ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం | Sebi proposes mandatory UPI block mechanism facility for secondary market trading | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం

Published Wed, Nov 13 2024 10:10 AM | Last Updated on Wed, Nov 13 2024 10:40 AM

Sebi proposes mandatory UPI block mechanism facility for secondary market trading

న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్‌ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్‌ విధానాన్ని లేదా త్రీ–ఇన్‌–వన్‌ ట్రేడింగ్‌ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్‌ స్టాక్‌ బ్రోకర్క్‌కు (క్యూఎస్‌బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.

ప్రస్తుత ట్రేడింగ్‌ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్‌–వన్‌ ట్రేడింగ్‌ అకౌంటులో సేవింగ్స్‌ అకౌంటు, డీమ్యాట్‌ అకౌంట్, ట్రేడింగ్‌ అకౌంట్‌ మూడూ కలిసి ఉంటాయి.

ఇదీ చదవండి: సెబీకి షాక్‌.. ముకేశ్‌ అంబానీకి ఊరట

యూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్‌లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement