chairman Emeritus of Tata Sons. Who succeeded Ratan Tata as Chairman of Tata Sons? a) Cyrus Mistry b) Niira Radia c) Mukesh Ambani d) Nandan Nilekani e) None of the above 31. Yellow Metal refers to? a) Copper b) Silver c) Platinum d) Gold e) None of the above 32. Who is the Chairman of the committee set up to scrutinize applications for new Bank licenses? a) Usha Thorat b) Bimal Jalan c) C B Bhave d) S Damodaran e) None of the above 33. Who is the World Bank President? a) Christine Legrade b) Jim Yong Kim c) Raghuram Rajan d) Monteksingh Ahluwalia e) None of the above 34. Ben Bernanke is the Chairman of Federal Reserve. What is Federal Reserve? a) Central Bank of UK b) Financial wing of the World Bank c) Central Bank of USA d) European Union Central Bank e) None of the above Answers: 1) a; 2) c; 3) a; 4) e; 5) b; 6) a; 7) d; 8) b; 9) a; 10) c; 11) d; 12) a; 13) b; 14) c; 15) a; 16) b; 17) b; 18) d; 19) b; 20) c; 21) b; 22) c; 23) a; 24) b; 25) a; 26) e; 27) c; 28) b; 29) a; 30) a; 31) d; 32) b; 33) b; 34) c