బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 50, గురువారం వరుసగా రెండో సెషన్‌లోనూ ప్రతికూలంగా ముగిశాయి. ఇది సంవత్ 2080 చివరి ట్రేడింగ్ సెషన్. బీఎస్‌ఈ సెన్సెక్స్ 553.12 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 79,389.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే దారిలో 135.50 పాయింట్లు లేదా 0.56 శాతం క్షీణించి 24,205.35 వద్ద ముగిసింది. దీంతో సంవత్ 2080లో సెన్సెక్స్ 22.31 శాతం లాభపడగా, నిఫ్టీ 26.40 శాతంగా ఉంది.
50 షేర్లలో 34 నష్టాల్లో ముగియడంతో ప్రస్తుత సంవత్ చివరి ట్రేడింగ్ సెషన్ 3.61 శాతం చొప్పున నష్టాలను చవిచూసింది. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, సిప్లా, లార్సెన్ & టూబ్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓన్‌జీసీ, మహీంద్రా & మహీంద్రా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
కాగా శుక్రవారం దీపావళి సందర్భంగా బీఎస్‌ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లతోపాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సాధారణ ట్రేడింగ్ సెషన్‌కు బదులుగా ముహూర్తం ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తాయి. శుక్రవారం సాయంత్రం 6-7 గంటల వరకు గంటసేపు సెషన్ జరగనుంది. దీంతో సంవత్ 2081 ప్రారంభం కానుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment