Trading
-
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల లాగిన్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా కీలక చర్యలను సెబీ(SEBI) ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకమీదట అ«దీకృత యూజర్లే వారి ట్రేడింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. యూనిక్ క్లయింట్ కోడ్ (యూసీసీ)–డివైజ్–సిమ్ ఈ మూడింటితో కూడిన సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదన. యూపీఐ యాప్ అన్నది ఒక మొబైల్లో ఒకే యూజర్‌తో ఎలా అనుసంధానం అయి ఉంటుందో.. ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా సైతం యూజర్ మొబైల్‌తో అనుసంధానమై ఉంటుంది. యూపీఐ లావాదేవీల సమయంలో యూపీఐ అప్లికేషన్ క్లయింట్ సిమ్, మొబైల్ డివైజ్, వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేస్తుంది. అదే మాదిరిగా ట్రేడింగ్ అప్లికేషన్ సైతం యూజర్ యూసీసీ, సిమ్, మొబైల్ డివైజ్ నిజమైనవని ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్‌కు వీలు కల్పిస్తుంది.యూనిక్ క్లయింట్ కోడ్‌కు క్లయింట్ మొబైల్ నంబర్, డివైజ్ ఐఎంఈఐ నంబర్‌ను లింక్ చేయడాన్ని సెబీ ప్రతిపాదించింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అవ్వాలంటే.. సోషల్ మీడియా యాప్‌ల మాదిరే టైమ్ సెన్సిటివ్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సిటివ్ క్యూఆర్ కోడ్ ఆథెంటికేషన్ ద్వారే చేయాల్సి వస్తుంది. అలాగే, ట్రేడింగ్ యాప్‌లోకి బయోమోట్రిక్ ధ్రువీకరణతోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పత్రిపాదనలపై సలహా, సూచనలను మార్చి 11 లోపు తెలియజేయాలని సెబీ కోరింది.ఏఎంసీలు సకాలంలో పెట్టుబడి పెట్టాల్సిందేనూతన ఫండ్ పథకం (ఎన్ఎఫ్వో) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్దేశిత సమయంలోపు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలంటూ నిబంధనలను సెబీ సవరించింది. అలాగే, పారదర్శకత పెంపుకోసం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను సైతం ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. మరింత జవాబుదారీతనం, ఇన్వెస్టర్లలో విశ్వాసం, మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్వహణ సౌలభ్యం తీసుకొచ్చే దిశగా సెబీ ఈ చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం, పథకం పెట్టుబడుల విధానానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలోపు ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు గత డిసెంబర్లో ఆమోదం తెలపడం గమనార్హం. సాధారణంగా ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయకపోతే.. ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ (చార్జీ) చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఏఎంసీలు అనుమతించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎలా ఎదుర్కొంటాయో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. -
ఏది కొంటే ఎంత లాభం..?
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51 లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల మంది కేవలం ఆప్షన్స్(Options)లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.తొందరగా లాభాలు సంపాదించాలని..స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్లైన్లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్‌లో మనం ఆప్షన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్‌లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.కాల్, పుట్ తీసుకోవడం తెలియాలి..తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్‌లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.ఎట్ ది మనీ (ఏటీఎం)ఇన్ ది మనీ (ఐటీఎమ్)అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)ఎస్బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్‌లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్‌లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్‌ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్) = రూ.15,750 అన్నమాట.B అనే వ్యక్తి షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!పైన తెలిపిన దానికి రివర్స్‌లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్‌గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్‌లో తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
‘ఆప్షన్స్’తో గేమ్లొద్దు!
కరోనా ఎంతోమంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆదాయ మార్గాలు అడుగంటాయి. ఈ తరుణంలో ఉన్నకొద్ది డబ్బులతో ఇంట్లో కూర్చుని ఎలాగోలా నాలుగు రూపాయలు సంపాదించడానికి చాలామంది ఎంచుకున్న ఆదాయ మార్గం స్టాక్ మార్కెట్. అది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్(Option Trading). మార్కెట్‌పై సరైన నాలెడ్జ్ లేకపోవడం, అరాకొరా పరిజ్ఞానంతో అడుగుపెట్టడం వంటి కారణాలతో ఎంతోమంది ట్రేడర్లు మునిగిపోయారు. ముఖ్యంగా తక్కువ డబ్బులతోనే ఎక్కువ సంపాదించవచ్చనే దురాశ, చేసిన తప్పులే చేస్తూండడం, డబ్బు పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించవచ్చులే అనే ఉద్దేశంతో అప్పు చేసి మరిన్ని డబ్బులు పెట్టడం.. అవి కూడా పోగొట్టుకోవడం..జీవితంలో కోలుకోలేని దెబ్బ తినడం.. చాలామంది ఎదుర్కొన్న, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్లలో అధిక శాతం ఆప్షన్స్ ట్రేడర్లే.నిజంగా అంత ప్రమాదమా..?నిజంగా ఆప్షన్స్ అంత ప్రమాదకరమా..? పెట్టే డబ్బులన్నీ పోవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆప్షన్స్ తో గేమ్ లాడొద్దు. ఆదమరిస్తే మునిగిపోతారు. మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఈక్విటీ(Equity)ల్లో అయితే లాట్ కొనుగోలు చేసి లాభం వచ్చేంత వరకు కొన్ని రోజులపాటు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ అలా కాదు. ఏమాత్ర ఏమరపాటుగా ఉన్నా క్యాపిటల్ అంతా పోగొట్టుకోవాల్సిందే. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే ముందు ఏయే అంశాలు తెలిసి ఉండాలో చూద్దాం.అండర్ లయింగ్ అసెట్కాల్స్పుట్స్స్ట్రైక్ ప్రైస్ఆప్షన్స్ చైన్ఓపెన్ ఇంటరెస్ట్చేంజ్ ఇన్ ఓపెన్ ఇంటరెస్ట్వాల్యూమ్ఇంటరెన్సిక్ వేల్యూడెల్టా, గామా, తీటా, వెగా, ఆర్హెచ్ఓఅండర్ లయింగ్ అసెట్ అంటే మనం కొనాలనుకుంటున్న షేర్ విలువ. దీన్ని ఆధారం చేసుకునే ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ప్రీమియంలు నిర్ధారితమవుతాయి. ఎఫ్ అండ్ ఓలో ఏది కొన్నా లాట్ల్లోనూ కొనుగోలు చేయాలి. ఫ్యూచర్స్(Futures)లో కూడా ఇంచుమించు షేర్ ధర అదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు మీరు రిలయన్స్ షేర్ కొనాలి అనుకున్నారు. ప్రస్తుత షేర్ ధర రూ.1240 దగ్గర ఉంది. ఇది అండర్ లయింగ్ అసెట్ అవుతుంది. ఫ్యూచర్స్ & ఆప్షన్స్‌లో మనం లాట్స్ రూపంలోనే షేర్లు కొనాలి అని చెప్పుకున్నాం కదా. ఒక లాట్ కొనాలి అంటే కనీసం 500 షేర్లు తీసుకోవాలి. ఈక్విటీల్లో కొనాలి అంటే దాదాపు రూ.6,20,000 పెట్టుబడి పెట్టాలి. ఇదే ఫ్యూచర్స్‌లో అయితే రూ.1,10,000 ఉంటే సరిపోతుంది. అదే ఆప్షన్స్‌లో అయితే రూ.1240 కాల్ కొనాలి. ఇది రూ.27 లో ఉంది. అంటే రూ.13,500 (రూ.27X500)ఉంటే చాలు కొనేయగలం. పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.అసలు సమస్య ఇదే..తక్కువకు వస్తుందని పరిస్థితులు తెలుసుకోకుండా ఆప్షన్స్ ఎంచుకుంటే షేర్ ధర రూ.1240 దాటి పెరుగుతున్నంత సేపూ ఈ కాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా లాభాలు సంపాదించొచ్చు. అదే షేర్ ధర పడిపోతూ ఉంటే కాల్ కూడా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ కాల పరిమితి కేవలం నెల రోజులే. ఈ నెల రోజుల్లో షేర్ ధర పెరగకపోయినా, అక్కడక్కడే కదలాడుతూ ఉన్నా నెలాఖరుకి మన పెట్టుబడి సున్నా అయిపోతుంది. అంటే మొత్తం రూ.13,500 పోతాయి. షేర్ ధర కంటిన్యూగా పెరుగుతూ ఉంటే వచ్చే లాభం మాత్రం అపరిమితంగా ఉంటుంది. ఇక్కడ టైం డికే (కాల వ్యవధి తగ్గిపోతూ ఉండటం) చాలా కీలకం.ఇప్పుడేం చేయాలి..షేర్ ధర పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొనాలి. పైన తెలిపిన ఉదాహరణనే తీసుకుంటే.. రిలయన్స్ షేర్ ధర రూ.1240 కంటే పడిపోతుంది అని భావిస్తే రూ.1240 ఫుట్ కొనాలి. ఇది రూ.22 లో ఉంది. (500X22 = 11000) షేర్ ధర పడిపోతున్న కొద్దీ మనకొచ్చే లాభం పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా షేర్ రూ.1240 దాటి పెరుగుతూ వెళ్లినా, అక్కడక్కడే కదలాడిన నెలాఖరుకి మన ప్రీమియం హరించుకుపోయి చివరికు జీరో అవుతుంది. నెల రోజులకు మించి ఈ ఆప్షన్స్‌ను కొనసాగించే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా తగిన లాభాల్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ బయటకు వచ్చేయడం ఉత్తమం.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుగుర్తు పెట్టుకోవాల్సినవి..షేర్ ధర పెరిగేటప్పుడు పెరిగేవి కాల్స్షేర్ ధర పడిపోయేటప్పుడు పెరిగేవి పుట్స్ఒక కంపెనీ షేర్ ధర మనం కొనాలనుకునే ఆప్షన్స్‌కు అండర్ లయింగ్ అసెట్ అవుతుంది.షేర్ ధరకు అనుగుణంగా మనం తీసుకునే కాల్/పుట్ (ఉదా: రూ.1230, 1240, 1250, 1260... ఇలా)నే స్ట్రైక్ ప్రైస్ అంటారు.వీటికి తోడు ఆప్షన్స్ చైన్, అందులో ఓపెన్ ఇంటరెస్ట్, ఓపెన్ ఇంటరెస్ట్‌లో చోటు చేసుకునే మార్పులు, వాల్యూమ్, ఇంటరెన్సిక్ వ్యాల్యూ వంటివి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవేగాక ఇన్ ది మనీ (ఐటీఎమ్), ఎట్ ది మనీ (ATM), అవుట్ అఫ్ ది మనీ (ఓటీఎం) ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఈ మూడింటి గురించి తదుపరి ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
Stock Market Trading: ఇండెక్స్‌ల్లో ట్రేడ్ చేస్తున్నారా...!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఈక్విటీలు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ అనే మార్గాలు ఉంటాయని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం కదా...ఇందులో ఫ్యూచర్స్ & ఆప్షన్స్... దానిలో ఇండెక్స్ ట్రేడ్ ల గురించి ఇప్పుడు చూద్దాం.వాస్తవానికి ఫ్యూచర్స్ కి, ఈక్విటీల్లో ట్రేడింగ్ కి పెద్దగా తేడా ఉండదు. ఈక్విటీ ల్లో షేర్లు గా వ్యవహరిస్తే... ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ) లో కాంట్రాక్టులు గా పేర్కొంటారు. ఈక్విటీల్లో మనం కొనే షేర్లు ఎన్ని సంవత్సరాలైనా అట్టేపెట్టుకోవచ్చు. షేర్లు అనేవి మన ఆస్తిగా భావించవచ్చు. కాంట్రాక్టులను మాత్రం ఆవిధంగా పరిగణించలేం. ఎఫ్ & ఓ లో కాంట్రాక్టులు కొన్నప్పుడు కేవలం ఒక నెల రోజుల వ్యవధికే పరిమితమవుతాయి.ఒకవేళ మనం కొన్న కాంట్రాక్టు మంచి లాభాల్లో ఉంటే ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. అదే నష్టాల్లో ఉంటే నెల రోజుల వరకు ఆగొచ్చు. అప్పటికీ నష్టాల్లోంచి బయట పడకపోతే కచ్చితంగా నెలాఖరున బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆ కాట్రాక్టు రాబోయే రోజుల్లో పెరుగుతుందనే నమ్మకం ఉంటే... ప్రస్తుతం చేతిలో ఉన్న కాంట్రాక్టు ను నెలాఖరున అమ్మేసి తదుపరి నెల కాంట్రాక్టు ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఈక్విటీల్లో ఒక్క షేర్ మొదలుకొని మన చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి ఎన్ని షేర్లు అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ & ఓ లో తప్పనిసరిగా లాట్స్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేరును బట్టి, ఇండెక్స్ ను బట్టి లాట్ సైజు ను నిర్ణయిస్తారు.ఉదా: రిలయన్స్ షేర్ ధర రూ. 1250 ఉంది. దీన్ని ఎఫ్ & ఓ లో కొనుగోలు చేయాలంటే 500 షేర్లు (1 లాట్) తీసుకోవాలి. అదే జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ 5625 (ఒక లాట్) షేర్లు కొనాలి. ఐటీసీ అయితే.. 1600 (ఒక లాట్) తీసుకోవాలి.ఎఫ్ & ఓ లో ట్రేడ్ చేయాలంటే కేవలం లాట్స్ లో అది కూడా పరిమిత కాలానికి మాత్రమే కొనగలం అన్న విషయం అర్ధం అయింది కదా... ఇప్పుడు ఇండెక్స్ ల గురించి మాట్లాడుకుందాం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కి నిఫ్టీ ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయం మనకు తెలుసు కదా...ఈ సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, బీఎస్ఈ బ్యాంకెక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. బ్యాంకు నిఫ్టీ ల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి కాక ఆటో, ఫార్మా, ఐటీ.... ఇలా వివిధ రంగాలకు కూడా ఆయా ఇండెక్స్ లు ఉంటాయి. కానీ వీటిలో ట్రేడింగ్ చేయలేం.గత నవంబర్ 20 వ తేదీ వరకు మిడ్ నిఫ్టీ కి సోమవారం, ఫిన్ నిఫ్టీ కి మంగళవారం, బ్యాంకు నిఫ్టీ కి బుధవారం, నిఫ్టీ కి గురువారం, సెన్సెక్స్ కు శుక్రవారం... ఇలా వీక్లీ కాంట్రాక్టు లు ఉండేవి. అంటే ఆ వారాంతానికి ముగిసిపోయే కాంట్రాక్టు లన్న మాట. ఇలా ట్రేడింగ్ జరిగే ప్రతి రోజూ ఏదో ఒక ఎక్సపైరీ ఉండటం వల్ల రిటైల్ ట్రేడర్లు భారీగా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో సెబీ... సెన్సెక్స్, నిఫ్టీ లకు తప్ప మిగతా ఇండెక్స్ లకు వీక్లీ కాంట్రాక్టు లు తీసేసింది.బీ ఎస్ ఈ కి సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ కి నిఫ్టీ లు ప్రామాణిక సూచీలు కాబట్టి వీటిలో మాత్రం వీక్లీ, మంత్లీ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్సపైరీ శుక్రవారం ఉండగా వచ్చే వారం నుంచి మంగళవారం (జనవరి 7,14, 21, 28... ఇలా ) కి మారబోతోంది. నిఫ్టీ కి మాత్రం గురువారమే కొనసాగుతుంది. అలాగే లాట్ సైజు లను కూడా సెబీ మార్చింది. వాటి వివరాలు.ఇండెక్స్లాట్ సైజు ప్రస్తుతంమార్చాకఅమల్లోకి వచ్చే/వచ్చిన తేదీ నిఫ్టీ2575జనవరి 2, 2025బ్యాంకు నిఫ్టీ1530ఫిబ్రవరి 2025ఫిన్ నిఫ్టీ2565 ఫిబ్రవరి 2025మిడ్ నిఫ్టీ50120 ఫిబ్రవరి 2025సెన్సెక్స్ 10 20 జనవరి 7, 2025 నిఫ్టీ నెక్స్ట్ 50 10 25 నవంబర్ 20, 2024 బీఎస్ఈ బ్యాంకెక్స్ 15 30 నవంబర్ 20, 2024మిడ్, ఫిన్, బ్యాంకు నిఫ్టీ ల్లో ట్రేడ్ చేయాలంటే తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి చాల ఖరీదు ఉంటాయి. అదే సమయంలో లాట్ సైజు లను కూడా పెంచడం వల్ల రిటైల్ ట్రేడర్లు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ప్రమేయం తగ్గుతుందని, తద్వారా వారి నష్టాల స్థాయిని తగ్గించవచ్చనేది సెబీ ఉద్దేశం.ఉదా: గతంలో ఒక ట్రేడర్ రూ. 100 ఖరీదు చేసే నిఫ్టీ 50 ఆప్షన్ ఒక లాట్ కొనడానికి రూ. 100 X 25 (లాట్ సైజు) = రూ.2,500 వెచ్చిస్తే సరిపోయేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అదే లాట్ కొనాలంటే రూ. 7,500 పెట్టాలి. అంటే చేతిలో రూ.25,000 ఉన్న వ్యక్తి 10 లాట్లు కొనగలిగేవాడు కాస్తా తాజాగా రూ.75,000 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి... ట్రేడింగ్ లో రిటైలర్ల ప్రమేయం తగ్గిపోతుంది. తద్వారా వారికొచ్చే నష్టాలు కూడా పరిమితం గానే ఉంట్టాయన్న ఉద్దేశంతో సెబీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇండెక్స్ ల్లో ట్రేడ్ చేసేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
బడ్జెట్ రోజున ఎక్సేచెంజీలు పనిచేస్తాయ్
ముంబై: వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2025–26) గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఆ రోజు శనివారం అయినా కూడా ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3.30 గంటల మధ్య ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇరు ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. గతంలో 2020 ఫిబ్రవరి 1న, 2015 ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పని చేశాయి. -
షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టాలపాలై చివరకు ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ నిజంగానే అంత ప్రమాదకరమా? మార్కెట్లో అడుగుపెట్టిన వారికి ఈ పరిస్థితి రావాల్సిందేనా? మార్కెట్ ముంచేస్తుందా? మరి లాభాలు ఎవరికి వస్తున్నాయి? నష్టాలు వస్తున్నవారు అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? అనే చాలా ప్రశ్నలొస్తాయి. వీటిని విశ్లేషించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.స్టాక్ మార్కెట్ అద్భుత సాధనంస్టాక్ మార్కెట్ ఎప్పటికీ ప్రమాదకరం కాదు. పైగా మంచి రాబడి ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్న ఒక అద్భుత సాధనం. ఓ పక్క కుటుంబం ప్రాణాలు వదులున్న ఘటనలున్నాయని చెప్పారు కదా. మరి స్టాక్ మార్కెట్ బెటర్ అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి వెంటనే రాబడి రావాలంటే చాలా కష్టం. మార్కెట్ తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంటుంది. కాబట్టి సరైన సమయం ఇచ్చి రాబడి ఆశించాలి. లార్జ్ క్యాప్ స్టాక్ల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే దాదాపు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తొందరగానే రావొచ్చు. నష్టాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తకొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్సైడర్ ట్రేడింగ్(అంతర్గత సమాచారంతో చేసే ట్రేడింగ్) జరుగుతుంటుంది. అది నిబంధనలకు విరుద్ధం. అది సాధారణ ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. దాంతో పెన్నీ స్టాక్ బాగా ర్యాలీ అవుతుందనే ఉద్దేశంతో అందులో పెట్టుబడి పెట్టి చివరకు నష్టాలతో ముగించాల్సి ఉంటుంది. కాబట్టి పెన్నీ స్టాక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు వాటి వైపు చూడకపోవడం ఉత్తమం.ఎవరో చెప్పారని..చాలామంది స్టాక్ మార్కెట్ అనగానే వెంటనే లాభాలు వచ్చేయాలి.. తక్కువ మొత్తం పెట్టుబడితో అధికంగా లాభాలు ఆర్జించాలనే ఆశతో మార్కెట్లోకి అడుగుపెడుతుంటారు. అలాంటి వారు తొందరగానే నష్టాలు మూటగట్టుకుంటారు. కాసింత లాభం కళ్ల చూడగానే మార్కెట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని అనుకుంటారు. కానీ చాలామందికి స్టాక్స్‌కు సంబంధించి సరైన అవగాహన ఉండడం లేదు. ఎవరో చెప్పారని, ఏదో ఆన్లైన్లో వీడియో చూశారని, వాట్సప్, టెలిగ్రామ్.. వంటి ఛానల్లో ఎవరో సజెస్ట్ చేశారని పెట్టుబడి పెడుతున్నవారు చాలా మంది ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిస్టాక్ మార్కెట్లో తాము ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఎందుకు పెరుగుతోందో చాలామందికి తెలియదు. అది ఇంకెంత పెరుగుతుందో అవగాహన ఉండదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. నిన్నపెరిగింది కదా.. ఈరోజు పడుతుందిలే.. లేదంటే.. నిన్న పడింది కదా.. ఈరోజు పెరుగుతుందిలే..అని సాగిపోతుంటారు. దాంతో భారీగా క్యాపిటల్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పటికీ తేరుకోకపోగా ఫర్వాలేదు.. పూడ్చేద్దాం అనుకుంటారు. ఆ నష్టం పూడకపోగా.. మరింత పెరుగుతుంది. అప్పు చేస్తారు. ఎలాగైనా సంపాదించి తీర్చేద్దాం అనుకుంటారు. అదీ జరగదు. క్రమంగా అప్పులు పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోతుంది. చివరకు ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..దీర్ఘకాలిక దృక్పథం అవసరంట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయాలి. స్టాక్మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది నిజం. కానీ నిమిషాల్లో సంపాదించేయలేం. ఓపిక ఉండాలి. దీర్ఘకాలిక దృక్పథం అవసరం. అప్పుడే ఎవరైనా మార్కెట్లో రాణించగలుగుతారు. లేదంటే ఆషేర్లే మెడకు ఉరితాళ్ళుగా మారి కుటుంబాల్ని విషాదాల్లో నింపేస్తాయి.డబ్బు ఎవరు సంపాదిస్తున్నారంటే..మార్కెట్ తీరుతెన్నులను ఓపిగ్గా గమనిస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేరుగా డబ్బు పెట్టి ట్రేడింగ్ చేయడం కంటే కనీస ఆరు నెలలపాటు పేపర్ ట్రేడింగ్ చేయాలి. దాంతో అవగాహన వస్తుంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో చాలా కంపెనీలు కాన్కాల్ ఏర్పాటు చేస్తాయి. అందులో పాల్గొనాలి. ఒకవేళ అవకాశం లేకపోతే తర్వాత రెగ్యులేటర్లకు ఆయా వివరాలను అప్డేట్ చేస్తాయి. ఆ డాక్యుమెంట్లు చదవాలి. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..రెవెన్యూ అంశాలు ఎలా ఉన్నాయి.. క్యాష్‌ఫ్లోలు ఎలా ఉన్నాయి.. అనుబంధ సంస్థలతో జరిపే రిలేటెడ్ పార్టీ లావాదేవీలు ఎలా ఉన్నాయి.. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు.. పోటీలో ఉన్న కంపెనీలు, వాటి విధానం.. కాలానుగుణంగా సరైన సెక్టార్‌లోని స్టాక్‌లనే ఎంచుకున్నామా.. వంటి చాలా అంశాలను పరిగణించి పెట్టుబడి పెట్టాలి. అలా చేసిన తర్వాత దీర్ఘకాలంపాటు వేచిచూస్తేనే మంచి రాబడులు అందుకోవచ్చు.- బెహరా శ్రీనివాసరావుస్టాక్ మార్కెట్ నిపుణులు -
Stock market: ఈ ట్రాప్‌లో పడకండి
స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి. ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి. ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...హలో సర్..చెప్పండి..మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...అవునండీ చేస్తున్నా...ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...రెండూ..మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...3 లక్షలు..ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?4000 -5000 దాకా...అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..(మనవాడిలో ఆశ బలపడింది.) అయితే చెప్పండి..మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?ఫలానా దాంట్లో...మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు. వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
‘ఈ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్ వద్దు’.. సెబీ హెచ్చరిక!
అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్ఫామ్ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.ఇప్పటికే హెచ్చరికలుఅనధికారిక వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్ఫామ్ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐకొన్ని లిస్టెడ్ ఆన్లైన్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్లుగ్రోజెరోధాఏంజిల్ వన్అప్స్టాక్స్ఐసీఐసీఐ డైరెక్ట్కోటక్ సెక్యూరిటీస్హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ఎస్బీఐ సెక్యూరిటీస్మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ -
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
ఐటీ షేర్ల దెబ్బ.. సంవత్ చివరిరోజూ నష్టాలే!
బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్‌కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పండగవేళ నష్టాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 66 పాయింట్లు తగ్గి 24,272కు చేరింది. సెన్సెక్స్ 251 పాయింట్లు నష్టపోయి 79,681 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.33 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.56 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఐఐలు నిత్యం వేలకోట్ల రూపాయల విలువ చేసే షేర్లు విక్రయిస్తున్నారు. కొన్ని రేటింగ్ ఏజెన్సీలు సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5-7 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మ్యూచవల్ ఫండ్స్ వద్ద ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో ఎఫ్ఐఐలు మరింతగా విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు ఏఎంసీల వద్ద సరిపడా డబ్బు ఉండకపోవచ్చనే వాదనలున్నాయి. కానీ ఈ తాత్కాలిక పరిణామాలకు భయపడి విక్రయాలు అమ్మకాలు చేయకుండా మంచి కంపెనీ స్టాక్లను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెలవున్నా గంట పని చేస్తాయ్.. ఎందుకంటే?
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి రోజు లక్ష్మీ పూజతోపాటు, సాయంత్రం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ చరిత్రఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం నవంబర్ 1న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ పండితులు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా నవంబర్ 1న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: అధికంగా విక్రయించిన స్టాక్‌లు ఇవే..నవంబర్ 1 దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుమార్కెట్ సాయంత్రం 6:15కు ఓపెన్ అవుతుంది.మార్కెట్ సాయంత్రం 7:15కు ముగుస్తుంది.ట్రేడ్ సవరణ ముగింపు సమయం సాయంత్రం 7:25 -
ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.2020లో కరోనా వైరస్ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్ అండ్ ఓలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.మరోవైపు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. -
టపటపా!.. స్టాక్ మార్కెట్ల భారీ పతనం
సూచీలు ఒకశాతానికి పైగా పతనం కావటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ మంగళవారం ఒక్కరోజే రూ.9.19 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ.444.45 లక్షల కోట్లకు (5.29 ట్రిలియన్ డాలర్లు) దిగివచి్చంది.ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అమ్మకాలు వెల్లువెత్తాయి. సూచీలు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు పతనమైన 80,221 వద్ద స్థిరపడగా... నిఫ్టీ 309 పాయింట్లు క్షీణించి 24,472 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు రెండు నెలల కనిష్టం కావడం గమనార్హం. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలతో నష్టాల బాటపట్టాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల తీవ్రత మరింత పెరిగింది.ఒక దశలో సెన్సెక్స్ 1,002 పాయింట్లు క్షీణించి 80,149 వద్ద, నిఫ్టీ 335 పాయింట్లు పతనమై 24,446 వద్ద కనిష్టాలు తాకాయి. వాస్తవానికి ఇండెక్స్‌లు ఒక శాతమే నష్టపోయినా... మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు చాలావరకూ భారీగా పతనమయ్యాయి. కొన్ని డిఫెన్స్ రంగ షేర్లు 10–12 శాతం వరకూ పతనం కాగా... ప్రభుత్వ బ్యాంకులతో సహా పలు ప్రధాన రంగాల షేర్లు 3–6 శాతం మధ్యలో నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలే ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీల వారీగా అత్యధికంగా ఇండ్రస్టియల్ ఇండెక్స్ 3.50% నష్టపోయింది. రియల్టీ 3.30%, కమోడిటీ 3%, పవర్ 2.64%, యుటిలిటి, టెలికం, కన్జూమర్ డి్రస్కేషనరీ సూచీలు 2.50 నష్టపోయాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ ఏకంగా 4% పతనమైంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.50% నష్టపోయింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ సూచీలు మినహా అన్ని దేశాల ఇండెక్సులు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 1.50% పడిపోగా. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.నష్టాలు ఎందుకంటే.. కార్పొరేట్ కంపెనీల సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతు న్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... నవంబర్‌లో పావుశాతం మేరకే వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు న్నాయి. అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 3 నెలల గరిష్టానికి (4.21%), డాలర్ ఇండెక్సు 103.96 స్థాయికి చేరుకున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణులకు కారణమయ్యాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంకు షేరు 0.67% లాభంతో గట్టెక్కింది. ఎంఅండ్ఎం 4%, టాటా స్టీల్ 3%, ఎస్బీఐ 2.95%, టాటా మోటార్స్ 2.64%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.50%, రిలయన్స్ 2%, ఎల్అండ్టీ 2%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 1% చొప్పున నష్టపోయాయి. -
పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓ
స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ కామత్ తెలిపారు. సెబీ ఇటీవల చేసిన బ్రోకరేజ్ ఛార్జీలో మార్పుల వల్ల స్టాక్ బ్రోకింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్ట్‌లో మాట్లాడారు.‘జెరోధా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,370 కోట్ల ఆదాయాన్ని సంపాధించింది. అందులో రూ.4,700 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023లో కంపెనీ ఆదాయం రూ.6,875 కోట్లు, నికర లాభం రూ.2,900 కోట్లుగా ఉంది. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ (ఎంఐఐ)ల్లో పారదర్శకతను నిర్ధారించడానికి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌లో నష్టపోయే బాధితులను తగ్గించేందుకు సెబీ ఇటీవల నిబంధనల్లో మార్పులు చేసింది. వాటి అమలుతో కంపెనీకి రానున్న ఏడాదిలో లాభాలు తగ్గనున్నాయి. ఇండెక్స్ డెరివేటివ్ ట్రేడింగ్ విభాగంలో కంపెనీకు సమకూరే రాబడి 30-50% వరకు తగ్గనుంది’ అని చెప్పారు. సెబీ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. దాదాపు 97 శాతం మంది ట్రేడర్లు ఈ విభాగంలో నష్టాలపాలవుతున్నట్లు గుర్తించింది. దాంతో నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపునిబంధనల్లో మార్పులివే..ఇండెక్స్ డెరివేటివ్‌ల కోసం కనీస కాంట్రాక్ట్ పరిమాణం ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. దాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే ఆరు నెలల్లో దీన్ని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచనున్నారు. బ్రోకర్లు క్లయింట్ల నుంచి ఆప్షన్ ప్రీమియంలను ముందుగానే సేకరించవలసి ఉంటుంది. వీక్లీ ఎక్స్‌పైరీలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్లు (ఎంఐఐ) ఇంట్రాడే(అదే రోజు ముగిసే ట్రేడింగ్) ప్రాతిపదికన ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లను పర్యవేక్షిస్తాయి. -
బోనస్ షేర్ల ట్రేడింగ్‌లో సెబీ మార్పులు
బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.ప్రస్తుత ఐసీడీఆర్ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్లు అదే ఐఎస్ఐఎన్ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే బోనస్ షేర్లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. -
ఎక్స్ఛేంజీల్లో ‘కరెంట్’పై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పవర్ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాల ట్రేడింగ్ జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో బుక్ చేసుకున్న 1,000 మెగావాట్ల కారిడార్‌ను వదులుకున్నందుకు రూ.261.31 కోట్ల చార్జీలను టీజీఎస్పీడీసీఎల్ చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చేసిన ఫిర్యాదుతో ఈ మేరకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర విద్యుత్ శాఖ 2022 మార్చి 10న ప్రకటించిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్ కింద విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్ సంస్థలకు చెల్లింపులను ఇన్వాయిస్ల జారీ నుంచి 75 రోజుల్లోగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో విఫలమైన దేశంలోని 16 డిస్కంలను బ్లాక్ లిస్టులో పెడుతూ ‘ప్రాప్తి’పోర్టల్‌లో గ్రిడ్ కంట్రోలర్ గురువారం ప్రకటన చేయగా, ఆ జాబితాలో టీజీఎస్పీడీసీఎల్ సైతం ఉండటం గమనార్హం. 2,000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసిన గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండటంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగో లు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేసుకోవడం కోసం అప్పట్లో పీజీసీఐఎల్ నిర్మిస్తున్న వార్ధా–డిచ్పల్లి 765/400 కేవీ కారిడార్‌లో ముందస్తుగా 2,000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకోవడానికి దర ఖాస్తు చేసుకుంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునేందుకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ విద్యుత్ ధరలు అధికంగా ఉంటాయని విమర్శలు రావడంతో మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేసే ఆలోచనను విరమించుకుంది.ఈ నేపథ్యంలో 1000 మెగావాట్ల కారిడార్‌ను మాత్రమే కేటాయించాలని పీజీసీఐఎల్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో పీజీసీఐఎల్ ఆ కారిడార్ కేటాయింపులను రద్దు చేసింది. కారిడార్‌ను వదు లుకున్నందుకు రూ.261.31 కోట్ల రిలింక్వి‹Ùమెంట్ చార్జీలను చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్కు డిమాండ్ నోటీసులు చేసింది. టీజీఎస్పీడీసీఎల్ ఈ చార్జీల ను చెల్లించకపోవడంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీఈఆర్సీని ఆశ్రయించింది. టీజీఎస్పీడీసీఎల్ తర హాలోనే దేశంలో కారిడార్ వదులుకున్న మిగిలిన అన్ని డిస్కంల వివరాలను సమరి్పంచాలని పీజీసీఐఎల్‌ను అప్పట్లో సీఈఆర్సీ ఆదేశించింది.ఈ వివరాలేవీ అందించకుండా పీజీసీఐఎల్ రూ.261.31 కోట్ల చార్జీలను ఎలా లెక్కించిందని టీజీఎస్పీడీసీఎల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ డిపాజిట్ చేసిన రూ.కోటి బ్యాంకు గ్యారంటీని పీజీసీఐఎల్ ఏకపక్షంగా జప్తు చేసుకుంది. చార్జీలు అడగకుండా పీజీసీఐఎల్‌ను నిలువరించాలని కోరుతూ 2021 జూన్ 25న సీఈఆర్సీని టీజీఎస్పీడీసీఎల్ సంప్రదించగా, కేసు విచారణ తుది దశకు చేరింది. కేసు పెండింగ్‌లో ఉండగానే టీజీఎస్పీడీసీఎల్ను బ్లాక్ లిస్టులో పెట్టడం గమనార్హం. -
బలహీనత కొనసాగొచ్చు
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలకు తోడు దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో దలాల్ స్ట్రీట్ బలహీనంగా కదలాడొచ్చని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ‘‘కార్పొరేట్ తొలి త్రైమాసిక ఫలితాల మాదిరిగానే దేశీయ క్యూ1 జీడీపీ వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఆగస్టు పీఎంఐ తయారీ, సేవా రంగ డేటా, ఆటో అమ్మకాలు మెప్పించలేపోయాయి. ఈ పరిణామాలతో అప్రమత్తత వాతావరణం నెలకొని ఉంది. అధిక వాల్యుయేషన్ల కారణంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించలేపోతున్నాయి. కమోడిటీ ధరలు తగ్గడంతో మెటల్ షేర్లూ నష్టాలు చవిచూస్తున్నాయి. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 24,500–24,400 పరిధిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,400 వద్ద మరో మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల గతవారంలో సెన్సెక్స్ 1,182 పాయింట్లు, నిఫ్టీ 384 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి అమెరికా ఆగస్టు ద్రవ్యల్బోణ గణాంకాలు సెపె్టంబర్ 11న, దేశీయ ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణ, జూలై పారిశ్రామికోత్పత్తి డేటా గురువారం విడుదల కానున్నాయి. అమెరికా ప్రొడ్యూసర్ ప్రెస్ ఇండెక్స్(పీపీఐ) సెపె్టంబర్ 14న వెల్లడి కానున్నాయి. అమెరికాలో ఉపాధి కల్పన తగ్గినట్లు డేటా వెలువడంతో ఫెడ్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్ల మే వడ్డీరేట్లను తగ్గించే అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక మాంద్య భయాలు తెరపైకి వచ్చాయి.ఈ వారం ఐపీఓల పండుగ దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల వారం మళ్లీ వచి్చంది. మెయిన్ బోర్డు విభాగంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో సహా నాలుగు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. అందులో పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్, టొలిన్స్ టైర్స్, క్రాస్ కంపెనీలు ఉన్నాయి. తద్వారా ఆయా కంపెనీలు మొత్తం రూ.8,390 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. అలాగే తొమ్మిది సంస్థలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించనున్నాయి. ‘‘సెబీ నిబంధల ప్రకారం కంపెనీలు సమరి్పంచిన ముసాయిదా పత్రాల్లోని ఆర్థిక గణాంకాలు ఆరు నెలలలోపు అయి ఉండాలి. గత ఆర్థిక సంవత్సరంలో సెబీ నుంచి అనుమతులు పొందిన ఐపీఓలకు ఈ సెపె్టంబర్ చివరి నెల కావడంతో కంపెనీలు ఇష్యూ బాట పట్టాయి’’ అని ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలిపారు. తొలివారంలో రూ.11వేల కోట్ల కొనుగోళ్లు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ తొలి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–6 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,600 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
అధికారులకు ముఖేష్ మీనా సూచనలు ఈవీఎం స్లిప్ లు తగలబెట్టండి..
-
ట్రేడింగ్ చేస్తున్నారా.. జాగ్రత్త!
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ అనగానే.. ఆహా! లక్షలు సంపాదించవచ్చని చాలామంది భావిస్తారు. అందులో పెట్టుబడి పెట్టేవారు ఒక్కరోజులోనే భారీగా లాభాలు రావాలని ఆశిస్తారు. దాంతో ఎక్కువగా ఇంట్రాడే ట్రేడింగ్(ఒకరోజులో స్టాక్స్ కొని అదేరోజు అమ్మడం)ను ఎంచుకుంటున్నారు. కానీ అలా ట్రేడింగ్ చేస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురు నష్టపోతున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం 2018–19తో పోలిస్తే 2022–23లో ఈక్విటీల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసిన వారి సంఖ్య ఏకంగా 300 శాతం పెరిగింది. వీరిలో ఎక్కువ శాతం మంది 30 ఏళ్ల లోపు యువ ట్రేడర్లే ఉన్నారు.ఇంట్రాడే ట్రేడింగ్‌లో లాభపడిన వారితో పోలిస్తే నష్టపోయిన ట్రేడర్లు సగటున అత్యధికంగా లావాదేవీలు చేశారు. వీరి లాభనష్టాల సరళిని విశ్లేషించడానికి సెబీ అధ్యయనం నిర్వహించింది. కరోనా మహమ్మారికి పూర్వం, తర్వాత ట్రెండ్స్‌ను పరిశీలించేందుకు 2018–19, 2019–20, 2022–23 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న రిస్క్‌ల గురించి ట్రేడర్లలో అవగాహన పెంచేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సెబీ భావిస్తోంది.సెబీ ఇప్పటికే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో ట్రేడర్ల ధోరణులపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్ఓలో ట్రేడింగ్ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని చెప్పింది. ఈ నష్ట పరిమాణం సగటున రూ.1.1 లక్షలుగా ఉందని తేలింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 7.1 లక్షలుగా ఉన్న ఎఫ్‌అండ్‌వో ట్రేడర్ల సంఖ్య 500 శాతం ఎగిసి 2021 ఆర్థిక సంవత్సరం నాటికి 45.24 లక్షలకు పెరిగింది.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!తాజా నివేదికలోని వివరాల ప్రకారం..ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లావాదేవీలు జరిపే ప్రతి ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు. 30 ఏళ్ల లోపు వయసున్న ఇంట్రాడే ట్రేడర్ల సంఖ్య 2018–19లో 18 శాతంగా ఉండగా 2022–23లో 48 శాతానికి పెరిగింది. 2022–23లో 71 శాతం మంది (ప్రతి పది మందిలో ఏడుగురు) ఇంట్రాడే ట్రేడర్లు నికరంగా నష్టపోయారు. తరచుగా ట్రేడింగ్ చేసి (ఏడాదికి 500 పైగా ట్రేడ్లు) నష్టపోయిన ట్రేడర్ల సంఖ్య 80 శాతం పెరిగింది. ట్రేడింగ్‌లో నష్టపోవడమే కాకుండా ఆ నష్టాల్లో దాదాపు సగభాగం (57 శాతం) ట్రేడింగ్ ఖర్చుల రూపంలో సమర్పించుకున్నారు. ఇక నష్టపోయిన వారిలో అత్యధికులు (76 శాతం) యువ ట్రేడర్లే ఉండటం గమనార్హం. -
ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!
స్టాక్‌మార్కెట్‌పై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్నాకే ఇన్వెస్ట్ చేయాలని ఆర్థిక నిపుణులు, సెబీ హెచ్చరిస్తున్నా వారి సూచనలు పట్టించుకోకుండా చాలామంది తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ నిపుణుల సలహాలు పట్టించుకోని ఓ బీటెక్ విద్యార్థి రెండేళ్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేసి ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఆ విద్యార్థి రోషన్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటపడింది.రోషన్ తెలిపిన వివరాల ప్రకారం..‘బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలని నా వద్దకు వచ్చాడు. తనకు ఎలాంటి ఆదాయం లేదు. తన తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి హోటల్ నిర్వహిస్తోంది. పేరెంట్స్‌కు తెలియకుండానే వాళ్ల అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేశాడు. ఆ డబ్బుతో ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు నష్టపోవడంతో యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర అప్పు చేశాడు. ట్రేడింగ్ ద్వారా నిత్యం డబ్బు నష్టపోతున్నా అప్పుచేసి మరీ ట్రేడింగ్ చేసేవాడు. గడిచిన ఏడాదిలో ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.26 లక్షలు నష్టపోయాడు. అంతకుముందు ఏడాదిలోనూ రూ.20 లక్షలు పోగొట్టుకొన్నాడు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ద్వారానే మొత్తం రూ.46 లక్షలు కోల్పోయాడు’ అని చెప్పారు.‘ఆ విద్యార్థి మిత్రుడు ఒకరు ఎఫ్ అండ్ ఓ ద్వారా రూ.కోటి సంపాదించాడని విని ఎలాగైనా డబ్బు సంపాదించాలని ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. నిత్యం నష్టం వస్తునపుడు ఆ ట్రేడింగ్‌ను మానేయొచ్చు కదా అని ప్రశ్నిస్తే..ట్రేడింగ్‌కు బానిసైపోయా అని బదులిచ్చాడు. ఇంతలా నష్టపోయావు కదా.. భవిష్యత్తులో మళ్లీ ట్రేడింగ్ చేస్తావా? అని అడిగితే ఇకపై ట్రేడింగ్ చేయనని చెప్పాడు’ అని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో 90 శాతం మంది మదుపర్లు తమ డబ్బు పోగొట్టుకుంటున్నారని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ అన్నారు. ‘ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న దాదాపు 45.24 లక్షల మందిలో, కేవలం 11 శాతం మందే లాభాలు పొందుతున్నారు. ట్రేడింగ్‌పై పూర్తి అవగాహన చాలా ముఖ్యం. దీర్ఘకాలిక దృష్టితో మార్కెట్లో పెట్టుబడులు పెడితే తాత్కాలికంగా నష్టాలు వచ్చినా మంచి రాబడులు పొందవచ్చు. సంపద సృష్టికి అవకాశం ఉన్న విభాగంలోనే పెట్టుబడులు పెట్టండి’ అని ఆమె గతంలో మదుపర్లకు సూచించారు. -
రికార్డుల ర్యాలీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు బ్యాంకులు, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ మూడో రోజూ కొనసాగింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడి ఇంట్రాడే, ముగింపులో సరికొత్త రికార్డులు లిఖించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి ఆర్థిక సంవత్సరం(2024–25) కోసం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న సమగ్ర బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే., ప్రజారంజకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. సెన్సెక్స్ ఉదయం 242 పాయింట్ల లాభంతో 77,235 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 374 పాయింట్లు పెరిగి 77,366 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరికి 308 పాయింట్ల లాభంతో 77,301 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 113 పాయింట్లు బలపడి 23,579 వద్ద రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 92 పాయింట్లు 23,558 వద్ద ముగిసింది. బ్యాంకులు, ఐటీతో పాటు రియలీ్ట, కన్జూమర్, యుటిలిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 1శాతం, అరశాతం చొప్పున రాణించాయి. ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రయ్...సెన్సెక్స్ నాలుగోరోజూ రాణించడంతో బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టానికి చేరింది. మంగళవారం ఒక్కరోజే రూ.2.42 లక్షల కోట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 437.24 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం 4 రోజుల్లో రూ.10.29 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది.⇒ అమెరికా ఫ్యాషన్ దుస్తుల సంస్థ హానెస్ బ్రాండ్స్‌తో వ్యాపార కాంట్రాక్టు కొనసాగింపుతో పాటు జీబీఎస్టీతో కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో విప్రో షేరు 3% పెరిగి రూ.492 వద్ద ముగిసింది. ⇒ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి 156 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోళ్ల ఆర్డర్ దక్కించుకోవడంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేరు 6 శాతం పెరిగి రూ. 5,533 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% ఎగసి రూ. 5,565 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. -
ట్రేడింగ్ స్కామ్.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే?
టెక్నాలజీ పెరుగుతున్న వేళ సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల నవీ ముంబైలోని ఖార్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి షేర్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.1.07 కోట్లు మోసపోయారు. విచారణలో భాగంగా ఓ యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.సైబర్ మోసాలు కొత్తేమీ కాదు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్‌క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సీ) వివరాలు చెబుతున్నాయి. ఇందులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు మాత్రమే కాకుండా.. గేమింగ్ యాప్స్, చట్ట విరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి.ఇటీవల నవీ ముంబైలో సైబర్ మోసానికి ఎరగా చిక్కిన వ్యక్తిని మోసగాళ్లు ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు పలుమార్పు కలిసి షేర్ ట్రేడింగ్ నుంచి లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తరువాత వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. 10709000 డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ చేయించుకున్న తరువాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (చీటింగ్) వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మొత్తం కేసులుఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ప్రకారం.. 2023లో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కామ్‌ల ద్వారా మోసపోయిన వారు 20,043 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. డేటింగ్ యాప్‌ల వల్ల మోసపోయిన వారి సంఖ్య 1725గా నమోదైంది. ఇలా వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మాయ చేస్తూ.. మోసం చేస్తున్నారు.మోసగాళ్ల కొత్త అవతారాలు..మోసగాళ్లు తమ ఫోన్ నంబర్లను చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి తరచుగా కాల్ స్పూఫింగ్ ఉపయోగిస్తారు. స్కామర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తారు. ఇది నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారు. -
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్‌ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్‌లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా లింక్‌లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్‌పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్‌లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
బిట్‌కాయిన్ సరికొత్త రికార్డ్‌లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్‌కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్‌తో బిట్‌కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్‌కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్‌ను దాటి రికార్డ్‌లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్‌టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్‌కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
ఆటో, ఐటీ షేర్ల జోరు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో రికవరీ ర్యాలీ కలిసిరావడంతో మంగళవారం అరశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 305 పాయింట్లు పెరిగి 73,095 వద్ద నిలిచింది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 22,200 స్థాయి చేరువులో 22,198 వద్ద స్థిరపడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ప్రథమార్థంలో నష్టాలతో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 371 పాయింట్లు దూసుకెళ్లి 73,161 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 22,218 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కమోడిటీ, ఫైనాన్షియల్ సర్విసెస్, టెలీ కమ్యూనికేషన్, యుటిలిటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 %, 0.10 % నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,509 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,861 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. కాగా పేటీఎం షేరు ఆరంభ లాభాలు నిలుపుకోలేకపోయింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ.449 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. అయితే ఆరంభ లాభాలు నిలుపుకోవడంలో విఫలమైంది. చివరికి 0.11% నష్టపోయి రూ. 427.50 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో రూ.449 వద్ద గరిష్టాన్ని, రూ.413.55 వద్ద కనిష్టాన్ని తాకింది. టీసీఎస్ షేరు 2.50% ర్యాలీ చేసి రూ.4103 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ షేరు రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘బై’కు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,700కు పెంచింది. ట్రేడింగ్‌లో 3.25% పెరిగి రూ.4,125 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా షేర్ల రిగ్గింగ్!
ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే పది మంది నిపుణులతోపాటు ఐదుగురు గెస్ట్ అనలిస్ట్‌లపై నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. షేర్ రిగ్గింగ్‌కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ.7.41 కోట్ల స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. సెబీ దర్యాప్తు వివరాల ప్రకారం జీ బిజినెస్ న్యూస్ ఛానల్లో ఏ స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నామన్నది గెస్ట్ నిపుణులు ముందుగానే కొంతమంది ప్రాఫిట్ మేకర్స్‌కు చెబుతారు. సమాచారం అందుకున్న ప్రాఫిట్ మేకర్స్ తొలుత ఆ షేరు లేదా డెరివేటివ్ కాంట్రాక్టులో పొజిషన్లు తీసుకుంటారు. దాంతో రిటైలర్లు సైతం అందులో ఇన్వెస్ట్‌చేసిన తర్వాత లాభాలు స్వీకరించి పొజిషన్లను విక్రయిస్తారు. గెస్ట్ అనలిస్టులు కిరణ్ జాదవ్, అశీష్ కేల్కర్, హిమాన్షు గుప్తా, ముదిత్ గోయల్, సిమి భౌమిక్‌ల సిఫార్సులు ఛానల్లో ప్రసారం అయిన తర్వాత ఆ పొజిషన్లను మార్చి లాభం సంపాదించినట్లు సెబీ గుర్తించింది. ఈ ఉదంతంలో నిర్మల్ కుమార్ సోని, పార్థసారథి ధర్, శార్ కమోడిటీస్, మానన్ షేర్‌కామ్, కన్హా ట్రేడింగ్ కంపెనీలు ప్రాఫిట్ మేకర్స్‌గా వ్యవహరించారని సెబీ పేర్కొంది. ఆ లావాదేవీల్లో వచ్చిన లాభాల్ని అందరూ పంచుకున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. దర్యాప్తు అనంతరం సెబీ 127 పేజీల ఆర్డర్‌ను జారీచేస్తూ వారిని సెక్యూరిటీ లావాదేవీల నుంచి నిషేధించింది. గెస్ట్ నిపుణులకు సంబంధించిన కంటెంట్‌తో సహా వీడియో రికార్డులు, ఇతర రికార్డుల్ని భద్రపర్చాలని జీ మీడియాను ఆదేశించింది. -
ట్రేడింగ్ సమయం పెంపు.. సెబీ చీఫ్ ఏమన్నారో తెలుసా..
దేశీయ స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచాలనే సూచనపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. అయితే ఏ ఒక్కరి నుంచీ తమకు ట్రేడింగ్ సమయానికి సంబంధించి ప్రతిపాదన రాలేదన్నారు. స్టాక్ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బ్రోకింగ్ కంపెనీ యజమాన్యం మాత్రం వారివారి మదుపర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను సేకరించి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ అభిప్రాయం చెబుతామన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని సెబీ చీఫ్ హెచ్చరించారు. ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్ సమయాన్ని పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రేడింగ్ సమయం పెంచితే ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్ మార్కెట్‌కు తేడా లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతోంది. -
ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్‌కు ఉద్యోగాలివ్వని జెరోధా.. కారణం చెప్పిన కామత్
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్‌తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! డేట్రేడింగ్ చాలా ప్రమాదకరమని కామత్ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్ఎస్ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. -
ముకేశ్ అంబానీకి సెబీ జరిమానా సరికాదు
న్యూఢిల్లీ: రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్లలో అవకతవకల ట్రేడింగ్ వివాదం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్– శాట్ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకల ట్రేడింగ్‌కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్‌లో దాఖలైన అప్పీల్లో 87 పేజీల ఈ తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ జనవరి 2021 కీలక రూలింగ్ ఇస్తూ, ఆర్‌ఐఎల్‌పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్ వద్ద జరిమానాను డిపాజిట్ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్ఐఎల్కు లభించని ఊరట.. అయితే ఈ కేసు విషయంలో ఆర్ఐఎల్ వేసిన అప్పీల్‌ను శాట్ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ తరుణ్ అగర్వాలా, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరా స్వరూప్‌లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ, ‘కంపెనీ ఆర్ఐఎల్కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది. నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్ఐఎల్తో ఆర్పీఎల్ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్ఐఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అయితే కంపెనీ (ఆర్ఐఎల్) నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. నగదు, ఎఫ్అండ్ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్పీఎల్ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్ఐఎల్ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది పీఎఫ్‌యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ముకేశ్ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్ బెంచ్ అభిప్రాయపడింది. -
సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు
ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చేయడానికి ఒక దర్శకుడికి రూ.91 కోట్లు చెల్లించింది. కానీ అతడు స్టాక్మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి దాదాపు రూ.50 కోట్లు నష్టపోయినట్లు గురువారం కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 2018లో నెట్‌ఫ్లిక్స్ కార్ల్రిన్చ్ అనే దర్శకుడి నుంచి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ను కొనుగోలు చేసింది. 2020 నాటికి ఆ సిరీస్ కోసం రూ.366 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సరిపోలేదని మరింత కావాలని రిన్చ్ అడగడంతో నెట్‌ఫ్లిక్స్ రూ.91 కోట్లు ఇచ్చింది. కానీ ఆ డబ్బును ఫార్మాస్టాక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి రూ.50 కోట్లు నష్టపోయాడు. అయితే మిగతా రూ.33 కోట్లను డోజికాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్చేసి రూ.220 కోట్లు సంపాదించినట్లు సమాచారం. తర్వాత తాను ఖరీదైన ఐదు రోల్స్‌రాయిస్ కార్లు, ఒక ఫెరారీ కారు, ఫర్నీచర్, డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసినట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2021లో బయోటెక్ సంస్థకు చెందిన గిలియడ్ సైన్సెస్ షేర్లు పెరుగుతాయని రిన్చ్ పందెం వేసినట్లు కొన్ని కథనాలు ద్వారా తెలిసింది. తాజాగా అమెరికా మార్కెట్ ఎస్అండ్పీ 500 ఇండెక్స్ మరింత పడిపోతుందని ఆప్షన్ ట్రేడింగ్ చేసి కొన్ని వారాల వ్యవధిలోనే తాను రూ.50 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజా ఘటనపై నెట్‌ఫ్లిక్స్ తన ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వడం మానేసి రిన్చ్పై దావా వేయనుందని సమాచారం. ఇదీ చదవండి: అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక ఇదిలాఉండగా కార్ల్రిన్చ్ గతంలో కేవలం ‘47 రొనిన్’ అనే ఒకే సినిమా రూపొందించడం గమనార్హం. ఈ మొత్తం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రిప్లైలు వైరల్‌గా మారుతున్నాయి. రిన్చ్ జీవితంపైనే మంచి సినిమా తీయచ్చని కొందరు, తాను స్కామ్ చేశాడని ఇంకొందరు పోస్ట్ చేస్తున్నారు. -
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓపెన్ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్‌లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్‌ను ఉపయోగించారా అని బోట్‌ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్‌ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. -
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే...
ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మంగళవారం అరశాతం పతనమైంది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకశాతానికి పైగా క్షీణించి సూచీలను నష్టాల వైపు నడిపించాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 65,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 19,529 వద్ద నిలిచింది. 3 రోజుల వరుస సెలవుల తర్వాత స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 65,345 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 19,480 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాకులు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా, రియల్టి, కన్జూ్యమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,034 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ క్యూ2 ఫలితాల ప్రకటనకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ లభించింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, పీఎస్బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5–3% ర్యాలీ చేశాయి. యుకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% లాభపడ్డాయి. ఎస్బీఐ బ్యాంక్ షేరు ఒకశాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది కేంద్ర పెట్రోలియం శాఖ దేశీయ సహజ వాయువు ధరలు 7% పెంచడంతో ఓఎన్బీసీ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య రికవరీ సైతం ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఈ షేరు బీఎస్ఈలో 4% నష్టపోయి రూ.185 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.50% క్షీణించి రూ.184 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్సుల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఐషర్ మోటార్స్ షేరు 3% నష్టపోయి రూ.3351 వద్ద స్థిరపడింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు సెపె్టంబర్లో తగ్గిపోవడం షేరు పతనానికి కారణమైంది. హిట్... ఫ్లాట్ నష్టాల మార్కెట్లోనూ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిస్టింగ్ బంపర్ హిట్ కొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.119)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు 32.18% ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.157 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.33,033 కోట్లుగా స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 57.99 లక్షల ఈక్విటీ షేర్లను చేతులు మారాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెలర్స్ షేరు ఫ్లాటుగా లిస్టయింది. ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే బీఎస్ఈలో లాభ, నష్టాలు లేకుండా రూ.215 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.210–222 మధ్య ట్రేడైంది. చివరికి 0.30% స్వల్ప లాభంతో రూ.216 వద్ద క్లోజైంది. మార్కె ట్ విలువ రూ.1,053 కోట్లుగా నమోదైంది. -
ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
ట్రేడింగ్‌లో దూసుకుపోతున్న మహిళలు.. ఇన్వెస్టర్లుగా సత్తా
విజేతల విజయాలు ఇతరులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ ఉమెన్ ఇన్వెస్టర్ల నుంచి స్ఫూర్తి పొందిన ఈతరం అమ్మాయిలు ‘లెర్నింగ్ అండ్ చేజింగ్’ సూత్రంతో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్లలో విజయం సాధిస్తున్నారు. తమదైన గెలుపు ప్రణాళికను పక్కాగా రూపొందించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ గేమ్‌లో పురుషాధిక్యత కనిపిస్తుంది. ఒక ఆన్లైన్ వెల్త్ మేనేజ్మెంట్ స్టడీ ప్రకారం అయిదుమందిలో ఒకరు మాత్రమే ఉమెన్ ఇన్వెస్టర్. అయితే ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆశాజనకమైన మార్పు కనిపిస్తుంది. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాలోకి మహిళలు వచ్చి సత్తా చాటుతున్నారు. మన దేశం విషయానికి వస్తే పాండమిక్ సమయంలోనూ ఉమెన్ ఇన్వెస్టర్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వర్ష శ్రీవాస్తవకు ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్‌లో రాణించాలనేది భవిష్యత్ లక్ష్యం. ఇన్వెస్ట్మెంట్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎంబీఏ చేస్తున్న వర్షకు స్ఫూర్తి. బెంగళూరుకు చెందిన ఏంజెల్ ఇన్వెస్టర్ అంకిత వశిష్ఠ ఔత్సాహిక మహిళా ఇన్వెస్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ‘సహ ఫండ్’ కు అంకిత ఫౌండర్, సీయివో. వీసీ ఫర్మ్ ‘స్ట్రాంగ్హర్’ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. పద్మజ రూపరెల్ ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్(ఐఏఎన్) కో–ఫౌండర్, ప్రెసిడెంట్. ‘ఐఏఎన్’ పది దేశాలలో ఫైనాన్స్, వ్యవసాయం, అంతరిక్షం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వైద్యపరికరాలు... మొదలైన రంగాలలో పెట్టుబడులు పెడుతోంది. పద్మజ ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’గా గుర్తింపు పొందింది.... ఈ ఇద్దరు మాత్రమే కాదు భారతీ జాకబ్, నీతా మీర్చందానీ, సాక్షి చోప్రా, బాలా దేశ్ పాండే...లాంటి ప్రముఖ ఇన్వెస్టర్లు వర్షకు స్ఫూర్తి.ముంబైకి చెందిన చైత్రకు లారెన్ సీమన్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. ‘సీమన్స్ గురించి చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. ఆమె మాటల్లో ఎంతో స్ఫూర్తి దొరుకుతుంది’ అంటుంది చైత్ర. ఇరవై మూడు సంవత్సరాల వయసులో వాల్‌స్ట్రీట్‌లో యంగెస్ట్ ఫుల్–టైమ్ ఫిమేల్ ట్రేడర్‌గా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది లారెన్ సీమన్స్. కెరీర్ మొదలుపెట్టినప్పుడు సీమన్స్‌కు ఎలాంటి అనుభవమూ లేదు. కుటుంబ సభ్యులు, బంధువులలోనూ ఆ రంగంలో ఎవరూ లేరు. జెనెటిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సీమన్స్ న్యూయార్క్ సిటీకి వెళ్లి ఫైనాన్స్ రంగంలో అడుగు పెట్టింది,.‘డైరెక్షన్లెస్’ ‘కన్ఫ్యూజ్డ్’ అంటూ ఆమెకు పేర్లు తగిలించేవాళ్లు కొందరు పురుషులు. ఈ పేర్ల వెనుక ఉద్దేశం ఆమెకు ఏమీ తెలియదు అని. అయితే ‘రోసెన్‌బ్లాట్ సెక్యూరిటీస్’ సీయీవో జో గౌరోస్కి మాత్రం ఆమెపై నమ్మకం ఉంచాడు. ‘జార్జియా నుంచి ఇక్కడికి వచ్చిన ఈ అమ్మాయికి ఫైనాన్స్‌లో డిగ్రీ లేదు. అయితే ఏదో సాధించాలనే ఉత్సాహం ఉంది. అంకితభావం ఉంది’ అన్నారు. రోసెన్ బ్లాట్ సెక్యూరిటీస్‌లోకి అడుగుపెట్టి ప్రయాణం ప్రారంభించింది సీమన్స్. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ కీనోట్ స్పీకర్‌గా ఫైనాన్స్‌కు సంబంధించి అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది. వారి కోసం ఎన్నో రచనలు చేసింది. సీమన్స్లాగే మన దేశానికి చెందిన మహెక్ షాకు వెటకారం మాటలు ఎదురయ్యాయి. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే ట్రేడింగ్‌లోకి వచ్చిన మహెక్ వాటిని పట్టించుకోలేదు. తన పనితోనే సమాధానం చెప్పాలనుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌తో స్టాక్మార్కెట్లో తొలి అడుగు వేసింది. టెక్నికల్ టర్మ్స్‌ను అర్థం చేసుకోవడం నుంచి సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం వరకు ఎన్నో విషయాలను తన ప్రయాణంలోనే నేర్చుకుంది. హైయెస్ట్ ప్రాఫిట్ చూసిన రోజు తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేది. ట్రేడింగ్‌లో డబ్బు కోల్పోయిన సందర్భాలు కూడా లేక΄ోలేదు. ‘చాలా నిరుత్సాహానికి గురయ్యాను. అయితే అంతలోనే తేరుకొని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది 26 సంవత్సరాల మహెక్. పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు చేతిలో ల్యాప్‌టాప్‌తో పనిలో తలమునకలై ఉంటుంది మహెక్. డిగ్రీ తరువాత ఫుల్‌టైమ్ ట్రేడర్ అయింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా తాను సంపాదించిన డబ్బుతో యూకేలో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసింది. చార్టెడ్ ఎకౌంటెన్సీ ట్రైనింగ్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చిన ప్రియల్ అనిల్ బర్గీ ఈక్విటీ ఇన్వెస్టింగ్‌లోకి అడుగు పెట్టింది. తండ్రి నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని స్టాక్మార్కెట్లోకి వచ్చిన ప్రియల్ ఆ మొత్తాన్ని కొంతకాలానికే రెట్టింపు చేసింది. అంతమాత్రాన ఆమెకు నష్టాలు ఎదురు కాలేదని కాదు. ఒకేరోజు కొన్ని లక్షలు పోగొట్టుకొని షాక్‌కు గురైంది. అయితే నిరాశతో వెనకడుగు వేయకుండా, తాను వేసిన తప్పటడుగును లోతుగా విశ్లేషించుకుంది. ‘ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దురాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం. భయం ఉండాలి. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే భయం కాకూడదు. మనల్ని హద్దుల్లో పెట్టే భయమై ఉండాలి’ అంటున్న 27 సంవత్సరాల ప్రియల్ బర్గీ నాగ్‌పుర్ కేంద్రంగా ‘నతిభాయి తులసీదాస్ ఇన్వెస్ట్మెంట్స్’ సంస్థను ప్రారంభించింది. పవర్ ఆఫ్ ట్రేడింగ్ తెలుసుకున్నాను. ఫారిన్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో నేర్చుకున్న విషయాలు నాకు ఉపకరిస్తాయి. – మహెక్ షా ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దూరాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం. – ప్రియల్ బర్గీ -
ప్రపంచ వాణిజ్యంలో ఎక్కడున్నాం..?
జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవడానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం. విదేశాలతో వ్యాపారం చేయడం భారత్‌కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది. 2022–23లో వర్తకపు సరుకుల ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం. అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితులను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరుకున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియజేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఐటీ సేవల (46 శాతం) వల్లనే. దీంతోపాటు వ్యాపార సేవలు కూడా 24 శాతంతో తమదైన ముద్ర వేశాయి. సేవల విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, వస్తువుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వస్తువుల ఎగుమతులు అమెరికా, యూరప్ వంటి మార్కెట్ల డిమాండ్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. మన పొరుగునే ఉన్న చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ఒక దేశానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎక్కువ. శేష ప్రశ్నలు ఎన్నో... దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో మన పాత్ర పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎగుమతుల విషయంలో వెనుకబడి ఉండేందుకు కారణాలేమిటి? మొదటిది... దేశీ మార్కెట్ ఒకటి లేకపోవడం. దేశీ మార్కెట్ ఒకటి ఉండి ఉంటే స్థానిక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఇక్కడే వ్యాపారం చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ మార్కెట్లను వెతుక్కునే శ్రమ తగ్గుతుంది. దేశంలో కొన్ని పరిశ్రమలు కేవలం ఎగుమతులపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంప్రదాయ రంగాలకు చెందినవీ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, హస్తకళలు, జ్యువెలరీ, రంగురాళ్లు వంటివి. వీటితోపాటు ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, రిఫైన్డ్ నూనె ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా పరిశ్రమలు స్థానికంగా మార్కెట్ అవస రాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే స్థానిక పరిశ్రమలు సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదన్నమాట. ఎగుమతులు పెరగకపోవడానికి రెండో లోపం... దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం. ప్రపంచ వాణిజ్య సంస్థపై మనం చాలాకాలం ఆశలు పెట్టుకున్నాం. ఎదుగు తున్న మార్కెట్లకు కొన్ని లాభాలు అందిస్తుందని ఆశపడ్డాం. ఈ క్రమంలో ప్రాంతీయ లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకునే సమయం కాస్తా మాయమైపోయింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగ స్వామ్యం (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ట్నర్షిప్–ఆర్సీఈపీ) నుంచి వైదొలగాలన్న నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే. ఏదో ఒక దేశం ద్వారా చైనా తన చౌక వస్తువులను దేశంపై గుమ్మరిస్తుందన్న ఆందోళన కూడా ఉండింది. అయినా కూడా... ఇతర ప్రాంతీయ వాణిజ్య గ్రూపుల్లోకి చేరే దిశగా చాలాకాలం క్రితమే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. ఉదాహరణకు... పదకొండు మంది సభ్యులున్న ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్’ (సీపీటీపీపీ). ఈ వ్యాపార వర్గంలో చేరి ఉంటే దేశ విదేశీ వ్యాపారం, ఎగుమతులు పెరిగేందుకు తగిన సహకారం లభించి ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆస్ట్రేలియా, జపాన్, మలేసియాలు భాగస్వాములుగా ఉండి... అతి జాగ్రత్తగా చైనా లేకుండా చేసుకున్న వ్యాపార వర్గంలో చేరేందుకు భారత్ ప్రయత్నించాలి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే... యూరోపి యన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందం పదేళ్లుగా అమల్లో లేకుండా పోయింది. భారత్‌కున్న అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈ ప్రాంతంతోనూ వాణిజ్య ఒప్పందం విషయమై ఇటీవలే చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ దేశంలోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావడం దేశ హితం కోసమే అన్న భావన ప్రబలుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఇలాంటి ఒప్పందాలు ఇటీవలే కుదరడం గమనార్హం. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్డమ్లతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మళ్లీ వెనక్కి? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఏడేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ఒప్పందం చేసు కోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమని ఇటీవలే గుర్తించి ఆ దిశగా ముందుకు కదులుతూండటం హర్షించదగ్గ విషయం. పర్యావరణం, లేబర్, డిజిటల్ వాణిజ్యం వంటి వాణిజ్యేతర అంశాలను కూడా ఇప్పుడు చర్చి స్తున్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదిరితే చాలా లాభాలుంటాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వంటి హైటెక్ దేశాల్లో మన దేశానికి చెందిన నిపుణులు పనిచేయడం సులువు అవుతుంది. చివరగా... ఎగుమతులు మరింత జోరు అందుకునేందుకు ఉన్న ఇంకో అవరోధం ఇటీవలి కాలంలో పెరిగిపోయిన రక్షణాత్మక ధోరణులు. దిగుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. విదేశీ తయారీదారుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయులు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. స్థానికంగా పారిశ్రామిక రంగానికి సహాయం అవసరమని అనుకుంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటివి ఉండనే ఉన్నాయి. దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు చేయడం కంటే దేశీ తయారీ రంగం ఊపందుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయి. ఆత్మ నిర్భర్ భారత్ విధానం కూడా గతంలోని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్(దిగుమతికి ప్రత్యామ్నాయం) విధానాన్ని గుర్తు చేస్తోంది. లైసెన్స్ రాజ్ కాలంలో ఇది చాలా ప్రధానమైందన్నది తెలిసిందే. దేశంలో ఇప్పటికే దిగుమతి సుంకాలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అవి చైనా, ఆగ్నేయాసియా దేశాల సుంకాలకు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి మారితేనే భారత్ అంతర్జాతీయ వాణిజ్య విపణిలో కీలక పాత్ర పోషించగలుగుతుంది. వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్ ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం(నేటి రాత్రి), కీలక కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ ఉదయం 146 పాయింట్ల లాభంతో 66,531 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 381 పాయింట్ల పరిధిలో 66,178 వద్ద కనిష్టాన్ని, 66,559 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పాయింట్ల స్వల్ప లాభంతో 66,356 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 19,729 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,616 – 19,729 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఎనిమిది పాయింట్ల స్వల్ప నష్టంతో 19,681 వద్ద నిలిచింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో రియల్టీ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్, ఇంధన, ఆటో, ఫార్మా, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.39%, 0.31 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,089 కోట్ల షేర్లను కొన్నారు.., దేశీ ఇన్వెస్టర్లు రూ.334 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆర్థిక వేత్తలు అంచనాలకు తగ్గట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ చైనాలో కోవిడ్ అనంతరం నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ మూడుశాతం ర్యాలీ చేసింది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో షేర్లు 5.50 – 4% ర్యాలీ చేశాయి. జేఎస్‌డబ్ల్యూ, ఏపీఎల్ అపోలో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, నాల్కో షేర్లు 3% లాభపడ్డాయి. సెయిల్, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ జింక్ షేర్లు రెండు శాతం ర్యాలీ చేశాయి. ♦ దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ పవర్ 9.3% ర్యాలీ చేశాయి. అదానీ ట్రాన్స్మిషన్ 8%, అదానీ విల్మార్ 5%, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ గ్రూప్ చెందిన అంబుజా సిమెంట్స్ 4%, ఏసీసీ 5%, లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2% పెరిగాయి. పది కంపెనీల షేర్ల ర్యాలీతో గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్క రోజులోనే రూ.50,501 కోట్లకు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు చేరింది. ♦ టాటా స్టీల్ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి వచ్చింది. చివరికి 3% లాభపడి రూ.119 వద్ద స్థిరపడింది. -
ఆర్ఐఎల్ కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్‌ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్ఐఎల్ విడదీయనుంది. తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను ఎన్ఎస్ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్‌లో ఆర్ఐఎల్ కొనసాగనుంది. 19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్‌ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్ఎస్ఈ చేపట్టనుంది. ఏప్రిల్‌లో ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు. రికార్డ్ డేట్ ఎఫెక్ట్.. అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్ఎస్ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్‌ను నిర్వహిస్తోంది. ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు. -
సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌లోనూ ‘అస్బా’
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ కల్పించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెకండరీ మార్కెట్లోనూ అస్బాకు తెరతీసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. షేర్ల జారీ తదుపరి ఖాతాలో నిలిపి ఉంచిన సొమ్ము బదిలీ(అస్బా) పద్ధతికి దన్నుగా ప్రస్తుతం అనుబంధ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ప్రైమరీ మార్కెట్లో వినియోగించే అస్బా సౌకర్యాన్ని 2024 జనవరి 1కల్లా సెకండరీ మార్కెట్లోనూ అమలు చేసే చర్యలకు తెరతీసింది. అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్డ్ అమౌంట్(అస్బా) అమలు చేయడం ద్వారా ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలోని సొమ్ము ట్రేడింగ్ సభ్యునికి బదిలీకాకుండా నిలిచిపోతుంది. వెరసి లావాదేవీ తదుపరి ఇన్వెస్టర్లకు షేర్లు బదిలీ అయ్యాక మాత్రమే అతని ఖాతా నుంచి నిలిపి ఉంచిన సొమ్ము సంబంధిత ఖాతాకు విడుదల అవుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఇప్పటికే అస్బా అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్(సీసీ)కు అనుగుణంగా క్లయింట్ ఖాతాలోని సొమ్మును నిలిపి ఉంచుతారు. లావాదేవీ గడువు ముగిశాక లేదా సీసీ విడుదల చేశాక నిధులు బదిలీ అవుతాయి. దీంతో అటు సభ్యుల నుంచి సెక్యూరిటీలు, ఇటు క్లయింట్ల నుంచి నిధులు బదిలీ ద్వారా కాకుండా సీసీ ద్వారా లావాదేవీ సెటిల్మెంట్ జరుగుతుంది. ఫలితంగా క్లయింట్ల సొమ్ము అక్రమ వినియోగానికి చెక్ పడే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్‌సీఎల్‌కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
ట్రేడింగ్ ట్రెండ్: సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరే చాన్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల వార్తలు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఇతర అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణికి అనుగుణంగానే కదలాడతాయని చెబుతున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పుంజుకున్నాయి. వారాంతం రోజైన శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి (63,583)కి 198 పాయింట్లు, నిఫ్టీ ఆల్‌టైం హై (18,888)కి 62 పాయింట్లు చేరువులో ఉన్నాయి. సరికొత్త రికార్డు స్థాయిల నమోదు ఇప్పుడు నామమాత్రమే. సరికొత్త రికార్డులు సృష్టించిన తర్వాత ర్యాలీ కొనసాగుతుందా..? లేక గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సి అంశం. ఒకవేళ మొమెంటమ్ కొనసాగితే నిఫ్టీ 19,000 స్థాయికి చేరవచ్చు. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 18,676 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని ఏంజెల్ వన్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సమీత్ చవన్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూరోజోన్ నిర్మాణ ఉత్పాదక, కరెంట్ అకౌంట్ డేటా, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం (జూన్ 21న) అమెరికా దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ (టెస్టిమోనీ) ఇవ్వనున్నారు. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించే వీలుంది. అదే రోజున జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ మే ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు వెల్లడవుతాయి. వారాంతం రోజున యూఎస్ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు, జపాన్ ద్రవ్యోల్బణ, బ్రిటన్ రిటైల్ అమ్మకాలు విడుదల కానున్నాయి. వర్షపాత వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణలో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై ఉండదని, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చంటున్నారు. సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. రెండు వారాల్లో రూ.16,405 కోట్లు భారత మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా భారత ఈక్విటీలపై ఆసక్తి కనబరుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ జూన్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటి వరకు (116 తేదీల మధ్య) రూ.16,405 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల అంశాలు ఎఫ్‌పీఐల కొనుగోళ్లకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. -
‘రూపే’ చెల్లింపులపై భారత్, రష్యా కసరత్తు
న్యూఢిల్లీ: సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి భారత్, రష్యా తమ తమ స్వంత పేమెంట్ విధానాలను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇరు దేశాల అత్యున్నత స్థాయి కమిషన్ (ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఇటీవల సమావేశమైన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపే (భారత్), మిర్ కార్డుల (రష్యా) వినియోగం ద్వారా ఇరు దేశాల ప్రజలు తమ తమ కరెన్సీల్లో చెల్లింపులు జరిపేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి. భారత ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ), రష్యాకు చెందిన ఫాస్టర్ పేమెంట్స్ సిస్టమ్ (ఎఫ్‌పీఎస్)ను అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే, సీమాంతర చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్విఫ్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో తాజా భేటీలో ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ తమ దేశాల కరెన్సీల్లో సీమాంతర చెల్లింపులను జరిపేందుకు తోడ్పడేలా భారత్, సింగపూర్ ఇటీవలే యూపీఐ, పేనౌ (సింగపూర్ వ్యవస్థ)ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని ప్రవాస భారతీయులు తక్కువ లావాదేవీ వ్యయాలతో, సత్వరం అక్కడి నుంచి ఇక్కడికి డబ్బును పంపించేందుకు ఇది తోడ్పడుతోంది. -
3 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో సూచీలు మూడు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం కలిసొచ్చాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 61,302 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 18,125 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 374 పాయింట్లు ర్యాలీ చేసి 61,486 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు దూసుకెళ్లి 18,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే యూరప్ మార్కెట్ల బలహీన ట్రేడింగ్ ప్రభావంతో చివర్లో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆఖరికి సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 61,355 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా ఎనిమిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 18,148 వద్ద ముగిసింది. కాగా ఈ ఇండెక్స్‌కిది అయిదోరోజూ లాభం ముగింపు కావడం విశేషం. వరుస ర్యాలీ క్రమంలో సూచీలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసీసీ, టెలీకమ్యూనికేషన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1997 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.394 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదుపైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ప్రారంభానికి ముందు(మంగళవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలు గడించాయి. ప్రస్తుతం సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18180 – 18200 శ్రేణిలో కీలక నిరోధం కలిగి ఉంది. దిగువ స్థాయిలో 18050 – 18000 పరిధిలో తక్షణ మద్దతు కలిగి ఉందని’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ షేరు 16 శాతం పెరిగి రూ.566 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 18 శాతం ఎగిసి రూ.595 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 63% వృద్ధితో రూ.79 కోట్లను సాధించడం ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ♦ ఏప్రిల్‌లో ఎన్ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేరు రాణించింది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం బలపడి రూ.110 వద్ద స్థిరపడింది. ♦ కేంద్రం ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఓఎన్జీసీ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.164 వద్ద ముగిసింది. -
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్‌లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్‌సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్‌ప్లేస్‌లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్‌కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్‌కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023 -
లాభాలకు అవకాశం
ముంబై: ట్రేడింగ్ నాలుగురోజులే ఈ వారంలో స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ప్రధాన వార్తలు లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపై దృష్టి సారించవచ్చు. ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీ ప్రసంగం భారత్ తో పాటు ఈక్విటీ మార్కెట్లకు కీలకం కానుంది. అమెరికా మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణిని మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు, బాండ్లపై రాబడులు, తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. బీఎస్ఈ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను నేటి నుంచి (ప్రస్తుతం ఉన్న మధ్యాహ్నం 3.30 గంటల నుంచి) సాయంత్రం 5.00 గంటల వరకు పొడగించడమైంది. నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ సూచీలు గతవారం కొంతమేర రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 345 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ట్రేడింగ్ నాలుగు రోజులే హోళీ సందర్భంగా మంగళవారం స్టాక్ ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. కమోడిటీ మార్కెట్ తొలి సెషన్లో పనిచేయదు. సాయంత్రం సెషన్ (సాయంత్రం 5గంటల నుంచి 11:55 గంటకు వరకు)లో ట్రేడింగ్ జరుగుతుంది. అగ్రి కమోడిటీ ఇండెక్స్ రెండు సెషన్లలోనూ పనిచేయదు. ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం యథావిధిగా ప్రారంభవుతాయి. ‘‘మార్కెట్లో రికవరీ సూచీలపై కొంత ఒత్తిడిని తగ్గించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు రాణించడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే. అయితే ఐటీ, ఆటో, ఇంధన షేర్లు కూడా పుంజుకోవాల్సిన అవశ్య కత ఎంతైనా ఉంది. ఇటీవల నిఫ్టీ 200 డేస్ మూ వింగ్ యావరేజ్ అధిగమించగలిగింది. తక్షణ నిరోధం 17,750... ప్రస్తుతం 17,750 వద్ద తక్షణ నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరిగి 17,900 స్థాయిని అందుకోవచ్చు. అనూహ్యంగా దిద్దుబాటుకు లోనైతే 17500 – 17350 శ్రేణిలో తక్షణ మద్దతు లభిస్తుంది. మిశ్రమ సంకేతాలు నెలకొన్న తరుణంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ సాంకేతిక విశ్లేషకుడు పర్వేష్ గౌర్ తెలిపారు. మంగళవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ఎదుట మంగళవారం, హౌసింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమిటీ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, వడ్డీరేట్ల సైకిల్ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు, చైనా సీపీఐ, బ్రిటన్ పారిశ్రామికోత్పత్తి డేటాతో పాటు అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్, యూరో జోన్ ఎస్అండ్పీ కన్స్ట్రక్షన్ పీఐఎం, రిటైల్ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అలాగే జపాన్ కరెంట్ అకౌంట్, చైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ద్రవ్యోల్బణం, పీపీఐ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. అయితే అమెరికా ఆర్థిక వృద్ధి నమోదు కారణంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడంతో బాండ్లపై రాబడులు కొంత నెమ్మదించాయి. మూడు రోజుల్లో రూ.8,300 కోట్ల కొనుగోళ్లు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లో రూ.8,300 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. గతవారంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్ నాలుగు కంపెనీ షేర్లలో 1.87 బిలియన్ (రూ. 15,280 కోట్లు) డాలర్లు భారీ పెట్టుబడిని పెట్టడంతో ఎఫ్ఐఐల నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం ఎఫ్ఐఐలు ఫిబ్రవరి రూ.5,249 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఈ మార్చిలోనూ విదేశీ అమ్మకాలు కొనసాగవచ్చు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో బాండ్ల ఈల్డ్స్(దిగుమతులు) కొన్నేళ్ల గరిష్టాలను చేరుకున్నాయి. ఈక్విటీలతో పోలిస్తే రిస్క్ సామర్థ్యం తక్కువగా ఉండే బాండ్లపై పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ విజయ్‌కుమార్ తెలిపారు. -
నియంత్రణ సంస్థల సేవలు ప్రశ్నార్థకం
ఆర్థికపరమైన అవకతవకలపై తిరుగులేని అధికారాలు చలాయిస్తున్న నియంత్రణా సంస్థగా ‘సెబీ’కి పేరుంది. కానీ వివిధ ప్రభుత్వాల పాలనా కాలాల్లో అది మౌనం పాటించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్పడమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. అలాంటిది స్వయం నియంత్రణా సంస్థలే తమ విధులను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభిప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? ఈ రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటున్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకం. ప్రపంచంలోనే అత్యున్నత అధికారం చలాయిస్తున్న నియంత్రణా సంస్థల్లో మన ‘సెబీ’ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఒకటి. ఆర్థిక పరమైన అవకతవకలపై శోధన, స్వాధీనం, దాడులు, అరెస్టులకు సంబంధించి తిరుగులేని అధికారాలను సెబీ కలిగి ఉంటోంది. అనుమానాస్పదమైన ట్రేడింగ్ కార్యకలాపాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన షేర్ల విలువను తారు మారు చేయడాన్ని పసిగట్టడంలో సెబీకి విస్తృత మైన నిఘా వ్యవస్థ తోడుగా ఉంటోంది. అయిన ప్పటికీ విభిన్న రాజకీయ పాలనా కాలాల్లో ఈ రెగ్యులేటరీ సంస్థ మౌనం పాటిస్తూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా, సెబీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం పనిచేస్తూ వచ్చింది. ప్రత్యేకించి యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రె సివ్ అలయెన్స్) రెండో పాలనా కాలంలో ఇది కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో కో– లొకేషన్ (కోలో) స్కామ్ విషయంలో కానీ, సత్యం కుంభకోణంలో కానీ సెబీ కార్యకలాపాలు ఎలాంటి పబ్లిక్ లేదా రాజకీయ తనిఖీ రాడార్‌లో లేకుండా కొనసాగుతూ వచ్చాయి. ఇటీవలే ఇలాంటి ప్రశ్నలను పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రతిభావంతంగా లేవనెత్తారు. గత రెండేళ్లలో స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీల విలువ అమాంతంగా పెరిగిపోవడంపై ఆమె ప్రశ్నలు సంధించారు. కానీ సెబీ మాత్రం ఈ విషయంలో కనీస అధ్యయనం కూడా చేయనట్లు కనిపిస్తోంది. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ రూ. 20,000 కోట్ల విలువైన అత్యంత భారీ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)ని ఒక కంపెనీ ప్రతిపాదించడాన్ని సెబీ ఎలా అనుమతించిందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సరిగ్గానే ప్రశ్నించారు (అయితే ఆ ప్రతిపాద నను తర్వాత ఉపసంహ రించుకున్నారు.) ఆర్థిక అవకతవకలపై అత్యంత క్రియాశీలకంగా ఉండే రెగ్యులేటరీ సంస్థ సెబీ తన విశ్వసనీయత ప్రశ్నార్థకమైన సమయంలో, తన గమనింపునకు వచ్చి నప్పుడు ఈ విషయమై పరిశీలిస్తానంటూ ముభావంగా స్పందించిందే తప్ప అంతకుమించిన విచారణ జరపలేదు. ఎందుకు విచారించలేదనే కీలక ప్రశ్నకు కూడా ఇప్పటికీ అది సమాధాన మివ్వడం లేదు. చర్యలు తీసుకున్న దాఖలా లేదు సెబీ నిద్రపోతోందంటూ సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, భారతదేశంలో రెగ్యులేటరీ వ్యవస్థ ఎందుకు విఫలమవుతోందన్న అంశంపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకతను నెలకొల్ప డమే స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు ఉద్దేశం. సరళీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున బొగ్గు, భూమి, విద్యుత్, టెలి కమ్యూనికేషన్లు, స్పెక్ట్రమ్, పెట్రోలయం, సహజ వాయువు, స్టాక్ మార్కెట్లు, పెన్షన్ నిధులు– వీటి నిర్వహణ, విమానాశ్రయాలు వగైరా ఎన్నో అంశాలు రెగ్యురేటరీ పరిశీలనా చట్రం పరిధిలోకి వచ్చాయి. అయితే ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటిది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలిగే అధికారం కలిగివుంటోంది. మరోవైపు విద్యుత్ కమిషన్లు తమ సేవల మార్కెట్లపై అధికారం చలాయించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సెబీ, కాంపిటీషన్ కమి షన్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని కేసులలో తప్పితే నిబంధనలు పాటించకపోవడంపై చర్యలు తీసు కునే శిక్షాత్మక అధికారాలు ఇప్పటికీ బలహీనంగానే ఉంటున్నాయి. స్వయం నియంత్రణా సంస్థలు తమ విధు లను సంతృప్తికరంగా నిర్వహించడం లేదనే అభి ప్రాయం ఎందుకు ఏర్పడుతోంది? చాలావరకు ఈ రెగ్యులేటరీ సంస్థలే అక్రమాలకు పాల్పడుతున్నా యనే ఆరోపణలు ఉంటున్నాయి. నిబంధనలను అతిక్రమించే సభ్యులకు వ్యతిరేకంగా ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) లేదా ఎమ్సీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) వంటి ప్రొఫెషనల్ సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక క్రీడా సంస్థల విషయానికి వస్తే అవి జీవితకాలం పదవుల్లో ఉండే వ్యక్తులతో కూడుకుని ఉంటు న్నాయి. పైగా వీటి ఆర్థిక సమగ్రతపై సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపున ప్రభుత్వం నియమించిన చట్టబద్ధమైన నియంత్రణాధికార సంస్థలు కూడా లోపరహితమైన స్థాయికి చేరలేక పోతున్నాయి. విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లు,కాంపిటీషన్, సెక్యూరిటీల విషయంలో సంబంధిత కమిషన్ల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ వంటివి అప్పీలేట్ ట్రిబ్యునల్స్‌కి వెళుతున్నాయి తప్ప నేరుగా హైకోర్టుల ముందుకు వెళ్లడం లేదు. దీని వల్ల జాప్యం జరగడమే కాకుండా కమిషన్ అసలు ఉద్దేశాన్ని పలుచన చేస్తున్నాయి. డిప్యుటేషన్ మరో సమస్య ప్రభుత్వ విభాగాలు ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అనేక ఉదంతాల్లో రెగ్యులేటరీ కమిషన్లను స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వం తరపున పనిచేసేలా మార్చేశారు. రెగ్యు లేటరీ సంస్థల ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ దీనికి ఒక కారణం కావచ్చు. ఎంపిక కమిటీలు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పదవీ విరమణ చేసిన పాలనాధికారులతో కూడి ఉంటు న్నాయి. ఇలాంటి ఆచరణ చట్టబద్ధమైన స్వతంత్ర రెగ్యులేటరీల అసలు ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. ఇలాంటి విభాగాల్లో నియమితులైన వారిని నాటుకుపోయిన ప్రభుత్వ విధేయ సంస్కృతి నుంచి బయటపడవేయలేరా? చాలావరకు రెగ్యులేటరీ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది ప్రభుత్వ ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ పై వచ్చినవారు. వీరు రెగ్యులేషన్ లో తమకు కెరీర్ ఉందని భావించడం లేదు. అలా భావించే కొద్దిమందే ఈ విభాగాల సభ్యులుగానూ లేదా ఛైర్మన్లుగానూ ఎదుగుతున్నారు. ఈ తరహా రెగ్యులేటరీ విభాగాలు మరొక ప్రభుత్వ సంస్థలానే తరచుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ విభాగాలలోని కీలక స్థానాలు పదవీ విరమణ చేసిన బ్యూరోక్రాట్లకు, ప్రభుత్వ అధికారులకు పదవీ విరమణ అనంతరం దక్కించుకునే హోదాలుగా మారిపోయాయి. దీని ఫలితంగా పెద్దగా స్వాతంత్య్రం లేకపోవడం, సంబంధిత రంగాల నియంత్రణాధికారుల్లో సాహసం లేక విజ్ఞానం లేకపోవడం జరుగుతోంది. ప్రభుత్వ ప్రతిష్ఠ పైన మాత్రమే కాకుండా, భారత వృద్ధి గాథపై కూడా ఇది ప్రభావం చూపుతున్నందు వలన, దేశంలోని రెగ్యులేటరీ సంస్థల విశ్వస నీయతను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్న మైంది. నీలూ వ్యాస్ వ్యాసకర్త సీనియర్ టీవీ యాంకర్,కన్సల్టింగ్ ఎడిటర్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
రికవరీకి అవకాశం
ముంబై: గత వారం రెండున్నర శాతం దిద్దుబాటుకు గురైన దేశీయ సూచీల్లో ఈ వారం కొంత రికవరీ కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతల కారణంగా భారీ లాభాలైతే ఉండకపోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) డిసెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు, ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, తయారీ, సేవారంగ పీఎంఐ డేటాను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర సాధారణ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ కఠిన ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు సంకేతాలు, రష్యా – ఉక్రెయిన్– అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెరపైకి రావడంతో సూచీలు గడిచిన ఎనిమిది నెలల్లో ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,539 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ‘‘వరుస నష్టాల మార్కెట్ వచ్చే వారం గట్టెక్కే వీలుంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్లలో కరెక్షన్ ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా., సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో ట్రేడవొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ కీలక మద్దతు స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. అమ్మకాలు కొనసాగి బడ్జెట్ రోజునాటి కనిష్ట స్థాయి(17,353)ని కోల్పోతే 17,050 –17,000 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. అనుకున్నట్లే రికవరీ కొనసాగితే 17,750–17,800 పాయింట్ల పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది’’ అని ఏంజెల్ వన్ సాంకేతిక నిపుణుడు రాజేశ్ భోంస్లే తెలిపారు. బుధవారం డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో కొన్ని నెలల విరామం తర్వాత ప్రైమరీ మార్కెట్ మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ డివ్గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ ఐపీవో మార్చి ఒకటిన మొదలవనుంది. శుక్రవారం ముగియనున్న ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.180 కోట్లను సమీకరించనుంది. ఇందుకు 39 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి పెట్టింది. ధర శ్రేణిని సోమవారం కంపెనీ వెల్లడించనుంది. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 24 తేదీ నాటికి ఎఫ్ఐఐలు రూ.2,313 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు ఎన్‌సీడీఎల్ డేటా చెబుతోంది. అయితే ఈ ఏడాది జన వరి విక్రయాలు రూ.28,852 కోట్లతో పోలిస్తే అమ్మకాలు భారీగానే తగ్గాయి. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వెలువడిన నేపథ్యంలో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐ లు వైదొలుగుతున్నారు. అయితే దక్షిణ కొరి యా, తైవాన్, చైనా దేశాలు ఈక్విటీలు చౌకగా లభిస్తున్నందున ఇన్వెస్టర్లు ఈ దేశాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్(క్యూ3) జీడీపీ గణాంకాలు ఈ మంగళవారం(ఫిబ్రవరి 28) కేంద్రం వెల్లడిస్తుంది. అదేరోజున జనవరి ద్రవ్యలోటు డేటా వెలువడుతుంది. మార్చి ఒకటిన(బుధవారం) ఆటో కంపెనీలు ఫిబ్రవరి హోల్‌సేల్ అమ్మకాల వివరాలు, ఫిబ్రవరి తయారీ పీఎంఐ డేటా వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం సేవారంగ పీఎంఐ డేటా విడుదల అవుతుంది. అదే రోజున ఆర్బీఐ ఫిబ్రవరి 24 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ 19వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు(సోమవారం) యూరోజోన్ ఫిబ్రవరి ఎకనామిక్స్, సర్విసెస్, పారిశ్రామిక సెంటిమెంట్ వివరాలు వెల్లడికానున్నాయి. అమెరికా, యూరోజోన్‌తో పాటు ఇతర ప్రధాన దేశాల తయారీ రంగ డేటా మార్చి ఒకటిన(బుధవారం) విడుదల అవుతుంది. యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా మార్చి రెండో తేదీన వెల్లడి కానుంది. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. -
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వచ్చేస్తోంది: ఇక వాటికి పెట్టుబడుల వెల్లువ!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటుకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఎస్ఈ)ని ఏర్పాటు చేయడానికి సెబీ ఆమెదించిందని తెలిపింది. దీని ప్రకారం మార్చినుంచి ఎస్ఎస్ఈ మొదలు కానుందని చెప్పింది. దీని ప్రకారం ఏదైనా సామాజిక సంస్థ, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓపి) లేదా ఫర్-ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్‌పిఇలు), సామాజిక ఉద్దేశం ప్రాధాన్యాన్ని స్థాపించే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజ్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు, లిస్టింగ్ కావచ్చు అని ఎన్ఎస్ఈ వెల్లడించింది. అంటే దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడుదారులుఈ సంస్థల షేర్లను కొనుగోలు చేయవచ్చు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం, వాటికి దృశ్యమానతను అందించడానికి, సామాజిక సంస్థల ద్వారా నిధుల సమీకరణకు ఇది ఉపయోపడనుంది. అలాగే వినియోగంలో పారదర్శకతను పెంచడానికి సామాజిక సంస్థలకు కొత్త మార్గాన్ని అందించాలనేది కూడా తమ లక్ష్యమని ఎస్ఎస్ఈ పేర్కొంది ఈ సెగ్మెంట్లో అర్హత కలిగిన ఎన్ఓపీ నమోదు చేసుకోవచ్చు. తద్వారా వీటిని పెట్టుడుల సమీకరణకు ఆస్కారం లభిస్తుంది. ఆన్‌బోర్డింగ్ అర్హత కలిగిన ఎన్జీవో పబ్లిక్ ఇష్యూ లేదా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ (ZCZP) వంటి సాధనాలను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. నిబంధనల ప్రకారం ఇష్యూ పరిమాణం కోటి రూపాయలు, సబ్స్క్రిప్షన్ కనీస అప్లికేషన్ సైజును రూ. 2 లక్షలుగాను సెబీ నిర్దేశించింది. -
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ వేళల పొడిగింపు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి. రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది.. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. -
దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయి.. ఒక్క రోజులోనే సెటిల్మెంట్
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం(27న) నుంచి మొత్తం ఈక్విటీ విభాగంలో లావాదేవీలను ఒక్క రోజులోనే సెటిల్ చేసే ప్రక్రియకు తెరతీశాయి. దీంతో మార్కెట్లో నమోదయ్యే లావాదేవీలను మరుసటి రోజులోనే క్లియర్ చేస్తారు. అంటే షేరు లేదా నగదు బదిలీని పూర్తి చేస్తారు. ఈక్విటీ విభాగంలోని సెక్యూరిటీలలో ఈ నెల 27 నుంచి ట్రేడ్‌ప్లస్(టీప్లస్)1 సెటిల్మెంట్ను అమలు చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీ మార్కెట్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకూ టీప్లస్2 సెటిల్మెంట్ అమల్లో ఉంది. అంటే లావాదేవీ జరిగిన రెండు రోజుల్లో క్లియరింగ్‌ను చేపడుతున్నారు. టీప్లస్1 సెటిల్మెంట్ వల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడి సామర్థ్యాలు మెరుగుపడటంతోపాటు.. మొత్తం పరిశ్రమలో రిస్కులు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2021లోనే పునాది: నిజానికి టీప్లస్1 సెటిల్మెంట్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2021 సెప్టెంబర్ 7న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ప్రవేశపెట్టేందుకు ఎక్సే్ఛంజీలను అనుమతించింది. ట్రేడింగ్ సభ్యులు, కస్టోడియన్లు తదితర మార్కెట్ మౌలిక సంస్థలు దశలవారీగా టీప్లస్1 అమలుకు తెరతీశాయి. 2022 ఫిబ్రవరి 25న కొత్త సెటిల్మెంట్ను ప్రారంభించాయి. 2023 జనవరి 27కల్లా ఈక్విటీ విభాగంలోని అన్ని సెక్యూరిటీలనూ ఒక్క రోజు సెటిల్‌మెంట్‌లోకి తీసుకువచ్చాయి. వీటిలో ఎస్ఎంఈ షేర్లు సహా ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు), సావరిన్ గోల్డ్ బాండ్లు(ఎస్‌జీబీలు), ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు చేరాయి. పలు అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పటికీ టీప్లస్2 సెటిల్మెంటును అమలు చేస్తుండటం గమనార్హం! చదవండి: జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ! -
దారి చూపనున్న ప్రపంచ పరిణామాలు..
ముంబై: దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం స్టాక్ సూచీలకు ప్రపంచ పరిణామాలు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళిపై దృష్టి సారించవచ్చు. ఈ డిసెంబర్ 5–7 తేదీల మధ్య జరిగిన ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశపు మినిట్స్ (బుధవారం వెల్లడి)ను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు కన్నేసే అవకాశం ఉంది. ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లు కీలక వడ్డీరేట్లను అరశాతం మేర పెంచడంతో పాటు రానున్న రోజుల్లో కఠిన ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తామనే సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గతవారంలో సెన్సెక్స్ 844 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ‘‘ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలు లేకపోవడంతో మార్కెట్లలో స్థిరీకరణ దశ కొనసాగొచ్చు. సంవత్సరాంతపు సెలవుల కారణంగా ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పరిమితంగా ఉంటుంది. కావున ట్రేడింగ్ పరిమిత శ్రేణిలో ఉండొచ్చు. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 18,100 వద్ద తొలి మద్దతు, ఈ స్థాయిని కోల్పోయితే 18,000 వద్ద మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువున 18,500–18,700 శ్రేణిలో నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాలసీ కమిటీ సమావేశ ఫలితాల వెల్లడి తర్వాత అమెరికా మార్కెట్లు రెండో దశ అమ్మకాలను ఎదుర్కొంటున్నాయి. యూఎస్ గృహ విక్రయాల డేటా(మంగళవారం), క్యూ3 జీడీపీ, నిరుద్యోగ గణాంకాల(గురువారం)పై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. రేపు యూరోజోన్ కరెంట్ ఖాతా డేటాతో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. బ్రిటన్ క్యూ3 కరెంట్ ఖాతా లోటు గణాంకాలు గురువారం వెల్లడి కానున్నాయి. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణాంకాల నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు దలాల్ స్ట్రీట్ ఈ వారం రెండు ఐపీఓలు సందడి చేయనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న మూడు కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఫిన్ టెక్నాలజీస్ ఐపీఓ రేపు ప్రారంభమై, డిసెంబర్ 21న(బుధవారం) ముగిస్తుంది. ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఇష్యూ 20–22 తేదీల మధ్య జరగనుంది. వైన్ ఉత్పత్తి చేసే శూల వైన్యార్డ్స్ లిస్టింగ్ మంగళవారం ఉంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ అబాన్స్ హోల్డింగ్స్, ప్రీమియం ఆటోమొబైల్ రీటైలర్ లాండ్మార్క్ కార్స్ షేర్లు ఒకేరోజున బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ప్రథమార్థంలో రూ.10,555 కోట్ల పెట్టుబడులు భారత మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు సానుకూల వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ డిసెంబర్ ప్రథమార్థంలో( 1–16 తేదీల మధ్య) రూ.10,555 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గడం, అమెరికా ద్రవ్యోల్బణం దిగిరావడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. ‘‘ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలుకు సిద్ధమైన తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పరిమితంగా ఉండొచ్చు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్లపై రాబడులు ఎఫ్ఐఐల ట్రెండ్‌ను నిర్ణయిస్తాయి. నవంబర్ మొత్తంలో రూ.36,200 కోట్ల కొనుగోళ్లు చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూ.1.22 లక్షల కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. భారత్‌తో పాటు ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్, ఇండోనేషియాలో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. -
రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని నిర్వహించడానికి సంబంధించిన విధివిధానాలపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ), ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. వాణిజ్య శాఖ అధికారులు, బ్యాంకుల సీఈవోలు, ఎగుమతిదారులతో కేంద్ర ఆర్థిక శాఖ డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాల్గొన్న ఎగుమతిదారులు లేవనెత్తిన సందేహాలకు ఆర్బీఐ ప్రతినిధి వివరణ ఇచ్చారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారులకు రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఐబీఏ, ఎఫ్ఐఈవో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరెన్సీ మారకంపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేలా మన కంపెనీలకు, అలాగే తమ ఖాతాల్లో ఉన్న రూపాయి నిల్వలకు సమానంగా మన దగ్గర నుంచి దిగుమతులు పెంచుకునేలా సీమాంతర భాగస్వాములను ప్రోత్సహించేందుకు దేశీ కరెన్సీలో వాణిజ్యం తోడ్పడగలదని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు. (సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడుతుందని, మరిన్ని దేశాలకు కూడా దీన్ని విస్తరిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ రూపాయికి ప్రత్యేక గుర్తింపు లభించగలదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో డాలరుకు ప్రత్యామ్నాయంగా ఇతర దేశాలతో దేశీ కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు నిర్వహించుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతోంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) -
ఈటీఎఫ్‌లకూ మార్జిన్ ట్రేడింగ్ సదుపాయం
న్యూఢిల్లీ: ఈక్విటీ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు సైతం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్) అందించేందుకు బ్రోకర్లకు సెబీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్ 1 కింద ఉన్న కొన్ని స్టాక్స్‌కు మాత్రమే మార్జిన్ ట్రేడింగ్ సదుపాయాన్ని బ్రోకర్లు అందిస్తున్నారు. ఒక పెట్టుబడి సాధనంగా ఈటీఎఫ్‌లో ఉండే పారదర్శకత, వైవిధ్యం, తక్కువ వ్యయాల వంటి అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని ఈటీఎఫ్ యూనిట్లను సైతం అర్హత కలిగిన సెక్యూరిటీగా పరిగణిస్తున్నట్టు సెబీ తెలిపింది. అలాగే, ఎంటీఎఫ్‌కు తనఖాగా ఈ యూనిట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. క్లయింట్లు బ్రోకర్లకు చెల్లించే ముందస్తు మార్జిన్ అన్నది నగదు, నగదు సమానం లేదా ఈక్విటీ ఈటీఎఫ్‌ల రూపంలో ఉండొచ్చని సెబీ తెలిపింది. ఇందుకు సంబంధించి బోర్డు ఆమోదంతో కూడిన ఒక విధానం ఉండాలని స్పష్టం చేసింది. అంటే ఒక విధంగా గ్రూప్1లో ఉన్న స్టాక్స్‌కు సమానంగా ఈక్విటీ ఈటీఎఫ్‌లను ఇక మీదట పరిగణించనున్నారు. -
ఈ వారమూ మరింత ముందుకే !
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలోనూ పరిమిత శ్రేణిలో కదలాడుతూ.., ముందుకే కదిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ‘‘మార్కెట్ అప్‌సైడ్ మూమెంట్‌ను ప్రోత్సహించే సానుకూలాంశాలు పరిమితంగా ఉన్నందున్న స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. ఫెడ్ ఛైర్మన్ పావెల్ ప్రసంగం, కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. నిఫ్టీ 18,500 స్థాయిని నిలుపుకోలిగితే 18,700 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 19,000 వద్ద మరో కీలక నిరోధం ఉంది. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగితే డౌన్‌ట్రెండ్‌లో 18,100 తక్షణ మద్దతు లభించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అన్మోల్ దాస్ తెలిపారు. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్ పతనంతో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌మార్క్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, బ్యాంక్స్, టెక్నాలజీ, మౌలిక రంగ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 631 పాయింట్లు, నిఫ్టీ 205 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ డేటా బుధవారం(నవంబర్ 30న) విడుదల అవుతుంది. డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ క్యూ2లో వృద్ధి ఆరుశాతానికి పైగా నమోదుకావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేరోజున అక్టోబర్ ద్రవ్య లోటు, మౌలిక రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. మరుసటి రోజు(గురువారం) నవంబర్ తయారీ రంగ పీఎంఐ డేటా, వాహన విక్రయ గణాంకాలు విడుదల అవుతాయి. అలాగే శుక్రవారం ఆర్బీఐ నవంబర్ 25 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 18వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ప్రపంచ పరిణామాలు ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రసగించనున్నారు. కీలక వడ్డీరేట్ల పెంపుదల క్రమంగా నెమ్మదించవచ్చని ఫెడ్ మినిట్స్‌లో వెల్లడైన తర్వాత మార్కెట్ వర్గాలు పావెల్ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అమెరికా నిరుద్యోగ డేటా గురువారం వెల్లడి అవుతుంది. అదే రోజున ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాల స్థితిగతులను తెలియజేసే ‘‘బీజ్ బుక్’’ను ఫెడ్ రిజర్వ్ విడుదల చేయనుంది. చైనాలో కరోనా కేసులు, లాక్డౌన్ విధింపు వార్తలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. రష్యా చమురు నిషేధం తొలగింపుపై పాశ్చత్య దేశాల చర్యలతో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. గతవారంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర పదినెలల కనిష్టానికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 106 స్థాయికి దిగివచ్చింది. బుల్లిష్‌గా ఎఫ్ఐఐల వైఖరి భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నవంబర్‌లో ఇప్పటి వరకు (25 తేదీనాటికి) దేశీయ మార్కెట్లో రూ.31,630 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ దూకుడు వైఖరిని తగ్గించుకోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో ఎఫ్ఐఐలు మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్, ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ షేర్ల పట్ల అధిక బుల్లిష్ వైఖరిని కనబరుస్తున్నారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తెరపైకి వస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించవచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ వారంలో రెండు ఐపీవోలు ఈ వారంలో ధర్మజ్ క్రాప్, యూనిపార్ట్స్ ఇండియా కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఆగ్రో కెమికల్ ధర్మజ్ క్రాప్ సంస్థ ఇష్యూ భాగంగా రూ.216 కోట్ల విలువైన తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 35.15 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుంది. తద్వారా మొత్తం రూ. 251 కోట్లను సమీకరించనుంది. ఇందుకు ధర శ్రేణి రూ.216 – 327గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ 28న మొదలై 30న ముగిస్తుంది. ఇంజనీరింగ్ సిస్టమ్స్ కంపెనీ యూనిపార్ట్స్ ఇండియా ఐపీఓ నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2న ముగుస్తుంది. మొత్తం 1.4 కోట్ల షేర్లను విక్రయించి రూ.836 కోట్లను కంపెనీ సేకరిస్తుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.548–577గా ఉంది. -
పీటీసీ ఇండియా లాభం హైజంప్
న్యూఢిల్లీ: విద్యుత్ ట్రేడింగ్ సొల్యూషన్ల కంపెనీ పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 157 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 50 కోట్లు మాత్రమే ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5.80 చొప్పున డివిడెండును ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,926 కోట్ల నుంచి రూ. 3,107 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 3,793 కోట్ల నుంచి రూ. 2,891 కోట్లకు తగ్గాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 458 కోట్ల నుంచి రూ. 552 కోట్లకు జంప్ చేసింది. అయితే మొత్తం ఆదాయం రూ. 18,374 కోట్ల నుంచి రూ. 16,880 కోట్లకు నీరసించింది. కాగా.. గతేడాది మధ్యలోనే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. వెరసి మొత్తం రూ. 7.80 డివిడెండు చెల్లించినట్లయ్యింది. కంపెనీ ఈ ఏడాది(2022–23) జూన్ త్రైమాసిక ఫలితాలను సైతం ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు 1.1 శాతం లాభపడి రూ. 85 వద్ద ముగిసింది. -
‘రూపీ ట్రేడింగ్’ కోసం రష్యన్ బ్యాంకుల వోస్ట్రో ఖాతాలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వ్యాపార లావాదేవీల నిర్వహణకు సంబంధించి తొమ్మిది రష్యన్ బ్యాంకులు భారత్‌లో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలు తెరిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నట్లు వివరించారు. సెబెర్బ్యాంక్, వీటీబీ బ్యాంక్, గాజ్ప్రోమ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
ట్రేడింగ్ పేరుతో రూ.150 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక యాప్ ద్వారా ట్రేడింగ్‌లో పెట్టుబడులు.. రోజూ భారీ లాభాలంటూ ముక్తిరాజ్ అనే పాత నేరగాడు అనేక మందికి ఎర వేశాడు. రూ.150 కోట్ల మేర స్వాహా చేశాడు. గతంలో జైల్లో ఉన్నప్పుడు ఇతడు వేసిన ఈ స్కెచ్‌కు జైలు అధికారులూ సహకరించారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముక్తిరాజ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వందల మంది బాధితులు మంగళవారం హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఖనిజాలపై ట్రేడింగ్... పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. రాంనగర్‌కు చెంతిన ముక్తిరాజ్ గతంలో మల్టీలెవల్ మార్కెటింగ్ కేసులో అరెస్టై చర్లపల్లి జైలుకు వెళ్లాడు. రియల్ ఎస్టేట్‌తోపాటు ఖనిజాలపై ట్రేడింగ్ చేస్తానంటూ జైలు సిబ్బందిని నమ్మించాడు. బయటకు వచ్చిన ముక్తిరాజ్ హబ్సిగూడలో రియల్ ఎస్టేట్ పేరుతో కార్యాలయం తెరిచాడు. ఇది సక్సెస్ కాకపోవడంతో ట్రేడింగ్ వైపు మొగ్గాడు. ఆ వెంటనే తన కార్యాలయం పేరును మల్టీ జెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చేశాడు. ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయించి, అందులో బంగారం, వెండి, రాగి, ముడిచమురు, గ్యాస్, అల్యూమినియం, సీసం, నికెల్, మిథనాల్.. ఇలా అనేక వాటిపై ట్రేడింగ్ చేసేలా అవకాశం ఇచ్చాడు. రోజుకు 3 శాతం లాభం ఇస్తామని, ఇందులో ఒక శాతం జీఎస్టీ, సర్వీస్ చార్జీ తప్ప మిగిలింది మొత్తం తక్షణం ఇచ్చేస్తానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది జూన్‌లో ఈ స్కీమ్ మొదలుపెట్టి రెండు నెలల్లోనే వందలాది మందిని ఆకర్షించాడు. గొలుసు కట్టు విధానంలో సాగే ఈ స్కీమ్‌లో మొదట చేరిన వాళ్లు తమ కింద సభ్యులను చేరుస్తూపోయారు. ఒక్కొక్కరు 11 మందిని చేర్చగా వీరికి గరిష్టంగా 9 శాతం వరకు కమీషన్ చెల్లించాడు. దీనిపై ప్రచారం కావడంతో వేల మంది చేరారు. భారీగా లాభాలు కనిపించేలా... కస్టమర్లు కంపెనీ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశాక ముక్తిరాజ్ యాప్‌నకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాడు. ఆ యాప్‌లో వారి పెట్టుబడి, లాభాలు కన్పించేలా చేశాడు. కొందరు బాధితులు బృందాలుగా ఏర్పడి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ నెల 10 వరకు లాభాలు ఇస్తూ వచ్చిన ముక్తిరాజు ఆపై గోల్మాల్ మొదలుపెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన అనేక మంది డబ్బు విత్ డ్రా చేయడం ప్రారంభించగా, ముక్తిరాజు విత్ డ్రా ఆప్షన్స్ బ్లాక్ చేశాడు. అనేక మంది బాధితులు కార్యాలయానికి, ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో వారు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ దందాలో ముక్తిరాజ్ 10 మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో బాగిరెడ్డి, సురేష్, భాస్కర్, సతీష్ కీలకమని బాధితులు చెప్తున్నారు. నాలుగు బ్యాంక్ ఖాతాలను నిర్వహించిన ముక్తిరాజు ఇటీవల వాటి నుంచి రూ. 100 కోట్ల వరకు దారి మళ్లించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిలో జైలు సిబ్బంది సైతం ఉండటం గమనార్హం. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీసీఎస్ అడ్మిన్ ఏసీపీ పూర్ణచందర్ బాధితులకు చెప్పారు. -
బీఎస్ఈలో ఎలక్ట్రానిక్ గోల్డ్ షురూ
న్యూఢిల్లీ: బంగారం ట్రేడింగ్‌లో పారదర్శకతకు తెరతీస్తూ దిగ్గజ స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ.. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్(ఈజీఆర్) ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ ద్వారా 995, 999 స్వచ్ఛత పేరుతో రెండు ప్రొడక్టులను ప్రారంభించింది. వీటిని 1 గ్రాము పరిమాణంతో ప్రారంభించడంతోపాటు 10 గ్రాములు, 100 గ్రాములలోనూ డెలివరీలకు వీలు కల్పించింది. ఈజీఆర్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో బీఎస్ఈకి తుది అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సూచనప్రాయ అనుమతి లభించాక సభ్యులు ట్రేడింగ్ చేసేందుకు వీలుగా బీఎస్ఈ పరీక్షార్థం పలుమార్లు మాక్ ట్రేడింగ్‌ను నిర్వహించింది. కాగా.. ఈజీఆర్‌లో వ్యక్తిగత ఇన్వెస్టర్లతోపాటు..బులియన్ ట్రేడర్లు, వాణిజ్య క్లయింట్లు తదితర సంస్థలు సైతం ట్రేడింగ్‌ను చేపట్టేందుకు వీలుంటుంది. దిగుమతిదారులు, బ్యాంకులు, రిఫైనరీలు, ఆభరణ తయారీదారులు, రిటైలర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు. దీంతో స్పాట్ ధరల్లో మరింత పారదర్శకత వస్తుందని బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
విదేశీ వాణిజ్య విధానం ఆరు నెలలు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్‌నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్‌కు చెందిన రోషన్‌అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్‌నంబర్‌పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్‌కాంగ్‌లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్‌టీఎక్స్ అనే ట్రేడింగ్‌లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
ఇంకా తప్పటడుగుల్లో క్రిప్టో: అవగాహన లేకపోతే అంతే!
క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బుడగ పేలడంతో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది. 2021 ఆగస్ట్ 11న బిట్ కాయిన్ ధర 67,566 డాలర్లు. ఇప్పుడు 20,000 దరిదాపుల్లో ఉంది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా ఇదే రీతిలో ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను ఇచ్చింది. గడిచిన ఆరు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా నష్టాలను చూస్తున్నాయి. కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతను తగ్గించే చర్యల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వాటికి మరో దారి లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తెగనమ్మడం మొదలు పెట్టారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, క్రిప్టో కరెన్సీలు వేరు. ఇవి స్వేచ్ఛా మార్కెట్లు. కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. అసలు వీటికి ఫండమెంటల్స్ అంటూ ఏమీ లేవు. నియంత్రణలు ప్రపంచవ్యాప్తంగా కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థలను బయట పడేసేందుకు కేంద్ర బ్యాంకులు నిధుల లభ్యతను పెంచాయి. అవి ఈక్విటీలతోపాటు క్రిప్టోలను వెతుక్కుంటూ వెళ్లాయి. ఇప్పుడు లిక్విడిటీ వెనక్కి వెళుతుండడం వాటి ఉసురుతీస్తోంది. అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫంజిబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్‌చైన్ సాంకేతికతను భవిష్యత్తు టెక్నాలజీగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినా సరే క్రిప్టోలతో ఆర్థిక అనిశ్చితులకు అవకాశం ఇవ్వరాదన్నదే నియంత్రణ సంస్థల అభిప్రాయం. ‘‘ఫేస్బుక్ మొదలు పెట్టిన ‘లిబ్రా’ పట్ల చాలా మందిలో ఆసక్తి కనిపించింది. కానీ, దీనికి ఆదిలోనే నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. టెలిగ్రామ్ మొదలు పెట్టిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత ‘టాన్’ను నిలిపివేయాలని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది’’అని వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ వివరించారు. 2018లో క్రిప్టో లావాదేవీలకు రూపీ చెల్లింపుల సేవలను అందించొద్దంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టర్లు సుప్రీం కోర్టుకు వెళ్లి అనుకూల ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా కానీ, క్రిప్టోలతో జాగ్రత్త అంటూ ఆర్బీఐ హెచ్చరిస్తూనే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం క్రిప్టో లాభాలపై 30 శాతం మూలధన లాభాల పన్నును అమల్లోకి తీసుకొచ్చింది. లాభం నుంచి ఒక శాతం టీడీఎస్‌ను ఎక్స్చేంజ్ల స్థాయిలోనే మినహాయించే నిబంధనలను ప్రవేశపెట్టింది. మొత్తంమీద ఇన్వెస్టర్లను క్రిప్టోల విషయంలో నిరుత్సాహ పరిచేందుకు తనవంతుగా కేంద్ర సర్కారు చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ గమనించాల్సిన ముఖ్య విషయాలు ► ఫండమెంటల్స్ లేని సాధనాలు ►స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ ►నియంత్రణల్లేని చోట రిస్క్ అపరిమితం ►అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ►ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు ►నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం ►అవగాహన లేమితో నష్టాలు తెచ్చుకోవద్దని నిపుణుల సూచన -
చైనాతో వాణిజ్య స్నేహం
దేశాల మధ్య ఘర్షణ తాత్కాలికం, వాణిజ్య తదితర బంధాలు శాశ్వతం. ఇందుకు నిదర్శనమే.. సరిహద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతూ ఉండటం. భారత్, చైనాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నప్పటికీ వీటి నుంచి భారతదేశం పెద్దగా లాభపడుతున్నదేమీ లేదన్న పెదవి విరుపు ఉంది. చైనా నుంచి మనం కొనుగోలు చేస్తున్న సరకుల కంటే మనం చైనాకు అమ్మగలుగుతున్న సరకుల పరిమాణం చాలా తక్కువ అన్నమాట కూడా అబద్ధమేమీ కాదు. అయితే ఈ వ్యత్యాసాన్ని సమతుల్యం చేసేందుకు భారత్ కృషి చేస్తోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష వర్ధన్ ష్రింగ్లా ధీమాగానే చెబుతున్నారు. వచ్చే పాతికేళ్లలో భారతదేశం తనకు సాధ్యమైన ప్రతిదీ ఎగుమతి చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. మన ఎగుమతులను అత్యంత లాభదాయకంగా, గరిష్టంగా ఉత్తమమైన ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అత్యంత చౌకగా లభిస్తాయనుకున్న దేశాల నుంచి మనం సరకులను దిగుమతి చేసుకోడానికీ సిద్ధంగా ఉంది. చైనాకు భారత ఉత్పత్తులు ప్రధానంగా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు సంబంధించినవే ఎగుమతి అవుతుంటాయి. అంటే మిగతా వాటిలో మనం స్వావలంబనను సాధించేంతవరకు భారత్, చైనా వాణిజ్యం కొనసాగుతూనే ఉంటుంది. గత వందేళ్లుగా చైనీయులు భారత్‌లో నివసిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో వేలాదిమంది చైనా పౌరులు నివసిస్తూ ఉన్నారు. వారిలో అన్ని రంగాల నిపుణులూ ఉంటారు. వారి సేవల్ని కూడా భారత్ గుర్తించి, వినియోగించుకోడానికి సిద్ధంగా ఉంది. -
డాలర్‌తో పని లేదు.. ఇక రూపీతోనే చూసుకుందామా..
ముంబై: ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను భారత్, ఇరాన్ పరిశీలించాయి. అలాగే, నిర్దిష్ట బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే అంశంపైనా చర్చించా యి. మూడు రోజుల పాటు భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ అమిర్–అబ్దుల్లాహియాన్ ఈ విషయాలు తెలిపారు. భారత్ తోడ్పాటుతో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టు లో పెట్టుబడులను పెంచే అంశం కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జై శంకర్‌తో భేటీలో చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఏకపక్షంగా ఆంక్షలు విధించినప్పటికీ భారత్, ఇరాన్‌లకు పుష్కలమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హొసేన్ తెలిపారు. చదవండి: Internationalise Rupee: రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్‌కు ఇదే గోల్డెన్ ఛాన్స్..! అమెరికాకు చెక్..! -
మార్కెట్... ఆద్యంతం ఊగిసలాట
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగింది. ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంతో విఫలమైన సూచీలు మంగళవారమూ పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌లో 638 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ చివరికి 236 పాయింట్ల నష్టంతో 54,053 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లు లాభపడింది. మార్కెట్ ముగిసే సరికి 90 పాయింట్లను కోల్పోయి 16,125 వద్ద నిలిచింది. ఆర్థిక షేర్లు మినహా అన్ని రంగాల షేర్లూ నష్టపోయాయి. ఐటీ షేర్లు ఎక్కువగా క్షీణించాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,393 కోట్ల షేర్లు అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,948 కోట్ల షేర్లను కొన్నారు. యూఎస్ ఫెడ్ మినిట్స్ వెల్లడి(బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ‘‘దేశీయ మార్కెట్ దిద్దుబాటు దశలో ఉంది. అధిక వ్యాల్యుయేషన్లు సాధారణ స్థాయికి దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు ర్యాలీకి ప్రతిబంధకాలు మారాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి బలహీనత సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తున్నాయి’’ అని ఈక్వైరీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ చీప్ ఎగ్జిక్యూటివ్ అధికారి సామ్రాట్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. వీనస్ లిస్టింగ్ భేష్ వీనస్ పైప్స్–ట్యూబ్స్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇష్యూ ధర రూ.326 ధరతో పోలిస్తే బీఎస్ఈలో ఈ షేరు మూడు శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎమినిది శాతం ఎగసి రూ.352 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. డెల్హివరీ కూడా... లాజిస్టిక్స్, సప్లై చైన్ సేవల కంపెనీ డెల్హివరీ ఐపీఓ లిస్టింగ్ హిట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.487తో పోలిస్తే 1% లాభంతో రూ.493 లిస్టయ్యింది. 17% బలపడి రూ.569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం లాభంతో రూ.537 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.38,924 కోట్లుగా నమోదైంది. ఈ–ముద్ర ఐపీవో సక్సెస్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ల సేవలందించే సంస్థ ఈ–ముద్ర పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు మంగళవారానికల్లా 2.72 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 1,13,64,784 షేర్లను ఆఫర్ చేయగా.. 3.09 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 4.05 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.28 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. -
లావాదేవీలపై టీడీఎస్‌ను తగ్గించండి
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీలలో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలపై చెల్లింపులకు సంబంధించి టీడీఎస్‌ను ప్రతిపాదిత 1 శాతం నుండి 0.01 లేదా 0.05 శాతానికి తగ్గించాలని క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. ఒక టీడీఎస్ రిటైల్ వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. ఇక క్రిప్టోకరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను చాలా ఎక్కువని, ఈ పన్ను రేటును తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను నిబంధనలు, వాటి అమలు విషయంలో తన ప్లాట్‌ఫారమ్‌లోని వ్యాపారులతో కాయిన్ డీసీఎక్స్ సంప్రదింపులు జరుపుతోందని కూడా ఆయన చెప్పారు. క్రిప్టో అసెట్స్‌పై ఆదాయపు పన్నుకు సంబంధించి 2022–23 బడ్జెట్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గుర్రపు పందెం లేదా ఇతర స్పెకిలేటివ్ లావాదేవీల నుండి గెలుపొందిన మొత్తాలపై ఏప్రిల్ 1 నుండి 30 శాతం ఆదాయపు పన్ను, సెస్, సర్‌చార్జీలు విధించనున్న సంగతి తెలిసిందే. వార్షికంగా రూ. 10,000 దాటిన వర్చువల్ కరెన్సీల చెల్లింపులపై, అంతే పరిమాణానికి సంబంధించి బహుమతులపై 1 శాతం టీడీఎస్ విధించాలని బడ్జెట్ 2022–23 ప్రతిపాదించింది. ఆదాయపు చట్టం ప్రకారం ఖాతాలను ఆడిట్ చేయాల్సిన నిర్దిష్ట వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు టీడీఎస్ పరిమితి సంవత్సరానికి రూ. 50,000గా ఉంది. 1 శాతం టీడీఎస్‌కు సంబంధించిన నిబంధనలు 2022 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
జీ ఎంటర్టైన్మెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో కీలక పరిమాణం...!
న్యూఢిల్లీ: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) షేర్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై పలువురు వ్యక్తులుసహా, 10 సంస్థలపై విధించిన ఆంక్షలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రస్తుతానికి ఎత్తివేసింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టులో తమ అప్పీల్‌కు లోబడి తన తాజా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. ఉత్తర్వులు ఇవీ... జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు ధరపై ప్రభావం చూపగల బయటకు వెల్లడికాని సమాచారాన్ని పొందడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ నిర్వహించిన ఆరోపణలపై కొందరు వ్యక్తులుసహా 15 సంస్థలపై ఆంక్షలు విధిస్తూ 2021 ఆగస్టు 20వ తేదీన సెబీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2020 జూన్30తో ముగిసే త్రైమాసిక ఆడిటెడ్ ఫలితాల అంతర్గత సమాచారం ఆధారంగా లావాదేవీలు చేపట్టడం ద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్నది ఇందులో ప్రధాన ఆరోపణ. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ సెక్యూరిటీల మార్కెట్లలో లావాదేవీలు చేపట్టరాదన్న ఆంక్షలుసహా, ఈ కేసులో అక్రమంగా లబ్ది పొందారని భావిస్తున్న రూ.23.84 కోట్లను తిరిగి జప్తు చేయాలన్నది సెబీ ఆదేశాల్లో ప్రధాన అంశాలు. శాట్ రూలింగ్‌పై సెబీ అప్పీల్ సెబీ తప్పు పట్టిన వారిలో బిజల్ షా, గోపాల్ రిటోలియా, జతిన్ చావ్లా, అమిత్ భన్వర్‌లాల్ జాజూ, మనీష్ కుమార్ జాజూ, గోమతీ దేవి రిటోలియా, దల్జిత్ గురుచరణ్ చావ్లా, మోనికా లఖోటియా, పుష్పాదేవి జాజూ, భవర్లాల్ రాంనివాస్ జాజూ, భవర్లాల్ జాజూ, భవర్లాల్ జాజోరే విజయ భాగస్వాములు, యష్ అనిల్ జాజూ విమల సోమానిలు ఉన్నారు. వీరిలో మొదటి వ్యక్తి బిజల్ షా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఫైనాన్షియల్ ప్లానింగ్, విశ్లేషణ, వ్యూహరచన, ఇన్వెస్టర్ రిలేషన్స్ విభాగం చీఫ్‌గా ఉన్నారు. కాగా, ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ, ఐదుగురు వ్యక్తిగతంగా సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు. సెబీ మధ్యంతర ఉత్తర్వులను శాట్ గత ఏడాది నవంబర్‌లో తోసిపుచ్చింది. ఈ ఉత్తర్వులను ఉదహరిస్తూ, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ఈ కేసులోని మరో 10 సంస్థలు సెబీని ఆశ్రయించాయి. వీరి విజ్ఞప్తిని స్వీకరించిన సెబీ, ఇందుకు అనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. అయితే శాట్ ఉత్తర్వులపై తాను ఇప్పటికే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయని, ఆంక్షలు ఎత్తివేస్తూ తన తాజా ఉత్తర్వులు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. ఈ కేసులో సంస్థలు ఇప్పటికే డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీతోసహా తదుపరి ఆదేశాలను వెలువరించేవరకూ ఎస్క్రో అకౌంట్లో కొనసాగుతాయని కూడా సెబీ వివరించింది. -
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
-
అనధికార ఫ్లాట్‌ఫామ్స్‌పై ఫారెక్స్ ట్రేడింగ్ వద్దు..ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికార ఎలక్ట్రానిక్ ఫ్లాట్‌ఫామ్స్‌పై విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ట్రేడింగ్ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) కింద జరిమానాలు పడే అవకాశం ఉందని కూడా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజన్లు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌పై భారతీయ నివాసితులకు ఫారెక్స్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తామంటూ వస్తున్న తప్పుదోవ పట్టించే అనధికార ఈటీపీల ప్రకటనలను ఆర్బీఐ గమనిస్తున్నట్లు తెలిపింది. అనుమతించబడిన ఫారెక్స్ లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్బీఐ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా) అధికారిక ఈటీపీల మాత్రమే నిర్వహించాలని సూచించింది. ఫెమా కింద రూపొందించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ ఎక్సే్ఛంజీలు, విదేశీ కౌంటర్పార్టీలకు మార్జిన్ల కోసం చెల్లింపులకు ఎంతమాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫారెక్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పథకాలను చేపట్టేందుకు కొందరు మోసపూరిత సంస్థలు వారి ఏజెంట్లు ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా సంప్రదించి భారీ రాబడుల హామీలతో వారిని ప్రలోభపెడుతూ, అనధికార ఈటీపీలను నిర్వహిస్తున్న అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి అనధికార ఈటీపీలు, పోర్టల్‌లు చేసిన మోసపూరిత పథకాలు, ట్రేడింగ్‌ల వల్ల అనేకమంది భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. -
భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
సత్సంబంధాలతోనే ప్రయోజనం
భారత్–చైనా సంబంధాలలో ఎన్ని ఘర్షణలు చోటు చేసుకుంటున్నా, ఇరుదేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను వీలైనంతవరకు కొనసాగించడమే ఉత్తమం. ‘హిందీ– చీనీ భాయి భాయి’ అనే నినాదం స్థానంలో ‘హిందీ–చీనీ బైబై’ అనే నినాదానికి ప్రాచుర్యం ఇస్తున్న వారు ఈ ప్రపంచం మొత్తంగా పరస్పరాధారితం అనే వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ప్రపంచీకరణ ఏదో ఒక రూపంలో దేశాలన్నింటికీ ఏకం చేసింది. ఈ నేపథ్యంలో దేశాల నడుమ పొర పొచ్చాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల పాలిట శాపాలు కారాదు. ఇరు దేశాల ప్రజల అవసరాలు తీర్చడంలో అవి అడ్డంకులు కారాదు. ఈ ఎరుకతో పరస్పరం ప్రతి దేశం మరో దేశంతో పూర్తి సంయమనంతో అన్నింటా పాటించగలిగితే అది ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, అవసరాల్లో ఆదుకోవడానికి ఎంతైనా దోహదకారి అవుతుంది. స్వతంత్ర దేశంపై మరొక దేశం దురాక్రమణ ఆక్షేపణీయం. దాన్ని ఆయా రీతులలో అన్నివిధాలా ఎదుర్కోవలసిందే. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసినదే. కానీ దాని పేరుతో సమస్త సంబంధాలను విచ్ఛిన్నం చేసుకోనవసరం లేదు. సాకు దొరికింది కదా అని గతంలోని వాటిని తవ్వి తలకెత్తుకుని ఆడిపోసుకోనవసరం లేదు. మానవీయ సంబంధాలకు ఈపేరుతో ఉద్వాసన పలకనవసరం లేదు. దేశాల మధ్య పరస్పర సంబంధాలను కాదనటం, కాలదన్నటం అనైతికం. ఇది అమాయక ప్రజలలో దాగున్న భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. ఇందుకు తాజా తార్కాణం మన దేశం చైనాతో 2021లో విదేశీ వాణిజ్యం 100 బిలియన్లు డాలర్లు దాటుతూ ఉండటం. ఇంత పెద్ద స్థాయిలో పరస్పర వాణిజ్యం జరగడం ఇదే తొలిసారి. చైనా ప్రభుత్వ కస్టమ్స్ పాలనా విభాగం డేటా ప్రకారం చైనా భారత్ మధ్య వాణిజ్యం ఈ తొమ్మిది నెలల్లో గతంలో కన్నా 49 శాతం వృద్ధితో 90.3 బిలియన్లకు చేరింది. చైనా నుండి మన దిగుమతులు గతంలోకన్నా 51.7 శాతం వృద్ధితో 68.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో మన ఎగుమతులు 42.5 శాతం పెరుగుదలతో 21.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మన రెండు దేశాల విదేశీ వాణిజ్యం కరోనా ముందు కాలం నాటి కన్నా గణనీయంగా పెరగడం గమనార్హం. ఈ గణాంక వివరాలు దేశాల నడుమ వాణిజ్య సంబంధాలకు సంకేతం. మన దేశం నుంచి చైనాకు ముఖ్య ఎగుమతులు– ఇనుప ఖనిజం, కాటన్, ఇతర ముడిసరుకులు ముఖ్యమైనవి. మన దిగుమతుల్లో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ యంత్రాలు, యంత్ర పరికరాలు, మందులు, వాటికి సంబంధించిన మూలకాలు వగైరా గత రెండేళ్లలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఒక దేశ అభివృద్ధి ప్రపంచ అవసరాలను తీర్చటంతో కూడా ముడిపడి ఉంటుందని స్పష్టమవుతోంది. వీటిని ఏ రూపంలో ఆటంకపరచినా అదివిశ్వ మానవాళి ప్రయోజనాలకు ద్రోహం చేసినట్లే అవుతుంది. దేశాల నడుమ పరస్పర సత్సంబంధాలు ఏ విధంగా పరస్పర ప్రయోజనకారులో తాజా గణాంకాల వివరాలు తెలుపుతున్నాయి. ‘హిందీ – చీనీ బై బై’ అంటే ఇవన్నీ ఎలా సాధ్యం? సాధ్యం కాకుంటే ఇక్కడ అక్కడ ప్రజ లంతా ఏమయ్యేవారు? వారి అత్యవసరాలు/ ప్రయోజనాలు ఎలా తీరేవి? నెరవేరేవి? చైనా నుంచి యంత్రాలు, పరికరాలు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు, మందులకు సంబంధించిన ఎగుమతులు రెట్టింపుకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఆ దేశం నుండి రాకుంటే ఇక్కడి కోట్లాది మంది ప్రజలు ఏమై ఉండేవారు? భారత్– చైనా సంబంధాల పట్ల విషం చిమ్ముతున్న వారు ఒకవిషయం గుర్తించాలి. పరస్పర సంబంధాల విచ్ఛిన్నానికి చిన్న కారణం చాలు. వీటిని గుర్తించి గౌరవించి పాటించడమే వ్యక్తుల, వ్యవస్థల– విజ్ఞత, వివేకం, విచక్షణలకు కొలబద్ధలు. అవి ఎల్ల వేళలా అందరికీ, అందునా జనజీవనంలో ఉన్నవారికి మరింతగా ఉండాలని ఆశిద్దాం. – బి. లలితానంద ప్రసాద్ విశ్రాంత ఆచార్యులు ‘ 92474 99715 -
ఇలా చేస్తే రూ.5000 ఉచితం..!
Crosstower Offers Indian Users 5000 Credit For Learning Crypto Trading: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వాడకం ఊపందుకుంది. అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్‌లో కూడా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం బ్రోకర్‌చూసర్ పేర్కొన్న విషయం తెలిసిందే. సుమారు 10 కోట్లకుపైగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. భారత్‌లో పలు క్రిప్టో ట్రేడింగ్ కంపెనీలు కూడా క్రిప్టోపై అవగాహనను కల్పించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. జియో ఫ్రీ ఆఫర్ తరహాలో..! టెలికాం రంగంలో జియో రాకతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో ప్రారంభంలో సుమారు ఆర్నెల్ల పాటు ఉచిత డేటా, కాలింగ్‌ను అందించిన విషయం మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఇప్పుడు జియో తరహాలో క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్‌ను ప్రొత్సహించేందుకుగాను క్రిప్టో ట్రేడింగ్ కంపెనీ క్రాస్‌టవర్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. క్రాస్టవర్తో క్రిప్టో ట్రేడింగ్ ప్రారంభించే యూజర్లకు ఉచితంగా రూ. 5 వేలను వారి వ్యాలెట్‌లో క్రెడిట్ చేయనుంది. ఆయా యూజర్ కేవైసీ పూర్తికాగానే రూ. 5 వేలు వ్యాలెట్లోకి వస్తాయి. కంపెనీ ప్రకారం..వీటితో వచ్చే లాభాలను యూజర్లు సులువుగా రిడీమ్ చేసుకోవచ్చును. ట్రేడింగ్ చేసే సమయంలో వచ్చే నష్టాలను కంపెనీ భరిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఇతర వ్యాలెట్లకు ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతి ఉండదు. ఈ ఫీచర్‌తో భారత యూజర్లు ఎలాంటి ఖర్చు లేకుండా క్రిప్టో ట్రేడింగ్‌లో పాల్గొనే సామర్థ్యాన్ని పొందుతారని క్రాస్‌టవర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ అహుజా అభిప్రాయపడ్డారు. చదవండి: వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్ సరికొత్త పంథాతో ట్రేడింగ్ కంపెనీలు..! భారత్‌లో క్రిప్టోకరెన్సీపై మరింత ఆదరణను తెచ్చేందుకు పలు క్రిప్టోట్రేడింగ్ కంపెనీలు సరికొత్త పంథాలో వెళ్తున్నాయి. క్రిప్టోకరెన్సీపై మరింత అవగాహనను తెచ్చేందుకుగాను పలు ట్రేడింగ్ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ప్రముఖ నటులను నియమించుకుంటున్నారు. కొద్ది రోజల క్రితం కాయిన్స్విచ్చ్కుబేర్కు రణ్వీర్ సింగ్‌ను, కాయిన్డీసీఎక్స్కు ఆయుష్మాన్ ఖురానాను నియమించిన విషయం తెలిసిందే. వీరిని ప్రచారకర్తలుగా నియమాకంతో భారత్‌లోని టైర్-1, టైర్-2 నగరాలోని ప్రజల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహనను కల్పించేందుకు క్రిప్టోకంపెనీలు సిద్ధమయ్యాయి. చదవండి: టెస్లా కార్లపై నీతి ఆయోగ్ కీలక వ్యాఖ్యలు...! -
‘మేకింగ్ మనీ యాప్’ పేరిట మోసం
కడప అర్బన్: ఇంట్లోనే ఉంటూ సులువుగా డబ్బులు సంపాదించండి అంటూ.. ఆర్సీసీ మేకింగ్ మనీ యాప్ పేరిట సెల్ఫోన్లకు లింకులు పంపి అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుని మోసాలకు తెగబడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించిన 23 బ్యాంకు ఖాతాలను గుర్తించి, అందులోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని స్తంభింప (ఫ్రీజ్) చేశారు. కడప వన్‌టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన నాలుగు కేసుల్లో దాదాపు 100 మంది బాధితులకు రూ.11 కోట్ల మేరకు నిందితులు కుచ్చుటోపీ పెట్టారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నేరం ఇలా చేస్తారు.. ► మేకింగ్ మనీ, ఆర్సీసీ, ఇతర యాప్‌ల పేరిట బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపుతారు. ఈ లింకులను క్లిక్ చేసి.. పెట్టుబడి పెడితే కమీషన్ ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందవచ్చని ఊరిస్తారు. ► రిజిస్టర్ చేసుకుని, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ టాస్క్ పేరిట వస్తువును ఆన్లైన్లో కొనేందుకు టాస్క్‌ను బట్టి పెట్టుబడి పెట్టాలని చెబుతారు. టాస్క్‌లో పాల్గొని అధిక మొత్తంలో డబ్బులు కమీషన్ రూపంలో సంపాదించాలనే ఆశతో బాధితులు నమ్మి డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ► తొలుత కమీషన్ రూపంలో కొంత మొత్తాన్ని పంపిస్తారు. ఇలా డబ్బులు నిజంగా వస్తాయేమోనన్న ఆశతో మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేస్తారు. వాట్సాప్ ద్వారా చాట్ చేస్తూ మోసాన్ని కొనసాగిస్తారు. ► టాస్క్ అతి సులువుగా ఉండటంతో చాలా మంది తమ సన్నిహితులతో పెట్టుబడి పెట్టిస్తారు. వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ ఐడీ) ద్వారా డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేయించుకుంటారు. ► ఆర్సీసీ, మనీ మేకింగ్, ఇతర యాప్‌లలో బాధితుల ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తుంటుంది. అయితే అదంతా ఫేక్ డిస్ప్లే. అప్పటికే బాధితుల మొత్తాన్ని ఇతర ఖాతాలకు తరలించి సైబర్ నేరగాళ్లు దానిని క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చుకుంటారు. ఇలా పట్టుబడ్డారు.. ► కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన గౌస్‌బాషా ఫిర్యాదుతో నిఘా పెట్టి, తమిళనాడులోని నామక్కల్‌కు చెందిన గోకుల్ వెందన్ (28), ఈరోడ్‌కు చెందిన మురుగానందన్ (50)లే నిందితులుగా గుర్తించారు. వీరు ఎంతో మందిని మోసం చేశారు. అయితే ఇదే తరహా నేరం చేసిన ఘటనలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి పోలీసులు పీటీ వారెంట్ ద్వారా వారిని కడపకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచి, కస్టడీలోకి తీసుకున్నారు. ► బాధితుడు గౌస్‌బాషా స్నేహితుడు దండు నాగచైతన్య కూడా రూ.99,980 మోసపోయాడు. ఇకపై ఎవరూ ఇలాంటి లింకులను క్లిక్ చేయొద్దు. ఎవరైనా మోసపోయి ఉంటే పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. -
ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్‌పై బీఎస్ఈ కసరత్తు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫాంపై ఆవిష్కరించేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధంగా ఉన్నట్లు బాంబే స్టాక్ ఎక్సే్చంజీ (బీఎస్ఈ)చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సమీర్ పాటిల్ తెలిపారు. త్వరలో దీనికి అనుమతులు పొందేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దాదాపు ఒకే రకంగా ఉండేలా చూసేందుకు ఈజీఆర్‌లు తోడ్పడగలవని పాటిల్ చెప్పారు. ఇతర షేర్ల లావాదేవీల తరహాలోనే ఈజీఆర్‌ల ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈజీఆర్‌లను డీమ్యాట్ తరహాలోనే ఉంచుకోవచ్చని, అవసరమైనప్పుడు భౌతిక బంగారం రూపంలోకి మార్చుకోవచ్చని పాటిల్ చెప్పారు. ఇదంతా మూడు అంచెల్లో జరుగుతుందన్నారు. ముందుగా భౌతిక బంగారాన్ని ఈజీఆర్ల్లోకి మార్చడం, ఈజీఆర్ రూపంలో ట్రేడింగ్ నిర్వహించడం, తర్వాత ఈజీఆర్‌ను తిరిగి భౌతతిక రూపంలోకి మార్చడం ఉంటుందని పాటిల్ చెప్పారు. ముందుగా 1 కేజీ, 100 గ్రాముల డినామినేషన్లో ఈజీఆర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు దశలవారీగా 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల పరిమాణంలో కూడా ఈజీఆర్‌లను అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. క్లయింట్లు కావాలనుకుంటే భౌతిక బంగారాన్ని నిర్దిష్ట డెలివరీ సెంటర్లో జమ చేసి ఈజీఆర్‌ను కూడా పొందవచ్చని పాటిల్ వివరించారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రస్తుతం భౌతిక రూపంలో బంగారం ట్రేడింగ్‌కు కూడా స్పాట్ ఎక్సే్చంజీలు ఉన్నప్పటికీ, భారత్‌లో మాత్రం గోల్డ్ డెరివేటివ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మాత్రమే ట్రేడింగ్‌కు అనుమతి ఉంటోంది. -
Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 525 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల లాభంతో 60,078 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 141 పాయింట్ల శ్రేణిలో ట్రేడింది. మార్కెట్ ముగిసే సరికి రెండు పాయింట్ల అతి స్వల్ప లాభంతో 17,855 వద్ద నిలిచింది. ఈ ముగింపులు ఇరు సూచీలకు జీవితకాల గరిష్ట స్థాయిలు. ఎవర్‌గ్రాండే సంక్షోభంతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరుగుదల అంశాలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. తొలిసెషన్లో ఆటో, బ్యాంకింగ్, ఆయిల్‌అండ్‌గ్యాస్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మిడ్‌సెషన్ నుంచి ఐటీ, ఫార్మా, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంక్షోభాన్ని తట్టుకొనేందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ ఆ దేశ వ్యవస్థలోకి 17 బిలియన్ డాలర్లను చొప్పించడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. జర్మనీ ఎన్నికల్లో నేపథ్యంలో యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరగడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 73.83 వద్ద స్థిరపడింది. ‘‘ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబం చేసే పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాల విడుదల కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. రియల్టీ సెక్టార్లో డిమాండ్ తిరిగి ఊపందుకోవడంతో ఈ రంగ షేర్ల ర్యాలీ కొనసాగింది. షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్ కదలాడుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. టాప్‌గేర్‌లో ఆటో షేర్ల ర్యాలీ... ఆటో షేర్లు టాప్‌గేర్‌లో దూసుకెళ్లాయి. పండుగ సీజన్ ప్రారంభంతో ఈ సెప్టెంబర్ వాహన విక్రయాల్లో వృద్ధి ఉండొచ్చని, అక్టోబర్‌లోనూ డిమాండ్ కొనసాగవచ్చనే అంచనాలతో ఈ రంగ షేర్లు లాభాల బాటపట్టాయి. సెమికండెక్టర్ల కొరత కొంతమేర తగ్గిందని పలు కంపెనీల వ్యాఖ్యలు ర్యాలీకి తోడ్పాటును అందించింది. మారుతీ సుజుకీ షేరు అత్యధికంగా ఆరున్నర శాతం ఎగసింది. ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్, అమరరాజా బ్యాటరీస్ షేర్లు 5–4% చొప్పున రాణించాయి. టీవీఎస్, భాష్, ఎంఆర్ఎఫ్, హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ షేర్లు రెండు నుంచి మూడు శాతం పెరిగాయి. రిలయన్స్ మెరుపులు... రిలయన్స్ షేరు ట్రేడింగ్‌లో మెరిసింది. ఇంట్రాడేలో 2% పైగా ర్యాలీ చేసి రూ.2529 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. షేరు ధర ఆల్‌టైమ్ హైని అందుకోవడంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ విలువ రూ.16 లక్షల కోట్ల పైకి ఎగసింది. మార్కెట్ విలువ విషయంలో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ ఇదే. చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేరు 2% లాభం తో రూ.2525 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో మా ర్కెట్ విలువ కూడా దాదాపు రూ. 16 లక్షల కోట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ షేరు ఈ ఏడాది(2021)లో 27% ర్యాలీ చేసింది. -
క్రిప్టోకరెన్సీ.. భారీగా ఉద్యోగావకాశాలు
క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. దేశీయంగా వీటి ట్రేడింగ్, మైనింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలు పెద్ద సంఖ్యలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. వీటికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం కావడంతో ఎక్కువగా తత్సంబంధ అంశాల్లో పరిజ్ఞానమున్న ఇంజనీర్లకు డిమాండ్ ఉంటోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్, బ్యాక్ఎండ్ డెవలపర్, క్రిప్టో ఇంజినీర్లు మొదలైన వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. వీరితో పాటు ప్రోడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ సిబ్బంది నియామకాలు కూడా మొదలైనట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. సాంప్రదాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే క్రిప్టో ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు కనీసం 25–30 శాతం అధికంగా ఉంటుండటంతో.. ఇంజినీర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించాయి. దేశీయంగా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు వార్షికంగా రూ. 9.5 లక్షల నుంచి ఉంటున్నాయి. రెండేళ్ల దాకా అనుభవం ఉన్నవారికి దాదాపు రూ. 22 లక్షల దాకా ప్యాకేజీ ఉంటోంది. ఇక సాలిడిటీ వంటి వినూత్న టెక్నాలజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్నవారికైతే ఏకంగా రూ. 45 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటోంది. ఇతర ఉద్యోగాలకు సంబంధించి మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో లిస్టయిన కాయిన్‌బేస్ అనే భారీ క్రిప్టో ఎక్సే్చంజీ ప్లాట్‌ఫాం పెద్దయెత్తున నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత్‌లో పూర్తి స్థాయి హబ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2012లో ప్రారంభమైన కాయిన్‌బేస్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, ఎథీరియం, లైట్‌కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోంది. భిన్నమైన నైపుణ్యాలు.. ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫాంలతో పోలిస్తే క్రిప్టో రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవి మార్కెట్లో నేర్చుకోవడానికి అంత సులువుగా లభించవు. క్రిప్టో రంగానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సుశిక్షితులైన ఇంజినీర్లు అవసరమవుతారు. కోడ్‌ను వేగవంతంగా రూపొందించడం, వినియోగంలోకి తేవడంతో పాటు కోడ్ భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి వినియోగంలోకి తెచ్చాక సొల్యూషన్స్‌లో మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి ఏ కాస్త తప్పిదం జరిగినా అటు యూజర్లు, ఇటు ప్లాట్‌ఫాంలు భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కనుక హ్యాకింగ్ దాడులనూ సమర్ధంగా తట్టుకునేలా ప్లాట్‌ఫాంలు సురక్షితంగా ఉండాలి. హ్యాకింగ్ జరిగితే సెకన్లలో కోట్ల డబ్బు తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి కోడర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతటి రిస్కీ వ్యవహారం కాబట్టి కోడర్లకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. సందిగ్ధంలో ఉద్యోగార్థులు.. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, క్రిప్టో సంస్థలపై నియంత్రణపరంగా స్పష్టత లేకపోవడంతో వీటిలో చేరడానికి ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారు. క్రిప్టో కరెన్సీకి తాను అనుకూలమా లేక ప్రతికూలమా అన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పటిదాకా స్పష్టతనివ్వలేదు. ఈ అనిశ్చితితో హైరింగ్‌పైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని క్రిప్టో రంగంలోని సంస్థల్లో చేరడానికి చాలా మంది ఇష్టపడటం లేదని క్రిప్టో ఎక్సే్చంజీ నిర్వాహకులు అంటున్నారు. ఉద్యోగార్థులు చేరాలనుకున్నా వారి కుటుంబాల ఆందోళన వల్ల సదరు అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక కోర్సులు... అర్హులైన ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మైనింగ్ చేస్తున్నవారిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు క్రిప్టో సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే వారు రిఫ్రెషర్ కోర్సులు నేర్చుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అనుభవమనేది ఇతరత్రా విద్యాసంస్థల్లో నేర్చుకున్న దానికి మించి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. క్రిప్టో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ప్రత్యేక కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఎంఐటీ మీడియా ల్యాబ్ .. క్రిపోకరెన్సీలపై ఆరు వారాల స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సు అందిస్తోంది. గెట్స్మార్టర్ అనే డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ భాగస్వామ్యంతో అందించే ఈ కోర్సు ఫీజు రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇటీవలే సింప్లీలియర్ అనే అంతర్జాతీయ డిజిటల్ నైపుణ్యాల సంస్థ .. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నాలుగు నెలల ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అందించేందుకు ఐఐటీ కాన్పూర్‌తో జట్టు కట్టింది. నిపుణుల కొరత... మధ్యవర్తి ప్రమేయం లేకుండా రెండు వర్గాలు క్రిప్టో లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను స్మార్ట్ కాంట్రాక్టులుగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదాహరణకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంలలో స్మార్ట్ కాంట్రాక్టులను అమలు చేసేందుకు ఉపయోగించే సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఇది 2014లో తెరపైకి వచ్చింది. ఈ లాంగ్వేజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్న వారు కూడా వార్షికంగా రూ. 45 లక్షల దాకా వేతనం అందుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సుశిక్షితులైన వారి కొరత తీవ్రంగా ఉండటంతో ఎంతైనా ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లకు నెలకు రూ. 1.45 లక్షల దాకా వేతనం ఇచ్చి తీసుకునేందుకు యునోకాయిన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకుని, వారికి శిక్షణనిచ్చుకోవాల్సి వస్తోంది. కాయిన్‌బేస్ వంటి పెద్ద సంస్థలు నియామకాలను గానీ చేపడితే.. పరిస్థితులు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల మరింత మంది శిక్షణ పొంది, నిపుణుల కొరత కొంత తీరవచ్చని పేర్కొన్నారు. కేవలం ఇంజినీర్లే కాకుండా క్రిప్టో ఎక్సే్చంజీల్లో ఇతరత్రా సిబ్బంది అవసరం కూడా ఉంటోంది. -
ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్ క్రిస్ కెయిన్స్ జీవితం నేర్పే పాఠాలివే!
ఇప్పుడు న్యూజిల్యాండ్ అంటే కెయిన్ విలియమ్సన్ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్ మరొకరు ఉన్నారు అతనే క్రిస్ కెయిన్. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. సాక్షి, వెబ్‌డెస్క్: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్ టు హై సక్సెస్ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్ కెయిన్స్ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్ జీవితం. న్యూజిల్యాండ్ స్టార్ హాలీవుడ్ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్ స్టార్ ఆటగాడు కెయిన్స్. ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్ తను ఎదిగాడు. పైసల్లేక ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్ కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్ చివరకు బస్సులు కడిగే క్లీనర్ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి డైమండ్ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్ కెయిన్స్ కెరీర్ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్మెంట్ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. అదుపులేని ఖర్చులతో కెయిన్స్ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. అవనసర ఖర్చులు వద్దు అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్ కెయిన్స్ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు. ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్ రన్లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్ బఫెట్ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు. ఆలోచన ధోరణి మారాలి డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్ క్రికెటర్ నుంచి క్లీనర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు. -
ట్రేడింగ్ పేరుతో లక్షల రూపాయలు దోపిడీ
-
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టేయండిలా!
ముంబై: ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ పేరుతో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులకు వన్‌స్టాప్ సొల్యూషన్‌ను ఆవిష్కరించింది. ఇందుకు ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను ప్రారంభించి నిర్వహించేందుకు ఎలాంటి ఫీజునూ వసూలు చేయరు. అయితే పేమెంట్ గేట్‌వే ఫీజులు అమలవుతాయి. వీటిని రిజిస్టర్ చేసుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైలర్ల లావాదేవీలను పెంచే బాటలో ఆర్బీఐ తాజా చర్యలు తీసుకుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిటైలర్లు ప్రభుత్వ బాండ్ల జారీ వివరాలను పొందవచ్చు. -
రెండు ఉదంతాల్లో రూ.73 లక్షల మోసం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ట్రేడింగ్ చేసే వ్యక్తితో పాటు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ రూ.73 లక్షల మేర నష్టపోయారు. ఇన్వెస్టర్‌తో పాటు ఎన్ఆర్ఐ సోదరుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన ఓ మహిళ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఈమె వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు కొన్నాళ్ల క్రితం ఫోన్ చేశారు. ఓ మహిళ మాట్లాడుతూ తాను ట్రేడింగ్ వ్యాపారం చేసే ఓ సంస్థ తరఫున మాట్లాడుతున్నానంటూ మాట్లాడింది. ఏ రంగాల్లో, ఎలా ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయో తమకు తెలుసంటూ నమ్మబలికింది. దీనికి రెండుమూడు ఉదాహరణలు చెప్పి మరీ పూర్తిగా బుట్టలో వేసుకుంది. ఆపై ట్రేడింగ్‌లో అంటూ రూ.5 లక్షలను తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్ చేసిన ఆ కీలేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ. 4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ. 60 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమెరికాలో నివసిస్తున్న పాతబస్తీకి చెందిన ఓ మహిళ పేరుతో దుండగులు ఐదు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. వీటి ద్వారా జరిపిన రూ.13 లక్షల లావాదేవీల బిల్లులు ఇక్కడుంటున్న ఆమె సోదరుడికి వచ్చా యి. పూర్వాపరాలు పరిశీలించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రవాస భారతీయురాలైన ఆ మహిళ సోదరుడు, కుమార్తె పాతబస్తీలో నివసిస్తున్నారు. కొన్నేళ్లగా అమెరికాలోనే ఉండిపోయిన ఆమె పేరుతో ఇక్కడి యాక్సస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల నుంచి ఐదు క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. ఈ కార్డులు, ఓటీపీలు పంపే కవర్లు నేరుగా నేరగాళ్లకే డెలివరీ అయ్యాయి. రూ.13 లక్షలకు సంబంధించిన బిల్లులు మాత్రం ఆమె సోదరుడి చిరునామాకి చేరాయి. దీంతో తన సోదరిని సంప్రదించిన ఆయన ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. దీంతో సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
నేషనల్ 'షాక్' ఎక్స్చేంజ్!
ముంబై: దేశీయంగా ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈ బుధవారం ట్రేడర్లకు చెమట్లు పట్టించింది. సాంకేతిక సమస్య కారణంగా ఎన్ఎస్ఈలో దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీకి సరిగ్గా ముందు రోజు ఇలా జరగడంతో ట్రేడింగ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్నికల్ సమస్య పరిష్కారమయ్యాక చివర్లో అసాధారణంగా ట్రేడింగ్ వేళలు సాయంత్రం అయిదింటి దాకా పొడిగించడం కొంత ఊరటనిచ్చింది. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యలకు కారణమంటూ ఎన్ఎస్ఈ పేర్కొనగా.. దీనిపై సమగ్రంగా వివరణ ఇవ్వాలంటూ ఎక్సే్చంజీని సెబీ ఆదేశించింది. ఏం జరిగిందంటే... నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మరోసారి సాంకేతిక లోపాలతో కుదేలైంది. బుధవారం ఉదయం దాదాపు 10 గం.ల ప్రాంతంలో నిఫ్టీతో పాటు ఇతర ఎన్ఎస్ఈ సూచీల టికర్లు సరిగ్గా పనిచేయడం లేదంటూ డీలర్లు ఫిర్యాదు చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. చివరికి సాంకేతిక సమస్యల కారణంగా క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ నిలిపివేస్తున్నట్లు 11.40 గం.లకు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఆ తర్వాత సాయంత్రం 3.30 గం.ల దాకా ట్రేడింగ్ నిల్చిపోయింది. గురువారంతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండటంతో ట్రేడర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అసాధారణంగా ట్రేడింగ్ వేళలను పొడిగించారు. సాధారణ ట్రేడింగ్ సమయం సాయంత్రం 3.30 గం.లకు ముగిసిపోయాక 3.45 గం.ల నుంచి ట్రేడింగ్ మళ్లీ ప్రారంభమై సాయంత్రం 5 దాకా సాగింది. దీనికనుగుణంగా బీఎస్ఈ, మెట్రోపాలిటన్ ఎక్సే్చంజీ ఆఫ్ ఇండియా ట్రేడింగ్ వేళలను కూడా సాయంత్రం 5 దాకా పొడిగించారు. కనెక్టివిటీ సమస్యలే కారణం.. టెలికం కనెక్టివిటీపరమైన అంశాలే సాంకేతిక సమస్యకు కారణమని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఎన్ఎస్ఈకి రెండు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అనేక టెలికం లింకులు ఉన్నాయి. తమ టెలికం లింకుల్లో సమస్యలు ఉన్నాయంటూ అవి మాకు సమాచారం ఇచ్చాయి. ఇది ఎన్ఎస్ఈ సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపింది‘ అని వివరించింది. వివరణ కోసం సెబీ ఆదేశం.. ఎన్ఎస్ఈలో సాంకేతిక లోపాల వ్యవహారాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ట్రేడింగ్‌ను డిజాస్టర్ రికవరీ సైట్‌కు ఎందుకు మళ్లించలేదని ప్రశ్నించింది. సత్వరం దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అలాగే, ’ట్రేడింగ్ హాల్ట్’కి మూలకారణాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించింది. అనూహ్య సమస్యలు తలెత్తినప్పుడు కార్యకలాపాలపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయంగా డిజాస్టర్ రికవరీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇక ఎన్ఎస్ఈ వర్గాలతో కలిసి పరిస్థితిని సమీక్షించిన ట్లు సెబీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిణామాలను మార్కెట్ వర్గాలకు తెలియజేయాలంటూ ఎన్ఎస్ఈకి సూచించినట్లు పేర్కొన్నారు. ఇదే మొదటిసారి కాదు.. ఎన్ఎస్ఈ ఇలా సాంకేతిక సమస్యలు ఎదుర్కొనడం ఇదే తొలిసారి కాదు. 2020 జూన్‌లో బ్యాంక్ ఆప్షన్ సెగ్మెంట్ ధరలు ఎక్సే్చంజీలోని టెర్మినల్‌లో ప్రతిఫలించలేదు. 2019 సెప్టెంబర్‌లో.. ట్రేడింగ్ చివర్లో సిస్టమ్ పనిచేయలేదు. 2017లోనూ ఇలాంటి సమస్యే వచ్చి దాదాపు 5 గంటల పాటు ట్రేడింగ్ ఆగిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను పటిష్టం చేసుకోవాలంటూ అప్పట్లోనే ఎన్ఎస్ఈకి సెబీ గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. కానీ నాలుగేళ్లు తిరగకుండానే ఎన్ఎస్ఈ మళ్లీ అలాంటి సమస్యలోనే చిక్కుకుంది. బీఎస్ఈలో యథావిధిగా ట్రేడింగ్.. ఎన్ఎస్ఈ డౌన్ అయినప్పటికీ బీఎస్ఈలో యథావిధిగానే పనిచేసింది. అయితే, బ్రోకర్లంతా పొలోమంటూ బీఎస్ఈకి మళ్లడంతో ట్రేడింగ్ వాల్యూమ్ .. రోజువారీ సాధారణ స్థాయికన్నా తొమ్మిది రెట్లు పైగా పెరిగింది. ట్రేడర్లు తమ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు హడావుడి పడటంతో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని స్టాక్స్ హఠాత్తుగా లోయర్ సర్క్యూట్లకు కూడా పడిపోయాయంటూ పలువురు ట్రేడర్లు తెలిపారు. తాము తీసుకున్న పొజిషన్ల పరిస్థితి ఏమిటన్నది తెలియక వారిలో గందరగోళం నెలకొంది. మిగతా దేశాల్లోనూ... ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోని ఎక్సే్చంజీల్లోనూ గతంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆస్ట్రేలియా సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ (2020) ట్రేడింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 10.24 గం.లకు ట్రేడింగ్ ఆగిపోయింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మిగతా రోజంతా కూడా నిలిపివేశారు. టోక్యో స్టాక్ ఎక్సే్చంజ్ (2020) మార్కెట్ వివరాలను రిలే చేసే హార్డ్‌వేర్‌లో సమస్యలు తలెత్తడంతో స్థానిక సమయం ప్రకారం ఉదయం 9 గం.లకు ట్రేడింగ్ నిల్చిపోయింది. బ్యాకప్ వ్యవస్థ కూడా విఫలం కావడంతో మిగతా రోజంతా కూడా ట్రేడింగ్ సాగలేదు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2018) సాంకేతిక సమస్యల కారణంగా అమెజాన్, ఆల్ఫాబెట్ సహా అయిదు దిగ్గజ కంపెనీల షేర్లలో పూర్తి రోజంతా ట్రేడింగ్ నిలిపివేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్ (2015) చాలా భారీ సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని షేర్లలో ట్రేడింగ్ నిల్చిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అంతర్గతంగా సాంకేతిక సమస్య ఇందుకు కారణమంటూ ఎన్వైఎస్ఈ తెలిపింది. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ (2008) సాంకేతిక సమస్య కారణంగా దాదాపు రోజంతా ట్రేడింగ్ నిల్చిపోయింది. మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత అమ్మడానికి, కొనడానికి షేర్ల ధరలు కనిపించడం లేదంటూ ట్రేడర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ట్రేడింగ్ నిలిపివేశారు. దాదాపు 7 గంటల తర్వాత ముగింపు సమయానికి అరగంట ముందు తిరిగి ప్రారంభమైంది. మళ్లీ 52 వేల పైకి సెన్సెక్స్ ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో నెలకొన్న సాంకేతిక అంతరాయం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయలేకపోయింది. ఆర్థిక రంగ షేర్లు రాణించడంతో బుధవారం మార్కెట్ భారీ లాభాలను మూటగట్టుకుంటుంది. సెన్సెక్స్ 1,030 పాయింట్లు పెరిగి తిరిగి 50 వేల పైన 50,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 15 వేల స్థాయిని అందుకున్నప్పటికీ.., ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. చివరకు 274 పాయింట్లు లాభంతో 14,982 వద్ద నిలిచింది. మొదటి సెషన్లో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సాంకేతిక అంతరాయం తొలగి మార్కెట్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు దూసుకెళ్లాయి. నేడు (గురువారం) ఎఫ్అండ్ఓ ముగింపు నేప«థ్యంలో ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌తో పాటు తమ పోజిషన్లను రోలోవర్ చేసుకోవడంతో సూచీలు ర్యాలీ చేసినట్లు నిపుణులు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. సంపద రూ.2.60 లక్షల కోట్లు అప్ మార్కెట్ 2% లాభంతో ఇన్వెస్టర్లు రూ.2.60 కోట్లు ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.203 లక్షల కోట్లకు చేరింది. -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
-
లాక్డౌన్లో మొబైల్స్‌పై జోరుగా స్టాక్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు మరింత మంది ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించి.. మొబైల్స్‌పై ట్రేడింగ్‌కు ఆసక్తి చూపించినట్టు బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. రానున్న కాలంలోనూ స్మార్ట్ఫోన్ల ద్వారా ట్రేడింగ్ మరింత పుంజుకుంటుందని అవి అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్ల నుంచి వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సమాచారం తెలుసుకోవడంతోపాటు, పెట్టుబడులకు సంబంధించి వెంటనే నిర్ణయాన్ని అమలు చేసేందుకు సౌలభ్యం ఉంటుందని పేర్కొన్నాయి. ‘‘వినియోగం పరంగా సౌకర్యంగా ఉండడం వల్ల లాక్డౌన్ సమయంలో డెస్క్‌టాప్ నుంచి మొబైల్ పరికరాలపైకి చెప్పుకోతగిన స్థాయిలో ట్రేడింగ్ కార్యకలాపాలు బదిలీ అయ్యాయి’’ అని ఫైయర్స్ సీఈవో తేజాస్ కొడాయ్ తెలిపారు. ప్రధానంగా మొదటిసారి ఇన్వెస్టర్లు, మిలీనియల్స్ నుంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. మొబైల్ యాప్‌పై ట్రేడింగ్‌లో చెప్పుకోతగినంత పెరుగుదల నెలకొన్నట్టు షేర్‌ఖాన్ సీఈవో జైదీప్ అరోరా తెలిపారు. 2020 జనవరి–జూలై మధ్య ఆన్లైన్ ట్రేడింగ్ అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47 శాతం పెరిగిందని.. షేర్‌ఖాన్ యాప్ నుంచి ఆర్డర్ల సంఖ్యలో 91 శాతం వృద్ధి ఉన్నట్టు ఆయన చెప్పారు. ఆధునిక టెక్నాలజీ, వినియోగానికి సౌకర్యంగా ఉండడం వల్ల మొబైల్ యాప్స్‌పై ట్రేడింగ్ విస్తృతం అవుతున్నట్టు అప్‌స్టాక్స్ సీఈవో రవికుమార్ వెల్లడించారు. -
ఈ 4నియమాలతో నష్టాలకు దూరం
స్టాక్‌మార్కెట్ అనేది అవకాశాలకు స్వర్గధామం. ప్రతి ట్రేడర్ మంచి రాబడుల్ని ఆశిస్తూ ట్రేడ్ చేస్తారు. అయితే అందరూ అందులో విజయాల్ని సాధించలేరు. మార్కెట్ ట్రెండ్‌ను గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పు అవసరం. గట్టి పట్టుదల ఉండాలి. అన్నింటిని అలవరుచుకొని సురక్షితంగా ట్రేడింగ్ చేస్తేనే లాభాలు సమకూరుతాయి. ఈ క్రమంలో ప్రతి ట్రేడరు 4నాలుగు నియమాలను అలవరుచుకుని నష్టాలకు దూరంగా ఉండచవచ్చని క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ జష్న్ అరోరా తెలిపారు. 1.రిస్క్‌ను ముందుగానే అంచనా వేసుకోవాలి: స్టాక్ మార్కెట్లో వైఫల్యానికి ‘‘మేనేజ్మెంట్ నైపుణ్యం లేకపోవడం’’ అతిపెద్ద కారణం. కాబట్టి ట్రేడింగ్ విఫలమైతే సంభవించే నష్టాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. సాధారణంగా ట్రేడర్లు తమ డబ్బులన్నింటినీ ఒకే స్టాక్‌లో ఉంచి నష్టాలను చవిచూస్తారు. 2.మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి: మార్కెట్ అర్థం చేసుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు అనేది వాస్తవమే. అయితే మార్కెట్‌ను అర్థం చేసుకోకుంటే భారీ నష్టాలను నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే భారీ నష్టాలు తప్పవు. 3.స్టాప్ లాస్ పెట్టుకోవాలి ట్రేడర్లు ఎల్లప్పుడూ ‘‘స్టాప్ లాస్’’ ఆప్షన్ వినియోగించాలి. ఈ ఆప్షను ఉపయోగించక పోతే స్టాక్‌లో రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ షేరు ధర ట్రేడర్ ఊహించిన దానికి అనుకూలంగా కదలకపోతే భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. 4.భావోద్వేగాలకు దూరంగా ఉండాలి స్టాక్ మార్కెట్లో భావోద్వేగాలకు స్థానం లేదు. షేరు మరింత నష్టాన్ని చవిచూడవచ్చనే భయాలు లేదా మరింత ర్యాలీ చేస్తుందనే ఆత్యాశ లాంటి భావోద్వేగాలు పనికిరావు. ఒకవేళ ఇలా చేస్తే ఎక్కువ మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. నిఫ్టీకి 10,325-10,410 శ్రేణి కీలకం: ఈ వారంలో జూన్ కాంట్రాక్టు డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడకులకు లోనయ్యే అవకాశం ఉందని అరోరా అభిప్రాయపడ్డారు. అప్‌సైడ్‌లో నిఫ్టీ 10,325-10,410 శ్రేణిలో కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుందని ఆయన అన్నారు. ఒకవేళ ఇండెక్స్ 10,400 స్థాయిని అధిగమించగలిగితే దాని తదుపరి నిరోధ శ్రేణి 10,530-10,650 ఉండొచ్చు. ఇప్పటికీ నిఫ్టీ 200 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయిని ఎదుర్కోంటుందన్నారు. డౌన్‌ట్రెండ్‌లో 10070 దిగువుకు చేరితే ఇండెక్స్ మరింత బలహీనపడి 9,950-9,840 స్థాయికి చేరుకుంటుదన్నారు. ఈ స్థాయికి కోలో్పతే తదుపరి కీలక మద్దతు 9,725-9,700 స్థాయిని పరీక్షిస్తుంది. -
మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్..!
టోక్యో/న్యూయార్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్ జరగలేదు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు. పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత. ఆస్ట్రేలియా స్టాక్ సూచీ 5 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ 3 శాతం నష్టపోయింది. బ్రిటన్ ఎఫ్టీఎస్సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన మార్కెట్లో ట్రేడింగ్ జరిగిఉంటే, సెన్సెక్స్ 1,000 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు. -
‘యస్’ షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. షేరు ఏకంగా 50 శాతం పైగా ఎగిసినప్పటికీ తమ దగ్గరున్న వాటిని విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్లో తమ పొజిషన్లను వదిలించుకోలేకపోవడంపై పలువురు సీనియర్ ఫండ్ మేనేజర్లు, ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిబంధనను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీగా పొజిషన్లు ఉన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయినట్లయిందని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత నియంత్రణ సంస్థను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఆంక్షల గురించి సోమవారం ఉదయానికి మాత్రమే ఇన్వెస్టర్లకు తెలిసింది. అంతే కాకుండా యస్ బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్‌ను మొబైల్ యాప్స్ ద్వారా కుదరదని, డెస్క్‌టాప్ ద్వారా మాత్రమే చేయాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితర బ్రోకింగ్ సంస్థలు .. ఇన్వెస్టర్లకు సమాచారమిచ్చాయి. ఒకవేళ యస్ బ్యాంక్ షేర్లలో ఈ–మార్జిన్ పొజిషన్లు గానీ ఉంటే సోమవారం వాటిని డెలివరీ కింద మారుస్తామని, అందుకు తగినంత స్థాయిలో నిధులు తమ అకౌంట్లలో ఉంచుకోవాలని సూచించాయి. 19నే సూచీల నుంచి నిష్క్రమణ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న దానికంటే ముందుగానే యస్ బ్యాంక్‌ను నిఫ్టీ సహా వివిధ సూచీల నుంచి తొలగించాలని ఎన్ఎస్ఈ ఇండిసెస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్–కమిటీ నిర్ణయించింది. దీంతో ముందుగా అనుకున్నట్లు మార్చి 27న కాకుండా 19 నుంచే నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ 100, నిఫ్టీ 500 వంటి అన్ని ఈక్విటీ సూచీల నుంచి యస్ బ్యాంక్ నిష్క్రమించనుంది. 18 నుంచి పూర్తి సేవలు: ఆర్బీఐ పునరుద్ధరణ ప్రణాళిక అమల్లోకి రావడంతో మార్చి 18 సాయంత్రం నుంచి యస్ బ్యాంక్‌పై మారటోరియం తొలగిపోయి, అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో ఖాతా దారులు .. ఆంక్షలేమీ లేకుండా విత్‌డ్రాయల్స్ లావాదేవీలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్లకు ఈడీ సమన్లు.. యస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్ తదితరులపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా పలువురు కార్పొరేట్ దిగ్గజాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాష్ చందద్ర, జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఇండియాబుల్స్ చైర్మన్ సమీర్ గెహ్లాట్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. అటు అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఈ నెల 19న హాజరు కానున్నారు. యస్ బ్యాంక్ అప్‌గ్రేడ్ .. తాజాగా పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో యస్ బ్యాంక్ రేటింగ్‌ను సానుకూల అంచనాలతో అప్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. బోర్డు పునర్వ్యవస్థీకరణకు ఓకే .. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటరుగా ఉన్న ప్రశాంత్ కుమార్.. కొత్త ఎండీ, సీఈవోగా బోర్డు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. -
ఒడిదుడుకుల వారం!
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్ తరువాత, ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు. ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఉండొచ్చని ఇండియానివేష్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ తెలిపారు. ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్ మార్కెట్ నుం చి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు. -
‘కోవిడ్’ కోస్టర్..!
ప్రపంచమార్కెట్లలో కరోనా ప్రళయం కొనసాగుతూనే ఉంది. మహా పతనాల బాటలో స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కూడా మరింత అధఃపాతాళానికి పడిపోయాయి. భారత్‌లో తొలి కరోనా మరణం నమోదు కావడంతో మార్కెట్ మరోమారు అత్యంత ఘోరంగా కుప్పకూలింది. అయితే, అంతేవేగంతో నేలక్కొట్టిన బంతిలా మార్కెట్ దూసుకెళ్లి ఇన్వెస్టర్లకు అసలుసిసలు రోలర్ కోస్టర్ రైడ్‌ను చూపించింది. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ జరగని రీతిలో తొలిసారి మన స్టాక్ మార్కెట్లో మళ్లీ ట్రేడింగ్ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 3,389 పాయింట్లు నష్టపోయి... ఆ కనిష్ట స్థాయి నుంచి 5,380 పాయింట్లు దూసుకెళ్లడం తీవ్రమైన ఒడిదుడుకులకు నిదర్శనం. చివరకు 1,325 పాయింట్లు లాభపడి 34,103 వద్ద ముగిసింది. ఒకేరోజు ఇంత ఘోరంగా పడిపోవడం, మళ్లీ ఈస్థాయిలో రికవరీ.. ఈ రెండూ కూడా కొత్త రికార్డులే కావడం గమనార్హం. కాగా, శుక్రవారం ఆరంభంలో 15 నిమిషాల్లోనే రూ.12.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోగా... చివరికి ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకోవడంతోపాటు రూ.3.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ పెరగడం విశేషం!! శుక్రవారం స్టాక్ మార్కెట్ చిత్ర, విచిత్ర గతులతో ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు చుక్కలు చూపించింది. ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతం నష్టపోవడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడైనా, మెల్లగా కోలుకొని, లాభాల్లోకి వచ్చాయి. కోవిడ్–19 వైరస్ భయాలున్నప్పటికీ, వేల్యూ బయింగ్, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో భారీ లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 3,389 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 1,325 పాయింట్ల లాభంతో 34,103 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 1,035 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ చివరకు 365 పాయింట్ల లాభంతో 9,955 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4%, నిఫ్టీ 3.8% లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కరోనా భయాలను అరికట్టడానికి ఆర్బీఐతో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్టమూర్తి సుబ్రమణ్యన్ భరోసానివ్వడం సానుకూల ప్రభావం చూపించింది. 5,380 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..... కోవిడ్ 19 వైరస్ కల్లోలం ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో గురువారం ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 10–12 శాతం, అమెరికా స్టాక్ సూచీలు 8 శాతం మేర క్షీణించాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. ఈ ప్రభావంతో సెన్సెక్స్ 1,564 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. పదినిమిషాల్లోనే సెన్సెక్స్ 3,389 పాయింట్ల నష్టంతో 29,389 పాయింట్లకు, నిఫ్టీ, 1,035 పాయింట్ల నష్టంతో 8,555 పాయింట్లకు పడిపోయాయి. ఈ రెండు సూచీలు 10 శాతం లోయర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకడంతో ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. ఉ.10.20ని. తర్వాత మళ్లీ ట్రేడింగ్ ఆరంభమైంది. నష్టాలు మెల్లగా రికవరీ అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చిన సూచీలు దూసుకుపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,991 పాయింట్ల లాభంతో 34,769 పాయింట్లకు, నిఫ్టీ 569 పాయింట్లతో 10,159 పాయింట్లకు చేరాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 4,714 పాయింట్లు, నిఫ్టీ 1,410 పాయింట్లు రికవరీ అయ్యాయి. మొత్తంమీద సెన్సెక్స్ రోజంతా 5,380 పాయింట్లు, నిఫ్టీ 1,604 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. అధ్వాన వారం... ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు భారీ స్థాయిలోనే నష్టపోయాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అధ్వాన వారాల్లో ఒకటిగా ఈ వారం నిలిచిపోతుంది. హోలీ కారణంగా మంగళవారం సెలవు కావడంతో నాలుగు రోజులే జరిగిన ఈ వారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 3,473 పాయింట్లు, నిఫ్టీ 1,034 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఈ రెండు సూచీలు చెరో 9 శాతం నష్టపోయాయి. ఈ రెండు సూచీలు ఈ వారం జరిగిన నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రెండింటిలో ఒక్క రోజులో అత్యధిక పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఆరంభం 31,214 (–1,564) కనిష్టం 29,389 (–3,389) గరిష్టం 34,769 (+1,991) కనిష్టం నుంచి 5,380 పాయింట్ల రికవరీ ముగింపు 34,103 (+1,325) మరిన్ని విశేషాలు... ► సెన్సెక్స్ షేర్లలో 5 షేర్లే నష్టపోగా, మిగిలిన 25 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► ఎస్బీఐ 14% లాభంతో రూ. 242 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భారీగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► దాదాపు 1,300కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, జిల్లెట్ ఇండియా, బజాజ్ ఆటో తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఈ నెల 17న జరిగే బోర్డ్ సమావేశంలో షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించనుండటంతో సన్ ఫార్మా షేర్ 8% లాభంతో రూ.384కు పెరిగింది. ► టెలికం రంగానికి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించగలదన్న వార్తల కారణంగా భారతీ ఎయిర్టెల్ 5 శాతం, వొడాఫోన్ ఐడియా షేరు 34 శాతం మేర లాభపడ్డాయి. ఈ కంపెనీలకు రుణాలిచ్చిన పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు కూడా భారీగానే ఎగబాకాయి. లాభాలు ఎందుకంటే... వాల్యూ బయింగ్... ఈ వారంలో స్టాక్ మార్కెట్ దాదాపు 8 శాతం మేర నష్టపోయింది. ఈ నష్టాల కారణంగా పలు షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు ఎగబడ్డారు. ‘ఉద్దీపన’ ఊసులు.. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు కోవిడ్–19 వైరస్ కల్లోలంతో అంతర్జాతీయంగా మాంద్యం తప్పదన్న భయాలు నెలకొన్నాయి. దీనిని నివారించేందుకు అమెరికాతో సహా పలు దేశాలు ఉద్దీపన చర్యలపై కసరత్తు చేస్తున్నాయి. శుక్రవారం నాడే అమెరికా ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రకటించే అవకాశాలున్నాయన్న అంచనాలతో అమెరికా స్టాక్ సూచీల ఫ్యూచర్లు భారీగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల నుంచి రికవరీ కాగా, యూరప్ మార్కెట్లు 3 శాతం లాభాల్లో ఆరంభమయ్యాయి. ఈ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. జోష్‌నిచ్చిన గణాంకాలు... జనవరిలో తయారీ రంగం స్వల్పంగా పుంజుకుందని, అలాగే ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నెలల కనిష్టానికి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. . రూపాయి రికవరీ.... గురువారం భారీగా నష్టపోయిన రూపాయి శుక్రవారం కోలుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు పుంజుకొని 73.81కు రికవరీ కావడం సానుకూల ప్రభావం చూపించింది. భారత్‌లో కోవిడ్ ప్రభావం తక్కువే... భారత్‌లో కోవిడ్–19 వైరస్ సోకిన వారి సంఖ్య 75కు పెరిగింది. వీరిలో 17 మంది విదేశీయులు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌పై కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 1.30 లక్షలకు, మరణించిన వారి సంఖ్య 4.900కు చేరింది. 15 నిమిషాల్లో... 12 లక్షల కోట్లు హాం ఫట్! సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే 10 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 3,389 పాయింట్లు, నిఫ్టీ 1,035 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 15 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఉదయం. గం.10.20ని. లకు ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.12.9 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,12,78,173 కోట్లకు పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు లాభాల్లోకి మళ్లాయి. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.55 లక్షల కోట్లు ఎగసి రూ.1,29,26,243 కోట్లకు పెరిగింది. కాగా గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో రూ.15 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. రూపాయికి ఆర్బీఐ బూస్ట్ ముంబై: ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో భయాందోళన పడాల్సింది ఏదీ లేదని, ఇందుకు తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామనీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇచ్చిన హామీ శుక్రవారం రూపాయికి వరమయ్యింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఒకేరోజు 48 పైసలు బలపడి 73.80 వద్ద ముగిసింది. ఒకదశలో 74.50 స్థాయినీ చూసింది. సోమవారం 2 బిలియన్ డాలర్లను బ్యాంకింగ్‌కు విక్రయించనున్నట్లు కూడా ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఇంట్రాడేలో 74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు 74.39 మాత్రమే. పసిడికీ ‘వైరస్’ 70 డాలర్లకు పైగా పతనం న్యూయార్క్: పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్– నైమెక్స్‌లో భారీ పతనాన్ని చూసింది. ఈ వార్తరాసే 11 గంటల సమయంలో పసిడి ధర 71 డాలర్ల నష్టంతో (4.5%) 1,520 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. 2020లో ఈ స్థాయికి పసిడి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడచిన 52 వారాల్లో 1,266 డాలర్ల కనిష్టాన్ని చూసిన బంగారం ధర, వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు, కోవిడ్–19 భయాలతో మూడు వారాల క్రితం 1,704.30 గరిష్ట స్థాయిలనూ చూసింది. కారణమేమిటి?: ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల నుంచి వేగంగా మార్చేస్తున్నారు. భారీగా పెరిగిన బంగారం ధర నేపథ్యంలో... వారి ఇన్వెస్ట్మెంట్లను శుక్రవారం ఈక్విటీల్లోకి మళ్లించినట్లు సంకేతాలు అందుతున్నాయి. దేశీయంగానూ భారీ తగ్గుదల: దేశీయంగానూ పసిడి ధర దిగివస్తోంది. ఈ వార్త రాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర రూ.1,885 తగ్గి, రూ.40,321 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం పలు దేశీయ స్పాట్ మార్కెట్లలో పసిడి ధర రూ.1,500 వరకూ పడింది. కాగా, డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ బలహీనత వల్ల ధర మరింతగా పడడం లేదు. -
ఇక రోజంతా రూపీ ట్రేడింగ్
ముంబై: దేశీయంగా రూపాయి ట్రేడింగ్ సేవలు ఇకపై 24 గంటలూ అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రోజంతా దేశీ కరెన్సీ ట్రేడింగ్ సేవలు అందించడానికి దేశీ బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూపాయి ట్రేడింగ్ పరిమాణం భారత్‌లో కన్నా విదేశాల్లో గణనీయంగా జరుగుతుండటం, ఇక్కడ ట్రేడింగ్ వేళలు పరిమితంగా ఉండటం వల్ల అంతర్జాతీయ పరిణామాలను దేశీ మార్కెట్లు వెంటనే అందిపుచ్చుకోలేక ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశీ మార్కెట్ వేళల తర్వాత కూడా అధీకృత డీలర్లు ఇంటర్–బ్యాంక్ లావాదేవీలను నిర్వహించవచ్చని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాలు ఓవర్–ది–కౌంటర్ మార్కెట్ లావాదేవీలకే పరిమితమైనా.. అటు ఎక్సే్ఛంజీల్లో కూడా కరెన్సీ ట్రేడింగ్ వేళలను పొడిగించేందుకు బాటలు వేసే అవకాశముంది. అయితే, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి కరెన్సీ ట్రేడింగ్ వేళలు పొడిగించాలన్న డిమాండ్ చాన్నాళ్లుగానే ఉంది. దేశీయంగా కన్నా ఇతరత్రా కొన్ని దేశాల్లో రూపాయి ట్రేడింగ్ భారీగా ఉంటుండటమే ఇందుకు కారణం. రూపాయి ట్రేడింగ్‌కు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ విడుదల చేసిన గణాంకాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. -
కార్వీకి మరో షాక్
సాక్షి, ముంబై: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థకు షాక్ మీదషాక్‌లు తగులుతున్నాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదనే ఆరోపణలతో స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఇ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసాయి. ఈ మేరకు రెగ్యులేటరీ సంస్థలు నేడు (డిసెంబరు 2, సోమవారం) ఒక ప్రకటన విడుదల చేసాయి. గతవారం కార్వీ సంస్థపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రేడింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ లైసెన్స్‌ను బీఎస్ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో గత నెల 22న సెబీ చర్యలు తీసుకుంది. అలాగే కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఎక్స్ఛేంజీలు క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
స్టాక్ మార్కెట్లకు ముడిచమురు సెగ..
ముంబై : ముడిచమురు ధరలు భగ్గుమనడం, ఆర్థిక మందగమన భయాలు స్టాక్ మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం నష్టాల బాట పట్టాయి. ఆసియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ర్టీస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. ఇక సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 11,016 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ప్యాకేజీ ఆశలతో లాభాలు మూడో రోజూ పరుగు
సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. ఆర్థిక మందగమనం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీల స్థితిగతులపై ఆందోళన కారణంగా ట్రేడింగ్‌చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు పరిమితమయ్యాయి. ఇంట్రాడేలో 369 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 52 పాయింట్లు లాభపడి 37,402 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,054 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 444 పాయింట్లు, నిప్టీ 128 పాయింట్లు చొప్పున పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై 71.43కు పడిపోయినా, ముడి చమురు ధరలు 0.56 శాతం పెరిగినా, మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ప్యాకేజీ వచ్చేదాకా...ఒడిదుడుకులు...! ఆసియా మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించగలదన్న అంచనాలతో రోజంతా లాభాలు కొనసాగాయి. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మధ్యాహ్న లాభాలు చాలా వరకూ ఆవిరయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్369 పాయింట్లు, నిఫ్టీ 99 పాయింట్ల మేర పెరిగాయి. అంతర్జాతీయ వాణిజ్యంపై ఆశావహ అంచనాలు, ఐటీ, ఫార్మా షేర్లు కోలుకోవడంతో ఆరంభంలో స్టాక్ సూచీలు మంచి లాభాలు సాధించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మందగమనం సెగ తీవ్రమవుతుండటంతో ఆ లాభాలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ప్రకటన వెలువడేదాకా మార్కెట్లో ఒడిదుడుకులకు కొనసాగుతాయని అంచనా. మందగమన కట్టడికి పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు ప్యాకేజీలు ప్రకటిస్తాయన్న ఆశలతో ఆసియా, యూరప్ మార్కెట్లు లాభపడ్డాయి. మళ్లీ మొదటి స్థానంలోకి రిలయన్స్ ♦ అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీ మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 1.1 శాతం లాభంతో రూ.1,292కు చేరింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,19,074 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ (రూ.8,11,747 కోట్ల) కంటే ఇది రూ.7,226 కోట్లు అధికం. ♦ హలోల్ ప్లాంట్‌కు సంబంధించి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి సానుకూల నివేదిక అందడంతో సన్‌ఫార్మా షేర్ 2.6 శాతం లాభంతో రూ.426 వద్ద ముగిసింది. ♦ రెప్కో హోమ్ ఫైనాన్స్‌కు కొనుగోలు రేటింగ్‌ను బీఎన్పీ పారిబా కొనసాగిం చడంతో ఈ షేర్ 6.3% లాభంతో రూ.330 వద్ద ముగిసింది. ♦ వాటా విక్రయానికి సంబంధించి కోక–కోలాతో మళ్లీ చర్చలు జరిగే అవకాశాలున్నాయన్న వార్తలతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.66 వద్ద ముగిసింది. గత మూడు వారాల్లో ఈ షేర్ 68 శాతం పతనమైంది. -
జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఆర్థిక సంక్షోభం కారణంగా కార్యకలాపాలు నిలిపివేసిన ప్రయివేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లావాదేవీల నిర్వహణ (ట్రేడింగ్ యాక్టివిటీ)లో ఆంక్షలు విధించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు నేపథ్యంలో ఇన్వెస్టర్లు జెట్ ఎయిర్ వేస్ షేర్లలో భారీ అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో జెట్ షేరు ఏకంగా 23శాతం పతనమైంది. తద్వారా సరికొత్త కనిష్టానికి చేరింది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 986.03 కోట్లకు పడిపోయింది. బిఎస్ఇలో 15.61 లక్షల షేర్లు చేతులుమారాయి. స్టాక్ గత తొమ్మిది రోజుల్లో 40శాతానికి పైగా పతనమైంది. జెట్ షేర్లను రోజువారీ ట్రేడింగ్నుంచి తీసివేయనున్నామని నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తెలిపింది. గరిష్టస్థాయిలో ఆటుపోట్లను చవిచూడకుండా నివారించే బాటలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. జెట్ ఎయిర్వేస్ కౌంటర్లో ట్రేడింగ్ యాక్టివిటీపై నియంత్రణలు విధించనున్నట్లు ఎన్ఎస్ఈ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 28 నుంచీ అమల్లోకిరానున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ షేరును ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచి తొలగించనున్నారు. ఫలితంగా 100 శాతం మార్జిన్ల చెల్లింపుతోపాటు 5 శాతం ప్రైస్‌బ్యాండ్ అమలు కానుంది. -
ఎన్ఎస్ఈలో అక్షయ తృతీయ స్పెషల్ ట్రేడింగ్
అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 7న (మంగళవారం) కాపిటల్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించినట్లు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. ఈ విభాగంలోని గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్), ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్లు వివరించింది. మార్కెట్ సాధారణ ట్రేడింగ్ మార్కెట్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు మాత్రం క్లోజింగ్ సెషన్ రోజువారీలా ఉండదని తెలిపింది. వీటి ప్రీ–ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4:30 వరకు కొనసాగనుండగా.. ఈ సమయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్లు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ప్రీ–ఓపెన్ తరువాత 4:30 నిమిషాలకు ట్రేడింగ్ మొదలై ఏడు గంటలకు ముగుస్తుంది. -
కమోడిటీ ట్రేడింగ్ సమయం పెరిగింది
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను కూడా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం.11.55 వరకూ ఉండేది. ఇక వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్ కమోడిటీల ట్రేడింగ్ ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 9కి ముగుస్తుంది. గతంలో ఈ సెగ్మెంట్ ట్రేడింగ్ ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకూ ఉండేది. ఈ మేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్చంజ్‌లు తమ కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ట్రేడింగ్ వేళలను సరిచేసుకోవాలని సెబీ పేర్కొంది. సవరించిన ట్రేడింగ్ వేళలు ఈ సర్క్యులర్ వెలువడిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని, స్టాక్ ఎక్సే్చంజ్‌లు తమ నియమ నిబంధనల్లో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సెబీ సూచించింది. కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ సూచనలు ఆధారంగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నామని సెబీ తెలిపింది. -
బారీ నష్టాల్లో ట్రేడవుతున్నా స్టాక్ మార్కెట్లు
-
ముగింపులో సరికొత్త ‘పతనం’ నమోదు!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత బలహీన బాటలో పయనిస్తోందని, ఇది త్వరలో 72ను తాకడం ఖాయమన్న వాదనలకు సోమవారం బలం చేకూరింది. డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో– ముగింపులో సరికొత్త పత నాన్ని నమోదుచేసుకుంది. 70.16 వద్ద ముగిసింది. సోమవారం ఒకేరోజు 25 పైసలు పడిపోయింది. ♦ నిజానికి 17వ తేదీ శుక్రవారం డాలర్ రూపాయి 70.15 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నాడు ట్రేడింగ్ ఒక దశలో చరిత్రాత్మక కనిష్టం 70.40 స్థాయినీ చూసింది. అయితే అటు తర్వాత కోలుకుని 70.15 వద్ద ముగిసింది. ♦ 20, 21 తేదీల్లో కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 పైసలు రికవరీ అయినా, అటు తర్వాత మళ్లీ పతన బాట పట్టింది. సోమవారం ముగింపులో తాజా కనిష్ట స్థాయి 70.16 వద్ద ముగిసింది. ♦ క్యాడ్ ఆందోళనలు, క్రూడ్ధరల పెరుగుదల, ఎగుమతులు పెరక్కపోవడంతో తీవ్రమవుతున్న వాణిజ్యలోటు రూపాయి తాజా పతనానికి కారణం. ♦ అయితే రూపాయి ప్రస్తుత పతన ధోరణిలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎగుమతులకు ఇది ప్రోత్సాహకర అంశమని కొందరు ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ♦ సోమవారం ఒక దశలో రూపాయి విలువ 69.65కు తాకినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడేలో 70.20ని తాకింది. ♦ ఆసియాలోనే తీవ్ర స్థాయిలో భారత కరెన్సీ విలువ ఈ ఏడాది 9 శాతం పతనమయ్యింది. ♦ ఆగస్టు 17తో ముగిసన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33.2 మిలియన్ డాలర్లు తగ్గి 400.8 బిలియన్ డాలర్లకు చేరడమూ రూపాయిపై ప్రతికూలత చూపుతోంది. గడచిన కొన్ని నెలలుగా భారత్ విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి 69 స్థాయిలో ఉన్నప్పుడు దీనిని ఈ స్థాయిలో నిలబెట్టడానికి డాలర్లను మార్కెట్లోకి ఆర్బీఐ పంప్ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మారకపు విలువను మార్కెట్ విలువకు వదిలేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ♦ క్రాస్ కరెన్సీలోనూ రూపాయి బలహీనత కొనసాగింది. బ్రిటన్ పౌండ్‌పై 89.86 నుంచి 90.19కి పడింది. యూరోపై 80.98 నుంచి 81.53కు దిగింది. ఇక జపాన్ యన్ విషయలో 62.79 నుంచి 63.16కు చేరింది. -
‘లాభం’ చూపించి లూటీ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ ట్రేడింగ్ పేరుతో ప్రక టనలు గుప్పించాడు. ఆకర్షితులైన వారు పెట్టిన పెట్టుబడులు, ‘లాభాలు’చూపించడానికి ఓ వెబ్సైట్ సృష్టించాడు. ఈ హంగామాతో నగరానికి చెందిన వైద్యుడు కొంత పెట్టుబడి పెట్టి వారంలోనే ‘లాభం’ పొందాడు. రెండోసారి ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం కాజేసి టోకరా వేసిన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు గురువా రం సూరత్‌లో పట్టుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నగరానికి చెందిన వైద్యుడు దినేశ్‌ను వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆకర్షించింది. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఉన్న తమ సంస్థ ద్వారా ఫారిన్ ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఉంది. వారంలోనే రూ.10 లక్షలిచ్చాడు... దీనికి ఆకర్షితుడైన దినేశ్ ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. ముంబైకి చెందిన అలీ షేక్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడాడు. తమ వద్ద పెట్టుబడి పెడితే అంతర్జాతీయ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతామని, డాలర్, యూరోల విలువతో పాటే ఇది పెరుగుతుందం టూ నమ్మబలికాడు. దినేశ్ తొలుత రూ.50 లక్ష లు పెట్టుబడి పెట్టాడు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించిన అలీ షేక్... వైద్యుడి పేరుతో ఖాతా తెరిచాడు. రూ.50 లక్షలు ఫారెన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు, దాని విలువ డాలర్, యూరో విలువతో పాటే మారుతున్నట్లు చూపించాడు. అలాగే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైద్యుడికి ఇచ్చి చూసుకునే అవకాశం ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారంలోనే 10లక్షలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లోని ఖాతా ద్వారా వైద్యుడికి తెలిసేలా చేశాడు. ఇది చూసిన దినేశ్ ఆ మొత్తం తనకు బదిలీ చేయాలని కోరడంతో అలీ షేక్ మొత్తం రూ.60లక్షలూ దినేశ్‌కు పంపాడు. ఈసారి రూ.కోటిన్నర పెట్టుబడి... వారంలో రూ.10లక్షలు లాభం రావడంతో వైద్యుడు అలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. ఇది నిర్ధారించుకున్న అలీ అసలు కథ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ లాభాల బాటలో ఉందని, ఈసారి మరింత లాభం వచ్చే అవకాశం ఉందంటూ ఎర వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి తీసుకున్నది కలిపి మొత్తం రూ.1.5కోట్లు దినేశ్ పెట్టుబడిగా పెట్టా డు. డబ్బు కోసం దినేశ్ ఎంతగా ప్రయత్నించినా అలీ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఈ మోసానికి పాల్పడింది అలీ షేక్‌గా చెప్పుకున్న అమీర్ ఆరిఫ్ అగాడీగా తేల్చారు. అతడు ఉండేది ముంబై కాదని, గుజరాత్‌లోని సూరత్ అని నిర్ధారించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. -
ట్రేడింగ్ వేళల పెంపుపై సందిగ్ధత
ముంబై: ట్రేడింగ్ వేళలను పదిహేను గంటల దాకా పొడిగించేందుకు స్టాక్ ఎక్సే ్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ అనుమతించినప్పటికీ .. అది ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో సాధ్యపడేలా కనిపించడం లేదు. బ్రోకింగ్ సంస్థలు ఇంత సుదీర్ఘ ట్రేడింగ్ వేళలకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఎకాయెకిన 15 గంటలు కాకుండా ముందుగా 12 గంటల పాటు అమలు చేసి .. ఆ తర్వాత మార్కెట్ స్పందనను బట్టి పొడిగించవచ్చన్నది బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ట్రేడింగ్ వేళల పొడిగింపుపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మరికొన్ని వారాల్లో తమ తమ ప్రణాళికలను సెబీకి సమర్పించనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్ సెగ్మెంట్స్‌కి సంబంధించి స్టాక్ ఎక్సే ్చంజీల్లో ట్రేడింగ్ వేళలు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 3.30 గం. దాకా ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రోజంతా నడిచే అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసే ఉద్దేశంతో దేశీయంగా ట్రేడింగ్ వేళలను పెంచాలని సెబీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గతంలో క్యాష్ మార్కెట్ల సమయాన్ని సాయంత్రం 5 గం. దాకా పొడిగించుకునేందుకు ఎక్సే ్చంజీలకు అనుమతించినప్పటికీ పలు కారణాలతో అవి అమలు చేయలేదు. అయినప్పటికీ.. తాజాగా డెరివేటివ్స్ విభాగం ట్రేడింగ్‌ను రాత్రి 11.55 గం. దాకా పొడిగించుకునేందుకు ఈ ఏడాది మేలో స్టాక్ ఎక్సే ్చంజీలను అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయా ఎక్సే ్చంజీల సంసిద్ధతను బట్టి అక్టోబర్ 1 నుంచి కొత్త వేళలు అమల్లోకి రావాల్సి ఉంది. బ్రోకింగ్ సంస్థల అభ్యంతరాలివి.. ట్రేడింగ్ పరిమాణం ఎంత స్థాయిలో ఉంటుందో తెలియకుండా .. ముందు నుంచే అర్ధరాత్రి దాకా వేళలను పొడిగించడం సరికాదని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. వేళల పొడిగింపు ప్రతిపాదన ముఖ్యంగా చిన్న సంస్థలను కలవరపరుస్తోంది. దీనికోసం అదనంగా సిబ్బందిని తీసుకోవాల్సి రానుండటం, ఫలితంగా నిర్వహణ వ్యయాలు పెరగనుండటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. బ్రోకరేజి సంస్థలు ప్రతి రోజు ట్రేడింగ్ వేళలను ముగిసిన తర్వాత స్టాక్ ఎక్సే ్చంజీలకు అసంఖ్యాకంగా నివేదికలను పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం బోలెడు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌ను అనుమతించిన పక్షంలో తెల్లవారి మార్కెట్ ప్రారంభమయ్యేలోగా ఈ పనులన్నీ పూర్తి చేయడం కష్టసాధ్యమైన విషయం. రాత్రి వేళ ముఖ్యంగా 9 దాటిన తర్వాత ట్రేడింగ్ పరిమాణం ఎలా ఉంటుందనేది అటు స్టాక్ ఎక్సే్చంజీలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. దీంతో అర్ధరాత్రి 11.55 గం. దాకా కాకుండా రాత్రి 8 గం. లేదా 9 గం. దాకా మాత్రమే ట్రేడింగ్ వేళలను పొడిగించేలా ప్రతిపాదనలు ఇచ్చే యోచనలో ఉన్నాయవి. ఒకవేళ ట్రేడింగ్ వాల్యూమ్స్ గణనీయంగా ఉన్న పక్షంలో ఆ తర్వాత దశలో వేళలను పొడిగించవచ్చని భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధనాలపైనా..: ట్రేడింగ్ వేళలను పొడిగించినా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వంటి కొన్ని సాధనాలనే అనుమతించడం శ్రేయస్కరమని బ్రోకింగ్ సంస్థలు లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లకు రిస్క్ మేనేజ్మెంట్ సాధనాలను అందుబాటులోకి తేవడమే సెబీ ఉద్దేశమైనప్పుడు.. ఇండెక్స్ ఆప్షన్స్, ఫ్యూచర్స్ వంటి ప్రాథమిక హెడ్జింగ్ సాధనాల ట్రేడింగ్‌కు అనుమతిస్తే సరిపోతుందని బ్రోకింగ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటిదాకా ఎఫ్ఐఐలకే అనుకూలం.. డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ వేళలను పెంచడం వల్ల దేశీ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకి రిస్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం అమలవుతున్న ట్రేడింగ్ వేళలు.. దేశీ సంస్థలతో పోలిస్తే విదేశీ సంస్థలకే ఎక్కువ అనుకూలంగా ఉంటున్నాయి. భారత్‌లో పరిమిత సమయంపాటే ట్రేడయ్యే దేశీ సూచీలు ఎస్‌జీఎక్స్, సీఎంఈ వంటి అంతర్జాతీయ ఎక్సే ్చంజీల్లో మాత్రం రోజంతా ట్రేడవుతూనే ఉంటాయి. దీంతో భార త్లో ట్రేడింగ్ వేళలు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే సదరు రిస్కుల నుంచి పోర్ట్‌ఫోలియోలను హెడ్జింగ్ చేసుకునేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) ఎక్కువ వెసులుబాటు ఉంటోంది. -
నిధులు పనిచేస్తేనే ఆర్జన
సురేశ్‌కు స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉంది. రెగ్యులర్‌గా ట్రేడింగ్ చేస్తుంటాడు. కాకపోతే మార్కెట్లు అనుకూలంగా లేవని భావిస్తే... కొద్దిరోజులు ఎలాంటి ట్రేడింగ్ చెయ్యకుండా మిన్నకుండిపోతాడు. డబ్బులు పోగొట్టుకోకుండా చూసుకోవటం కూడా ఒకరమైన స్ట్రాటజీయేనన్నది సురేశ్ ఉద్దేశం. కాకపోతే అలా ట్రేడింగ్ మానేసినపుడు... మార్కెట్లు కాస్త అనుకూలంగా మారి మళ్లీ ఎప్పుడు చేస్తాడో తనకే తెలియదు కనక ఆ డబ్బుల్ని అలా ట్రేడింగ్ ఖాతాలోనే ఉంచేస్తుంటాడు. బ్యాంకు ఖాతాలోకి వెనక్కి తీసుకోకుండా అలానే ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి కదా అని ఉంచేస్తుంటాడు. ఒకోసారి రెండుమూడు వారాల పాటు ఇలానే ఉండిపోతాయి కూడా. మరి ఈ సమయంలో అవి బ్యాంకు ఖాతాలో ఉంటే కనీసం సేవింగ్స్ వడ్డీ అయినా వస్తుంది. అలాకాకుండా ఈ సమయంలో ఇంకా మెరుగైన రాబడులు రావాలంటే ఏం చేయాలి? లిక్విడ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవాలి. మీ ట్రేడింగ్ ఖాతా నుంచి బ్యాలన్స్‌ను విత్ డ్రా చేసుకోకుండానే... లిక్విడ్ ఫండ్స్‌ను కొనుగోలు చేసుకుని, మళ్లీ ట్రేడింగ్‌కు డబ్బులు అవసరమైన వెంటనే వీటిని విక్రయించేసుకోవచ్చు. దాంతో మీ బ్యాలన్స్‌పై కొంతైనా రాబడులు అందుకోవచ్చు. ఈ విధానం ఎలా పనిచేస్తుందో తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం అందుబాటులో రెండు ఫండ్లు... లిక్విడ్ ఈటీఎఫ్‌లనేవి ‘ప్యాసివ్లీ మేనేజ్డ్ డెట్ ఫండ్స్’. పాసివ్లీ అంటే ఫండ్ మేనేజర్ల ప్రమేయం లేకుండానే డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం.. అంతకుముందు రోజు రాత్రి బెంచ్‌మార్క్ (సూచీ) రేటును ట్రాక్ చేయటం వంటివి జరిగిపోతుంటాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో షేర్ల మాదిరే లిక్విడ్ ఈటీఎఫ్‌లు ట్రేడవుతుంటాయి. మార్కెట్ వేళల్లో అన్ని పనిదినాల్లో ఎప్పుడైనా వీటిని కొనటం, విక్రయించటం చేయొచ్చు. ప్రస్తుతం రెండు లిక్విడ్ ఈటీఎఫ్‌లు పనిచేస్తున్నాయి. రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్‌రాక్ లిక్విడ్ ఈటీఎఫ్. వీటిలో రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్‌గా ట్రేడయ్యే ఈటీఎఫ్. 2003 జులై నుంచి మంచి బలమైన ట్రాక్ రికార్డు ఉంది. డీఎస్పీ బ్లాక్‌రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఏడాది నుంచే పనిచేస్తోంది. చార్జీలు లేవు..! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్‌రాక్ లిక్విడ్ ఈటీఎఫ్... రెండూ డైలీ డివిడెండ్ ప్లాన్‌నే ఆఫర్ చేస్తున్నాయి. అంటే రోజువారీ రాబడులను డివిడెండ్‌గా మార్చేసి తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక డివిడెండ్‌పై 29.12 శాతం డివిడెండ్ పన్ను అమలవుతుంది. అయినప్పటికీ ఫండ్ ఎన్ఏవీని రోజువారీగా కనీసం రూ.1,000 స్థాయిలో ఉంచేందుకు ఇవి ప్రయత్నిస్తుంటాయి. ఒక్క బ్రోకరేజీ సంస్థ మినహా (ఈ బ్రోకరేజీ మాతృ సంస్థ బ్యాంకింగ్ కంపెనీ) మిగిలిన బ్రోకరేజీలు లిక్విడ్ ఈటీఎఫ్‌లలో లావాదేవీలపై బ్రోకరేజీ వసూలు చేయడం లేదు. ఎందుకంటే లిక్విడ్ ఈటీఎఫ్‌ల రూపంలో ఇన్వెస్టర్ల నిధులు బయటకు వెళ్లిపోకుండా ఉంటాయి. దీంతో వాటిని తిరిగి ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తే బ్రోకరేజీలకు ఎంతో కొంత లాభమే వస్తుంది కాబట్టి. కస్టోడియన్, ట్రాన్సాక్షన్ చార్జీలు కూడా లేవు. దీంతో కొనుగోలు, అమ్మకాలపై పెద్దగా వ్యయాలుండవు. ఎక్సే్చంజ్‌ల్లో కనీస లావాదేవీ ఒక యూనిట్‌గా ఉంటుంది. లిక్విడిటీ సమస్య తక్కువే... రిలయన్స్ లిక్విడ్ బీస్ అన్నది చాలా యాక్టివ్‌గా ట్రేడయ్యే ఈటీఎఫ్. అవసరమైన సందర్భంలో ఈటీఎఫ్ యూనిట్లను అమ్ముకోవడం ఎంతో సులభం. ఎన్ఎస్ఈలో రిలయన్స్ లిక్విడ్ బీస్ కౌంటర్లో రోజువారీగా రూ.92 కోట్ల మేర ట్రేడింగ్ గత రెండేళ్లుగా నమోదవుతోంది. గత రెండేళ్లుగా రోజువారీగా ఈ కౌంటర్లో 3,150 ట్రేడ్లు నమోదవుతున్నాయి. ఈ రెండు లిక్విడ్ ఈటీఎఫ్‌లు కూడా నిఫ్టీ 1డి రేటు ఇండెక్స్‌ను తమ బెంచ్ మార్క్‌గా పాటిస్తున్నాయి. అంటే ఇన్వెస్టర్లు లెండింగ్ మనీతో ఆర్జించే రాబడులను ఈ సూచీ ప్రతిఫలిస్తుంది. ఈ సూచీ రాబడుల రేటు ప్రస్తుతం 6.11 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో 4.3– 6.3 శాతం మధ్య ఉంది. దీంతో ఈ లిక్విడ్ ఈటీఎఫ్‌ల రాబడులు నిఫ్టీ 1డి రేటు సూచీల రేటుకు సమీపంలో ఉంటాయి. అంటే స్పష్టంగా చెప్పాలంటే డివిడెండ్ పన్ను పోను ఈ లిక్విడ్ ఈటీఎఫ్‌ల్లో రాబడులు ప్రతి రోజూ రూ.లక్షకు రూ.11–13 మధ్య ఉంటున్నాయి. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో వచ్చే రాబడుల కంటే ఇవి ఎక్కువ. ఉపయోగపడని నిధులకు మార్గం లిక్విడ్ ఈటీఎఫ్‌లు ప్రత్యేకంగా క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు ఉపయోగం. ఉపయోగించకుండా ఉన్న నిధులతో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భంలో వెంటనే నగదుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు ఆ మొత్తం ఖాతాలో యాడ్ అవుతుంది. కానీ రెండు రోజుల తర్వాతే బ్యాలన్స్ నిధులను రిడెంప్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం క్యాష్ మార్కెట్లో సెటిల్మెంట్కు సంబంధించి టీప్లస్2 అమలవుతోంది. అంటే ట్రేడ్ జరిగిన తరవాత రెండు రోజులకు సెటిల్మెంట్ అవుతుందన్న మాట. సెటిల్మెంట్ రోజున లిక్విడ్ ఈటీఎఫ్‌లు డీమ్యాట్ ఖాతాలో జమవుతాయి. కొత్త లావాదేవీకి డబ్బులు అవసరమయ్యేంత వరకు లిక్విడ్ ఈటీఎఫ్‌ల రూపంలో నిధులు హోల్డ్ అయి ఉంటాయి. ఇక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాల్లో బ్యాలన్స్ ఉంచుకుని, అవకాశం కోసం వేచి చూసే వారు కూడా ఆ అవకాశం వచ్చే వరకు లిక్విడ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదే. ట్రేడ్‌కు మార్జిన్ అవసరమైన వెంటనే ఒక క్లిక్‌తో లిక్విడ్ ఈటీఎఫ్‌లను అమ్మేసుకుంటే సరిపోతుంది. లిక్విడ్ ఈటీఎఫ్‌లను డెరివేటివ్ ట్రేడ్లకు మార్జిన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. హేర్‌కట్ 10 శాతం అమలవుతుంది. ప్రతికూలతలూ ఉన్నాయ్! రిలయన్స్ లిక్విడ్ బీస్, డీఎస్పీ బ్లాక్‌రాక్ లిక్విడ్ ఈటీఎఫ్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంది. 60 బేసిస్ పాయింట్ల (0.60శాతం) మేర ఉంది. రెగ్యులర్ లిక్విడ్ ఫండ్స్‌తో పోలిస్తే ఇది ఎక్కువే. రెండోది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అన్నది రాబడులను తినేస్తుంటుంది. మరో అంశం మాతృ సంస్థ బ్యాంకుగా ఉన్న బ్రోకరేజీ కంపెనీ లిక్విడ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్‌పై షేర్ల మాదిరే బ్రోకరేజీ ఛార్జీలను బాదేస్తోంది. దీంతో లిక్విడ్ ఈటీఎఫ్‌ల రాబడులు తగ్గిపోతాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇక, లిక్విడ్ ఈటీఎఫ్‌లను లిక్విడిటీ లేని ఈటీఎఫ్‌ల పనితీరుతో, బ్యాంకు ఎఫ్డీలతో పోల్చడం సరైనది కాదు. ఎందుకంటే ఇవి సాధారణ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు తగిన అవకాశం కోసం వేచి చూస్తూ ట్రేడింగ్ ఖాతాల్లో నిధులను అలాగే ఉంచేసేవారు, తాత్కాలికంగా ఆ నిధుల్ని లిక్విడ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనువైనవి. అది కూడా ఒక నెల కాల వ్యవధి వరకు సమంజసం. -
ఆన్లైన్ మోసం: ఐదుకోట్లు హాంఫట్
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో మోసానికి పాల్పడిన ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నలుగురు వ్యక్తులు కలిసి దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి 5 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ఓ మహిళ వీరి వద్ద 7.26,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంతా హవాలా రూపంలో జరిగింది. సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి నిందితులను పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 13 లక్షల రూపాయలు, ఒక ల్యాప్‌టాప్, 6 సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ట్రేడింగ్ సెంటర్స్ ద్వారా వచ్చే బల్క్ ఎస్ఎంఎస్ల పట్ల జాగ్రత్తగా మెలగాలని, సీఐబీఐలో రిజిస్టర్ అయిన వాళ్ల దగ్గర మాత్రమే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. -
రూపీ .. రికవరీ..
ముంబై: జీడీపీ గణాంకాలు మెరుగ్గా ఉండగలవన్న ఆశావహ అంచనాల నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే 43 పైసలు పెరిగి 67.43 వద్ద క్లోజయ్యింది. ఎగమతిదారులు, కార్పొరేట్ సంస్థలు .. డాలర్లకు సంబంధించి లాంగ్ పొజిషన్స్ నుంచి వైదొలగడం కూడా ఇందుకు తోడ్పడింది. అటు డాలర్ బలహీనపడటం కూడా రూపాయి రికవరీకి కలిసొచ్చింది. 2017–18 మార్చి త్రైమాసికం, పూర్తి ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభు త్వం గురువారం విడుదల చేయనుంది. మూడో త్రైమాసికంలో 7.2% వృద్ధి రేటుతో భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా నిల్చిన సంగతి తెలిసిందే. -
టాటా మెటార్స్, జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ
సాక్షి, ముంబై: దేశీ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ కు ఫలితాల షాక్ తగిలింది. ఈక్విటీ మార్కెట్లు సెంచరీ లాభాలతో ఊత్సాహకరంగా సాగుతుండగా, టాటా మోటార్స్ భారీగా నష్టాలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది క్యూ4లో నికర లాభాలు 50శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. భారీ అమ్మకాల ఒత్తిడితో టాటా మోటార్స్ కౌంటర్ 7శాతానికి పతనమై టాప్ లూజర్‌గా నిలిచింది. 52 వారాల కనిష్టం వద్ద ఉంది. విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు ఫలితాల సెగ తాకింది. 6 శాతానికి పైగా పతనమైన జెట్‌ఎయిర్‌వేస్ షేరు 52 వారాల కనిష్టాన్ని తాకింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 2175 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ. 91,279 కోట్లను తాకింది. ఇబిటా 4 శాతం పుంజుకుని 11,250 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ నికర నష్టం రూ. 806 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గింది. అటు జెట్ ఎయిర్‌వేస స్టాండ్‌లోన్ ప్రాతిపదికన 1030కోట్ల రూపాయల నష్టాన్నిప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 3.44 శాతం తగ్గి రూ.6,271 కోట్ల నుంచి రూ.6,055 కోట్లకు పరిమితమైంది. -
దిగి వస్తున్న వెండి, బంగారం ధరలు
సాక్షి, ముంబై: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఇటీవల బలహీనంగా ఉన్న బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారుల లాభాల బుకింగ్ నేపథ్యంలో వెనకడుగువేశాయి. తాజాగా ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా.29వేల దిగువన ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 176 పతనమై రూ. 28,791కు చేరింది. వెండి మార్చి ఫ్యూచర్స్ కేజీ రూ. 130 క్షీణించి రూ. 37,314ను తాకింది. అటు న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం ఔన్స్(31.1 గ్రాములు) 1260 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం 0.5 శాతం(6 డాలర్లకు పైగా) క్షీణించి 1259 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 0.25 శాతం నష్టంతో 16 డాలర్ల దిగువన 15.92 డాలర్లను తాకింది. ఇది రెండు నెలల గరిష్టంగా నమోదైంది. నగలు, పరిశ్రమలు, రీటైల్ వర్తకుల నుంచి డిమాండ్ క్షీణించడంతో బంగార ధరలు కొద్దిగా నీరసించాయని నిపుణుల అంచనా. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదిత 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను సంస్కరణల బిల్లుకు సెనేట్ ఆమోదం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో ఇతర కరెన్సీలతో డాలర్ విలువ పుంజుకుంది. ఇది పసిడిధరలను ప్రభావితం చేస్తోందని విశ్లేషించారు. ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్ ప్రకారం, బులియన్ కౌంటర్ ధరలు మరింత దిగిరానున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
బ్యాన్ ఎఫెక్ట్: 11 కంపెనీల షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం నాటి బేరింగ్ ట్రెండ్‌ను కొనసాగించిన మార్కెట్లలో సోమవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభ గంటలో కీలక సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా కుప్పకూలగా నిఫ్టీ 50 కీలక వ్యూహాత్మక మద్దతు స్థాయి 9,900 కు దిగువకుచేరింది. దీంతోపాటు ఎన్ఎస్ఈ నిషేధం నేపథ్యంలోస్టాక్మార్కెట్ లో 11 షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆరంభంనుంచీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కొనసాగడంతో ఇన్ఫిబీమ్, ఇండో కౌంట్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ సహా 11 స్టాక్స్ నష్టపోయాయి. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ సంస్థ ఇన్ఫీబీమ్ కౌంటర్ ఎన్ఎస్ఈ లో తొలుత ఒక దశలో ఏకంగా 39 శాతం కుప్పకూలింది. ఇండియా సిమెంట్స్ 5 శాతం ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 6 శాతం పతనమైంది. ఆ తరువాత ఇన్ఫీబీమ్ కొన్ని నష్టాలను రికవర్ చేసుకుని నష్టాలను తగ్గించుకుంది. ఎఫ్అండ్ వో కాంట్రాక్టులలో ట్రేడింగ్ ను ఎన్ఎస్ ఈ నిషేధం కారణం గా ఇన్వెస్టర్ల అమ్మకాల వెల్లువ సాగింది. మరోవైపు ఇన్ఫీబీమ్ షేరు భారీ పతనం కారణంగా పొజిషన్లు రోలోవర్ చేసుకుంటే పెనాల్టీ విధించనున్నట్లు ఎన్ఎస్ ఈ తెలియజేసింది. బిఎమ్ఎల్, డిహెచ్ఎఫ్ఎల్, డిఎల్ఎఫ్, హెచ్డిఐఎల్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, ఇన్ఫిబీమ్, జెఎస్డబ్ల్యు ఎనర్జీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, వోక్హార్డ్ 11 కంపెనీల ట్రేడింగ్ నిషేధానికి గురయ్యాయి -
గణాంకాలపై మార్కెట్ దృష్టి..
► భౌగోళిక అంశాలూ కీలకమే: విశ్లేషకుల అంచనా ► స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు ► ట్రేడింగ్ నాలుగు రోజులే ద్రవ్యోల్బణ గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఫలితాలు, రుతుపవనాల విస్తరణ ఈ వారం మన స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న(మంగళవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. దీంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఈ వారంలో నాలుగు రోజులకు పరిమితం కానున్నది. క్షీణించిన ఐఐపీ... గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు(ఐఐపీ) సోమవారం మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు క్షీణించడంతో జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి క్షీణించడం ఇదే మొదటిసారి. జూలై నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే వెలువడతాయి. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. ఇక నేడు (సోమవారం–ఆగస్టు 14న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, టాటా పవర్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఒత్తిడి కొనసాగుతుంది.... డొల్ల కంపెనీలంటూ మూడొందలకు పైగా కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆంక్షలు విధించడం దేశీయంగా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సెబీ చర్య సమీప భవిష్యత్తులో లిక్విడిటీపై ప్రభావం చూపనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా–ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై పడనున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(బిజినెస్, ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) వి.కె. శర్మ పేర్కొన్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలన్స్ చేస్తాయని, ఫలితంగా మన మార్కెట్లపై కొన్ని రోజుల పాటు ఒత్తిడి ఉంటుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకులు జి. చొక్కలింగమ్ పేర్కొన్నారు. కాగా గతవారంలో సెన్సెక్స్ 1,112 పాయింట్లు. నిఫ్టీ 356 పాయింట్లు నష్టపోయాయి. డెట్‌లో జోరుగా విదేశీ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.10 వేల కోట్లకు పైగా డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించడంతో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని, ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితిని సెబీ పెంచడం కూడా విదేశీ పెట్టుబడుల జోరును పెంచిందని నిపుణులంటున్నారు. అయితే స్టాక్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటంతో ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డెట్‌లో విదేశీ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లకు పెరిగాయి. -
ఆరు కంపెనీలపై ట్రేడింగ్ ఆంక్షలు ఎత్తివేత
శాట్ ఆదేశాలు ముంబై: పార్శ్వనాథ్ డెవలపర్స్ సహా ఆరు కంపెనీలకు గురువారం ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్, కవిట్ ఇండస్ట్రీస్, పిన్‌కాన్ స్పిరిట్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్ ఇండియా బీఎఫ్ఎస్ఐ, కె–కల్పన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్ ఆదేశించింది. దీంతో ఈ కంపెనీ షేర్లలో సోమవారం నుంచి ట్రేడింగ్ కొనసాగనుంది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది. సెబీ, స్టాక్ ఎక్సే ్చంజ్‌లు కంపెనీల వాదన వినాలని, వాటి వ్యాపార కార్యకలాపాలపై దర్యాప్తు నిర్వహించి, ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవాలని శాట్ స్పష్టం చేసింది. -
సాక్షి... ‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్ అండ్ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్ ఇంట్రస్ట్ హెచ్చుతగ్గులు... కాల్, పుట్ రైటింగ్ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఐటీసీ: రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసిన ఐటీసీ షేరు డెరివేటివ్ కాంట్రాక్టుల్లో ఆసక్తికరమైన బిల్డప్ జరిగింది. షేరు పతనంతోపాటు ఈ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 6% పెరిగి 5.19 కోట్ల షేర్లకు చేరింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే రూ.0.50 మేర తగ్గింది. షేరు ధర తగ్గుదలతో పాటు ఓఐ పెరగడం, ప్రీమియం తగ్గడం వంటి సంకేతాలు షార్ట్‌సెల్లింగ్‌ను సూచిస్తున్నాయి. ఆప్షన్ కాంట్రాక్టులకు సం బంధించి రూ. 300, రూ. 290 స్ట్రయిక్స్ వద్ద భారీ కాల్‌రైటింగ్ జరిగింది. రూ. 300 స్ట్రయిక్ వద్ద మంగళవారమే 70 లక్షల షేర్లు తాజాగా యాడ్‌కాగా, ఇక్కడ కాల్ బిల్డప్ 78 లక్షలకు చేరింది. రూ.290 స్ట్రయిక్ వద్ద 42 లక్షల మేర కాల్ బిల్డప్ జరిగింది. కానీ రూ.280 వద్ద పుట్ రైటింగ్.. కాల్ రైటింగ్ అంత బలంగా లేదు. సమీప భవిష్యత్తులో ఐటీసీ రూ.300 స్థాయి దాటడం కష్టసాధ్యమని, రూ.290 దిశగా పెరిగితే అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని డేటా చెబుతోంది. ⇔ మరి బ్యాంక్ నిఫ్టీ డేటా ఏం చెబుతోంది? ⇔ ఎస్బీఐ ఫ్యూచర్ సంకేతాలెలా ఉన్నాయి? ⇔ ఈ వివరాలు www.sakshibusiness.comలో -
కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కి సెబీ ఆమోదం
సెటిల్మెంట్, ట్రేడింగ్ వేళలపై మార్గదర్శకాలు న్యూఢిల్లీ: కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించే ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మంగళవారం ఆమోదముద్ర వేసింది. అయితే, ప్రాథమికంగా ఒకే ఒక్క కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఆప్షన్ ట్రేడింగ్ ప్రవేశపెట్టాలని, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేలా పటిష్టమైన రిస్కు మేనేజ్మెంట్ చర్యలు పాటించాలని కమోడిటీ ట్రేడింగ్ ఎక్సే్ఛంజీలకు సూచించింది. ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించబోయే కమోడిటీలకు సంబంధించి కఠినతరమైన నిబంధనలు విధించింది. వీటి ప్రకారం ఆప్షన్స్ ట్రేడింగ్‌కు ఎంపిక చేసే కమోడిటీ... గడిచిన 12 నెలల్లో మొత్తం ట్రేడింగ్ టర్నోవరు విలువలో పరిమాణంపరంగా టాప్ 5 కమోడిటీల్లో ఒకటై ఉండాలి. అంతేగాకుండా వ్యవసాయోత్పత్తులు, అగ్రి–ప్రాసెస్డ్ కమోడిటీలకు సంబంధించి గడిచిన ఏడాది వ్యవధిలో ఫ్యూచర్స్ కాంట్రాక్టుల సగటు రోజువారీ టర్నోవరు కనీసం రూ. 200 కోట్లుగా ఉండాలి. ఇతర కమోడిటీలైతే ఈ విలువ రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. ఆప్షన్స్ కాంట్రాక్టులు ప్రారంభించదల్చుకునే కమోడిటీ డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీలు.. ముందస్తుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సెబీ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. పొజిషన్ పరిమితులు, సెటిల్మెంట్ విధానం, ట్రేడింగ్ వేళలకు సంబంధించి కూడా సెబీ మార్గదర్శకాలు జారీ చేసింది. కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌కు అనుమతించాలంటూ ఎక్సే్ఛంజీలు చాన్నాళ్లుగా కోరుతున్న నేపథ్యంలో సెబీ ఆమోదముద్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వాగతించిన ఎక్సే్ఛంజీలు.. సెబీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఎంసీఎక్స్ ఎండీ మృగాంక్ పరాంజపే తెలిపారు. దేశీ కమోడిటీ మార్కెట్‌ను మరింత పటిష్టపర్చేందుకు ఇది దోహదపడగలదన్నారు. ఫ్యూచర్స్‌ను వినియోగించుకోవడం మొదలుపెట్టిన అనేక మంది రైతులతో పాటు భారీ స్థాయిలో ట్రేడింగ్ వర్గాలకు కూడా రిస్కు మేనేజ్‌మెంట్‌పరంగా ఆప్షన్స్ మెరుగైన సాధనంగా ఎన్సీడీఈఎక్స్ వర్గాలు పేర్కొన్నాయి. కమోడిటీ ఎక్సే్ఛంజీల్లో ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ .. ఇన్వెస్టర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, వారి ప్రయోజనాలు పరిరక్షించేందుకు కమోడిటీ ఎక్సే్ఛంజీలు తప్పనిసరిగా ఇన్వెస్టర్ సర్వీస్ ఫండ్ (ఐఎస్ఎఫ్), ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐపీఎఫ్) ఏర్పాటు చేయాలని సెబీ ఆదేశించింది. మరిన్ని విశేషాలు.. ⇔ సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రాథమిక దశలో ఫండ్‌కి ఎక్సే్ఛంజీలు రూ. 10 లక్షలు సమకూర్చాలి. అటుపైన సభ్యుల నుంచి వసూలు చేసే టర్నోవర్ ఫీజులో ఒక శాతాన్ని నెలవారీ ప్రాతిపదికన ఐఎస్ఎఫ్కు బదలాయించాలి. సర్వీస్ సెంటర్లలో డమ్మీ టెర్మినల్స్ కూడా ఉండాలి. ఇన్వెస్టర్ల ఫిర్యాదులను స్వీకరించేందుకు, కౌన్సెలింగ్ సర్వీసులు అందించేందుకు సదుపాయాలు ఉండాలి. ⇔ ఇన్వెస్టర్ల రక్షణ నిధికి గరిష్టంగా అయిదుగురు ట్రస్టీలు ఉండొచ్చు. సెబీ గుర్తింపు పొందిన ఇ న్వెస్టర్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు, ఎక్స్ఛేం జీకి చెందిన ఒక అధికారి ఇందులో ఉండాలి. ⇔ సెటిల్మెంట్ సంబంధ పెనాల్టీలు తప్ప ఎక్సే్ఛంజీకి జరిమానాల రూపంలో వచ్చే నిధులన్నీ కూడా ఐపీఎఫ్ ఖాతాలో జమచేయాల్సి ఉంటుంది. ఎక్సే్ఛంజీ మెంబర్/బ్రోకింగ్ సంస్థ గానీ డిఫాల్ట్ అయితే ఇన్వెస్టర్.. ఐపీఎఫ్ నుంచి పరిహారం పొందవచ్చు. కమోడిటీ ఎక్సే్ఛంజీలు తమ తమ ఐపీఎఫ్ ట్రస్ట్‌తో సంప్రదించి తగు నష్ట పరిహార పరిమితులను నిర్ణయించాల్సి ఉంటుంది. ఐపీఎఫ్ కార్పస్ నిధిపై వచ్చే ఆదాయాన్ని ఎక్సే్ఛంజీలు ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఐపీఎఫ్, ఐఎస్ఎఫ్కి ఎక్సే్ఛంజీలు వేర్వేరు బ్యాంకు ఖాతాలు నిర్వహించాల్సి ఉంటుందని సెబీ నిర్దేశించింది. -
ట్రేడింగ్ టిప్స్‌తో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: షేర్లకు సంబంధించి అవాంఛిత ఎస్ఎంఎస్లు, కాల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి నష్టపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... ప్రజలకు సూచించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్అనలిస్ట్ల సలహాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ... ఆయా సంస్థల, వ్యక్తుల వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తమ వద్ద నమోదు కాని సంస్థలు.. ఇన్వెస్టర్లనుతప్పుదోవ పట్టించేలా ఎస్ఎంఎస్లు, కాల్స్ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఇలాంటి 15 సంస్థలపై చర్యలు తీసుకున్నామని సెబీ తెలిపింది. మనీవరల్డ్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ, గ్లోబల్ మౌంట్ మనీరీసెర్చ్ అండ్ అడ్వైజరీ, ఆరంజ్ రిచ్ ఫైనాన్షియల్స్, గోక్యాపిటల్, క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్‌లు తమ వద్ద నమోదు కాకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలిచ్చాయని సెబీ పేర్కొంది -
బేగంబజార్.. బేజార్!
నవంబర్ 8కి ముందు నిత్యం వంద కోట్ల వ్యాపారం నేడు సగానికి తగ్గిన వాణిజ్యం.. రూ.50 కోట్లు దాటని వైనం ♦ గత 8 రోజులుగా రూ.400 కోట్ల వ్యాపారానికి నష్టం ♦ పని లేకపోవడంతో సిబ్బందిని తొలగిస్తున్న వ్యాపారులు ♦ కూలీ దొరకక వందల మంది అవస్థలు ♦ బహిరంగ విపణిలో పలు రంగాలపై పెను ప్రభావం చూపుతోన్న నోట్ల రద్దు సాక్షి, హైదరాబాద్: బేగంబజార్... ‘బేర్’మంటోంది. హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్. రోజూ ఇసుక వేస్తే రాలనట్లు ఉండే జనం. అగ్గిపుల్ల, సబ్బుబిల్లా, ఉప్పు, పప్పు, బియ్యం, సౌందర్యసాధనాలు.. గృహోపకరణాలు, ఆటోమోబైల్స్, ఇలా అన్ని వస్తువులకు ఇది నెలవు. హోల్‌సేల్ నుంచి రిటైల్ దాకా రోజూ కోట్ల రూపాయల వ్యాపార కేంద్రం. నగరంలోని ఇతర ప్రాంతాలే కాదు... జిల్లాల వ్యాపారులకు కూడా ఇదే పెద్ద హోల్‌సేల్ మార్కెట్. వందల కోట్ల లావాదేవీలు సాగే ఈ మార్కెట్ ఇప్పుడు బోసిపోతోంది. పెద్ద నోటు ‘కాటు’తో కోలుకోలేక అవస్థలు పడుతోంది. కొందరి వ్యాపారం దెబ్బతినగా... మరికొందరికి కూలీ కరువైంది... ఇంకొందరికి ఉపాధి లేకుండా పోయింది. కళ తప్పిన బేగంబజార్ మార్కెట్‌పై బుధవారం ‘సాక్షి’ బృందం పరిశీలనాత్మక కథనం... ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు అవసరమైన వస్తువుల కొనుగోళ్లు.... వేలాది మంది వ్యాపారుల రాకపోకలతో నిత్యం కళకళలాడే ఈ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది. పెద్ద నోట్ల రద్దుతో ఈ బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్, రిటైయిల్ వ్యాపారం దారుణంగా పడిపోయింది. నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు బేగంబజార్, సిద్ధి అంబర్‌బజార్, మహరాజ్‌గంజ్, కిషన్‌గంజ్, ముక్తార్‌గంజ్ తదితర ప్రాంతాల్లో నిత్యం వందల కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం రూ.50 కోట్లు దాటడం లేదు. దేశంలో 14 శాతం మేర ఉన్న నల్ల కుబేరుల భరతం పట్టేందుకు 86 శాతం మేర ఉన్న సామాన్యులపై సర్జికల్ స్ట్రైక్స్ చేయడం దారుణమని వాపోయారు. 8 రోజులుగా రూ.400 కోట్ల నష్టం... బేగంబజార్‌లోని ఏడు డివిజన్ల పరిధిలో సుమారు ఐదువేల హోలోసేల్ దుకాణా సముదాయాలుంటాయి. ఇందులో కిరాణా, జువెల్లరీ, వస్రా్తలు, స్టీలు, సిమెంటు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, టైర్లు, ఎలక్ట్రికల్, పప్పు దినుసులు, మసాలా, డ్రైఫ్రూట్స్, ఆటోమోబైల్స్, నూనెలు, లూబ్రికెంట్స్, పాన్‌మసాలా, ఫర్టిలైజర్, కాస్మోటిక్స్, స్టెయిన్లెస్స్టీల్ తదితర రంగాలకు సంబంధించిన దుకాణాలున్నాయి. వీటిల్లో నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దుకు ముందు రోజువారీగా సుమారు రూ.100 కోట్ల వ్యాపారం జరిగేది. నిత్యం సుమారు లక్షమంది రిటైల్ వ్యాపారులు, కొనుగోలుదారులు ఈ మార్కెట్‌కు వచ్చిపోయేవారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సీన్ రివర్సైంది. మార్కెట్లో కొనుగోళ్లు పడిపోయాయి. కొనుగోలు దారులు, రిటైలర్ల రాకపోకలు సగానికి పైగా తగ్గాయి. రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుతో ఈ నోట్లను వ్యాపారులు స్వీకరించకపోవడంతో అమ్మకాల విలువ నిత్యం రూ.50 కోట్ల మేరకు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. అంటే 8 రోజులుగా రూ.400 కోట్ల మేర మార్కెట్‌కు నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వినియోగదారులు తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకే ప్రాధాన్యతనివ్వడంతో వ్యాపారం అనూహ్యంగా దెబ్బతిందని వాపోయారు. ప్రస్తుతం బేగంబజార్‌లోని పలు వీధులు కొనుగోలుదారులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. అంతేకాదు పలు దుకాణాల్లో వ్యాపారులు మినహా కొనుగోలు దారులు లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే తాము నెలవారీ దుకాణ అద్దెలు, పనివాళ్ల వేతనాలు చెల్లించడమూ కష్టతరమౌతోందని పలువురు వ్యాపారులు వాపోయారు. బేగంబజార్‌లోని జయశ్రీ మ్యాచింగ్ సెంటర్. అన్ని రకాల మ్యాచింగ్ వస్రా్తలతో పాటు, రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వ్యాపారులు, నగరంలోని వినియోగదారులు ఈ మ్యాచింగ్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తారు. అలాంటి జయశ్రీ మ్యాచింగ్ సెంటర్లో వారం రోజులుగా అమ్మకాలు నిలిచిపోయాయి. దివాలా తీస్తున్నాం రోజుకు 10 మంది వినియోగదారులు కూడా రావడం లేదు. చిల్లర కొరత పెద్ద సమస్యగా మారింది. రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిగిన వ్యాపారం ఇప్పుడు ఏకంగా రూ.5000లకు పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్కర్లు ఎలాంటి పని లేకుండా కాలక్షేపం చేయాల్సి వస్తోంది. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసేవాళ్లు కూడా రావడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో సర్జికల్ దాడి జరిగింది నల్ల డబ్బు ఉన్న వాళ్లపైనా, లేక వ్యాపారులు, సగటు పేద, మధ్య తరగతి వర్గాలపైనా అనేది అంతుబట్టకుండా ఉంది. – నారాయణ, షాపు నిర్వాహకుడు గోటి జ్యువెలర్స్. పెళ్లిళ్లు, వేడుకలకు, అన్ని రకాల శుభకార్యాలయాలకు అవసరమైన బంగారు, వెండి ఆభరణాలను అందజేస్తారు. నిజానికి బేగంబజార్‌లో దొరకని వస్తువంటూ లేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. బట్టలు, బంగారు ఆభరణాలకు మంచి గిరాకీ ఉండే రోజులు ఇవి. కానీ గోటీ జ్యువెలర్స్ వ్యాపారం స్తంభించింది. వ్యాపారం సున్నా ఒక్కటంటే ఒక్క ఆభరణం కూడా ఈ వారంలో అమ్మలేదు. ప్రతి రోజు ఉదయం షాపు తెరుస్తున్నాము.రాత్రి మూసేస్తున్నాము. అంతే. వ్యాపారం సున్నా. చాలా కష్టంగా ఉంది. ఎంతకాలం ఇలా ఉంటుందో తెలియదు. రూ.లక్షల్లో వ్యాపారం చేసిన వాళ్లం ఇప్పుడు రూ.వేలల్లో కూడా విక్రయించలేకపోతున్నాము. – అనిల్, షాపు నిర్వాహకుడు వెయ్యినోటు ఇస్తున్నారు.. చాయ్ పత్తా వ్యాపారం దివాలా తీసింది. హోల్‌సేల్‌గా కంటే ఇంటి అవసరాల కోసం కొనుగోలు చేసే వినియోగదారులే మా షాపునకు ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఒక్కరిద్దరు వస్తున్నారు. కానీ వాళ్లు కూడా పెద్ద నోట్లు తెస్తున్నారు. రూ.300 కిలో టీ పొడి కోసం రూ.1000 నోటు తెస్తే మిగతా రూ.700 నేను ఎక్కడి నుంచి తేవాలి. చిల్లర లేక గిరాకీని వదులుకుంటున్నాను. – ప్రేమ్ డాగా, టీ పొడి వ్యాపారి 50 శాతం పడిపోయింది చాలా ఏళ్లుగా అన్ని రకాల స్టీలు, రాగి, ఇత్తడి సామగ్రి హోల్‌సేల్‌గా, రిటేల్‌గా విక్రయిస్తున్నాము. ఇటీవల కాలంలో ఇలాంటి కుదుపును చూడలేదు. సగానికి సగం గిరాకీ దెబ్బతింది. పెళ్లిళ్ల సీజన్ కదా. ప్రతి రోజు మా షాపు కస్టమర్లతో కిక్కిరిసిపోయేది. ప్రతి రోజు రూ.లక్షల్లో వ్యాపారం చేసే వాళ్లం ఇప్పుడు రూ.50 వేల కంటే ఎక్కువ బిజినెస్ కావడం లేదు. – సయ్యద్ ఫరీద్, స్టీల్ దుకాణం వ్యాపారి వస్త్రాల వ్యాపారానికి కష్టకాలమే 6 నెలల క్రితమే షాపు తెరిచాం. రంజాన్, దసరా, దీపావళి పండుగలకు మంచి గిరాకీ ఉండింది. చాలా సంతోషంగా అనిపించింది. కానీ వారం, పది రోజుల నుంచి దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కదా మంచి గిరాకీ ఉంటుందనుకున్నాము. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక నుంచి రిటైల్ వ్యాపారులు ఇక్కడికి వస్తారు. వారం నుంచి ఎవ్వరూ రావడం లేదు. – శైలేందర్, వస్త్రాల వ్యాపారి ఇల్లు గడవడమే కష్టం.. ఐదారేళ్ల నుంచి ఇక్కడ హమాలీగా పని చేస్తున్నాను. ఏ రోజూ ఇలాంటి ఇబ్బంది రాలేదు. రోజుకు రూ.400 కూలీ దొరికేది. ఇప్పుడు వారం నుంచి కూలీ లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – జహీరుద్దీన్, హమాలీ -
స్టాక్ ఎక్స్ఛేంజ్ లలోకి తాజా గోల్డ్ బాండ్లు
రేపటి నుంచి ట్రేడింగ్ ప్రారంభం ముంబై: గత నెల జారీ చేసిన గోల్డ్ బాండ్లలో బుధవారం నుంచి ట్రేడింగ్ ప్రారంభం కానుంది. గత నెల 30న జారీ అయి డీమ్యాట్ మోడ్‌లో ఉన్న బంగాం బాండ్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ఈ నెల 19వ తేదీ నుంచి ట్రేడింగ్‌కు అర్హమైనవని ఆర్బీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఐదో విడత గోల్డ్ బాండ్ల జారీ ప్రకటనను ఆగస్ట్‌లో జారీ చేసింది. సెప్టెంబర్ 1-9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా... రెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అదే నెల 30న బాండ్లను జారీ చేసింది. బంగారంపై పెట్టుబడులకు సంబంధించి ఆభరణాలకు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఈ బాండ్లను తొలిసారి గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. -
ముగింపులో తగ్గిన ఎల్ అండ్ టీ టెక్ లిస్టింగ్ లాభాలు
ముంబై: ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు రూ. 860 ఆఫర్ ధరతో పోలిస్తే శుక్రవారం 4.65% ప్రీమియంతో రూ.900 వద్ద లిస్టయ్యింది. తదుపరి 8% వరకూ ర్యాలీ జరిపి రూ. 925 స్థాయిని చేరింది. అయితే ట్రేడింగ్ ముగింపు సమయానికి లిస్టింగ్ లాభాల్ని చాలావరకూ కోల్పోయి, చివరకు 0.59% పెరుగుదలతో రూ. 865 వద్ద క్లోజయ్యింది. తాజా ధర ప్రకారం కంపెనీకి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ. 8,797 కోట్ల మార్కెట్ విలువ లభించినట్లయ్యింది. రూ. 900 కోట్ల సమీకరణకు ఎల్ అండ్ టీ టెక్నాలజీస్ జారీచేసిన ఐపీఓ 2.53 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన సంగతి తెలిసిందే. -
మళ్లీ రోడ్డెక్కిన ఉల్లి రైతు
– కొనుగోళ్లు ముందుగా నిలిపివేయడంపై ఆగ్రహం –మార్కెట్ కమిటీ అధికారులతో వాగ్వాదం కర్నూలు(అగ్రికల్చర్): స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు మళ్లీ రోడ్డెక్కారు. కొనుగోళ్లను సోమవారం సాయంత్రం 4 గంటలకే ముగించడంతో.. నాలుగైదు రోజులుగా మార్కెట్లో పడిగాపుల కాస్తున్న రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మార్కెట్లో ఉల్లి నిల్వలు పేరుకొనిపోయినా కొనుగోళ్లలో వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్ కమిటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కెట్‌కు ఎదురుగా వెంకటరమణ కాలనీకి వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఉల్లి ఎక్కువగా ఉన్నా.. పూర్తిగా కొనకుండా అర్ధాంతరంగా కొనుగోళ్లు ముగించడం దారణమన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుకు ఇరువైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాల్గో పట్టణ పోలీసులు వచ్చి రైతులకు సర్ది చెప్పి ధర్నాను విరమింప చేసి మార్కెట్ కమిటీ కార్యదర్శి దగ్గరకు రైతులను తీసుకెళ్లారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వస్తోందని, సోమవారం ఒక్కరోజే 18 వేల ప్యాకెట్లు కొన్నారని కార్యదర్శి నారాయణమూర్తి తెలిపారు. కొన్న సరుకును తరలించుకోవాల్సి ఉన్నందున వేలంపాటను ముగించారన్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వేలంపాట ప్రారంభించి మిగిలిపోయిన ఉల్లిని పూర్తిగా కొనుగోలు చేస్తామని వివరించారు. -
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
సెన్సెక్స్ 85 పాయింట్లు అప్ ముంబై: రెండు రోజుల నష్టాల నుంచి గురువారం స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, కొన్ని బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో రియల్టీ, లోహ, వాహన, బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 27,860 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 8,592 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ఎఫ్ఎంసీజీ, ఆయిల్, గ్యాస్, విద్యుత్తు, ఇన్ఫ్రా, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 27,697 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల కారణంగా నష్టాలన్నింటిని పూడ్చుకొని 27,902 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. 205 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 85 పాయింట్ల లాభంతో ముగిసింది. వరుసగా రెండు రోజుల పతనం కారణంగా షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్ల జోరు పెరిగిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ చెప్పారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్..
-
గోల్డ్ బాండ్ ట్రేడింగ్ శుభారంభం
ముంబై: స్టాక్ ఎక్స్చేంజ్ల్లో గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ సోమవారం శుభారంభం చేసింది. ట్రేడింగ్ తొలి రోజే 7 శాతం లాభాలు వచ్చాయి. గ్రామ్ డినామినేషన్ గోల్డ్ బాండ్ రూ.2,930 వద్ద నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అయింది. 7.43 శాతం లాభంతో రూ.3,147.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 10.3 శాతం లాభంతో రూ.3,258 గరిష్ట స్థాయిని తాకింది. 736 లావాదేవీలు జరిగాయి. టర్నోవర్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో కలిపి రూ.23.18 లక్షలుగా నమోదైంది. భౌతికంగా బంగారాన్ని కొనకపోయినప్పటికీ, ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ వీలు కల్పిస్తాయి. గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 30న ప్రారంభించింది. -
ఈ ఏడాది గరిష్ట స్థాయికి ముడి చమురు ధరలు
అమెరికాలో క్షీణించిన చమురు నిల్వలు లండన్: ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్యారెల్ చమురు ధరలు 51 డాలర్లను మించి పోయాయి. చైనా వృద్ధిపై ప్రోత్సాహకర నివేదికలు రావడం, ముడి చమురు సరఫరాలు తగ్గడం, జూన్ 3న ముగిసిన వారంలో అమెరికా ముడి చమురు నిల్వలు 3.2 మిలియన్ బ్యారెళ్లు తగ్గాయన్న గణాంకాలు, అమెరికా డాలర్ పతనమవుతూ ఉండటం వంటివి దీనికి కారణాలు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బుధవారం ఈ ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఈ ధరలు 90 శాతం ఎగిశాయి. అడవుల్లో చెలరేగిన దావానలం కారణంగా కెనడాలో, నైజీరియాలో చమురు ప్లాంట్లపై మిలిటెంట్ గ్రూప్‌ల దాడుల కారణంగా చమురు ఉత్పత్తి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణాలని నిపుణులంటున్నారు. ఈ వార్త రాసే సమయానికి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 52.34 డాలర్లకు(గత ఆక్టోబర్ నుంచి చూస్తే ఇదే అధిక ధర) పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర 2 శాతం పెరిగి 51.34 డాలర్లకు ఎగసింది. -
ద్రవ్యోల్బణం డేటా కీలకం..
దేశీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ కదలికలకు కీలకమని విశ్లేషకులు అంటున్నారు. సోమవారంనాడు వెలువడే ఫిబ్రవరి నెల రిటైల్, టోకు ద్రవ్యోల్బణం,ఆర్బీఐ రేటు నిర్ణయం వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ సింఘానియా చెప్పారు. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడే సంకేతాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులు, క్రూడ్ ధరల చలనం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ గాడియా తెలిపారు. అమెరికా ఫెడ్ 15-16 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే సమావేశం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. స్వల్పకాలిక కరెక్షన్!: గత అంచనాలకు భిన్నంగా ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్‌గా మారింది. వివిధ రంగాల షేర్లపై ఈ సెంటిమెంట్ ప్రభావం కన్పిస్తోంది. బాగా బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నందున, స్వల్పకాలికంగా చిన్నపాటి కరెక్షన్ జరిగే అవకాశం లేకపోలేదని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ చెప్పారు. అయితే అంతర్లీనంగా మార్కెట్ పటిష్టంగానే వుంటుందని, తదుపరి ట్రెండ్ నెలకొనేముందు, సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు.వరుసగా రెండోవారం దేశీయ సూచీలు పెరుగుదలతో ముగిసాయి. రెపోను తగ్గించవచ్చన్న అంచనాలతో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 8,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేశారు. -
పన్ను ఎగవేతల ‘ట్రేడింగ్’పై సెబీ కొరడా
22 బ్రోకింగ్ మెంబర్లపై వేటు న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన 22 ట్రేడింగ్ సభ్యులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల నుంచి ఆయా సంస్థలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్యాష్ సెగ్మెం ట్లో తమ ప్రస్తుత క్లెయింట్ల తరఫున స్టాక్ బ్రోకర్లుగా కార్యకలాపాలు నిర్వహించడానికి ట్రేడింగ్ మెంబర్లను అనుమతిస్తున్నట్లు సెబీ తెలిపింది. కొత్త క్లెయింట్తో ఎటువంటి ఒప్పందానికీ రాకూడదని స్పష్టం చేసింది. ఇంతకుమించి సెక్యూరిటీస్ మార్కెట్లలో పరోక్షంగాకానీ, ప్రత్యక్షంగాకానీ ఈ సంస్థలు ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరపరాదని స్పష్టం చేసింది. స్టాక్ ఆప్షన్స్ విభాగంలో వివాదాస్పద రూ.8,100 కోట్ల ట్రేడింగ్ లావాదేవీల ద్వారా భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడ్డారన్న ఆరోపణలను ఈ బ్రోకింగ్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారణ అయిన నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ ట్రేడింగ్ సభ్యులపై మరింత విచారణ జరిపి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. సెబీ తాజా నిషేధిత జాబితాలో సన్‌స్టార్ సెక్యూరిటీస్, శుభ్ స్టాక్ బ్రోకింగ్ తదితర సంస్థలు ఉన్నాయి. -
రోజంతా ఒడిదుడుకులే..
♦ నేడు డెరివేటివ్‌ల ముగింపు ♦ జాగ్రత్తగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు ♦ 6 పాయింట్ల లాభంతో 24,492కు సెన్సెక్స్ ♦ 2 పాయింట్ల లాభంతో 7,438కు నిఫ్టీ రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. నేడు (గురువారం) జనవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం వెలువడనుండడం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 6 పాయింట్లు లాభపడి 24,492 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 7,438 పాయింట్ల వద్ద ముగిశాయి. ముడి చమురు ధరల ర్యాలీ కారణంగా మంగళవారం అమెరికా మార్కెట్ లాభపడడంతో బుధవారం చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం 29 నెలల కనిష్టానికి పడిపోవడం, ఫెడ్ వడ్డీరేట్ల నిర్ణయం, ముడి చమురు ధరలు పతనం నేపథ్యంలో యూరప్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురికావడం, జనవరి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు లాభాల స్వీకరణ చేయడంతో లాభాలు తగ్గాయి. -
చైనా దెబ్బ: కుదేలైన భారత మార్కెట్లు
-
బ్యాంక్ షేర్లు బేర్
► మందకొడిగా ట్రేడింగ్ ► 12 పాయింట్ల నష్టంతో 25,839కు సెన్సెక్స్ ► 5 పాయింట్ల నష్టంతో 7,861కు నిఫ్టీ ట్రేడింగ్ మందకొడిగా సాగడంతో గురువారం ఆద్యంతం ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప నష్టాలతో ముగిసింది. బ్యాంకుల రుణ నాణ్యత క్షీణిస్తోందంటూ ఆర్బీఐ నివేదిక వెల్లడించడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 25,839 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 7,861 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు వచ్చే వారంలో ముగియనుండడం, నేడు (శుక్రవారం) సెలవు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. కాగా వరుసగా రెండో వారమూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 319 పాయింట్లు(1.25 శాతం), నిఫ్టీ 99 పాయింట్లు(1.27 శాతం) లాభపడ్డాయి. బ్యాంకులపై ‘మొండి’ భారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి బ్యాంక్‌ల రుణ వృద్ధి మందగించిందని, మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆర్బీఐ నివేదిక బుధవారం వెల్లడించడంతో పలు బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. కబుధవారం లిస్టింగ్ రోజున మెరుపులు మెరిపించిన డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాల జోరును కొనసాగించాయి. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్ 9%, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 10 శాతం చొప్పున పెరిగాయి. నేడు సెలవు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. స్టాక్ మార్కెట్లో పాటు ఫారెక్స్, మనీ, కమోడిటీ మార్కెట్లకు కూడా సెలవు. -
సెన్సెక్స్ మద్దతు 25,700
మార్కెట్ పంచాంగం అంతర్జాతీయంగానూ, దేశీయంగానూ గతవారం అనుకూల, ప్రతికూలాంశాలేవీ లేకపోవడంతో భారత్ మార్కెట్ పరిమితంగా కదిలింది. వరుసగా రెండోవారం స్వల్ప లాభాలతో ముగియగలిగింది. అయితే ఈ వారం వెలువడే పలు వార్తల కారణంగా మార్కెట్ కదలికలు వేగవంతం కావొచ్చు. జీడీపీ డేటా, ఆర్బీఐ పాలసీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశం, అమెరికా ఫెడ్ చైర్మన్ యెలెన్ అక్కడి కాంగ్రెస్ సమావేశంలో ఇచ్చే ప్రెజెంటేషన్ వంటివి ప్రపంచ, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు నవంబర్ 27తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ కనిష్టస్థాయి వద్ద పదేపదే మద్దతు పొందుతూ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 260 పాయింట్ల లాభంతో 26,128 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మార్కెట్ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 26,100-26,200 నిరోధ శ్రేణి వద్ద నిలిచివుంది. ఈ వారం ఈ శ్రేణిపైన ముగిస్తే 26,440 స్థాయిని అందుకునే ఛాన్స్ వుంటుంది. అటుతర్వాత అక్టోబర్ 26 నాటి గరిష్టస్థాయి అయిన 26,618 స్థాయిని పరీక్షించవచ్చు. తొలి నిరోధశ్రేణిపైన ముగియలేకపోతే క్రమేపీ 25,700 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయి గత ఐదు రోజుల నుంచి వరుసగా మద్దతును అందిస్తున్న కారణంగా 25,700 పాయింట్ల లోపు ముగిస్తే తిరిగి డౌన్‌స్వింగ్ మొదలుకావొచ్చు. ఆలోపున ముగిస్తే మద్దతు స్థాయిలు 25,440, 25,100 పాయింట్లు. నిఫ్టీ మద్దతు శ్రేణి 7,810-7,860 ఎన్ఎస్ఈ నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 7,943 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా గత ఐదు ట్రేడింగ్ రోజుల్లో నిఫ్టీ 7,810-7,860 పాయింట్ల శ్రేణిలో మద్దతు పొందినందున, సమీప భవిష్యత్తులో ఈ శ్రేణి కీలకం. ఈ వారం ఈ శ్రేణి దిగువన ముగిస్తే గత రెండు వారాల అప్‌ట్రెండ్‌కు బ్రేక్పడవచ్చు. ఆ లోపున 7,700 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 7,600 స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే 8,005 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అధిక ట్రేడింగ్ పరిమాణంతో ఈ స్థాయిని బ్రేక్చేస్తే తదుపరి వారాల్లో 8,336 పాయింట్ల వరకూ పెరిగే చాన్స్ వుంది. -
ఒడిదుడుకుల వారమే..!
డెరివేటివ్‌ల ముగింపు * పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రభావం * ట్రేడింగ్ నాలుగు రోజులే * బుధవారం గురునానక్ జయంతి సెలవు న్యూఢిల్లీ: డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల కారణంగా ఈ వారం ట్రేడింగ్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులంటున్నారు. గురునానక్ జయంతి కారణంగా బుధవారం సెలవు ఉండడం వల్ల నాలుగు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కూడా తగినంత ప్రభావం చూపిస్తాయని వారంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లోనే వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేశాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. బిహార్ గెలుపుతో... ఈ నెల 26(గురువారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాలతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోగలుగుతుందా అనే అంశం మీదనే అందరి దృష్టి ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు. బిహార్ ఎన్నికల్లో వచ్చిన విజయంతో ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతాయని, పలు అంశాల్లో ప్రభుత్వానికి అడ్డుపడతాయని, దీంతో జీఎస్టీతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి అవరోధాలు తప్పవని కొందరు నిపుణులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధానమైన గణాంకాలు ఈ వారంలో వెలువడవు. ఫలితంగా అంతర్జాతీయ సంకేతాలే కొంత వరకు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయి. ప్రతికూలంగానే మార్కెట్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ ప్రతికూలంగానే చలించవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,930 పాయింట్ల దిగువన ఉన్నంత వరకూ పెరిగినప్పుడల్లా షార్ట్ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు బ్యాలెన్స్ చేశాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. పార్లమెంట్లో సానుకూల చర్యలు లేనిపక్షంలో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. గతవారం మార్కెట్... నవంబర్ 20తో ముగిసిన గత వారంలో సెన్సెక్స్ 258 పాయింట్ల(1 శాతం) ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్ల (1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి. అక్టోబర్ 9 తర్వాత గత వారంలోనే స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచింది. గత శుక్రవారం సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి. 126 కోట్ల డాలర్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు)భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ వంద కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ నెలలోనే పెంచే అవకాశాలుండడం దీనికి ప్రధాన కారణాలు. ఈ నెల 2 నుంచి 19వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.5,713 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.2,565 కోట్లు.. వెరశి రూ.8,278 కోట్లు(126 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
స్వల్ప లాభాలతో సరి
* ప్లస్ 217 నుంచి ప్లస్ 27కు పరిమితమైన సెన్సెక్స్ లాభం * 25,868 వద్ద ముగింపు ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో స్టాక్ సూచీలు గట్టెక్కాయి. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో ఉండటానికి తోడు దేశీయంగా కొనుగోళ్లు జోరందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 217 పాయింట్లు లాభపడింది. 26 వేల పాయింట్లను దాటింది. కానీ చివరి గంటలో అమ్మకాల కారణంగా ఆ లాభాలను నిలుపుకోలేకపోయింది. ఐటీ, కొన్ని ఆయిల్, గ్యాస్, వాహన షేర్ల మద్దతుతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చివరలో బ్యాంక్, ఆర్థిక సేవల షేర్లలో అమ్మకాల కారణంగా స్వల్పలాభాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ వారంలో సెన్సెక్స్ 258 పాయింట్లు (1 శాతం), నిఫ్టీ 94 పాయింట్లు(1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి. గత నాలుగు వారాల్లో లాభాల్లో ముగిసిన వారం ఇదే. డిసెంబర్లోనే వడ్డీరేట్లను పెంచడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమవుతున్నప్పటికీ, ఈ పెరుగుదల దశలవారీగానే ఉంటుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపారు. వేతన సంఘం సిఫారసు చేయడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చింది.ప్రారంభంలో లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయిన సెన్సెక్స్, బ్లూ చిప్‌ల్లో కొనుగోళ్లతో తేరుకుంది. కాగా ఐపీఓ కోసం మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సెబీకి దరఖాస్తు చేసింది. దీంతో మహానగర్ గ్యాస్ కంపెనీలో 49.75 శాతం వాటా ఉన్న గెయిల్ 10 శాతం లాభపడి రూ.350 వద్ద ముగిసింది. -
ఈ తారాజువ్వులు కొంటారా?
అందరికీ జనవరి... మనకైతే ఉగాది. కానీ స్టాక్ మార్కెట్ మదుపరులకు మాత్రం దీపావళే కొత్త సంవత్సరాది. దీపావళి నుంచి కొత్త సంవత్ మొదలవుతుంది. అందుకే ఆ రోజున ఒకవైపు దేశమంతా టపాకాయలు కాలుతుండగా... స్టాక్ మార్కెట్లోనూ కొద్దిసేపు తారాజువ్వలు, చిచ్చుబుడ్డిల్లాంటి షేర్లు హల్చల్ చేస్తాయి. కొద్దిసేపు జరిగే మూరత్ ట్రేడింగ్‌లో... మదుపరులంతా ఏవో కొన్ని షేర్లను కొని పెట్టుకుంటుంటారు. ఎందుకంటే ఆ రోజున కొనుగోలు చేయాలన్నది చాలామంది సెంటిమెంటు. సరే! మరి రాబోయే సంవత్సరం సంవత్ 2072లో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఏ షేర్లు తారాజువ్వల్లా పెకైగురుతాయి? మార్కెట్ నిపుణులు వీటిపై ఏమంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవటానికి పలువురు బ్రోకింగ్ నిపుణుల్ని ‘సాక్షి బిజినెస్’ సంప్రదించింది. వారి సిఫారసుల సమాహారమే ఈ దీపావళి స్పెషల్... - సాక్షి, బిజినెస్ బ్యూరో బ్రోకింగ్ సంస్థ: ఆనంద్‌రాఠీ రీసెర్చ్ మార్చికి నిఫ్టీ టార్గెట్- 9,100 కంపెనీల ఆదాయాల్లో సరైన వృద్ధి లేకపోవడంతో వచ్చే రెండు త్రైమాసికాల సూచీలు పరిమిత శ్రేణిలోనే కదులుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే మార్చి, 2016 నుంచి కంపెనీల ఆదాయాలు పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ లోగా నిఫ్టీ 9,100 స్థాయిని తాకవచ్చు. ప్రభుత్వం వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐ పెట్టుబడులను ప్రోత్సహించడం, రక్షణ, రేవులు, రోడ్లు వంటి కీలకమైన ఇన్ఫ్రా రంగానికి పెట్టుబడులు పెంచడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి. వెల్స్పన్ ఇండియా ప్రస్తుత ధర: 738 లక్ష్యం: 1,020 వృద్ధి: 38% ఎందుకంటే..?: దేశీయ హోమ్ టెక్స్టైల్ వ్యాపారంలో వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్స్‌లో వెల్స్పన్ ఇండియా ఒకటి. కంపెనీ ఉత్పత్తిలో 97 శాతం ఎగుమతులదే. భారీ విస్తరణ కార్యక్రమాల్లో ఉన్న ఈ కంపెనీ వచ్చే రెండేళ్ల ఆదాయంలో 19 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. అశోక్ లేలాండ్ ప్రస్తుత ధర: 89 లక్ష్యం: 130 వృద్ధి: 46% ఎందుకంటే..?: దేశీయ వాణిజ్య వాహనాల తయారీలో రెండోస్థానంలో ఉంది. నిస్సాన్ , జాన్ డీర్‌తో కలసి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. మైనింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, ఆర్థిక వృద్ధిరేటు పుంజుకోనుండటంతో వాణిజ్య వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. దివాన్ హౌసింగ్ ప్రస్తుత ధర: 212 లక్ష్యం: 322 వృద్ధి: 52% ఎందుకంటే..?: తక్కువ, మధ్య స్థాయి ఆదాయ వర్గాల గృహరుణాలపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఈ రంగం వేగంగా విస్తరిస్తుండటం.. 100 స్మార్ట్‌సిటీల్లో భాగంగా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి కేంద్రం అందిస్తున్న తోడ్పాటు, దిగొస్తున్న వడ్డీరేట్లు కలిసొచ్చే అంశాలు. బ్రోకింగ్ సంస్థ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ నిఫ్టీ లక్ష ్యం: 9,400 సంవత్ 2071 మదుపరులకు మిశ్రమ ఫలితాలిచ్చింది. ప్రథమార్థంలో లాభాలను అందించిన సూచీలు ద్వితీయార్థం వచ్చే సరికి ఆ లాభాలన్నీ వెనక్కు తీసేసుకున్నాయి. నిఫ్టీ నూతన గరిష్ఠ స్థాయికి చేరుకున్నా, ఆ తర్వాత పతనం మొదలై... చివరకు స్వల్ప నష్టాలతో ముగిసింది. ఈ పతనం 2016 జనవరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడా పతనం ఆగకపోతే 2016 సెప్టెంబర్ వరకూ మార్కెట్లు నేల చూపులు చూసే అవకాశం ఉంది. జనవరి వరకు నిఫ్టీ 7,673 - 8,300 శ్రేణిలో కదులుతుందని అంచనావేస్తున్నాం. ఈ పతనం ఆగి నిఫ్టీ బుల్ కక్ష్యలోకి ప్రవేశిస్తే సంవత్ 2072లో గరిష్టంగా 9,400 మార్కును చేరుతుంది. గతేడాదిలాగే ఈ ఏడాదీ లార్జ్ క్యాప్ కంటే మిడ్‌క్యాప్ షేర్లే ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తాయని అంచనా. మార్క్సన్స్ ఫార్మా ప్రస్తుత ధర: 97 లక్ష్యం: 155 వృద్ధి: 60% ఎందుకంటే..?: కొన్నేళ్లుగా స్థిరంగా పెరుగుతున్న మిడ్‌క్యాప్ ఫార్మా షేరు ఇది. ఇటీవలి గరిష్ట స్థాయి రూ.115 నుంచి రూ.74 వరకు పడింది. అక్కడి నుంచి మళ్లీ పటిష్టమైన ర్యాలీ చేస్తోంది. సాంకేతికంగా బుల్లిష్ ట్రెండ్‌కి నిదర్శనమిది. టాటా ఎలెక్సీ ప్రస్తుత ధర: 1,772 లక్ష్యం: 2,880 వృద్ధి: 63% ఎందుకంటే..?: ఈ ఐటీ మిడ్‌క్యాప్ కంపెనీ గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందిస్తోంది. గత కొన్ని నెలలుగా రూ.1,555 - 2025 శ్రేణిలో కదులుతున్న ఈ షేరు స్ట్రాంగ్ బుల్ ట్రెండ్‌ను సూచిస్తోంది. బ్లూస్టార్ ప్రస్తుత ధర: 352 లక్ష్యం: 525 వృద్ధి: 49% ఎందుకంటే..?: ఎయిర్కండీషన్ల వ్యాపారంలో ఉన్న బ్లూస్టార్ 2013 ఆగస్టులో కనిష్టంగా రూ.130కి వచ్చింది. అక్కడి నుంచి పెరుగుతూ వస్తోంది. ఏడాది కాలంగా ఈ షేరు రూ. 300-370 శ్రేణిలో కదులుతోంది. బోకింగ్ సంస్థ: వే 2 వెల్త్ కాక్స్ అండ్ కింగ్స్ ప్రస్తుత ధర: 252 లక్ష్యం: 480 వృద్ధి: 90% ఎందుకంటే..?: రెండేళ్ల క్రితం భారీగా పెరిగిన ఈ షేరు గడిచిన ఏడాది కాలంగా లాభాల స్వీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుత స్థాయి నుంచి మళ్లీ ర్యాలీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సాంకేతికాలు వెల్లడిస్తున్నాయి. రూ.263 స్థాయిని దాటితే కొనుగోళ్లు చేయమని సూచిస్తున్నాం. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రస్తుత ధర: 314 లక్ష్యం: 465 వృద్ధి: 48% ఎందుకంటే..?: చాలా నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. సాంకేతికంగా చూసినా ఈ కౌంటర్లో జరుగుతున్న దిద్దుబాటు చివరి దశకు వచ్చింది. గత కొంతకాలంగా రూ.303 స్థాయిలో గట్టి మద్దతును అందుకుంటోంది. ఈ స్థాయి వద్ద షేర్లను కొనుగోలు చేయొచ్చు. సింటెక్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర: 100 లక్ష్యం: 198 వృద్ధి: 98% ఎందుకంటే: 2008లో ఈ షేరు ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 310ను తాకిన తర్వాత కరెక్షన్ మొదలై 8 ఏళ్లు అయ్యింది. సాంకేతికంగా చూస్తే... ఈ షేరు ప్రస్తుతం బుల్లిష్‌గా ఉంది. ఒక్కసారి రూ. 122 స్థాయిని అధిగమిస్తే వేగంగా రూ. 198 మార్కును అందుకునే అవకాశాలున్నాయి. -
భారీ నష్టాల నుంచి రికవరీ
మైనస్ 608 నుంచి మైనస్ 144కు బిహార్ ఫలితాల ప్రభావం స్వల్పమే బిహార్ ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్లుగానే స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అయితే అందరూ ఊహించినట్లుగా భారీగానే పతనమైనప్పటికీ, ఎవరూ ఊహించని విధంగా స్టాక్ సూచీలు రికవరీ అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 608 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 144 పాయింట్ల నష్టంతో 26,121 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 7,915 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ నష్టాల పాలయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. తదుపరి సంస్కరణలపై ఆర్థిక మంత్రి జెట్లీ వ్యాఖ్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుందన్న ఫిచ్ రేటింగ్..తదితర అంశాలు రికవరీకి తోడ్పడ్డాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి హెచ్చరిక లేఖలు అందిన నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేర్ పతనం కొనసాగుతోంది. సీఎన్ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50 న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన సూచీలన్నింటీని రీబ్రాండ్ చేసింది. అన్ని సూచీల పేర్ల నుంచి సీఎన్ఎక్స్ను తొలగించాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. సీఎన్ఎక్స్ నిఫ్టీ ఇక నుంచి నిఫ్టీ 50గానూ, నిఫ్టీ జూనియర్‌ను ఇక నుంచి నిఫ్టీ నెక్స్ట్ 50 గానూ, సీఎన్ఎక్స్ ఐటీని నిఫ్టీ ఐటీగానూ వ్యవహరిస్తారు. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓకు సెబీ ఓకే న్యూఢిల్లీ: ప్రముఖ డయాగ్నస్టిక్ చెయిన్ డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు కలిసి 14 శాతం వాటాకు సమానమైన 1.1 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్ ధరను ఇంకా నిర్ణయించలేదని కంపెనీ పేర్కొంది. -
ఆరు రోజుల నష్టాలకు బ్రేక్
బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు 31 పాయింట్ల లాభంతో 26,591కు సెన్సెక్స్ 10 పాయింట్ల లాభంతో 8,061కు నిఫ్టీ ఇటీవల నష్టపోయి ఆకర్షణీయ ధరల్లో ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. దీంతో ఆరు రోజుల ట్రేడింగ్ నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 26,591 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,061 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, గ్యాస్, పీఎస్‌యూ, విద్యుత్, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యురబుల్స్ షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి.కీలక రంగాలు నాలుగు నెలల గరిష్ట వృద్ధిని సాధించడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.5 శాతం వృద్ధిని సాధిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి మరింతగా మెరుగుపడుతుందని మూడీస్ సంస్థ వెల్లడించడం, భారత బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ రేటింగ్‌ను ప్రతికూలం నుంచి స్థిరత్వం స్థాయికి ఈ సంస్థ పెంచడం... సానుకూల ప్రభావం చూపించాయని ట్రేడర్లు చెప్పారు. ఇన్వెస్టర్లు బిహార్ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగిస్తుండడం ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని వారంటున్నారు. -
ఐదో రోజూ లాభాలే
కొనసాగిన ఫెడ్ లాభాలు 147 పాయింట్ల లాభంతో 26,933కు సెన్సెక్స్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వుండకపోవొచ్చన్న అంచనాలతో లాభాలు మంగళవారం కూడా కొనసాగాయి. స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లోనే సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 26,938 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 8,153 పాయింట్ల వద్ద ముగిశాయి. ముందుగా అనుకున్న విధంగానే 2016 నుంచే వస్తువుల, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం, కమోడిటీ ధరలు పెరుగుతుండడం, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు.. ఈ అంశాలన్నీ సెంటిమెంట్‌కు మరింత ఊతమిచ్చాయని విశ్లేషకులంటున్నారు. ఆయిల్, ఫార్మా షేర్లు బాగా లాభపడ్డాయి. మొత్తం ఐదు ట్రేడింగ్ సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,316 పాయింట్లు లాభపడింది. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 5%, నిఫ్టీ 4.6% చొప్పున పెరిగిపోయాయి. తగ్గిన లాభాలు..:వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకు భారీగా ఉండేలా ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించడం కూడా ప్రభావం చూపింది. గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు తగ్గాయన్న నికాయ్ ఇండియా కాంపొజిట్ పీఎంఐ సర్వే వెల్లడించడంతో ఐటీ, టెక్నాలజీ, బ్యాంకింగ్, విద్యుత్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో సెన్సెక్స్ లాభాలు తగ్గాయి. కొనసాగిన టాటా మోటార్స్ జోరు... టాటా మోటార్స్ జోరు మంగళవారం కూడా కొనసాగింది. చైనా ప్రభుత్వం వాహన విక్రయాల జోరు పెంచడం కోసం ప్యాకేజీని ఇవ్వనున్నదన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్ 5.8 శాతం లాభపడి 333 వద్దముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,589 షేర్లు లాభాల్లో, 1,151 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
హెచ్చుతగ్గుల మార్కెట్
- ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త - 40 పాయింట్ల లాభంతో 25,864కు సెన్సెక్స్ - 23 పాయింట్ల లాభంతో 7,869కు నిఫ్టీ ముంబై: వచ్చే వారం ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో గురువారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. బీఎస్ఈ సెనెక్స్ 40 పాయింట్ల లాభంతో 25,864 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 7,869 పాయింట్ల వద్ద ముగిశాయి. సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టు ముగింపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, కొన్ని లోహ షేర్లు పతనమయ్యాయి. రోల్ ఓవర్స్ సానుకూల ప్రభావం... సెన్సెక్స్ 279 పాయింట్ల రేంజ్లో కదలాడింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల రోల్ ఓవర్లు అక్టోబర్‌కు స్వల్పంగా పెరగడంతో సెంటిమెంట్ మెరుగుపడిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 355 పాయింట్లు(1.35 శాతం), నిఫ్టీ 113 పాయింట్లు(1.42%) చొప్పున నష్టపోయాయి. గత మూడు వారాల్లో ఈ రెండు సూచీలు నష్టపోవడం ఇదే మొదటిసారి. లాభ నష్టాలు... నొముర, క్రెడిట్ సూచీ బ్రోకరజ్ సంస్థలు లుపిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో లుపిన్ షేర్ 3.5 శాతం ఎగిసి రూ. 1,990 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే, 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,442 షేర్లు లాభాల్లో, 1,245 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,567 కోట్లుగా, ఎన్ఎస్ఈ ఈక్విటీ విభాగంలో రూ.19,830 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.5,58,242 కోట్లుగా నమోదైంది. నేడు మార్కెట్లకు సెలవు బక్రీద్ పర్వదినం సందర్భంగా స్టాక్‌మార్కెట్‌కు నేడు(శుక్రవారం) సెలవు. బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఫారెక్స్, మనీ, ప్రధాన కమోడిటీ మార్కట్లు పనిచేయవు. -
నమోదు కాని సంస్థల
- స్టాక్ టిప్స్‌ను నమ్మద్దు - ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసిన సెబీ ముంబై: నమోదు కాని సంస్థల నుంచి వచ్చే షేర్ల టిప్‌ల ఆధారంగా ట్రేడింగ్ చేసి మోసపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి ఇన్వెస్టర్లను హెచ్చరించింది. తమ వద్ద నమోదు కాని సంస్థలు ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఇతర మీడియా సాధనాల ద్వారా పంపించే స్టాక్ మార్కెట్ టిప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సెబీ సూచించింది. ఈ సంస్థలు పంపించే షేర్ల రికమండేషన్లను నమ్మవద్దని సూచించింది. ఈ తరహా నమోదు కాని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇప్పటివరకూ ఇలాంటి ఏడు సంస్థలపై చర్యలు తీసుకున్నామని వివరించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్ ఎనలిస్ట్‌ల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇలా నమోదైన సంస్థల వివరాలు తమ వెబ్సైట్లో పొందుపరిచామని సెబి తెలిపింది. ఈ సంస్థల టిప్స్ ఆచరించే ముందు అవి నమోదై ఉన్నాయో లేదోనన్న స్టేటస్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. -
టెల్కోలు స్పెక్ట్రంను అమ్ముకోవచ్చు..
- ట్రేడింగ్ నిబంధనలకు కేబినెట్ ఓకే న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు తమ వద్దనున్న మిగులు స్పెక్ట్రంను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, కొనుగోళ్లు-అమ్మకాలు(ట్రేడింగ్) జరుపుకునేందుకు కేంద్రం లైన్‌క్లియర్ చేసింది. స్పెక్ట్రం ట్రేడింగ్ మార్గదర్శకాలకు బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. దీనివల్ల టెల్కోలకు స్పెక్ట్రం కొరత సమస్య తీరేందుకు కూడా వీలవుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రమే టెల్కోలకు వేలం పద్ధతిలో స్పెక్ట్రంను కేటాయిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, స్పెక్ట్రం యాజమాన్య హక్కులు కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయని.. ఆపరేటర్లకు వేలం ద్వారా దీన్ని ఉపయోగించుకోవడానికి, అవసరమైతే ఇతరులతో పంచుకోవడానికి మాత్రమే హక్కులను ప్రభుత్వం ఇస్తోందని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. స్పెక్ట్రం ట్రేడింగ్‌కు అనుమతించాల్సిందిగా టెల్కోలు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. 1 శాతం ఫీజు...: తాజా మార్గదర్శకాల ప్రకారం స్పెక్టం ట్రేడింగ్ ద్వారా లభించే ఆదాయాన్ని కూడా ఏటా ఆయా టెల్కోలపై విధించే స్పెక్ట్రం వినియోగచార్జీలు, లెసైన్స్ ఫీజులను లెక్కగట్టేందుకు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ ట్రేడింగ్ వల్ల స్పెక్ట్రం మార్కెట్ ధర ఎంతనేది కూడా నిర్ధేశితం అవుతుందని ప్రసాద్ తెలిపారు. ట్రేడింగ్‌లో భాగంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసిన సంస్థ మార్కెట్ ధర లేదా గతంలో వేసిన వేలం ధరలో ఏది ఎక్కువైతే దాని ఆధారంగా ప్రభుత్వానికి 1 శాతాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. పవన విద్యుత్‌కు కొత్త పాలసీ... దాదాపు 7,600 కి.మీ. తీరం వెంబడి పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా క్యాబినెట్ ప్రత్యేక విధానాన్ని ఆమోదించింది. నేషనల్ ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ పాలసీ కింద .. పవన విద్యుదుత్పాదనకు అనువైన ప్రాంతాలను ముందుగా గుర్తిస్తారు. ఆ తర్వాత రక్షణ తదితర రంగాల నుంచి అనుమతులు వచ్చాక ఆయా ప్రాజెక్టులకు బిడ్డింగ్ నిర్వహిస్తారు. -
సంస్కరణలపై అనిశ్చితితో నష్టాలు
చివర్లో అమ్మకాల వెల్లువ - సెన్సెక్స్ శ్రేణి.. ప్లస్ 182 - మైనస్ 218 - చివరకు 135 పాయింట్ల నష్టంతో 28,102 వద్ద ముగింపు... - 39 పాయింట్లు క్షీణించి 8,526కు నిఫ్టీ ట్రేడింగ్ చివరి అరగంటలో అమ్మకాల వెల్లువ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. భూ సేకరణ, జీఎస్టీ బిల్లులు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాల్లేవన్న ఆందోళనతో లాభాల స్వీకరణ జరిగి అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అప్పటివరకూ లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల పాలయ్యాయి. బీఎస్ఈ సెనెక్స్ 135 పాయింట్లు క్షీణించి 28,102 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే ఒక రోజు అత్యధిక పతనం. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జరపడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం కూడా ప్రభావం చూపాయి. ఆయిల్, ఎఫ్ఎంసీజీ, కొన్ని టెక్నాలజీ, వాహన షేర్లు నష్టపోయాయి. తీవ్ర ఒడిదుడుకులు..: సెన్సెక్స్ 28,251 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దిగుమతుల బిల్లు తగ్గగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో సూచీలు లాభాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 28,419 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 182 పాయింట్లు లాభపడింది) గరిష్ట స్థాయిని తాకింది. అమ్మకాల వెల్లువ కారణంగా 28,018 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 218 పాయింట్లు నష్టం)కు పడిపోయింది. 20 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,529 షేర్లు నష్టాల్లో, 1,424 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,105 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,379 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,78,752 కోట్లుగా నమోదైంది. -
షార్ట్ కవరింగ్‌తో లాభాలు
104 పాయింట్ల లాభంతో 27,563కు సెన్సెక్స్ నాలుగు వరుస ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు స్టాక్ మార్కెట్ బుధవారం బ్రేక్ వేసింది. ఇటీవల కాలంలో బాగా పతనమైన షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో మార్కెట్లు కాస్త లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 27,563 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,375 పాయింట్ల వద్ద ముగిశాయి. భారత్‌లో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలేవీ తీసుకోబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభయమివ్వడం, చైనా సూచీ షాంఘై రికవరీ కావడం సెంటిమెంట్‌కు బలమిచ్చింది. ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగినా... వడ్డీరేట్ల పెంపుకు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం బుధవారం అర్థరాత్రి వెలువడే అవకాశాలుండడం, జులై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,655 షేర్లు లాభాల్లో, 1,170 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,348 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,194 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ,3,56,085 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ షేర్లు బేర్ కాగా మొండి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంతో బ్యాంక్ షేర్లు బేర్‌మంటున్నాయి. ఇప్పటివరకూ దాదాపు పదికి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించాయి. పలు బ్యాంకుల షేరు ధరలు ఏడాది కనిష్ట స్థాయిని తాకాయి. -
మద్దతు 27,500-నిరోధం 28,030
మార్కెట్ పంచాంగం ప్రపంచ స్టాక్ మార్కెట్లు గ్రీసు సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో నాటకీయంగా చైనా మార్కెట్ పతనం అల్లకల్లోలం సృష్టించింది. ముగిసిన గురు, శుక్రవారాల్లో చైనా మార్కెట్ కోలుకున్నప్పటికీ, దాదాపు సగం షేర్లలోనే ట్రేడింగ్ జరిగినందున, ఆ రికవరీ కొనసాగుతుందో, లేదో డౌటే. అక్కడ పతనం నేపథ్యంలో సగం షేర్లలో ట్రేడింగ్ రద్దుచేశారు. మరోవైపు గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ సమర్పించిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందన్న అంచనాలతో శుక్రవారం ప్రపంచంలో అన్ని మార్కెట్లూ ర్యాలీ జరిపాయి. కానీ గ్రీసుకు ప్యాకేజీ ఇచ్చే అంశమై యూరప్ దేశాల్లో చీలిక వచ్చినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీసు, చైనా అంశాలు రానున్న కొద్దిరోజుల్లో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూలై 10తో ముగిసిన వారం ప్రథమార్ధంలో 28,335 పాయింట్ల గరిష్టస్థాయిని చేరిన తర్వాత ద్వితీయార్ధంలో 27,530 పాయింట్ల కనిష్టస్థాయికి బీఎస్ఈ సెన్సెక్స్ పడిపోయింది. చివరకు దాదాపు 1.53 శాతం నష్టంతో 27,661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 27,500 స్థాయి వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన సెన్సెక్స్ ప్రారంభమైతే, వేగంగా జూన్ 29నాటి కనిష్టస్థాయి 27,209 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. రానున్న కొద్దిరోజుల్లో ఈ స్థాయిని వదులుకుంటే, తర్వాతి వారాల్లో 26,300 పాయింట్ల స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే 28,030 పాయింట్ల స్థాయి తొలి నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, ముగిస్తే 28,335 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 28,700 స్థాయికి పెరిగే అవకాశాలుంటాయి. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 29,090 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 8,300-నిరోధం 8,460 ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 8,500 పాయింట్లపైన స్థిరపడి, పాజిటివ్ ముగింపు కనపర్చినా, చైనా మార్కెట్ నాటకీయంగా పతనమయిన ప్రభావంతో ఈ సూచీ కూడా పడిపోయింది. చివరకు అంతక్రితం వారంకంటే 124 పాయింట్ల క్షీణతతో 8,361 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే 8,300 పాయింట్ల స్థాయి తొలి మద్దతును అందించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే క్రమేపీ 8,195 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. గ్రీసు, చైనా సంక్షోభాలు తలెత్తి తీవ్రస్థాయిలో ప్రపంచ మార్కెట్లను చుట్టుముడితే 7,940 స్థాయి వద్దకు సైతం పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ సోమవారం గ్యాప్‌అప్‌తో మొదలైతే 8,460 పాయింట్ల స్థాయి వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, స్థిరపడితే క్రమేపీ 8,550 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో 8,845 పాయింట్ల స్థాయిని చేరే చాన్స్ వుంటుంది. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్..
రోజంతా ఒడిదుడుకులే - 88 పాయింట్ల లాభంతో 27,661కు సెన్సెక్స్ - 32 పాయింట్ల లాభంతో 8,361కు నిఫ్టీ ముంబై: ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చివరకు లాభాల్లోనే ముగిసింది. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి సందర్భంగా ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దిగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 27,661 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32పాయింట్లు లాభపడి 8,361 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చైనా షాంగై మార్కెట్ 4.5 శాతం లాభపడడం, , ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ఉండడం, ఇటీవల మూడు రోజుల క్షీణత కారణంగా బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం, గ్రీస్ రుణ సంక్షోభం పరిష్కార దిశగా పయనిస్తుండడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడం సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. ఆర్థిక సేవల,లోహ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. ఐటీ షేర్లకు నష్టాలు: టీసీఎస్ అంతంత మాత్రం ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి. -
న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ ఢాం..
న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అయిన న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం 11:30 గంటలకు) ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఇలా జరిగిందని మార్కెట్ అధికారులు వెల్లడించారు. 'తదుపరి సమాచారం కాసేపట్లో' అనే సమాధానం తప్ప ఎక్నేంజికి సంబంధించిన సైట్ లో వివరాలేవీ కానరావడంలేదు. ఒక్కసారిగా క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ఇన్వెస్టర్లు గాభరాపడ్డారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని స్టాక్ ఎక్సేంజ్ అధికారులు ప్రకటించడంతో కాస్త కుదుటపడినట్లు తెలుస్తోంది. -
8,500 పైకి నిఫ్టీ..
- ప్రభావం చూపని గ్రీస్ రెఫరెండమ్ - 116 పాయింట్ల లాభంతో 28,209కు సెన్సెక్స్ - 37 పాయింట్ల లాభంతో 8,522కు నిఫ్టీ ట్రేడింగ్ చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. బెయిలవుట్ షరతులకు అంగీకరించేది లేదంటూ ప్రజాభిప్రాయసేకరణలో గ్రీస్ ప్రజలు తెగేసి చెప్పడంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావంతో ప్రారంభంలో నష్టాల పాలైన మన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 317 పాయింట్ల నష్టం నుంచి తేరుకొని 115 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కీలకమైన 8,500 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫార్మా, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, గ్యాస్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 116 పాయింట్ల లాభంతో 28,209 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,522 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలకు ఇది రెండున్నర నెలల గరిష్ట స్థాయి. భారత్‌లో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, చాలినన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, గ్రీస్ ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించడం మార్కెట్‌కు ఊరటనిచ్చింది. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,770 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,587 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,13,736 కోట్లుగా నమోదైంది. ఈ షేర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి బీఎస్ఈ, ఎన్ఎస్ఈల హెచ్చరిక న్యూఢిల్లీ: ట్రేడింగ్ జరగని 450కు పైగా కంపెనీల్లో షేర్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు హెచ్చరించాయి. ఇలాంటి 413 షేర్ల జాబితాను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. ఈ 2 జాబితాల్లో ఉన్న కొన్ని కంపెనీల షేర్లు -బిల్‌పవర్, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్, తిజరియ పాలిపైప్స్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్, జెనిత్ కంప్యూటర్స్, ప్రదీప్ ఓవర్సీస్, గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్. ఈ షేర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ పేర్కొన్నాయి. -
వెలుగులో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు
- 45 పాయింట్లు క్షీణించి 27,206 పాయింట్లకు సెన్సెక్స్ - 11 పాయింట్లు నష్టపోయి 8,224కు చేరిన నిఫ్టీ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులమయంగా సాగిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసింది. బుధవారం బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండడం ట్రేడింగ్‌పై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొన్నారు. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టంతో 27,206 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8,224 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో ఎగుమతి ఆధారిత ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం, కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండడం, కీలక బిల్లుల ఆమోదంపై అనిశ్చితి, వర్షాలు సాధారణం కన్నా తక్కువగానే కురుస్తాయన్న అంచనాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త కనిష్ట స్థాయిలకు చేరడంతో కీలక రేట్ల కోతపై అంచనాలు పెరిగాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బ్యాంక్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీనితోపాటు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిపారు. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలనే నమోదు చేశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఆరోగ్య సంరక్షణ షేర్లు నష్టపోగా, పీఎస్‌యూ బ్యాంకింగ్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, వాహన, లోహ, విద్యుత్ షేర్లు పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,965 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.16,096 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,16,908 కోట్లుగా నమోదైంది. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
మార్కెట్ అప్డేట్ 6 పాయింట్ల నష్టంతో 28,879కు సెన్సెక్స్ 2 పాయింట్ల లాభంతో 8,780కు నిఫ్టీ ఐదు రోజుల బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. అయితే స్వల్ప లాభంతో నిఫ్టీ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లోనే ముగిసింది. లాభాల స్వీకరణ (ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో) కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్ప నష్టాలకు లోనైంది. వెరశి సెనెక్స్ 6 పాయింట్ల స్వల్ప నష్టంతో 28,879 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,780 పాయింట్ల వద్ద ముగిశాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారమూ లాభాల్లోనే ముగిసింది. బ్యాంకింగ్ కీలకం మార్కెట్ ఫ్లాట్‌గా మొదలై బేరిష్ మూడ్‌లోనే కొనసాగిందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. ఇక ఇప్పటి నుంచి నిఫ్టీ కదలికలకు బ్యాంకింగ్ రంగమే కీలకం కానున్నదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.బ్యాంక్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాల సూచీలు మినహా మిగిలిన 9 రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. టారిఫ్‌లు పెరుగుతాయనే అంచనాలతో టెలికాం షేర్లు పెరిగాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,102 కోట్లుగా, ఎన్ఎసీ నగదు విభాగంలో రూ.18,328 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,175 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.363 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.135 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
ఐటీ రిటర్న్ లేటయితే?
లేట్ రిటర్నులు ఒకసారి ఫైల్ చేశాక వాటిల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. వ్యాపారం లేదా ట్రేడింగ్‌లో ఏమైనా నష్టాలు చూపిస్తే వాటిని రానున్న సంవత్సరాలకు కొనసాగించే వీలుండదు. ఈ అసెస్మెంట్ ఇయర్ (2015-16) రిటర్నులను మార్చి 31, 2016లోగా దాఖలు చేయకపోతే రూ.5,000 పెనాల్టీ విధించే అవకాశం ఉంది. పాత రిటర్నులకు సంబంధించి ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటే దానిపై వడ్డీ భారం పడుతుంది. ఓ బహుళజాతి సంస్థలో పనిచేసే కృష్ణమోహన్ ఇంటి రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేశాడు. రుణం మంజూరు చేయడానికి బ్యాంకు అధికారులు గడిచిన మూడేళ్ళ ఆదాయపు పన్ను రిటర్నులు అడిగారు. కానీ కృష్ణ మోహన్ గత మూడేళ్ళుగా రిటర్నులు వేయటం లేదు. వార్షిక ఆదాయం రూ.4,00,000 ఉన్నా... పొదుపు పథకాలు, ఇతర మినహాయింపులు చూపించడం ద్వారా ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించే అవసరం రావటం లేదు. జీతంలో పన్ను కోతలూ లేవు. దీంతో రిటర్నులు దాఖలు చేయలేదు. ఇప్పుడు రుణం తీసుకోవడానికి అదే సమస్యగా తయారయింది. పన్ను కట్టేశాం కదా... ఆఫీసులో ఎలాగూ కోత కోశారు కదా!! ఇక రిటర్నులతో పనేముంది? అనుకునేవారికీ ఇదే సమస్య. అసలు ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో చట్టాలు ఏం చెపుతున్నాయి? రిటర్నులు దాఖలు చేయకపోతే జరిగే నష్టమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఆదాయపు పన్ను మినహాయింపు బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలు. మీ మొత్తం వార్షికాదాయం కనక రూ.2.5 లక్షలు దాటితే తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చెయ్యాలి. ఒకవేళ విదేశాల్లో ఆస్తులుంటే మా త్రం ఆదాయంతో సంబంధం లేకుండా రిటర్నులు దాఖలు చేసి తీరాలి. అయితే విదేశాల్లో ఆస్తులున్న వారు, వార్షికాదాయం రూ.10 లక్షలు దాటిన వారు ఆన్లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వీరంతా 2014-15కు సంబంధించి జూలై 31, 2015లోగా రిటర్నులు వేయాలి. గడువులోగా వేయకపోతే... పన్ను సకాలంలో చెల్లించినా రిటర్నులు మాత్రం ఆలస్యంగా దాఖలు చేస్తే కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సకాలంలో దాఖలు చేసినవారికి కలిగే కొన్ని ప్రయోజనాలను ఇలా ఆలస్యంగా వేసినవారు కోల్పోతుంటారు. సకాలంలో దాఖలు చేయని వాటిని లేట్ రిటర్నులుగా భావిస్తారు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరానికి - ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్‌కి అన్ని ప్రయోజనాలు పొందాలంటే జూలై 31లోగా రిటర్నులు దాఖలు చేయాలి. ఇలా సకాలంలో వేస్తే రిటర్నుల్లో గనక ఏమైనా తప్పులు దొర్లితే మార్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. కొన్ని ఆదాయవ్యయాలు చూపించకపోతే వాటిని సవరిస్తూ ఎన్నిసార్లైనా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే ఇక రివైజ్డ్ వేయడానికి వీలుండదు. ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తే స్వలకాలిక, దీర్ఘకాలిక మూలధన నష్టాలను రానున్న సంవత్సరాల్లో చూపించుకొని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 2014-15లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలు వస్తే వీటిని మీరు ఎనిమిదేళ్ళు... అంటే 2022-23 వరకు చూపించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగాక గడువు దాటాక రిటర్ను వేస్తే మూలధన నష్టాలను మరుసటి సంవత్సరాల్లో చూపించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఎన్నాళ్ళవి వేయొచ్చు? రెండు మూడు సంవత్సరాలవి కలిపి ఒకేసారి రిటర్నులు దాఖలు చేయొచ్చు. రెండేళ్ళ పాత ఆర్థిక సంవత్సరాలవైతే నేరుగా ఆన్లైన్లోనే దాఖలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సంవత్సరాలవి అయితే మాత్రం ఫిజికల్ రూపంలో దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రూపంలో దాఖలు చేసే రిటర్నులకు అనుమతిచ్చే అంశం డిపార్ట్మెంట్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటి విషయంలో పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉంది. ఇలా లేట్‌గా దాఖలు చేసే రిటర్నుల విషయంలో మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి రిటర్నులు దాఖలు చేసిన తర్వాత తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తప్పులు లేకుండా దాఖలు చేయాల్సి ఉంటుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం