
ముంబై: జీడీపీ గణాంకాలు మెరుగ్గా ఉండగలవన్న ఆశావహ అంచనాల నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌లో రూపాయి బలపడింది. డాలర్‌తో పోలిస్తే 43 పైసలు పెరిగి 67.43 వద్ద క్లోజయ్యింది. ఎగమతిదారులు, కార్పొరేట్ సంస్థలు .. డాలర్లకు సంబంధించి లాంగ్ పొజిషన్స్ నుంచి వైదొలగడం కూడా ఇందుకు తోడ్పడింది.
అటు డాలర్ బలహీనపడటం కూడా రూపాయి రికవరీకి కలిసొచ్చింది. 2017–18 మార్చి త్రైమాసికం, పూర్తి ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభు త్వం గురువారం విడుదల చేయనుంది. మూడో త్రైమాసికంలో 7.2% వృద్ధి రేటుతో భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా నిల్చిన సంగతి తెలిసిందే.